Naveen Kumar
-
వేట కొడవళ్లతో నరుక్కున్న నవ దంపతులు!
కేజీఎఫ్/కోలారు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లయిన రోజే ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు వేట కొడవళ్లతో నరుక్కుని ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతుల కుమార్తె లిఖితశ్రీ(19), చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరు నివాసి మునియప్ప కుమారుడు నవీన్‌కుమార్(27)లు ప్రేమించుకున్నారు.పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. లిఖితశ్రీ ఇంటర్ పూర్తి చేయగా, నవీన్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం కర్ణాటక చండరసనహళ్లిలోని నవీన్‌కుమార్ సోదరి ఇంట్లో వారిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు సంతోషంగా పాల్గొన్నారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్‌కుమార్ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్లింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో నవ దంపతులు గొడవ పడ్డారు, గట్టిగా కేకలు వేయడంతో బంధువులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు.ఇద్దరూ ఆ గదిలో ఉన్న వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారని అనుమానాలున్నాయి. వధువు లిఖితశ్రీ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మరణించింది. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్ కుమార్‌ను అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి, అనంతరం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఇలా కొత్త జంట కొన్ని గంటలకే ఈ లోకాన్ని వీడింది. జిల్లా ఎస్పీ శాంతరాజు, డీఎస్పీ పాండురంగ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నవదంపతులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. -
ఐపీఎస్ నవీన్‌కుమార్ కొడుకుపై కేసు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్‌లాల్ ఇంటిని కబ్జా చేయడానికి ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ నకిలీ పత్రాలతో ప్రయతి్నంచిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నవీన్‌కుమార్ భట్ కుమారుడు సాహిత్పై కూడా జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. దర్యాప్తు అధికారులు శుక్రవారం సాహిత్‌కు నోటీసులు జారీ చేశారు. మరోపక్క భన్వర్‌లాల్ భార్య మణిలాల్ ఫిర్యాదుతో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో నమోదైన కేసు విచాణకు నవీన్‌కుమార్ శుక్రవారం గైర్హాజరయ్యారు. దీంతో ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని పోలీసులు నిర్ణయించారు. భన్వర్‌లాల్‌కు జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో సొంత ఇల్లు ఉంది. ఆయన పదవీ విరమణ చేయకముందే ఇంటిని నవీన్‌కుమార్ సోదరుడు సాంబశివరావు అద్దెకు తీసుకున్నారు. 2019లో భన్వర్‌లాల్ పదవీ విరమణ చేయడంతో తమ ఇల్లు ఖాళీ చేసి అప్పగించాల్సిందిగా సాంబశివరావును కోరగా, ఆయన స్పందించలేదు. ఆ ఇంట్లో ఐపీఎస్ అధికారి నవీన్‌కుమార్ కూడా ఎలాంటి రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఉన్నారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరితో పాటు సాంశివరావు భార్య రూపా డింపుల్ నకిలీ పత్రాలు సృష్టించి, భన్వర్‌లాల్‌తో పాటు ఆయన భార్య మణిలాల్ సంతకాలు ఫోర్జరీ చేసి ఇంటిని కబ్జా చేయాలని చూశారు. మణిలాల్ ఫిర్యాదు మేరకు గతేడాది నవంబర్ 17న సీసీఎస్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. గత నెల 22న సాంబశివరావు దంపతులను అరెస్టు చేశారు. నవీన్‌కుమార్‌కు గత నెల 27న నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నవీన్‌కుమార్ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. బౌన్సర్లతో బెదిరింపు.. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ రోడ్డు నం.72లోని ప్రశాసన్‌నగర్‌లో ఉన్న తమ ఇంట్లోకి వెళ్లేందుకు భన్వర్‌లాల్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన భార్య మణిలాల్ గురువారం సాయంత్రం అక్కడకు వెళ్లి కొన్ని మరమ్మతులు చేయించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆ ఇంటి వద్ద ఉన్న సాహిత్ ఇద్దరు బౌన్సర్లతో కలసి బీభత్సం సృష్టించారు. మణిలాల్ ఉండగానే ఇంటి లోపలి నుంచి గడియ పెట్టడంతో పాటు అతి సమీపం నుంచి బెదిరిస్తూ మాట్లాడారు. చాలాసేపు నిర్బంధించినంత పని చేశారు. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సాహిత్ భట్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు. -
IPS నవీన్ కుమార్ కుమారుణ్ణి అదుపులోకి తీసుకున్న సీసీఎస్
-
ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ నవీన్ కుమార్, మాజీ ఐఏఎస్ బన్వర్ లాల్ మధ్య వివాదం చెలరేగుతోంది. ఐపీఎస్ నవీన్ కుమార్ తన ఇంటిని కబ్జా చేసే ప్రయత్నం చేశాడంటూ గతంలో సిసిఎస్ పోలీసులకు బన్వర్ లాల్ ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి తన నివాసాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేశాడు అంటూ ఆరోపణలు చేశారు. దీంతో గతంలో నవీన్ కుమార్ ను విచారణ చేసిన సిసిఎస్ పోలీసులు.. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ ప్రశాసననగర్ లో ఐపీఎస్ నవీన్ కుమార్ కుమారుడిని సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ కుమార్ ని కూడా మరికొద్ది సేపట్లో అదుపులోకి తీసుకొని విచారించనున్నామని తెలిపారు. ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినలను అరెస్ట్ చేశారు. గతంలో 41ఏ నోటీసులు జారీ చేసి నవీన్ కుమార్ ను విచారించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ అధికారి నవీన్ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: చింతమనేని సీట్ సిరిగిపోయిందా ? -
IPS నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్
-
IAS vs IPS అసలు తప్పు ఎవరిది ?
-
హైదరాబాద్: రిటైర్డ్ IASకు ప్రజెంట్ IPS టోకరా!
సాక్షి, హైదరాబాద్: IPS అధికారి నవీన్ కుమార్‌ను సెంట్రల్ క్రైం స్టేషన్ పోలీసులు (CCS) అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి పోలీసులు IPS అధికారి నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు ఏంటంటే.? IAS అధికారిగా సుదీర్ఘ కాలం రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన భన్వర్‌లాల్ 2017లో రిటైరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఆయన సుపరిచితుడు. జూబ్లీహిల్స్‌లో భన్వర్‌లాల్‌కు ఓ భవంతి ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి ఓర్సు సాంబశివరావు అనే వ్యక్తితో అద్దె ఒప్పందం చేసుకున్నారు. దీని కాల పరిధి అయిదు సంవత్సరాలు. ఈ రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం భన్వర్‌లాల్ జూబ్లిహిల్స్‌లోని తన నివాసాన్ని సాంబశివరావుకు ఐదేళ్ల కోసం అద్దెకు ఇచ్చారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా.. ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదన్నది భన్వర్ లాల్ ఆరోపణ. భన్వర్ లాల్ కుటుంబ సభ్యులు ఏం ఆరోపిస్తున్నారు? 2019 తర్వాత ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి IPS అధికారి నవీన్‌కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదికి వచ్చాయి. ఈ డాక్యుమెంట్లు తమ ఆస్తులకు సంబంధించి ఒరిజినల్ తరహాలో రూపొందించిన నకిలీ పత్రాలని భన్వర్‌లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి IPS అధికారి నవీన్‌కుమార్ సహకరించారన్నది భన్వర్ లాల్ ఆరోపణ. పోలీసులు ఏం చేశారు? భన్వర్‌లాల్ ఆరోపణలతో రంగంలోకి దిగిన CCS పోలీసులు.. డాక్యుమెంట్లను విచారించి అవి ఫేక్ అని తేల్చారు. డిసెంబర్ 22న ఓర్సు సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన IPS అధికారి నవీన్‌కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భన్వర్ లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే నవీన్ కుమార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లను రూపొందించి భన్వర్‌లాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని అనుమానిస్తున్నారు. IPS అధికారి నవీన్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పోలీస్ అకాడమీలో గత ఆరేళ్లుగా తన సేవలను కొనసాగిస్తున్న నవీన్ కుమార్.. గతంలో వికారాబాద్‌లో SPగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో DCPగా విధులు నిర్వహించారు. ఆయన ఆచూకీని తెలుసుకున్న పోలీసులు ఇవ్వాళ అదుపులోకి తీసుకున్నారు. గత నెల 17 న భన్వర్ లాల్ భార్య మనీలాల్ CCS పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అరెస్టులు ఈ నెలలో జరిగాయి. నన్ను టార్గెట్ చేసి కేసు పెట్టారు: నవీన్‌కుమార్ తనను టార్గెట్ చేసి కేసు పెట్టారని, 41 సీఆర్పీసీ నోటీసు ఇచ్చారని నవీన్‌కుమార్ తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న సివిల్ వివాదంలో పోలీసులు కలుగ జేసుకుంటున్నారని, త్వరలో అన్ని విషయాలు వెల్లడిస్తానని నవీన్‌కుమార్ అన్నారు. రిమాండ్ రిపోర్ట్ ఇదీ చదవండి: ప్రజాభవన్: ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్.. సీఐ సస్పెండ్ -
అందరూ మెచ్చే చిత్రాలు చేస్తా – నిర్మాత సతీష్ కుమార్
‘‘గతంలో నేను నిర్మించిన ‘బట్టల రామస్వామి బయోపిక్’, ‘కాఫీ విత్ ఏ కిల్లర్’ సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం గౌతమ్ కృష్ణ హీరోగా ఓ చిత్రం నిర్మిస్తున్నాను. యువత, కుటుంబ ప్రేక్షకులతో పాటు అందరూ మెచ్చే చిత్రాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా’’ అని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ అన్నారు. గౌతమ్ కృష్ణ, శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా పి.నవీన్ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం) తన పుట్టినరోజు సందర్భంగా సతీష్ కుమార్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. గౌతమ్ కృష్ణ ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 షోలో ఉన్నారు. ఆ షో నుంచి తిరిగి రాగానే మా సినిమా చివరి షెడ్యూల్ పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్దు, సంగీతం: జుడా శాండీ. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్, నవీన్
తాష్కెంట్: ప్రపంచ సీనియర్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ (57 కేజీలు) వరుసగా రెండో విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన నవీన్ కుమార్ (92 కేజీలు) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ఆశిష్ చౌధరీ (80 కేజీలు) రెండో రౌండ్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన రెండో రౌండ్ బౌట్లలో హుసాముద్దీన్ 5–0తో లియు పింగ్ (చైనా)పై, నవీన్ 5–0తో జియోంగ్ జెమిన్ (దక్షిణ కొరియా)పై ఏకపక్ష విజయాలు సాధించారు. ఆశిష్ 2–5తో రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్ అర్లెన్ లోపెజ్ (క్యూబా) చేతిలో ఓడిపోయాడు. -
సీనియర్లకు నచ్చని నవీన్! ఆల్రెడీ బాస్‌కు కంప్లైంట్.. కాకరేపుతున్న కాకినాడ
ఆంధ్రప్రదేశ్‌లో పచ్చ పార్టీ తెలంగాణ కాంగ్రెస్‌లా తయారవుతోంది. ఓ జిల్లాలో సీనియర్లు వర్సెస్ జూనియర్లు అంటూ వార్ జరుగుతోంది. ఓ సీనియర్ నేత తనయుడు ఒకానొక పార్లమెంటరీ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోని సీనియర్లకు నచ్చడంలేదని టాక్. జూనియర్లను ప్రోత్సహించడం అసలు సహించలేకపోతున్నారట. అందుకే ఆ నాయకుడు తమకొద్దని పార్టీ చీఫ్‌కు తేల్చి చెప్పేశారట. కాకినాడ టీడీపీలో రగులుకున్న మంటలు పక్క జిల్లాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందంటున్నారు. సీనియర్ నాయకుడు జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే తనయుడుగా.. మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా నవీన్ సుపరిచితం. ఇటీవల కాలంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా నవీన్ అనుసరిస్తున్న విధానాలు కొందరు సీనీయర్ నేతలకు మింగుడు పడడం లేదని టాక్. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణీ నేతలను నవీన్ ప్రోత్సహిస్తున్నారని సీనియర్లు మండిపడుతున్నారు. అలా ప్రోత్సహించిన నేతలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారట. దీంతో నవీన్ నాయకత్వం తమకు వద్దని మరో నేతను నియమించాలంటూ కొందరు తమ బాస్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సైకిల్ ఎక్కేది నేనే.! గతంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ జగ్గంపేట నియోజకవర్గంలో నవీన్ రెండు నెలల పాటు పాదయాత్ర చేశారు. తొలుత ఈ పాదయాత్రకు యనమలతో పాటుగా పలువురు సీనియర్లు.. మాజీ ఎమ్మెల్యేలు సంఘీభావం తెలిపారు. ఆ తరువాత నవీన్ ముఖం చూడడమే మానేశారట. అంతేకాదు గత నెలలో పాదయాత్ర ముగింపు సందర్భంగా నవీన్‌ను కలవడానికి ఒక్క నేత కూడా రాలేదని సమాచారం. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నవీన్ నిర్వహించిన యాత్ర తుస్సు మన్నట్లు అయిందని పార్టీలోనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీ అభ్యర్ధినని నవీన్ తన సన్నిహితులతో చెప్పుకుంటున్నారు. ఈ ప్రచారం యనమల రామకృష్ణుడు.. నిమ్మకాయల చినరాజప్ప వంటి సీనియర్లుకు రుచించడం లేదని టాక్. తండ్రి జగ్గంపేట నుండి ఎమ్మెల్యేగా.. కొడుకు కాకినాడ పార్లమెంట్ సీటుకు ఎలా పోటీ చేస్తారంటూ ప్రశ్నించుకుంటున్నారట. ఒకే ఇంట్లో ఇద్దరికి సీట్లు ఎలా ఇస్తారని చర్చించుకుంటున్నారట. మొత్తం మీద జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్ కాకినాడ జిల్లా పార్టీలో మంటలు రేపారు. ఒక వైపు జూనియర్లను ప్రోత్సహిస్తూ సీనియర్లకు కంటగింపుగా మారారు. మరోవైపు తండ్రీ, కొడుకులిద్దరూ పోటీ చేస్తున్నారనే సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా అసమ్మతిని పెంచి పోషిస్తున్నారు. చూడాలి చివరకు ఏమవుతుందో..? -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
సమయం మారింది
ఓ గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి ప్రేమలో పడితే.. ఆ ఊరి దొర, గ్రామ ప్రజలు ఎలా వ్యతిరేకత కనబరిచారు అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘శరపంజరం’. టి. గణపతిరెడ్డి, మామిడి హరికృష్ణ సహకారంతో నవీన్ కుమార్ గట్టు, లయ జంటగా నవీన్ కుమార్ గట్టు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలోని రెండో పాట ‘రావయ్యా నందనా రాజా నందన..’ పాటను ప్రముఖ నటి విజయశాంతి విడుదల చేశారు. మల్లిక్ ఎంవీకే స్వరపరచిన ఈ పాటను జానపద కళాకారుడు గిద్దె రాంనర్సయ్య రాసి, పాడారు. విజయశాంతి మాట్లాడుతూ– ‘‘ఆనాడు దొరలు స్వార్థం కోసం ఆడవాళ్లని ఎలా వాడుకున్నారో తెలిసిన విషయమే. ఈనాటి దొర కూడా ఎలా చేస్తున్నాడో తెలిసిన విషయమే. సమయం మారింది కానీ వ్యక్తి మనస్తత్వం మారలేదనడానికి ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలుస్తుంది’’ అన్నారు. -
ఉదయ్‌పూర్ ఘటన: ఖబడ్దార్.. కన్హయ్యను చంపినట్లే చంపుతాం!
ఢిల్లీ: రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యల కలకలం.. ఆమెకు మద్దతుగా కన్హయ్య చేసిన పోస్ట్... చివరికి అతని దారుణ హత్యకు దారి తీసింది. ఈ తరుణంలో.. బీజేపీ సస్పెండెడ్ నేత నవీన్ కుమార్ జిందాల్‌కు, ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఈ ఉదయం మూడు బెదిరింపు ఈ-మెయిల్స్‌తో పాటు కన్హయ్యను చంపిన ఘటన తాలుకా వీడియోను ఎటాచ్ చేసి మరీ ఆయనకు పంపించారు దుండగులు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన నవీన్‌కుమార్ జిందాల్.. ఢిల్లీ పోలీసులను ఆశ్రయిస్తూ ట్వీట్లో ట్యాగ్ చేశారు. నూపుర్ వ్యాఖ్యల టైంలోనే మొహమ్మద్ ప్రవక్తను ఉద్దేశిస్తూ నవీన్‌కుమార్ జిందాల్ ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. అది దుమారం రేపింది. ఈ ఘటన తర్వాత నవీన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీజేపీ. అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఆయనపై కేసులు సైతం నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగా.. కన్హయ్య లాల్‌ను చంపుతూ ఈ వీడియోను షూట్ చేసిన అక్తర్, గౌస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం మరో సెల్ఫీ వీడియోలో కత్తులో ప్రధాని మోదీని సైతం చంపుతామంటూ వాళ్లు బెదిరించారు నిందితులు. అయితే హత్య వీడియోతో పాటు సదరు బెదిరింపుల వీడియో వైరల్ అవుతుండగా.. వాటిని సర్క్యులేట్ చేయొద్దంటూ రాజస్థాన్ పోలీసులు, ఆ రాష్ట్ర సీఎం విజ్ఞప్తి చేస్తున్నారు. आज सुबह क़रीब 6:43 बजे मुझको तीन ईमेल आयी है, जिसमें #उदयपुर में भाई कन्हैया लाल की गर्दन काटने का विडियो अटैच करते हुए मेरी और मेरे परिवार की भी ऐसी गर्दन काटने की धमकी दी गई है मैंने PCR को सूचना दे दी है।@DCPEastDelhi @CellDelhi @CPDelhi तुरंत संज्ञान ले। pic.twitter.com/rhzyLbbdNg — Naveen Kumar Jindal 🇮🇳 (@naveenjindalbjp) June 29, 2022 చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో గొంతు కోసి.. -
నవీన్ అదుర్స్ దబంగ్ ఢిల్లీకి రెండో విజయం
బెంగళూరు: దబంగ్ ఢిల్లీ జట్టు స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ మరోసారి చెలరేగాడు. ఏకంగా 17 పాయింట్లు సాధించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 31–27తో యు ముంబాపై గెలిచింది. మ్యాచ్‌లో మొత్తం 28 సార్లు కూతకు వెళ్లిన నవీన్ 16 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను పట్టేసి మరో పాయింట్‌ను సాధించాడు. ఈ ప్రదర్శనతో నవీన్ 500 రెయిడింగ్ పాయింట్ల మార్కును అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ (47)ల్లో ఈ ఘనతను అందుకున్న తొలి రెయిడర్‌గా నవీన్ నిలిచాడు. సహచరుడు జోగిందర్ సింగ్ నర్వాల్ (4 పాయింట్ల) ప్రత్యర్థిని పట్టేయడంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 38–30తో తమిళ్ తలైవాస్‌పై, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 31–28తో గుజరాత్ జెయింట్స్ గెలిచాయి. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధతో పట్నా పైరేట్స్; పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ అరెస్ట్
సాక్షి, నాగోలు: నగరానికి చెందిన మెడికాయల నవీన్‌కుమార్ (34) షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్‌తో నవీక్కుమార్ గతంలో ఇంటర్వ్యూ చేశాడు. ఆమె ఫొటోను లోగోగా ఉంచి ఆమె పేరు మీద ఒక యూట్యాబ్ చానెల్ ప్రారంభించాడు. తరువాత బాధితురాలి పేరు మీద ఒక చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అతను తన వెబ్ సిరీస్ వీడియోలు, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ వీడియోలు అప్లోడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సింగర్ ఇలాంటి కార్యకాపాలను ఆపమని అతడిని కోరింది. అయినా నిందితుడు ఆమె మాటలు పట్టించుకోలేదు. సింగర్ వ్యక్తిగత జీవితానికి సంబంధిన వీడియాలు అప్లోడ్ చేస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నవీన్‌కుమార్ అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. -
ఆ వీడియోలతో వేధిస్తున్నాడు!: బుల్లితెర నటి
సాక్షి, చెన్నై: వీడియోలను తీసి వేధింపులకు గురిచేస్తున్నాడని టీవీ సీరియల్ సహాయ దర్శకుడిపై బుల్లితెర నటి జెన్నిఫర్(24) శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ తాను మనాలి సమీపంలోని చిన్న సేక్కాడు ప్రాంతంలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నానన్నారు. ఐదేళ్లుగా టీవీ సీరియల్లో నటిస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్జీఆర్ నగర్‌కు చెందిన శరవణన్ అనే వ్యక్తిని గత 2019 ఆగస్టు 25న పెళ్లి చేసుకున్నానన్నారు. అయితే తమ మధ్య మనస్పర్థల కారణంగా విడిపోయాం అన్నారు. శరవణన్‌తో వివాహ రద్దు కేసు కోర్టులో ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తను, టీవీ సీరియల్ సహాయ దర్శకుడు నవీన్‌కుమార్ సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో నవీన్‌కుమార్‌కు పనిపోయిందన్నారు. దీంతో అతను ఖర్చుల కోసం డబ్బు ఇవ్వాలని తనను వేధిస్తూ ఉండేవాడన్నారు. తన వద్ద డబ్బు లేదని చెప్పడంతో షూటింగ్ స్పాట్ నుంచి తనను తీసుకెళ్లి కారులో కూర్చోబెట్టి నగ్నంగా వీడియో తీశాడని చెప్పారు. ఈ విషయం గురించి అతని తల్లి దృష్టికి తీసుకెళ్లగా ఆమె తన కొడుకు చెప్పినట్లు నడుచుకోమని బెదిరించారన్నారు. దీంతో నవీన్ కుమార్‌పై మనాలి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. నవీన్ కుమార్ తీసిన వీడియోను తనకు ఇప్పించాలని, తనపై దౌర్జన్యాలకు పాల్పడిన నవీన్‌కుమార్, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్కొన్నారు. -
రూ.30 లక్షలు డిమాండ్.. తీన్మార్ మల్లన్నపై కేసు !
సాక్షి, చిలకలగూడ: క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. వివరాలు.. సీతాఫల్మండి డివిజన్ మధురానగర్‌కాలనీలో మారుతి సేవా సమితి పేరిట లక్ష్మీకాంతశర్మ జ్యోతిషాలయం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 19న తీన్మార్ మల్లన్న తనకు ఫోన్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోవడంతో 20వ తేదీన తనపై తప్పుడు కథనాలు ప్రచురించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 22న పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలగూడ సీఐ నరేష్ తెలిపారు. చదవండి: వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపేస్తా -
మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
నాంపల్లి (మునుగోడు): తీన్మార్ మల్లన్న ఓటమిని తట్టుకోలేక యువకుడు ఆత్మహ త్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఏర్పుల శ్రీశైలం (22) ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్రలో మూడు నెలల పాటు కళాకారుడిగా పని చేశాడు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సందర్భం గా రెండ్రోజుల పాటు ఇంట్లోనే టీవీకి అతుక్కుపోయి కౌంటింగ్ ప్రక్రియను చూశాడు. శనివారం రాత్రి మల్లన్న ఓడిపోయాడని తెలిసి భోజ నం చేయలేదు. ఆదివారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు డబ్బాను తీసుకుని పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్లి తాగాడు. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేయగా వారు ఎత్తలేదు. అంతలో అతడిని గమనించిన తల్లిదండ్రులు, చెల్లెలు ఇలా ఎందుకు చేశావని శ్రీశైలాన్ని అడిగారు. తీన్మార్ మల్లన్న ఓడిపోవడం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని అన్నాడని కుటుంబసభ్యులు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం శ్రీశైలాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. శ్రీశైలం తండ్రి ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. శ్రీశైలం కుటుంబసభ్యులను ఆదివారం తీన్మార్ మల్లన్న పరామర్శించారు. కుటుంబానికి రూ.50 వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. శ్రీశైలం చెల్లెలి వివాహానికి రూ.లక్ష చెక్కును అందజేశారు. చదవండి: ఓడి.. గెలిచిన తీన్మార్ మల్లన్న -
సుప్రీం కోర్టు ఆదేశాలతో మరోసారి అగ్రిగోల్డ్ విచారణ
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించిన అగ్రిగోల్ట్ కేసును మరోసారి విచారించాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ హై కోర్టు అగ్రిగోల్డ్ కేసు విచారణకు అంగీకరించింది. విచారణ కోసం జస్టిస్ ఎస్ రామచందర్ రావు, జస్టిస్ కోదండరాం బెంచ్ ముందు ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరాం, పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ మెన్షన్ చేశారు. సోమవారం నుంచి మళ్ళీ వాదనలు జరగనున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం తిరిగి చెల్లించేందుకు అనుమతించాలని ఏపీ ఏజీ పిటీషన్ దాఖలు చేసింది. దీనికి న్యాయస్థానం అంగీకరించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల దురాక్రమణ, హైకోర్టు ఆధీనంలో ఉన్న నిధులు పంపిణీ చెయ్యాలని కోరుతూ రమేష్ బాబు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే సోమవారం నుంచి అగ్రిగోల్డ్ కేసు విచారణ హైకోర్టులో కొనసాగనుంది. (చదవండి: అగ్రిగోల్డ్ బాధితుల కన్నీరు తుడిచేలా..) ‘మల్లన్న’ పై చర్యలు తీసుకోవాలి మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై చర్యలు తీసుకోవాలిని కోరుతూ ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. క్యూ న్యూస్ అనే సామాజిక మాధ్యమాన్ని మూసేసే విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. క్యూ న్యూస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారం, హద్దులు దాటుతుందని పిటిషన్‌దారు కోర్టుకు తెపారు. క్యూ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కించపరుస్తూ నిబంధనలు ఉల్లంగిస్తున్న నవీన్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టుకు తెలిపారు. క్యూ న్యూస్ అనే సామాజిక మాధ్యమం ద్వారా విషప్రచారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని కోర్టుకు విన్నవించారు. పిటిషనర్ తరఫు వాదనలు విన్న హై కోర్టు తదుపరి విచారణను ఈ నెల 6న చేపట్టనున్నట్లు తెలిపింది. -
నిర్భయ కేసు : లాయర్‌కు భారీ జరిమానా..!
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్‌కుమార్ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తగిన ఆధారాలు సమర్పించకుండా కోర్టు సమయాన్ని వృధా చేశారని పేర్కొంటూ 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఏపీ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. తన క్లైంట్ పవన్‌కుమార్ నిర్భయ ఘటన జరిగిన సమయంలో (2012, డిసెంబర్ 16) మైనారిటీ (జువైనల్) తీరలేదంటూ న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పవన్‌కుమార్‌ను జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఏపీ సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు చూపకుండా పిటిషన్ వేయడం.. విచారణ సమయంలో గైర్హాజరు కావవడంపై మండిపడింది. కోర్టుకు నివేదించిన సాక్ష్యాల ఆధారంగా ఘటన సమయంలో పవన్‌కుమార్ జువైనల్ కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అదే విధంగా, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి జువైనల్ జస్టిస్ యాక్ట్ అంశం తమ పరిధిలోకి రాదని కోర్టు తేల్చిచెప్పింది. దోషి మరణ శిక్షను తప్పించాలనే ఉద్దేశంతోనే లాయర్ ఏపీ సింగ్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించింది. ఇక నిర్భయ కేసులో మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్, తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. -
ఢిల్లీని గెలిపించిన నవీన్
పుణే: ప్రస్తుత ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో ఢిల్లీ స్టార్ రైడర్ నవీన్ కుమార్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి సూపర్ ‘టెన్’ సాధించి అదరగొట్టాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ 34–30తో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. నవీన్ (12 పాయింట్లు)కు ట్యాక్లింగ్‌లో విశాల్ (3 పాయింట్లు), జోగిందర్ (3 పాయిం ట్లు) సహకరించడంతో దబంగ్ విజయం ఖాయ మైంది. 12 విజయాలతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో ‘టాప్’ ప్లేస్‌లో కొనసాగుతోంది. పుణేరి పల్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 55–33తో ఘనవిజయం సాధించింది. పట్నా రైడర్ ప్రదీప్ నర్వాల్ 18 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధ; దబంగ్ ఢిల్లీతో తెలుగు టైటాన్స్ తలపడతాయి. -
భవనాన్ని కూల్చి పైలాన్ కట్టారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లా పరిషత్ పదవీకాలం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజల కోసం ఏమి చేశారా అంటే ఒక్కటి కూడా కనిపించకపోగా మరకలే అధికంగా వెక్కిరిస్తున్నాయి. నిధుల దుర్వినియోగం, ఆస్తుల ధారాదత్తం, స్వప్రయోజనాలకు వేదికగా మార్చుకోవడం తప్ప చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి. ప్రజలకు చేసిందేమీ లేకపోగా అన్నీ అడ్డగోలు పనులకు శ్రీకారం చుట్టి అవినీతికి కేంద్రంగా మార్చేశారు. చంద్రన్నబాట పేరుతో అక్రమబాటలు వేసుకున్నారు... బదిలీలు, పదో న్నతులు పేరుతో దండిగా సంపాదించుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు తెప్పించుకోకపోగా ఉన్న నిధులను, ఆస్తులను ఊడ్చేసే పనులపైనే ఆసక్తి చూపిం చారు. చెప్పాలంటే జెడ్పీ ఖజానాను ఖాళీ చేసేశారు. గత ప్రభుత్వం అనేక నిధుల్ని నిలిపేసి, మరికొన్ని నిధులను మళ్లించింది. కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే పరిమి తమైన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ప్రభుత్వ విధానాలకిందకొస్తాయి. కానీ ఆస్తులను కాపాడాల్సిన పాలకవర్గం తమ పార్టీ అధినేతకు విధేయతగా ఉండాలని విలువైన జెడ్పీ ఆస్తిని అప్పనంగా పార్టీ కార్యాలయం కోసం కట్టబెట్టారు. 2 వేల గజాల స్థలాన్ని 99 సంవత్సరాల లీజుకని ఇచ్చేశారంటే ఇక జెడ్పీ దాన్ని వదులుకోవల్సిందే. సంవత్సరానికి రూ.25 వేల అద్దెకింద విలువైన స్థలాన్ని సమర్పించేశారు. విశేషమేమిటంటే ఇదే జెడ్పీ స్థలంలో ఉన్న స్త్రీ,శిశు సంక్షేమ శాఖ భవనాన్ని తమ అవసరాల కోసమని ఖాళీ చేయించి, కూల్చేచారు. శత వసంతాల వేడుక ఫైలాన్ కోసమని స్త్రీ, శిశు సంక్షేమశాఖకు నిలువ నీడ లేకుండా చేసేశారు. ప్రభుత్వ కార్యాలయం ఉన్న స్థలాన్ని పైలాన్ కోసం వినియోగించగా, ఖాళీగా ఉన్న స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి అప్పగించేశారు. రెండేళ్ల పదవికే అంత సీన్ సాధారణంగా జిల్లాకు మేలు చేసిన వారినో, అభివృద్ధికిపాటు పడిన వారినో, జెడ్పీ గుర్తింపు కోసం కృషి చేసిన వారినో గుర్తించి, వారికో గౌరవం కల్పించడం సంప్రదాయం. కానీ పార్టీ ఫిరాయించి చైర్మన్ పదవి పొందిన జ్యోతుల నవీన్‌కుమార్ పేరును ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు పెట్టడం విమర్శలకు గురవుతోంది. రేండేళ్ల కాలానికే ఇంత చేసి చెడ్డపేరును మూటగట్టుకున్నారు. పార్టీ ఫిరాయించి... జ్యోతుల నవీన్‌కుమార్ వైఎస్సార్సీపీ జెడ్పీటీసీగా ఎన్నికై చైర్మన్ పదవి కోసం మూడేళ్ల కిందట టీడీపీలోకి ఫిరాయించారు. రెండేళ్ల కిందట జెడ్పీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ పదవి వెలగబెట్టింది కేవలం రెండేళ్లే. ప్రజా సేవతో ప్రజల్లో తన పేరును చిరస్థాయిగా నిలుపుకోవల్సిందిపోయి ప్రజాధనంతో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌కు ‘జ్యోతుల నవీన్ కుమార్ కాంప్లెక్స్’గా నామకరణం చేశారు. గతంలో ఎంతోమంది పూర్తిస్థాయిలో చైర్మన్లుగా పని చేసి జిల్లాకు సేవలందించినవారున్నారు. కానీ వారెవరూ ఇంత చీప్ ట్రిక్స్‌కు దిగి తమ పేరున ఎక్కడా నిర్మాణాలు చేపట్టలేదు. కేవలం రెండేళ్ల పదవిని చేపట్టిన ఈయన తన పేరిట ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం... జ్యోతుల నవీన్‌కుమార్‌కు ముందు నామన రాంబాబు జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. అప్పటి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రాజకీయంతో నామనకు ఎగనామం బెట్టి నవీన్‌కు పట్టం కట్టారు. జెడ్పీకి చెందిన రెండు వేల గజాల స్థలాన్ని టీడీపీకి నామన అప్పణంగా కట్టబెట్టేశారు. 99 ఏళ్ల లీజు పేరుతో, సంవత్సరానికి రూ.25 వేల అద్దె ప్రాతిపదికన టీడీపీ కార్యాలయం కోసం కోట్ల విలువైన స్థలాన్ని అర్పణం చేసేశారు. ఈ జెడ్పీ స్థలంలో టీడీపీకి కార్యాలయం నిర్మించారు. స్వప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. భవనాన్ని కూల్చేసి... జెడ్పీ చైర్మన్ నవీన్‌కుమార్ హయాంలో మరో ఘనకార్యం చేశారు. 70 ఏళ్లుగా ఉన్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భవనాన్ని కూల్చేసి జెడ్పీ శతవసంతాల వేడుక పేరుతో పైలాన్ నిర్మించారు. టీడీపీ నాయకులతో కూడిన ఫొటోలతో రూ.15 లక్షలు ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టారు. దీంతో 5452 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించే స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు సొంత గూడు లేకుండా పోయింది. జెడ్పీ వందేళ్ల వేడుక సందర్భంగా పైలాన్ ఏర్పాటు కోసం టీడీపీ నాయకులు ఆగమేఘాలపై 2018 ఏప్రిల్ 14న భవనాలు ఖాళీ చేయించారు. వెనువెంటనే దానిని కూల్చి వేయించి పైలాన్ నిర్మాణ పనులు చేపట్టారు. విశేషమేమిటంటే రెండేళ్ల కిందట అదే స్త్రీ, శిశు సంక్షేమ భవనాన్ని రూ.5 లక్షలతో ఆధునికీకరించారు. ఇంకా దారుణమేమిటంటే బలవంతంగా ఖాళీ చేసేసిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ప్రస్తుతం అద్దె భవనంలో ఉంటోంది. -
చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయా: నవీన్
సాక్షి, తిరుపతి: అమరావతిలో అన్ని అక్రమాలే జరుగుతున్నాయని సన్‌షైన్ ప్రొడక్షన్ లిమిటెడ్ ఎండీ, నారావారిపల్లెకు చెందిన నవీన్‌కుమార్ నాయుడు విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఆయన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ఏ ఒక్క పని కూడా నిబంధనల ప్రకారం జరగడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి కోటిన్నర రూపాయలు పెట్టి అమరావతిలో స్టూడియో నిర్మించి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు చేసి మరి స్టూడియో నిర్మించినట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వం పిలిచిన ప్రతి టెండర్లో పాల్గొన్న కానీ ఏ ఒక్క వర్క్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పన్నులన్నీ దొడ్డిదారిన సొంతవారికే కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో జరుగుతున్న అక్రమాలపై చంద్రబాబు, లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని వెల్లడించారు. కాగా, చంద్రబాబు స్వగ్రామానికి చెందిన నవీన్ ఆయనపై ఈ స్థాయిలో విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రెస్‌క్లబ్‌లో నవీన్ మాట్లాడుతున్న సమయంలో టీడీపీ నేతలు నవీన్ బంధువులను పంపించి.. నవీన్‌ను అక్కడి నుంచి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నవీన్ తనకు జరిగిన అన్యాయంపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. -
చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయా: నవీన్
-
నా పంట యాప్ రైతుకు చేదోడు!
రైతులకు తోడ్పడటానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలన్న తపనతో నవీన్ కుమార్ అనే యువకుడు ఏడాదిన్నర క్రితం ప్రారంభించిన ప్రస్థానం రైతులకు చేదోడుగా నిలుస్తోంది. సకాలంలో సమాచారం సాంకేతిక సలహా అందక పంట నష్టపోవడం, దళారీ వ్యవస్థ వల్ల పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వంటి మౌలిక సమస్యలను పరిష్కరించగలిగితే రైతుల జీవితాల్లో వెలుగులు పూయించవచ్చని నవీన్‌కుమార్ తలపెట్టాడు. ఐఐఐటీ హైద్రాబాద్, ఇక్రిశాట్ నిపుణుల తోడ్పాటుతో ‘నా పంట’ అనే మొబైల్ యాప్‌ను 2017 జూన్‌లో రూపొందించారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలోకి గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘నా పంట’ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 3,500 మార్కెట్లలో 300 వ్యవసాయోత్పత్తులకు పలుకుతున్న తాజా ధరవరలతోపాటు మూడేళ్లలో వాటి ధరల్లో హెచ్చుతగ్గులను ఈ యాప్ ద్వారా రైతులు తెలుసుకోవచ్చు. ప్రకృతి, సేంద్రియ, రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన 120 పంటలకు సంబంధించిన ఎరువులు, చీడపీడల యాజమాన్య మెలకువలు, కషాయాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరిచారు. పంటల బీమా.. కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు.. యంత్రపరికరాల లీజు సమాచారం, వ్యవసాయ డీలర్ల వివరాలు.. వంటి మొత్తం 16 రకాల సేవలను స్మార్ట్ ఫోన్ ద్వారా నిమిషంలోనే పొందవచ్చని నవీన్ వివరించారు. గ్రామీణ రైతులు ఉపయోగించుకోగలిగేలా తెలుగు భాషలోనే ఆన్లైన్ మార్కెటింగ్, ఈ కామర్స్ సదుపాయాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రారంభించిన ఏడాదిన్నర కాలంలోనే ఈ యాప్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో లక్షా పది వేల మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందుతున్నారని నవీన్(95059 99907) చెబుతున్నారు. బాల వికాస, రెడ్డీ ల్యాబ్స్ వంటి ప్రైవేటు సంస్థలతోపాటు ప్రభుత్వ సంస్థలతోనూ కలిసి పనిచేస్తూ రైతులకు చేరువ అవుతున్నామన్నారు. అనతికాలంలోనే అనేక అవార్డులను అందుకున్న ‘నా పంట’ యాప్‌ను ఉపయోగించుకోగలిగిన రైతులు సాగు వ్యయాన్ని తగ్గించుకోవడానికి, ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. -
గౌరీ లంకేశ్ కేసులో చార్జిషీట్ దాఖలు
బెంగళూరు: సంచలనం సృష్టించిన ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్(55) హత్యకేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బుధవారం తొలి చార్జిషీట్‌ను బెంగళూరులోని అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలుచేసింది. ఈ చార్జిషీట్లో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్‌ను నిందితుడిగా సిట్ పేర్కొంది. నిందితుడిపై పలు ఐపీసీ సెక్షన్లతో పాటు ఆయుధ చట్టం కింద కేసు సిట్ నమోదుచేసింది. గౌరీ ఇంటివద్ద రెక్కీ నిర్వహించిన నవీన్ ఆమె హంతకులకు ఆయుధాలను సరఫరా చేశాడని సిట్ చార్జిషీట్లో తెలిపింది. హత్యచేసేందుకు నిందితుల్ని గౌరి ఇంటివద్దకు నవీన్ తీసుకెళ్లాడని వెల్లడించింది. -
ప్రేమోన్మాదులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ప్రేమించు..లేకుంటే ప్రాణం తీస్తా’ అంటూ కిరాతకంగా వ్యవహరించిన ప్రేమోన్మాదులు యువతుల గొంతుకోసిన దారుణ సంఘటనలు వేలూరు జిల్లాలో చోటుచేసుకున్నాయి. వేలూరు జిల్లా కేదాంతపట్టి గ్రామానికి చెందిన మునిరాజ్ కుమార్తె లావణ్య (23) హాస్టల్లో ఉంటూ కడలూరు జిల్లా చిదంబరంలోని అన్నామలై యూనివర్సిటీలో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. లావణ్యకు ఆమె సొంతూరికి చెందిన వ్యక్తి, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న నవీన్‌కుమార్ (27)కు మధ్య స్నేహం ఉంది. అయితే నవీన్‌కుమార్ మాత్రం ప్రేమించాల్సిందిగా వేధించేవాడు. దీంతో విసిగిపోయిన లావణ్య గత 20 రోజులుగా నవీన్‌కుమార్‌తో మాట్లాడడం మానేసింది. ఫోన్ కూడా తీయడం లేదు. దీంతో సోమవారం ఉదయం చిదంబరానికి వచ్చిన నవీన్కుమార్నేరుగా లావణ్య ఉంటున్న హాస్టల్‌కు వెళ్లి గేటుముందే నిలబడి మాట్లాడుకోవడంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో కోపగించుకున్న నవీన్‌కుమార్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి విచక్షణారహితంగా ముఖంపై కత్తితో దాడిచేశాడు. లావణ్య పెట్టిన కేకలకు పరిసరాల్లోని ఆటో డ్రైవర్లు ఉలిక్కిపడి ప్రేమోన్మాదిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అతడు కత్తితో బెదిరించడంతో బలమైన రాళ్లు విసిరి యువతిని రక్షించారు. తీవ్రరక్తస్రావం అవుతున్న స్థితిలో సమీపంలోని లావణ్యను ఆస్పత్రిలో చేర్పించారు. స్థానికులు నవీన్‌కుమార్‌ను పట్టుకుని చితకబాదారు. తీవ్రగాయాలకు గురైన అన్ని ఆసుపత్రిలో చేర్పించి అన్నామలైనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాట్పాడిలో.. వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన షబ్బీర్ (23) అనే ఎంబీఏ విద్యార్థి అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించేవాడు. మతం మార్చుకుని పెళ్లి చేసుకుందాం..లేకుంటే చంపేస్తాను అని బెదిరించేవాడు. దీంతో యువతి తల్లిదండ్రులు గత నెల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో రోడ్డుపై నడిచి వెళుతున్న యువతిని అడ్డుకుని షబ్బీర్ కత్తితో గొంతుకోశాడు. ఆమె పెట్టిన కేకలతో జనం అక్కడికి చేరడంతో అతను పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని సమీపంలోని ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. వేలూరు పోలీసులు షబ్బీర్‌ను అరెస్ట్ చేశారు. -
జర్నలిస్టు హత్య కేసులో పురోగతి
-
అల్లుడి కళ్లలో కారం కొట్టి కూతురి కిడ్నాప్
సాక్షి, తిరుపతి : వాళ్లిద్దరికి మూడేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోవడంతో నెలన్నర క్రితం (ఆగస్ట్ 16) పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురంలో కులాలు అడ్డుగోడలుగా నిలిచాయి. కూతురు కులాంతర వివాహం చేసుకోవడం అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చలేదు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న పాపానికి అల్లుడి కళ్ళల్లో కారం చల్లి కూతుర్ని ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... తిరుపతికి చెందిన నవీన్ కుమార్ చంద్రగిరి గ్రామీణ ప్రభుత్వ ఆసుపత్రిలో హౌస్ సర్జన్‌గా పని చేస్తున్నాడు. మెడిసన్ చదువుతున్న సిరిచందనతో అతడికి పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమ వివాహానికి దారి తీసింది. అయితే కుమార్తె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని సిరిచందన తల్లిదండ్రులు ఇవాళ మధ్యాహ్నం రెండు ఇన్నోవా వాహనాలతో వచ్చి... భార్యాభర్తలు ఇంటికి వెళుతుండగా నవీన్‌పై దాడి చేశారు. అనంతరం సిరిచందనను బలవంతంగా తీసుకు వెళ్లారు. నవీన్‌కుమార్ తన సోదరి సాయంతో చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కులాలు వేరు కావడంతో సిరిచందన తల్లిదండ్రులు రాజభూపాల్ రెడ్డి, పార్వతి...తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ... తమ పెళ్లి సిరిచందన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, అందుకే తనపై దాడి చేసి భార్యను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపాడు. గతంలో కూడా పలుమార్లు దాడులకు ప్రయత్నిస్తుంటే తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు అతడు తెలిపాడు. బాదితుడి ఆవేదన వీడియో -
అల్లుడి కళ్లలో కారం కొట్టి కూతురి కిడ్నాప్
-
వ్యాన్-స్కూల్ బస్ ఢీ, విద్యార్థి మృతి
-
వ్యాన్‌ను ఢీకొన్న స్కూల్ బస్, విద్యార్థి మృతి
సాక్షి, మైదుకూరు : వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం మీర్జాఖాన్‌పల్లె వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రయివేట్ పాఠశాల బస్సు, కొరియర్ వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో నవీన్‌కుమార్(5) అనే విద్యార్థి మృతి చెందాడు. మరో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కొరియర్ వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నవీన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే స్కూల్ బస్సు ప్రమాదానికి గురైందని, అయితే స్కూల్ యాజమాన్యం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా డ్రైవర్ రాంగ్ రూట్లో వాహనాన్ని నడటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
మంచిగా ఉంటూనే హైందవిని మట్టుపెట్టాడు..
► పరులతో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు ► హైందవి హత్యతో ప్రొద్దుటూరులో భయాందోళనలు ప్రొద్దుటూరు: అతను అద్దెకు ఉన్నది మూడు నెలలే. అయినా ఆ కుటుంబంతో బాగా చనువు ఏర్పడింది. ఈ కారణంగా అప్పుడప్పుడు ఇంట్లోకి వెళ్లేవాడు. మంచిగా ఉంటూనే అతను బీటెక్ విద్యార్థిని హైందవిని మట్టుపెట్టాడు. గోకుల్‌నగర్‌లో నివాసం ఉంటున్న జయప్రకాష్‌రెడ్డికి కుమార్తె హైందవి, కుమారుడు మౌనీశ్వరరెడ్డిలు ఉన్నారు. ఆయన లెక్చర్‌గా పని చేస్తుండగా, భార్య విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. వారి కుమార్తె హైందవి 10 వరకూ ఉషోదయ హైస్కూల్, ఇంటర్ షిర్డిసాయి జూనియర్ కాలేజిలో చదువుకుంది. తర్వాత బీటెక్ ట్రిపుల్ఈ హైదరాబాద్‌లోని సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజిలో పూర్తి చేసింది. మొదటి నుంచి హైందవికి క్లాస్‌లో మంచి మార్కులు వచ్చేవి. బాగా చదివి ఎప్పటికైనా ఉన్నతమైన ఉద్యోగం సాధిస్తానని తల్లిదండ్రులతో చెప్పేది. ఈ క్రమంలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లలో టీసీఎస్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికైంది. అయితే ఆ కంపెనీ నుంచి కాల్‌లెటర్ రాకపోవడంతో ఇంటిì వద్ద ఖాళీగా ఉండకుండా బ్యాంకు కోచింగ్‌కు వెళ్లేది. వృత్తి రీత్యా ఏనాడైనా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుందని భావించిన హైందవి ఇటీవల పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంది. ఇంట్లో ఉంటే తల్లికి ఒక్క పని కూడా చేసే అవకాశం ఇవ్వదు. అంతా తానే చేస్తుంది. తన దారిన తాను వెళ్లి ఉంటే.. తన స్కూటీ రోజూ మొరాయిస్తుండంతో రిపేరు చేయించేందుకు షెడ్డులో ఇచ్చింది. స్కూటీ తెచ్చుకునేందుకు హైందవి తండ్రి బైక్‌లో బజారులోకి వెళ్లింది. అప్పటికే స్కూటీ రిపేరు చేసి ఉండటంతో తీసుకొని నేరుగా ఇంటికి బయలుదేరింది. పెట్రోల్ అయిపోవడంతో నవీన్ కుమార్ దారిలో బైక్ నిలిపి ఆగి ఉన్నాడు. అదే దారిలో వెళ్తున్న హైందవి అతన్ని చూసి ఆగింది. పెట్రోల్ అయిపోవడంతో ఆగానని అతను చెప్పగా మానవత్వం చూపిన హైందవి తన స్కూటీలో కూర్చోపెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్లింది. ఇంట్లో ఉన్న ఒక ఖాళీ బాటిల్ ఇచ్చి పెట్రోల్ తెచ్చుకోమని స్కూటీ తాళాలను అతనికి ఇచ్చింది. తమ కుటుంబంతో పరిచయం కారాణంగా హైందవి అతనికి సాయం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది. అలా కాకుండా తన దారిన తాను వెళ్లి ఉంటే ఈ దారుణం జరిగేది కాదని పలువురు అంటున్నారు. పరులతో జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు పరాయి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పక్కన ఉన్న కారణంగా చనువు ఉంటుందని, అలాంటి వారికి ఎక్కువ చనువు ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని అంటున్నారు. కొందరు మనుసులో ఏదో ఆలోచన పెట్టుకొని పరిచయం పెంచుకునేవాళ్లు కూడా లేకపోలేదని పోలీసులు పేర్కొంటున్నారు. మంచితనం అనే ముసుగు కప్పుకొని నిండా ముంచేవాళ్లు ఇటీవల కాలంలో ఎక్కువగా ఉన్నారని, ఇంటా బయట జాగ్రత్తగా ఉంటే ఎలాంటి నేరాలు జరగడానికి అస్కారం ఉండదని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. హైందవి హత్యతో ప్రొద్దుటూరులో భయాందోళనలు హైందవి హత్య జరిగిన మరు క్షణం నుంచి ప్రొద్దుటూరు ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంట్లోకి చొరబడి గొంతులు కోస్తుండటంతో పట్టణ వాసుల్లో అలజడి మొదలైంది. ఇప్పటి వరకూ బయటికి వెళ్లేటప్పుడు మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేవారు. ఇళ్లలో ఉన్న వాళ్లు కూడా పూర్తి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పట్టణంలోనే గాక శివారు ప్రాంతాల్లో పోలీసులు రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
లారీ,బైక్ ఢీ : యువకుడికి తీవ్రగాయాలు
యాచారం: లారీ, బైక్ ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం చింతుల్ల గ్రామానికి చెందిన ఎదటి నవీన్ కుమార్ శుక్రవారం సాయంత్రం ఉపవాస దీక్ష విరమించేందుకు కావాల్సిన పండ్లకొనుగోలుకు తన బైక్‌పై యాచారం వెళు్తన్నారు. మార్గ మధ్యలో యాచారం– చౌదర్పల్లి గ్రా మాల మధ్య మలుపు వద్ద యాచారం నుంచి చౌదర్‌పల్లికి వస్తున్న లారీ నవీన్ కుమార్ బైకును బలంగా ఢీకొట్టడంలో నవీన్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. నవీన్ కుమార్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ మదన్ మోహన్ రెడ్డిని సంప్రదించగా ప్రమాదం వాస్తవమేకానీ ఫిర్యాదు అందలేదన్నారు. -
పుట్టినరోజే నాబిడ్డను కడతేర్చారు...
అనుమానస్పద స్థితిలో విద్యానికేతన్ విద్యార్థి మృతి అది ముమ్మాటికీ హత్యేనంటున్న తల్లిదండ్రులు విద్యానికేతన్ ఎదుట బైఠాయించి, నిరసన తెలిపిన విద్యార్థి సంఘాలు చంద్రగిరి: పుట్టిన రోజు అన్నాడు.. కొత్తబట్టలు తీసిచ్చాము.. ఎంతో సంతోషంగా నా బిడ్డ తన కాలేజ్‌లో మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పి వచ్చిన వాడిని అన్యాయంగా ఆరోజే తోటి స్నేహితులే కడతేర్చారంటూ ఆ తల్లి పడ్డ వేదన అక్కడున్న వారందరినీ కలిచివేసింది. ఏ పాపం తెలియని తన కొడుకుని హతమార్చడానికి వాళ్లకి చేతులేలా వచ్చాయంటే ఆ తల్లి ఆక్రోసం పలువురిని కదలించింది. బందువుల కథనం మేరకు.. తిరుపతి పెదకాపు వీధికి చెందిన చలపతి, నాగమణిలకు ఇద్దరు కుమారులు. వారిలో రెండవ కుమారుడు నవీన్‌కుమార్(18) విద్యానికేతన్ విద్యాసంస్థలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 5వ తేదిన నవీన్ పుట్టిన రోజు కావడంతో కొత్తబట్టలు వేసుకుని కళాశాల చైర్మన్ మోహన్ బాబు వద్ద ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఎప్పటిలాగే ఇంటిలో నుంచి కళాశాలకు పయనమయ్యాడు. అయితే నవీన్ 5వ తేది మధ్యాహ్నం నుంచి కళాశాలకు రాలేదని కళాశాల యాజమాన్యం సమాచారం అందించింది. అప్పటి నుంచి ఎంత వెతికినా నవీన్ కనిపించ కపోవడంతో, 6వతేదిన చంద్రగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా , వారు మిస్సింగ్ కేసు నమోదు చేసారు. ఈ లోగా శుక్రవారం విద్యానికేతన్‌కు ఎదురుగా ఉన్నటువంటి గుండాలకోన మడుగులో ఓ శవం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మతుడి కుడిచేతి వేళ్లకు ఉంగరం ఉండటంతో నవీన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మతుడు తన బిడ్డేనని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో నవీన్ తల్లిదండ్రులు, బందువులు, విద్యార్థి సంఘ నాయకులు విద్యానికేతన్ వద్ద చేరుకున్నారు. ఆంబులెన్స్‌లో పోస్టమార్టంకు వెళుతున్న నవీన్ మతదేహాన్ని వారి బందువులు అడ్డుకుని నిరసనకు యత్నించారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అనంత రం వారు విద్యానికేతన్ గేటు ముందు ైబైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. దీంతో కళాశాల సీఈవో తులసీ నాయుడు జోక్యం చేసుకుని తప్పకుండా మీకు న్యాయం చేస్తానని హామి ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. అనుమానాలెన్నో... నవీన్ మృతి పట్ల పలు అనుమానాలు తావిస్తోంది. నవీన్‌ను కళాశాల నుంచి ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు అన్న విషయం అంతుపట్టడం లేదు. కళాశాలలో నవీన్‌కు ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉందని పలువురు విద్యార్థులు తెలుపుతున్నారు. అంతే కాకుండా మతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అది హత్యేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు సమాచారం. నవీన్ మృతికి ప్రేమే కారణమా? లేక మరేదైనా విభేధాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అది ముమ్మాటికీ హత్యే.. నా బిడ్డ ఎవరీ జోలికీ వెళ్లడు. ఎంతో సౌమ్యుడిగా ఉంటారు. అటువంటి వ్యక్తిని అన్యాయంగా చంపారు. తన తోటి విద్యార్థులే కొంత మంది నా బిడ్డను కళాశాల నుంచి బయటకు తీసుకువచ్చి, ఆటోలో ఎక్కించుకుని వెళ్లినట్లు సీసీ కెమారాల్లో రికార్డు అయ్యింది. నాబిడ్డను చంపిన వారిని శిక్షించాలి. - నాగమణి, తల్లి. యాజమాన్య వైఫల్యమేః నవీన్ మృతికి యాజమాన్యం వైఫల్యమే కారణం. గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నా పోలీసులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కళాశాల్లో నాశిరకం సీసీ కెమారాలను పెట్టి విద్యార్థుల జీవితాలతో వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై ఏఐటీయూసీ దృష్టికి తీసుకెళ్తాం. -విశ్వనాథం, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. -
యూట్యూబ్‌లో శోధించి ఆత్మహత్య!
హైదరాబాద్: కుటుంబ కలహాలతో సతమతమైన ఓ యువకుడికి ఆత్మహత్య చేసుకోవడమే శరణ్యమనిపించింది. ఆత్మహత్య చేసుకోవడానికి అతగాడు సులువైన దారుల కోసం అన్వేషించాడు. చివరకు ఆ యవకుడు యూట్యూబ్‌ను ఎన్నుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడం ఎలా? అని యూట్యూబ్‌లో శోధించి మరీ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హస్టల్ గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఎక్కడో కాదు. నగరంలోని ఎస్సార్ నగర్ అనుపమ హాస్టల్లో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. నల్లగొండ జిల్లాకు చెందిన నవీన్ కుమార్ బీటెక్ పూర్తి చేసి ఎస్సార్ నగర్‌లోని అనుపమ వసతి గృహంలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతూ బుధవారం హస్టల్ గదిలో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు బలవన్మరణానికి ముందు ఆత్మహత్య చేసుకోవడానికి సులువైన దారుల కోసం యూట్యూబ్‌లో శోధించినట్లు తెలుస్తోంది. -
యూట్యూబ్‌లో శోధించి ఆత్మహత్య!
-
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
అనంత పురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెన్త్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. వారిని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిలమత్తూరు మండలం నల్లగుట్ట పల్లికి చెందిన నవీన్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి సైకిల్ పై వెళుతుండగా.. పక్క నుంచి వెళ్లిన రెండు ఐషర్ వాహనాలు ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో నవీన్‌కుమార్ అక్కడి కక్కడే మృతి చెందాడు. రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఈత నేర్చుకోవడానికి వెళ్లి..
రామన్నపేట మండలం వెల్లంకిలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. సరినేనిగూడెం గ్రామానికి చెందిన నవీన్ కుమార్(14) అనే బాలుడు స్నేహితులతో కలిసి వెల్లంకి గ్రామశివారులో ఉన్న చిన్న కొలనులో ఈత నేర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఢిల్లీలో తెలుగు మహిళ అనుమానాస్పద మృతి..!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రియుడితో కలిసి వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన దేశ రాజధానిలోని నోయిడా 49వ సెక్టార్ సర్ఫాబాద్లో చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో ఇరువురి మృతదేహాలను మంగళవారం రాత్రి పోలీసులు కనుగొన్నారు. స్నానాలగదిలో నగ్నంగా పడి ఉన్న మృతదేహాలను ఒడిశాకు చెందిన నవీన్‌కుమార్ (32), ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఎట్టెడ గ్రామానికి చెందిన దాక్షాయణి (30)గా పోలీసులు గుర్తించారు. స్థానికులు, మృతుల బంధువుల కథనం మేరకు వివరాలు.. దాక్షాయణికి రేవన్న అనే వ్యక్తితో ఎనిమిదేళ్ల క్రితం పెళ్లైంది. ఉద్యోగరిత్యా వీరు బెంగళూరులో స్థిరపడ్డారు. వీరికి మహేశ్ (5), మౌనిక (3) సంతానం. బెంగుళూరులో ఉంటున్న సమయంలో ఇంటిపక్కనే ఉంటున్న నవీన్ అనే వ్యక్తితో దాక్షాయణికి పరిచయం ఏర్పడింది. పరిచయం ఆతర్వాత ప్రేమగా మారింది. బెంగుళూరు నుంచి మకాం మార్చిన నవీన్ నోయిడాలోని ఓ ప్రై వేటు కంపెనీలో చేరాడు. సర్ఫాబాద్ గ్రామంలో అద్దె ఇళ్లు తీసుకున్నాడు. కాగా రెండు నెలల కిందట పుట్టింటికి (చిత్తూరు) వెళ్తున్నట్టు భర్త రేవన్నకు చెప్పిన దాక్షాయణి ఇద్దరు పిల్లలను తీసుకుని నోయిడాకు వచ్చింది. సర్ఫాబాద్ చేరుకున్న ఆమె నవీన్‌తో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి స్నానాలగదిలో ఇద్దరి మృతదేహాలు పడిఉన్నాయి. ఇంటికి, స్నానాలగదిలోకి లోపల నుంచి గడి పెట్టి ఉంది. పిల్లలు వేరు గదిలో నిద్రిస్తున్నారు. సోమవారం ఉదయం లేచిన పిల్లలు తల్లి కనిపించకపోవడంతో స్కూల్‌కు వెళ్లలేదు. ఫీజు కూడా కట్టాల్సి ఉండడంతో పిల్లలు గైర్హాజరవడంపై టీచరు ఓ విద్యార్థిని నవీన్ ఇంటికి పంపారు. తల్లి బాత్రూంకు వెళ్లి తిరిగిరాలేదని దాక్షాయని కుమారుడు మహేశ్ చెప్పడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నానాలగది తలుపుపగలగొట్టగా ఇరువురి మృతదేహాలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్యా? లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది పోస్టుమార్టం తర్వాతే తేలుతుందని పోలీసులు పేర్కొన్నారు. దాక్షాయనిని హత్యచేసి ఆ తర్వాత నవీన్ ఆత్మహత్యచేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
జీహెచ్ఎంసీ ఉద్యోగి ఆత్మహత్య
మృతుడు నవీన్‌మిట్టల్ పీఏ చైతన్యపురి: కొత్తపేట ఓల్డ్ విలేజ్‌లో నివసించే జీహెచ్ఎంసీ ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్యపురి ఎస్ఐ జయరాం కథనం ప్రకారం...కొత్తపేటకు చెందిన జీహెచ్ఎంసీ ఉద్యోగి వంగా నగేష్, భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. నగేష్ చనిపోవటంతో అతని ఉద్యోగాన్ని పెద్ద కుమారుడు వంగా నవీన్‌కుమార్ (26)కు ఇచ్చారు. తల్లి భాగ్యమ్మ జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ లేబర్‌గా, సోదరుడు ప్రవీణ్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. చిన్న సోదరుడు అరుణ్ బీటెక్ చదువుతున్నాడు. నవీన్ కొంతకాలంగా జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ దగ్గర పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు. తల్లి, అమ్మమ్మ, చిన్నతమ్ముడు నవీన్‌తో కలిసి ఉంటుండగా... పెద్ద తమ్ముడు ప్రవీణ్ ఇటీవలే ప్రేమవివాహం చేసుకుని వేరే ఉంటున్నాడు. కాగా, బుధవారం ఇంట్లోని వారంతా బయటకు వెళ్లగా.. అమ్మమ్మను టిఫిన్ చేసి రమ్మని నవీన్ బయటకు పంపాడు. తర్వాత బెడ్రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఉస్మానియా మార్చురీకి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ పీఏ ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) నవీన్ కుమార్(26) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి చైతన్యపురిలోని తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
చిన్నారులకు సి‘కిల్’సెల్
బిడ్డల రక్తం తాగుతున్న ప్రాణాంతక వ్యాధి ఖరీదైన వైద్యం చేయించలేనిస్థితిలోతల్లిదండ్రు దాతల సాయం కోసం వేడుకోలు జ్యోతినగర్ : అయ్యా.. మా బిడ్డలకు ప్రాణభిక్ష పెంట్టండి’ అని వేడుకుంటున్నారు ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీకి చెందిన బోగె కిష్టయ్య-పద్మ దంపతులు. ‘మా ప్రాణాలు.. మీ చేతుల్లో ఉన్నాయి. మమ్మల్ని బతికించండి’ అని చేతులు జోడించి అర్థిస్తున్నారు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వీరి కొడుకు, కూతురు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్నపూర్ణకాలనీలో నివాసముంటున్న బోగె కిష్టయ్య-పద్మకు కుమారుడు నవీన్‌కుమార్, కుమార్తె వందన ఉన్నారు. కిష్టయ్య పర్మనెంట్ టౌన్‌సిప్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పద్మ కూలీ పనిచేస్తూ భర్తకు అండగా ఉంటోంది. వీకి కుమారుడు నవీన్‌కుమార్ గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. కూతురు వందన టౌన్‌షిప్‌లోని సెయింట్ క్లేర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. హాయిగా సాగుతున్న కిష్టయ్య కుటుంబాన్ని విధి పగబట్టింది. ఎనిమిదేళ్ల క్రితం నవీన్‌కుమార్ అనారోగ్యంతో మంచం పట్టాడు. వైద్య పరీక్షలు చేయించగా సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి శరీరంలోని రక్తకణాలను నశింపజేసి, ఎముకల్లోని మూలగ(బోన్‌మ్యారో)ను క్షీణింపజేస్తుందని పేర్కొన్నారు. వ్యాధి కారణంగా ఎమ్ములు బలహీనపడతాయని తెలిపారు. అప్పటి నుంచి నెలకు రూ.2 వేల మందులతో కొకును కాపాడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఏడేళ్ల క్రితం వందన కూడా అనారోగ్యానికి గురైంది. ఈ మేకు కూడా వైద్య పరీక్షలు చేయించగా సికిల్‌సెల్ ఎనీమియా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా ఇద్దరి పిల్లల పరిస్థితి విషమిస్తోంది. నవీన్‌కుమార్ ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యాడు. దీంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స చేయిస్తున్నాడు. కూతురు వందన నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నవీన్‌కుమార్‌కు పరిస్థితి విషయమంగా ఉందని, త్వరగా బోన్‌మ్యారో మార్చాలని వైద్యులు తెలిపారు. ఇందుకు రూ.5 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. అటెండర్‌గా తనకు నెలనెలా వచ్చే రూ.5 వేల వేతనంలో రూ.4 వేలు పిల్లల మందులకే వెచ్చిస్తున్నాడు కిష్టయ్య. ఇద్దరు పిల్లలను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఇంతకాలం తమ సాయశక్తులా ప్రయత్నించారు. ప్రస్తుతం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేని కిష్టయ్య-పద్మ పిల్లలను ఎలా బతికించుకోవాలో తెలియక కన్నీటిపర్యంతమవుతున్నారు. దాతలు ముందుకు వచ్చి తన కొడుకు ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు. కదలలేని స్థితిలో ఉన్న నవీన్‌కుమార్ కూడా సాయం కోసం మౌనంగా అర్థిస్తున్నాడు. దాతలు 9963041772, 9494985525 నబర్లలో సంప్రదించాలని కోరుతున్నారు. -
రాత్రంతా రోడ్డుపైనే నిరసన
నవీన్ మృతదేహంతో తెల్లవారుజాము వరకూ ఆందోళన న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువుల డిమాండ్ ఎట్టకేలకు దిగివచ్చిన ట్రాక్టర్ యజమాని వర్గీయులు కోలవెన్ను (కంకిపాడు) : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి నవీన్‌కుమార్ కుటుం బాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు చేపట్టిన ఆందోళన రెండో రోజైన బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. రెండు వర్గాల మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో కోలవెన్ను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఒకానొక దశలో తోపులాటలు జరిగాయి. అనంతరం రాజీ కుదరటంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. వివరాల్లోకి వెళితే.. కోలవెన్ను గ్రామానికి చెందిన ప్రత్తిపాటి నవీన్‌కుమార్ (18) విజయవాడలోని ఓ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం కళాశాల నుంచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఆటోలో ఇంటికి వస్తున్నాడు. మాదాసువారిపాలెం సమీపంలో ఎదురుగా వేగంగా వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో నవీన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. కోలవెన్ను రోడ్డు మార్జిన్లో ఉన్న కంకర గుట్టను తప్పించే క్రమంలో వేగంగా వెళ్తున్న రెండు వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన నవీన్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బంధువులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ యజమాని ప్రతినిధులు, బాధితులు, గ్రామస్తులతో తెల్లవారుజాము వరకూ పోలీసుస్టేషన్లోనే చర్చలు జరిపారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అనుచరుడు ఇచ్చిన హామీతో గ్రామస్తులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. అప్పటి వరకూ ఘటనాస్థలంలోనే ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడకు తరలించారు. కోలవెన్నులో ఉద్రిక్తత బాధితులు, ట్రాక్టర్ యజమాని ప్రతినిధులతో గ్రామ సర్పంచ్ తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), టీడీపీ నేత తుమ్మల జగదీష్ స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి చర్చలు జరిపారు. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న నవీన్ తల్లిదండ్రులు నాగరాజు, శ్రీదేవి రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కదిలించివేంది. అందరితో కలివిడిగా ఉండే నవీన్ మృతిని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పంచాయతీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. తమసహ విద్యార్ధిని చూసేందుకు విజయవాడలోని కళాశాల విద్యార్ధులు కోలవెన్ను చేరుకున్నారు. దీంతో గ్రామం లో విషాదం నెలకొంది. ట్రాక్టర్ యజమాని ఎం.శ్రీనివాసరావు తరఫు మధ్యవర్తులు జగన్మోహన్రావు, విశ్వేశ్వరరావు బాధిత కుటుంబానికి అందించే నష్టపరిహారం అందించే విషయం స్పష్టంగా చెప్పకపోవడం గ్రామస్తులు, మృతుని బంధువులను ఆగ్రహానికి గురిచేసింది. ఎస్ఐ శ్రీనివాస్ సమక్షంలోనే స్థానికులు మధ్యవర్తులపై దాడికి యత్నించారు. దీంతో ఎస్ఐ అక్కడినుంచి వెళ్లిపోయారు. సర్పంచ్ తుమ్మల చంద్రశేఖర్, తుమ్మల జగదీష్‌లు బాధితులు, మధ్యవర్తులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో నష్టపరిహారం విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో గ్రామానికి చెందిన యువత ఆగ్రహావేశాలతో కార్యాలయంలోకి తోసుకొచ్చి తోపులాటకు దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను వదిలేది లేదంటూ పెద్దగా కేకలు వేశారు. ఆందోళనకారులకు సర్దిచెప్పి రూ 2లక్షలు నష్టపరిహారం బాధిత కుటుంబానికి అందించేలా రాజీ కుదిర్చారు. దీంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. -
జంట కమిషనరేట్లలో ఏడుగురు ఐపీఎస్‌ల బదిలీ
నగర సీసీఎస్ డీసీపీగా రవివర్మ సైబరాబాద్ సీసీఎస్ డీసీపీగా నవీన్‌కుమార్ సిటీబ్యూరో: ప్రభుత్వం మంగళవారం 35 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో జంట పోలీసు కమిషనరేట్లలో ఏడుగురు ఉన్నారు. వీరిలో ఐదుగురు కొత్తవారు వచ్చారు. నగర సీసీఎస్ డీసీపీగా ఉన్న పాలరాజును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో ఆయన స్థానంలో ఎల్బీనగర్ డీసీపీగా ఉన్న రవివర్మను నియమించారు. ఎల్బీనగర్ డీసీపీగా తస్వీర్ ఎక్బాల్‌ను నియమించారు. ఇక సైబరాబాద్ సీసీఎస్ డీసీపీగా బి.నవీన్‌కుమార్‌ను నియమించారు. బాలానగర్ డీసీపీగా ఉన్న ఏఆర్ శ్రీనివాస్‌ను శంషాబాద్ డీసీపీగా బదిలీ చేశారు. బాలానగర్ డీసీపీగా డాక్టర్ శిముషి వాజపేయి, నగర జాయింట్ కమిషనర్ (అడ్మిన్)గా టి.మురళీకృష్ణ, సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా ఎస్.జె.జనార్ధన్‌లు నియమితులయ్యారు. -
అమ్మాయి ట్విస్ట్...
‘‘ఈ సినిమా వేడుక చూస్తుంటే నా కెరీర్ ప్రారంభ రోజులు గుర్తొస్తున్నాయి’’ అన్నారు కాజల్ అగర్వాల్. నవీన్‌కుమార్(ఎన్.కె.), హరిణి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘పిచ్చెక్కిస్తా’. బి.శ్రీకాంత్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. నటరాజ్ కొట్టూరి, రాజశేఖర్ లంకా, శ్రీకాంత్‌రెడ్డి నిర్మాతలు. నవనీత్‌చారి స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని కాజల్ అగర్వాల్ ఆవిష్కరించి, తొలి ప్రతిని దర్శకుడు మారుతికి అందించారు. అమ్మాయిని ఎన్నో కష్టాలకోర్చి ప్రేమలో దించిన ఓ యువకుడికి ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? అనేది ఈ చిత్ర కథాంశం అని దర్శకుడు చెప్పారు. -
‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే ...’
విజయవాడ : పదేళ్లు ప్రేమాయణం సాగించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బుద్ధి వక్రీకరించి మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ‘నువ్వు కూడా ఉండొచ్చు..కాకుంటే షరతులు వర్తిస్తాయి’ అనడంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె న్యాయం కోసం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే పటమట రామచంద్రానగర్‌కు చెందిన కొప్పురావూరి సంధ్యారాణి తన భర్త నవీన్‌కుమార్ రెండున్నర నెలల కిందట వదిలేసి వెళ్లాడని పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేసింది. భర్త గవర్నరుపేటలోని తన మామ కొప్పురావూరి నటరాజు ఇంట్లో ఉంటున్నాడని, తన రెండున్నరేళ్ల కుమార్తె శ్రీ చిన్విని కూడా అక్కడే ఉంచుకొని చూపించడం లేదని ఆమె పేర్కొంది. రెండో పెళ్లికి సిద్ధపడిన తన భర్త పేరొందిన న్యాయవాది పేరు చెపుతూ తననేమీ చేయలేరంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన కుమార్తెనైనా చూ పించాలంటూ పోలీస్ కమిషనర్‌ను ఆమె వేడుకుంది. దీనిపై మహిళా పోలీ సు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఇదీ జరిగింది 2001లో సంధ్యారాణి ఇంటర్మీడియెట్ చదువుతుండగా బియ్యం వ్యాపారి నట రాజు కుమారుడు నవీన్‌కుమార్‌తో స్నే హితుల ద్వారా పరిచయమైంది. తరువాత ప్రేమలో పడిన వీరు 2010లో కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి రామచంద్రానగర్‌లో ఉంటున్నారు. వీరికి రెండున్నరేళ్ల శ్రీ చిన్వి, మూడు నెలల జిజ్ఞేశ్వర్ సం తానం. నవీన్ గత మే 16న కుమార్తెను తీసుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. పలుమార్లు వెళ్లి ప్రాథేయపడినా రాకపోగా, కుమార్తెను కూడా చూ పించడం లేదు. ఇందుకు తన మామే కారణమని ఆమె పేర్కొంది. తన మామ బలవంతంతో మరో వివాహం చేసుకునేందుకు నవీన్ ప్రయత్నిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. షరతులు పెడుతున్నాడు తన కుమార్తెను చూపించేందుకు భర్త షరతులు పెడుతున్నాడని సంధ్యారాణి ఆరోపిస్తోంది. రెండో వివాహం ఇష్టమేనని, ఆస్తిలో వాటా అడగనని, భవిష్యత్‌లో అత్తమామలపై పోలీసులకు ఏ విధమైన ఫిర్యాదు చేయకూడదంటూ ఒప్పంద పత్రంపై సంతకం పెట్టాలంటున్నట్టు ఆమె పేర్కొంది. ఇది జరిగితే కుటుంబ ఖర్చులు పెట్టుకొని వారంలో ఒకరోజు పాపను తీసుకువచ్చి తన ఇంట్లో గడుపుతానని చెపుతున్నాడని, ఇలా చేయకపోతే పిల్లలు తనకు పుట్టలేదని ప్రచారం చేస్తారని బెదిరిస్తున్నాడని ఆమె కన్నీటి పర్యంతమైంది. -
ఫ్యాషన్ ప్రపంచం
-
‘డీడీఏ’ స్కాంలో మరో ముగ్గురి అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అభివృద్ధి సంస్థ(డీడీఏ) ప్లాట్ల కుంభకోణంలో మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. డీడీఏ ప్లాట్లు ఇస్తామంటూ అమాయకుల నుంచి రూ.3.83 కోట్ల దండుకున్న కేసులో ఇప్పటికే నలుగురు కటకటాలపాలైన విషయం తెలిసిందే . బుధవారం అరెస్టయిన ముగ్గురిలో ఇద్దరు డీడీఏ ఉద్యోగులు ఉన్నట్లు క్రైం బ్రాంచి అడిషనల్ కమిషనర్ అరవిందర్ యాదవ్ తెలిపారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం.. ప్రేమ్ శంకర్ ముఠాకి చెందిన నిందితులంతా ఈ కుంభకోణానికి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ముఖర్జీనగర్కి చెందిన కన్వల్సాహ్ని అనే వ్యక్తికి డీడీఏ కార్యాలయం నుంచి డీడీఏ ప్లాట్ కేటాయించినట్టు ఓ లెటర్ వచ్చింది. ఇందుకు సంబంధించి అతడు డీడీఏ కార్యాలయం పేరుతో కొంత మొత్తాన్ని డీడీ రూపంలో అందులో ఉన్న నంబర్లో జమ చేశాడు. తర్వాత కొన్నాళ్లకి తనకు ఇచ్చిన ధ్రువపత్రాలు నకిలీవని తెలియడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును క్రైం బ్రాంచికి అప్పగించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీనిలో డీడీఏకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర సైతం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. బుధవారం నవీన్‌కుమార్, అజయ్‌కుమార్, శైలేందర్ భాటియాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ముఠాకి ప్రేమ్‌శంకర్ శర్మ నాయకుడని పోలీసులు గుర్తిం చారు. అతడి ఆధ్వర్యంలోనే బాధితులకు నకిలీ అలాట్మెంట్ లెటర్లు పంపినట్టు గుర్తించారు. నిందితులంతా కలిసి రూ.3.83 కోట్ల రూపాయలు దండుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందతులందరినీ అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు.