
జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ పీఏ ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) నవీన్ కుమార్(26) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి చైతన్యపురిలోని తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.