Naveen Mittal
-
అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిట్టల్ ఈ నెల 26న సర్క్యులర్ జారీచేశారు. ధరణి కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.అదనపు కలెక్టర్లకు 4 కొత్త అధికారాలు అదనపు కలెక్టర్లు(రెవెన్యూ) కొత్తగా ధరణి సాఫ్ట్‌వేర్‌లోని నాలుగు మాడ్యూల్స్‌కు తుది ఆమోదం తెలిపే అధికారం పొందనున్నారు. మ్యూటేషన్ దరఖాస్తులు(టీఎం3), పీపీబీ–కోర్టు కేసు(టీఎం24), ఇళ్లు/ఇంటి స్థలంగా పేరు ఉన్న సందర్భంలో పీపీబీ/నాలా కన్వర్షన్ జారీ(టీఎం31), పాస్‌బుక్‌లో తప్పుల దిద్దుబాటు/పేరు మార్పు(టీఎం33)కు సంబంధించిన దరఖాస్తులకు ఆయన స్థాయిలోనే పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానా లను సైతం సీసీఎల్ఏ ప్రకటించింది. తొలుత తహసీల్దార్లు దరఖాస్తుదారులను విచారించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి దరఖాస్తులను ఆర్డీ ఓలకు పంపించాలి. ఆర్డీఓలు దరఖాస్తు లను పరిశీలించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా అదనపు కలెక్టర్లకు ఫార్వ ర్డ్ చేయాలి. తహసీల్దార్/ఆర్డీఓ సిఫారసుల ఆధారంగా అదనపు కలెక్టర్లు దరఖాస్తులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అదనపు కలెక్టర్లు అందుకు సరైన కారణాలు తెలపాలి. ఆర్డీఓలకు మరిన్ని అధికారాలు..ఆర్డీఓలకు ఇప్పటికే ఉన్న ధరణి మాడ్యూల్ అధికారాలకు అదనంగా మరో నాలుగు మాడ్యూల్స్‌కు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. అసైన్డ్ భూములతో సహా పట్టా భూముల వారసత్వ బదిలీ దరఖాస్తులు(టీఎం4), పెండింగ్ నాలా దరఖాస్తులు (టీఎం27), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(టీఎం 33), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(జీఎల్ఎం) దరఖాస్తులకు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని వారికి కల్పించింది. గత ఫిబ్రవరి 28న ప్రకటించిన గడువుల్లోగానే దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. -
పలు సంస్థలకు 125 ఎకరాల ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అవసరాల నిమిత్తం 125 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర భూమి నిర్వహణ అథారిటీ ఆమోదం మేరకు భూ ముల కేటాయింపు చేసినట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఖమ్మం జిల్లాలో వైద్య కళాశాల, గురుకుల పాఠశాల, పలుచోట్ల ఎస్ఐబీ విభాగం కార్యాలయాలు, నివాస క్వార్టర్ల నిర్మాణం, కామారెడ్డిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం ఈ భూములను సర్కార్ కేటాయించింది. టీజీఐఐసీ, స్వామి నారాయణ గురుకుల పాఠశాల, ఎస్ఐబీకి ఇచి్చన భూములను మార్కెట్ విలువ ధర ప్రకారం కేటాయించగా పలు ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములతోపాటు అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు సిరాజ్‌కు ఉచితంగా కేటాయించింది. ఏ సంస్థకు ఎంత భూమి అంటే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో తెలంగాణ పారిశ్రామిక మౌలి క సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ)కు 61.18 ఎకరాలను కేటాయించింది. ఇందుకోసం ఎకరానికి రూ.6.4 లక్షల చొప్పున మొత్తం రూ. 3.93 కోట్లను ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్థలంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కానుంది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురంలో 6.23 ఎకరాలను కూడా ఈ సంస్థకు పారిశ్రామిక పార్కు కోసం ఇచి్చంది. ఈ స్థలం కోసం ఎకరం రూ. 20 లక్షల చొప్పున మార్కెట్ ధరను రాష్ట్ర ప్రభుత్వానికి టీజీఐఐసీ చెల్లించనుంది.మరోవైపు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లితోపాటు రఘునాథపాలెం మండల కేంద్రంలో మొత్తం 35.06 ఎకరాలను ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కేటాయించింది. అలాగే రఘునాథపాలెం మండల కేంద్రంలో 13.10 ఎకరాల భూమిని స్వామి నారాయణ గురుకుల అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటు కోసం కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అక్కడ ఎకరం మార్కెట్ విలువ సుమారు రూ. కోటి ఉన్నప్పటికీ రూ. 11.25 లక్షలకే ఆ సంస్థకు అప్పగించాలన్న ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రతిపాదన మేరకు ఆ భూమిని కేటాయించింది. ఇందుకుగాను ఈ పాఠశాలలోని 10 శాతం సీట్లను జిల్లా కలెక్టర్ విచక్షణ కోసం (ఉచిత విద్య కోసం) రిజర్వు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉచిత కేటాయింపులు ఇలా.. ⇒ నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామంలో సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నిర్మాణం కోసం టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్కు 6 ఎకరాలు. ⇒ కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో ట్రాఫిక్ శిక్షణా కేంద్రం ఏర్పాటు కోసం హోంశాఖకు 3 ఎకరాలు. ⇒అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.78 (షేక్‌పేట మండలం)లోని ప్రశాసన్‌నగర్‌లో 600 గజాల ఖాళీ స్థలం. -
మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
సాక్షి, హైదరాబాద్: ‘ఒక జిల్లాలో పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు 800 వరకు ఉన్నాయి. కానీ, గత నెల రోజుల నుంచి 30 అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేయలేదు. క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ధరణి పోర్టల్ కింద వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. సరిగా పనిచేయని అలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి... లేదంటే నేనే సస్పెండ్ చేస్తా’అని శనివారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల వైఖరిలో మార్పు రావాలని, 10 రోజుల్లో సరైన పద్ధతిలో ధరణి దరఖాస్తులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అదేవిధంగా దరఖాస్తు పరిష్కారానికి, మాన్యువల్ రికార్డుకు లింకు పెట్టవద్దని, వీలున్నంత మేర ఆన్లైన్లోనే దరఖాస్తులు డిస్పోజ్ చేయాలని, మాన్యువల్ రికార్డు లేదంటూ ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్లతో రెండు విడతల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో ఎన్ఆర్ఐ పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, డేటా కరెక్షన్లు, నిషేధిత జాబితాలోని భూములు, కొత్త పాసు పుస్తకాల జారీ, నాలా, ఖాతాల విలీనం తదితర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై మిత్తల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గత 15 రోజుల్లో... ధరణి దరఖాస్తుల పురోగతిపై ఈనెల 14న నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నాటికి గత 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేల దరఖాస్తులు పరిష్కారయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,779 దరఖాస్తులు, నల్లగొండలో 2,120, సిద్ధిపేటలో 1,880, నాగర్‌కర్నూల్‌లో 1,800 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అయితే, అత్యల్పంగా భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 100 దరఖాస్తులు కూడా క్లియర్ కాలేదు. భూపాలపల్లిలో 65, సిరిసిల్లలో 97, కొత్తగూడెం జిల్లాలో 144 దరఖాస్తులు మాత్రమే గత 15 రోజుల వ్యవధిలో పరిష్కారమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1.50 లక్షలు తహశీల్దార్ల వద్దనే.. 15 రోజుల క్రితం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కార పురోగతి ప్రక్రియను పరిశీలిస్తే మొత్తం 2,59,404 దరఖాస్తులకుగాను 24,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2.34 లక్షల దరఖాస్తుల్లో మెజార్టీ దరఖాస్తులు తహశీల్దార్ల వద్దనే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 60 శాతం అంటే 1.48 లక్షల దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, ఆర్డీవోల వద్ద మరో 20 శాతం అంటే 50 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోనే మిత్తల్ కలెక్టర్ల సమావేశంలో తహశీల్దార్లు, ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంమీద అదనపు కలెక్టర్ల వద్ద 20వేల పైచిలుకు, కలెక్టర్ల స్థాయిలో 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉండగా, ఆ తర్వాత నల్లగొండలో 21,693 ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 1,410, భూపాలపల్లిలో 1,826 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. పెండింగ్ దరఖాస్తులు ఏ స్థాయిలో ఎన్ని? తహశీల్దార్ల వద్ద: 1,48,182 ఆర్డీవోల వద్ద: 53,478 అదనపు కలెక్టర్ల వద్ద: 20,461 కలెక్టర్ల వద్ద: 12,505 మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 2,34,626 -
ఎడ్‌సెట్‌లో అబ్బాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీ ఎడ్‌సెట్–2024) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. అయితే, తొలి పది ర్యాంకుల్లో అబ్బాయిలకే ఎనిమిది దక్కాయి. ఎడ్‌సెట్ ఫలితాలను మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నవీన్ మిత్తల్ హైదరాబాద్ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ఎస్కె మçహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎడ్‌సెట్ కన్వినర్ మృణాళిని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెల 23వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు 33,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29,463 మంది పరీక్ష రాశారు. తాజాగా వెల్లడించిన పలితాల్లో 28,549 (96.90%) అర్హత సా«దించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 99.04 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ నుంచి 44 మంది పరీక్ష రాస్తే అందరూ పాసయ్యారు. టీచర్ పోస్టులకు డిమాండ్ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీ చేపడుతున్న కారణంగా ఉపాధ్యాయులకు భవిష్యత్‌లో మంచి డి మాండ్ ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. బీఈడీ కోర్సులకు ఈ మధ్య కాలంలో ఆదరణ తగ్గిందని, ఎక్కువ మంది ఈ కో ర్సులో చేరడం లేదన్నారు. 24,633 మంది అమ్మా యిలు సెట్ రాస్తే.. 23,780 మంది అర్హత పొంది నట్టు, 4,830 మంది అబ్బాయిలు పరీక్ష రాస్తే 4,769 మంది పాసయినట్టు వివరించారు. ఎడ్‌సెట్‌లో నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, 19 రోజుల్లోనే ఫలితాలు అందించామని వీసీ న వీన్‌మిత్తల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 208 బీఈడీ కాలేజీలుంటే, వాటిల్లో 20 వేల సీట్లున్నాయని ఎడ్‌సెట్ కన్వినర్ మృణాళిని వెల్లడించారు. గత ఏడాది 75 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. ఆర్డీఓ కావాలని లక్ష్యం: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ నవీన్ కుమార్ బిజినేపల్లి: ఎడ్‌సెట్ ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన మల్లిశెట్టి నవీన్‌కుమార్ 118.37 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొద టి ర్యాంకు సాధించాడు. వ్యవసాయ నేపథ్యం గల నవీన్ బీటెక్ పూర్తి చేసి కొన్ని నెల లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆర్డీఓ ఉద్యోగం లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, గ్రూప్–1 నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేస్తుండటంతో కనీ సం ఉపాధ్యాయ ఉద్యోగమైనా సాధించాలని ఎడ్‌సెట్ పరీక్ష రాశానని నవీన్ చెప్పాడు. -
అత్యున్నత ఫలితాలే లక్ష్యం కావాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో గుణాత్మక మార్పు తేవాలని విద్యాశాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. టెన్త్, ఇంటర్మిడియెట్ పరీక్షలు స్వేచ్ఛాయుతంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కోరారు. అత్యున్నత స్థాయి ఫలితాలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ తొలిసారిగా మంగళవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మిడియెట్ బోర్డు కార్యదర్శి హోదాలో నవీన్ మిత్తల్, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన హాజరయ్యారు. ఇంటర్, టెన్త్ పరీక్షలకు సంబంధించిన సమగ్ర వివరాలు సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు, రాబోయే ఫలితాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెరుగైన ఫలితాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. గత ఏడాది పేపర్ లీకేజీ ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. కాగా ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని ఇంటర్ అధికారులు సీఎంకు వివరించారు. దీనివల్ల అతి తక్కువ సమయంలో ఫలితాల వెల్లడికి ఆస్కారం ఉందని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ దిశగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన సిఫారసులు, వాటి సాధ్యాసాధ్యాలపై సమగ్ర వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. ప్రైవేటుతో సమానంగా ఫలితాలు రావాలి ప్రైవేటు విద్యా సంస్థలతో సమానంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన ఫలితాలు రావాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నొక్కి చెప్పారు. దీంతో గురుకులాల్లో మెరుగైన ఫలితాలు వస్తున్న తీరును అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చా రు. ఈ క్రమంలోనే గురుకులాల్లో మాదిరిగా ప్రభు త్వ స్కూళ్లల్లోనూ ఫలితాలు పెంచాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన బోధన, పరీక్షలకు సన్నద్ధమయ్యే మెళకువలు మెరుగు పర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. ఇంటర్ తర్వాత జరిగే పోటీ పరీక్షలకు రాష్ట్ర విద్యార్థులను, ముఖ్యంగా ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులను సన్నద్ధం చేయాలని, ప్రత్యేక కోచింగ్ ఇవ్వాలని సూచించారు. మండలానికో కాలేజీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ విద్యార్థులకు కాలేజీలు అందుబాటులో ఉండాలని సీఎం చెప్పారు. ప్రతి మండలానికి ఓ కాలేజీ ఏర్పాటు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో అవసరాన్ని బట్టి అధ్యాపకులను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ తెలిపారు. డిగ్రీ కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుండటంపై ఆయన ఆరా తీశారు. పదోన్నతులు చేపడితే ఖాళీలపై స్పష్టత రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు, పరీక్షలు, ఫలితాల గురించి దేవసేన సీఎంకు వివరించారు. వివిధ సబ్జెక్టు టీచర్ల కొరత, ఖాళీల భర్తీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో జరిగిన కసరత్తు చర్చకు వచ్చినట్టు తెలిసింది. 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి ఎన్నికల ముందు చేపట్టిన ప్రక్రియ ఆగి పోయిందని అధికారులు తెలిపారు. పాఠశాల విద్యాశాఖలో 18 వేలకు పైగా ఖాళీలున్నాయని, పదోన్నతులు చేపడితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టమైన సమాచారం వస్తుందని వివరించారు. టెట్ ఉత్తీర్ణులకే పదోన్నతులు ఇవ్వాలన్న కోర్టు తీర్పు అడ్డంకిగా ఉందని చెప్పగా, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుందామని సీఎం చెప్పినట్లు సమాచారం. -
‘నవీన్ మిత్తల్’ ఎన్ఓసీ జారీపై 3న విచారణ: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ స్థలానికి సంబంధించి నవీన్ మిత్తల్ కమిటీ ఎన్ఓసీ జారీ చేసిన అంశంలో దర్యాప్తును మరో సంస్థకు అప్పగింతపై 3న విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే రంగారెడ్డి జిల్లా గుడిమల్కాపూర్‌లోని 5,262 గజాల స్థలానికి ఎన్ఓసీ జారీ చేయడంపై దర్యాప్తును సిట్‌కు లేదా సీబీఐకి అప్పగించాలన్న మధ్యంతర పిటిషన్‌ను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. శాంతి అగర్వాల్ కొనుగోలు చేసిన దాదాపు 5వేల గజాల స్థలానికి తప్పుడు పత్రాలు సమర్పించిన వారికి నవీన్ మిత్తల్ కమిటీ ఎన్ఓసీ ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ శాంతి 2011లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఎన్ఓసీ రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. నవీన్ మిత్తల్, జాయింట్ కలెక్టర్ వి.వి.దుర్గాదాస్, తహసీల్దార్లు మధుసూధన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పుపై 2017లో ప్రైవేటు వ్యక్తులతోపాటు అధికారులు అప్పీళ్లు వేశారు. ఈ అప్పీళ్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. -
సేత్వార్ సమస్యలకు ‘చెక్’
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం చెక్ పెట్టింది. సేత్వార్ నమోదులో జరిగిన పొరపాట్లను సవరించి ఒక సర్వే నంబర్లోని భూముల హెచ్చుతగ్గులను నమోదు చేసేందుకు అవకాశం కలి్పంచింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చి న కొత్త ఆప్షన్లపై భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు గురువారం సమాచారం పంపారు. వాస్తవానికి, ధరణి పోర్టల్‌లో సర్వే నంబర్లలోని భూములను నమోదు చేసే విషయంలో కొన్నిచోట్ల పొరపాట్లు జరిగాయి. కొన్ని సర్వే నంబర్లలో ఉన్న వాస్తవ భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. దీంతో ఆ భూమి నమోదైన మేరకు మాత్రమే రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వడంతోపాటు క్రయవిక్రయ లావాదేవీలకు ధరణి పోర్టల్ అనుమతినిచ్చి ంది. తద్వారా ఆ భూమిలో ఏళ్లుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్న రైతులకు పాసు పుస్తకాలు రాకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు సేత్వార్ నమోదు, సవరణలకు ధరణి పోర్టల్‌లో అవకాశం ఇవ్వడంతో ఈ సమస్యకు చెక్ పడుతుందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయేతర భూములను ఒకరి కంటే ఎక్కువ మంది అమ్మేందుకు, కొనేందుకు అవకాశముంది. కానీ, ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు ఇప్పటివరకు ఒక్కరి పేరు మీదనే జరిగేవి. దాన్ని మార్చడం ద్వారా ఒకరి కంటే ఎక్కువ మంది భూమి అమ్మేందుకు, భూమి కొనేందుకు అవకాశం కలగనుంది. ఇక, భూసేకరణ సమయంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన లావా దేవీల సగటు విలువను లెక్కించి పరిహారాన్ని రైతుకు చెల్లిస్తారు. దీనికి అవసరమైన మార్కెట్ విలువ సర్టిఫికెట్‌ను ధరణి పోర్టల్ ద్వారా ఇచ్చే ఆప్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భూములను మార్ట్గేజ్ (తనఖా) చేసుకునేందుకు అడుగుతున్న కుల ధ్రువీకరణ పత్రం అవసరం లే కుండా మార్పులు చేశారు. సదరు భూ యజమాని ఎస్టీ అని సంబంధిత తహసీల్దార్ నమోదు చేస్తే సరిపోయేలా మార్పు చేశారు. టీఎం 33 మాడ్యూల్లో.. ధరణి పోర్టల్‌లో రైతులు ఎక్కువగా ఉపయోగించుకునే టీఎం33 మాడ్యూల్‌ను తాజా మార్పుల్లో మరింత సులభతరం చేశారు. ఉదాహరణకు గతంలో టీఎం 33 ద్వారా పేరు మార్పు చేయాలనుకుంటే ఆ పేరుతోపాటు ఇతర వివరాలన్నింటినీ నమోదు చేయాల్సి వచ్చేది. ఆ క్రమంలోనే ఇతర వివరాల నమోదులో పొరపాట్లు దొర్లి కొత్త సమస్యలు వచ్చేవి. అలా కాకుండా ఇప్పుడు టీఎం33 మాడ్యూల్ ద్వారా పేరు, లింగం, ఆధార్, కుల కేటగిరీల్లో ఏది అవసరమైతే దాన్ని మాత్రమే సరిదిద్దుకునేలా, ఇతర వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా మార్పులు చేశారు. పాసుపుస్తకాల దిద్దుబాటు క్రమంలో కలెక్టర్లు వెనక్కు పంపిన దరఖాస్తుల వివరాలకు సంబంధించిన రిపోర్టు అందుబాటులో ఉండేది కాదు. ఇప్పుడు ఎక్సెల్ ఫార్మాట్లో ఆ రిపోర్టు అందుబాటులో ఉండేలా ధరణి పోర్టల్‌లో మార్పులు చేయడం గమనార్హం. అదేవిధంగా గ్రామ పహాణీలు కలెక్టర్‌తోపాటు సీసీఎల్ఏ లాగిన్‌లో కూడా అందుబాటులో ఉండేలా మార్పులు చేశారు. -
వీఆర్ఏల విలీనానికి నో
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)లను క్రమబద్ధీకరించి, జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వీఆర్ఏల నియామకం చట్టవిరుద్ధమని, అది చెల్లదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85లను సస్పెండ్ చేసింది. రెవెన్యూ శాఖలో జూలై 24న జీవో 81 జారీకి ముందున్న పరిస్థితినే కొనసాగించాలని స్పష్టం చేస్తూ.. స్టేటస్కో ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా వీఆర్ఏలు ఇప్పటికే కొత్త విధుల్లో చేరినా వారు తిరిగి వెనక్కి వెళ్లాలని తేల్చిచెప్పింది. ఇక పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు.. ప్రతివాదుల జాబితా నుంచి సీఎం కేసీఆర్, ఎన్నికల సంఘం, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌ను తొలగించింది. వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడంపై వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఆఫీస్ సబార్డినేట్లు.. వయసు ఎక్కువున్న వారికి పింఛన్ వంటి ప్రయోజనాలు లేకుండా చేశారని వీఆర్ఏలు ఇలా వివిధ అంశాలపై హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ మాధవీదేవి గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పీవీ కృష్ణయ్య, శ్రీరాం పొలాలి.. ప్రభుత్వం తరఫున జీపీ రామారావు వాదనలు వినిపించారు. నవీన్ మిట్టల్ తీరు సరిగా లేదు.. సబార్డినేట్లకు అన్యాయం తొలుత పిటిషనర్ల తరఫున పీవీ కృష్ణయ్య, శ్రీరాం పొలాలి వాదిస్తూ.. ‘‘చట్ట ప్రకారం ఉద్యోగాల నియామకానికి ఒక ప్రక్రియ ఉంటుంది. వీఆర్ఏల విషయంలో ఆ ప్రక్రియ చేపట్టలేదు. సర్వీస్ రూల్స్‌లోనూ ఎలాంటి మార్పు చేయలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంలో రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు జీవోలు జారీ చేసింది. సీనియర్లలో 19వ స్థానంలో ఉన్న నవీన్ మిట్టల్‌ను ఉద్దేశపూర్వకంగా సీసీఎల్ఏగా నియమించింది. దీనికి కృతజ్ఞతగా ఆయన చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోకుండానే ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తున్నారు. సీసీఎల్ఏగా మిట్టల్ నియామకం చెల్లదు. రాత్రి జీవోలు ఇచ్చి ఉదయానికల్లా విధుల్లో చేరాలని ఆదేశించడం ఇంత వరకు ఎక్కడా, ఎప్పుడూ జరగలేదు. పైగా అంతా ఇప్పటికే విధుల్లో చేరారని కోర్టుకు చెప్పడం హాస్యాస్పదం. రాజ్యాంగబద్ధమైన కోర్టుల ముందు ఇలాంటి చర్యలను సమర్ధించుకోజాలరు. ఓ వైపు సర్వీస్ నిబంధనలు అవసరం లేదంటూనే.. మరోవైపు అవసరమైతే జారీ చేస్తామనడం శోచనీయం. రాష్ట్రంలో ఆఫీస్ సబార్డినేట్లు ఏళ్లతరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని కాదని వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడం సరికాదు. వీఆర్ఏల సర్దుబాటు పేరిట ఆఫీస్ సబార్డినేట్లకు అన్యాయం చేయడం తగదు. అదేవిధంగా వీఆర్ఏలకు పదవీ విరమణ ఉండదు. దీన్ని అడ్డుపెట్టుకుని వారికి పింఛన్, గ్రాట్యుటీ వంటివి ఇవ్వకుండానే రిటైర్ అయ్యేలా చేయడం అన్యాయం. ఇది వయసు మీద పడిన వీఆర్ఏలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుంది. దీనిపై పిటిషన్లు వేసిన వారిని ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోంది’’ అని కోర్టుకు విన్నవించారు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయం.. రాజకీయ విమర్శలు చేయడమేంటి? పిటిషనర్ల వాదనల అనంతరం ప్రభుత్వం తరఫున జీపీ రామారావు వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్లు ప్రభుత్వంపై, అధికారులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఉద్యోగులు సర్వీస్ నిబంధనల గురించి మాట్లాడకుండా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదు. సీసీఎల్ఏగా ఎవరిని నియమించాలనేది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. సర్వీస్ నిబంధనలకు, ఎన్నికలకు, సీసీఎల్ఏకు ఏమిటి సంబంధం? వీఆర్ఏలను ఒక్క రెవెన్యూ శాఖలోనే సర్దుబాటు చేయడంలేదు. ఇతర శాఖలకూ పంపుతున్నాం. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినంత మాత్రాన ఆఫీస్ సబార్డినేట్లపై ప్రతికూల ప్రభావం ఉండదు. వీఆర్ఏల విలీనం కోసం ప్రభుత్వం సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించింది. అందువల్ల ఎవరికీ నష్టం ఉండదు. కొత్త పోస్టుల కోసం సర్వీసు నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉండదు. వీఆర్ఏలకు పింఛను, గ్రాట్యూటీ వంటివి ఇతర ఉద్యోగులకు వర్తించినట్లే ఉంటాయి. పెద్ద వయసు వారికి తక్కువ సర్వీసు ఉందనే కారణంగా మొత్తం ప్రక్రియ అక్రమమని చెప్పలేం. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం విధానపర నిర్ణయం తీసుకుంది. అందులో జోక్యం కూడదు. వీఆర్ఏలను ఇప్పటికే సర్దుబాటు చేశాం.. మెజారిటీ విధుల్లో చేరారు. ఈ పిటిషన్లు సమర్థనీయం కాదు..కొట్టివేయాలి’’ అని కోర్టుకు వాదనలు వినిపించారు. నచ్చిన వారికి.. నచ్చిన ఉద్యోగాలిస్తారా? ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. వారికి ఆ హోదా కల్పించి వేతనాలు ఇవ్వడం ఎలా సమర్థనీయమని నిలదీసింది. ‘‘వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసినప్పుడు వీఆర్ఏలను ఎందుకు కొనసాగించారు? పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారిని కేటగిరీలుగా ఎలా విభజిస్తారు? ఎలాంటి ఎంపిక ప్రక్రియ లేకుండా ఎలా నియమిస్తారు? జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఉండాల్సిన అర్హతలు ఏమిటి? వారి ఎంపిక ప్రక్రియ ఏంటి? జూనియర్ అసిస్టెంట్ సమాన స్థాయి కలిగిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో)లను జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ఎందుకు తీసుకోలేదు? అంటే మీకు నచ్చిన వారికి.. నచ్చిన ఉద్యోగాలు ఇస్తారా? రెవెన్యూ శాఖలో ఖాళీలు లేవంటూనే 50శాతం మందిని ఎలా సర్దుబాటు చేశారు?’’ అని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వీఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించే అంశంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆదేశాల ప్రతి కోసం ఎదురుచూడకుండా వెంటనే వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వివిధ చోట్ల పోస్టింగ్ పొందిన వీఆర్ఏలు తిరిగి వెనక్కి రానున్నారు. -
వీఆర్ఏల సర్దుబాటు షురూ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకుల సర్దుబాటు ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. పలు ప్రభుత్వశాఖల్లో వారిని విలీనం చేసేందుకు వీలుగా 14,954 సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెవెన్యూతోపాటు మిషన్ భగీరథలో వారిని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ బుధవారం జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా, డివిజన్, మండలస్థాయిలో ఏ పోస్టులో ఎంతమందిని నియమించాలో ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ఇలా... రెవెన్యూశాఖ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో 16, డివిజన్లో 7, మండల స్థాయిలో ఐదుగురిని నియమించాలని, రికార్డు అసిస్టెంట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో ముగ్గురు, డివిజన్లో నలుగురు, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని వెల్లడించారు. ఇక, ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీలో జిల్లాస్థాయిలో 12 మంది, డివిజన్లో నలుగురిని, మండలస్థాయిలో ముగ్గురిని సర్దుబాటు చేయాలని, చైన్మెన్లుగా డివిజన్, మండల స్థాయిలో ఒక్కరు చొప్పున నియమించుకోవాలని సూచించారు. మిషన్ భగీరథలో... మిషన్ భగీరథకు సంబంధించి ప్రతి రూరల్ మండలంలో ఆరుగురుని నియమించుకోవాలని జిల్లా కలెక్టర్లకు పంపిన ఉత్తర్వుల్లో సూచించారు. మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లు, సాగునీటిశాఖలో లస్కర్లుగా ఎంత మంది వీఆర్ఏలను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలన్న దానిపై ఆయా శాఖలు త్వరలోనే స్పష్టత ఇస్తాయి. -
నోటరీ ఆస్తుల క్రమబద్ధీకరణ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నోటరీల ద్వారా క్రయవిక్రయాలు జరిగిన వ్యవసాయేతర ఆస్తుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం.. నోటరైజ్డ్ డాక్యుమెంట్లు ఉన్న ఆస్తుల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు నోటరీ డాక్యుమెంటు, సదరు ఆస్తికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, ఆస్తిపన్ను రశీదు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, లేదంటే ఆ ఆస్తి స్వాదీనంలో ఉన్నట్టు నిరూపించే ఇతర ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ దరఖాస్తుల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఆస్తులు ఉంటే వాటికి జీవోలు 58, 59 (ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణ) ద్వారా పరిష్కారం చూపిస్తారు. లేదంటే నేరుగా పరిష్కరిస్తారు. ఈ విధంగా రిజిస్టర్ చేసేందుకు 125 గజాల లోపు ఉన్న ఆస్తులపై ఎలాంటి స్టాంపు డ్యూటీ వసూలు చేయరు. అంతకు మించితే మాత్రం మార్కెట్ రేటు ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రూ.5 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో వివరించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి గడువును పేర్కొనలేదు. -
ప్రైవేటు మాయకు చెక్ పెట్టండి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులను చేర్చుకుని కూడా ఇంటర్ బోర్డ్‌కు ప్రవేశాలు చూపని ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27లోగా ప్రతి విద్యార్థి అడ్మిషన్ వివరాలను పంపేలా జిల్లా ఇంటర్ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ‘ఇంటర్ లెక్కల్లో కాలేజీల మాయ’ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 2లక్షల మంది టెన్త్ పాసయిన విద్యార్థులు ఎక్కడ చేరారు? వారి వివరాలు తెలియజేయాలని ఆమె అధికారు లను కోరారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులు చేరినా, వాటి డేటా ఇంటర్ బోర్డ్‌కు చేరలేదనే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులతో చర్చించారు. పనులు పూర్తికాకపోతే ఎలా: సబిత రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ కళాశా లల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి సబిత అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, ఇంకా పూర్తి కాకపోవడంతో ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని నవీన్ మిత్తల్‌కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకోసం, ల్యాబ్‌ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ.4.43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారంలోగా పుస్తకాలు అందాలి విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయ డానికి ఆర్టీసీపైనే ఆధారపడకుండా ప్రయివేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టా లని ఆదేశించారు. మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదన్నారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వివిధ జిల్లాల ఇంటర్ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. డేటా పంపకపోతే విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీకి జరిమానా ఈ నెల 27లోగా ప్రైవేటు కాలేజీల్లో చేరిన విద్యార్థుల డేటా పంపాలని, అలా చేయకుండా తర్వాత పంపితే నెలాఖరు వరకూ ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీపై జరిమానా విధించాలని బోర్డ్ అధికారులకు మిత్తల్ సూచించారు. ఆ గడువు కూడా దాటితే విద్యా ర్థికి రూ. వెయ్యి చొప్పున కాలేజీపై జరిమానా విధించా లని తెలిపారు. ఆఖరి నిమిషం వరకూ వేచి చూసి ఆ తర్వాత సెక్షన్లు పెంచుకోవడం, ఒక క్యాంపస్‌లో ప్రవే శాలు, మరో క్యాంపస్‌లో అడ్మిషన్లు చేపట్టే ప్రైవేటు కాలేజీలపై నిఘా పెట్టాలని, ఇలాంటి చర్యలకు పాల్ప డే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నని, అవసరమైతే సదరు కాలేజీ అనుమతి కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని జిల్లా అధికారు లను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆదేశించారు. -
119 మార్కులకు టాప్ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, నాన్– ఇంజనీరింగ్, అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో (పాలిటెక్నిక్) ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ పాలిసెట్–20 23)లో బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణుల య్యారు. బాలురు, బాలికలు కలిపి మొత్తం మీద 82.17 శాతం ఉత్తీర్ణత నమోదైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యాభవన్ ఆడిటోరియంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ ఫలితాలను విడుదల చేశారు. 86.63 శాతం ఉత్తీర్ణతతో బాలికలు సత్తా చాటారు. బాలురు 78.62 శాతం ఉత్తీర్ణత సాధించారు. అర్హులైన వారికి జూన్ 14 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మిత్తల్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మరో నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు కొత్తగా వస్తున్నాయని చెప్పారు. 119తో టాప్ ర్యాంక్ ఈనెల 17న నిర్వహించిన పాలిసెట్‌కు 1,05,742 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,274 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో ఎంపీసీ విభాగంలో 80,358, ఎంబైపీసీ విభాగంలో 80,752 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. సూర్యాపేట జిల్లాకు చెందిన సురభి శరణ్య 120 మార్కులకు 119 మార్కు లు సాధించి ఎంపీసీ విభాగంలో స్టేట్ మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. అదే జిల్లాకు చెందిన షేక్ సిద్ధిక్ సైతం 119 మార్కులు సాధించి రెండో ర్యాంక్‌ను కైవసం చేసుకోగా, మెదక్ జిల్లాకు చెందిన జి.ప్రియాంశ్కుమార్, హైదరాబాద్‌కు చెందిన పి.ప్రణీత్, సూర్యాపేటకు చెందిన కె.శశివర్ధన్లు 118 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఎంబైపీసీ విభాగంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన చీర్ల ఆకాశ్ 116 మార్కులు సాధించి మొదటి ర్యాంక్‌ను సొంతం చేసుకోగా, సూర్యాపేట జిల్లా విద్యార్థి మిర్యాల అక్షయతార 116 మార్కులతో రెండు, సూర్యాపేట జిల్లాకే చెందిన కె.శశివర్ధన్ 116 మార్కులతో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. శశివర్ధన్ ఎంపీసీ, ఎంబైపీసీ రెండింటిలోనూ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ, హార్టీకల్చర్ వర్సిటీల్లోని కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. రైతుబిడ్డ.. ఎంబైపీసీలో ఫస్ట్‌ర్యాంకర్ కాటారం: రైతుబిడ్డ పాలిసెట్‌లో మెరిశాడు. ఎంబైపీసీలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గంగారానికి చెందిన చీర్ల ఆకాశ్ 120కి 116 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్‌ర్యాంక్ సాధించాడు. ఆకాశ్ తండ్రి చీర్ల రమేశ్ రైతు కాగా, తల్లి రజిత గృహిణి. ఆకాశ్ 4వ తరగతి వరకు కాటారంలోని ప్రైవేటు పాఠశాలలో చదివాడు. 10వ తరగతి వరకు హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివి 10 జీపీఏ సాధించాడు. ‘మా నాన్న కష్టం చూసేవాడిని. ప్రణాళికాబద్ధంగా చదివాను. అనుకున్న ర్యాంకు సాధించాను. ఏ కోర్సు తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు’ అని ఆకాశ్ తెలిపాడు. తొలి విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం, స్లాట్ బుకింగ్: జూన్ 14 నుంచి 18 వరకు ♦ సరి్టఫికెట్ల వెరిఫికేషన్: జూన్ 16 నుంచి 19 వరకు ♦ వెబ్ ఆప్షన్లు: జూన్ 16 నుంచి 21 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూన్ 21 ♦ సీట్ల కేటాయింపు జూన్ 25 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 25 నుంచి 29 వరకు తుది విడత కౌన్సెలింగ్.. ♦ ఆన్లైన్లో దరఖాస్తు చేయడం, ఫీజు చెల్లించడం స్లాట్‌బుకింగ్: జూలై 1 ♦ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 2 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 1 నుంచి 3 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 3 ♦ సీట్ల కేటాయింపు జూలై 7 ♦ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 7 నుంచి 10 వరకు. స్పాట్ అడ్మిషన్లు.. ♦ స్పాట్ అడ్మిషన్ల ప్రకటన: జూలై 7 ♦ ఫీజు చెల్లింపు జూలై 8, 9 ♦ ర్యాంక్ జనరేషన్ జూలై 10 ♦ వెబ్ ఆప్షన్లు జూలై 8 నుంచి 11 వరకు ♦ ఆప్షన్ల ఫ్రీజింగ్ జూలై 11 ♦ సీట్ల కేటాయింపు జూలై 14 ♦ ఫీజు చెల్లించడం, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 14 నుంచి 15 వరకు ♦ కాలేజీల్లో రిపోర్ట్ చేయడం జూలై 15, స్పాట్ అడ్మిషన్లు పూర్తి జూలై 17 -
రిజిస్ట్రార్ గదికి తాళం.. తెయూలో వివాదం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ పదవి విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. సోమవారం రిజిస్ట్రార్ యాదగిరి గదికి తాళం వేసి ఉంచడంతో గందరగోళం నెలకొంది. దీనిపై రిజిస్ట్రార్ యాదగిరి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ కమిషనర్ నవీన్‌మిట్టల్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో ఉదయం అన్ని విభాగాలు, చాంబర్లకు సెక్యూరిటీ సిబ్బంది తాళాలు తెరిచారు. రిజిస్ట్రార్ చాంబర్ మాత్రం తెరవద్దని వైస్ చాన్స్‌లర్ పీఏ సవిత చెప్పడంతో తెరవకుండానే ఉంచారు. అక్కడకు వచ్చి న రిజిస్ట్రార్ విషయాన్ని పాలకమండలి సభ్యులకు చెప్పడంతో వారు వీసీకి ఫోన్ చేశారు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు తాళం తీయడంతో సిబ్బంది వెళ్లి కూర్చున్నారు. రిజిస్ట్రార్ మాత్రం చాంబర్‌కు రాలేదు. ప్రభుత్వం చెబితేనే రిస్ట్రాస్టార్‌గా వచ్చా.. ప్రభుత్వం, పాలకమండలి చెబితేనే రిస్ట్రాస్టార్‌గా వచ్చానని, సమస్య పరిష్కారం చేస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని యాదగిరి ‘సాక్షి’కి తెలిపారు. తనను లొంగదీసుకునే ఉద్దేశంతోనే వీసీ ఇలా చేశారని ఆరోపించారు. కాగా తాళం వేసిన విషయమై వీసీ రవీందర్‌గుప్తాను ‘సాక్షి’ప్రశ్నించగా, తాను తాళం వేయించలేదని, అలా చేస్తే తాళానికి సీల్ వేసి, లెటర్ విడుదల చేసేవాడినన్నారు. వీసీ గా ఉన్న తన అనుమతి లేకుండానే ఈసీ సభ్యులు యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించ డం చెల్లదన్నారు. తాను రిజిస్ట్రార్‌గా పెట్టిన విద్యావర్థినిని బయటకు పంపి యాదగిరిని ఎలా నియమిస్తారన్నారు. తెయూలోనూ ఇతర ప్రొఫె సర్లు ఉన్నప్పటికీ తనకు నచ్చని యాదగిరిని నియమించారని, తాను ఆర్డర్ ఇవ్వకుండా యాదగిరి ఎలా బాధ్యతలు తీసుకుంటారని వీసీ అన్నారు. తెయూ వీసీని సస్పెండ్ చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు తెయూ వీసీపై వచ్చి న ఆరోపణలపై విచారణ కమిషన్ లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నేత దినేశ్ కులాచారితో పాటు పలువురు వర్సిటీ విద్యార్థులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వీసీ 2021మేలో పదవి చేపట్టాక పరిపాలన, ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు సోమ వారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం సమర్పించారు. -
డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి డిగ్రీలో కొత్తగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ ప్రకటించారు. ఇది ఇంజనీరింగ్‌లో సీఎస్సీ కోర్సుకు సమానమని తెలిపారు. గురువారం ‘దోస్త్’(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరుతో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి 11 ప్రభుత్వ డిగ్రీ, అటానమస్ కాలేజీలు ఈ కోర్సును ప్రవేశపెట్టేందుకు ముందుకొచ్చాయని, ఒక్కో కాలేజీలో 60 సీట్లతో అనుమతులిచ్చామని తెలిపారు. ఇదే తరహాలో ప్రైవేట్ కాలేజీలు ముందుకొస్తే వాటికీ అనుమతిస్తామన్నారు. కోర్సు ప్రత్యేకతలివీ... ► ప్రస్తుతానికి డిగ్రీలో బీఎస్సీ ఎంపీసీఎస్ (గణితం, ఫిజిక్స్, కంప్యూటర్) కోర్సును నిర్వహిస్తున్నారు. అంటే కంప్యూటర్ సిలబస్‌ను కేవలం ఒక సబ్జెక్టుగా చదువుతుండగా, ఇకపై ఏకంగా పూర్తిస్థాయి కంప్యూటర్ సైన్స్ కోర్సు అందుబాటులోకి వస్తుంది. ► ఈ కోర్సు సిలబస్, కరిక్యులం అంతా బీటెక్ సీఎస్ఈ కోర్సుతో సమానంగా ఉంటుంది. బీటెక్‌లో సీట్లు దక్కించుకోలేని వారు, ఎంసెట్‌కు హాజరుకాని వారు దోస్త్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. ► విద్యార్థి కావాలనుకుంటే మూడేళ్లలోనే ఈ కోర్సు నుంచి వైదొలగవచ్చు. అప్పుడు ఆ విద్యార్థికి మూడేళ్ల డిగ్రీ పట్టా ఇస్తారు. ► నాలుగేళ్ల డిగ్రీ పూర్తిచేసే విద్యార్థులకు ఆనర్స్ డిగ్రీ పట్టాను జారీచేస్తారు. అమెరికా, యూకే అంతటా నాలుగేళ్ల యూజీ కోర్సులు ఉండగా, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుంది. ► ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్‌ను బోధిస్తున్న అధ్యాపకులే బీఎస్సీ కంప్యూటర్‌సైన్స్ కోర్సుకు బోధిస్తారు. వారికి త్వరలోనే శిక్షణ ఇస్తారు. సెక్టార్ స్కిల్ కోర్సులు సైతం ఈ సంవత్సరం బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుతోపాటు కొత్తగా సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కోర్సులను సైతం ప్రవేశపెట్టనున్నారు. బీబీఏ రిటైలింగ్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీబీఏ–ఈకామర్స్ ఆపరేషన్స్, బీఏ కంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్, బీబీఏ లాజిస్టిక్స్ వంటి పూర్తిస్థాయి మూడేళ్ల డిగ్రీ కోర్సులను సైతం ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రవేశపెట్టనున్నారు. ఈ కోర్సులను సైతం ‘దోస్త్’ద్వారానే భర్తీచేస్తారు. -
డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్)–2023 నోటిఫికేషన్‌ను కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిత్తల్‌తో కలసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం విడుదల చేశారు. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం ఈ నెల 16 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. దీనికోసం ఈసారి కొత్తగా ఈౖ ఖీ అనే యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకుని దోస్త్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొబైల్ ద్వారా కూడా దోస్త్ రిజిస్ట్రేషన్ ► ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈౖ ఖీ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ చేసేప్పుడు విద్యార్థి ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ► మీ సేవ కేంద్రాల ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే అక్కడ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ► టీయాప్ ఫోలియో ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి.. విద్యార్థి ఇంటర్ హాల్‌టికెట్, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసుకోవాలి. టీఎస్‌బీఐఈలో లభించే విద్యార్థి ఫొటో, ప్రత్యక్షంగా దిగే ఫొటో సరిపోతే.. దోస్త్ ఐడీ సమాచారం వస్తుంది. ► రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు రూ.200 రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దోస్త్ ఐడీ, పిన్ నంబర్‌ను భద్రపర్చుకోవాలి. ► రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు మీసేవ నుంచి పొందిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2022 తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 86 వేల సీట్లు తగ్గాయ్.. ఈ ఏడాది డిగ్రీలో దాదాపు 86 వేల సీట్లు తగ్గించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. డిమాండ్ లేని కోర్సుల బదులు కొత్త కోర్సులు పెడతామంటే అనుమతులు ఇస్తామన్నారు. గత ఏడాది 4,73,214 డిగ్రీ సీట్లు ఉంటే, ఈ ఏడాది 3,86,544 అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. డిమాండ్ లేని సీట్లను గత ఏడాది కూడా తగ్గించినట్లు పేర్కొన్నారు. -
ఇంకా ఆలస్యమే..!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ కష్టాలు తీరడం లేదు. ఈ పోర్టల్ ద్వారా ఎదురవుతున్న సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)గా సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్‌మిత్తల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్య సమస్యల పరిష్కారానికి ఉపక్రమించినప్పటికీ, ఈ క్రమంలో వస్తున్న తీవ్ర సాంకేతిక సమస్యలు అడుగు ముందుకు పడనీయడం లేదని సమాచారం. ఈ కారణంగానే విస్తీర్ణం, పేరు మార్పు లాంటి సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఎదుర్కొంటున్న 10 సమస్యలకు సంబంధించిన మార్పులు జరిగినప్పటికీ, సాంకేతిక అవరోధాల కారణంగా బుధవారం నాటికి స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ (ఎస్పీఏ) ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చిందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలుస్తోంది. విదేశాల్లో ఉంటున్న పట్టాదారులు తమ భూమి విక్రయానికి గాను ఇక్కడకు రావాల్సిన అవసరం లేకుండా, తాము ఉంటున్న దేశం నుంచే అదీకృత డాక్యుమెంట్ పంపి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా ఉన్న ఈ ఆప్షన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన సమస్యలు కూడా దాదాపు పూర్తయినట్టేనని, ఒకట్రెండు రోజుల్లో అన్నీ అందుబాటులోకి వస్తా యని సీసీఎల్ఏ వర్గాలు చెపుతున్నాయి. వేలసంఖ్యలో పెండింగ్‌లో టీఎం 33 దరఖాస్తులు ధరణి పోర్టల్‌లోకి రైతుల వివరాల నమోదు సమయంలో వచ్చి న చిక్కులను తొలగించేందుకు గాను టీఎం (టెక్నికల్ మాడ్యూల్) 33 కింద దరఖాస్తులు తీసుకుంటున్నారు. పట్టాదారు పేరు, భూమి విస్తీర్ణం, స్వభా వం, మిస్సింగ్ సర్వే నంబర్ల లాంటి సమస్యల సవరణ కోసం ఈ మాడ్యూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. పట్టాదారు బయోమెట్రిక్‌తో మీసేవా కేంద్రం ద్వారా తగిన ఆధారాలు పొందుపరిచి ఈ మాడ్యూ ల్ కింద రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే తీవ్ర జాప్యం జరుగుతుండడం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మాడ్యూల్ కింద దరఖాస్తు చేసుకున్న వారి సమస్యల పరిష్కారంలో రాజకీయ జోక్యం కూడా ఎక్కువగా ఉంటోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే స్థానిక అధికారులు (తహసీల్దార్లు) నిష్పక్షపాతంగా నివేదికలు పంపడం లేదని, ఈ నివేదికల ఆధారంగా కలెక్టర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ కలెక్టర్లు ఆమోదించినా సీసీఎల్ఏ కార్యాలయంలో క్లియర్ చేయాల్సి ఉండడం కూడా జాప్యానికి కారణమవుతోంది. ఈ దరఖాస్తుల పరిష్కారానికి సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా, ఇంకా వేల సంఖ్యలో దరఖాస్తులు సీసీఎల్ఏ కార్యాలయ స్థాయి లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. తహసీల్దార్లు, జిల్లాల కలెక్టర్లు నివేదికలు పంపేందుకే నెలలు గడుస్తోందని, ఆ తర్వాత సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లిందీ లేనిదీ తెలియడం లేదని, ఒకవేళ సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్లినా తదుపరి సమా చారం కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. టీఎం–33 దరఖాస్తులను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని, తమ దరఖాస్తు ఏ దశలో ఉందో తెలుసుకునే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. -
తిరస్కరణకు కారణం చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆమోదించినా, తిరస్కరించినా అందుకు తగిన కారణాలను కలెక్టర్లు విధిగా తెలియజేసేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసేందుకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ కసరత్తు చేస్తున్నారు. రైతుల భూములపై తీసుకొనే నిర్ణయాలకు గల కారణాలు పబ్లిక్ డొమైన్లో కనిపించేలా మార్పులు చేస్తున్నారు. అదే జరిగితే దరఖాస్తు తిరస్కరణకు గల కారణం రైతుకు తెలుస్తుందని, మరోసారి అలా తిరస్కారానికి గురికాకుండా అవసరమైన పత్రాలు సమకూర్చుకొనేందుకు, రికార్డులను రెవెన్యూ యంత్రాంగానికి సమర్పించి మళ్లీ దరఖాస్తు చేసుకోవడం ద్వారా సమస్యకు పరిష్కారం పొందేందుకు రైతుకు వీలు కలుగుతుందని, ఈ కోణంలోనే సీసీఎల్ఏ స్థాయిలో కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటివరకు కారణమేంటో తెలియక.. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా నమోదవుతున్న అర్జీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దరఖాస్తు ఎక్కడకు వెళ్లింది... ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏ స్థాయిలో నిర్ణయం తీసుకుంటున్నారు? ఏం నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? వంటి వివరాలేవీ రైతులకు తెలియట్లేదు. దరఖాస్తును ఆమోదించారో లేదో కూడా తెలియని దుస్థితి. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి వేచి చూశాక సదరు రైతు ఫోన్‌కు దరఖాస్తును కలెక్టర్ తిరస్కరించారనో లేదా ఆమోదించారనో మాత్రమే సందేశం వస్తోంది. ఆ సందేశం వచ్చే వరకు తమ దరఖాస్తు ఏమైందంటూ తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టరేట్ల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉంటోంది. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే అందుకుగల కారణమేంటో కూడా తెలియట్లేదు. కారణం కోసం ఏ స్థాయిలోని కార్యాలయానికి వెళ్లినా తమకు తెలియదంటే తమకు తెలియదంటూ దాటవేయడం పరిపాటిగా మారిపోయింది. దీంతో రైతులు తమ వినతులను ఉపసంహరించుకోవడమో లేక దళారులను ఆశ్రయించడమో జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు తమ దరఖాస్తులపై స్పష్టతనిచ్చే దిశగా సీసీఎల్ఏ కసరత్తు జరుగుతోంది. త్వరలో మరో 10 మాడ్యూల్స్ ధరణి పోర్టల్ ద్వారా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం 10వరకు కొత్త మాడ్యూల్స్ కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ధరణి పోర్టల్ అందుబాటులోకి రాకముందే ‘నాలా’ కేటగిరీలోకి మారినా వ్యవసాయ కేటగిరీలోనే నమోదైన భూములు, వారసత్వ హక్కులు కల్పించాల్సిన భూములు, సంస్థల పేరిట పట్టా హక్కులు కల్పించాల్సిన భూముల విషయంలో కొత్త మాడ్యూల్స్ అందుబాటులోకి వస్తున్నాయని సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మరికొన్ని సమస్యలకు కూడా త్వరలోనే ఫుల్స్టాప్ పడనుందని అంటున్నాయి. -
Inter Exams 2023: నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించా లని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. గత కొన్ని నెలలుగా ఇంటర్ బోర్డ్‌లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి పరీక్షలపై అప్రమత్తత అవసరమని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించినట్టు తెలిసింది. దీంతో పరీక్షల నిర్వహణపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు అవసరమైన సూచనలు చేశారు. ఇంటర్ బోర్డ్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థ నడుస్తోందని కొన్ని నెలల క్రితం ఇంటర్ బోర్డ్ కార్యదర్శి మిత్తల్ సందేహం వెలిబుచ్చారు. డేటా ట్యాంపరింగ్ జరిగిందని పోలీసులకు బోర్డ్ గతంలో ఫిర్యాదు చేసింది. ప్రైవేటు ఇంటర్ కాలేజీలతో బోర్డ్‌లోని కొంతమంది అధికారులే కలిసి పనిచేస్తున్నారనే అనుమానాలతో కొంతమందిని కీలకమైన స్థానాల నుంచి తప్పించారు. ఈ ఏడాది నుంచి ఆన్లైన్ మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించడం, దీన్ని కొంతమంది ఆక్షేపిస్తూ వివాదాస్పదం చేసే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ పరీక్షల నిర్వహణలో అప్రమత్తతను సూచిస్తున్నాయి. పేపర్ల పంపిణీ దగ్గర్నుంచి... డేటా చోరీ వ్యవహారం తెరమీదకొచ్చిన తర్వాత ఇంటర్ బోర్డ్‌లో ప్రతీ వ్యవహారంలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు. కీలకమైన అంశాలపై చర్చించేందుకు ముఖ్యులను మాత్రమే అనుమతిస్తున్నారు. బోర్డ్‌లోని కొందరి సెల్‌ఫోన్లపైనా నిఘా పెట్టినట్టు తెలిసింది. ప్రస్తుత పరీక్షల నిర్వాహకులే లక్ష్యంగా బోర్డ్ లోని వ్యక్తులు, ప్రైవేటు కాలేజీలు, మరికొంత మంది కలిసి పరీక్షల్లో అవాంతరాలు సృష్టించే వీలుందనే అనుమానాలు ఉన్నత వర్గాల్లోనూ ఉన్నాయి. దీంతో పరీక్ష పేపర్లు పంపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అన్ని పరీక్ష కేంద్రాల్లో విధిగా సీసీ కెమెరాల ముందే ప్రశ్నపత్రాలు ఓపెన్ చేయాలని ఆదేశాలిచ్చారు. అదే విధంగా జవాబు పత్రాలు సురక్షితంగా చేరే వరకూ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. పరీక్ష లపై అసత్య ప్రచారం చేసేందుకు కొంతమంది సామాజిక మాధ్యమాలను వాడుకునే అవకాశముందని, ఈ అంశాలపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. -
సమస్యలుంటే కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీ డియెట్ పరీక్షల నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది తలెత్తినా 040– 24601010, 040– 24655027 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షల ఏర్పాట్లపై మిత్తల్ మంగళవారం మీడియా సమావేశంలో వివరించారు. ఇంటర్ బోర్డ్ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పనిచేస్తాయని తెలిపారు. ఇవే కాకుండా ప్రతీ జిల్లాలోనూ ప్రత్యేక నంబర్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. కాలేజీలతో ప్రమేయం లేకుండా విద్యార్థులే ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నా రు. మంగళవారం మధ్యాహ్నం వరకూ 50 వేల మంది విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఉదయం 9 దాటితే పరీక్ష హాలులోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు ఎక్కడా నేలపై కూర్చొని పరీక్ష రాసే విధానం ఉండకూడదని అధికారుల ను ఆదేశించారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 9,47,699 మంది పరీక్షలు రాస్తున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్, 4,65,022 మంది సెకెండీయర్ ఉన్నట్టు చెప్పారు. 75 ఫ్లైయింగ్ స్వా్కడ్స్ పనిచేస్తాయన్నారు. డిజిటల్ మూల్యాంకనం ఈ ఏడాది 35 లక్షల ప్రశ్నాపత్రాలకు ఆన్లైన్లో మూల్యాంకన చేపట్టాలని నిర్ణయించామని మిత్తల్ తెలిపారు. ఇందుకు సంబంధించి రెండోసారి పిలిచిన టెండర్లకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయని, వాటి అర్హతలను పరిశీలిస్తున్నామని తెలిపారు. టెన్త్ పరీక్షలు పూర్తయ్యేనాటికే ఇంటర్ కాలేజీల అఫ్లియేషన్ ప్రక్రియ ముగించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. అఫ్లియేషన్ లేకపోతే పరీక్షకు బోర్డ్ అనుమతించదనే విషయమై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఈసారి ముందే అంగీకారం తీసుకునే వీలుందన్నారు. ఇంటర్ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
మార్చి 15 నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. పరీక్షల ఏర్పాట్లపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. పరీక్షల కోసం తీసుకున్న జాగ్రత్తలు, విద్యార్థులకు ఇచ్చే సూచనలను పరీక్షల విభాగం డైరెక్టర్ జయప్రదాభాయ్ మీడియాకు వివరించారు. పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి సబిత ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తక్షణమే స్పందిస్తాం: నవీన్ మిత్తల్ ’’ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటాం. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోంది. ఎలాంటి మానసిక ఒత్తిడి అన్పించినా విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకోవాలి.. మనోధైర్యం ప్రతీ విద్యార్థికి అవసరం’’అని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అన్నారు. గంట ముందే పరీక్ష హాలుకు... ♦ విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్షహాలులోకి అనుమతిస్తారు. 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. విద్యార్థులు హాల్ టికెట్లపై పేరు, మీడియం ఇతర వివరాలను ముందే సరిచూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ చేత సరిచేయించుకోవాలి. హాల్‌టికెట్లను ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు. ♦ ఏ విధమైన ప్రింటింగ్, చేతిరాత మెటీరియల్, సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్ష హాలులోకి అనుమతించరు. ♦ జిల్లా పరీక్షల కమిటీ(డీఈసీ)ని ప్రతీ జిల్లాలో నియమించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, నోడల్ అధికారి, ఇద్దరు ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్ ఇందులో ఉంటారు. వీరితోపాటు జిల్లాస్థాయి హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. ♦ రెవెన్యూ, విద్య, పోలీసు శాఖల నుంచి ఒకరు చొప్పున 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల్లో 200 సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. ♦ జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీలో అన్ని శాఖల అధికారులుంటారు. వారు ఆర్టీసీ, హెల్త్, విద్యుత్ సేవలు అందిస్తారు. అన్ని ప్రాంతాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పరీక్షకేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తారు. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. -
విరాసత్ నుంచి నాలా వరకు..
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించి తలెత్తుతున్న చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ కసరత్తు ప్రారంభించారు. సమస్యలను గుర్తించి వాటిని సరిచేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తయారు చేయిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు వారంలోపే పూర్తవుతాయని.. ఆ తర్వాత ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో వస్తున్న ఇబ్బందుల్లో పదికిపైగా చిన్నచిన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. చిన్నవే కానీ.. సతాయిస్తున్నాయి వాస్తవానికి వ్యవసాయ భూముల లావాదేవీలు మాన్యువల్‌గా జరిగే సమయంలో ఎక్కడికక్కడ సమస్యలు వచ్చినా పెద్దగా వెలుగులోకి వచ్చేవి కావు. వాటి పరిష్కారానికి ఎక్కువ సమయం పట్టినప్పటికీ క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరించేవారు. కానీ ధరణి పోర్టల్ ఆన్లైన్ వేదిక కావడంతో ఏ చిన్న సమస్య అయినా రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకరీతిలో ఇబ్బందులు పెడుతోంది. దీనికితోడు భూసమస్యల పరిష్కార అధికారం కలెక్టర్ల చేతిలో ఉండటంతో మరింత జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ధరణి సమస్యలపై సీసీఎల్ఏ నవీన్‌మిత్తల్ ప్రత్యేక దృష్టి సారించారు. రెవెన్యూ రికార్డులను ధరణి పోర్టల్‌లో అప్లోడ్ చేయడంలోనే అసలు సమస్య వచ్చిందనే నిర్ధారణకు వచ్చి ఆయా సమస్యల నివృత్తి, పరిష్కారానికి రోజూ కొంత సమయం కేటాయిస్తున్నారు. తన వరకు వస్తున్న దరఖాస్తులు, విజ్ఞప్తులను అధ్యయనం చేయడంతోపాటు సీసీఎల్ఏ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. శాశ్వత పరిష్కారం దిశగా.. ధరణి పోర్టల్ ద్వారా రైతులకు చిన్న సమస్యలు కూడా అగ్నిపరీక్షలుగా మారిపోయాయి. ముఖ్యంగా పట్టాదారు చనిపోయే సమయం నాటికి ఆ వ్యక్తి పేరిట ఉన్న భూమికి సంబంధించిన రికార్డులపై తహసీల్దార్ డిజిటల్ సంతకం లేకపోతే ఆ భూమిని చనిపోయిన పట్టాదారు వారసులకు బదిలీచేసే అవకాశం ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్‌లో అందుబాటులో లేదు. అలాగే గతంలో నాలా (వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు) భూములు ఇప్పటికీ ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూముల విభాగంలోనే కనిపిస్తున్నాయి. ఈ భూములను నాలా కింద మార్పు చేసే ఆప్షన్ కూడా ధరణిలో లేదు. గతంలో కంపెనీలు, ట్రస్టుల పేర్లపై ఉన్న భూముల వివరాలు ధరణిలో సక్రమంగా అప్లోడ్ కాకపోవడంతో వాటి పాసుపుస్తకాలు ఆయా కంపెనీలు, ట్రస్టుల పేరిట రావట్లేదు. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం చూపగా ఇందుకు సంబంధించిన మార్పులు వారం రోజులు లోపే ధరణిలో కనిపించనున్నాయి. మరోవైపు మరికొన్ని సమస్యలను గుర్తించి వాటికి అవసరమైన మార్పులు చేసే ప్రక్రియను ప్రారంభించారు. మిస్సింగ్‌కు మిత్తల్ ‘మార్కు’ ధరణిలో ఎదురవుతున్న మరో సమస్య మిస్సింగ్ సర్వేనంబర్లు. రెవెన్యూ ఆన్లైన్ రికార్డుల్లో కొన్ని సర్వేనంబర్లు మిస్సవడంతో ఈ సర్వే నంబర్లలోని భూముల రైతులు పాసు పుస్తకాలు లేక, ప్రభుత్వం నుంచి వచ్చే రైతుబంధు అందక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ధరణిలో మిస్సింగ్ సర్వేనంబర్ల నమోదు కోసం సీసీఎల్ఏ ప్రత్యేక ఆప్షన్ కల్పించారు. టీఎం–33 కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు సంబంధించిన సర్వేనంబర్లను పోర్టల్‌లో సరిచేస్తున్నారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా వేలల్లో ఉన్న నేపథ్యంలో రోజుకు 500 చొప్పున దరఖాస్తులను పరిష్కరించేందుకు సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. -
Telangana: వేధిస్తే ఉక్కుపాదమే!
ఇక యాజమాన్యాలదే బాధ్యత విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? వ్యాపార ధోరణే ధ్యేయంగా పనిచేసే సంస్థలు విద్యార్థులను పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఏ ఒక్క విద్యార్థి ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయినా ఊరుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – నవీన్ మిత్తల్, కాలేజీ విద్య కమిషనర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యార్థులను వేధింపులకు గురిచేసే ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం హెచ్చరించింది. విద్యార్థుల పట్ల అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తించడం, శారీరకంగా హింసించడం వంటివి చేసే లెక్చరర్‌ను రాష్ట్రంలోని ఏ కాలేజీలోనూ బోధించకుండా అనర్హుడిగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్య ఘటనల నేపథ్యంలో.. సోమ వారం ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు. కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్య సంఘం అధ్యక్షుడు గౌరీ సతీశ్‌తోపాటు 14 కాలేజీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోవడానికి కారణాలు, ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో నిబంధనల ఉల్లంఘనలు, విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి తదితర అంశాలపై చర్చించారు. వీటిని అదుపు చేయడానికి అనుసరిస్తున్న చర్యలపై కాలేజీల యాజమాన్యాలను అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మళ్లీ ఆత్మహత్య ఘటనలు జరగొద్దు.. సమీక్ష సందర్భంగా ప్రైవేటు కాలేజీల తీరుపై నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని, ఆదేశాలను కాలేజీల ప్రతినిధులకు వివరించారు. ‘‘విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సాత్విక్ ఘటనే ఆఖరిది కావాలి. ఇది పునరావృతమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయి. చదువు కోసం వచ్చే పిల్లలు తనువు చాలిస్తుంటే తప్పెవరిది? దీనికి యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని మీరే పరిష్కరించుకుంటారా? లేకపోతే 33 జిల్లాల అధికారులను రంగంలోకి దించాలంటారా? అధికారులు రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుంది’’ అని నవీన్ మిత్తల్ హెచ్చరించారు. ఏ ఒక్క విద్యార్థి ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయినా ఊరుకోవద్దని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. ఈ సందర్భంగా కాలేజీల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ చేస్తున్నామంటూ యాజమాన్య ప్రతినిధులు చెప్పడాన్ని మిత్తల్ తోసిపుచ్చారని.. వ్యాపార ధోరణే ధ్యేయంగా పనిచేసే సంస్థలు విద్యార్థులను పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అని నిలదీశారని తెలిసింది. గీత దాటితే వేటే.. ప్రైవేటు కాలేజీలకు నిబంధనల ఉల్లంఘన అలవాటుగా మారిందని.. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారి బోధన వేరేచోట ఉండటం ఏమిటని నవీన్ మిత్తల్ ప్రశ్నించారు. ఇక మీద ఇలా చేస్తే ట్రెస్పాస్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ హాజరు అమలు చేయాల్సిందేనని, కాలేజీల్లో బోధించే అధ్యాపకుల నాణ్యత ఏమిటో దీనితో తెలుస్తుందని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు పనీపాటా లేకుండా సమావేశాలు పెడుతుందనే భ్రమల నుంచి కార్పొరేట్ కాలేజీలు బయటపడాలని.. ఇక మీద ఎప్పుడు మీటింగ్‌కు పిలిచినా కాలేజీల ప్రిన్సిపాళ్లు మాత్రమే సమావేశానికి రావాలని తేల్చిచెప్పారు. విద్యార్థులను ఆకట్టుకునేందుకు ప్రైవేటు కాలేజీలు ఇస్తున్న ప్రకటనలపైనా ఇక నుంచి పరిశీలన ఉంటుందని తెలిపారు. ర్యాంకు వచ్చిన విద్యార్థిని మూడు చోట్ల చూపించి గొప్పలు చెప్పుకునే విధానాలకు స్వస్తి పలికేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. చైతన్య గుర్తింపు రద్దు: నవీన్ మిత్తల్ కాలేజీల ప్రతినిధులతో సమావేశం అనంతరం నవీన్ మిత్తల్ ‘సాక్షి’తో మాట్లాడారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన శ్రీచైతన్య నార్సింగి బ్రాంచి అనుబంధ గుర్తింపు రద్దు చేస్తున్నామని.. దీనిపై మంగళవారం ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు. విద్యార్థులను దూషించే, హింసించే లెక్చరర్లపై కాలేజీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని.. తమ దృష్టికి వస్తే సదరు లెక్చరర్లను డీబార్ చేస్తామని చెప్పారు. స్టడీ అవర్స్ పేరిట వేధించే విధానాలకు స్వస్తి చెప్పాలన్నారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని వెల్లడించారు. మనోవేదనతో ఉన్న విద్యార్థులను ముందే గుర్తించి సరైన కౌన్సెలింగ్ ఇవ్వాలని కాలేజీలకు సూచించామన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగా, క్రీడలను ప్రోత్సహించేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రైవేటు కాలేజీల ఆగడాలను ఇక మీదట ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు. గ్రేడింగ్ విధానంపై కూడా ఆలోచిస్తున్నామని చెప్పారు. అరెస్ట్ చేయకుండా చర్చలా?: పీడీఎస్‌యూ కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కాలేజీల యాజమాన్యాలను అరెస్ట్ చేయకుండా, చర్చలు ఎలా జరుపుతారని పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు. సోమవారం కాలేజీల యాజమాన్యాలతో భేటీ జరిగిన ఎంసీఆర్హెచ్ఆర్డీ వద్ద నిరసనకు దిగారు. అక్రమాలకు పాల్పడుతున్న కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. -
నేడు ప్రైవేటు ఇంటర్ కాలేజీ యాజమాన్యాలతో సబిత భేటీ
సాక్షి, హైదరాబాద్/మణికొండ/ షాద్‌నగర్ రూరల్: ప్రైవేటు ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు, అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం భేటీ అవుతా రు. ఇంటర్, పోటీ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆమె సమీక్షించనున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల మానసిక స్థితిగతులు, యాజమాన్యాల నుంచి విద్యార్థులకు మార్కుల కోసం వస్తున్న ఒత్తిడిపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ విద్యాశాఖ కార్యదర్శి కరుణ హాజరవుతారు. సాత్విక్ ఆత్మహత్యపై సమగ్ర నివేదిక ఇటీవల నార్సింగ్ పరిధిలోని ఓ కార్పొరేట్ కాలేజీ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ అధికారులను సబిత ఆదేశించారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రాథమిక నివేదిక అందజేశారు. విద్యార్థి తను చదువుతున్న కాలేజీలో కాకుండా, అదే కాలేజీకి చెందిన మరో క్యాంపస్‌లో మృతి చెందినట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. వేరే క్యాంపస్‌కు అతను ఎందుకు వెళ్లాడు? అతని అడ్మిషన్ ఎక్కడ? ఆత్మహత్యకు గల కారణాలపై సోమవారం సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి సాత్విక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఆస్పత్రిపై అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక సమర్పించారని మృతుడి తల్లిదండ్రులు నాగుల రాజు, అలివేలు ఆరోపించారు. ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి పోస్టుమార్టం చేస్తే, గాం«దీలో చేసినట్లు తప్పుడు నివేదిక ఇచ్చారని, తమ కుమారుడు అసలు శ్రీ చైతన్య కాలేజీలో చదవడం లేదని రిపోర్టు ఇచ్చి ఇచ్చారని ఆరోపించారు. ఆ నివేదికపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్య.. మంత్రి సబిత కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ కుమారుడికి ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణం అంటూ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలేజీ ఎదుట ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యార్థిపై విచారణకు ఆదేశించారు సబిత. ఇదే సమయంలో ఈ ఘటనపై విచారణ చెపట్టాలని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌కు కూడా సబిత ఆదేశించారు. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ క్రిష్ణారెడ్డి, వార్డెన్లు నరేష్‌తో పాటు మేనేజ్మెంట్పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఇక, అంతుకుముందు.. తమకు న్యాయం చేయాలంటూ శ్రీచైతన్య కాలేజీ ఎదుట విద్యార్థి పేరెంట్స్, విద్యార్థులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాలేజీ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సాత్విక్ మృతిచెందాడని పేరెంట్స్ ఆరోపించారు. చదువు కోసం పంపిస్తే చంపేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని సాత్విక్ సోదరుడు పోలీసుల కాళ్లపై పడి ప్రాధేయపడ్డాడు. ఆందోళనల సందర్బంగా సాత్విక్ తల్లి స్పృహ తప్పిపోయి రోడ్డుపైనే పడిపోయారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది దాడి చేసిన దృశ్యాలను విద్యార్థులు విడుదల చేశారు. ఫిర్యాదు చేసి విద్యార్థులను టార్గెట్ చేసి కొడుతున్నారని ఆరోపించారు. -
భూ బదలాయింపు బాధ్యత తహసీల్దార్లకే..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేదలకు ఆ భూములను క్రమబద్ధీకరించే ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన జీవో 59 అమలు ఓ కొలిక్కి వస్తోంది. క్రమబద్ధీకరణకు ఆమోదం పొంది, ఫీజు పూర్తిగా చెల్లించిన దరఖాస్తుదారుల పేరిట సదరు భూములను బదలాయించేందుకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ భూములను బదలాయించే బాధ్యత తహసీల్దార్లకు అప్పగించారు. తహసీల్దార్ల లాగిన్లలో ఈ డీడ్లను అందుబాటులో ఉంచాలని, వాటిపై తహసీల్దార్ల సంతకం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు.. జీవో 59 కింద ఆమోదం పొందిన భూములకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్లను సబ్ రిజిస్ట్రార్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఇప్పటివరకు కేవలం ఆక్రమణదారులుగా ఉన్న వేలాది మందికి ఆ స్థలాలపై పూర్తి హక్కులు సంక్రమిస్తాయి. ఆ భూములను అవసరమైతే విక్రయించుకోవడానికి కూడా హక్కు లభించనుంది. సీసీఎల్ఏగా బాధ్యతలు స్వీకరించాక నవీన్ మిత్తల్ తొలిసారి జారీచేసిన అధికారిక ఉత్తర్వులు జీవో 59కి సంబంధించినవే కావడం, ఈ ప్రక్రియ పూర్తి బాధ్యతలను తహసీల్దార్లకే అప్పగించడం గమనార్హం. తక్కువ ధర ఉన్న ప్రాంతాల్లో.. రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లుకట్టుకున్న పేదలకు వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం జీవో 58, 59లను జారీ చేసింది. వీటికింద గత ఏడాది ఫిబ్రవరిలో దరఖాస్తులను స్వీకరించారు. జీవో 58 కింద ఉచితంగా, 59 కింద ప్రభుత్వం నిర్ధారించిన ఫీజును కట్టించుకుని.. సదరు స్థలాలను క్రమబద్ధీకరించేలా చర్యలు చేపట్టారు. జీవో 59 కింద క్రమబద్ధీకరణ కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వ విలువ చదరపు గజానికి రూ.7 వేల కంటే తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని దరఖాస్తులను పరిశీలించి ఆమోదం తెలిపారు. ఇవి 25వేల వరకు ఉంటాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఈ దరఖాస్తులకు సంబంధించి కన్వేయన్స్ డీడ్లను జారీ చేసేందుకు సీసీఎల్ఏ తాజాగా మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ విలువ రూ.7 వేల కంటే అధికంగా ఉన్న స్థలాల విషయంలో ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలో కసరత్తు చేస్తోందని, ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. సీసీఎల్ఏ జారీ చేసిన మార్గదర్శకాలివీ.. ►జీవో 59 కింద ఆమోదం పొంది, నిబంధనల మేరకు ప్రభుత్వానికి ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ (భూబదలాయింపు డాక్యుమెంట్æ) తహసీల్దార్ లాగిన్లోకి వస్తుంది. ►తహసీల్దార్లు మీసేవ వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. అందులో జీవో 59 కింద కన్వేయన్స్ డీడ్లను ప్రాసెస్ చేసే ఆప్షన్ ఉంటుంది. ►తహసీల్దార్ బయోమెట్రిక్ నమోదు చేసి ఈ ప్రాసెస్‌ను పూర్తి చేయవచ్చు. లాగిన్‌లో దరఖాస్తు నంబర్, గ్రామాల వారీగా కన్వేయన్స్ డీడ్లు అందుబాటులో ఉంటాయి. ఈ కన్వేయన్స్ డీడ్లలో లబ్ధిదారుల పూర్తి వివరాలను నమోదు చేయడంతోపాటు పాటు జారీచేసే పూర్తి బాధ్యతలను తహసీల్దార్ నిర్వర్తించాల్సి ఉంటుంది. ►సదరు దరఖాస్తును ఆమోదించడంతో కన్వేయన్స్ డీడ్ డౌన్లోడ్ అవుతుంది. ఇలా డౌన్లోడ్ చేసుకునే ముందే అన్ని వివరాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. ►డౌన్లోడ్ అయిన డీడ్ (మూడు పేజీలు) ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రింట్‌పై తహసీల్దార్ సంతకం చేయడంతోపాటు ఆఫీస్ స్టాంప్ వేయాల్సి ఉంటుంది. ►ఇలా తహసీల్దార్ సంతకం చేసిన కన్వేయన్స్ డీడ్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీ వంటివేవీ వసూలు చేయకూడదు. ►ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన ఈ డాక్యుమెంట్‌ను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఇలా అందజేసే సమయంలో తహసీల్దార్ జారీచేసిన కన్వేయన్స్ డీడ్‌ను, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్‌ను లబ్ధిదారుడికి ఇవ్వాలి. ►కన్వేయన్స్ డీడ్ కాపీని మీసేవ పోర్టల్‌లో కూడా అప్లోడ్ చేయడంతో జీవో 59 కింద సదరు భూమిని లబ్ధిదారుడికి బదలాయించే ప్రక్రియ ముగుస్తుంది. -
తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరి ప్రైవేటు కాలేజీలతో లావాదేవీలు జరిపితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఎప్పటికప్పుడు పరీక్షలపై సమాచారం తెప్పించుకుంటుందని, విద్యార్థులు కూడా సమస్య ఉంటే తక్షణమే తెలియ జేసేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని మిట్టల్ తెలిపారు. కేవలం విద్యార్థులకుకలిగే అసౌకర్యాలను అప్పటికప్పుడే పరిష్కరించేందుకు అన్ని జిల్లాల్లో యంత్రాంగం పని చేస్తుందని స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్‌కు 3,65,931 విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 3,65,931 మంది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు హాజరవుతున్నారు. వీరిలో 94,573 మంది ఒకేషనల్ పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తం 2,201 ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ విధానంలో నిర్వహించాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ వస్తోంది. కానీ ఈ ఏడాది వరకూ విద్యార్థి చదివే కాలేజీల్లోనే నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జంబ్లింగ్ లేకపోవడం వల్ల ప్రైవేటు కాలేజీలు ప్రాక్టికల్స్ నిర్వహించకుండా, ఇన్విజిలేటర్లను ప్రభావితం చేసి, ఎక్కువ మార్కులు వేయించుకుంటున్నారనే ఫిర్యాదులొస్తున్నాయి. ఈ ఏడాది ఇలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకూడదని ఇంటర్‌బోర్డ్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇన్విజిలేటర్ల ఎంపికలోనూ ట్రాక్ రికార్డును పరిశీలించి మరీ ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు విద్యార్థులను ఏ కాలేజీ అయినా ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏ సమస్య తలెత్తినా విద్యార్థులు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్‌లోని కంట్రోల్ రూంకు ఫోన్ చేయొచ్చు. తక్షణమే స్పందిస్తాం. విద్యార్థులు, కాలేజీ ప్రిన్సిపాళ్ల సందేహాలను నివృత్తిచేసేందుకు ఈ కంట్రోల్ రూంను వాడుకోవచ్చు. 040 –24600110 ఫోన్‌నెంబర్‌తో పాటు, helpdesk-ie@telangana.gov.in ను సంప్రదిస్తే సమస్యను తక్షణమే పరిష్కరిస్తాం. – జయప్రదాభాయ్ (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇంటర్ బోర్డ్) -
యూకే కోర్సుకు 15 మంది తెలంగాణ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: యూకేలో స్వల్పకాలిక సర్టిఫికెట్ కోర్సు చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. రెండు వారాల కాలవ్యవధితో అందించే ఈ కోర్సుకు అయ్యే ఖర్చును బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం భరిస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థుల్లోంచి పూర్తిగా మెరిట్ ప్రాతిపదికగా 15 మందిని ఎంపిక చేశారు. హైదరాబాద్ విద్యాభవన్‌లో శనివారం కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్, బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధులు భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘స్కాలర్షిప్ ఫర్ ఔట్‌స్టాండింగ్ అండర్ గ్రాడ్యుయేట్ టాలెంట్ (స్కాట్)’ ప్రోగ్రామ్ వివరాలను బ్రిటిష్ కౌన్సిల్ సౌత్ ఇండియా డైరెక్టర్ జనక పుష్పనాథన్ వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో ‘హౌ టు బీ మోర్ రేషనల్ క్రియేటివ్ థింకింగ్, లాజిక్ అండ్ రీజనింగ్ (హేతుబద్ధంగా ఉండటం ఎలా? విమర్శనాత్మకత, తర్కం, హేతువాదన) అనే అంశాలపై మార్చి, ఏప్రిల్‌లలో రెండు వారాలపాటు కోర్సు చేస్తారని తెలిపారు. విద్యార్థులకు అవసరమయ్యే వీసా, ప్రయాణ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని, యూకేలో కోర్సు ఫీజులు, వసతి, ఇతర ఖర్చులను బ్రిటిష్ కౌన్సిల్ భరిస్తుందని తెలిపారు. రాష్ట్రాన్ని ఆధునిక విజ్ఞాన కేంద్రంగా మార్చడమే తమ లక్ష్యమని కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. -
ఇంటర్ బోర్డ్లోకి మధుసూదన్‌ను రానివ్వొద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డ్‌లో సీసీ కెమెరాల ట్యాంపరింగ్‌కు పాల్పడటమే కాకుండా, వివిధ నేరారోపణలతో సస్పెండైన ప్రభుత్వ లెక్చరర్ పి.మధుసూదన్ రెడ్డికి ఇంటర్ సంస్థల కార్యాలయాల్లో అనుమతి నిషేధిస్తూ ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లోని స్టేట్‌బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (విద్యాభవన్), కమిషనరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (ప్రొఫెసర్ జయశంకర్ విద్యా భవన్), నాంపల్లి కాలేజీ కాంప్లెక్స్‌ల్లోకి మధుసూదన్ రెడ్డి ప్రవేశిస్తే నేరంగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా అతనితో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నా క్రిమినల్ చర్యగానే గుర్తించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇంటర్ బోర్డ్ కార్యాలయంలోకి మధుసూదన్ రెడ్డి అక్రమంగా ప్రవేశించి, అక్కడి ఉద్యోగిని బెదిరించి సీసీ కెమెరాలను ట్యాంపర్ చేసినట్టు ఇంటర్ బోర్డ్ ఈ నెల 30న బేగంబజార్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయ డం తెలిసిందే. ఒక మహిళా ఉద్యోగిని మధు సూదన్ రెడ్డి లైంగికంగా వేధించడంతో పాటు ఆయనపై ఉన్న పలు ఏసీబీ, క్రిమినల్ కేసులను నవీన్ మిత్తల్ తన ఆదేశాల్లో వివరించారు. ‘నాపై నిషేధం ఆశ్చర్యంగా ఉంది..’ ఇంటర్మీడియెట్ కార్యాలయాల్లోకి తన ప్రవేశాన్ని నిషేధిస్తూ నవీన్ మిత్తల్ ఇచ్చిన ఉత్తర్వులపై ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది తన హక్కులను కాలరాయడమేనని వ్యాఖ్యానించారు. -
ఇంటర్ అఫిలియేషన్ ప్రక్రియ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అఫిలియేషన్ వ్యవహారంలో వివాదాలకు తెరదించేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు ఉపక్రమించింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధిచిన అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను బోర్డ్ సోమవారం విడుదల చేసింది. గతంలో పరీక్ష ఫీజు చెల్లించే తేదీ సమీపిస్తున్నా.. అఫిలియేషన్ వ్యవహారం కొలిక్కిరాక గుర్తింపు రాని కాలేజీల్లోని విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం లేకుండా పోయేది. దీంతో ఇలాంటి వివాదాలకు పుల్‌స్టాప్ పెడుతూ వచ్చే ఏడాది కాలేజీలు మొదలయ్యే నాటికే అఫిలియేషన్ల ప్రక్రియ ముగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 2023–24 విద్యాసంవత్సరానికి కళాశాలల అనుబంధ గుర్తింపు నోటిఫికేషన్‌ను బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ విడుదల చేశారు. అలాగే, ఏప్రిల్ 30లోపే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ప్రకటించాలని బోర్డు గడువుగా పెట్టుకుంది. ఆలస్యం లేకుండా ముందే... రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలు బోర్డు అనుబంధ గుర్తింపును పొందిన తర్వాతే నడపాల్సి ఉంటుంది. కొత్త కాలేజీల ఏర్పాటుకు అవకాశం లేకపోగా, నడుస్తున్న కాలేజీలు, వీటిల్లో అదనపు సెక్షన్లకు ఏటా అనుబంధ గుర్తింపును పునరుద్ధరిస్తుంటారు. అయితే కొంతకాలంగా అనుమతుల జారీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇదంతా జూన్ కంటే ముందుగానే ముగియాల్సి ఉండగా, సెప్టెంబర్ వరకు కొనసాగుతోంది. అనుబంధ గుర్తింపు పొందకుండానే కాలేజీలు అడ్మిషన్లు తీసుకుని విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. దీంతో ఏటా గందరగోళానికి దారి తీస్తోంది. ఈ సంవత్సరం మిక్స్డ్ ఆక్యుపెన్సీ కారణంగా డిసెంబర్ వరకు అఫిలియేషన్ల జారీ కొనసాగింది. ఈ నేపథ్యంలో బోర్డు ఈసారి ముందుగానే అనుమతుల షెడ్యూల్ ప్రకటించింది. అనుబంధ గుర్తింపు కోసం కాలేజీ యాజమాన్యాలు ఆలస్య రుసుము లేకుండా ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని నవీన్‌మిత్తల్ వెల్లడించారు. ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. అఫిలియేషన్‌కూ జీఎస్టీ ప్రైవేటు కాలేజీల అనుబంధ గుర్తింపునకూ ఇకపై జీఎస్టీ చెల్లించాలి. తాజాగా ఇంటర్ బోర్డు విడుదల చేసిన అఫిలియేషన్ నోటిఫికేషన్లో ఈ అంశాన్ని కొత్తగా చేర్చారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ పరిధిలో ఉండే కళాశాలలకు వేర్వేరు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇవి రూ. 21 వేల నుంచి రూ. 65 వేల వరకూ ఉంటాయి. ఈ మొత్తానికి 18 శాతం జీఎస్టీ చెల్లించాలని పేర్కొన్నారు. అఫిలియేషన్ పొందే కాలేజీలు కూడా సేవల పరిధిలోకి వస్తాయని బోర్డు పేర్కొనడం గమనార్హం. -
ఇంగ్లిష్‌కూ ప్రాక్టికల్స్! 20 నుంచి 25 మార్కులు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్‌లో వచ్చే ఏడాది నుంచి గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్టు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. జాతీయస్థాయిలో పోటీ పడేలా సరికొత్త విధానాలను అనుసరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా తాము వేసిన కమిటీ కసరత్తు ముమ్మరం చేసిందన్నారు. ‘సాక్షి’తో మంగళవారం నవీన్ మిత్తల్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యావిధానంలో మార్పులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే తెలంగాణ కాలేజీ విద్యను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఉన్నత విద్యకు కీలకమైన ఇంటర్మీడియెట్‌లో అత్యున్నత ప్రమాణాలు తెచ్చే ప్రయత్నం కీలక దశకు చేరుకుంది. ఉన్నత విద్యలో ఇప్పటివరకు కేవలం విద్యార్థి మెమరీని గుర్తించడానికి పరీక్ష పెట్టారు. ఇక నుంచి వారిలోని సృజనాత్మకత, ఆలోచన విధానం వెలికితీసేలా పరీక్ష తీరు ఉండాలని నిపుణులు భావిస్తున్నారు. దీనికి అనుసరించాల్సిన విధానాలపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో కమిటీ వేశాం. మరికొన్ని నెలల్లోనే ఇది తమ ప్రతిపాదనలను సమర్పిస్తుంది’ అని చెప్పారు. ఇంగ్లిష్ ఉచ్ఛారణపై అవగాహన పెంపు ఇంటర్లో ఇప్పటివరకు సైన్స్ సబ్జెక్టులో ప్రాక్టికల్స్ ఉండేవని, ఇక నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టుకూ దీన్ని విస్తరించాలని బోర్డ్ నిర్ణయించిందని నవీన్ మిత్తల్ చెప్పారు. ఇది ఏ విధంగా ఉండాలనేదానిపై వివిధ వర్గాల సలహాలు, సూచనలు తీసుకున్నామని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని ప్రాక్టికల్‌గా భావిస్తారని, దీనికి 20 నుంచి 25 మార్కులు ఉండే అవకాశముందన్నారు. ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ పెట్టడం వల్ల మొదట్నుంచీ ఇంగ్లిష్ ఉచ్ఛారణపై విద్యార్థుల్లో అవగాహన పెరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్ సిలబస్‌పై సిలబస్ కమిటీని నియమించామని, ఇటీవలే ఈ కమిటీతో భేటీ జరిగిందని చెప్పారు. రాష్ట్ర సిలబస్ చదివిన విద్యార్థి జాతీయస్థాయి పోటీ పరీక్షలైన జేఈఈ, నీట్, కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలను తేలికగా రాసేలా సిలబస్ రూపొందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. చరిత్ర విషయంలో రాష్ట్ర చరిత్రకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, సైన్స్ సబ్జెక్టుల్లోనే అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను మేళవించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఉపాధి అవకాశాలున్న అనేక కోర్సుల మేళవింపు, ఏయే సబ్జెక్టుల్లో ఎంత వరకు పాఠాలు అవసరం అన్నది పరిశీలించి మార్పు చేస్తామన్నారు. జనవరి 18 నుంచి అఫిలియేషన్లు ప్రైవేటు ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ విషయంలో గతంలో మాదిరి ఆలస్యం చేయకూడదని నిర్ణయించినట్లు నవీన్ మిత్తల్ చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ ప్రక్రియను జనవరి 18 నుంచి మొదలుపెడతామని, మార్చి 15 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి అనుబంధ గుర్తింపు జాబితాను ప్రకటిస్తామన్నారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గుర్తింపు అంశాన్ని పరిగణనలోనికి తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీనివల్ల ఇంటర్ విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితులు ఉండబోవని తెలిపారు. పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇంటర్లో మరికొన్ని మార్పులకు అవకాశం లేకుండా పోయిందని, వచ్చే సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ విషయంలో జంబ్లింగ్ విధానం అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. -
Telangana: తప్పటడుగుల ఇంటర్ బోర్డుకు చికిత్స!
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో ఏటా అబాసుపాలవుతున్న ఇంటర్మీడియెట్ బోర్డును చక్కబెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దిశగా ఇటీవల ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. లోపాలను సరిచేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. త్వరలో నిపుణులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది. ఇంటర్ బోర్డు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్న నవీన్ మిత్తల్‌కు కార్యాచరణ అప్పగించే అవకాశముందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. బోర్డులో అంతర్గతంగా ఉన్న సమస్యలు, నియంత్రణ వ్యవస్థ లోపించడం, సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం కారణంగా కొన్నేళ్లుగా ఇంటర్ పరీక్షల్లో అనేక లోటుపాట్లు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటికీ కారణాలను అన్వేషించి, తప్పులు జరగకుండా పకడ్బందీగా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్లుగా తప్పిదాలే... 2019 మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులొచ్చినట్టు గుర్తించారు. వీటిని సరిచేయడంలో ఆలస్యం జరిగింది. దీంతో 27 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. 2020 మార్చిలో జరిగిన పరీక్షల్లో ప్రశ్నపత్రంలో భారీగా తప్పులు రావడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఫెయిలైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే, కరోనా రావడం, సప్లిమెంటరీ పెట్టలేకపోవడంతో ఫెయిలైన వారందరినీ పాస్ చేశారు. 2021లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగానే రెండో ఏడాది మార్కులను నిర్ధారించారు. ఫస్టియర్ విద్యార్థులకు రెండో సంవత్సరానికి అనుమతించారు. కానీ 2021 అక్టోబర్‌లో రెండో సంవత్సరం చదువుతున్న వారికి ఫస్టియర్ పరీక్షలు పెట్టారు. ఇందులో 49% ఉత్తీర్ణత రావడం, ఆందోళనతో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం, ఇదంతా రాజకీయ రంగు పులుముకోవడంతో కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు. ఇటీవల జరిగిన ఇంటర్ పరీక్షల్లోనూ అనేక తప్పులు దొర్లాయి. ఒకచోట సంస్కృతం సబ్జెక్టులో మూడు ప్రశ్నలు రిపీట్ అయ్యాయి. జనగామలో సంస్కృతం పేపర్‌కు బదులు హిందీ పేపర్ ఇచ్చారు. ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో పొరపాట్లు దొర్లాయి. పొలిటికల్ సైన్స్ హిందీ మీడియం ప్రశ్నపత్రం ముద్రించకుండా, చేతిరాతతో అప్పటికప్పుడు ఇవ్వడం విద్యార్థులను కలవరపెట్టింది. ఇలా ప్రతీ ఏటా పరీక్షల నిర్వహణ తలనొప్పిగా మారుతోంది. సమూల మార్పులే శరణ్యమా? పరీక్ష నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్న తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులను మార్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. బోర్డుపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని పరిశీలన కమిటీకి అప్పగించే వీలుంది. దీంతోపాటే పరీక్ష కేంద్రాలను, ఇన్విజిలేటర్లను పెంచడం, జిల్లాస్థాయి నుంచే బాధ్యతాయుతంగా పనిచేసే యంత్రాంగాన్ని నియమించడం వంటి చర్యలూ తీసుకోవాలని భావిస్తున్నారు. (క్లిక్: వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ) -
కంప్యూటర్ ఇంజనీరింగ్కే క్రేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం జరిగిన రెండో దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపులో కన్వీనర్ కోటా కింద 75.18 శాతం సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 79,790 ఇంజనీరింగ్ సీట్లు ఉంటే ఇప్పటివరకు 59,993 సీట్ల కేటాయింపు పూర్తయింది. ఇంకా 19,797 సీట్లు మిగిలిపోయాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలోనూ చాలా మంది కంప్యూటర్ సైన్స్ సహా కొత్త కోర్సులకే ప్రాధాన్యమిచ్చారు. దీంతో కంప్యూటర్ సైన్స్ సీట్లు హాట్ కేకుల్లా భర్తీ అయ్యాయి. సివిల్, మెకానికల్ సీట్లకు తక్కువ ఆప్షన్లు ఇవ్వడంతో ఎక్కువగా మిగిలిపోయాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) సీట్లను 95.98 శాతం కేటాయించగా మెకానికల్ ఇంజనీరింగ్‌లో కేవలం 32.57 శాతమే సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్ ఇంజనీరింగ్‌కు కూడా విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో 41.87 శాతమే సీట్ల కేటాయింపు జరిగింది. 20 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్... రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన సీటును రద్దు చేసుకొనేందుకు ఈ నెల 18 వరకు అవకాశం ఇచ్చారు. ఈలోగా సీటురద్దు చేసు కున్న వారికి చెల్లించిన ఫీజులో 50 శాతం వెనక్కి ఇస్తారు. గడువు తర్వాత రద్దు చేసుకుంటే ఎలాంటి ఫీజు తిరిగి ఇవ్వరు. ప్రస్తుతం భర్తీకాని సీట్లు, రెండో దశలో ఖాళీగా మిగిలే సీట్లను పరిగణలోకి తీసుకొని ఈ నెల 20 నుంచి ప్రత్యేక రౌండ్ సీట్ల కేటాయింపు చేపడతారు. సీటు పొందిన అభ్యర్థులకు ఇప్పటికే వారి రిజిస్టర్డ్ మొబైల్‌కు సంక్షిప్త సందేశం పంపా రు. వివిధ కారణాల చేత 1,861 మంది ఆప్షన్స్ ఇచ్చి నా సీట్లు కేటాయించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్ కోటా) 4,973 సీట్లు కేటాయించారు. -
తెలంగాణ వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్‌పై వేటు
సాక్షి, నిజామాబాద్: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. శనివారం ఉన్నత విద్యామండలి కమిషనర్ నవీన్ మిట్టల్ 5 గంటలపాటు పాలకమండలి సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమాలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇన్చార్జి రిజిస్ట్రార్ కనకయ్యను ఆ పదవి నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు. పదేళ్ల అనుభవం అవసరమైన సీనియర్ ప్రొఫెసర్ పోస్టుకు కేవలం ఐదేళ్ల అనుభవం ఉన్న కనకయ్య తనకు తానే ఆర్డర్లు ఇచ్చుకుని, పాలకమండలి అప్రూవల్ అయినట్లుగా ప్రకటించుకొని యూజీసీ నిబంధనలను అతిక్రమించారని నవీన్ మిట్టల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లికేషన్ చూపించమని అడిగినా కనకయ్య చూపించలేకపోయారు. దీంతో కనకయ్య సీనియర్ ప్రొఫెసర్ పోస్టుకు అనర్హుడని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. కనకయ్యపై క్రమశిక్షణ చర్యల కోసం అప్పటికప్పుడే ఛార్జ్ మెమో తయారు చేశారు. అక్కడికక్కడే ప్రొ.యాదగిరికి రిజిస్ట్రార్‌గా ఛార్జ్ ఇప్పించి కనకయ్యను సమావేశం నుంచి బయటకు పంపించారు. అదేవిధంగా సీనియారిటీ లేని యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాగరాజును కూడా పాలకమండలి సమావేశం నుంచి నవీన్ మిట్టల్ బయటకు పంపారు. గత నెలలో అవుట్ సోర్సింగ్ విధానంలో చేపట్టిన 113 మంది అక్రమ నియామకాలను రద్దు చేస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా ప్రెస్మీట్లో ప్రకటించారు. బోధన సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో అన్నిరకాల డిప్యుటేషన్లను రద్దు చేసి అందరినీ వెనక్కు పిలవాలని మిట్టల్ ఆదేశించారు. నవంబర్ 1 నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బయోమెట్రిక్ కచ్చితంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 27న హైదరాబాద్‌లో మరోసారి పాలకమండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అక్రమ నియామకాలు, ప్రమోషన్లు, ఇన్చార్జి రిజిస్ట్రార్ వ్యవహారాలపై ‘సాక్షి’లో వరుసగా ప్రచురితమైన కథనాలను కొందరు పాలకమండలి సభ్యులు బుక్లెట్ రూపంలో నవీన్ మిట్టల్‌కు అందించగా వీటిపై చర్చ జరిగింది. -
పాలిసెట్‌లో 81.75 శాతం ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–21 ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 17న జరిగిన పాలిసెట్–21 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 1,02,496 మంది దరఖాస్తు చేసుకోగా, 92,557 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81.75శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.. అంటే 75,666 మంది పాసయ్యారు. వీరిలో బాలురు 39,186, బాలికలు 33,071 మంది ఉన్నారు. సాధారణంగా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పాలిసెట్ పరీక్షను నిర్వహిస్తుండగా... కోవిడ్–19 వ్యాప్తి నేపథ్యంలో పదోతరగతి బోర్డు పరీక్షలు నిర్వహించకపోవడంతో బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు సైతం ఈ సెట్ ఫలితాల ఆధారంగా నిర్వహిస్తున్నారు. అతి త్వరలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి, రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ వేర్వేరుగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. పాలిసెట్‌లో సాధించిన మార్కులు, ర్యాంకులకు సంబంధించిన సమాచారం, ర్యాంకు కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సాంకేతిక విద్యా కమిషనర్ తెలిపారు. -
రేపట్నుంచి పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. ఈ నెల 5వ తేదీ నుంచి వేసవి సెలవులు అని సాంకేతిక విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. సవరించిన అకడమిక్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. చదవండి: సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్ చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం -
పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–2020 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్ష రాసేందుకు 72,920 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, ఈనెల 2న జరిగిన పరీక్షకు 56,945 మంది హాజరయ్యారు. అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 46,207 మంది (81.14 శాతం) అర్హత సాధించగా, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 46,318 మంది (81.34 శాతం) అర్హత సాధించినట్లు (ఒకే విద్యార్థికి రెండు కేటగిరీల్లో ర్యాంకులు) కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. సాంకేతిక విద్యాభవన్‌లో గురువారం పాలిసెట్ ఫలితాలను నవీన్ మిట్టల్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందులో 120 మార్కులకు గాను 30 శాతం (36 మార్కులు) మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక మార్కును కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామని, పరీక్షకు హాజరైన 9,510 మంది ఎస్సీ విద్యార్థుల్లో 9,508 మందికి, పరీక్షకు హాజరైన 4,715 మంది ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులను కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లలో సీట్లను కేటాయిస్తామని వివరించారు. విద్యార్థులు ఈనెల 12 నుంచి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యలో తగ్గనున్న సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సిలబస్‌ను, పని దినాలను 50 శాతానికి తగ్గించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని, ఆ మార్గదర్శకాలు వచ్చాక పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని ఉన్నత స్థాయి సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. బుధవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ జయేశ్‌రంజన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు ఇంజనీరింగ్, ఇతర కాలేజీల యాజమాన్యాలతో ఆన్లైన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కేంద్రం మార్గదర్శకాలు ముందుగా వస్తే అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని, లేదంటే రాష్ట్రంలో ముందుగా ఆన్లైన్లో పాఠాలను సెప్టెంబర్‌లో ప్రారంభించాలని, ఆ తరువాత కరోనా పరిస్థితిని బట్టి ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు విదేశీ విద్యకు, ఉద్యోగాల కోసం వెళ్లాల్సి ఉన్నందున వారికి ఈనెల 20 నుంచి పరీక్షలు నిర్వహించాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు సెప్టెంబర్‌లో కాలేజీలు తెరిచినా హాస్టళ్లు తెరవద్దని, భౌతిక దూరం పాటించడం కష్టం అవుతుందన్న భావన వ్యక్తమైంది. కాలేజీల ప్రారంభంతోపాటు ఇతర పరీక్షలు, డిగ్రీ, పీజీ పరీక్షలకు సంబ«ంధించి ఈనెల 15న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో భేటీ కానున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. అవసరమైతే ఆ తరువాత ముఖ్యమంత్రితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
24 నుంచి ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహణకు ప్రవేశాల కమిటీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 24 నుంచి చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటివరకు ఫీజు చెల్లించనివారు ఈ నెల 24 నుంచి 25 లోగా ఫీజు చెల్లించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని పేర్కొన్నారు. కొత్త వారితోపాటు మొదటి దశలో సీట్లు రాని వారు, సీట్లు వచ్చినా మరింత మెరుగైన కాలేజీల్లో సీట్ల కోసం ఈ నెల 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని వెల్లడించారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు ఈ నెల 29న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29 నుంచి 31 వరకు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా 30, 31 తేదీల్లో ఆయా కాలేజీల్లో చేరాలని సూచించారు. కాలేజీల్లో చేరిన వారు 40 వేల లోపే.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజనీరింగ్‌లో 65,444 సీట్లు అందుబాటులో ఉండగా, మొదటి దశ కౌన్సెలింగ్‌లో 49,012 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. 16 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. ఇక సీట్లు పొందిన వారిలో 40 వేల లోపు మంది మాత్రమే కాలేజీల్లో చేరారు. ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. దీంతో మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారిలోనూ 9 వేల మందికిపైగా విద్యార్థులు కాలేజీల్లో చేరలేదు. దీంతో చివరి దశ కౌన్సెలింగ్‌లో 26 వేలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు ప్రవేశాల క్యాంపు అధికారులు లెక్కలు వేశారు. -
షిఫ్టింగ్‌లో అవకతవకలు లేవు
సాక్షి, హైదరాబాద్: కొన్ని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే, తనకు లేని అధికారాలను విని యోగించుకుని కొన్ని కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీ లు ఇచ్చారని వచ్చిన ఆరోపణలను ఆయన తోసి పుచ్చారు. ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్ అధికా రాన్ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌కు కట్టబె డుతూ 2014 ఏప్రిల్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి న ఉత్తర్వుల ఆధారంగా ఎన్ఓసీలు జారీ చేశాన న్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు అన్ని ఇంజనీరింగ్ కళాశాలలు సమానమేనని, ఏ ఒక్క కళాశాలకూ అనుకూలంగా వ్యవహరించలేదన్నారు. తాము కేవలం ఎన్ఓసీలు మాత్రమే ఇస్తామని, కళాశాలల షిఫ్టింగ్‌కు ఏఐసీటీఈ అనుమతిస్తుందన్నారు. తన అధికారాన్ని వినియోగించుకుని 5 ఇంజనీరింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు జారీ చేశానని, మరో మూడు నాన్ టెక్నికల్ కళాశాలల షిఫ్టింగ్ ప్రతిపాద నలను ప్రభుత్వానికి పంపించానన్నారు. ఇంజనీ రింగ్ కళాశాలల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు ఇవ్వడం రొటీ న్ అంశమని, పెద్ద విషయం కాదన్నారు. ఇంజనీరిం గ్ కళాశాలల యాజమాన్యాల మధ్య విభేదాల కారణంగానే తనపై లేనిపోని విమర్శలు సృష్టించా రన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమతూకాన్ని కాపాడా లని, ఈ నేపథ్యంలో షిఫ్టింగ్‌ను ప్రోత్సహించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అన్నారు. ఈ నేపథ్యంలో 5 కళాశాలలకు జారీ చేసిన ఎన్ఓసీలను రద్దు చేశాన న్నారు. ఎన్ఓసీలు రద్దు చేసిన విషయాన్ని ఏఐసీటీ ఈకు సైతం తెలిపామన్నారు. ఇంజనీరింగ్ కళాశా లల షిఫ్టింగ్‌కు ఎన్ఓసీలు జారీ చేసే అధికా రాన్ని తన పరిధి నుంచి తొలగిస్తూ ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులకు, ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. నాన్ఎయిడెడ్గా మార్చలేదు రాష్ట్రంలోని ఏ ఒక్క ఎయిడెడ్ కళాశాలను నాన్ ఎయిడెడ్ కళాశాలగా మార్చలేదని నవీన్ మిట్టల్ తెలిపారు. విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్న కోర్సులను, విద్యార్థులు ఉండి లెక్చరర్లు లేని కోర్సులను అన్ ఎయిడెడ్‌గా మార్చామన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో కొత్తగా నియామకాలు చేపట్టవద్దని 2005లో ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుందని, దాంతో పదోన్నతులు పొందిన వారి స్థానాలు, బదిలీలపై వెళ్లిన వారి పోస్టులు రద్దు అవుతున్నాయన్నారు. దీంతో ఎయిడెడ్ కళాశాలలు నడపడం ఆర్థికంగా సాధ్యం కావడం లేదన్నారు. దీంతో విద్యార్థులు లేని కోర్సులను అన్ ఎయిడెడ్‌గా మార్చి, ఒకరో, ఇద్దరో ఫ్యాకల్టీ ఉంటే వారిని ప్రభుత్వ కాలేజీల్లో బోధనకు ఉపయోగిస్తున్నామన్నారు. ఎయిడెడ్ కళాశాలల్లో కోర్సులు రద్దు కావడం వల్ల కొన్ని కాలేజీలు ఆన్ ఎయిడెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయన్నారు. కోర్సుల రద్దు నిర్ణయం వల్ల జూన్ నుంచి మార్చి వరకు రూ.16.53 కోట్ల ప్రభుత్వ నిధులు ఆదా అయ్యాయన్నారు. ఎయిడెడ్ కళాశాలలకు ఉన్న భూములపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిట్లు తెలిపారు. ఈ కమిటీ ఈ నెల 30 వరకు అధ్యయనం జరిపి నివేదిక ఇస్తుందన్నారు. రాష్ట్రంలో సుమారు 65 వరకు ఎయిడెడ్ కళాశాలలున్నాయని, వాటిలో 5 కళాశాలలు పూర్తిగా మూతబడ్డాయన్నారు. మిగిలిన కళాశాలల్లో సైతం చాలా వరకు కోర్సులు సరిగ్గా నిర్వహించడం లేదన్నారు. కొన్ని ఎయిడెడ్ కళాశాలలకు ప్రభుత్వం భూమి కేటాయించిందని, మరి కొన్నింటికి భవన నిర్మాణం కోసం నిధులు, ఫ్యాకల్టీ నియామకం జరిపిందన్నారు. ఎయిడెడ్ కళాశాలల బోధన, బోధన సిబ్బందిని ప్రభుత్వ కళాశాలలకు సర్దుబాటు చేశామన్నారు. జూన్‌లో రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్ జూన్‌లో రెండో విడత పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని నవీన్ మిట్టల్ తెలిపారు. పాలిటెక్నిక్ సీట్ల భర్తీలో పదో తరగతి పాసైన విద్యార్థులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, మిగిలిన సీట్లను అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పాసైన విద్యార్థులకు కేటాయిస్తామన్నారు. -
ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలపై సర్కార్ కొరడా
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలపై తెలంగాణ సర్కార్ కొరడా ఝులిపించింది. నిబంధనలు పాటించని కాలేజీలకు నోటీసులు జారీ చేసింది. ఫ్యాకల్టీ లేని కాలేజీలకు ఫెనాల్టీ విధిస్తోంది. రాష్ట్రంలో 150 కాలేజీలపై చర్యలకు ప్రభుత్వం సిద్దమైంది. హాజరుకాని ఫ్యాకల్టీల నుండి జీతాలు రికవరీ చేసి బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఒక్కో కాలేజ్ కి లక్షల్లో జమ చేయాలని నోటీసులు జారీ చేసింది. వెంటనే స్పందించకపోతే 2019-20 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు ఇవ్వమని ఎస్బీ టెట్ వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో పాలిటెక్నిక్ కళాశాలల యజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్‌ని కలిసి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. -
నవీన్ మిట్టల్ మిలీనియం బ్రోకర్: దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాలేజీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఉపా ధ్యాయ, లెక్చరర్ల బది లీల్లో అనేక అవకతవ కలు జరిగాయని పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మరో మారు ఆరోపించారు. మంగళవారం గాంధీ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బదిలీల్లో అవకతవకలను ఎత్తిచూపుతూ ముఖ్య మంత్రికి లేఖ రాస్తే, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తమ మీద దుమ్మెత్తి పోస్తున్నారని విమర్శించారు. మిట్టల్ వేల కోట్ల అవినీతికి ఆద్యుడని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు అత నిపై ఎలాంటి చర్యల్లేవన్నారు. మిట్టల్ ఒక మిలీ నియం బ్రోకర్ అని ధ్వజమెత్తారు. మిట్టల్ అవి నీతిపరుడని, ఆయన తర్వాత వచ్చిన హైదరా బాద్ కలెక్టర్ గుల్జార్ చెప్పారని తెలిపారు. ఆన్ డ్యూటీలో పంపామని చెబుతున్న అంశంలో ఓపెన్ నోటిఫికేషన్ ఎందుకివ్వలేదని ప్రశ్నించా రు. వెబ్ కౌన్సెలింగ్‌లో ఇచ్చిన పోస్టింగులను తర్వాత ఎందుకు మార్చారని ప్రశ్నించారు. -
ఇక పాలి‘టెక్’లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు 198 ఉంటే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు 14 మాత్రమే ఉన్నాయి. ప్రైవేటు కాలేజీల్లో లక్షకు పైగా సీట్లు ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 3 వేల సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలు అవసరమని సాంకేతిక విద్యా శాఖ భావిస్తోంది. తగిన మౌలిక సదుపాయాలు, భవనాలు కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఆ దిశగా ప్రభుత్వంతో చర్చించి, తగిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ బుధవారం వెల్లడించారు. ప్రభుత్వ స్థాయిలో దీనిపై చర్చ జరిగాకే నిర్ణయాలు ఉంటాయని ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యం లోని ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టడం ద్వారా మరింత మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తేవచ్చని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు ఏయే పాలిటెక్నిక్ కాలేజీలు అనువుగా ఉంటాయన్న అంశంపై అధికారులతో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఉపాధి అవకాశాలు పెంచేలా.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడంతోపాటు విద్యావకాశాలను పెంపొందించేందుకు సాంకేతిక విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2018–19లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం నుంచే ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు నిర్ణయించింది. పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాల నుంచి విద్యార్థులకు ఆఫర్లు వచ్చేలా చేయడంతోపా టు ఇంటర్న్‌షిప్ ద్వారా పరిశ్రమల్లో ఎక్కువ కాలం పని చేస్తే విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచవచ్చన్న ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాలిటెక్నిక్ కోర్సుల్లో ఆరు నెలలకుపైగా ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయనుంది. మొదటి సంవత్సరం అయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యాక వేసవి సెలవుల్లో 6 నుంచి 8 వారాలు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులు చివరి సెమిస్టర్ మొత్తం (దాదాపు 110 రోజులు) ఇంటర్న్‌షిప్ చేసేలా చర్యలు చేపట్టింది. చివరి సెమిస్టర్ ఇంటర్న్‌షిప్‌ను ఆప్షనల్‌గా అమలు చేయాలని నిర్ణయించింది. పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్.. పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయ్యాక ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాలనుకునే వారు (ఈసెట్ రాసి ల్యాటరల్ ఎంట్రీ ద్వారా) కాలేజీలో చదువుకుంటూనే ప్రాజెక్టు వర్క్ చేసేలా ఆప్షన్ ఇచ్చింది. పాలిటెక్నిక్ తర్వాత ఉపాధి అవకాశాలు వెతుక్కునే విద్యార్థులు చివరి సెమిస్టర్ మొత్తం పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తద్వారా విద్యార్థులకు ఆయా కంపెనీల్లో ఉపాధి లభించే అవకాశం ఉంటుందని నవీన్ మిట్టల్ వెల్లడించారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం, తృతీయ సంవత్సరం చదివే విద్యార్థుల నుంచి ఇంటర్న్‌షిప్ చేసే అంశంపై ముందుగానే ఆప్షన్ తీసుకోవాలని కాలేజీలను ఆదేశించారు. మరోవైపు కొత్త సిలబస్ ప్రకారం ఇంజనీరింగ్‌లోనూ ఇంటర్న్‌షిప్‌ను అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్.. డిగ్రీలోనూ ఇంటర్న్‌షిప్ తెచ్చినట్లు నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. దీన్ని అన్ని కాలేజీలు అమలు చేయడం లేదని, విద్యార్థులకు ఆప్షన్‌గా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎంపిక చేసిన కోర్సుల్లో ఇంట ర్న్షిప్ను తప్పనిసరి చేసే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతం డిగ్రీ ప్రథమ, ద్వితీయ ఏడాదిలో 2 క్రెడిట్ల చొప్పున ఇంటర్న్‌షిప్ చేసే వారికి 4 క్రెడిట్లు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
11 నుంచి పాలీసెట్ ఫైనల్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: పాలీసెట్–2018 తుదివిడత కౌన్సెలింగ్ ఈ నెల 11 నుంచి చేపట్టనున్నట్లు సెట్ కన్వీనర్ నవీన్‌మిట్టల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి tspolycet.nic.in వెబ్సైట్లో ప్రాసెసింగ్ ఫీజును ఈనెల 8 నుంచి 11లోపు చెల్లించాలని సూచించారు. 11వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన (గతంలో ధ్రువపత్రాలు పరిశీలించుకోని అభ్యర్థులు) ఉంటుందని పేర్కొన్నారు. 12వ తేదీ లోపు ఆప్షన్లు ఇవ్వాలని, 13వ తేదీన సీట్లు కేటాయిస్తామని తెలిపారు. 14, 15వ తేదీల్లో ట్యూషన్ ఫీజు చెల్లింపు, కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. సీట్లు వచ్చినప్పటికీ ఇతర కాలేజీల్లో సీట్ల కోసం వేచి చూసేవారు, ఇప్పటికీ సీట్లు రాని అభ్యర్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాలకు tspolycet.nic.in వెబ్సైట్ చూడాలని సూచించారు. -
డిగ్రీలోనూ ‘ఇంగ్లిష్’ హవా!
సాక్షి, హైదరాబాద్: - హయత్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీలో తెలుగు మీడియం బీఎస్సీ మ్యాథ్స్ గ్రూపులో 60 సీట్లు ఉంటే గతేడాది అందులో 10 మందే చేరారు. - ఇబ్రహీంపట్నం డిగ్రీ కాలేజీలోని తెలుగు మీడియం బీజెడ్సీలో 60 సీట్లు ఉంటే 29 సీట్లే భర్తీ అయ్యాయి. - కోరుట్ల డిగ్రీ కాలేజీ తెలుగు మీడియం బీఎస్సీ మ్యాథ్స్ గ్రూపులో 50 సీట్లు ఉంటే గతేడాది ఒక్కరూ చేరలేదు. - మణుగూరు డిగ్రీ కాలేజీలో బీకాం తెలుగు మీడియంలో 60 సీట్లు ఉంటే గతేడాది 10 మందే చేరారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తెలుగు మీడియం చదివే విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతోంది. ఇందుకు కారణం ఆయా కాలేజీల్లో ఇంగ్లిష్ మీడియం లేకపోవడమే. ఇదే సమయంలో అక్కడి ఇంగ్లిష్ మీడియం ప్రైవేటు కాలేజీల్లో మాత్రం విద్యార్థులు బాగానే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని కళాశాల విద్యా శాఖ నిర్ణయించింది. తెలుగు మీడియంలో విద్యార్థులు పెద్దగా చేరని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సగం తెలుగు మీడియం, సగం ఇంగ్లిష్ మీడియం కోర్సులను నిర్వహించేలా రంగం సిద్ధం చేసింది. ఇప్పటి వరకూ ప్రైవేటే దిక్కు: రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల విద్యార్థులు ఇప్పటివరకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుకోవాలంటే 90 శాతం మందికి తెలుగు మీడియమే దిక్కు. గత విద్యా సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ కోర్సులు కొన్ని కాలేజీలు మినహా ఎక్కువ శాతం తెలుగు మీడియంలోనే ఉన్నాయి. ఇకపై ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో చదువుల స్వరూపం మారబోతోంది. ఉపాధి అవకాశాల్లో ఇంగ్లిష్ మీడియం వారికే ప్రాధాన్యం ఇస్తుండటంతో ఇంగ్లిష్ మీడియం కోర్సులను కళాశాల విద్యా శాఖ ప్రవేశ పెడుతోంది. మారనున్న కోర్సుల స్వరూపం.. ఇందులో భాగంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(బీఏ)లో హిస్టరీ, ఎకనామిక్స్‌తో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ రాబోతోంది. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌తోనూ కంప్యూటర్స్ చేయవచ్చు. బీఎస్సీలో జువాలజీ, కెమిస్ట్రీతోపాటు బయో కెమిస్ట్రీ చదువుకోవచ్చు. మైక్రో బయాలజీ చేయవచ్చు. కోర్సుల్లో మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో సీట్లను పెంచాలని నిర్ణయించింది. గతేడాది కంటే 17 వేలకుపైగా సీట్లను అదనంగా 2018–19 విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ప్రస్తుతం 59,875 ఇంగ్లిష్ మీడియం సీట్లు ఉండగా, వాటిని 77,280కి పెంచనుంది. మరోవైపు పదిలోపు సీట్లు మాత్రమే భర్తీ అయిన తెలుగు మీడియం కోర్సులు రద్దు చేయాలని యోచిస్తోంది. కోర్సులకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు డిగ్రీ కోర్సుల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సిలబస్‌లోనూ మార్పులు చేస్తున్నాం. అందుకు అనుగుణంగా పోస్టులను భర్తీ చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు గెస్ట్ లెక్చరర్లను నియమించి బోధన కొనసాగిస్తాం. – నవీన్ మిట్టల్, కళాశాల విద్యా కమిషనర్ నేడు డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ద్వారా ఆన్లైన్లో ఈ ప్రవేశాలను చేపడుతున్నామని, నోటిఫికేషన్ 10న ఆన్లైన్లో విద్యార్థులకు అందుబాటులోకి వస్తుందని, 14వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. నల్లకుంటలోని ఏకేఎల్ఆర్ ఓరియంటల్ కాలేజీని లింగ్విస్టిక్ కాలేజీగా మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ఆ కాలేజీలో బీఏ హిందీ, బీఏ అరబిక్ తదితర భాషా కోర్సులనూ ప్రవేశపెడుతున్నామన్నారు. -
31 జిల్లాల్లో ఎంసెట్ హెల్ప్‌లైన్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా 31 జిల్లాల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సాంకేతిక కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో 10 జిల్లాల్లో 21 హెల్ప్‌లైన్ కేంద్రాలు మాత్రమే ఉండేవని తాజాగా వీటిని పెంచినట్లు వెల్లడించారు. మూడు దశల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, క్యాంపు కార్యాలయ ఆధ్వర్యంలోనే ఇంటర్నల్ స్లైడింగ్ ఉంటుందని అన్నారు. గతంలో క్యాంపు కార్యాలయం కేటాయించిన బ్రాంచీలో చేరి, ఆ తర్వాత ఇతర బ్రాంచీలోకి మారితే విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది కాదని, ప్రస్తుతం క్యాంపు కార్యాలయమే ఆ పని చేయడం వల్ల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందని వివరించారు. మే 8న డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని తెలిపారు. జూన్ 31 లోగా ప్రవేశాలను పూర్తి చేసి, జూలై 2 నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈసారి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు, ఎంసెట్ ఆన్లైన్ ప్రవేశాలకు లింకు పెడుతున్నట్లు వెల్లడించారు. విద్యార్థి ఇంజనీరింగ్‌లో సీటు కావాలనుకుంటే డిగ్రీలో అతనికి వచ్చిన సీటు ఆటోమెటిగ్గా రద్దు అయ్యేలా, డిగ్రీలో సీటు కావాలనుకుంటే ఇంజనీరింగ్‌లో వచ్చిన సీటు రద్దు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈసారి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గతంలో కంటే అదనంగా 25 శాతం సీట్లు భర్తీ అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు లేని కోర్సులను మాత్రమే రద్దు చేస్తున్నామని, విద్యార్థులు ఉంటే ఏ మీడియం అయినా కొనసాగిస్తామని అన్నారు. -
మేక్ ఇన్ ఇండియా చాలా అవసరం
సాక్షి, హైదరాబాద్ : విద్యార్ధులకు గల అనంతమైన అవకాశాలను వివరించేందుకు, సోమవారం మహీంద్రా ఇకోల్ సెంట్రల్ కళశాలలో మొదటి సెంట్రల్ కనెక్ట్ కాన్క్లేవ్ను నిర్వహించారు. ‘అనంతమైన అవకాశాల దిశగా’ అనే ట్యాగ్‌లైన్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డా. సతీష్ రెడ్డి పాల్గొన్నారు. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ.. మేక్ ఇన్ ఇండియా ఆవశ్యకతను వివరించారు. గత 40 సంవత్సరాలుగా భారత్ అంతరిక్ష పరిశోధనల్లో సాధించిన విజయాలు, అభివృద్ధిని విద్యార్థులకు వివరించారు. కాలేజ్ డైరెక్టర్ యాజులు మేధూరి మాట్లాడుతూ.. గ్లోబలైజేషన్ ప్రభావం, విద్యార్థుల్లో సాహసవంతమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కల్పించడంపై చర్చించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. భారతదేశంలో గల ఉద్యోగ అవకాశాల గురించి వాటిని ఏ విధంగా విద్యార్థులు అందిపుచ్చుకోవాలి అనే విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ ఫిల్మ్ క్యాపిటల్‌గా తయారవుతుంది : నవీన్ మిట్టల్
‘‘సినీ పరిశ్రమ అనగానే చాలా మంది ముంబైలో ఉన్న హిందీ పరిశ్రమ అనుకుంటున్నారు. భాగ్యనగరం ఫిల్మ్ హబ్ అవుతోంది. భారతదేశంలో సినిమాకి హైదరాబాద్ రాజధానిగా తయారవుతుంది’’ అని తెలంగాణ రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల అధికారి నవీన్ మిట్టల్ అన్నారు. డిసెంబరు 1న హైదరాబాద్‌లో ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నవీన్ మిట్టల్ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లో సినిమాలు, సీరియల్స్ షూటింగ్‌తో పాటు సినిమా పరిశ్రమకు అవసరమైన అన్ని సౌకర్యాలతో కూడిన స్టూడియోలు, ల్యాబ్‌లు ఉన్నాయి. సినిమా రంగాన్ని మరింత ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో విధానం తీసుకొస్తోంది. ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ గత ఏడాది కంటే ఈ ఏడాది మూడు రెట్లు గ్రాండ్‌గా జరగనుంది’’ అన్నారు. ‘‘సినిమా రంగంలో టెక్నాలజీ ఫాస్ట్‌గా మారుతోంది. ప్రజలు కూడా అప్డేట్ అవాల్సి ఉంది. ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’కి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది’’ అని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ పి.రామ్మోహన్రావు అన్నారు. ‘‘డిసెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు ‘ఇండీవుడ్ ఫిల్మ్ కార్నివాల్’ జరుగుతుంది. ఈ సమావేశానికి 50–60 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. ఈ ఏడాది తొలిసారి 22 విభాగాల్లో టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నాం’’ అని ‘ఇండీవుడ్ ఫౌండర్, డైరెక్టర్ సోహన్ రాయ్ అన్నారు. -
నవీన్ మిట్టల్‌పై చర్యలు తీసుకోండి..
- నకిలీ పత్రాల ఆధారంగా ఎన్ఓసీ ఇచ్చిన కమిటీలోని ఇతరులపై కూడా... - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: నకిలీ పత్రాల ఆధారంగా ఓ భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేసిన వ్యవహారంలో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్, జాయింట్ కలెక్టర్ దుర్గాప్రసాద్, మాజీ తహసీల్దార్ వెంకటరెడ్డి, సీనియర్ డ్రాఫ్ట్స్‌మన్ పి.మధుసూదన్‌రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. పత్రాలు, ఇతర రికార్డు లను పరిశీలించకుండానే నవీన్ మిట్టల్ నేతృత్వంలోని కమిటీ ఎన్ఓసీ జారీ చేయడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. వీరంతా రూ.25వేలను బాధిత వ్యక్తికి ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది. నకిలీ పత్రాలు సృష్టించి ఎన్ఓసీ పొందిన మహ్మద్ రుక్ముద్దీన్, మహ్మద్ అబ్దుల్, సయ్యద్ అబ్దుల్ రబ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా న్ని ఆదేశించింది. వీరు కూడా బాధిత వ్యక్తికి రూ.25వేలను ఖర్చుల కింద చెల్లించాలంది. నవీన్ మిట్టల్ నేతృత్వంలోని కమిటీ జారీ చేసిన ఎన్ఓసీ చెల్లదంటూ, దానిని రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరిం చారు. హైదరాబాద్, గుడిమల్కాపూర్‌లోని సర్వే నెంబర్ 284/6లో తాను 5,262 గజాల స్థలాన్ని కొనుగోలు చేశానని, ఈ విషయం లో తన ప్రమేయం లేకుండానే అధికారులు ఎన్ఓసీ జారీ చేశారని, దానిని రద్దు చేయాలని కోరుతూ శాంతి అగర్వాల్ అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఓసీ జారీ చేసిన కమిటీ, అది పొందిన వ్యక్తు లపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు ను కోరారు. ఎన్ఓసీ పొందిన వారి నుంచి భూమి కొనుగోలు చేసిన వారు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు... ఎన్వోసీల జారీ నిమిత్తం నవీన్ మిట్టల్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని తేల్చారు. ప్రజాప్రయో జనాల నిమిత్తం ఎన్ఓసీ జారీ చేస్తున్నామని చెప్పిన కమిటీ, ఆ అంశాన్ని అస్సలు పట్టించు కోలేదన్నారు. -
మూసీ ప్రక్షాళనకు ప్రత్యేక సంస్థ: మిట్టల్
హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు పనులకు ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పురపాలక శాఖ కార్య దర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. తొలి దశ పనుల పూర్తికి ప్రణాళికను రూపొందిస్తున్నా మని, ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నైట్ ఫ్రాంక్ ప్రతినిధులతో మంగళవారం సెక్రటేరియెట్‌లో ఆయన భేటీ అయ్యారు. మూసీపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ అధ్యయనం ఆధారంగా నివేదిక రూపొందించ నున్నామన్నారు. -
రైతులతో నేరుగా చర్చలు
రైతులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో సమావేశాలు ► సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ► పలు కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచన సాక్షి, హైదరాబాద్: రైతులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో నేరుగా చర్చించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. త్వరలో ‘జనహిత’లో ఆయా వర్గాలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎక్కువ మంది జనాభాకు జీవనాధారమైన వ్యవసాయం– అనుబంధ రంగాలు, గొర్రెల పెంపకం, మత్స్య శాఖల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని సీఎం ఉద్ఘాటించారు. వ్యవసాయం, ఉద్యానవనం, నీటి పారుదల, మత్స్యశాఖ, గొర్రెల పెంపకం తదితర అంశాలపై శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ రంగాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, భవిష్యత్తు నిర్ణయాలు, చేయాల్సిన కార్యక్రమాలపై డాక్యుమెంటరీలు రూపొందించి అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన ప్రజల భాగస్వామ్యంతో, వారికి అవసరమైన రీతిలో జరగాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం తమ అభివృద్ధి, సంక్షేమం కోసం చేస్తున్నదే అన్న విశ్వాసం ఆయా వర్గాల్లో కలగాలన్నారు. లాభమంతా మత్స్యకారులకే.. ఇంతకాలం రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ నిర్లక్ష్యానికి గురైందని, చేపలు దిగుమతి చేసుకునే దుస్థితి నెలకొందని కేసీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తామని, చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, మార్కెటింగ్, వసతుల కల్పన, నిర్వహణ భారాన్నంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నిర్వహణ వ్యయం పోగా మిగిలిన లాభం అంతా మత్స్యకారులకే దక్కేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. చేపలు పట్టుకుని జీవించే కులాలు, కుటుంబాలకు మేలు జరిగేలా కార్యక్రమం రూపొందిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ చెరువులు, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో కూడా మనకు వాటాలు దక్కుతాయన్నారు. చేపల పెంపకం కోసం ప్రాజెక్టులను బాగా ఉపయోగించుకోవాలని, ప్రాజెక్టుల వద్దే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కోసం ప్రతి ప్రాజెక్టు వద్ద 10 శాతం నీళ్లు నిల్వ ఉంచాలని నిర్ణయం తీసుకున్నందున నీటి కొరత ఉండదన్నారు. గొర్రెల పెంపకానికి ప్రోత్సాహం.. రాష్ట్రంలోని యాదవులు, కుర్మల ను ప్రోత్సహించి గొర్రెల పెంప కాన్ని విస్తృతంగా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాలు తీర్చడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా గొర్రెల పెంపకం ఉండాలన్నారు. ఏడాదికి లక్ష చొప్పున కనీసం రెండు లక్షల మందికి గొర్రె పిల్లలు కొనివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనికి అనుగుణంగా గొర్రె పిల్లల పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నీటిపారుదల శాఖ ఈఎన్ సీ మురళీధర్‌రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అవసరాలకు తగ్గట్టు ప్రణాళిక ‘ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. నీటిపారుదల రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వల్ల రాష్ట్రంలో సాగుభూమి పెరుగుతుంది. రాష్ట్రంలోని వాతావరణం, వర్షపాతం, నేల స్వభావానికి ఏ రకమైన పంటలు అనుకూలమైనవి? ఏ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది? ఏ నేలలో ఏ పంట వేయాలి? పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పరిస్థితి ఏంటి? వ్యవసాయదారుల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలేంటి? వ్యవసాయ యాంత్రీకరణ, గ్రీన్ హౌజ్, పాలీ హౌజ్ సాగు విధానాల ద్వారా ఎలాంటి పంటలు పండించవచ్చు? తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు, కార్యక్రమాలుండాలి’ అని సీఎం ఆదేశించారు. -
వాటికి డబ్బు చెల్లించి... మోసపోవద్దు!
‘ది హైదరాబాద్ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ 1941 నవంబర్ 17న ప్రారంభమైంది. ఈ సంస్థను 2014లో ‘తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌గా’ మార్చారు. ఈ సంస్థకు గురువారంతో 75 ఏళ్లు (ప్లాటినం జూబ్లీ) పూర్త య్యాయి. ఈ సందర్భంగా ఆ కమిటీ అధ్యక్షుడు పి.రామ్మోహన రావు, కార్యదర్శి కె. మురళీ మోహనరావు అధ్యక్షతన కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ- ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక గుర్తింపు పొందిన సంస్థ ఇది. ఇప్పటి వరకూ 3382 మంది సభ్యులున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినీసీమకు అందించే సేవలు, లబ్ధి పొందా లంటే ఈ సంస్థలో సభ్యత్వం ఉండాలి. తెలం గాణ పేరిట ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొచ్చిన ఏ ఇతర సంస్థలకీ ప్రభుత్వ గుర్తింపు లేదు. వాటిల్లో సభ్యత్వం కోసం డబ్బు చెల్లించి మోసపోవద్దు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ ఉన్నతాధికారి నవీన్ మిట్టల్ దృష్టికి పలు అంశాలు తీసుకెళ్లాం’’ అన్నారు. -
నవీన్ మిట్టల్ పీఎస్ పద్మావతిపై బదిలీ వేటు
ఆర్థిక శాఖలో ముదిరిన వివాదం హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పద్మావతిపై బదిలీ వేటు పడింది. ప్రభుత్వ సలహాదారులు జీఆర్ రెడ్డి పేషీకి ఆమెను బదిలీ చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పద్మావతి తెలంగాణ ఉద్యోగులంటేనే చీదరింపుగా వ్యవహరిస్తున్నారని, వేధిస్తున్నారని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇటీవల ఆందోళనకు దిగింది. సంఘం నాయకులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఆర్థిక శాఖలో మరోసారి వివాదం చెలరేగింది. ఆర్థికశాఖ చాంబర్ నుంచి సీఎం బ్లాక్ వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. పద్మావతి గో బ్యాక్ అంటూ పేషీలో ఆమె కూచోకుండా అడ్డుకున్నారు. ఆమె కుర్చీని బయట పడేశారు. పద్మావతిని వెయిటింగ్లో పెట్టాలని, ఏపీకి చెందిన పద్మావతిని ఇక్కణ్నుంచి తొలగించాలని సంఘం ఉపాధ్యక్షులు నేతి మంగమ్మ డిమాండ్ చేశారు. పదోన్నతి విషయంలో తెలంగాణ ఉద్యోగులు తనను ఏమీ చేయలేరని, తనకు పదోన్నతి ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పదోన్నతుల రివ్యూ డీపీసీ వద్దని, ఒరిజినల్ డీపీసీనే పెట్టాలని మంగమ్మ కోరారు. తనకు రావాల్సిన ప్రమోషన్‌ను అడ్డుకునేందుకే ఆందోళన చేస్తున్నారని, తన తప్పేమీ లేదని పద్మావతి వివరణ ఇచ్చారు. తన విధులకు ఆటంకం కల్పించటంతోపాటు కుర్చీ బయటకు విసిరేసిన సంఘటనపై ఏపీ సీఎస్ ఠక్కర్‌కు, తెలంగాణ సీఎస్‌కు రాజీవ్‌శర్మను కలసి ఫిర్యాదు చేశారు. -
కార్బైడ్ వాడితే.. ఆరునెలల జైలు
హైదరాబాద్: కాల్షియం కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు.. కాల్షియం కార్బైడ్ వినియోగంతో జరిగే అనర్థాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కృత్రిమంగా పండ్లు మగ్గ పెట్టే వ్యాపారులకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, లక్ష రూపాయల జరిమానా విధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.కృత్రిమంగా మగ్గ పెట్టిన పండ్లను తినడం ద్వారా కాన్సర్‌తో పాటు జీర్ణ, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయన్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్‌లు, ఇతర ప్రచార సామగ్రి సిద్దం చేస్తున్నట్లు వెల్లడించారు. పండ్లను మగ్గ పెట్టేందుకు రూ.60 లక్షల వ్యయంతో గడ్డి అన్నారం పండ్ల మార్కెట్లో ఇథిలీన్ చాంబర్‌ను మార్కెటింగ్ శాఖ నిర్మిస్తోందని తెలిపారు. ఆరుగురు వ్యాపారులు సొంతంగా ఇథిలీన్ ఛాంబర్ల నిర్మాణానికి ముందుకు వచ్చారని.. మార్చి ఆఖరులోగా వినియోగంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రై వేటు రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 ఇథిలీన్ ఛాంబర్లు వుండగా.. అవసరమైన చోట వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. -
మార్చిలోగా పత్రికా ప్రకటనల రేట్లు ఖరారు
- సమాచార, ప్రజాసంబంధాల కమిషనర్ నవీన్ మిట్టల్ సాక్షి, హైదరాబాద్: మార్చి నెలాఖరులోగా పత్రికల్లో ప్రకటన రేట్లు ఖరారు చేయడంతో పాటు వీలైనంత త్వరలో ఎంపానల్‌మెంట్‌ను నియమించేందుకు చర్యలు చేపడతామని రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీఐసీ) సబ్ కమిటీ కన్వీనర్ గురిందర్ సింగ్, సభ్యుడు ప్రభాత్ కుమార్ దాస్ మంగళవారం నవీన్‌మిట్టల్‌తో భేటీ అయ్యారు. పత్రికలకు వాణిజ్య ప్రకటన రేట్లు ఖరారు చేసే అంశంపై చర్చించారు. పెద్ద, మధ్య, చిన్న తరహా పత్రికలకు వాణిజ్య ప్రకటనల జారీకి సంబంధించి ఎంపానెల్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా పీసీఐ సబ్ కమిటీ సూచించింది. ఈ కమిటీ క్రమం తప్పకుండా సమావేశమై ఎంపానెల్మెంట్కు దరఖాస్తు చేసుకున్న పత్రికల దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాలన్నారు. సబ్ కమిటీ సూచనలపై నవీన్ మిట్టల్ స్పందిస్తూ... 2015 డిసెంబర్ నుంచే పత్రికల రెగ్యులారిటీపై దృష్టి సారించిందని, రెగ్యులారిటీ ఆధారంగానే రేట్ల నిర్ణయం జరుగుతుందన్నారు. వివక్షకు తావులేకుండా అన్ని భాషా పత్రికలకు తమ శాఖ ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. సమావేశంలో సమాచార శాఖ డైరక్టర్ కిశోర్ బాబు, జేడీ నాగయ్య కాంబ్లే, డిప్యూటీ డైరక్టర్ జి.సుజాత, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ కిశోర్ బాబు పాల్గొన్నారు. -
జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ పీఏ ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ వ్యక్తిగత కార్యదర్శి(పీఏ) నవీన్ కుమార్(26) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరూ లేని సమయం చూసి చైతన్యపురిలోని తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
మాకు రక్షణ కల్పించండి
* ఎన్నికల సంఘం కార్యదర్శితో నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీలు * మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్న వైఎస్సార్సీపీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 20న జరగనున్న నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నికలో తాము స్వేచ్ఛగా పాల్గొనేలా రక్షణ కల్పించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జెడ్పీటీసీలు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్థన్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, పోలుబోయిన అనిల్ కుమార్, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిలతో పాటు 23 మంది జెడ్పీటీసీ సభ్యులు మిట్టల్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 5, 13 తేదీల్లో రెండుసార్లు జిల్లా జెడ్పీ చైర్మన్ వాయిదా పడిన సమయంలో జిల్లా అధికారులు, కొందరు పోలీసులు వ్యవహరించిన పక్షపాత ధోరణికి సాక్ష్యాలుగా కొన్ని సీడీలను అందజేశారు. జిల్లాలో మెజార్టీ జెడ్పీటీసీలను గెలుచుకోకపోయినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ ఎలాగైనా జెడ్పీ చైర్మన్ దక్కించుకోవాలన్న ఆలోచనతో సాగిస్తున్న ఆరాచకాలను అడ్డుకోవాలని.. వారికి వత్తాసు పలుకుతున్న కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు జెడ్పీ కోసం స్వయంగా రంగంలోకి సీఎం సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని ఏదో విధంగా దక్కించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం. అందులో భాగంగానే జెడ్పీ చైర్మన్ ఎన్నికలకు ఒకరోజు ముందు ఆయన జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రైతు నాయకులను కలుసుకునే నెపంతో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులను నేరుగా కలుసుకుని వారికి మరిన్ని ప్రలోభాలను ఎర చూపించనున్నట్లు సమాచారం. జిల్లాలో వైఎస్సార్సీపీ 31 జెడ్పీటీసీ స్థానాలు చేజిక్కించుకోగా, టీడీపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. దీంతో జెడ్పీ పీఠాన్ని దక్కించుకోవడాన్ని టీడీపీ అధినేత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. -
ముసుగు తీసేశారు..!
* వైఎస్సార్సీపీకి చైర్మన్‌గిరీ దక్కకుండా గిరిగీసుకున్న అధికారులు * ఎన్నికల కమిషన్ ఆదే శాలు తుంగలోకి.. * ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై టీడీపీ దాడి * ఈసీ పరిధిలోకి జమ్మలమడుగు వ్యవహారం సాక్షి ప్రతినిధి, కడప: ప్రభుత్వ అధికారులనే ముసుగు తొలగించారు. పచ్చ కండువా కప్పుకోకుండానే అధికార పార్టీ మత్తులో జోగుతున్నారు. తెలుగుదేశం పార్టీకి చైర్మన్‌గిరీ చేజారిపోకుండా రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయం లోపల టీడీపీ కౌన్సిలర్లు, వెలుపుల తెలుగుతమ్ముళ్లు యథేచ్ఛగా వీరంగం సృష్టించారు. పోలీసుల్ని సైతం లెక్కచేయకుండా దాడులకు తెగబడ్డారు. నిబంధనల మేరకు చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ ఆదేశించినా, అప్పటి వరకూ బేషుగ్గా ఉన్న ప్రిసైడింగ్ అధికారికి రఘునాథరెడ్డికి అనారోగ్య సమస్య తెరపైకి వచ్చింది. ఈలోగా శాంతిభద్రతలు అదుపు తప్పనున్నాయని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ లేఖ రాశారు. వైఎస్సార్ జిల్లాలో జమ్మలమడుగులో అధికార యంత్రాంగం ఏకపక్ష ధోరణిలో పయనిస్తోంది. గురువారం కౌన్సిలర్ కిడ్నాప్ డ్రామాను తెరకెక్కించిన టీడీపీ నేతలు, శుక్రవారం అధికారుల అండతో శాంతిభద్రతల సమస్యను తెరకెక్కించారు. నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: జమ్మలమడుగు 1వవార్డు కౌన్సిలర్ మహమ్మద్‌జానీ తననెవ్వరూ కిడ్నాప్ చేయలేదంటూ గురువారం సాయంత్రమే ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీవో రఘునాథరెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు. శుక్రవారం ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం మాట్లాడారు. రాజకీయాలపై విరక్తితో వచ్చానని, ఆరోగ్యం బాగా లేకపోతే చూపించుకునేందుకు వెళ్లానని తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని, పోలీసు అధికారులు సైతం సంప్రదించలేదని వివరించారు. ఆమేరకు స్పందించిన ఎన్నికల సంఘం 22మంది సభ్యులకు గాను, 21మంది హాజరైన నేపథ్యంలో జమ్మలమడుగు చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతోందనుకున్న తరుణంలో ఆర్డీఓ రఘునాథరెడ్డి కర్ఛీఫ్తో ముఖం తుడుచుకుంటూ ప్రస్తుతం ఆరోగ్యం సహకరించడం లేదని ఎన్నికలు నిర్వహించలేనని మొండికేశారు. రెండు గంటలు కథ నడించారు. ఆలోగా శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని చైర్మన్ ఎన్నికల్ని వాయిదా వేయాలంటూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆర్డీవోకు లేఖ పంపారు. అంతవరకూ అనారోగ్యం నటించిన ఆర్డీవో ఆలేఖను హుషారుగా చదివి సభ్యులకు వినిపించారు. అధికారుల వైఖరిని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు. 21 మంది సభ్యుల మధ్య చైర్మన్ ఎన్నికలు నిర్వహించలేరా? అని ఆయన విస్మయం ప్రకటించినట్లు సమాచారం. టీడీపీ దౌర్జన్యం తెలుగుదేశం పార్టీ నేతలు జమ్మలమడుగులో రెండురోజులు యథేచ్ఛగా దౌర్జన్యం కొనసాగించారు. పోలీసుల్ని సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ వందలాదిగా కార్యకర్తలతో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి హల్చల్ చేశారు. చైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుసుకోగానే టీడీపీ కౌన్సిలర్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై కారంపొడి చల్లారు. అంటే కౌన్సిలర్లను పోలీసులు ఏమేరకు తనిఖీలు చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జమ్మలమడుగు పురవీధుల్లో తెలుగుదేశం కార్యకర్తలు వీరంగం సృష్టించారు. యధేచ్ఛగా రాళ్ల వర్షం కురింపిం చారు. శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమౌతుందని ఎస్పీ లేఖను ఎన్నికల సంఘం దృష్టికి జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తీసుకెళ్లారు. -
2వ విడత పోలింగ్ తేదీ మారే అవకాశం
హైదరాబాద్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ తేదీని మార్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీరామనవమి సందర్భంగా పోలింగ్ తేదీని మార్పు చేసే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంది. రేపు సుప్రీంకు ఎన్నికల సంఘం కొత్త తేదీని నివేదించనుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సుప్రీం కోర్టు రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా 1,096 జడ్పిటిసి స్థానాలకు 5,034 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట జడ్పిటిసి స్థానం ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16, 589 ఎంపిటిసి స్థానాలకు 52,568 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. 331 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ -70, ఇండిపెండెంట్ 105, టీడీపీ-102, కాంగ్రెస్-31, టీఆర్ఎస్-15, సీపీఎం-4, సీపీఐ-2, బీఎస్పీ-1, బీజేపీ-1 స్థానాన్ని ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నట్లు వివరించారు. రంగారెడ్డి జిల్లాలోని 21 పంచాయతీలకు, విశాఖపట్నం జిల్లాలో 5 గ్రామ పంచాయతీలకు ఏప్రిల్ 13న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నవీన్ మిట్టల్ తెలిపారు. -
'మున్సిపోల్స్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి'
-
రేషన్ డీలర్లు పోటీకి అర్హులే
సాక్షి, హైదరాబాద్: రేషన్ డీలర్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ గురువారం పేర్కొన్నారు. వారి నామినేషన్లను తిరస్కరించవద్దని సూచించారు. అంగన్వాడీ వర్కర్, నీటి వినియోగదారుల సంఘం సభ్యుడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని, మార్కె ట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ సభ్యుడు అనర్హులని వివరించారు. నామినేషన్ల పరిశీలన సమయంలో రిటర్నింగ్ అధికారు లకు కోర్టు తరహా అధికారాలు ఉంటాయని అందువల్ల తిరస్కృతి సమయంలో పంచాయతీరాజ్ ఎన్నికల చట్టం ఆధారంగా స్వతంత్రగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలనకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఒకవేళ నామినేషన్ల పరిశీలనకు ముందు రోజు మార్కెట్ కమిటీ చైర్పర్సన్, సభ్యులు రాజీనామా చే సినట్లు అయితే వారి నామినేషన్లను అమోదించవచ్చని పేర్కొన్నారు. కో ఆపరేటివ్ సొసైటీల్లోని చైర్పర్సన్లు, సభ్యులు పోటీకి అర్హులని సూచించారు. దేవాలయాల ట్రస్టుబోర్డు చైర్పర్సన్లు, సభ్యులు పోటీ చేయడానికి వీల్లేదన్నారు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉన్నవారు పోటీకి అనర్హులని, అయితే 1994లో ఈ చట్టం అమలులోకి వచ్చిందని, అమలులోకి వచ్చిన సంవత్సరంలోగా ఒక పిల్లాడు పుట్టినా, ఆ తరువాత ఇద్దరు పిల్లలు పుట్టినా అలాంటి అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రభుత్వ వాటా 25 శాతం కంటే అధికంగా ఉన్న ఏదైనా కార్పొరేషన్లో మేనేజర్స్థాయి లేదా ఇతర ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పోటీ చేయడానికి అనర్హులని తేల్చారు. అయితే ఆర్టీసీలో మేనేజర్లు, కార్యదర్శులుపై స్థాయి అధికారులు కాకుండా దిగువన ఉన్నవారు పోటీకి అర్హులని కూడా మిట్టల్ పేర్కొన్నారు. ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి పంచాయతీకి ఆస్తిపన్ను లేదా ఇతరత్రా బకాయిలు ఉన్నంత మాత్రానా.. సదరు అభ్యర్థిని స్క్రూట్నీ సమయంలో అనర్హునిగా ప్రకటించడానికి వీల్లేదని, కేవలం మండల పరిషత్‌కు ఏవైనా బకాయిలు ఉంటేనే అనర్హునిగా ప్రకటించాలని సూచించారు. అదే విధంగా జడ్పీటీసీ సభ్యుడు జిల్లా పరిషత్‌కు బకాయి ఉంటే తప్ప.. అనర్హునిగా ప్రకటించడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. -
మున్సిపోల్స్ బరిలో 17,795 మంది!
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఉపసంహరణకు తుది గడువు కూడా మంగళవారమే ముగియడంతో మొత్తం మిగిలిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. మొత్తం 146 మున్సిపాలిటీలలోని 3990 వార్డుల కోసం 17,795 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అత్యధికంగా ఒక్క గుంటూరు జిల్లాలోనే 1456 మంది పోటీలో ఉన్నారన్నారు. జడ్పీటీసీలకు 273 నామినేషన్లు దాఖలు అయ్యాయని, ఎంపీటీసీలకు 3335 నామినేషన్లు దాఖలయ్యాయని తెలిపారు. ఇక వీటికి సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు తుదిగడువు గురువారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుందన్నారు. అన్ని జిల్లాల్లో మద్యం ,డబ్బు పంపిణీని అరికట్టడానికి వీడియో సర్వేలు చేస్తున్నామని, ఇందుకోసం రెవిన్యూ,ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయని నవీన్ మిట్టల్ చెప్పారు. తాము మొత్తం రూ. 37.54 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, అలాగే 1.07 లక్షల లీటర్ల నాటు సారాను సీజ్ చేశామని అన్నారు. 4462 మందిపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, 212 వాహనాలను సీజ్ చేశామన్నారు. 1.77 లక్షల కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామని, గోడలపై పోస్టర్లను అంటించినవారిపై 63,810 కేసులు నమోదు చేశామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు, చీరలు, బంగారాన్ని కూడా సీజ్ చేశామని ఆయన వివరించారు. మొత్తం 22 జిల్లాలలో 44 మంది అధికారుల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు చెప్పారు. -
‘స్థానిక’ పోరు తప్పదు..
విచారణ వాయిదాతో అనివార్యం 17న యథావిధిగా ఎన్నికల నోటిఫికేషన్ ఆర్ఓ, ఏఆర్‌ఓల నియామకం పూర్తి సామగ్రి పంపిణీలో జెడ్పీ సిబ్బంది బిజీ జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : మండల, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ ఎన్నికల పోరు తప్పేలా లేదు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ... విచారణను సుప్రీంకోర్టు ఈనెల 24వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో పోరు తప్పదని జిల్లా ఎన్నికల అధికారులు భావిస్తున్నా రు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు సం బంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ఈనెల 10వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) షెడ్యూల్‌ను జారీ చేసింది. అప్పటికే మునిసిపాలిటీ, ఎమ్మె ల్యే, ఎంపీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ కూ డా విడుదలైంది. ఇప్పటివరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్, సాధారణ ఎన్నికలు ఒకేసారి వచ్చిన పరిస్థితులు లేవు. ఈఎన్నికలను నిర్వహించేందుకు సిబ్బందిని నియమించడం కష్టంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్... రాజకీయ పార్టీలతోపాటు కలెక్టర్ల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వార్షిక పరీక్షలు, సార్వత్రిక ఎన్నికల వల్ల జరిగే ఇబ్బందులను వారు ఎస్ఈసీకి విన్నవించారు. జిల్లాల వారీగా వచ్చిన నివేదికలను ఎస్ఈసీ సహాయ కమిషనర్ నవీన్‌మిట్టల్ శుక్రవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. వివరాలను పరిశీలించిన సుప్రీం కోర్టు విచారణను ఈ నెల 24కు వాయిదా వేయడంతో ఎన్నికలు నిర్వహిం చక తప్పని పరిస్థితులు ఏర్పడ్డారుు. 17న నోటిఫికేషన్ స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేసి న ప్రకారం ఈనెల 17వ తేదీన జిల్లా స్థారుు లో కలెక్టర్ స్థానికంగా నోటిఫికేషన్ జారీ చేయూలి. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. సుప్రీం కోర్టు లో విచారణ చేపట్టనున్న 24వ తేదీ నాటికి బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఈమేరకు ఎన్నికలు నిర్వహించ క తప్పదని అధికారులు పేర్కొంటున్నారు. సామగ్రి పంపిణీలో యంత్రాంగం స్థానిక ఎన్నికలపై విచారణను సుప్రీంకోర్టు 24వ తేదీకి వాయిదా వేయడం... ఎస్ఈసీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో జిల్లా పరిషత్ అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే... ఎంపీడీఓలు, తహసీల్దా ర్లు ఒకేసారి రెండు బాధ్యతలు నిర్వర్తిం చాల్సి వస్తోంది. స్థానిక ఎన్నికలకు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు(ఏఆర్ఓ)గా పని చేస్తూనే సార్వత్రిక ఎన్నికలకు మోడల్ కోడ్ అధికారులుగా వ్యవహరించాల్సి రావడం వారికి ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యం లో మోడల్ కోడ్ అమలు చేసే బాధ్యతను ఇతర శాఖలకు చెందిన అధికారులకు అప్పగించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. క్రమంలో మండల కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించేందుకు రిటర్నిం గ్, సహాయ రిటర్నింగ్ అధికారులుగా మండల ప్రత్యేక అధికారుల ను నియమించినట్లు తెలిసింది. నియూమకాలు దాదాపుగా పూర్తికా గా... ఎన్నికల సామగ్రిని మండలాల వారీగా చేరవేసే పనుల్లో జెడ్పీ ఎన్నికల విభాగం సిబ్బంది నిమగ్నమయ్యూరు. -
'అన్ని పార్టీలతో చర్చించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం'
-
తొలిదశ పోలింగ్ ప్రశాతం