ప్రైవేటు మాయకు చెక్‌ పెట్టండి | Minister Sabita Indra Reddy review of Sakshi article | Sakshi
Sakshi News home page

ప్రైవేటు మాయకు చెక్‌ పెట్టండి

Published Wed, Jul 19 2023 2:04 AM | Last Updated on Wed, Jul 19 2023 2:04 AM

Minister Sabita Indra Reddy review of Sakshi article

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులను చేర్చుకుని కూడా ఇంటర్‌ బోర్డ్‌కు ప్రవేశాలు చూపని ప్రైవేటు కాలేజీలపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27లోగా ప్రతి విద్యార్థి అడ్మిషన్‌ వివరాలను పంపేలా జిల్లా ఇంటర్‌ అధికా రులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.

‘ఇంటర్‌ లెక్కల్లో కాలేజీల మాయ’ శీర్షికతో ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించా రు. 2లక్షల మంది టెన్త్‌ పాసయిన విద్యార్థులు ఎక్కడ చేరారు? వారి వివరాలు తెలియజేయాలని ఆమె అధికారు లను కోరారు. ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులు చేరినా, వాటి డేటా ఇంటర్‌ బోర్డ్‌కు చేరలేదనే విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ అధికారులతో చర్చించారు.

పనులు పూర్తికాకపోతే ఎలా: సబిత
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ కళాశా లల్లో అవసరమైన నూతన భవనాలు, అదనపు గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి సబిత అసంతృప్తి వ్యక్తం చేశారు.

విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా, ఇంకా  పూర్తి కాకపోవడంతో ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని నవీన్‌ మిత్తల్‌కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకోసం, ల్యాబ్‌ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ.4.43  కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు.

శుక్రవారంలోగా పుస్తకాలు అందాలి
విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత  అధికారులపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయ డానికి ఆర్టీసీపైనే ఆధారపడకుండా ప్రయివేట్‌ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేవిధంగా చర్యలు చేపట్టా లని ఆదేశించారు.

మారుమూల జిల్లాల్లో అత్యధిక శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తుండగా అన్ని వనరులు ఉండి కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ వంటి జిల్లాలు వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదన్నారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వివిధ జిల్లాల ఇంటర్‌ విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు. 

డేటా పంపకపోతే విద్యార్థికి  రూ.500 చొప్పున కాలేజీకి జరిమానా
ఈ నెల 27లోగా ప్రైవేటు కాలేజీల్లో  చేరిన విద్యార్థుల డేటా పంపాలని, అలా చేయకుండా తర్వాత పంపితే నెలాఖరు వరకూ ఒక్కో విద్యార్థికి రూ.500 చొప్పున కాలేజీపై జరిమానా విధించాలని బోర్డ్‌ అధికారులకు మిత్తల్‌ సూచించారు. ఆ గడువు కూడా దాటితే  విద్యా ర్థికి రూ. వెయ్యి చొప్పున కాలేజీపై జరిమానా విధించా లని తెలిపారు.

ఆఖరి నిమిషం వరకూ వేచి చూసి ఆ తర్వాత సెక్షన్లు పెంచుకోవడం, ఒక క్యాంపస్‌లో ప్రవే శాలు, మరో క్యాంపస్‌లో అడ్మిషన్లు చేపట్టే ప్రైవేటు కాలేజీలపై నిఘా పెట్టాలని, ఇలాంటి చర్యలకు పాల్ప డే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నని, అవసరమైతే సదరు కాలేజీ అనుమతి కూడా రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని జిల్లా అధికారు లను ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement