టాప్ టెన్‌లో 8 మంది అబ్బాయిలు
పరీక్ష రాసిన వారిలో అమ్మాయిలే ఎక్కువ
ఫలితాలు విడుదల చేసిన నవీన్ మిత్తల్
రాష్ట్రంలో 20 వేల సీట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీ ఎడ్‌సెట్–2024) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. అయితే, తొలి పది ర్యాంకుల్లో అబ్బాయిలకే ఎనిమిది దక్కాయి. ఎడ్‌సెట్ ఫలితాలను మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నవీన్ మిత్తల్ హైదరాబాద్ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు.
మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ఎస్‌కె మçహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎడ్‌సెట్ కన్వినర్ మృణాళిని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెల 23వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు 33,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29,463 మంది పరీక్ష రాశారు. తాజాగా వెల్లడించిన పలితాల్లో 28,549 (96.90%) అర్హత సా«దించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 99.04 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ నుంచి 44 మంది పరీక్ష రాస్తే అందరూ పాసయ్యారు.
టీచర్ పోస్టులకు డిమాండ్
ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీ చేపడుతున్న కారణంగా ఉపాధ్యాయులకు భవిష్యత్‌లో మంచి డి మాండ్ ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. బీఈడీ కోర్సులకు ఈ మధ్య కాలంలో ఆదరణ తగ్గిందని, ఎక్కువ మంది ఈ కో ర్సులో చేరడం లేదన్నారు. 24,633 మంది అమ్మా యిలు సెట్ రాస్తే.. 23,780 మంది అర్హత పొంది నట్టు, 4,830 మంది అబ్బాయిలు పరీక్ష రాస్తే 4,769 మంది పాసయినట్టు వివరించారు.
ఎడ్‌సెట్‌లో నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, 19 రోజుల్లోనే ఫలితాలు అందించామని వీసీ న వీన్‌మిత్తల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 208 బీఈడీ కాలేజీలుంటే, వాటిల్లో 20 వేల సీట్లున్నాయని ఎడ్‌సెట్ కన్వినర్ మృణాళిని వెల్లడించారు. గత ఏడాది 75 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు.
ఆర్డీఓ కావాలని లక్ష్యం: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ నవీన్ కుమార్
బిజినేపల్లి: ఎడ్‌సెట్ ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన మల్లిశెట్టి నవీన్‌కుమార్ 118.37 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొద టి ర్యాంకు సాధించాడు. వ్యవసాయ నేపథ్యం గల నవీన్ బీటెక్ పూర్తి చేసి కొన్ని నెల లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆర్డీఓ ఉద్యోగం లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, గ్రూప్–1 నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేస్తుండటంతో కనీ సం ఉపాధ్యాయ ఉద్యోగమైనా సాధించాలని ఎడ్‌సెట్ పరీక్ష రాశానని నవీన్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment