BEd
-
పెద్దోడా ఎలా ఉన్నావ్? చిన్నోడా ఏం తింటావ్?
ఫ్రాన్స్‌లోని కౌరాన్ అనే ఊళ్లో ఉన్న 72 ఏళ్ల ఫిలిప్ గిల్లెట్ ఇంటికి వెళితే దాదాపు 400 రకాల జంతువులు, కీటకాలు, పక్షులు, జలచరాలు ఉంటాయి. వాటన్నింటిని సాకడం ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యాడు. మనం పలకరించడానికి వెళితే ‘పెద్దోడా... ఇంటికి ఎవరొచ్చారో చూడు’ అనంటే మనం దడుచుకుని చస్తాం. ఎందుకంటే ఆయన పెద్దోడా అని పిలిచింది పెద్ద మొసలిని. మొసలి మూతి యు ఆకారంలో ఉండి సైజు భారీగా ఉంటే దానిని ఎలిగేటర్ అంటారు. అలాంటి ఎలిగేటర్లు రెండు ఉన్నాయి ఆయన ఇంట్లో. ఆడుకోవాలన్నా కష్టం సుఖం చెప్పుకోవాలన్నా అవే ఆయనకు దిక్కు. పెద్దోడు, చిన్నోడు ఇల్లంతా తిరుగుతూ ఫిలిప్‌తో గారాలు పోతుంటాయి. ఇలాంటి పెద్దాయన మన ఇంటి పక్కన లేడు లక్కీగా. లేకుంటే ‘అంకుల్... ఒక కప్పు కాఫీ పోడి ఉంటే ఇస్తారా’ అని కాలింగ్‌బెల్ నొక్కి ‘పెద్దోడు’ వచ్చాడనుకోండి. ఏం చేస్తాం. హరీమనడమే. సరదాలు ఎలా ఉన్నా సృష్టిలోని ప్రతి ్ర ణిని కాపాడుకోవడం పర్యావరణ బాధ్యత. అందరితో పాటు మనం. మనతో పాటు అన్నీ. కాలుష్యం, వేట బారిన పడి ఇవి నశించి΄ోకుండా చూసుకోవాలి. -
ఆ రైళ్లలో బెడ్‌రోల్స్ లేవు...
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు నడిపే స్పెషల్ రైళ్లలో బెడ్‌రోల్స్‌కు కొరత ఏర్పడుతోంది. అందుబాటులో ఉన్న బెడ్ రోల్స్ సంఖ్య, వాటిని శుభ్రపరిచి తిరిగి అందించే లాండ్రీల సామర్థ్యానికి మించి డిమాండ్ ఏర్పడటమే దీనికి కారణం. రెగ్యులర్ రైళ్లు, సంవత్సరం పొడవునా నిర్వహించే సాధారణ స్పెషల్ రైళ్లకు ఇవి సరిపోతుండగా, ఉన్నట్టుండి వచ్చే రద్దీ ఆధారంగా నడిపే స్పెషల్ రైళ్లకు ఈ సమస్య ఏర్పడుతోంది. ఐదు రోజుల వరుస సెలవులతో.. పంద్రాగస్టు నేపథ్యంలో గురువారం దేశవ్యాప్త సెలవు ఉంది. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. దీంతో రాకపోకలు బాగా పెరుగుతాయి. శనివారం వారాంతం కావటంతోపాటు ఆదివారం పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు ఉండటంతో శనివారం ప్రయాణించేవారి సంఖ్య అధికంగా ఉండనుంది. ఆదివారం ఎలాగూ సెలవు, ఆ రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లున్నాయి. సోమవారం రాఖీ పౌర్ణమి.. ఇలా వరుసగా ఐదు రోజుల పాటు రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో.. మరిన్ని స్పెషల్ రైళ్లు నడపాలంటూ దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 15 మంది పార్లమెంటు సభ్యులు విన్నప లేఖలు పంపారు. ప్రయాణికుల నుంచి కూడా డిమాండ్ వచ్చి0ది. దీంతో అందుబాటులో రేక్స్ తక్కువగా ఉండటంతో.. కొన్ని స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. స్పెషల్ రైళ్లు ఇవే.. 18న నర్సాపూర్–సికింద్రాబాద్, 19న సికింద్రాబాద్–నర్సాపూర్, 15, 17, 19 తేదీల్లో కాకినాడ–సికింద్రాబాద్, 16, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్–కాకినాడ, 14, 15 తేదీల్లో తిరుపతి–నాగర్సోల్, కాచిగూడ–తిరుపతి మధ్య వీటిని నడుపుతున్నారు. వీటన్నింటిలో ఏసీ కోచ్‌లున్నాయి. కానీ, వాటిల్లోని ప్రయాణికులకు బెడ్‌రోల్స్‌ను సర్దుబాటు చేయలేమని నిర్ణయించుకున్న దక్షిణ మధ్య రైల్వే, బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ స్పెషల్ రైళ్లలో బెడ్ రోల్స్‌ను సరఫరా ఉండదని తేల్చి చెప్పింది. ఇక ప్రయాణికులే సొంత ఏర్పాట్లతో రావాలన్నది దాని పరోక్ష సారాంశం. -
ఎడ్‌సెట్‌లో అబ్బాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని బీఈడీ కాలేజీల్లో ప్రవేశానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీ ఎడ్‌సెట్–2024) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉన్నారు. అయితే, తొలి పది ర్యాంకుల్లో అబ్బాయిలకే ఎనిమిది దక్కాయి. ఎడ్‌సెట్ ఫలితాలను మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నవీన్ మిత్తల్ హైదరాబాద్ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ఎస్కె మçహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎడ్‌సెట్ కన్వినర్ మృణాళిని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెల 23వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు 33,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29,463 మంది పరీక్ష రాశారు. తాజాగా వెల్లడించిన పలితాల్లో 28,549 (96.90%) అర్హత సా«దించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా 99.04 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఏపీ నుంచి 44 మంది పరీక్ష రాస్తే అందరూ పాసయ్యారు. టీచర్ పోస్టులకు డిమాండ్ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీ చేపడుతున్న కారణంగా ఉపాధ్యాయులకు భవిష్యత్‌లో మంచి డి మాండ్ ఉంటుందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. బీఈడీ కోర్సులకు ఈ మధ్య కాలంలో ఆదరణ తగ్గిందని, ఎక్కువ మంది ఈ కో ర్సులో చేరడం లేదన్నారు. 24,633 మంది అమ్మా యిలు సెట్ రాస్తే.. 23,780 మంది అర్హత పొంది నట్టు, 4,830 మంది అబ్బాయిలు పరీక్ష రాస్తే 4,769 మంది పాసయినట్టు వివరించారు. ఎడ్‌సెట్‌లో నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, 19 రోజుల్లోనే ఫలితాలు అందించామని వీసీ న వీన్‌మిత్తల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 208 బీఈడీ కాలేజీలుంటే, వాటిల్లో 20 వేల సీట్లున్నాయని ఎడ్‌సెట్ కన్వినర్ మృణాళిని వెల్లడించారు. గత ఏడాది 75 శాతం సీట్లు భర్తీ అయ్యాయని చెప్పారు. ఆర్డీఓ కావాలని లక్ష్యం: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ నవీన్ కుమార్ బిజినేపల్లి: ఎడ్‌సెట్ ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన మల్లిశెట్టి నవీన్‌కుమార్ 118.37 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొద టి ర్యాంకు సాధించాడు. వ్యవసాయ నేపథ్యం గల నవీన్ బీటెక్ పూర్తి చేసి కొన్ని నెల లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆర్డీఓ ఉద్యోగం లక్ష్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానని, గ్రూప్–1 నోటిఫికేషన్ ఆలస్యంగా విడుదల చేస్తుండటంతో కనీ సం ఉపాధ్యాయ ఉద్యోగమైనా సాధించాలని ఎడ్‌సెట్ పరీక్ష రాశానని నవీన్ చెప్పాడు. -
రెండ్రోజుల్లో టెట్ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క ఏర్పాట్లు చేసూ్తనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ చేసింది. కాగా, 2022, 2023 కాలంలో డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఈ డీఎస్సీ నోటిఫికేషన్లో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి.. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ జారీచేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్‌కు హాజరుకావొచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.. ఒకట్రెండు రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ‘టెట్’ నిబంధనల సడలింపు.. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లుచేస్తున్న పాఠశాల విద్యాశాఖ.. అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరన్న నిబంధన ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్–2024 నోటిఫికేషన్‌కు ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్‌లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువమంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశముంటుంది. అలాగే.. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసే అభ్యర్థులు ఇంటర్మిడియట్‌లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్/సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్‌తో పాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేయాలి లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే.. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు ఐదు శాతం మార్కుల సడలింపునిచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. -
ఉపాధ్యాయ పోస్టులకు ఓపెన్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ డిగ్రీ చేసి, బీఈడీ పూర్తి చేసిన వారూ ఉపాధ్యాయ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తు విధానంలో స్వల్ప మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియెట్ చదవకుండా గతంలో డైరెక్ట్ డిగ్రీ (దూర విద్య ద్వారా) చేసినవారు తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామకాల దరఖాస్తు ఫారంలో ఇంటర్ విద్య వివరాలను పొందుపరచాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని అభ్యర్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై విద్యాశాఖ సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. -
బీఈడీలో బ్లాక్ టీచింగ్.. చీటింగ్!
కర్నూలు సిటీ: ఛాత్రోపాధ్యాయుల బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్)లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అక్రమార్కులపై వేటు పడకుండా కర్నూలు డీఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ)కోర్సు అభ్యసించే ఛాత్రోపాధ్యాయులను థర్డ్, ఫోర్త్ సెమిస్టర్ సమయంలో బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్)కు పంపిస్తారు. ఇందుకు రాయలసీమ యూనివర్సిటీ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇంటర్న్‌షిప్‌కు స్కూళ్లను కేటాయించాలని కోరుతారు. బీఈడీ కాలేజీల యాజమాన్యాలు సైతం ఈ మేరకు డీఈఓకు విన్నవించుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లాలోని కొన్ని బీఈడీ కాలేజీలు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా 2020–22 బ్యాచ్‌కి చెందిన ఛాత్రోపాధ్యాయులు బ్లాక్ టీచింగ్(ఇంటర్న్‌షిప్) చేసినట్లు చూపించాయి. పలు ఫిర్యాదులు రావడంతో ఎన్ని కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇచ్చారో వివరాలు ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో డీఈఓకు రాయలసీమ యూనివర్సిటీ రిజిస్ట్రార్ లేఖ రాశారు. ఈ లేఖకు ఈ ఏడాది మార్చి 2వ తేదిన స్పందిస్తూ.. 11 కాలేజీలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేశారనే ఆరోపణలు వచ్చిన హెచ్‌ఎంలపై డీఈఓ చర్యలు తీసుకోకుండా 20 రోజుల్లోనే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు డీఈఓ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పినట్లు సమాచారం. అనుమతులకు అక్రమ వసూళ్లు! రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని 2020–22 విద్యా సంవత్సరానికి కర్నూలు జిల్లాలో 22, నంద్యాల జిల్లాలో 20 బీఈడీ కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అయితే కర్నూలు జిల్లాలో 11 కాలేజీలకు మాత్రమే అనుమతులు ఇచ్చామని, మరో 11 కాలేజీలకు ఇవ్వలేదని ఆర్యూ అధికారులకు డీఈఓ తెలిపారు. ఆ తరువాత కొద్ది రోజులకే కొన్ని కాలేజీలకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా 2021–23 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్లాక్ టీచింగ్ కోసం అనుమతులు ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి రూ.15 వేల నుంచి రూ. 25 వేల వరకు కర్నూలులో బుధవారపేటలోని ఓ హోటల్లో బేరం కుదుర్చుకుని వసూలు చేసినట్లు తెలుస్తోంది. మామూళ్లు వసూలు చేయడంలో డీఈఓ కార్యాలయంలో ఓ ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. వసూలు చేసిన మొత్తాన్ని వాటాలుగా పంచుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేసిన ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోకుండా కాలేజీల యాజమాన్యాలు డీఈఓపై ఒత్తిడి చేస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. చర్యలు తీసుకుంటాం 2020–22 విద్యా సంవత్సరానికి 22 కాలేజీలకు బ్లాక్ టీచింగ్‌కి అనుమతులు ఇవ్వాలని రాయలసీమ యూనివర్సిటీ అధికారులు కోరారు. ఇందులో 11 కాలేజీలకు మాత్రమే మొదట ఇచ్చాం. మార్చి నెలలో 11 కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదని యూనివర్సిటీ అధికారులకు తెలిపిన మాట వాస్తవమే. అయితే యూనివర్సిటీ అధికారులు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉందంటే కొన్నింటికి అనుమతులు ఇచ్చాం. అనుమతులు ఇవ్వకుండానే బ్లాక్ టీచింగ్ చేసినట్లు సర్టిఫై చేసిన హెచ్‌ఎంలపై విచారించి చర్యలు తీసుకుంటాం. – రంగారెడ్డి, డీఈఓ -
AP: నాలుగేళ్లలోనే డిగ్రీ ప్లస్ బీఈడీ.. ప్రవేశ పరీక్ష ఇలా..
సాక్షి, అమరావతి: సమీకృత బీఈడీ కోర్సులు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ తర్వాత నాలుగేళ్లలోనే డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేయవచ్చు. సాధారణంగా బీఈడీ చేయాలంటే మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసి, రెండేళ్ల బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు చేయాలి. దీనికి మొత్తం ఐదేళ్లు పడుతుంది. కొత్త విధానం వల్ల నాలుగేళ్లలోనే పూర్తి చేసే వీలుంది. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ కోర్సును జాతీయ స్థాయిలో పలు కళాశాలల్లో ప్రవేశపెడుతున్నారు. వీటిలో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశ వ్యాప్తంగా 178 పట్టణాల్లో 13 మాధ్యమాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం అర్ధరాత్రి ఎన్టీఏ విడుదల చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రెండు వర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎన్టీఏ 2023–24 విద్యా సంవత్సరానికి తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎచ్చెర్లలోని బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మొత్తం 150 సీట్లలో ప్రవేశాలు కలి్పంచనున్నారు. ఆధునిక విద్యా బోధనకు అనుగుణంగా సమీకృత బీఈడీ కోర్సును ఎన్సీఈఆర్టీ రూపొందించింది. విద్యార్థి మానసిక ధోరణి, ఆన్లైన్, డిజిటల్ విద్యా బోధనతో పాటు సరికొత్త మెలకువలతో ఎలా బోధించాలన్న అంశానికి ఈ కోర్సులో అత్యధిక ప్రాధాన్యమిస్తారు. తరగతి గదిలో పాఠాల కన్నా, అనుభవం ద్వారా నేర్చుకునే రీతిలో పాఠ్య ప్రణాళిక రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రవేశ పరీక్ష ఇలా : ఇంటర్ ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. పన్నెండో తరగతి, ఇంటర్ సిలబస్‌లోంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 160 బహుళ ఐచి్ఛక ప్రశ్నలుంటాయి. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్, టీచింగ్ అప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఎన్సీఈఆర్టీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తుంది. - ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19.7.2023 - డేటా కరెక్షన్కు చివరి తేదీ 20.7.2023 - పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు - హాల్ టికెట్ల డౌన్లోడ్ పరీక్షకు మూడు రోజుల ముందు - దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్లు: www.nta.ac.in, https://neet. samarth.ac.in/ ఇది కూడా చదవండి: గ్రీన్ ఎనర్జీకి స్టార్ రేటింగ్ -
కేంద్ర విద్యాశాఖ నిర్ణయం.. ఇక నాలుగేళ్ల కోర్సుగా బీఈడీ!
సాక్షి, హైదరాబాద్: మారుతున్న బోధన విధానాలకు అనుగుణంగా అధ్యాపకుల శైలిలోనూ మార్పులు తేవాలని కేంద్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుల స్వరూప స్వభావాన్ని మార్చాలని ప్రతిపాదించింది. ఇప్పుడున్న రెండేళ్ళ కాలపరిమితి స్థానంలో కోర్సును నాలుగేళ్ళకు పెంచబోతున్నారు. ఇప్పటికే బీఈడీ కోర్సుల మార్పులకు సంబంధించిన ముసాయిదా ప్రతిని రూపొందించారు. గత నెల 27న ఢిల్లీలో దీనిపై ప్రత్యేక సమావేశం జరిగింది. రాష్ట్రాలకు చెందిన ఉన్నత విద్యా మండళ్ళు, కేంద్ర విద్యాశాఖ అధికారులు ఇందులో పాల్గొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి బీఈడీలో కొత్త కోర్సుల రూపకల్పన బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. జాతీయ విద్యావిధానం–2020లో తీసుకొచ్చిన మార్పులను అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తిలోనూ గుణాత్మక మార్పులతో ముసాయిదా రూపొందించారు. నవీన బోధన విధానం..: కాలానుగుణంగా వస్తున్న మార్పులతో నవీన బోధన విధానంతో కొత్త సబ్జెక్టులను బీఈడీలో చేర్చబోతున్నారు. విద్యార్థి సైకాలజీని అర్థం చేసుకుని, సునిశిత విశ్లేషణతో బోధించే మెళకువలు ఇందులో పొందుపర్చాలని నిర్ణయించారు. బోధన ప్రణాళికలో వర్చువల్, డిజిటల్ పద్ధతులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. వాస్తవ ప్రపంచంలోకి వెళ్ళి విద్యార్థి సముపార్జించే జ్ఞానాన్ని ఉపాధ్యాయుడు ఏ విధంగా గుర్తించాలనే అంశాలను బీఈడీలో చేర్చబోతున్నారు. ఆన్లైన్, డిజిటల్ ప్లాట్ ఫామ్‌కు అనుగుణంగా పుస్తకాల్లో ఉన్న సబ్జెక్టును విద్యారి్థకి అర్థమయ్యేలా టెక్నాలజీతో అందించే విధానాన్ని బీఈడీలో పాఠ్యాంశాలుగా చేర్చనున్నారు. -
బీఈడీ అభ్యర్థులకూ పేపర్–1 అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో తీసుకొచ్చిన మార్పులు తమకు నష్టం చేస్తాయని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్–1 రాస్తారు. వీరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు (ఎస్జీటీ) అర్హులవుతారు. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సాధారణంగా పేపర్–2 రాస్తారు. వీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్–2తో పాటు, పేపర్–1 కూడా రాసే అవకాశం కల్పించారు. దీంతో వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కాకుండా, ఎస్జీటీ పోస్టులకూ పోటీ పడే వీలుంది. దీంతో తమకు అవకాశాలు తగ్గుతాయని డీఎడ్ అభ్యర్థులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపడితే.. 6,500 ఎస్జీటీ, 3 వేలపైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. డీఎడ్ నాణ్యతపైనే సందేహాలు... వాస్తవానికి కొన్నేళ్లుగా డీఎడ్ కాలేజీల్లో ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆ అభ్యర్థులు చెబుతున్నారు. సరైన ఆదరణ లేక ప్రైవేటు కాలేజీలు పెద్దగా దృష్టి పెట్టలేదంటున్నారు. నిజానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో సగం డీఎడ్ కాలేజీలు మూతపడ్డాయి. 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. గతేడాది వంద కాలేజీల్లో 6,250 సీట్లకు గానూ 2,828 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలు సరైన ఫ్యాకల్టీని నియమించడం లేదనే ఆరోపణలున్నాయి. మారుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల సైకాలజీ తెలుసుకుని బోధించే మెళకువలు, ప్రాజెక్టు వర్క్‌లు అసలే ఉండటం లేదని డీఎడ్ అభ్యర్థులు అంటున్నారు. మాకు అన్యాయమే... ఉపాధ్యాయ పోస్టుకు బీఈడీ అభ్యర్థులతో సమానంగా మేమెలా పోటీపడగలం. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ వారికే పరిమితం చేస్తే బాగుండేది. చిన్న తరగతులకు బోధించే విధానాలే డీఎడ్‌లో ఉంటాయి. పెద్ద తరగతులకు బీఈడీ సరిపోతుంది. బీఈడీ అభ్యర్థులు తేలికగా మా స్థాయి పోస్టులు సాధిస్తే, మాకు అన్యాయం జరుగుతుంది. – ప్రవీణ్ కుమార్ (డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థి) వారితో పోటీ సరికాదు... బీఈడీ, డీఎడ్ బోధనా విధానంలో చాలా మార్పులున్నాయి. కాలేజీలు కూడా డీఎడ్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లేదు. ప్రయోగాత్మక బోధనా పద్ధతులపై దృష్టి పెట్టడం లేదు. ఇవన్నీ డీఎడ్ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే అంశాలు. ఈ నేపథ్యంలో మా స్థాయి పోస్టులకు బీఈడీ వారినీ పోటీకి తేవడం సరికాదు. – సంజీవ్ వర్థన్ (టెట్‌కు దరఖాస్తు చేసిన డీఎడ్ అభ్యర్థి) -
ఆ శాఖలోనే అత్యధిక ఖాళీలు.. గ్రేటర్‌లోనే 25 వేల మందికిపైగా అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సర్కారు కొలువుల జాబితాలో అత్యధిక ఖాళీలు విద్యాశాఖలో ఉండటంతో నిరుద్యోగుల దృష్టి అంతా టీచరు పోస్టులపై కేంద్రీకృతమైంది. కొత్త జోన్లు, జిల్లాల విభజన తర్వాత తొలిసారిగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానుంది. ఇప్పటికే బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారితోపాటు ప్రస్తుతం ఫైనలియర్లో ఉన్న అభ్యర్థులకు కూడా కలిసి వచ్చే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) కోసం సుమారు 842కుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వానికి విద్యాశాఖ నివేదించినట్లు తెలుస్తోంది. ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయిదేళ్లుగా నో నోటిఫికేషన్.. గ్రేటర్ పరిధిలో సుమారు 25 వేలమందికిపైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తిచేసిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా టీఆర్టీ నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీని నిర్వహించగా ఇప్పటివరకు ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయలేదు. ఈసారి ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ అవుతాయనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ పోతోంది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 4,700 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తి చేస్తున్నట్లు విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే.. సర్కారు బడుల్లో భారీగా చేరిక.. గ్రేటర్‌లోని ప్రభుత్వ పాఠశాల్లో ఖాళీల జాతర కొనసాగుతోంది. పదవీ విరమణ, పదోన్నతులు, బదిలీలతో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి చతికిలపడి పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భరించలేక సర్కారు బడుల్లో తమ పిల్లలను పెద్ద ఎత్తున చేర్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతోపాటు విద్యా వలంటీర్లకు కూడా అనుమతి లభించకపోవడంతో ఉన్న ఉపాధ్యాయులపై పనిభారం పడుతోంది. రెండు మాధ్యమాల్లో.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించవచ్చని అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు చేసే అవకాశం ఉండడంతో నియామక పరీక్ష రెండు మాధ్యమాల్లో ఉండవచ్చని వారు భావిస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బీఎడ్ పూర్తి చేసినవారి సంఖ్యే అధికంగా ఉంది. ఆంగ్ల బోధనపై ప్రస్తుతం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మున్ముందు ఆంగ్లంలో బోధనను దృష్టిలో ఉంచుకుని.. కొత్తగా నియమించే ఉపాధ్యాయులను కూడా ఆ మాధ్యమం వారిని తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. మొత్తం పోస్టుల్లో ఆంగ్ల మాధ్యమం వారినే తీసుకుంటే తెలుగు మాధ్యమం అభ్యర్థులకు నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో రెండు మాధ్యమాల్లో డీఎస్సీకి నిర్వహించే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. టెట్ కోసం.. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. టెట్‌లో అర్హత సాధిస్తే టీఆర్టీ రాయవచ్చని నిరీక్షిస్తున్నారు. డీఎస్సీకి ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాస్తవంగా అయిదేళ్ల నుంచి టెట్ నిర్వహించలేదు. టెట్ పేపర్– 1, పేపర్– 2లో అర్హత సాధించినవారి కంటే టెట్ క్వాలిఫై కాని, 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసినవారు రెట్టింపు సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. టెట్ నిర్వహించాలంటే కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇవ్వాల్సి ఉంటుంది. గత పద్ధతి ప్రకారం డీఈడీ చేసినవారు పేపర్– 1, బీఈడీ చదివినవారు పేపర్– 2 రాయడానికి అర్హులు. ఎన్సీఈఆర్టీ కొత్త మార్గదర్శకాల ప్రకారం బీఈడీ చేసిన అభ్యర్థులు టెట్ పేపర్– 1, పేపర్– 2 రాయడానికి అర్హులు. ఈ మేరకు ప్రభుత్వం మార్పులు చేస్తూ ఉత్తర్వులివ్వాల్సి ఉంది. -
బీటెక్, బీఈడీ ఉంటే టీచర్ పోస్టులకు అర్హులే
సాక్షి, హైదరాబాద్: నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) మార్గదర్శకాల మేరకు బీటెక్, బీఈడీ విద్యార్హత కలిగిన అభ్యర్థులూ పీజీటీ/టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు బీటెక్ అభ్యర్థులనూ ఈ పోస్టులకు అనుమతించాలంటూ 2019లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమని తేల్చిచెప్పింది. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ‘ఎన్సీటీఈ 2010, 2014 మార్గదర్శకాల ప్రకారం బీటెక్, బీఈడీ చదివిన అభ్యర్థులూ పీజీటీ, టీజీటీ పోస్టులకు అర్హులు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్లో బీఏ, బీఎస్సీ, బీకాంతోపాటు బీఈడీ చదివిన అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొంది. ఎన్సీటీఈ మార్గదర్శకాల మేరకు బీటెక్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పు సరైనదే’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. -
ఇళ్ల మధ్యే సమాధులు.. మంచమే వాడని వింత ప్రపంచం
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): ఏ ఊరిలోనైనా సాధారణంగా సమాధులు ఊరికి దూరంగా ఉంటాయి. ఇంట్లో గతించిన వారిని స్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపి, కొన్నాళ్ల తరువాత సమాధి కడుతారు. ప్రపంచంలోని ఏ ఊరిలోనైనా ఈ ఆచారం కొనసాగుతుంది. చనిపోయిన వారి కోసం ఊరి చివర ఒక ప్రత్యేక స్మశాన వాటిక ఉండడం సాంప్రదాయం. కానీ ఇంటికి ముందే గతించిన వారి సమాధి ఉండడం, వారం వారం వాటికి పూజలు చేయడం ఆ ఒక్క ఊరిలోనే కనిపించే ఆచారం. గతించిన వారి ఆత్మల సన్నిధిలో తాము నివసించాలని, ఆ ఆత్మల ఆశీస్సులే తమకు అపురూపమని భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. అంతేకాదు.. తమ చింతలన్నింటినీ రూపుమాపి, తమ బ్రతుకులకు ఉత్సాహాన్ని నింపే స్వామి ‘చింతల మునిస్వామి’ అని భావిస్తూ తమ ఇంట్లో వండిన ప్రతి వంటకాన్ని ముందుగా ఆ స్వామికి నైవేధ్యంగా అందిస్తారు ఆ గ్రామస్తులు. తమ ఊరికి సమీపంలో ఉండే గంజిహళ్లి గ్రామ బడేసాహెబ్ వలి తాత పెట్టిన శాపంతో ఆ ఊరు మంచం లేని వింత ప్రపంచంగా మారింది. చిత్రం ఏమిటంటే ఏ ఇంటిలోనూ మనకు మంచమే అగుపించదు. నేలనే పాన్పుగా భావించి, నేలపై నిదురించే ఆ గ్రామవాసులు తమ ఇంటి ముందున్న సమాధులే తమకు శ్రీరామ రక్షగా భావిస్తుంటారు. స్మశానవాటిక లేని, మంచం వాడని, వింత ఆచారాలు కలిగి, సమాధులే అండదండగా భావిస్తోంది అయ్యకొండ గ్రామం. ఏడు తరాలుగా నిరంతరాయంగా, క్రమం తప్పకుండా ఈ ఆచారాలు పాటిస్తున్న ఆ గ్రామ వాసులను పలుకరిస్తే.. తాము నమ్మిన ఆచారాలను పాటించడంలోని ఒక చిత్తశుద్ధి, ఒక నియమపాలన కనిపిస్తుంది. వాటిపై ప్రత్యేక కథనం... గ్రామం గురించి.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో ఉంది అయ్యకొండ గ్రామం. కర్నూలుకు 61కిలో మీటర్లు దూరం ఉన్న ఈ గ్రామంలో 254 కుటుంబాలుండగా 1426 జనాభ ఉంటుంది. పురుషులు–768, స్త్రీలు–658 ఉన్నారు. ఊరంతా మాల దాసరి (ఒకే) కులం. గ్రామస్తులు చెప్పే చరిత్ర జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న అయ్యకొండ గ్రామంలో ‘శ్రీ చింతల మునిస్వామి’ ఆలయం ఉంది. అక్కడి పెద్దల అభిప్రాయాల ప్రకారం... మూడున్నర శతాబ్ధాల క్రితం అయ్యకొండపై (అప్పట్లో ఊరు లేదు) చింతల మునిస్వామి తాత ఉండేవారు. ఇక్కడికి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న గంజిహళ్లి గ్రామంలో పెద్ద భూస్వామి ఇంట్లో ఎల్లప్ప అనే వ్యక్తి పశువుల కాపరిగా ఉండేవారు. ఓ రోజు యజమాని ఒక ఆవును తీసుకెళ్లి తన కూతురుకు ఇచ్చిరావాల్సిందిగా ఎల్లప్పను ఆదేశించారు. దీంతో ఆవును తీసుళ్తుండగా అది తప్పించుకొని వెళ్లిపోడంతో యజమాని ఆగ్రహించి, ఆవును వెతుక్కొని తేవాలని ఆదేశిస్తారు. దీంతో ఎల్లప్ప అడవిలో వెతుక్కుంటూ కొండపైకి వెళ్తారు. అక్కడ రాళ్ల గుహలో శబ్ధం రాగా రాళ్ల చాటు నుంచి తొంగి చూస్తారు. అక్కడ కూర్చున్న చింతల మునిస్వామికి తప్పించుకుపోయిన ఆవు పితకకుండానే పాలు ఇస్తుండడం, మునిస్వామి తాత దోసిలి పట్టి పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు ఎల్లప్ప. ఇది చూసి తాత శక్తులు కలిగిన స్వామిగా భావించి భూస్వామి వద్ద పని మానేసి.. మునిస్వామి చెంతకు చేరి సేవలు చేసుకుంటూ ఉండిపోతారు. ఇళ్ల మధ్యే సమాధులు చింతల మునిస్వామి వద్ద సేవలు చేస్తూ జీవిస్తున్న ఎల్లప్ప కుమారుడు బాల మునిస్వామి చనిపోయిన తరువాత తన ఇంటి ముందే సమాధి చేస్తారు. ప్రతి శనివారం ఆ సమాధికి ఆవు పేడతో అలికి, అగరొత్తులు వెలిగించి పూజించారట. కుటుంబాలు పెరుగుతూ పోవడం, ఆయుష్షు తీరి చనిపోయిన వారిని ఇళ్ల ముందే అంత్యక్రియలు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. వండిన వంట మునిస్వామి చెంత ఆ రోజుల్లో చింతల మునిస్వామి తాత వద్ద సేవలు చేస్తూ ఉండిపోయిన ఎల్లప్ప తినడానికి సమీపంలోని గ్రామాలకు వెళ్లి అక్కడ అడిగి తెచ్చుకున్న ఆహారాన్ని ముందుగా స్వామి చెంత ఉంచి, పూజించిన తరువాతే భుజించేవారట. అన్నంతో పాటు ఏ వంట అయినా ఇలా చేసేవారట. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, వంశీయులు ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నారు. అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసాహారం, తీపి వంటలు.. ఇలా ఏ వంట వండినా ముందుగా చింతల మునిస్వామి ముందు పూజించిన తరువాతే నోటిలో పెట్టుకుంటున్నారు. అత్త ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆమెకు తెలియకుండా కోడలు చేసుకున్న వంట సైతం ఆలయంలోకి తీసుకెళ్లాలి. ఆమె వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే ఎవరితోనైనా పంపించి, పూజ చేయించిన తరువాతే తినాలి. చివరకు మద్యం, సారా, కల్లు ఇలా ఏమి తాగాలన్నా తాత ముందు పూజ చేయాల్సిందే. మంచం వాడని వింత ప్రపంచం మంచం వాడని వింత ఊరుగా అయ్యకొండకు పేరు. గంజిహళ్లి బడేసాహెబ్ తాత, చింతల మునిస్వామి తాత ఇద్దరు స్నేహితులు. గంజిహళ్లి ఉరుసుకు వెళ్లిన మునిస్వామి తన తిరుణాలకు ఆహ్వానించగా బల్లి రూపంలో వస్తారు బడేసాహెబ్ తాత. ఇది గ్రహించని మునిస్వామి తాత మంచంపై కూర్చొని ఉండి తిరుణాలకు రాలేదని బడేసాహెబ్ తాతపై కోప్పడుతారట. అప్పుడు ప్రత్యక్షమైన బడేసాహెబ్ తాత మంచంపై కూర్చున్న నువ్వు.. నేను వచ్చినా గ్రహించకుండా కోపగించుకుంటావా అని ఆగ్రహించి ‘మాల వాడికి మంచం లేదు.. నువ్వు మంచం వాడరాదని’ శపించారట. తాత మంచం వాడలేదని ఆ గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మనిషి పుట్టిన తరువాతే ఆచారాలు పుట్టాయి. అయితే వాటి ప్రభావం మనుషులపై ఎంతో ఉంటుంది. ఆనాదిగా వస్తున్న ఆచారాలు, నమ్మకాలు, సాంప్రదాయాలను మనిషి ఎంతో విశ్వాసం కలిగి ఉంటాడు అనడానికి ఇవే నిదర్శనం. ఏడు తరాలుగా ఇవే ఆచారాలు : పెద్ద రంగన్న, అయ్యకొండ. ఏడు తరాలుగా మా కులదైవం శ్రీ చింతల మునిస్వామి తాతను ఆరాధిస్తూనే వస్తున్నాం. అప్పటి నుంచి ఏ వంట చేసినా ముందుగా తాత పాదాల చెంత ఉంచి పూజ చేయనిదే నోట్లో పెట్టుకోం. తరాలు మారినా మా ఆచారాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటిని కాదనే ఇళ్లు, మనిషి మా గ్రామంలోనే లేరు. స్మశానం ఉండదు.. ఇంటి ముందు సమాదులు : చిట్టెమ్మ గ్రామానికి ప్రత్యేకంగా స్మశానం ఉండదు. ఎవరు చనిపోయినా ఇంటి ముందు లేదా పక్కన ఖాళీ స్థలంలోనే అంత్యక్రియలు జరుపుతారు. వాటి మధ్యే మా జీవనం. ప్రతి శనివారం వాటిని శుభ్రం చేసి అగరొత్తులు వెలిగించి పూజించడం తరాలుగా వస్తున్న ఆచారాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లలు సైతం వాటి మధ్యే ఆడుకోవడం చేస్తుంటారు. ఏ వంట చేసినా తాతకు ముందుగా నైవేద్యం : నాగమ్మ మా గ్రామంలో వస్తున్న ఆచారాలను ఇప్పటికీ ఎవరూ కాదని వెళ్లరు. ఏ వంట చేసినా ముందుగా చింతల మునిస్వామి తాత చెంత పెట్టాలి. అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, పిండి వంటలు, చివరకు గుడ్డుతో ఆమ్లెట్ వేసుకున్నా నైవేధ్యంగా పెట్టి పూజ చేయనిదే నోట్లో పెట్టుకోము. రోజుకు పది రకాల వంటలు, పది సార్లు వండినా తాతకు పెట్టాల్సిందే. కటిక నేలపైనే కాన్పు : శంకరమ్మ మా గ్రామంలో మంచం వాడరాదనే శాపం ఉంది. దీంతో ఊరిలోని ఏ ఇంట్లో చూసినా మంచం ఉండదు. నేలపైనే నిద్రిస్తాము. చివరకు కాన్పు జరిగినా కటిక నేలపైనే. పచ్చి బాలింత అయినా బొంత పరుచుకొని తల్లి, పిల్లలు కింద పడుకోవాలి తప్ప ఏ మంచాన్ని వాడరు. దీనిని ఎవరూ కాదనరు. -
స్కూల్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా?
స్కూల్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు చక్కటి మార్గం.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ). ఇందులో ప్రవేశం కోసం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ హాజరయ్యే ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఈ ఏడాది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్‌సెట్–2021 నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు,పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం.. తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలల్లో అందిస్తున్న రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష.. టీఎస్ ఎడ్‌సెట్–2021. ఎడ్‌సెట్‌కు గతేడాది సుమారు 31 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది రెట్టింపు దరఖాస్తులు వస్తాయని భావిస్తున్నారు. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్/పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీ ర్ణులు దరఖాస్తుకు అర్హులు. ఇంజనీరింగ్ అభ్యర్థులు సైతం బీఈడీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అర్హతలు ఆన్లైన్లో జరిగే ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని అర్హతలను నిర్దేశించింది. జూలై1 నాటికి 19ఏళ్లు నిండి, ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ..బీఏ,బీకామ్,బీఎస్సీ, బీఎస్సీ–హోమ్‌సైన్స్,బీసీఏ,బీబీఏం,బీఏ–ఓరియంటల్ లాంగ్వేజెస్,బీబీఏ లేదా మాస్టర్ డిగ్రీలో కనీసం 50శాతం మార్కులు తప్పనిసరి. బీటెక్/బీఈలో 50 శాతం మార్కులు సాధించినవారు సైతం బీఈడీ కోర్సుల్లో చేరేందుకు ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులైన ఎస్సీ/ఎస్టీ/ బీసీలతోపాటు ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు ఉన్న వారు 40శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. అర్హత కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులు సైతం ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీబీఎస్/బీఎస్సీ(ఏజీ)/బీవీఎస్సీ/ బీహెచ్‌ఎంటీ/ బీఫార్మసీ/ఎల్ఎల్బీ వంటి కోర్సుల అభ్యర్థులు బీఈడీలో చేరేందుకు అర్హులు కాదు. గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సు చదవకుండా.. పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు బీఈడీలో ప్రవేశం పొందేందుకు అనర్హులు. మెథడాలజీ–అర్హతలు మ్యాథమెటిక్స్: బీఏ/బీఎస్సీ మ్యాథమెటిక్స్, బీఈ/బీటెక్/బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివినవారు అర్హులు. ఫిజికల్ సైన్స్: బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి అనుబంధ సైన్స్ సబ్జెక్టులు చదివినవారు, ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ సబ్జెక్టులు చదివి ఇంజనీరింగ్/బీసీఏ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బయోలాజికల్ సైన్స్: బీఎస్సీ/బీఎస్సీ హోమ్ సైన్స్/బీసీఏ చేసినవారు ఇంటర్మీడియట్ స్థాయిలో బోటనీ, జువాలజీ అనుబంధ సబ్జెక్టులు చదివినవారు అర్హులు. సోషల్ సైన్సెస్: బీఏలో సోషల్ సైన్స్, బీకామ్/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్మీడియట్ స్థాయిలో సోషల్ సబ్జెక్టులు చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లిష్: బీఏ స్పెషల్ ఇంగ్లిష్/ఇంగ్లిష్ లిటరేచర్/ఎంఏ ఇంగ్లిష్ చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓరియంటల్ లాంగ్వేజెస్: బీఏ తెలుగు/హిందీ/ మరాఠి/ఉర్దూ/అరబిక్/సంస్కృతం సబ్జెక్టులు చదివినవారు, ఈ సబ్జెక్టులతో బీఏ లిటరేచర్ చేసినవారు అర్హులు. ఎడ్‌సెట్ సిలబస్ టీఎస్ ఎడ్‌సెట్–2021 పరీక్ష మొత్తం 150 మార్కులకు–150 ప్రశ్నలకు జరుగుతుంది. సబ్జెక్టు/కంటెంట్ 60 ప్రశ్నలు(మ్యాథ్స్–20, సైన్స్–20, సోషల్–20),టీచింగ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ 20 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ 30 ప్రశ్నలు, కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఎంట్రన్స్ సిలబస్.. ఆయా సబ్జెక్టుల్లో తెలంగాణలో హైస్కూల్ స్థాయిలో పదోతరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ఉంటుంది. దీంతోపాటు జనరల్ ఇంగ్లిష్, టీచింగ్ అప్టిట్యూడ్, మెథడాలజీపైనా ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టులు–సిలబస్ అంశాలు మ్యాథమెటిక్స్: నంబర్ సిస్టమ్, కమర్షియల్ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, జ్యామితి, మెన్సురేషన్, ట్రిగనోమెట్రీ, డేటా హ్యాండ్లింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. సైన్స్(ఫిజికల్/బయాలజీ): ఆహారం, జీవరా శులు, జీవ ప్రక్రియలు, జీవ వైవిధ్యం, కాలు ష్యం, పదార్థం, కాంతి, విద్యుత్ –అయస్కాంతత్వం, హీట్, ధ్వని, చలనం, వాతావరణం, కోల్ అండ్ పెట్రోల్, స్టార్స్ అండ్ సోలార్ సిస్టం, మెటలర్జీ, రసాయన చర్యలు. సోషల్ స్టడీస్: జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, క్లాస్ రూమ్ అర్థం చేసుకోవడానికి సంబంధించినవి. టీచర్–విద్యార్థి సంబంధానికి ప్రత్యేక రిఫరెన్స్, మేనేజ్మెంట్ అండ్ మెంటారింగ్. జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ దోషాలు, పదజాలం, పదబంధం రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్. జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూస్: కరెంట్ అఫైర్స్(ఇండియా అండ్ ఇంటర్నే షనల్), వర్తమాన విద్యా సంబంధ అంశాలు. కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్–ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్ అండ్ ఫండమెంటల్స్. టీఎస్ ఎడ్‌సెట్ 2021 ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: ఆలస్య రుసుం లేకుండా జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.250 ఆలస్య రుసుంతో జూన్ 25 వరకు, రూ.500 ఆలస్య రుసంతో జూలై 5 వరకు, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హాల్‌టికెట్ల డౌన్లోడ్: ఆగస్టు 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్: 2021 ఆగస్టు 24, 25 తేదీల్లో టీఎస్ఎడ్సెట్ జరుగుతుంది. పరీక్ష ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ రెండు భాషల్లో ఉంటుంది. దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.650, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.450 చెల్లించాలి. వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్: https://edcet.tsche.ac.in -
బీటెక్‌లో 50 శాతం మార్కులున్నా ప్రవేశాలకు అర్హులే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సు బీఎడ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) ప్రవేశాల విధానాన్ని ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. ఇప్పటివరకు బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారికి మాత్రమే బీఎడ్‌లో చేరే అవకాశం ఉండేది. ఇకపై వారితోపాటు కొత్త కొత్త కాంబినేషన్లతో డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా బీఎడ్ చదివే వీలు కలుగనుంది. ఇక బీఎడ్ మెథడాలజీ (సబ్జెక్టు) విషయంలోనూ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌లో ఒక్కో మెథడాలజీకి ఒక్కో ప్రశ్నపత్రం ఇచ్చి పరీక్ష నిర్వహించేవారు. కానీ ఇకపై అన్ని మెథడాలజీలకు కలిపి ఒకే పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు.. తాము డిగ్రీలో చదివిన ఏ సబ్జెక్టుకు సంబంధించిన మెథడాలజీలోనైనా అడ్మిషన్ పొందవచ్చు. ఈ మేరకు బీఎడ్ ప్రవేశపరీక్ష నిబంధనల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సోమవారం జీవో 14 జారీ చేశారు. మరోవైపు ఎడ్‌సెట్‌లో ఇప్పటివరకు ప్రామాణికంగా డిగ్రీలోని సిలబస్‌ను తీసుకొని పరీక్షను నిర్వహిస్తుండగా, ఇకపై ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకున్న సిలబస్ ఆధారంగానే ఎడ్‌సెట్‌ను నిర్వహించనుంది. 2021–22 విద్యా సంవత్సరం ప్రవేశాల్లో భాగంగా ఆగస్టులో నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్షలో, బీఎడ్ ప్రవేశాలల్లో ఈ మార్పులను అమలు చేయనున్నట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ, ఓయూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శంకర్ వివరించారు. కొత్త సబ్జెక్టుల వారికి అవకాశం కొన్ని కొత్త సబ్జెక్టులు చదివినవారు కూడా ఈసారి బీఎడ్ చదివే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఓరియంటల్ లాంగ్వేజెస్, బీబీఏ చదివినవారు డిగ్రీలో సంబంధిత సబ్జెక్టు కలిగి ఉంటే బీఎడ్ చేయొచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్ లాంగ్వేజెస్), బీబీఏ, ఎంబీఏ, బీటెక్ చేసిన వారు కూడా బీఎడ్ చదవచ్చు. అయితే సంబంధిత సబ్జెక్టుల్లో వారు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ప్రశ్నపత్రంలో మార్పులివీ.. సోషల్, సైన్స్, మేథమెటిక్స్, ఇంగ్లిషు.. ఇలా మెథడాలజీని బట్టి వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇకపై ఉండవు. అన్నింటికి ఒకే ప్రశ్నపత్రం ఇచ్చేలా ప్రభుత్వం మార్పులు చేసింది. ఏ సబ్జెక్టులో బీఎడ్ చేయాలనుకున్నా కామన్ ప్రవేశపరీక్ష రాయాలి. పదో తరగతి వరకు అన్ని ప్రధాన సబ్జెక్టులపై పట్టును పరీక్షించేలా పరీక్ష ఉంటుంది. ఇందులో గణితం, సైన్స్, సోషల్‌లో 60 ప్రశ్నలకు 60 మార్కులు, జనరల్ ఇంగ్లిషులో 20 ప్రశ్నలకు 20 మార్కులు, జనరల్ నాలెడ్జిలో 20, జీకే, ఎడ్యుకేషనల్ ఇష్యూస్‌లో 20, కంప్యూటర్ అవేర్‌నెస్‌లో 20, టీచింగ్ ఆప్టిట్యూడ్‌లో 20 ప్రశ్నలకు 20 మార్కులు ఉం టాయి. ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. అభ్యర్థులు ఇచ్చే ప్రాధాన్యాలను బట్టి సీట్‌ను కేటాయిస్తారు. మెథడాలజీ వారీగా సీట్ల విధానం మేథమెటిక్స్ వారికి 25 శాతం, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్ వారికి 30 శాతం సీట్లు (ఒక్కో దాంట్లో కనీసంగా 10 శాతం, గరిష్టంగా 20 శాతం), సోషల్ సైన్సె స్, ఇంగ్లిషు, ఓరియంటల్ లాంగ్వేజెస్ కలిపి 45 శాతం సీట్లు (ఇంగ్లిషులో కనీసం 5 శా తం, ఓరియంటల్ లాంగ్వేజెస్ వారికి కనీసం 5 శాతం ఉండాలి. ఈ 2 మెథడాలజీల్లో కలిపి 15 శాతానికి మించొద్దు) ఉంటాయి. ఇప్పటివరకు బీఎడ్ ఫిజికల్ సైన్స్ చేయాలంటే.. బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదివి ఉండాలన్న నిబంధన ఉంది. ఇప్పుడు దానిని మార్చారు. బీఎస్సీలో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును (ఏదో ఒకటి) పార్ట్–2 గ్రూపులో చదివి ఉంటే సరిపోతుంది. బీటెక్‌లో ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టును, బీసీఏ విద్యార్థులు ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉన్నా అర్హులే. బీఎడ్ బయోలాజికల్ సైన్స్ చదవాలంటే ఇప్పటివరకు డిగ్రీలో బోటనీ అండ్ జువాలజీ చదివి ఉండాలి. ఇకపై వారు బోటనీ, జువాలజీలో ఏదో ఒక సబ్జెక్టును డిగ్రీలో పార్ట్–బీ గ్రూపులో చదివి ఉన్నా సరిపోతుంది. బీసీఏ విద్యార్థులు ఇంటర్లో బయోలాజికల్ సైన్సెన్ చదివి ఉండాలి. బీఎడ్ మేథమెటిక్స్ చేయాలంటే బీఏ/బీఎస్సీలో మ్యాథ్స్ గ్రూపు సబ్జెక్టుగా ఉంటే చాలు. బీఈ/బీటెక్‌లో మ్యాథ్స్ ఉన్నవారూ అర్హులే. బీసీఏ అభ్యర్థులు ఇంటర్లో మ్యాథ్స్ చదివి ఉంటే చాలు. బీఎడ్ సోషల్ సైన్సెస్ చేయాలంటే ఇప్పటివరకు బీఏలో సోషల్ సైన్సెస్‌కు సంబంధించిన రెండు సబ్జెక్టులను చదివి ఉండాలన్న రూల్ ఉంది. ఇప్పుడు బీకాం/బీబీఎం/బీబీఏ/బీసీఏ అభ్యర్థులు ఇంటర్లో సోషల్ సైన్స్ చదివి ఉంటే సరిపోతుంది. బీఎడ్ ఇంగ్లిషు చేయాలనుకునే వారు బీఏలో స్పెషల్ ఇంగ్లిషు లేదా ఇంగ్లిష్ లిటరేచర్ లేదా ఎంఏ ఇంగ్లిషు చదివి ఉంటే చాలు. ఓరియంటల్ లాంగ్వేజెస్‌లో బీఎడ్ చేయాలనుకుంటే.. బీఏలో తెలుగు/హిందీ/మరాఠీ/ఉర్దూ/అరబిక్/సంస్కృతంను ఒక ఆప్షనల్‌గా చదివి ఉంటే సరిపోతుంది. లిటరేచర్ అభ్యర్థులు (బీఏ–ఎల్) తెలుగు/హిందీ/ మరాఠీ/ఉర్దూ/ అరబిక్/ సంస్కృతం చదివి ఉంటే చాలు. బీఏ ఓరియెంటల్ లాంగ్వేజెస్ వారు తెలుగు/హిందీ/ మరాఠీ/ఉర్దూ/అరబిక్/ సంస్కృతం చేసి ఉండాలి. తెలుగు/హిందీ/ మరాఠీ/ఉర్దూ/ అరబిక్/సంస్కృతంలో పీజీ చేసిన వారు బీఎడ్ ఓరియెంటల్ లాంగ్వేజెస్ చేయొచ్చు. -
కాలేజ్‌కు వెళ్తుండగా.. తండ్రి కళ్లెదుటే ఘోరం
గోపాలపట్నం (విశాఖ పశ్చి): బీఈడీలో చేరేందుకు తండ్రితో ద్విచక్రవాహనంపై వెళ్తున్న కుమార్తెను మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. కళ్లెదుటే చోటుచేసుకున్న ఈ ఘోరాన్ని చూసి ఆ తండ్రి షాక్‌కు గురయ్యాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆదివారం ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గాజువాక భవానీనగర్‌కు చెందిన సమ్మిడి గీతాకుమారి (21) బీఈడీలో చేరేందుకు తండ్రి వెంకటరావుతో ద్విచక్రవాహనంపై ఎంవీపీ కాలనీకి బయలుదేరింది. ఎన్ఏడీ జంక్షన్ సమీపంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దాటిన తరువాత వెనుకనుంచి వస్తున్న ప్రైవేటు బస్సు వీరి బైక్‌ను ఢీకొట్టడంతో అదుపు తప్పింది. వెనుక కూర్చున్న గీతా కుమారి కుడివైపుగా బస్సు వెనుక చక్రాల కింద పడిపోయింది. ఆమె నడుమ మీదుగా బస్సు వెళ్లిపోవడమే కాకుండా కొంతదూరం ఈడ్చుకుపోయింది. కడుపు భాగమంతా తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ప్రైవేటు వాహనంలో కేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం కేజీహెచ్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కడుపు భాగంలో అధిక రక్తస్రావం కావడంతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. వెంకటరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. గుండెలవిసేలా రోదన గీతా కుమారికి అన్న, తమ్ముడు ఉన్నారు. ఇంటికి ఒక్క ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా పెరిగింది. మా ఇంటి మహాలక్ష్మి కోల్పోయామని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బీఈడీ కోర్సులో చేరేందుకు థంబ్ వేసేందుకు ఎంవీపీ కాలనీకి వెళ్తుండగా యువతి ప్రమాదానికి గురైంది. -
మృత్యుభూతం
ఆ రైతు, అతనితోపాటు ఒక డాక్టరు.. చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ ముసలామె మంచం ఎదురుగా నిలబడ్డారు. ఆమె స్తబ్దుగా వుంది. అన్నీ వదిలేసినట్లు స్థిరంగా ఆ ఇద్దరి సంభాషణ వింటూ, వాళ్ళనే చూస్తూ వుంది. ఆమె చావడానికి సిద్ధంగా వుంది. వచ్చే చావుని ఎదిరించాలన్న కోరిక ఆమెలో లేదు. తొంభై రెండేళ్ళ వయసు అంటే అదే చివరి అంకం అని ఆమెకి తెలుసు.జ్యేష్ఠ మాసపు సూర్యుడు కిటికీలోనుంచి, తెరిచివుంచిన తలుపులోనుంచి మంటపుట్టించే వేడి కిరణాలను ప్రసరిస్తున్నాడు. అవి బురదమట్టితో అలికిన ఇంటి నేలపైన అడ్డదిడ్డంగా పడుతున్నాయి. నాలుగు తరాల మోటు మనుషులు వేసిన అడుగుల కింద నలిగిన నేల అది. ఎండతో పాటు వచ్చిన సన్నటి గాలులు పొలాల వాసనను వెంటబెట్టుకొస్తున్నాయి. డాక్టరు గొంతుపెగిల్చి కాస్త గట్టిగానే మాట్లాడటం మొదలుపెట్టాడు – ‘‘హోన్రే! మీ అమ్మ పరిస్థితి ఇలా వున్నప్పుడు నువ్వు ఆమెను వదిలి పెట్టడం మంచిది కాదు. ఆమె ఏ క్షణంలోనైనా ప్రాణాలు వదలచ్చు’’. రైతు చాలా బాధపడి సమాధానం ఇచ్చాడు – ‘‘కానీ పొలం నుంచి గోధుమలు తెచ్చుకోవాలి. కుప్పలూడ్చి అలాగే వదిలేసి చాలా రోజులైంది. వాతావరణం కూడా అనుకూలంగా వుంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తెచ్చుకోగలను. ఏమంటావు అమ్మా?’’ అన్నాడు. మరణశయ్య మీద వున్న ఆమె, కొడుకు లోభత్వానికి బాధపడ్డా, సరే అన్నట్లు కళ్ళతో, ముఖకవళికలతో చెప్పింది. కొడుకు గోధుమలుతెచ్చుకోడానికి వెళ్తే, ఒంటరిగా ప్రాణం వదలడానికి సిద్ధపడ్డట్టుగా వున్నదా సమాధానం.కానీ డాక్టరు కోపం నషాళాన్ని తాకింది. ‘‘నీ అంత దుర్మార్గుడు వుంటాడా? నేను నిన్ను అడుగు కూడా బయటపెట్టనివ్వను. అర్థమయిందా? కాదూ కూడదూ వెళ్ళాల్సిందే అంటే వెళ్ళే ముందు నర్స్ రాపేని తీసుకురా. ఆమెకు నీ తల్లిని దగ్గరుండి చూసుకోమని చెప్పి అప్పుడు కదులు. నా మాట వింటావా లేదా? నీకు మాత్రం ఇలాంటి పరిస్థితి రాదా? అప్పుడు కుక్కకన్నా హీనంగా చస్తావు. వింటున్నావా?’’సన్నటి పొడుగాటి ఆ రైతు చిన్న చిన్న అడుగులు వేస్తూ వెనకాముందు ఆడాడు. నిర్ణయం తీసుకోలేక తర్జనభర్జనపడ్డాడు. ఓ పక్క డాక్టరు అంటే భయం. మరో పక్క డబ్బులు వృధా అయిపోయే పరిస్థితి. స్వతహాగా రూపాయి రూపాయి కూడబెట్టడాన్ని ఎంతో ఇష్టపడే పొదుపరి. వెనుకాడాడు. లెక్కలు కట్టాడు.తడబడుతూ మాట్లాడాడు – ‘‘ఆమె ఎంత తీసుకుంటుంది?’’ అన్నాడు.‘‘నాకేం తెలుసు? ఆమెతోనే మాట్లాడుకో! కానీ చెప్తున్నా. గంటలో ఆమె ఇక్కడుండాలి.’’రైతు ఒక నిర్ణయానికి వచ్చాడు.‘‘కోప్పడకండి డాక్టరుగారూ. నేనే వెళ్ళి తీసుకొస్తాలెండి.’’ అన్నాడు. డాక్టరు వెళ్ళిపోయాక రైతు తన తల్లి వైపు తిరిగి తప్పదని ధ్వనిస్తున్న గొంతుతో – ‘‘నేను వెళ్ళి రాపేని పిల్చుకొస్తాను. ఖంగారు పడకు’’ అని బయల్దేరాడు.లా రాపే ముసల్ది. బట్టలు వుతకడం ఆమె వృత్తి. ఆ చుట్టుపక్కల ఎంతో మంది చావుల్ని చూసింది. వాళ్ళు చనిపోతుండగా చూసింది. తెల్లటి గుడ్డలో వాళ్ళను చుట్టిపెట్టి, తిరిగిరాని లోకాలకు పంపించేదాకా వెంటే వుంది. అది అయిపోగానే బతికున్నవాళ్ళ గుడ్డల్ని ఇస్త్రీ చేసే పని చేసుకునేది.ఆమె ఎవరిమీదో విరోధమున్నట్లు, ఇంకెవరినో చూసి అసూయపడుతున్నట్లు వుంటుంది. డబ్బు ఆశ. చనిపోయేవాళ్ళ యాతన చూడటం అంటే ఆమెకు ఒక పైశాచిక ఆనందం వున్నట్లు అందరూ అనుకుంటారు. హాన్రే బాన్టెంప్స్ ఆమె ఇంట్లో అడుగుపెట్టేసరికి ఆమె బట్టలకోసం గంజి తయారుచేస్తూ వుంది. ‘‘ఏమ్మా రాపే? ఏంటి విశేషాలు?’’ అన్నాడు పలకరిస్తూ. ఆమె తల వెనక్కి తిప్పి అతన్ని చూసింది.‘‘ఏముంటాయి. అంతా మాములే. నీ సంగతులు చెప్పు’’ అంది. ‘‘నేనా? నాకేం? నేను బాగానే వున్నాను. మా అమ్మ ఆరోగ్యమే సరిగాలేదు’’‘‘మీ అమ్మా?’’‘‘అవును మా అమ్మే’’‘‘ఏమైందామెకి?’’ ‘‘ఏముంది. అంతా అయిపోయింది. చావడానికి సిద్ధంగా వుంది’’ ‘‘అయ్యో మరీ అంత దారుణంగా వుందా?’’ ముసలామె గంజి కలుపుతున్న నీటిలో నుంచి చేతులు బయటికి తీసి జాలిగా అడిగింది. ‘‘డాక్టరు రేపు వుదయం దాకా కూడా వుండదేమో అన్నాడు’’‘‘అయ్యో! అయితే పరిస్థితి అసలు బాలేదన్నమాట’’హాన్రే కాస్సేపు తటపటాయించాడు. కాసేపటికి విషయంలోకి రాక తప్పలేదు. ‘‘ఆమె వెళ్ళిపోయేదాకా ఆమెతో వుండాలి. ఎంత తీసుకుంటావు? నేనేం డబ్బులున్నవాణ్ణి కాదు. కనీసం పనిమనిషిని పెట్టుకునే స్థోమత కూడా లేదు. అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం కూడా అదే!’’.అవన్నీ పట్టనట్లు అతనివైపు చూసింది రాపే. ‘‘రెండు రేట్లు వున్నాయి. పగటిపూట నలభై సౌలు, రాత్రికి మూడు ఫ్రాంకులు. ఈ రేటు డబ్బు వున్నవాళ్ళకి. ఇరవై సౌలు పగటికి, నలభై రాత్రికి ఇది మిగతావాళ్ళకి రేటు. నువ్వు కూడా ఇరవై, నలభై ఇవ్వు’’ అంది.రైతు ఆలోచించాడు. తన తల్లి గురించి తనకు బాగా తెలుసు. ఆమె పట్టు పట్టిందంటే వదిలే రకం కాదు. ఎప్పుడూ తలవంచిన ఘటం కాదు.డాక్టర్లు ఎన్ని చెప్పినాకనీసం ఇంకో వారం బండి లాగేయ్యగలదు. ఇదంతా ఆలోచించుకోని అతను ఆమెతో కొత్త ప్రతిపాదన పెట్టాడు. ‘‘అలా కాదు. నువ్వు ఆమె చనిపోయేదాకా ఆమెకు సేవ చెయ్యాలి.మొత్తానికి కలిపి ఇప్పుడే ఒక రేటు అనేసుకుందాం. ఎలా జరిగినా సరే! డాక్టర్లేమో ఇవాళో రేపో అంటున్నారు. అలా జరిగితే నీకే లాభం, నాకు నష్టం. అలా కాకుండా ఆమె తట్టుకోని నిలబడిందనుకో నీకు నష్టం, నాకు లాభం.’’నర్స్ ఆ మనిషి వైపు ఆశ్చర్యంగా చూసింది. చావుతో పందేలు వేయడం ఆమెకు కొత్త. అంచేత కాస్త తటపటాయించింది. నాలుగు డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం వుందని అనిపించింది. ఇంతలో వచ్చినవాడు ఏదైనా మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు అనుకుంది. ‘‘మీ అమ్మను చూస్తేగానీ నేను ఏ విషయం చెప్పలేను’’ అంది. వెంటనే చేతులు కడుక్కొని, అతని వెంటే బయల్దేరింది. దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇద్దరూ. ఇంటికి చేరుకున్నాక హోన్రే సన్నగా గొణిగాడు – ‘‘ఈపాటికే అంతా అయి పోయిందేమో’’. అలా జరిగి వుంటే బాగుండు నన్న కోరిక అతని గొంతులో అస్పష్టంగా వినిపించింది.లోపల ముసలామె బతికేవుంది. ఆ దరిద్రపు మంచం మీద అలాగే వెల్లకిలా పడుకొని వుంది. దాదాపు నూరు సంవత్సరాల జీవితంలో ఆమె సాధించినవాటన్నింటికీ ఇప్పుడు అలిసిపోయినట్లు పడివుంది. రాపే మంచం దగ్గరకు వెళ్ళి చావటానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసింది. ఆమె నాడి పరిశీలించి, గుండె పైన చిన్నగా తట్టింది. ఆమె శ్వాస విని, కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాలని ప్రయత్నించింది. అలా కొంతసేపు పరిశీలించిన తరువాత ఆ గదిలో నుంచి బయటకు నడిచింది. ఆమె వెంటే అతను కూడా కదిలాడు. ఆ ముసలామెకి ఆ రాత్రి గడిస్తే గొప్ప అని అనుకుంది రాపే.‘‘ఏమంటారు’’ అడిగాడతను. ‘‘బహుశా రెండురోజులు వుంటుందేమో! మహా అయితే మూడు అంతే. నాకు మొత్తం అన్నీ కలిపి ఆరు ఫ్రాంకులు ఇవ్వు చాలు’’ అంది. ‘‘ఆరు ఫ్రాంకులా? ఆరు ఫ్రాంకులు!’’ అంటూ అరవడం మొదలుపెట్టాడు. ‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చెప్తున్నాను కదా! ఆమె ఓ ఐదారు గంటలకన్నా బతకదని.’’ఇద్దరి మధ్యా తీవ్రమైన వాదన జరిగింది. ఆమె ఇంటికి వెళ్ళాలి కాబట్టి త్వరగా తేల్చమంది.ఇతనికి కూడా పొలానికి వెళ్ళకపోతే గోధుమల పనికాదని తెలుసు. చివరికి ఆమె చెప్పిన రేటుకే అంగీకరించాడు. అతను అంగలు వేసుకుంటూ ఎండకు గోధుమలు ఆరబెట్టిన పొలానికి వెళ్ళిపోయాడు. ఆమె ఇంట్లోకి నడిచింది. ఆమె ఎప్పుడూ తనతో పాటు ఏదో ఒక పని తెచ్చుకుంటుంది. చనిపోతున్నవాళ్ళ పక్కనే తనపని కూడా చేసుకుంటూ కూర్చుంటుంది. ఒకసారి తన పని చేసుకుంటే, ఒకసారి తనని నియమించుకున్న కుటుంబానికి పని చేసేది. ఒకసారి పనికి కుదిరాక ఎంత పనైనా చేసేస్తుంది.ఉన్నట్టుండి ఆమెకు ఏదో జ్ఞాపకం వచ్చింది.‘‘నీ గొంతులో ఎవరైనా కాసిని పవిత్రజలం పోశారామ్మా?’’ అంది.ముసలామె లేదన్నట్లు తలాడించింది. రాపే కాస్త భయం భక్తి వున్న మనిషే. అందుకే ఆ సమాధానం విని వెంటనే లేచి నిలబడింది. ‘‘భగవంతుడా! అలా ఎలా జరిగింది. వుండు నేను ఇప్పుడే వెళ్ళి నీకు పవిత్రజలం పోసే ఏర్పాటు చేస్తాను’’ అంటూ పాస్టరు ఇంటికి పరుగులుపెట్టింది. ఆమె ఉరుకులు చూసి వీధుల్లో వుండే జులాయివాళ్ళంతా ఏదో ప్రమాదం జరిగిందేమో అనుకున్నారు.ఫాదరు వెంటనే తన తెల్లగౌను వేసుకొని ఆమె వెంట బయల్దేరాడు. అతనితో పాటే చర్చిలో కాయిర్ నిర్వహించే బృందంలో పిల్లవాడు కూడా వచ్చాడు. వీళ్ళంతా ఇలా నడుస్తుంటే హోన్రే దూరం నుంచి చూసి, ‘‘పాస్టరుగారు ఎక్కడికి వెళ్తున్నారో’’ అన్నాడు. అతనికన్నా తెలివైన మరో మనిషి సమాధానమిచ్చాడు – ‘‘ఇంకెక్కడికీ! అదిగో ఆయన మీ అమ్మకోసమే పవిత్రజలం తీసుకెళ్తున్నాడు’’. హోన్రే ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. పైగా ‘‘అంతే అయ్యుంటుందిలే’’ అని తన పనిలో నిమగ్నమైపోయాడు.అతని తల్లి పాస్టరు ముందు తన తప్పులన్నీ చెప్పి క్షమాపణలు అడిగింది. స్వచ్ఛతను, శాంతిని పొందింది. ఆ తరువాత పాస్టరు వెళ్ళిపోయాడు. ఇరుకు గదిలో ఇద్దరే మిగిలారు. చావడానికి సిద్ధంగా వున్న ముసలామెను చూసి ఇంకా ఎంతకాలం ఇలా ఆయిష్షుని సాగదీస్తుందో అని ఆలోచిస్తోంది రాపే. కృష్ణపక్ష రోజులు కావటంతో గాలులు వీచడం మొదలైంది. గోడకు వేలాడదీసిన కేలండర్ టపటపమని కొట్టుకుంటోంది. ఒకప్పుడు తెల్లగా వుండి ఇప్పుడు పచ్చగా మారిన కర్టెన్లు గాలికి ముసలి ప్రాణంలాగే ఎగిరిపోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి.మంచంలో కదలకుండా, కళ్ళు మాత్రం తెరిచి మనసులో ఏ భావం లేకుండా చావుకోసం ఆమె ఎదురుచూస్తున్నట్లుంది. వచ్చినట్లే వచ్చి రాకుండాపోతున్న మృత్యువు ఆమెతో ఆటలాడుతోంది. భారంగా తీస్తున్న ఊపిరి ఆమె నోటినుంచి సన్నటి ఈలలా వస్తోంది. ఆ శబ్దం ఏ క్షణంలోనైనా ఆగిపోతుంది. ఈ భూమి మీద మరో ఆడమనిషి తగ్గిపోతుంది. అలా జరిగినా ఎవరికీ పెద్ద బాధ కలిగేలా లేదు. పొద్దుగుంకుతుండగా హాన్రే తిరిగి వచ్చి నేరుగా ఆమె మంచం దగ్గరకు వెళ్ళి ఆమె ఇంకా ప్రాణాలతోనే వుందని తెలుసుకున్నాడు.‘‘ఎలా వుంది’’ అన్నాడు అక్కడికి ఆమెకి ఏదో తగ్గిపోయే అనారోగ్యం వున్నట్లు. ఆ తరువాత రాపేని వెళ్ళిపొమ్మని చెప్పాడు. ‘‘రేపు ఉదయం ఐదుగంటలకి వచ్చేసెయ్’’ అన్నాడు.‘‘అలాగే. ఐదుకే వస్తాను’’ అన్నదామె.తెల్లవారుతుండగా ఆమె ఆ ఇంటికి వచ్చేసరికి హాన్రే సూప్ తయారు చేసుకొని తాగుతూ కనిపించాడు.‘‘మీ అమ్మ చనిపోయిందా లేదా?’’ అడిగిందామె.‘‘లేదు. కాస్త కుదుటపడినట్లు వుంది’’ అంటూ సమాధానం చెప్పాడు. అలా చెప్తున్నప్పుడు రాపే వైపు కనుచివర్ల నుంచి దొంగచూపు చూశాడు. ఆ తరువాత లేచి పనికి వెళ్ళిపోయాడు. రాపే ఆందోళనగా చావుబతుకుల్లో వున్న ముసలామె దగ్గరకు వెళ్ళింది. ఆమె అలాగే వుంది. కదలకుండా కళ్ళు మాత్రం తెరిచి, చేతులతో మంచాన్ని బలంగా పట్టుకొని వుంది. ఇది ఇలాగే సాగితే ఆమె ఇంకో రెండు రోజులో, నాలుగు రోజులో బతకచ్చు. ఎనిమిది రోజులు కూడా పట్టచ్చు. అసలే అత్యాశ వున్న ఆమెకు మోసపోయానేమోనన్న భయం కలిగింది. జిత్తులమారి రైతుమీద, చావడానికి సిద్ధంగా లేని అతని తల్లిపైనా చాలా కోపం వచ్చింది.అయినా సరే ఆమె తన పని మానుకోలేదు. అన్ని సేవలు చేసి ముడతలు పడ్డ ముసలామె ముఖాన్నే చూస్తూ ఎదురుచూసింది. కాస్సేపటికి టిఫిన్ చెయ్యడానికి తిరిగివచ్చిన హాన్రే సంతోషంగానూ, తృప్తిగానూ వున్నట్లు ప్రవర్తించాడు. కాస్త పరిహాసంతో కూడిన చణుకులు విసిరాడు.అతని గోధుమపంట సకాలంలో చేతికి వచ్చిన ఆనందం అతని మాటల్లో వుంది. రాపేలో అసహనం పెరిగిపోయింది. గడుస్తున్న ప్రతి నిమిషం ఆమె నుంచి సమయాన్ని, డబ్బుని దొంగిలిస్తున్నట్లుగా అనిపించసాగింది. ఆమెలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఈ రోగిష్టిదాన్ని, దిక్కుమాలిన పక్షిని, లేకుండా చేస్తే? తన డబ్బుని తనకి కాకుండా చేస్తున్న ఆ ఎగశ్వాసని అసలు లేకుండా చేస్తే? ఆమె గొంతుని నులిమేస్తే? అంతలోనే అలా చేయడంలో వున్న సమస్యలను తలచుకుంది. మరో రకంగా పథకం వెయ్యసాగింది. మంచం దగ్గరగా వెళ్ళి –‘‘మీరెప్పుడైనా మృత్యుభూతాన్ని చూశారా?’’ అంది.‘‘లేదు’’ అని ముసలామె సమాధానం చెప్పింది. ఇక అక్కడ్నుంచి నర్స్ ఆమెకు మృత్యుభూతం గురించి భయపెట్టేలా చెప్పడం మొదలుపెట్టింది. చావుబతుకుల్లో వున్న ముసలామె బలహీనమైన మనసును భయంతో వణికించేసింది. చావడానికి కొన్ని నిమిషాల ముందు ఓ భూతం కనిపిస్తుందనీ, మరణయాతన నుంచి ఆ భూతం విముక్తిని ఇస్తుందని చెప్పింది. ఆ భూతం చేతిలో ఓ చీపురు వుంటుందనీ, తలపైన కవచం వుంటుందనీ, భయంకరమైన అరుపులు అరుస్తుందని చెప్పింది.‘‘ఒక్కసారి ఆ మృత్యుభూతాన్ని చూస్తే ఇక అంతా అయిపోయినట్లే. కొన్ని నెలల ఆయుష్షు వున్నవాళ్ళు కూడా ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తారు’’ అంటూ తన అనుభవంలో చివరి క్షణాలలో భూతాన్ని చూసిన వాళ్ళు అంటూ చాలామంది పేర్లు చెప్పింది.ముసలామెకి అదంతా విని భయంగానూ, ఇబ్బందిగానూ అనిపించింది. అసహనంగా కదిలి అతి కష్టం మీద తలని రెండో వైపుకు తిప్పుకుంది. అదే అదనుగా రాపే అక్కడ్నుంచి తప్పుకుంది. కబోర్డ్ దగ్గర వున్న ఓ పెద్ద గుడ్డని తీసి తన చుట్టూ చుట్టుకుంది. ఇనుప మూకుడు ఒకటి తీసుకుని తలపైన బోర్లించుకుంది. దాని కాడలు కొమ్ముల్లా కనపడేట్లు పెట్టుకుంది. ఒక చేతిలో చీపురు తీసుకుని, మరో చేతితో ఇంకో గిన్నని పట్టుకుంది. ఉన్నట్టుండి ఆ గిన్నెని నేల మీదకు విసిరికొట్టింది.అది నేల తాకుతూనే పెద్ద శబ్దం చేసింది. ఆ తరువాత ఆమె కుర్చీ పైకి ఎక్కి, మంచానికి కట్టిన తెరని కిందనుంచి పైకి ఎత్తి ఒక్కసారిగా తన ముఖాన్ని ముసలామెకు చూపించింది. చేతులు భయం కలిగించేలా తిప్పుతూ, కీచు గొంతుతో గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ముఖం కనపడకుండా కప్పుకున్న మూకుడులో ఆ అరుపులు ప్రతిధ్వనించి ఇంకా భయంకరంగా వినపడసాగాయి. భయంతో బిక్కచచ్చిన ముసలామెని చీపురుతో తడుతూ ఇంకా బెదరకొట్టింది. అదిరిపోయిందామె. ఆమె ముఖం పిచ్చిపట్టినట్లుగా మారిపోయింది. చావడానికి సిద్ధంగా వున్న ఆమెలో ఏదో చిత్రమైన శక్తి ప్రవేశించినట్లు బలమంతా కూడదీసుకొని లేచి పారిపోవాలని ప్రయత్నం చేసింది.భుజాలు, సగం శరీరం పైకి లేపింది కూడా. అంతే! ఒక్కసారి గట్టిగా నిట్టూరుస్తూ వెనక్కిపడిపోయింది. అయిపోయింది.రాపే ఏమీ ఎరగనట్లు ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసింది. చీపురు మూల పెట్టేసింది, కప్పుకున్న గుడ్డ మళ్ళీ కబోర్డ్‌లో పెట్టేసింది. మూకుడు, గిన్నెలను గట్టుపైన, కుర్చీని గోడవారగా సర్దేసింది. ఆ తరువాత అనుభవం నేర్పిన చాకచక్యంతో చనిపోయిన ముసలామె పెద్ద కళ్ళను మూసేసింది. ఓ ప్లేటు మంచం మీద పెట్టి అందులో కాసింత పవిత్రజలం పోసింది. ఆ తరువాత మంచం పక్కనే మోకరిల్లి, ఎంతో కాలంగా చదివి చదివి నోటికి వచ్చేసిన ప్రార్థనలన్నీ చదివింది.హాన్రే సాయంత్రం తిరిగి వచ్చేసరికి ప్రార్థనలు చేస్తున్న రాపేను చూశాడు. వెంటనే లెక్కలు వేసి ఆమెకు ఇరవై సౌలు లాభం వచ్చిందని గుర్తించాడు. ఆమె గడిపిన రెండు రోజులు, ఒక రాత్రికి అయిదు ఫ్రాంకులే అయ్యేది కానీ ఒప్పందం ప్రకారం ఆరు ఫ్రాంకులు ఇవ్వాల్సివస్తోందని నష్టం లెక్క వేసుకున్నాడు. ఫ్రెంచి మూలం : గి ది మొపాసా అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్ -
స్పెషల్ డీఎస్సీ కోసం ఆందోళన
పాడేరు రూరల్: ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరుకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. టెట్ క్వాలీఫైడ్ డీఎడ్ అభ్యర్థులు బుధవారం పాడేరులో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడారు. బీఎడ్ చది విన వారికి కూడా ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పి స్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని, స్పెషల్ డీఎస్సీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డీఎడ్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ఇన్చార్జీ పీవో డీకే బాలాజీకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు కె.వై.కుమార్, కార్యదర్శి టి.విజయ్‌కుమార్, నాయకులు కె.కుస్టో, సోమేష్, డి.ధనురాష్, శ్యామ్యుల్, ఏజెన్సీ 11 మండలాల నుంచి డీఎడ్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
బీఈడీ అభ్యర్థులకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులకు మళ్లీ ఎస్జీటీ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు ఎస్జీటీ పోస్టులకూ అర్హులు కానున్నారు. అయితే ఒకటి నుంచి 5వ తరగతి వరకూ బోధించేందుకు టీచర్‌గా ఎంపికయ్యే బీఎడ్ అభ్యర్థి తాను నియామకం అయిన తేదీ నుంచి రెండేళ్లలోగా తాము గుర్తించిన విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ఎన్సీటీఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. బీఎడ్‌లో చైల్డ్ సైకాలజీ లేదని, చిన్న పిల్లలకు వారు బోధించేందుకు అర్హులు కాదని, 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఎస్జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థులే అర్హులంటూ 2008లో డీఎడ్ అభ్యర్థుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. వాదోపవాదాల తర్వాత 2010లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని, బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ వారు అర్హులు కాదని 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో చేపట్టిన నియామకాల్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను తీసుకోలేదు. వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తూ వచ్చాయి. బీఎడ్ అభ్యర్థుల అభ్యర్థనతో.. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, చైల్డ్ సైకాలజీ సబ్జెక్టును ప్రత్యేకంగా చదువుకుంటామని అనేకసార్లు బీఎడ్ అభ్యర్థులు ఎన్సీటీఈని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసిన వారు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు అర్హులేనని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్జీటీగా నియమితులైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఎలిమెంటరీ విద్యలో బ్రిడ్జి కోర్సు లేదు. దానిని ఎన్సీటీఈ ప్రవేశ పెడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు డీఎడ్ అభ్యర్థులకు ఇప్పటివరకు ఎస్జీటీ పోస్టుల్లో ఉన్న పూర్తి అవకాశం తగ్గిపోనుంది. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఇద్దరికి వాటిల్లో అవకాశం ఉండనుంది. మళ్లీ పూర్వవైభవం వస్తుందా? ఒకప్పుడు ఏడాది కోర్సుగానే ఉన్న బీఎడ్‌ను ఎన్సీటీఈ 2014లో రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడం, బీఎడ్ వారికి ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం తొలగించడంతో బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోయింది. గతంలో బీఎడ్‌లో చేరేందుకు ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018–19లో బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌కు 38 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్సీటీఈ తాజా నిర్ణయంతో బీఎడ్‌కు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని, ప్రైవేటు పాఠశాలల్లోనూ అవకాశాలు విస్తృతం అవుతాయని అధికారులు చెబుతున్నారు. -
15లోపు..దరఖాస్తు చేసుకోండి...
రాజంపేట టౌన్ : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (ఏఓయూ) ద్వారా బీఈడీ అభ్యసించే విద్యార్థులు మే 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎల్.విజయకృష్ణారెడ్డి (ఎల్వీకే) తెలిపారు. స్థానిక అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో శుక్రవారం ఎల్వీకే విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదువందల బీఈడీ సీట్లు ఉన్నాయన్నారు. అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్‌లో మరో ఐదువందల సీట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసేందుకు ఓసీ విద్యార్థులు డిగ్రీలో యాబైశాతం మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర రిజర్వేషన్ కలిగిన విద్యార్థులు డిగ్రీలో 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ప్రవేశ పరీక్ష ఈ ఏడాది జూన్ 6వ తేదీ అన్ని జిల్లా కేంద్రాల్లో జరుగుతుందన్నారు. బీఈడీలో ప్రవేశం పొందే విద్యార్థులు నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎన్సీటీఈ) గుర్తింపు పొందిన డీఎడ్, టీటీసీ, ఈఎల్‌ఈడీ, తెలుగుపండిట్, హిందీపండిట్ వంటి డిప్లొమా కోర్సులను పూర్తి చేసి ఉండాలని తెలిపారు. ఎన్సీఈటీ గుర్తింపు పొందిన డిప్లొమా సర్టిఫికెట్లు లేని వారు బీఈడీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నా అడ్మిషన్ పొందేందుకు అనర్హులన్నారు. బీఈడీ స్పెషల్æ ఎడ్యుకేషన్‌లో చేరే విద్యార్థులు 50 శాతం మార్కులతో డిగ్రీ పాసై ఉంటే చాలన్నారు. అయితే ప్రవేశ పరీక్షలో ర్యాంకు తప్పని సరి అన్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు సెమిస్టర్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో అంగవైకల్యం ఉన్నవారికి, అంగవైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ ఏడాది ఆగస్టులో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఎల్వీకే తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
7 నుంచి బీఈడీ దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య బీఈడీ పరీక్షలు ఈ నెల 7 నుంచి జరగనున్నాయి.ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించారు. 7వ తేదీన ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, 8న సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లర్నింగ్, 9 స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, 10న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్, 11 ,12, 13 తేదీల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన మెథడ్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. -
బీఈడీ కళాశాలలో వివాహిత ఆత్మహత్య
పుట్టపర్తి అర్బన్ : అమడగూరు మండలం కంచరవాండ్లపల్లికి చెందిన కిష్టప్ప భార్య జూటూరు కళావతి(26 పుట్టపర్తి మండలం వెంకటగారిపల్లి సమీపంలోని విజ్ఙాన్ బీఈడీ కళాశాలలో శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధనుంజయ తెలిపారు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తలిద్దరూ బీఈడీ కళాశాలలో చేరి స్వీపర్లుగా పని చేసుకుంటూ జీవనం సాగించేవారన్నారు. వారికి ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారన్నారు. అయితే కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న కళావతి జీవితంపై విరక్తితో ఫ్యాన్‌కు ఉరేసుకుని అఘాయిత్యానికి ఒడిగట్టిందని చెప్పారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
బంక్ బెడ్స్‌తో హుషారు
సాక్షి, హైదరాబాద్: తల్లిదండ్రులకు తమ పిల్లలే లోకం. అందుకే ఇంటి ఎంపికలో, అందులోని ఫర్నీచర్ విషయంలోనూ పిల్లల ఆసక్తి, అభిరుచులను కాదనట్లేదు. ఈమధ్య కాలంలో నగరంలో బంకు బెడ్స హల్చల్ చేస్తున్నారుు. చిన్నారులూ వాటిని ఇష్టపడుతుండటంతో వీటికి గిరాకీ పెరుగుతోంది. ఒక బెడ్ మీద మరొక బెడ్ ఉండటమే ఈ బంక్ బెడ్ ప్రత్యేకత. పెద్దలను విసిగించకుండా పడుకునేందుకు ఈ బెడ్స తోడ్పడుతుండటంతో వీటిని కొనేందుకు తల్లిదండ్రులూ వెనకాడట్లేదు. ఇద్దరు పిల్లలున్న ఇళ్లలో వీటి పాత్ర కాసింత ఎక్కువేనని చెప్పాలి. ఇద్దరికి అతికినట్లు సరిపోయేలా గదిని డిజైన్ చేయటం వల్ల బోలెడు ప్రయోజనాలున్నారుు. ఇద్దరి పిల్లలో ప్రేమానురాగాలు పెరుగుతారుు. ఒకరికొకరు సాయం చేసుకుంటారు. మేమిద్దరం ఒకటేనన్న ఆలోచన వస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. బోలెడు రకాలు.. బంకు బెడ్లలో రకాలకు కొదవేం లేదు. మెట్లు ఉండే ట్విన్ ఓవర్ ట్విన్, ట్విన్ ఓవర్ ఫుల్, మినీ లాఫ్ట్, ఫుల్ ఓవర్ ఫుల్, లాఫ్ట్ కమ్ స్టోరేజ్ బెడ్.. ఇలా రకరకాలున్నారుు. వీటిని ఏర్పాటు చేయడానికి గది విస్తీర్ణం పెద్దగా ఉండాల్సిన అవసరమేమీ లేదు. కనీసం 10/8 చ.అ. గది సైజుంటే చాలు. ⇔ ట్విన్ ఓవర్ బెడ్ల ప్రత్యేకత ఏంటంటే.. చిన్నారులు పెద్దయ్యాక కూడా వీటిని వ్యక్తిగత బెడ్‌గా వినియోగించుకోవచ్చు. టేకుతో తయారయ్యే రకం ధర రూ.30 వేల నుంచి ప్రారంభమవుతుంది. అదే రంగుల్లో కావాలంటే కాసింత ధరెక్కువ. ⇔ ట్విన్ ఓవర్ ఫుల్ రకం 3-6 ఏళ్ల చిన్నారులకు చక్కగా నప్పుతారుు. పైన బెడ్ మూడడుగుల వెడల్పు, కింది బెడ్ నాలుగడుల దాకా ఉంటుంది. మనకు నచ్చిన రంగుల్లో వీటిని ఎంచుకోవచ్చు. వీటి ప్రారంభ ధర రూ.45 వేలుంటుంది. ⇔ ఫుల్ ఓవర్ ఫుల్ రకం కాస్త పెద్దగా కనిపిస్తుంది. కింద, పైన నాలుగు అడుగుల చొప్పున ఉంటుంది. ధర కనీసం రూ.55 వేల నుంచి దొరుకుతారుు. ⇔ పిల్లలు కొంత పెద్దగా ఉంటే తల్లిదండ్రులు బంకు బెడ్లకే పరిమితం కావటం లేదు. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని చదువుకునే బల్ల, వార్డ్రోబ్, వస్తువులు పెట్టుకోవటానికి అరలు వంటివి కల్పిస్తున్నారు. ఇవన్నీ విదేశీ స్థారుులో చూడచక్కగా ఉంటారుు. -
కాలేజీ యజమానుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు
వినుకొండ రూరల్/వినుకొండ టౌన్ : ఎస్ఎస్సీ ప్రవేశాల్లో అక్రమాలకు పాల్పడుతున్న బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌కు మధ్యవర్తిత్వం వహిస్తూ ఏసీబీకి పట్టుబడిన వివేకానంద విద్యాసంస్థల అధినేత సయ్యద్ రఫీ కళాశాల, నివాస గృహాల్లో ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం తనీఖీలు చేపట్టారు. ఈనెల 2న ఏసీబీ అధికారులు సోదాల నిమిత్తం వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. హైదరాబాద్ నుంచి రఫీ కుమారుడు రసూల్ నివాసానికి వచ్చారన్న సమాచారంతో ఏసీబీ అధికారులు గురువారం తిరిగి తనిఖీలు చేపట్టారు. సయ్యద్ రఫీ నివాస గృహం, ఎస్ఆర్ బీఈడీ కళాశాలలో గుంటూరు ఏసీబీ సీఐ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించగా, వినుకొండ బీఈడీ∙కళాశాల డైరెక్టర్ చీతిరాల రామారావు నివాసంలో హైదరాబాద్ ఏసీబీ సీఐ గఫూర్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. రామారావు ఇంట్లో ఏవిధమైన ఆధారాలు లభించకపోవడంతో అధికారులు సాయంత్రం వరకు కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. రఫీ నిర్మించుకున్న విలాసవంతమైన నివాసం చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఫస్ట్ఫోర్్లలో గదుల మొత్తాన్ని తనిఖీ చేశారు. గదుల్లోని సూట్‌కేసులను స్వాధీనం చేసుకున్నారు. సూట్‌కేసుల్లో భారీఎత్తున నగదును ఉంటుందని అధికారులు భావించి సిబ్బందితో రెండో ఫ్లోర్‌కు తరలించి తెరచి చూడగా ఖాళీ సూట్‌కేసులు దర్శనమిచ్చాయి. రెండో ఫ్లోర్‌లోని రఫీ బెడ్రూమ్ను క్షుణ్ణంగా పరిశీలించినా ఏ ఆధారాలు లభించలేదు. ఎస్ఆర్ బీఈడీ కళాశాలలోని రఫీ సొంత కార్యాలయం తాళాలు తీయించి నిశితంగా పరిశీలించగా విలువైన డాక్యుమెంట్లు లభించాయి. ఎక్కడెక్కడ ఏ కళాశాలలు స్థాపించింది వాటిలో పొందుపరచినట్టు సమాచారం. ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌కు సంబంధించిన ఆధారాలు కూడా ఎస్ఆర్ బీయిడీ కళాశాలలో లభించడంతో వీరి మధ్య తతంగం ఎప్పటి నుంచి సాగుతుందోనని అధికారులు కూపీ లాగేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. రాత్రి 7గంటల వరకు తనిఖీలు కొనసాగగా... మొత్తం పూర్తయిన అనంతరం వివరాలు మీడియాకు అందజేస్తామని ఏసీబీ సీఐ నరసింహారెడ్డి తెలిపారు. ఇవేం తనిఖీలు... సాధారణంగా ఏసీబీ అధికారులు గుట్టుగా రావడం, సోదాలు చేయడం జరుగుతుంది. కానీ, రెండురోజులు సమయమిచ్చి మరీ సోదాలు చేయడం విమర్శలకు దారితీస్తోంది. ఈ నెల 2వ తేదీన వివేకానంద బీఈడీ ఎడ్యుకేషనల్ సోసైటీలో సోదాలు నిర్వహించటానికి ఏసీబీ అధికారులు వచ్చారు. అయితే కుటుంబసభ్యులు అందుబాటులో లేరు, తదితర కారణాలతో ఆవరణలోనే ఉన్న రఫీ ఇంటికి, కార్యాలయానికి, రఫీ పర్సనల్ గదికి తహశీల్దార్ నాగూల్ సింగ్ సమక్షంలో పంచనామా నిర్వహించి సీల్ వేశారు. ఇదంతా మీడియా సాక్షిగా నిర్వహించిన ఏసీబీ అధికారులు ఆ తర్వాత ఏమైందో ఏమో గాని అందరి సమక్షంలో వేసిన సీళ్లను తొలగించి సిబ్బంది వచ్చినప్పుడు కబురు చేస్తే మేము వచ్చి సోదాలు నిర్వహిస్తామని ఉదారత వ్యక్తం చేయటం విమర్శలకు దారితీసింది. తీరిగ్గా కళాశాల యజమానులు వచ్చాకా, గురువారం ఏసీబీ అధికారులు కళాశాల వద్ద, ఇదే కేసులో మరొక నిందితుడిగా ఉన్న చీతిరాల రామారావుల ఇళ్లను సోదాలు చేశారు. ఈ వైనాలు చర్చకు దారితీశాయి. అవినీతిని వెలికి తీయాలి... మూడు దశాబ్దాల క్రితం నాలుగు అద్దెగదుల్లో ఏర్పాటు చేసిన స్కూల్ యజమాని నేడు రూ. 150 కోట్లకు పడగలెత్తటం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. రాష్ట్రం మొత్తం మీద 23 బీఈడీ, రెండు ఫార్మసీ కాలేజీలకు యజమానిగా రఫీ మారటం వెనక జరిగిన అవినీతిని వెలుగుతీయాలని పలువురు కోరుతున్నారు. కొందరు విద్యాశాఖాధికారులకూ రఫీ అక్రమాలలో వాటాలున్నాయనే ఆరోపణలూ వస్తున్నాయి. -
8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్-2016 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను బుధవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎడ్‌సెట్ అడ్మిషన్ల ప్రక్రియ వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆరు హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఇందులో ఏ కేంద్రానికైనా వెళ్లి తమ సర్టిఫికెట్లను పరిశీలింప చేసుకోవచ్చు. ఎస్వీయూనివర్సిటీ(తిరుపతి), ఎస్కేయూ (అనంతపురం), జేఎన్టీయూ (కాకినాడ), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ( గుంటూరు), అంబేద్కర్ యూనివర్సిటీ( శ్రీకాకుళం), ఆంధ్రాయూనివర్సిటీ( విశాఖపట్నం)లలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి తెలిపారు. 8 వతేదీ గణితం, ఇంగ్లీషు, 9న ఫిజికల్ సైన్స్, బయాలజీ, 10 వతేదీ సోషియల్ సెన్సైస్ మెథడాలజీలకు సంబంధించిన సర్టిపికెట్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మరుసటి రోజు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని సూచించారు. ఈ ఆప్షన్స్ ఆధారంగా సీట్ల కేటాయిస్తామన్నారు. -
ఏపీ ఎడ్‌సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఖరారు
రాష్ట్రంలో బీఈడీ కళాశాలలో ప్రవేశానికి ఆగస్టు 8 నుంచి ఏపీ ఎడ్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ కుమారస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించినట్టు ఈనెల చివరి వారంలో జరగాల్సిన కౌన్సెలింగ్.. వివిధ బీఈడీ కళాశాలల వివరాలను సంబంధిత యూనివర్సిటీలు పంపకపోవడం, కొన్ని కళాశాలలు పీ రెగ్యులేటరీ కమిషన్‌ను సంప్రదించకపోవడంతో వాయిదా పడిందన్నారు. వచ్చే 8, 9, 10 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, 9, 10, 11 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. 16వ తేదీ సీట్ల కేటాయింపు పూర్తి చేసి 17 నుంచి తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. -
బీఈడీకి స్పందన అంతంతే..!
► బోధనావృత్తిపై తగ్గుతున్న ఆసక్తి ► ఎడ్‌సెట్‌కు తగ్గిన దరఖాస్తుల సంఖ్య ► గతేడాది 64 వేలు.. ఈ ఏడాది 45 వేలే.. సాక్షి, సిటీబ్యూరో: ఉపాధ్యాయ వృత్తి చేపట్టేందుకు ఉద్దేశించిన ఎడ్‌సెట్ కు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. గతంలో లక్షల్లో వచ్చే దరఖాస్తుల సంఖ్య.. ఇప్పుడు 50 వేలు దాటడమే గగనమైపోయింది. ఏడాదికేడాది గణనీయంగా ఆసక్తి క్షీణిస్తుండడంతో విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భావితరాలను మహోన్నతులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి.. ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని ఆవేదన చెందుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు శనివారంతో గడువు ముగిసింది. ఈ ఏడాది మొత్తం 45,313 ద రఖాస్తులు మాత్రమే అందాయి. గతేడాది 64 వేలకు పైగా అభ్యర్థులు పోటీపడగా.. చివరకు 13 వేల మంది మాత్రమే బీఈడీలో చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 220 కళాశాలల్లో 20,200 సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో 7 వేలకు పైగా సీట్లు మిగిలిపోవడాన్ని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 19 వేలకు పైగా దరఖాస్తుల సంఖ్య తగ్గడం బోధనా వృత్తిపై తగ్గుతున్న ఆసక్తికి ఉదాహ రణ. క్రేజీ తగ్గడానికి కారణాలు బీఈడీ చేసేందుకు గతేడాది నుంచి ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం ఇవ్వగా.. ఈ ఏడాది నుంచి బీబీఎం, బీసీఏ, బీఎస్సీ (హోం సైన్స్) పట్టభద్రులకూ అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) నిర్ణయం తీసుకుంది. అలాగే బీఈడీలో చేరడానికి ఉన్న గరిష్ట వయోపరిమితిని ఎత్తివేశారు. ఫలితంగా ఈ కోర్సుకు మరింత క్రేజ్ పెరగనుందన్న విద్యావేత్తల అభిప్రాయానికి భిన్నంగా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఈడీని రెండేళ్ల కోర్సుగా ఎన్సీటీఈ అమలు చేస్తోంది. బోధనలో నాణ్యత పెంచాలన్న సదుద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కోర్సు పట్ల విద్యార్థులు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. రెగ్యులర్ ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ చేయకపోవడం, బీఈడీ చేసిన వారికి ఎస్జీటీకి అనర్హులుగా తేల్చడం, కోర్సులో చేరితే కచ్చితంగా తరగతులకు హాజరుకావాల్సి ఉండడం తదితర ఘటనలు.. ఈ వృత్తిపై ఆసక్తి క్షీణించడానికి కారణాలని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ సారి బయోమెట్రిక్.. ఎడ్‌సెట్ పరీక్షలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు చేపట్టామని కన్వీనర్ పి. ప్రసాద్ తెలిపారు. గతంలో ఒకరిబదులు మరొకరు పరీక్షకు హాజరైన ఘటనల నేపథ్యంలో ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈనెల 27న జరిగే ఎడ్‌సెట్‌కు హాజరయ్యే విద్యార్థుల ఫింగర్ ప్రింట్స్‌ని సేకరిస్తామన్నారు. పరీక్షకు గంట ముందు నుంచే ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. రాష్ర్టవ్యాప్తంగా 11 నగరాలు, పట్టణాల్లో మొత్తం 110 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. -
అన్నిటికీ భయమే... ఏం చేయను?!
జీవన గమనం నేను బీఈడీ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి చాలా కష్టాల్లో పెరిగాను. మానసికంగా చాలా కుంగిపోయాను. దానివల్ల యాంగ్జయిటీ కూడా వచ్చేసింది. ప్రతిక్షణం భవిష్యత్ గురించి భయమే. చదువు మీద అస్సలు దృష్టి పెట్టలేకపోతున్నాను. రేపు ఏమవుతుందో, నా జీవితం ఎలా ఉంటుందో అనే చింత. ఈ భయం పోయేదెలా? - నవ్యశ్రీ, ఊరు రాయలేదు చిన్నప్పటి నుంచి కష్టాల్లో పెరిగానన్నారు. కానీ ఎటువంటి కష్టాలో రాయలేదు. కష్టాలు మూడు రకాలు. ఆరోగ్యం, మానసికం, ఆర్థికం. కొన్ని నియంత్రణల ద్వారా శారీరక కష్టాలను కొంతవరకు అధిగమించొచ్చు. సరైన పద్ధతులు తెలిస్తే, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కూడా అంత కష్టం కాదు. కానీ మానసిక సమస్యలు మాత్రం చాలా వరకూ మనం కల్పించుకున్నవే. ఇదంతా చెబుతున్నది కేవలం మీ కష్టాల్ని మీరు విశ్లేషించుకోవడానికి! మొక్కుబడిగా కాకుండా మనస్పూర్తిగా చదివి మంచి ఉద్యోగానికి ప్రయత్నించండి. రేపు ఏమవుతుందోనన్న భయం ఉందన్నారు. ఇంతకన్నా ఇంకేమవుతుంది? కష్టాలు మనిషిని రాటుదేల్చాలి. అంతే తప్ప మరింత ఆందోళనకు గురి చెయ్యకూడదు. యాంగ్జయిటీ చీకట్లో నల్లపిల్లి లాంటి భ్రాంతి. ఉనికి లేకుండా భయపెడుతుంది. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో విజయం సాధించిన తొంభై శాతం వ్యక్తులు కష్టాల్లోంచి వచ్చినవారే. ఆ స్ఫూర్తితో ముందుకు సాగండి. ఈ మధ్య చాలామంది పిల్లల గురించి మాట్లాడుతూ మా పిల్లలు హైపర్ యాక్టివ్ అంటున్నారు. నేను చాలా సందర్భాల్లో పిల్లల విషయంలో హైపర్ యాక్టివ్ అన్న మాట విన్నాను. అసలు ఈ మాటకు అర్థం ఏమిటి? పిల్లలు అలా ఉండాలా ఉండకూడదా? - సుమతి, రాజమండ్రి విపరీతమైన అల్లరి, ఒక చోట కుదురుగా ఉండకపోవటం, చేతిలో వస్తువులు గిరాటు వేయటం, టీవీ చానల్స్ తరచూ మారుస్తూ దేనితోనూ సంతృప్తి చెందకపోవడం మొదలైన విశేషణాలను హైపర్ అంటారు. అయితే హైపర్ యాక్టివ్‌గా ఉండటం కన్నా, లేకపోవటం (ఆటిజం) భయపడాల్సిన పరిస్థితి. అలాంటి పిల్లలు మన్ను తిన్న పాముల్లాగా ఎంతో నెమ్మదిగా ఉంటారు. అంతకంటే హైపర్‌గా ఉండటం ఎంతో మేలు. ఆలోచించకుండా సమాధానం చెప్పటం, పరిణామం ఆలోచించకుండా పని చెయ్యటం కూడా హైపరే. సరదాగా ఒక ఉదాహరణ చెబుతాను. కేవలం సరదాగానే సుమా! కోహ్లీ 94, ఇషాంత్‌శర్మ 94 పరుగుల్లో ఉన్నారు. అదే ఆఖరి వికెట్టు. ఇద్దరిలో ఎవరు అవుటయినా ఇండియా ఓడిపోతుంది. రెండు బంతుల్లో ఏడు పరుగులు తీయాలి. అంతకన్నా ఎక్కువ పరుగులే తీసి గెలిచింది మన జట్టు. అంతిమ స్కోర్లు: కోహ్లీ- 100, శర్మ - 100. ఇదెలా సాధ్యమయింది? దీనికి నాలుగు రకాల సమాధానాలు న్నాయి. మీ పిల్లల్ని ఆలోచించమనండి. వాళ్లు క్షణం కూడా ఆలోచించకుండా ‘నో బాల్’ అని అరిచారనుకోండి. ‘హైపర్’కి అదే గుర్తు. చిన్నతనంలో పిల్లల్లో హైపర్-యాక్టివిటీ మంచి లక్షణం. కొంత వయసు వచ్చాక (అంటే దాదాపు పన్నెండేళ్లు దాటాక) నిబద్ధత, నమ్రత, నెమ్మది అలవాటవ్వాలి. అలా అలవాటవ్వని పిల్లల హైపర్ - యాక్టివిటీని తగ్గించేందుకు కొన్ని పద్ధతులున్నాయి. చాలా వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో వీటి గురించి చర్చ జరిగింది. అవి తెలుసుకుంటే సరిపోతుంది. నేను అన్ని విషయాల్లోనూ తెలివిగానే ఉంటాను. కానీ నాకు భయం చాలా ఎక్కువ. పదిమందిలో మాట్లాడలేను. ఒక్కడినే ఏ పనినీ చక్కబెట్టుకోలేను. ఏం చెయ్యాలన్నా ఏదో గుబులుగా ఉంటుంది. ఎందుకో నాక్కూడా తెలియదు. ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? - ఓ సోదరుడు అన్నిటికీ భయపడేవాడు అసమర్థుడు. దేనికీ భయపడనివాడు మూర్ఖుడు. దేనికి భయపడాలో తెలుసుకున్నవాడు జ్ఞాని. సహేతుక భయానికి జాగ్రత్త పడేవాడు మేధావి. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాను వచ్చిందంటే అది నిన్ను భయపెట్టడానికి కాదు. తుఫానులో పడవ ఎలా నడపాలో నీకు నేర్పడానికి. కొంతమందికి అన్నిటికీ భయమే. ఎదుటివారి కళ్లలోకి సూటిగా చూసి మాట్లాడ లేరు. అంటే వాళ్లలో ఏ గిల్టో, అభద్రతా భావమో ఉందన్నమాట. అదే నీ కళ్లలోకి ఎవరూ చూసి మాట్లాడటం లేదంటే నిన్ను ప్రేమించడం లేదనో లేక నువ్వు ఎవరికీ ప్రేమను ఇవ్వలేకపోతున్నావనో అర్థం. రెండు సందర్భాల్లోనూ నీదే తప్పు. -
ఓయూ బీఈడీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 20 నుంచి ఆయా కళాశాలల నుంచి మార్కుల జాబితాలను పొందవచ్చని అడిషనల్ కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. రీవాల్యూయేషన్ కోసం ఈ నెల 11 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. ఉస్మానియా యూనివర్సిటీ వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఈ నెల 11న మార్కుల జాబితాలను ఆయా కళాశాలలకు అందచేయనున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ప్రొఫెసర్ సుధాకర్‌రెడ్డి చెప్పారు. -
ఓయూ బీఈడీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఓయూ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బీఈడీ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ప్రకటించారు. ఈ నెల 20 నుంచి ఆయా కళాశాలల నుంచి మార్కుల జాబితాలను పొందవచ్చు అని అడిషనల్ కంట్రోలర్.. ప్రొఫెసర్ రాములు తెలిపారు. రివాల్యూయేషన్ కోసం ఈ నెల 11 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. -
బతకాలని ఉంది
♦ బీఎడ్ పట్టభద్రురాలి ఆక్రందన ♦ రెండు కిడ్నీలు పాడై దాతల కోసం ఎదురుచూపు ఒంగోలు సెంట్రల్: బీఎడ్ పూర్తి చేసింది. మంచి ఉపాధ్యాయురాలిగా జీవనం సాగించాలనుకుంది. తను ఒకటి తలిస్తే విధి ఇంకొకటి శాసించింది. రెండు కిడ్నీలు పాడైపోరుు చావుతో పోరాడుతూ దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చినా మార్పిడి కోసం రూ.10 లక్షలకు పైగా వైద్య ఖర్చులు అవుతాయని తెలియడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటోందామె. ఒంగోలుకు చెందిన పి.రాజ్యం (36)కు మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈమె ఓ ప్రరుువేటు పాఠశాలలో ఉపాధ్యారుునిగా, భర్త ఓ లారీ క్లీనర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి ఓ కుమార్తె పుట్టింది. ఈ ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. గత రెండు సంవత్సరాల క్రితం ప్రరుువేటు పాఠశాలలో ఉద్యోగం చేస్తుండగానే విపరీతమైన నీరసంతో పడిపోగా ఆసుపత్రిలో చేర్చారు. అప్పట్లో ఉన్నత చికిత్స కోసం నెల్లూరు వెళ్లమని సూచించడంతో రెండు కిడ్నీలు పాడైపోయాయని నిర్ధారించారు. ఏమీ చేయలేని నిస్సహాయత. పైగా వెంటనే డయూలసిస్ చేయాలని సూచించడంతో ఆ చికిత్స చేరుుంచుకుంటూ ఇతర మందులు వాడుతోంది. కోడలు బాధ చూడలేక తన అత్త కిడ్నీని దానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇందుకు దాదాపు రూ.10 లక్షలకుపైగా ఖర్చవుతందని వైద్యులు చెప్పడంతో వీరి కష్టాలు మళ్లీ మొదటికి వచ్చారుు. కిడ్నీ మార్పిడికి అవసరమైన నగదును మానవతా దృక్పధంతో దాతలు సమకూర్చితేగానీ ఆరోగ్యం కుదుట పడదు. త్వరితగతిన ఈ శస్త్ర చికిత్స చేపట్టకపోతే మిగిలిన అవయవాలు పాడైపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్పందించే హృదయూలు 88975-51930 అనే నెంబరుకు ఫోన్ చేసి సాయం చేయాలని ఆ కుటుంబం అర్థిస్తోంది. -
నివ్వెరబోయూరు..
► ఇంగ్లిష్‌లో బీఈడీ ప్రశ్నపత్రం ► ఆందోళన చెందిన విద్యార్థులు ► ఏం రాయూలో తెలియక అయోమయం కమాన్‌చౌరస్తా : బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రశ్నపత్రం చూసిన విద్యార్థులు నివ్వెరబోయూరు. గతంలో మాదిరిగా కాకుండా కేవలం ఇంగ్లిష్‌లోనే ప్రశ్నపత్రం ఉండడంతో కొందరు విద్యార్థులు కేవలం హాల్‌టికెట్ నంబర్ మాత్రమే రాసి బయటకు వెళ్లిపోయూరు. ప్రశ్నాపత్రం గతంలో మాదిరిగా తెలుగులోనే ఇవ్వాలని కోరుతున్నారు. 5 కేంద్రాల్లో 1400 మంది బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్లో ఎస్సారార్ కళాశాల, వివేకనందా డిగ్రీ, పీజీ కళాశాల, వాగేశ్వరీ డిగ్రీ కళాశాల, జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాల, పెద్దపల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా బీఈడీ కళాశాలలకు చెందిన 1400 మంది విద్యార్థులు హాజరయ్యూరు. ఇక నుంచి ఇంతే ! శాతవాహన యూనివర్సిటీ బీఈడీ విద్యార్థులకు మొదటిసారిగా సెమిస్టర్ విధానం అమలు చేయడంతో నిబంధనలు మారారుు. బీఈడీ ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లోనే ఉంటుందని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. మొదటి పరీక్షనే కాదు ఇక ముందు జరుగబోయే పరీక్షలన్నింటీ ప్రశ్నపత్రాలు ఆంగ్లమాధ్యమంలోనే వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే ఉండాలి గతంలో బీఈడీ ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ రెండు భాషల్లో వచ్చేది. కానీ ఇప్పుడు సెమిస్టర్ విధానం అమలవడంతో కోర్సు నిబంధనలు మారి ఇంగ్లిష్ మీడియంలోనే వస్తున్నారుు. తెలుగు మీడియం విద్యార్థులు మాత్రం కేవలం హాల్‌టికెట్ నంబర్ రాసి పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని మరో సెంటర్లో ప్రశ్నపత్రాన్ని తెలుగులో అనువదించి చెప్పడంతో అక్కడి విద్యార్థులు గట్టెక్కారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో వచ్చినప్పటికీ సమాధానాలు మాత్రం తెలుగులో రాసుకునే వెసులుబాటు ఉందని యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. -
పార్టీల దాగుడుమూతలు
-
పింఛన్ కోసం మంచంపై తెచ్చారు
ప్రకాశం జిల్లా: వృద్ధాప్యంలో ఆసరాగా ఉన్న పింఛన్‌ను రేషన్ కార్డు లేదన్న సాకుతో రద్దు చేశారు. కార్డు కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఫలితం లేకపోవడంతో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామసభకు ఓ వృద్ధుడిని మంచం మీద తీసుకొచ్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కొనకనమిట్ల మండలం పెదారికట్ల ఎస్సీ కాలనీకి చెందిన అక్కిదాసరి ప్రభుదాసు(60)కు భార్యాబిడ్డలు ఎవరూ లేరు. దూరపు బంధువుల దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నెలకు రూ.200 పింఛన్ తీసుకున్నాడు. ప్రభుత్వం మారడంతో రేషన్‌కార్డు లేదన్న సాకుతో అతని పింఛన్ రద్దు చేశారు. అప్పటి నుంచి కార్డు కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న అధికారులు కనికరించలేదు. బుధవారం జన్మభూమి గ్రామసభ జరుగుతుందని తెలుసుకున్న ప్రభుదాసు బంధువులు అతడిని మంచం మీదనే గ్రామసభకు తీసుకొచ్చారు. అతని పరిస్థితిని అధికారులకు వివరించారు. ఆధార్‌కార్డు, వికలాంగ సర్టిఫికెట్ ఉందని పింఛన్ ఇవ్వాలని చేతులు జోడించి ప్రభుదాసు అధికారులను వేడుకున్నాడు. అతని పరిస్థితి తెలుసుకున్న తహశీల్దార్ జ్వాలా నరసింహం రేషన్‌కార్డు మంజూరు చేసి పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుదాసుని మంచంపై గ్రామసభకు తీసుకురావడానికి కారణమైన అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘ఢీ’ఎస్సీ
* ‘టెర్ట్’కు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ ఉద్యోగార్థులు * ప్రణాళికాబద్ధమైన సాధనతో విజయుం సాధ్యవుంటున్న నిపుణులు * కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్న అభ్యర్థులు చిత్తూరు(ఎడ్యుకేషన్): రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలోని వేలాదివుంది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ కల నెరవేర్చుకునేందుకు తుదిపోరుకు సన్నద్ధవువుతున్నారు. ఈసారి టెట్, డీఎస్సీ రెండు పరీక్షలను కలిపి టెర్ట్(టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్ట్) పేరిట సిలబస్‌ను సైతం సమ్మిళితం చేసి ఒకే పరీక్షను నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. 2012 డీఎస్సీ సిల బస్నే ఇవ్వడంతో హైస్కూల్స్థారుు వరకు పాత పాఠ్యపుస్తకాల కోసం అభ్యర్థులు శోధిస్తున్నారు. జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 221 ఉండగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు 1,194 పోస్టులున్నారుు. లాంగ్వేజ్ పండిట్లు 182 ఉండగా, తొమ్మిది పీఈటీ పోస్టులు ఉన్నారుు. ఎస్జీటీ పోస్టులకు కేవలం డీఎడ్ అభ్యర్థులు వూత్రమే అర్హులుగా ప్రకటించడంతో బీఈడీ అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కుస్తీ పడుతున్నారు. టెట్ రద్దు చేయుడంతో బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన ప్రతి అభ్యర్థీ డీఎస్సీ (టెర్ట్) రాసే అవకాశం ఉంది. ఈసారి దరఖాస్తులు రికార్డుస్థాయిలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయు పోస్టులు ఉండడంతో ఇతర జిల్లాల అభ్యర్థులు సైతం నాన్‌లోకల్ కేటగిరీ కింద ఇక్కడ దరఖాస్తు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓపెన్ కేటగిరీలో 20 శాతం నాన్‌లోకల్ అభ్యర్థులు పోటీపడే వెసులుబాటు ఉండడంతో ముఖ్యంగా పోస్టులు తక్కువగా ఉన్న వైఎస్సార్, విజయునగరం, కృష్ణా, విజయునగరం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు తదితర జిల్లాలకు చెందిన అభ్యర్థులు వున జిల్లావారితో పోటీ పడనున్నారు. తెలుగు అభ్యర్థులకు అన్యాయుం తెలుగు బోధనలో ఏవూత్రం ఉపయోగంలేని సబ్జెక్టులకు అధిక వూర్కులు కేటారుుంచి తెలుగు సబ్జెక్టుకు తక్కువ వూర్కులు కేటారుుం చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. స్కూల్ అసిస్టెంట్లకు ఈసారి సిలబస్ కొద్దిగా క్లిష్టతరంగా ఇచ్చారు. పాఠ్యపుస్తకాల్లోని కవి కాలాదులతోపాటు విషయు అవగాహనకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెలుగుభాష సాహిత్యచరిత్ర (వెలవుల తివ్మున్న) తెలుగుభాష సాహిత్య సమీక్ష (ద్వానాశాస్త్రి, నాగయ్యు), ప్రశ్నోత్తర కైముది(తెలుగు అకాడమీ) పుస్తకాలు అధికవూర్కులు సాధించేందుకు తోడ్పడతాయి. -యువశ్రీ మురళి,తెలుగు భాషా పండితులు, గోవర్థనపురం, వరదయ్యుపాళెం భూగోళం, చరిత్రపై శ్రద్ధ చూపాలి సోషల్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు భూగోళ శాస్త్రం, చరి త్ర అంశాలపై ప్రధానంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భూగోళ శాస్త్రంలో వ్యూప్కు అనుసంధానంగా ప్రిపేర్ కావాలి. చరిత్ర విషయూనికొస్తే కాలానుగుణంగా రాజవంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలి. ప్రతి ప్రశ్నకూ తార్కిక పద్ధతిలో ఆలోచించి సవూధానాలు గుర్తించాలి. - సురేష్‌బాబు,సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, శ్రీకాళహస్తి ప్రతి మార్కూ కీలకం ఉపాధ్యాయు ఉద్యోగానికి పోటీ తీవ్రతరమైం ది. పరీక్షలో ప్రతి వూర్కూ కీలకం కానుంది. దీంతో మిగిలి ఉన్న కాలాన్ని విభజించుకుని అవగాహనతో కూడిన ప్రిపరేషన్‌తో సత్ఫలితాలు సాధించవ చ్చు. అకాడమీ పుస్తకాలను చదవడం ద్వారా అధిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. - నల్లందుల గుణశేఖర్రెడ్డి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రాక్టీస్ పేపర్లు సాధన చేయూలి ఉపాధ్యాయు పరీక్ష డీఎస్సీకి పోటీ తీవ్రంగా ఉంటుంది. సివిల్స్ స్థారుులో ప్రిపేర్ కావాలి. తక్కువ కాల వ్యవధిలో అధిక ప్రశ్నలకు సవూధానాలు రాయూలి. వీలైనన్ని ఎక్కువ పేపర్లను సాధన చేయూలి. విషయూంశాలపై జ్ఞానంతోపాటు అవగాహన పెంపొందించుకోవాలి. గతంలో అడిగిన ప్రశ్నల సరళిని పరిశీలించాలి. ఇతర వ్యాపకాలను తగ్గించి ఏకాగ్రతతో సాధన చేస్తే విజేతలుగా నిలవచ్చు. - కె.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు పోటీ చూసి ఆందోళన వద్దు డీఎస్సీకి పోటీ తీవ్రంగా ఉంటుంది. పోస్టును సాధించడం అనే లక్ష్యం తప్ప వునస్సులో వేరే ఆలోచనవద్దు. నాలుగు నెలల కాలవ్యవధి పరీక్షకు ఉండడంతో సవుయూన్ని ఏవూత్రం వృథా చేయుకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకతను పాటిస్తాం. అనవసర విషయూలను వదిలిపెట్టి సిలబస్ ను అనుసరించి ప్రిపరేషన్ సాగాలి. - శామూయల్, ఇన్చార్జి డీఈవో, చిత్తూరు -
మూడేళ్ల కోర్సుగా పార్ట్‌టైం బీఎడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం కొత్తగా పార్ట్‌టైం బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సును ప్రవేశపెట్టింది. బీఎడ్ లేకుండానే ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా ఈ కోర్సును అమల్లోకి తెచ్చింది. అలాగే దూరవిద్య విధానంలో ఇన్నాళ్లు లేని డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సును కూడా ప్రవేశ పెట్టింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులు చేసి ప్రాథమిక పాఠశాలల్లో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు దూర విద్య విధానంలో బీఎడ్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. దూరవిద్య విధానంలో నిర్వహించే డీఈఎల్ఈడీ, బీఎడ్ కోర్సుల కాల వ్యవధి రెండేళ్లు ఉంటుందని పేర్కొంది. అలాగే విజువల్ ఆర్ట్స్‌లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. లలిత కళల విద్యలోనూ డిప్లొమా కోర్సును అమల్లోకి తెచ్చింది. ఇవి రెండూ రెండేళ్ల కోర్సులుగా ఉంటాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో ఈ కొత్త కోర్సుల ను అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది. వాటి వివరాలిలా ఉన్నాయి. # పార్ట్‌టైం బీఎడ్: ఇది మూడేళ్ల కోర్సు. బీఎడ్ లేకపోయినా ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు ఐదేళ్లలో దీనిని పూర్తి చేయవచ్చు. ఇందులో ముఖాముఖి విద్యా బోధన 120 రోజులు ఉంటుంది. ఏటా 40 రోజుల బోధన ఉంటుంది. మరో 60 రోజులు స్కూల్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఏటా 20 రోజులు స్కూళ్లలో ట్రైనీ టీచర్లుగా పని చేయాలి. అంతేకాదు మరో 150 రోజులపాటు పాఠశాల, సామాజిక కార్యక్రమాలు ఉంటాయి. ఏటా 50 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల సెలవు దినాల్లో ఈ పార్ట్‌టైం బీఎడ్ విద్యను నిర్వహించాలి. ఆ విద్యా సంస్థలు వారంలో 42 గంటలు పని చేయాలి. # డిస్టెన్స్ డీఈఎల్ఈడీ: దూరవిద్య విధానంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సును కొత్తగా ప్రవేశ పెట్టింది. ఉపాధ్యాయ విద్య కోర్సులు చేయని ఇన్‌సర్వీసు టీచర్లు ఈ కోర్సు చేసేందుకు అర్హులు. ఇది రెండేళ్ల కోర్సు. ఇందులో ఒక్కో విద్యాసంస్థ 500 మందికి ప్రవేశాలు కల్పించవచ్చు. స్టడీ సెంటర్ల ప్రవేశాలు 100 మందికి మించకూడదు. # డిస్టెన్స్ బీఎడ్: దూరవిద్య బీఎడ్ కూడా రెండేళ్ల కోర్సు. దీనిని ఐదేళ్లలో పూర్తి చేయవచ్చు. విద్యా సంస్థల్లో 100 మందికి మించకుండా, స్టడీ సెంటర్ల ద్వారా 50 మందికి మించకుండా ప్రవేశాలు కల్పించవచ్చు. # దేశ వ్యాప్తంగా కళలకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో డిప్లొమా ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ (విజువల్ ఆర్ట్స్), డిప్లొమా ఇన్ ఆర్ట్ ఎడ్యుకేషన్ (పెర్ఫార్మింగ్ ఆర్ట్స్) కోర్సులను కొత్తగా ప్రవేశ పెట్టింది. ఇవి రెండేళ్ల కోర్సులు. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు 1 నుంచి 8వ తరగతివరకు బోధించేందుకు అర్హులు. ఇందులో 16 వారాలపాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. -
‘ఉపాధ్యాయ విద్య’ ఇక సరికొత్తగా..
కొత్త నిబంధనలతో గెజిట్ నోటిఫికేషన్ జారీ బీఎడ్, ఎంఎడ్, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులు ఇకపై రెండేళ్లు ఇంటర్నల్స్, అంతర్గత మదింపునకు 20-30% వెయిటేజీ పరిశోధనలకు ప్రాధాన్యంతో బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్.. బీఈఎల్ఈడీలకు ప్రాథమిక స్కూళ్లలో బోధనార్హత సాధారణ, ఉపాధ్యాయ విద్యను కలిపి సమీకృత కోర్సులు డిగ్రీ స్థాయి కోర్సుల్లో కంప్యూటర్, యోగా, సమ్మిళిత విద్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లోనూ మార్పులు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యలో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలను చేపట్టింది. దేశవ్యాప్తంగా 15 రకాల ఉపాధ్యాయ విద్య కోర్సుల కాల వ్యవధి, విధివిధానాల్లో సమూల మార్పులు చేసింది. పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఉపాధ్యాయ విద్య కోర్సుల్లో ప్రధానమైన బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ), మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ) కోర్సుల కాల వ్యవధిని ఏడాది నుంచి రెండేళ్లకు పొడిగించింది. బీఏ-బీఎడ్, బీఎస్సీ-బీఎడ్, నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) వంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు-2014గా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన నాటినుంచే ఇవి అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పూర్తయిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2015-16) ఈ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి ఏటా దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయ విద్యా కోర్సులు చేస్తున్నారు. ప్రస్తుత సంస్కరణల ప్రభావం వీరిపై కనిపించనుంది. కేంద్రం తెచ్చిన సంస్కరణల్లోని ప్రధాన అంశాలు.. ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌కు వెయిటేజీ.. ఉపాధ్యాయ విద్యను అభ్యసించే వారి నిరంతర అంతర్గత మదింపు, ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్‌కు వెయిటేజీ ఇవ్వాలని నిబంధనల్లో పేర్కొన్నారు. వీటికి 20 నుంచి 30 శాతం మార్కులు ఉంటాయి. కోర్సుల నిర్వహణ కాలేజీలకు అఫిలియేషన్లు ఇచ్చే ప్రభుత్వ సంస్థలు ఈ ఇంటర్నల్స్‌కు ఇవ్వాల్సిన మార్కులను నిర్ధారించాలి. మిగతా 70 నుంచి 80 శాతం మార్కులకు రాత పరీక్షలు నిర్వహించాలి. మొత్తం మార్కులకు కలిపి గ్రేడ్లు ఇస్తారు. ప్రతి కోర్సులోనూ విద్యార్థులు, అధ్యాపకుల హాజరు కచ్చితంగా 80 శాతానికి పైగా ఉండాలి. టీచింగ్ ప్రాక్టీస్‌కు 90 శాతం హాజరు తప్పనిసరి. ఏటా 200 రోజులు పనిదినాలు ఉండాలి. వారంలో, ఐదారు రోజుల్లో కనీసంగా 36 గంటలు తరగతులు నిర్వహించాలి. ప్రస్తుతం 40 రోజులు మాత్రమే ఉన్న స్కూల్ ఇంటర్న్‌షిప్ (టీచింగ్ ప్రాక్టీస్)ను 20 వారాల (140 రోజుల)కు పెంచారు. ప్రథమ సంవత్సరంలో నాలుగు వారాలు, ద్వితీయ సంవత్సరంలో 16 వారాలు ఉంటాయి. కోర్సుల వారీగా ముఖ్య అంశాలు.. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (డీఈసీఈడీ)గా ఉన్న కోర్సు ఇకపై ‘డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ)’గా మారుతుంది. ఇది రెండేళ్ల కోర్సు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) రెండేళ్ల కోర్సు. బీటీసీ, జేబీటీ, డీఎడ్ (డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్) వంటి రకరకాల పేర్లతో ఉన్న వాటన్నింటిని ఇకపై ‘డీఈఎల్ఈడీ’గా పేర్కొంటారు. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్ఈడీ) నాలుగేళ్ల ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సు. ఇంటర్ పూర్తి చేసిన వారు ఇందులో చేరవచ్చు. బీఎడ్ వారికి లేని ప్రత్యేక అర్హత వీరికి ఉంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించేందుకు ఈ కోర్సు చేసినవారు అర్హులు. ఎలిమెంటరీ విద్యలో పరిశోధనే ప్రధాన లక్ష్యంగా ఈ కోర్సు ఉంటుంది. శిశు వికాసం, అభ్యసన ప్రక్రియల్లో లోతైన పరిశీలన ఉంటుంది. ఇందులో 60 శాతం మార్కులు రాత పరీక్షలకు, 40 శాతం మార్కులు ఇంటర్నల్స్‌కు (20% ఇంటర్న్‌షిప్‌కు, 20% ఇన్నోవేషన్, క్షేత్ర సంబంధ పరిశోధనలు, ప్రాక్టికల్స్‌కు) ఉంటాయి. ఇప్పటివరకు ఏడాది కోర్సుగా ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) ఇకపై రెండేళ్ల కోర్సుగా ఉంటుంది. దీని సిలబస్‌లోనూ మార్పులు చేశారు. విషయ విజ్ఞానం, మానవ అభివృద్ధి బోధన నైపుణ్యాల పెంపు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం లక్ష్యంగా సిలబస్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ), లింగ వివక్షను దూరం చేసే విద్య, యోగా ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య ఇందులో ఉంటాయి. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఎడ్)ను కూడా రెండేళ్ల కోర్సుగా చేశారు. రెండేళ్ల కోర్సుకు అదనంగా నాలుగు వారాలు క్షేత్ర స్థాయి పరిశోధన ఉంటుంది. డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ) రెండేళ్ల కోర్సు. ఇది పూర్తి చేసిన వారు పీఈటీ పోస్టులకు అర్హులు. ఏడాది మాత్రమే ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)ను, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎంపీఈడీ)ను రెండేళ్ల కోర్సులుగా మార్చారు. సమీకృత కోర్సులు... నాలుగేళ్లపాటు నిర్వహించేలా ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-బీఎడ్, బీఏ-బీఎడ్ కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టారు. వీటిలో 8 సెమిస్టర్లు ఉంటాయి. ఆరేళ్లలో కోర్సును పూర్తి చేయవచ్చు. ఏటా 250 రోజులు పని దినాలు ఉండాలి. కంప్యూటర్, జెండర్, యోగా, సమ్మిళిత విద్య ఇందులో ఉంటాయి. ఈ కోర్సుల్లో 3వ, 4వ ఏడాదిలో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అంతర్గత మదింపునకు 20శాతం నుంచి 40 శాతం మార్కులు, రాత పరీక్షలకు 60 నుంచి 80 శాతం మార్కులు ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఈడ్.. ఇంటిగ్రేటెడ్ బీఎడ్-ఎంఎడ్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇది మూడేళ్ల కోర్సు. ఏటా 215 రోజులు పనిదినాలు ఉండాలి. కాలేజీలు మొత్తంగా 107 వారాలు పని చేయాలి. పీజీ పూర్తి చేసిన వారు ఇందుకు అర్హులు. -
డీఎస్సీ పోస్టుల్లో కోత
సాక్షి, చిత్తూరు: ఊరించి, ఉడికించిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైందనే సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా పోయింది. సీఎం చంద్రబాబునాయుడు తన సహజసిద్ధ ధోరణిలోనే డీఎస్సీ పోస్టుల్లో కోత విధించారు. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో పోస్టులు తగ్గిస్తూ డీఈవో తయారు చేసిన నివేదికను పంపించారు. ఆర్థికభారం సాకుగా చూపించి ఆ చర్యకు పాల్పడినట్లు అధికారుల నుంచి సమాధానం లభించింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన తరువాత పోస్టులు తగ్గించడం ఏమిటో అర్థంకాక విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించారు. ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగాలేదని, ఒక్కసారిగా అంత భారం భరించే స్థితిలో లేనందున, ఆర్థికశాఖ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోగా తగ్గంపు ప్రక్రియ ను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాల డీఈవోలు నోటిఫికేషన్లో చూపించిన ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే కార్యక్రమాన్ని ఇప్పటికే ముగిం చినట్లు సమాచారం. ప్రతిజిల్లాలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా ప్రభుత్వం కేవలం వందల పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలే తక్కువ పోస్టులతో నోటిపికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం దరఖాస్తులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో మళ్లీ ఉన్న పోస్టులు తగ్గించే ప్రయత్నానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలతో పోలిస్తే చిత్తూరులోనే అత్యధికంగా 1,606 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. తరువాత అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే వెయ్యి పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో అతి తక్కువ పోస్టులు (356) మాత్రమే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చూపారు. ఆ తరువాత వరుసక్రమంలో విజయనగరం జిల్లాలో 362, కృష్ణాలో 379, నెల్లూరు 416, పశ్చిమ గోదావరి 601, శ్రీకాకుళం 719, కర్నూలు 731 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో చూపింది. అయితే 20 శాతం కుదించాలన్న తాజా ఆదేశాలతో ఈ పోస్టులు మరింతగా తగ్గనున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తం 1,606కు గాను 320 పోస్టులు తగ్గనున్నాయి. ఈ లెక్కన తక్కువ పోస్టులు కేటాయించిన జిల్లాలో నామమాత్రంగా కూడా పోస్టులు మిగిలే పరిస్థితి లేదు. ఉదాహరణకు వైఎస్సార్ కడప, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల పరిధిలో మొత్తం 400 లోపు మాత్రమే పోస్టులు చూపించారు. వీటిలో 20 శాతం తగ్గిస్తే 80 పోస్టులు తగ్గనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో కొత్త జాబితాతో వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ఆది నుంచి చంద్రబాబు ప్రభుత్వం దోబూచులాడింది. ఎన్నికల ప్రచారంలో డీఎస్సీపై ప్రకటన చేసి హామీలు ఇచ్చిన బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీని పక్కన బెట్టింది. డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఐదుమార్లు ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు, తాజాగా 19న మంత్రి ప్రకటన చేయగా 20న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీపై బీఈడీ చేసినవారు అర్హులు కాదనడం, టెట్, డీఎస్సీని అనుసంధానించడం, బీఈడీలను, డీఈడీలను విభజించడం తదితర నిర్ణయాలతో ప్రభుత్వం నిరుద్యోగులను గందరగోళానికి గురిచేసింది. తాజాగా దరఖాస్తులకు నాలుగు రోజులు మాత్రమే గడువున్న సమయంలో పోస్టులను కుదించి అర్హులకు ఉద్యోగావకాశాలను ఎండగడుతోంది. మరోవైపు ఒక్కో జిల్లాలో 20 నుంచి 40 వేలమంది వరకూ బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా మొక్కుబడిగా డీఎస్సీ నిర్వహణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు డీఎస్సీని కూడా రుణమాఫీ మాదిరే మార్చారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
ఆనందం.. ఆందోళన
డీఎస్సీ-2104కు గ్రీన్సిగ్నల్పై నిరుద్యోగుల్లో భిన్నస్వరం జీఓ విడుదల చేసిన ప్రభుత్వం నేడు, రేపో జిల్లాకు ఖాళీల జాబితా అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-2014 నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఓ వైపు ఆనందం, మరోవైపు ఆందోళన నెలకొంది. కేటగిరీ వారీగాఎన్నెన్ని ఖాళీలు ఉంటాయనే అంశంపై సందిగ్ధత నెలకొంది. డీఎస్సీ నోటిఫికేషన్ అదిగో.. ఇదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం జీఓ 38 విడుదల చేసింది. జీవోలో విధివిధానాలకు సంబంధించిన అంశాలు తప్ప షెడ్యూలు వెల్లడించలేదు. ఏయే కేటగిరిలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే సమాచారం, డీఎస్సీ పరీక్ష నిర్వహణ షెడ్యూలు రాష్ట్ర అధికారులు ఈరోజో...రేపో జిల్లాలకు పంపనున్నారు. అయితే ఇన్ని రోజులూ నిర్వహిస్తూ వచ్చిన డీఎస్సీని టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్ కమ్ టీఆర్టీ)గా మార్పు చేస్తూ జీఓలో పేర్కొన్నారు. దీనికితో 33 ఏళ్ల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచారు. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట కల్పించే అంశమైనా ఆశించిన పోస్టులు లేకపోవడం వారిని కలవరపెడుతోంది. కోర్సులు చేసి వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే పోస్టులు అంతంత మాత్రంగానే ఉంటుండటంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది. బీఈడీ అభ్యర్థులకు నిరాశ డీఎస్సీ-14 బీఈడీ అభ్యర్థులకు నిరాశ మిగల్చనుందనడంలో సందేహం లేదు. అన్ని సబ్జెక్టులకు కలిపి 57 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఎస్జీటీ 1083, పీఈటీలు 15, లాంగ్వేజ్ పండిట్లు 106 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలనే జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, పండింట్లు అన్ని కేటగిరీలకు 1251 ఖాళీలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ఈ ఖాళీలనే చూపిస్తూ నివేదించారు. ఇక మునిసిపల్ పాఠశాలల ఖాళీలను ప్రస్తుత నోటిఫికేషన్లో చేర్చాలా...వద్దా అనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మునిసిపల్ పోస్టుల చేరిక ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఖాళీలుగా చూపించిన (1251)వాటిలో పెద్దగా మార్పులు జరగకపోవచ్చని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ఎస్జీటీ పోస్టులు కొంతమేరకు తగ్గవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
డీఎస్సీ షెడ్యూల్ విడుదల
విశాఖ రూరల్: డీఎస్సీ అభ్యర్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. టెట్, డీఎస్సీని కలిపి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్-కమ్-టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టెట్-కమ్-టీఆర్టీ)గా వ్యవహరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్లో కొంత అస్పష్టత అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తోంది. పాత పద్ధతిలోనే ప్రకటన రావడంతో బీఈడీ అభ్యర్థులకు నిరాశే మిగలింది. సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు కానున్నారు. మే 9 నుంచి 11 వరకు పరీక్షలు: నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 2వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 16 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీ ఆన్లైన్, మీసేవ కేంద్రాల ద్వారా ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది మే 9న ఎస్జీటీలకు, 10న లాంగ్వేజ్ పండిట్లకు, 11న స్కూల్ అసిస్టెంట్లకు పరీక్ష జరగనుంది. మే 28న ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థుల్లో గందరగోళం: టెట్-కమ్-టీఆర్టీ పేరుతో నూతన విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తుండడం వల్ల ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు సైతం మరోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. టెట్ పరీక్షల్లో వెయిటేజీ ఆధారంగానే డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో టెట్ రాసిన వారు మళ్లీ పరీక్ష రాయాల్సి రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన పోస్టులు జిల్లాలో ఖాళీల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ తక్కువ పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ వెలువడడం పట్ల డీఎస్సీ అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. వాస్తవానికి జిల్లాలో 2500 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే రేషనలైజేషన్ చేస్తామని చెప్పి పోస్టులను కుదించగా 1714 ఖాళీలు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. కానీ రేషనలైజేషన్ జరగలేదు. దీంతో సెప్టెంబర్ నాటికి మ్యాథ్స్‌లో 106, ఫిజికల్ సైన్స్ 19, బయలాజికల్ సైన్స్ 34, సోషల్ 131, ఇంగ్లీష్ 17, గ్రేడ్-1 తెలుగు 28, గ్రేడ్-1 హిందీ 3, లాంగ్వేజ్ తెలుగు పండిట్ 12, లాంగ్వేజ్ హిందీ పండిట్ 57, లాంగ్వేజ్ ఉర్దూ పండిట్ 1, ఎస్జీటీ తెలుగు మీడియం 1268, ఎస్జీటీ ఉర్దూ మీడియం 10, పీఈటీలో 28 పోస్టులు ఖాళీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోను పోస్టులను తగ్గించి స్కూల్ అసిస్టెంట్లకు 307, లాంగ్వేజ్ పండిట్లకు 59, పీఈటీలకు 28, ఎస్జీటీలకు 793 మొత్తంగా 1187 ఖాళీలు ఉన్నట్లు అధికారులు జాబితాను ప్రభుత్వానికి సమర్పించారు. వాస్తవానికి సెప్టెంబర్ 5వ తేదీనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. అయితే బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులలో అర్హత కల్పిస్తామని చెప్పి నోటిఫికేషన్‌ను వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. -
'డీఎస్సీ నోటిఫికేషన్' లో అస్పష్టత
హైదరాబాద్:ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా విడుదల చేసిన డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్ అస్పష్టంగా ఉంది. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను కూడా ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. తాజా డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్ తో గతంలో టెట్ అర్హులైన వారు కూడా మరోసారి పరీక్ష రాయాల్సి ఉండటంతో గందరగోళానికి తావిస్తోంది. అయితే టెట్ పరీక్షల్లో వెయిటేజీ ఆధారంగానే డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారమిక్కడ విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,848, లాంగ్వేజ్ పండిట్స్ 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది. డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీ ఆన్లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లింపుకు అవకాశం ఉంది. -
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2014 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారమిక్కడ విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్ 1,848, లాంగ్వేజ్ పండిట్స్ 812, పీఈటీ 156, ఎస్జీటీ 6,244 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుంది. డీఎస్సీ పరీక్షలు, ఎస్జీటీలకు మే 9న, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు మే 10, స్కూల్ అసిస్టెంట్లకు మే 11న పరీక్షలు జరగనున్నాయి. డిసెంబర్ 2 నుంచి జనవరి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏపీ ఆన్లైన్, మీ-సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లింపుకు అవకాశం ఉంది. ఏప్రిల్ 25 నుంచి హాల్ టిక్కెట్లు జారీ చేసి, మే 18న ప్రాథమిక కీ విడుదల చేస్తారు. మే 27న ఫైనల్ కీ, మే 28న డీఎస్సీ ఫలితాలు వెల్లడించనున్నారు. మరోవైపు పాత పద్ధతిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో బీఈడీ అభ్యర్థులకు నిరాశ మాత్రం తప్పడం లేదు. ఈ తాజా నోటిఫికేషన్‌తో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు కానున్నారు. -
నేడు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పాత పద్ధతిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో బీఈడీ అభ్యర్థులకు నిరాశ మాత్రం తప్పడం లేదు. ఈ తాజా నోటిఫికేషన్ తో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అనర్హులు కానున్నారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ రాత పరీక్షలకు అర్హత కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చినా.. ఇప్పడు మాత్రం పాత పద్ధతిలోనే నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైంది. దీంతో ఐదు లక్షలకు పైగా బీఈడీ అభ్యర్థులు తీవ్రనిరాశకు లోనుకానున్నారు. వారికి ఎస్జీటీ పోస్టులకు అర్హత ఇదిలా ఉండగా టెట్ కు, డీఎస్సీకి ఒకేసారి రాతపరీక్ష నిర్వహించనున్నారు. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
కాటారం: మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికొకరు చొప్పున జ్వరంతో మంచంపడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు చింతకాని, ప్రతాపగిరి గ్రామస్తులు జ్వరాలతో బాధపడగా.. ప్రస్తుతం చింతకాని పంచాయతీ పరిధిలోని ఇబ్రహీంపల్లి, జాదారవుపేట, ధర్మాసాగర్ గ్రామస్తులు గజగజ వణుకుతున్నారు. ప్రతాపగిరిలో తగ్గుముఖం పట్టిన మళ్లీ విజృంభిస్తున్నాయి. ఒడిపిలవంచలో ముందస్తుగా వైద్య సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించినప్పటికీ జ్వరాలు తగ్గడం లేదు. ఐదు రోజులుగా ఆయా గ్రామాల్లో దాదాపు 100 మంది వరకు జ్వరాలతో బాధపడుతూ మంచం పట్టారు. కొందరు స్థానికంగా చికిత్స పొందుతుండగా.. మరికొందరు మండల కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. సిద్దం పిన్నయ్య, లక్ష్మి, రజిత, రాజయ్య, రాజు, మహేశ్, పోశం తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. పారిశుధ్యలోపమే ప్రధానం.. వాతావరణంలో మార్పుతోపాటు ముదిరిన ఎండలతోనే జ్వరాలు విజృంభిస్తున్నట్లు తెలిసింది. ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తుండడంతో జ్వరాలు తగ్గడం లేదు. అంతేకాకుండా పలు గ్రామాల్లోని కాలనీల్లో పారిశుధ్యం లోపించింది. మురగునీరు నిల్వ ఉండడంతో దోమలు పెరిగిపోతున్నాయి. కలుషిత నీరు, చేతిపంపుల నీరునే తాగుతున్నారు. ఇబ్రహీంపల్లిలో చికున్‌గున్యా లక్షణాలు మండలంలోని ఇబ్రహీంపల్లిలో జ్వరపీడితుల్లో ఎక్కువగా చికున్‌గున్యా లక్షణాలు కనిపిస్తున్నాయి. జ్వర బాధితుల్లో ఎక్కువ మంది కీళ్లు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. మిగతా గ్రామాల్లో జ్వరపీడితుల్లో రక్తకణాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతోపాటు మలేరియా జ్వరాల లక్షణాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒడిపిలవంచలో ఇటీవల పొన్న సుప్రియ అనే యువతి మలేరియాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. స్పందించని వైద్యసిబ్బంది మండలంలో జ్వరాలు విజృంభిస్తున్న వైద్యసిబ్బంది మాత్రం స్పందించడం లేదు. గ్రామాల్లోకి వెళ్లి వైద్యశిబిరాలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. పంచాయతీ పాలకవర్గాలు పట్టించుకుని పారిశుధ్య పనులు చేపట్టాలని వేడుకుంటున్నారు. -
ప్రారంభమైన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం బీఈడీలో ప్రవేశానికి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన, ర్యాంకు కార్డుల ఆధారంగా కళాశాలల ఎంపిక, వెబ్ ఆప్షన్ల నిర్వహించినట్లు కౌన్సెలింగ్ పరిశీలకులు వెంకట్రాంరెడ్డి తెలిపారు. మొదటి రోజు సోమవారం గణితం సబ్జెక్టుకు సంబంధించి నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మొత్తం 167 మంది హాజరయ్యారు. రెండో రోజైన మంగళవారం ఫిజికల్ సైన్సు సబ్జెక్టుకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. ర్యాంకు హోల్డర్లు సంబంధిత ర్యాంకు కార్డులతో పాటు సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని సూచించారు. నంగునూరులో మండల పరిధిలోని రాజగోపాల్‌పేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన బీఈడీ కౌన్సెలింగ్‌కు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంబం కాగా తొలి రోజు 182 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించారు. మధ్యాహ్నం బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో కౌన్సెలింగ్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి నెట్ పనిచేయడంతో అధికారులు తిరిగి కౌన్సెలింగ్ నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ నెల 30 వరకు కళాశాలలో వెబ్ఆప్షన్లు పెట్టుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. -
డీఎస్సీ నోటిఫికేషన్ తాత్కాలిక వాయిదా
హైదరాబాద్ : నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారమిక్కడ తెలిపారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పించాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. 2010 వరకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చిందని గంటా పేర్కొన్నారు. 2016వరకూ ఆ గడువు పెంచామని ఎన్సీపీఈకి లేఖ రాశామన్నారు. కేంద్రం అనుమతి ఇస్తే బీఈడీ విద్యార్థులకు ఎస్జీటీ రాసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. కేంద్రం నుంచి సమాధానం వచ్చాకే నోటిఫికేషన్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు డీఎస్సీ ప్రకటన వస్తుందని నిరుద్యోగులంతా ఎంతో ఆశగా ఎదురు చూశారు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే డీఎస్సీ ప్రకటనపై హామీ ఇవ్వడంతో అంతా నిజమే అనుకున్నారు. తీరా ఈనెల 5న డీఎస్సీ ప్రకటన వెలువడలేదు. ఎప్పటిలాగే ప్రభుత్వం ప్రకటనను వాయిదా వేసింది. దీంతో డీఎస్సీ అభ్యర్థులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. -
ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్
విలేకరులతో మంత్రి గంటా విశాఖపట్నం (సిరిపురం): బీఈడీ విద్యార్థులకు ఎస్జీటీ రాసుకునే అవకాశం కల్పిస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 5న ఇవ్వాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేయాల్సి వచ్చిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ రాసుకునే అవకాశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నాలుగు, ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ కచ్చితంగా ఇస్తామన్నారు. రాజధానికి కావల్సిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నప్పటికీ భౌగోళికంగా పక్కనుండడం వల్లే విజయవాడను రాజధానిగా ప్రకటించాల్సి వచ్చిందని చెప్పారు. ఏదేమైనా విశాఖను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గాల అభివృద్ధి నిధులు ఇచ్చే అవకాశం లేదని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రకటించారని, అలాంటప్పుడు నియోజకవర్గాల అభివృద్ధి ఎలా సాధ్యమని మంత్రిని ప్రశ్నించగా.. నిధులున్నా లేకపోయినా అభివృద్ధికి మాత్రం ఢోకా లేదని చెప్పుకొచ్చారు. -
ప్రజా పోలీసింగ్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రజల్లో చైతన్యం మరింత పెరగాలి. సమగ్ర, సమర్థ పోలీసింగ్‌కు ఇది అవసరం. కేసుల సత్వర పరిష్కారానికి ప్రజల సహకారం కావాలి. జిల్లా ప్రజల కోసం, శాంతిభద్రతల పరి రక్షణకు సమగ్ర పోలీసింగ్‌ను అభివృద్ధి చేస్తాను. అందుబాటులో ఉన్న సాంకేతిక వ్యవస్థను ఉపయోగించుకుని, ఉన్న సిబ్బందితోనే జిల్లా ప్రజ ల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పిస్తాను. వ్యక్తిగతం... మాది గుంటూరు జిల్లా.. ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బీఈడీ చదివా. కొన్నాళ్లు రామగుండంలోని కేంద్రీయ విద్యాలయంలో పనిచేశా. తరువాత గ్రూప్-1 రాసి 1991లో డీఎస్పీగా ఎంపికయ్యా. గతంలో మూడేళ్ల పాటు శ్రీకాకుళం జిల్లాలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా పనిచేశా. అందువల్ల జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. తొలిసారి శాంతిభద్రతల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పటికీ గతంలోనే జిల్లాలో అనువణువూ తిరగా. ఆ అనుభవం ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది. పోలీసులంటే ప్రజల్లో గౌరవం పెరిగేలా చేస్తా. జిల్లాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. జిల్లా ప్రజల గురించి.. శ్రీకాకుళం ప్రజలు మంచి హృదయం ఉన్నవాళ్లు. శ్రీకాకుళం జిల్లా స్పూర్తిదాయకం. ఎన్ని కష్టాలైనా తట్టుకొని.. ఎంతైనా దూరమైనా వెళ్లి బతకగలరు. కష్టపడటం ఇక్కడివారి మనస్తత్వం. కోడి రామ్మూర్తి వంటి మహానుభావులు పుట్టిన ఈ గడ్డలో.. పోరాటాలకు నెలవైన ఈ ప్రాంతంలో.. ఎంతోమంది చరిత్రకారులకు పుట్టినిల్లయిన శ్రీకాకుళంలో ఎస్పీగా పోస్టింగ్ రావడం సంతోషంగా ఉంది. మెరుగైన కంట్రోల్ రూం జిల్లాలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే తెలిసేలా కంట్రోల్ రూంలున్నాయి. అయితే ఇటీవల డయల్ 100గా దీనిని మార్చి రాజధానిలోని ఉన్నతాధికారులకే నేరుగా అనుసంధానం చేశారు. దీనివల్ల సత్వరం అధికారులకు సమాచారం అందడంతోపాటు, క్షణాల్లో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే వీలుంటుంది. దీనికి మరింత మెరుగులు దిద్ది ఇక్కడి కంట్రోల్ రూమును బలోపేతం చేస్తాం. మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేసేలా.. ముగ్గురు ఎస్ఐలు, ఇద్దరు సీఐలు పర్యవేక్షలుగా ఉంటారు. రోజువారీ (డీఎస్సార్) నివేదికలు ఉన్నతాధికారి వద్దకే వచ్చేలా చర్యలు చేపడతాం. దీనివల్ల మరింత పారదర్శకమైన, మెరుగైన పోలీసింగ్ సాధ్యమవుతుంది. అన్ని పోలీస్ స్టేషన్లకూ రిసెప్షన్ కేంద్రాలు ప్రజల్లో పోలీసుల పట్ల, పోలీస్ వ్యవస్థ పట్ల గౌరవం పెరగాలి. పోలీసులంటే భయం పోవాలి. ఫిర్యాదు ఇచ్చేందుకు ధైర్యంగా ముందుకు రావాలి. గతంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలంటేనే ఓ రకమైన భయం ఉండేది. ఇప్పుడు పరిస్థితి కొంత మారింది. ఇంకా మారాలి. పోలీసులు కూడా మన కుటుంబ సభ్యులే అన్న భావన రావాలి. ఇందుకోసం జిల్లాలో తొలిదశలో ఆమదాలవలస, వీరఘట్టం, సారవకోట, మెళియాపుట్టి, కాశీబుగ్గ, సంతబొమ్మాళి మండల కేంద్రాల్లో మహిళా రిసెప్షన్ కేంద్రాల నిర్మాణానికి అనుమతులొచ్చాయి. ఇప్పటికే మూడు కేంద్రాల్లో భవనాలు తయారవుతున్నాయి. త్వరలో జిల్లా వ్యాప్తంగా ఈ తరహా భవనాలొస్తాయి. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉండే ఈ రిసెప్షన్ కేంద్రాల్లో అధికారుల ఫోన్ నెంబర్లు, ఫిర్యాదు ఏ విధంగా చేయాలి, ఎవరిని కలవాలన్న వివరాలు ఫిర్యాదుదారులకు తెలియజేసేందుకు వీలుగా మహిళా కానిస్టేబుళ్లు అన్ని వేళల్లోనూ అందుబాటులో ఉంటారు. వచ్చిన వారు కూర్చునేందుకు, ఫిర్యాదు రాసుకునేందుకు, ప్రశాంత వాతావరణంలో తమ బాధలు చెప్పుకునేందుకు వీలుగా ఈ సెంటర్లుంటాయి. హైవే పెట్రోలింగ్.. బీట్ వ్యవస్థ పటిష్టత జాతీయ రహదారిపై చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో హైవే పెట్రోలింగ్, బీట్ల వ్యవస్థను మరింత పటి ష్టం చేసేందుకు నిర్ణయించాం. రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ ప్రభుత్వ విభాగాల సహకారంతో ముందస్తు భద్రతా చర్యలు చేపడతాం. బీట్ల వ్యవస్థను పరిపుష్టం చేసి ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుం టాం. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాం. గత ఏడాది జిల్లాలో 8 ప్రత్యేక పోలీస్ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో మహిళా పోలీస్‌స్టేషన్, సీసీఎస్, ట్రాఫిక్ స్టేషన్లు సిద్ధం కాగా, త్వర లో ఎచ్చెర్ల, సారవకోట, నౌపడా, నరసన్నపేట, ఇచ్చాపురం ప్రాంతాల్లో త్వరలో కొత్త భవనాలు కూడా రానున్నాయి. శ్రీకాకుళం, ఎచ్చెర్ల ప్రాం తాల్లో రెండు కొత్త బ్యారెక్లుసిద్ధం కాగా కాశీ బుగ్గ, కోటబొమ్మాళి ప్రాంతాల్లో కొత్త భవనాలు నిర్మించేందుకు సిబ్బంది పనులు చేపట్టారు. కేసుల మానిటరింగ్ సెల్ కోర్టుల్లో ఉన్న కేసుల్ని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా త్వరలో ఎస్పీ కార్యాలయం మేడపైనే కొత్తగా ‘కోర్టు మానిటరింగ్ సెల్’ రానుంది. ఇందులో ఓ ప్రత్యేక అధికారి తన సిబ్బందితో విధులు నిర్వహిస్తారు. కోర్టు కేసుల తేదీలను అధికారులు, నిందితులకు ఎప్పటికప్పుడు తెలియజేయడం, ఫైళ్లు పకడ్బందీగా నిర్వహించడం ఈ విభాగం విధి. ఉన్నతాధికారులతో సమాచారం పంచుకుంటూ, ప్రతి కేసుపైనా ప్రత్యేక నివేదికలు తయారు చేస్తూ, కేసు ల్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు వీలు గా ఈ సెల్ పనిచేస్తుంది. ఆన్లైన్ సమాచారాన్ని పొందుపరుస్తూ జిల్లాలో ఎక్కడ ఏ కేసు నమోదైనా, దాని వివరాలు క్షణాల్లో ఇక్కడకు వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా ప్రజలకు పోలీసులంటే ప్రత్యేక గౌరవం లభించేలా, అందరి సహకారంతో మరింత పకడ్బందీగా పోలీస్‌వ్యవస్థ పనిచేస్తుందని కచ్చితంగా చెప్పగలం. -
పడక మంచం @ రూ. 26 కోట్లు
మీరు వాడే బెడ్ ఖరీదెంత? రూ. 20 వేలో.. 30 వేలో.. మహా అయితే లక్ష రూపాయల దాకా ఉంటుంది. అదే ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వాడినదైతే..!? అభిమానులు ఎంతైనా పెట్టి కొనేస్తారు మరి! బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత చిత్రకారిణి ట్రేసీ ఎమిన్ ఉపయోగించిన బెడ్.. ఏకంగా రూ. 26 కోట్లు పలికింది. ఈ బెడ్‌తోపాటు ఎమిన్ ఉపయోగించిన మరకలు పడిన దుప్పట్లు, ఖాళీ వోడ్కా సీసాలు, సిగరెట్ పీకలు, వాడేసిన కండోమ్‌లు కూడా ఉన్న ఈ సెట్ మొత్తాన్నీ క్రిస్టీస్ సంస్థ వేలం వేయగా.. లండన్‌కు చెందిన ఓ వ్యక్తి దానిని కొనుక్కున్నాడు. మరో విషయం ఏమిటంటే.. ఈ వేలానికి ట్రేసీ ఎమిన్ కూడా హాజరై, దీనిని కొనుక్కున్న వ్యక్తిని అభినందించారు కూడా. -
ఓయూ దూరవిద్య బీఈడీలో 86 సీట్లు మిగులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉస్మానియా వర్సిటీ దూరవిద్య బీఈడీ (డిస్టెన్స్ మోడ్) కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ పూర్తి అయిన తర్వాత ఇంకా 86 సీట్లు మిగిలి నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ శివరాజ్ తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన ఆసక్తి గల ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు నాలుగు రోజుల్లో మిగిలిన సీట్లలో చేరవచ్చన్నారు. పూర్తి వివరాలకు 9440567567 నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. -
టెట్టా.. వీఆర్ఓనా?
జిల్లాలో టెట్ కోసం 21,261 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్ - 1 రాసేవారు (డీఈడీ అభ్యర్థులు) 2062 మంది, పేపర్ -2 రాసేవారు (బీఈడీ అభ్యర్థులు) 18,936 మంది ఉన్నారు. బీఈ డీ, డీఈడీ రెండూ పూర్తి పేపర్లు -1,2 రాసే వారు 263 మంది ఉన్నారు. చాలామంది ఇటీవల వెలువడిన వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగాల నియామకం కోస దరఖా స్తు చేశారు. ఇందుకోసం కొందరు సొంతంగా సన్నద్ధమవుతున్నారు. మరికొందరు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. ఫిబ్రవరి 2న వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 9వ తేదీన టెట్ నిర్వహిం చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటిం చారు. దేనికి ప్రాధాన్యమివ్వాలో అర్థంగాక అయోమయానికి గురువుతున్నారు. ఇన్నాళ్లూ టెట్‌పై స్పష్టత లేకపోవడంతో చాలా మంది వీఆర్ఓ, వీఆర్ఏకు దరఖాస్తు చేశారు. ఇక ఇప్పుడు టెట్ నిర్వహిస్తుండడం తో దేనికి సన్నద్ధం కావాలో తేల్చుకోలేక పోతున్నారు. ఇప్పటిదాకా రెవెన్యూ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాం కానీ, బీఈడీ చదివి టెట్ పాస్‌కాకపోతే ఎలా? రేపటి నుంచి మళ్లీ ఈ పుస్తకాలే చేతపడతాం అని కొందరు అభ్యర్థులు అంటున్నారు. వీఆర్ఓ పరీక్ష తర్వాత వారం రోజుల టైముంది కదా.. ముందు వీఆర్ఓ పరీక్ష రాసి ఆ తర్వాత టెట్‌కు పునశ్చరణ చేస్తామని మరికొంద రంటున్నారు. టెట్ కోసం దరఖాస్తు చేసిన వారు: 21,261 మంది వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు: ఫిబ్రవరి 2 టెట్ : ఫిబ్రవరి 9 -
డీఈడీ 4, బీఈడీ 2 ఏళ్లు
-
డీఈడీ 4, బీఈడీ 2 ఏళ్లు
జస్టిస్ వర్మ కమిటీ సిఫారసుల అమలుకు సన్నాహాలు.. సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ విద్యా కోర్సుల్లో సమూల సంస్కరణలు రాబోతున్నాయి. కోర్సుల కాలపరిమితులతో పాటు నాణ్యతకు సంబంధించి పెద్ద ఎత్తున్న మార్పులు రాబోతున్నాయి. జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసులను వచ్చే ఏడాది నుంచే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ) కోర్సు అందుబాటులో ఉండగా.. ఇకపై దీనికి బదులుగా ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వెంటనే ఈ కోర్సులో చేరొచ్చు. అలాగే ప్రస్తుతం డిగ్రీ అర్హతతో ఏడాది కాలపరిమితి గల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సు అందుబాటులో ఉంది. ఇక ఈ కోర్సు కాలపరిమితిని రెండేళ్లకు పెంచనున్నారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను అమలుచేయనున్నారు. అలాగే ఎంఈడీ కోర్సును ప్రస్తుత కాలపరిమితి ఏడాది నుంచి రెండేళ్లకు పెంచనున్నారు. దీనిలో స్పెషలైజేషన్ బ్రాంచి ఎంచుకునే అవకాశం కల్పించనున్నారు. ఇది వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలుకానుంది. యూజీసీ, ఎన్సీటీఈలు ఈ కోర్సుల అమలు బాధ్యతను తీసుకోనున్నాయి. జస్టిస్ వర్మ కమిటీ మొత్తం 30 సిఫారసులను చేసింది. వీటన్నింటినీ 2014-15 విద్యాసంవత్సరం నుంచే అమలుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అమలుకు వర్సిటీలను సన్నాహ పరిచేందుకు గురువారం ఎంహెచ్ఆర్డీ కార్యదర్శి ఆర్.భట్టాచార్య, సహాయక కార్యదర్శి డాక్టర్ అమర్జిత్సింగ్, ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి (ఎన్సీటీఈ) చైర్మన్ సంతోష్‌పండా రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని వర్సిటీల ఉపకులపతులతో వర్మ కమిటీ సిఫారసులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. పెరగనున్న ప్రభుత్వ కళాశాలలు... ఇప్పటివరకు ఉపాధ్యాయ విద్యా కోర్సులైన డీఈడీ, బీఈడీ కోర్సులను అందిస్తున్న కళాశాలల్లో 97 శాతం ప్రైవేటు కళాశాలలే. మన రాష్ట్రంలో 647 బీఈడీ కళాశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు కేవలం 20 మాత్రమే ఉండగా వీటిలో 2,499 సీట్లు ఉన్నాయి. మొత్తం సీట్లలో వీటి వాటా కేవలం 3.6 శాతం మాత్రమే. ఇక ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సరైన శిక్షణ కూడా లేదు. రాష్ట్రం మొత్తంలో 22 శాతం ప్రైవేటు స్కూళ్లు ఉండగా.. రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయుల్లో 38 శాతం మంది ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నారు. జస్టిస్ వర్మ కమిటీ ఉపాధ్యాయ కోర్సులు అందించేందుకు ప్రభుత్వం తగిన పెట్టుబడులు పెట్టాలని, ప్రభుత్వ కళాశాలలు పెంచాలని సిఫారసు చేసింది. దీనిపై ఇప్పటికే కేంద్రం రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు కోరింది. అలాగే కొత్త కళాశాలలన్నీ విభిన్న కోర్సుల సంకలనంగా ఉండాలని కమిటీ సిఫారసు చేసింది. ఉపాధ్యాయ కోర్సులన్నింటినీ ఇకపై ఉన్నత విద్య పరిధిలోకి తేవాలని కూడా ప్రతిపాదించింది. ఉపాధ్యాయ విద్య జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ 2009-10 కి అనుగుణంగా ఉపాధ్యాయ విద్యా కోర్సులన్నింటినీ సమూలంగా నవీకరించాలని ప్రతిపాదించింది. అనుబంధంగా బోధన పాఠశాల.. ప్రతి ఉపాధ్యాయ విద్యా శిక్షణ సంస్థకు అనుబంధంగా ఒక పాఠశాల ఉండాలని జస్టిస్ వర్మ కమిటీ ప్రతిపాదించింది. దీని ద్వారా ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం పెరుగుతుందని, సృజనాత్మక ప్రయోగాలకు వీలుపడుతుందని సిఫారసు చేసింది. ఈ విధానం మార్చి 2014 నుంచే ప్రారంభం కానుంది. అలాగే ఉపాధ్యాయ విద్యలోని తొలి కోర్సులన్నీ కచ్చితంగా తరగతి గది ద్వారానే ఉండాలని, దూర విద్య కోర్సులు కేవలం సర్వీసులో ఉన్న టీచర్లకు మాత్రమే అందుబాటులోకి తేవాలని కమిటీ సిఫారసు చేసింది. సర్వీసులో ఉన్న టీచర్లకు, ముఖ్యంగా సెకండరీ స్కూల్ టీచర్లకు ఎప్పటికప్పుడు వృత్తిపరమైన అభివృద్ధి ఉండేలా తగిన శిక్షణ అందించాలని, ఉపాధ్యాయ విద్యా కోర్సుల నియంత్రణకు ఒక జాతీయ స్థాయి యంత్రాంగం ఏర్పాటుచేయాలని సూచించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేసేందుకు తగిన యంత్రాంగం ఉండాలని సూచించింది. -
బీఈడీ అడ్మిషన్లు ఫుల్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: సిక్కోలు జిల్లాలో బీఈడీ కోర్సుకు ఆదరణ తగ్గలేదు. ఉన్నత విద్యామండలి రెండో విడత నిర్వహించిన కౌన్సెలింగ్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అనుబంధ పైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లు శతశాతం భర్తీ అయ్యూయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో 83.45 శాతం మాత్రమే నిండాయి. జిల్లాలో 14 కళాశాలలు ఉండగా 1460 సీట్లు ఉన్నాయి. వీటిలో కన్వీనర్ సీట్లు 1088 కాగా 908 సీట్లు మొదటి కౌన్సెలింగ్‌లో నిండాయి. రెండో కౌన్సెలింగ్‌కు కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న సెయింట్మాక్సు(మందస)లో కూడా 75 కన్వీనర్ సీట్లు నిండి పోయాయి. 25 శాతం మేనేజ్ మెంట్సీట్లు నేరుగా యూజ మాన్యాలు భ ర్తీ చేసుకుంటాయి. గత ఏడాది మొదటి విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో 1110 సీట్లకు 924 (83.24శాతం) సీట్లు నిండాయి. అనంతరం రెండో కౌన్సెలింగ్‌లో మొత్తం సీట్లు నిండటంతో పాటు, మేనేజ్ మెంట్ కోటా సీట్లు కూడా శతశాతం భర్తీ అయ్యూయి. ఈ ఏడాది కూడా జిల్లాలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ అడ్మిషన్లు తగ్గుతూ వస్తున్నాయి. కొన్ని జిల్లాలో 70 శాతానికి మాత్రమే ఈ ఏడాది పరిమితమయ్యాయి. డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ వారిని అనుమతించక పోవడం, కళాశాలు ఒక్కసారిగా పెరిగిపోవడం, ఎడ్‌సెట్ రాస్తున్న వారి సంఖ్య తగ్గడం వంటివి ప్రవేశాలకు ప్రతిబంధకంగా మారారుు. ఈ ఏడాది సీట్లు నిండవని ప్రైవేటు యాజమాన్యాలు ఆందోళన చెందాయి. పూర్తిస్థాయిలో అడ్మిషన్లు జరగడంతో ఊపిరి పీల్చుకున్నాయి. ఒక్క కళాశాలకే అనుమతి లేదు గతంలో వర్సిటీ పరిధిలో జిల్లాలో 16 బీఎడ్ కళాశాలలు ఉండేవి. కొన్ని కారణాలు వల్ల నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంస్థ 120 సీట్లు ఉన్న పలాస కాశీబుగ్గలోని సాయశిరీష కు అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఈ కళాశాలలో ఈ ఏడాది అడ్మిషన్లు నిర్వహించలేదు. ఈ ఏడాది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలోని స్సెషల్ బీఈడీ మెంటల్లీ రిటార్డ్ కోర్సులో అడ్మిషన్లు ఎడ్‌సెట్ ర్యాంకులు ద్వారానే ప్రవేశాలు కల్పించారు. 25 సీట్లకు మొత్తం నిండి పోయాయి. బీఈడీ కన్వీనర్ సీట్లు భర్తీలో మొదటి విడత కౌన్సెలింగ్‌లో సోషల్ స్టడీస్ 30, గణితం 25, బయోలాజికల్ సైన్సు 25, ఫిజకల్ సైన్సు 15, ఇంగ్లిష్ 5 శాతం కోటాలో భర్తీచేశారు. రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించడంతో మొదటి విడతలో బయోలాజికల్ సైన్సు, ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్ సబ్జెక్టులలో ర్యాంకర్లు తగినంతగా లేకపోవడంతో కన్వీనర్ కోటా సీట్లు మిగిలిపోయూయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో సబ్జెక్టు కన్వర్షన్‌కు వీలుండటంతో అడ్మిషన్లు మెరుగు పడ్డాయి. గత ఏడాది వెబ్ కౌన్సెలింగ్‌కు 1691 మంది హాజరు కాగా, ఈ ఏడాది ఎడ్‌సెట్ 4532 మంది రాయగా 1569 మంది హాజరయ్యారు. రెండో కౌన్సెలింగ్‌కు 32 మంది హాజరయ్యారు. 90 మంది వరకు సీట్లురాక వారి ధ్రువపత్రాలను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ సహాయ కేంద్రానికి వచ్చి తీసుకెళ్లారు. మారిన ఫీజు స్ట్రక్చర్... ఈ ఏడాది నుంచి బీఈడీ కళాశాలల ఫీజు స్ట్రక్చర్ కూడా ఇంజినీరింగ్ కళాశాలలు మాదిరిగా మారాయి. ఫీజుల నియంత్రన మండలి నిర్ణయిస్తుంది. గతంలో ప్రైవేటు కళాశాలలన్నింటి ఫీజు ఒకేలా ఉండేది. ప్రస్తుతం కళాశాలల వసతి బట్టి 17 వేలు నుంచి 22 వేల వరకు నిర్ణయించారు. కామన్ ఫీజు, స్పెషల్ ఫీజులతో కలిపి రూ.15వేల వరకు ప్రభుత్వం అర్హత గల వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తుంది. కళాశాలలు తమ భవనాలు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఫీజుల నియంత్రణ కమిటీకి అందజేయూల్సి ఉంటుంది. మేనేజ్మెంట్ సీట్లకు తగ్గిన డిమాండు బీఈడీ కళాశాలల్లో 25 శాతం మేనేజ్ మెంట్ కోటాలో సీట్లు నింపుతారు. ప్రస్తుతం మేనేజ్ మెంట్ కోటా సీట్లకు గతంతో పోల్చితే డిమాండు తగ్గింది. గతంలో రూ.లక్ష నుంచి రూ.50 వేల మధ్య సబ్జెక్టు బట్టి సీట్లకు డిమాండు ఉండేది. సోషల్ స్టడీస్‌కు డిమాండు ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం గిరాకీ తగ్గింది. కళాశాల బట్టి రూ. 30వేల నుంచి 40వేల మధ్య మేనేజ్ మెంట్లు వసూలు చేస్తున్నారుు. వాస్తవంగా కన్వీనర్ ఫీజులకు సమానంగా మాత్రమే వసూలు చేయాలి. ఈ నిబంధన ఎక్కడా అమలుకావడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో శతశాతం మేజేజ్ మెంట్ సీట్లు నిండే అవకాశం ఉంది. అయితే, అధిక మొత్తంలో డబ్బులు చెల్లించేందుకు విద్యార్థులు సిద్ధంగాలేనట్టు కనిపిస్తోంది. అనధికార వసూళ్లు! ఉన్నత విద్యామండలి హెచ్చరికలు జారీ చేస్తు న్నా ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో అనధికార వసూ ళ్లు తగ్గడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. దాదాపుగా అన్ని ప్రైవేటు కళాశాలలు కూడా బిల్డింగ్, కాలేజ్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో అనధికార వసూళ్లకు పాల్పడుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు అనధికార భారం వేస్తున్నారని వాపోతున్నారు. ఉన్నత విద్యామండలి మాత్రం ఈ వసూళ్లపై ఎప్పటి నుంచే నిఘా పెట్టింది. అయినా కళాశాలలు మాత్రం పెడచెవిన పెడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. -
11వరకు బీఎడ్ ప్రవేశ గడువు పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈనెల 11వ తేదీ వరకు సంబంధిత కళాశాలలో చేరవచ్చని కన్వీనర్ ఆచార్య నిమ్మ వెంకటరావు ఓ ప్రకటనలో తెలిపారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలు పొంది ఇంకాచేరని విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గడువు పెంచామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలల్లో చేరని విద్యార్థులు సంబంధిత హెల్ప్‌లైన్ కేంద్రాల నుంచి ఈనెల 11 నుంచి సర్టిఫికెట్లు పొందవచ్చు. 11 నుంచి ‘మను’లో బీఈడీ కౌన్సెలింగ్ హైదరాబాద్, న్యూస్‌లైన్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం(మను)లో బీఈడీ మొదటి సంవత్సరం(దూరవిద్య) విద్యార్థులకు ఈ నెల 11 నుంచి 28 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు వర్సిటీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. అభ్యర్థులు క్యాంపస్‌లోని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ భవనానికి 11న మధ్యాహ్నం 2 గంటలకు హజరుకావాలని పేర్కొన్నాయి.