సాక్షి, హైదరాబాద్: ఓపెన్ డిగ్రీ చేసి, బీఈడీ పూర్తి చేసిన వారూ ఉపాధ్యాయ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తు విధానంలో స్వల్ప మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఇంటర్మీడియెట్ చదవకుండా గతంలో డైరెక్ట్ డిగ్రీ (దూర విద్య ద్వారా) చేసినవారు తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామకాల దరఖాస్తు ఫారంలో ఇంటర్ విద్య వివరాలను పొందుపరచాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని అభ్యర్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై విద్యాశాఖ సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment