open degree
-
ఓపెన్ డిగ్రీ, పీజీ అడ్మిషన్లకు నోటిఫికేషన్
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ (ఎంఏ/ఎంకాం/ ఎంఎస్సీ) కోర్సులు, బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2023–24 విద్యా సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యా ర్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in,www.braou.ac.in లో పొందవచ్చని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 29 అని, అలాగే రూ. 200ల ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. అడ్మి షన్/ ట్యూషన్ ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా లేదా టీఎస్/ఏపీ ఆన్లైన్ ఫ్రాంఛైజ్ సెంటర్ల ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యా లయ హెల్ప్‌డెస్క్ నెంబర్లు 73829 29570/ 580, 040–23680222/333/555లో సంప్రదించవచ్చని సూచించారు. -
ఉపాధ్యాయ పోస్టులకు ఓపెన్ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులే
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ డిగ్రీ చేసి, బీఈడీ పూర్తి చేసిన వారూ ఉపాధ్యాయ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తు విధానంలో స్వల్ప మార్పులు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇంటర్మీడియెట్ చదవకుండా గతంలో డైరెక్ట్ డిగ్రీ (దూర విద్య ద్వారా) చేసినవారు తర్వాత బీఈడీ పూర్తి చేశారు. ఉపాధ్యాయ నియామకాల దరఖాస్తు ఫారంలో ఇంటర్ విద్య వివరాలను పొందుపరచాల్సి రావడంతో ఇబ్బంది ఎదురవుతోందని అభ్యర్థులు అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై విద్యాశాఖ సానుకూలంగా స్పందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి. -
నీకు తోడుగా నాన్న ఉన్నాడమ్మా!
సాక్షి, ఆదిలాబాద్ : ఆడపిల్లలు భారమనుకుంటున్న ఈ రోజుల్లో ఓ తండ్రి అంగవైకల్యం గల తన కూతురును పరీక్ష కేంద్రానికి స్వయంగా తీసుకొచ్చి పరీక్ష రాయించాడు. పట్టణంలోని కోలిపుర కాలనీకి చెందిన మందుల్వార్ బావురావుకు అంగ వైకల్యం ఉన్న కూతురు వికిత ఉంది. అయితే ఆమె బంగారు భవిష్యత్తు కోసం బావురావు తన కూతురును ఓపెన్‌లో డిగ్రీ చదివిస్తున్నాడు. అయితే సోమవారం పరీక్షలు రాయడానికి ప్రభుత్వ డిగ్రీ బాలుర కళాశాల పరీక్ష కేంద్రానికి ఆమెను తీసుకొచ్చి ‘నీకు తోడుగా నాన్న ఉన్నాడమ్మా’ అంటూ ధైర్యాన్నిచ్చాడు. కాగా వికితకు సహాయంగా పదవ తరగతి విద్యార్థి పరీక్ష రాశాడు. -
దూర..పరీక్ష
డిగ్రీ పరీక్షలు ఎప్పుడుంటాయి..? ఇదేం ప్రశ్న.. ఏటా మార్చిలోనో.. ఏప్రిల్‌లోనో ఉంటాయంటారా..! కానీ ఎస్కేయూ దూరవిద్య అధికారులు మాత్రం కాస్త డిఫరెంట్. రెండేళ్లు..లేదా మూడేళ్లవి కలిపి ఒకేసారి నిర్వహిస్తారు..! పోనీ అదైనా తేదీ చెప్పండని అడిగితే.. అంతా మా ఇష్టం అంటున్నారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడిపోయారు. ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో దూరవిద్య గతితప్పింది. స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తే పరీక్షలు నిర్వహిస్తామని ఓ విభాగం అధికారులు... పరీక్షల షెడ్యూల్ విడుదల చేస్తే స్టడీ మెటీరియల్ అందజేస్తామని మరో విభాగం అధికారులు చెప్పుకుంటూ కాలం వెళ్లదీయడంతో విద్యార్థులకు దిక్కుతోచడం లేదు. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కోర్సు గడువు పూర్తయినప్పటికీ, కేవలం ఒక సంవత్సరం పరీక్షలు మాత్రమే అధికారులు నిర్వహించారు. దీంతో డిగ్రీ కోర్సు చదివే విద్యార్థులు రెండు విద్యాసంవత్సరాలు నష్టపోయారు. పీజీ చదివే విద్యార్థులకు 2017లోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, 2018 –19 విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ.. పరీక్షలు నిర్వహించలేదు. ఫలితంగా డిగ్రీ, పీజీ విద్యార్థులు కోర్సులు పూర్తి చేయలేక నష్టపోతున్నారు. విభజనతోనే సమస్య దూరవిద్య విభాగాన్ని అడ్మిషన్ల విభాగం, పరీక్షల విభాగంగా విభజించారు. ఇలా రెండు విభాగాలుగా విభజిస్తే పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన వేగవంతం అవుతుందని అందరూ భావించారు. అయితే ఈ నిర్ణయంతో దూరవిద్య విభాగం పూర్తిగా గాడి తప్పడంతో పాటు విద్యార్థులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇబ్బంది పడుతున్న అభ్యర్థులు డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడుతున్న క్రమంలో సకాలంలో కోర్సులో అడ్మిషన్ పొందినా..ఫలితం లేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా దూరవిద్యలో పదోన్నతులు, అర్ధంతరంగా ఆగిన ఉన్నత విద్యను కొనసాగించే వారే ఎక్కువ మంది ఉన్నారు. పదోన్నతి అవకాశం వచ్చినప్పటికీ, డిగ్రీ, పీజీ కోర్సు పూర్తి కాకపోవడంతో కెరీర్ మరింత ఇబ్బందిలో పడే పరిస్థితి నెలకొంది. స్టడీ మెటీరియల్ పంపిణీలో నిర్లక్ష్యం కోర్సులో అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికీ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయాలి. కోర్సు ఫీజులోనే స్టడీ మెటిరీయల్‌కు సంబంధించిన మొత్తాన్ని కట్టించుకుంటారు. డిగ్రీ రెండో , మూడో సంవత్సరం విద్యార్థులు మొత్తం 32 వేల మంది, పీజీ రెండో సంవత్సరానికి సంబంధించి 12 వేల మంది విద్యార్థులు కోర్సు ఫీజు చెల్లించారు. వీరిలో సగం మందికి కూడా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయలేదని విద్యార్థులు చెబుతున్నారు. స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అందితే పరీక్షలు నిర్వహిస్తామని పరీక్షల అధికారులు, పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తే స్టడీ మెటీరియల్ అందేలా చర్యలు తీసుకుంటామని దూరవిద్య అధికారులు ఇరువురు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. మెటీరియల్ సరఫరా కాంట్రాక్ట్æ ముగిసింది స్టడీ మెటీరియల్ పంపిణీ చేసే కాంట్రాక్ట్ గడువు ముగిసింది. మెటీరియల్ సరఫరాకు తిరిగి టెండర్లు పిలవాలి. స్టడీ మెటీరియల్ ముద్రించే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తే.. మెటీరియల్ పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ బీవీ రాఘవులు,దూరవిద్య డైరెక్టర్, ఎస్కేయూ -
బేరం కుదిరితే పరీక్షంతా ఓపెనే..
సాక్షి, మెట్పల్లి(కోరుట్ల): కాసులిస్తే చాలు.. ఆ పరీక్ష కేంద్రంలో సిబ్బంది కాపీయింగ్‌కే కాదు ఏకంగా అభ్యర్థులకు బదులు వారిస్థానంలో ఇతరులు వచ్చి పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. బేరం కుదిరితే దగ్గరుండి చిట్టీలు అందించి ఉత్తీర్ణతకు సహకరిస్తారు. మెట్‌పల్లిలోని ఓపెన్ డిగ్రీ పరీక్ష కేంద్రాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ‘ఓపెన్’గా అక్రమాలు జరుగుతున్నాయి. మాస్‌కాపీయింగ్‌కు ప్రత్యేకం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు పేరొందిన మెట్పల్లి కేంద్రంలో కొత్త అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం కేవలం చిట్టీలతో కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే ప్రచారం ఉన్న ఈ కేంద్రంలో తాజాగా ఒకరికి బదులు ఇతరులు పరీక్ష రాస్తున్న విషయం బయటపడింది. సిబ్బంది అండతో బహిరంగంగా సాగుతున్న ఈ వ్యవహారంలో బుధవారం కథలాపూర్ ఎంపీపీ తొట్ల నర్సు భర్త తొట్ల అంజయ్యకు బదులు మరో యువకుడు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. ఇదీ జరిగింది... పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత సోమవారం నుంచి ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఇక్కడ విద్యార్థుల స్థానంలో ఇతరులు పరీక్ష రాస్తున్నారని కొందరు ప్రిన్సిపాల్ ఆబిద్ అలీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పట్టించుకోలేదు. అబ్జర్వర్ హరిశంకర్‌కు తెలుపగా ఆయన విద్యార్థుల వద్దకు వెళ్లి హాల్ టిక్కెట్లు పరిశీలించారు. తోట్ల అంజయ్య అనే పేరుతో పరీక్ష రాస్తున్న ఓ వ్యక్తిపై అనుమానం వచ్చి ఆన్లైన్లో పరిశీలించారు. అందులో మరో వ్యక్తి ఫొటో ఉండడంతో పరీక్ష రాస్తున్న వ్యక్తి నకిలీ అని తేలింది. అసలు వ్యక్తి కథలాపూర్ ఎంపీపీ భర్త కాగా, అతని స్థానంలో కోరుట్లకు చెందిన ఓ యువకుడి ఫొటోను మార్పింగ్ చేసి హాల్ టిక్కెట్ సృష్టించారు. దాంతో యువకుడు పరీక్షకు హాజరై పట్టుబడ్డాడు. కొద్దిసేపటికి అక్కడి వచ్చిన పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. సిబ్బంది అండతో పరీక్షకు వచ్చినట్లు ఆ యువకుడు చెప్పడం కొసమెరుపు. దీంతో ఇరువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ కూతురిని వదిలేసిన వైనం ? కేంద్రంలో ఓ కానిస్టేబుల్ కూతురు కూడా తన సోదరి స్థానంలో మూడ్రోజులుగా పరీక్షకు హాజరవుతున్నట్లు సమాచారం. ఇది పూర్తిగా సిబ్బంది సహకారంతోనే సాగుతున్నట్లు తెలిసింది. యువకుడు పట్టుబడిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై ఆమెను పరీక్ష మధ్యలోనే కేంద్రం ఉంచి బయటకు పంపడం గమనార్హం. -
6న ఓపెన్ డిగ్రీ అర్హత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 6న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురం ప్రాంతీయ సమన్వయ కేంద్ర కోఆర్డినేటర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. ఇప్పటికే అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆర్ట్స్ కళాశాలలోని కేంద్రం నుంచి హాల్ టికెట్లు పొందాలన్నారు. -
ఓపెన్ డిగ్రీ ప్రవేశానికి 26న అర్హత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ) ద్వారా డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరం ప్రవేశానికి ఈ నెల 26న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్. రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని వివరించారు. రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, అనంతపురం కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యయన కేంద్రాల విద్యార్థులకు ఆర్ట్స్ కళాశాలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
25 నుంచి ‘ఓపెన్’ విద్యార్థులకు ప్రాక్టికల్స్
అనంతపురం రూరల్ : అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం బీఎస్సీ డిగ్రీ మూడవ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 25 నుంచి ఆర్ట్స్ కళాశాలలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి మార్చి 2 వరకు జూవాలజీ, మార్చి3 నుంచి 8 వరకు బోటనీ, మార్చి 9 నుంచి 14 వరకు కెమెస్ట్రీ, మార్చి15 నుంచి 20వరకు ఫిజిక్స్ ప్రాక్టికల్స్ ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయన్నారు. -
26న ఓపెన్ డిగ్రీ ప్రవేశ అర్హత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ)కోర్సులో ప్రవేశానికి ఈనెల 26న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ వై.శివచంద్ర తెలిపారు. ఆదివారం ఆర్ట్స్ కళాశాలలోని అధ్యయన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్, సమానమైన విద్యార్హత లేని వారు డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశానికి అర్హత పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందన్నారు. అందుబాటులో ఉన్న నెట్కేంద్రానికి వెళ్లి ఠీఠీఠీ.bట్చౌఠౌn జీn్ఛ.జీn పోర్టల్‌ను ఓపెన్ చేస్తే అర్హత పరీక్ష దరఖాస్తు లింక్ ఉంటుందని వివరించారు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే దరఖాస్తు ఓపెన్ అవుతుందని, విద్యార్థి తన పూర్తి వివరాలు నమోదు చేసి ఫొటో స్కాన్ చేయాలని సూచించారు. అప్లోడ్ చేసిన దరఖాస్తును ప్రింట్ తీసుకుంటే దానిపై తొమ్మిది అంకెల సంఖ్య వస్తుందన్నారు. ఆసంఖ్య ఆధారంగా ఏపీ ఆన్లైన్ లేదా తెలంగాణ ఆన్లైన్ కేంద్రాల్లో కమీషన్‌తో కలిపి రూ. 310 ఫీజు చెల్లించి రశీదు పొందాలన్నారు. బ్యాంకు డెబిట్ కార్డు, క్రెడిట్‌కార్డు ద్వారా కూడా ఫీజు చెల్లించే వీలుందన్నారు. ఈ ఏడాది జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే వారు దరఖాస్తుకు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 08554–222448, సెల్ 73829 29602 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
నేటి నుంచి దూరవిద్య డిగ్రీ పరీక్షలు
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వీతీయ, తృతీయ సంవత్సర పరీక్షలు ఈనెల 3 నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 4 నుంచి పీజీ పరీక్షలు జరగబోతున్నాయి. మొత్తంగా 91 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 16,866 మంది, ద్వితీయ సంవత్సరంలో 12,994 మంది, తృతీయ సంవత్సర విద్యార్థులు 12,241 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. పీజీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 5,380 మంది, ఫైనల్ ఇయర్లో 4,637 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని అధికారులు తెలిపారు. పది స్పెషల్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. -
కొలిక్కి వచ్చిన అబ్జర్వర్ల నియామకం
దూర విద్య డిగ్రీ, పీజీ పరీక్షల్లో రెగ్యులర్ అధ్యాపకులకే విధులు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు సెప్టెంబర్ 3 నుంచి, పీజీ పరీక్షలు 4 నుంచి జరుగనున్నాయి. ఈ పరీక్షలకు అబ్జర్వర్లుగా విధులు నిర్వర్తించేందుకు విపరీతంగా పోటీ పెరిగింది. పలువురు అబ్జర్వర్లు తాము కోరుకున్న చోటే డ్యూటీ వేయాలని అధికారులను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కమిటీ సభ్యులతో చర్చించిన కేయూ వీసీ, ప్రొఫెసర్ సాయన్న ఓ నిర్ణయానికి వచ్చారు. మెుత్తం 91 పరీక్ష కేంద్రాలు కేయూతో పాటు శాతవాహన, మహాత్మాగాంధీ, తెలంగాణ, ఉస్మానియా తదితర విశ్వవిద్యాలయాల పరి ధిలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఉన్నాయి. ఆయా యూనివర్సిటీల పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్ష కేంద్రాల్లో అక్కడి కళాశాలల రెగ్యులర్ అధ్యాపకులకే అబ్జర్వర్లుగా డ్యూటీలు వేయాలని కేయూ వీసీ ఆర్.సాయన్న పలువురు వీసీలకు ఫోన్ చేసి కోరారు. అందుకు ఆయా వర్సిటీల వీసీలు కూడా అంగీకరించారు. కాగా, ఆదిలాబాద్ జిల్లాలోని పరీక్షా కేంద్రాలకు అబ్జర్వర్ల నియామక బాధ్యతలను కూడా తెలంగాణ వర్సిటీ వీసీకి అప్పగించారు. దీంతో ఎక్కువ శాతం అబ్జర్వర్ల డ్యూటీలు వేసే విషయంలో సమ స్య పరిష్కారమైంది. ఇక కేయూ పరిధిలోని వరంగల్ జిల్లాలో 10, ఖమ్మం జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలున్నాయి. వీటిలోనూ ఈ యూనివర్సిటీలోని రెగ్యులర్ లెక్చరర్లను అబ్జర్వర్లుగా డ్యూటీలు వేయబోతున్నారని సమాచారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్ట్ టైం, కాంట్రాక్టు లెక్చరర్లకు డ్యూటీలు వేయకపోవచ్చని భావిస్తున్నారు. పరీక్షలకు రెండు రోజులే మిగిలి ఉండటం గమనార్హం. -
ఓపన్ డిగ్రీ ప్రవేశానికి 20న తుది గడువు
అనంతపురం సప్తగిరి సర్కిల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపన్ డిగ్రీలో ప్రవేశానికి ఈనెల 20న తుది గడువు అని అనంతపురం మహిళా అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ రామచంద్రుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి 2012–2016 వరకు అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన వారు, ఐటీఐ, ఇంటర్మీడియట్, ఓపన్ ఇంటర్, పాలిటెక్నిక్, నర్సింగ్ 10+2 పాసైన వారు అర్హులన్నారు. అదేవిధంగా ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు ఈనెల 20 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 08554–245908 నంబర్‌కు సంప్రదించాలన్నారు.