
బంజారాహిల్స్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ (ఎంఏ/ఎంకాం/ ఎంఎస్సీ) కోర్సులు, బీఎల్‌ఐసీ, ఎంఎల్‌ఐసీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2023–24 విద్యా సంవత్సరం ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల అయినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యా ర్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in,www.braou.ac.in లో పొందవచ్చని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 29 అని, అలాగే రూ. 200ల ఆలస్య రుసుముతో మార్చి 31 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.
అడ్మి షన్/ ట్యూషన్ ఫీజును క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా లేదా టీఎస్/ఏపీ ఆన్‌లైన్ ఫ్రాంఛైజ్ సెంటర్ల ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. పూర్తి సమాచారం కోసం సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యా లయ హెల్ప్‌డెస్క్ నెంబర్లు 73829 29570/ 580, 040–23680222/333/555లో సంప్రదించవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment