సాక్షి, ఆదిలాబాద్ : ఆడపిల్లలు భారమనుకుంటున్న ఈ రోజుల్లో ఓ తండ్రి అంగవైకల్యం గల తన కూతురును పరీక్ష కేంద్రానికి స్వయంగా తీసుకొచ్చి పరీక్ష రాయించాడు. పట్టణంలోని కోలిపుర కాలనీకి చెందిన మందుల్వార్ బావురావుకు అంగ వైకల్యం ఉన్న కూతురు వికిత ఉంది. అయితే ఆమె బంగారు భవిష్యత్తు కోసం బావురావు తన కూతురును ఓపెన్‌లో డిగ్రీ చదివిస్తున్నాడు. అయితే సోమవారం పరీక్షలు రాయడానికి ప్రభుత్వ డిగ్రీ బాలుర కళాశాల పరీక్ష కేంద్రానికి ఆమెను తీసుకొచ్చి ‘నీకు తోడుగా నాన్న ఉన్నాడమ్మా’ అంటూ ధైర్యాన్నిచ్చాడు. కాగా వికితకు సహాయంగా పదవ తరగతి విద్యార్థి పరీక్ష రాశాడు.
Comments
Please login to add a commentAdd a comment