జిల్లాలో టెట్ కోసం 21,261 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్ - 1 రాసేవారు (డీఈడీ అభ్యర్థులు) 2062 మంది, పేపర్ -2 రాసేవారు (బీఈడీ అభ్యర్థులు) 18,936 మంది ఉన్నారు. బీఈ డీ, డీఈడీ రెండూ పూర్తి పేపర్లు -1,2 రాసే వారు 263 మంది ఉన్నారు. చాలామంది ఇటీవల వెలువడిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాల నియామకం కోస దరఖా స్తు చేశారు. ఇందుకోసం కొందరు సొంతంగా సన్నద్ధమవుతున్నారు. మరికొందరు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. ఫిబ్రవరి 2న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు జరుగుతాయి.
ఫిబ్రవరి 9వ తేదీన టెట్ నిర్వహిం చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటిం చారు. దేనికి ప్రాధాన్యమివ్వాలో అర్థంగాక అయోమయానికి గురువుతున్నారు. ఇన్నాళ్లూ టెట్‌పై స్పష్టత లేకపోవడంతో చాలా మంది వీఆర్‌ఓ, వీఆర్‌ఏకు దరఖాస్తు చేశారు. ఇక ఇప్పుడు టెట్ నిర్వహిస్తుండడం తో దేనికి సన్నద్ధం కావాలో తేల్చుకోలేక పోతున్నారు. ఇప్పటిదాకా రెవెన్యూ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాం కానీ, బీఈడీ చదివి టెట్ పాస్‌కాకపోతే ఎలా? రేపటి నుంచి మళ్లీ ఈ పుస్తకాలే చేతపడతాం అని కొందరు అభ్యర్థులు అంటున్నారు. వీఆర్‌ఓ పరీక్ష తర్వాత వారం రోజుల టైముంది కదా.. ముందు వీఆర్‌ఓ పరీక్ష రాసి ఆ తర్వాత టెట్‌కు పునశ్చరణ చేస్తామని మరికొంద రంటున్నారు.
టెట్ కోసం దరఖాస్తు చేసిన వారు: 21,261 మంది
వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు: ఫిబ్రవరి 2
టెట్ : ఫిబ్రవరి 9
టెట్టా.. వీఆర్‌ఓనా?
Published Sat, Jan 25 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement