vra exams
-
వీఆర్ఓ, వీఆర్ఏ ఫలితాలు విడుదల
-
పరీక్షలు ప్రశాంతం
-
జాతర
కలెక్టరేట్, న్యూస్‌లైన్: నెల రోజులుగా అభ్యర్థులను, అధికారులను ఉత్కంఠకు గురి చేసిన వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఆర్ ఓ పరీక్ష జరుగగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు వీఆర్ఏ పరీక్ష నిర్వహిం చారు. వీఆర్ఓ పోస్టులకు మొత్తం 41,920 మంది దరఖాస్తు చేసుకోగా 38,481 మంది (91.796 శా తం) హాజరయ్యారు. 3,439 మంది గైర్హాజరయ్యా రు. వీఆర్ఏకు 2,823 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,518 మంది (89.19 శాతం) పరీక్ష రాశారు. 305 మంది హాజరు కాలేదు. పర్యవేక్షించిన అధికారులు కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ తరుణ్‌జోషీ, జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణ పరీక్ష నిర్వహణను పరిశీలించారు. వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద హాల్‌టికెట్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. 131 మం ది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో లైజన్ అధికారులు, అసిస్టెంట్ లైజన్ అధికారులు, రెండు వేల మంది ఇన్విజిలేటర్లు, 25 మంది రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్స్లో 25 మంది, నలుగురు జోనల్ అధికారులు విధులు నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారు. 144వ సెక్షన్ అమలు చేశారు. వైద్య సిబ్బంది కేంద్రాలలో సేవలు అందించారు. ఆలస్యమైతే బయటికే పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు కేంద్రాలలోకి అనుమతించలేదు. వారు ఎంతగా ప్రాధేయపడినా నిరాకరించారు. నిమిషం ఆలస్యమైనా బయటకే పంపించి వేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు అధికారులను ప్రాధేయపడడం కనిపించింది. పరీక్ష కేంద్రాలన్నీ నగరంలో ఉండేసరి కి జిల్లాలోని 36 మండలాల నుంచి అభ్యర్థులు ఒకేసాకి నగరానికి విచ్చేశారు. దీంతో నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఇందూరు జాతరను తలపించింది. చాలా మంది అభ్యర్థులు తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు బస్టాండ్ ,రైల్వేస్టేషన్లో గంటలపాటు బస్సులు, రైళ్ల కోసం వేచి చూశారు. తెలంగాణ యూనివర్సిటీలో డిచ్పల్లి : డిచ్పల్లి మండలంలోని పది పరీక్షా కేంద్రాలలో వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు తహశీల్దార్ వెంకటయ్య తెలిపారు.3,640 మంది అభ్యర్థులకుగాను 3,283 మంది హాజరయ్యారు. తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి నలుగురు మహిళా అభ్యర్థులు ఆలస్యంగా చేరుకోవడంతో వారిని అనుమతించలేదు. అధికారులను బతిమాలినా ఫలితం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఈ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్ఐ శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఏఎన్ఎంలు వైద్య సేవలందించారు. -
సజావుగా పల్లె ‘పరీక్ష’
సాక్షి, నల్లగొండ: జిల్లాలో ఆదివారం ఉదయం వీఆర్ఓ, మధ్యాహ్నం వీఆర్ఏ పరీక్షలు ప్రశాం తంగా, సజావుగా జరిగాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో వీఆర్ఓ పరీక్షకు 86.24 శాతం, వీఆర్ఏకు 89.14 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మూడు.. నాలుగు నిమిషాలు కేంద్రాల వద్దకు ఆలస్యంగా వెళ్లిన అభ్యర్థులను పరీక్ష హాల్లోకి అనుమతించలేదు. దూర ప్రాంతాల నుంచి రావడంతో ఆలస్యమైందని వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో అభ్యర్థులు కన్నీళ్లతో వెనుదిరిగారు. రోజులపాటు పుస్తకాలతో కుస్తీపట్టిన శ్రమంతా వృథా అయ్యిందని విలపించారు. రెండుమూడు సెంటర్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా జరిగింది. మరికొందరు పరీక్ష సమయానికి రెండు నిమిషాల ముందు ఉరుకూపరుగులతో పరీక్ష హాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. పరీక్ష కేంద్రాలున్న పట్టణాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించినా అభ్యర్థులకు కష్టాలు తప్పలేదు. రోజువారీగా తిరిగే బస్సులకు అదనంగా మరో 124 బస్సులను నడిపించారు. అయినా బస్సులన్నీ కిటకిటలాడాయి. దీంతో ముఖ్యంగా వికలాంగులు నానా అవస్థలు పడ్డారు. వీఆర్ఓకు 86.24 శాతం హాజరు.... 68 వీఆర్ఓ పోస్టులకుగాను 85,438 దరఖాస్తులు అందగా.. వీరికి 278 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఇం దులో 73,690 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 201 వీఆర్ఏ పోస్టులకుగాను 4997 దరఖాస్తులు అధికారులకు అందాయి. వీరికి కేవలం జిల్లాకేంద్రంలోనే 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,468 మంది పరీక్ష రాశారు. మొత్తం మీద వీఆర్ఓ పరీక్షకు 11,748, వీఆర్ఏ పరీక్షకు 529 మంది గైర్హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో వీఆర్ఓ పోస్టుకు 1,083 మంది పోటీలో ఉన్నారు. హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు... దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు పరీక్ష కేంద్రాల చిరునామా, మార్గాలు తెలపడానికి పలుచోట్ల హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్ష కేంద్రాలు ఎక్కడున్నాయో తెలపడంతో అభ్యర్థులకు శ్రమ తప్పి సమయం ఆదా అయ్యింది. పలు వీఆర్ఓ పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ చిరంజీవులు సందర్శించారు. ఎన్జీ కళాశాలలో పరీక్ష ప్రారంభానికి ముందు హాల్లో అభ్యర్థులతో మాట్లాడారు. ఎలా సన్నద్ధమయ్యారని అడిగి తెలుసుకున్నారు. ప్రతిభనే నమ్ముకోండి.. మధ్యవర్తుల మాటలను ఎట్టిపరిస్థితుల్లోనూ వినకండి.. అని అభ్యర్థులకు సూచిం చారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఎస్ఆర్టీఐ, డైట్ సెంటర్లలో తిరిగారు. పరీక్షల నిర్వహణ తీరుపై అధికారులతో సమీక్షించారు. మధ్యాహ్నం ప్రభుత్వ మహిళా డిగ్రీ, బాలికల జూనియర్ కళాశాలల్లో పడిన వీఆర్ఏ పరీక్ష కేంద్రాలను సందర్శించారు. -
వీఆర్వో పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నాం
వీఆర్వో, వీఏవో పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరా రెడ్డి వెల్లడించారు. ఆదివారం అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాలలో జరగుతున్న వీఆర్వో పరీక్షా కేంద్రంలో మంత్రి రఘువీరా పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చేప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన అభ్యర్థులకు హితవు పలికారు. ఈ నెల నాలుగో తేదీన వీఆర్వో, వీఏవో పరీక్షల 'కీ' లను విడుదల చేస్తామన్నారు. -
స్పెషల్ డ్రెస్‌లు.. బటన్ కెమెరాలు
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల్లో కాపీయింగ్‌కు స్కెచ్ గురివిరెడ్డి ముఠా గుట్టురట్టు సాక్షి, కర్నూలు: గ్రామ రెవెన్యూ ఆఫీసర్, సహాయకుల పరీక్షల లీకేజీకి యత్నిస్తున్న గురివిరెడ్డి ముఠా గుట్టు రట్టయింది. మాల్‌ప్రాక్టీస్‌కు మారుపేరైన గురివిరెడ్డి ముఠా అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు చేస్తున్న యత్నాలను కర్నూలు జిల్లా పోలీసులు ఛేదించారు. గురివిరెడ్డి 2010లో ఎంసెట్, 2012లో చండీఘర్ రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ ఎంట్రన్స్‌లలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి దొరికిపోయాడు. కొంతకాలం జైలుజీవితం కూడా గడిపాడు. అయినా కుక్కతోక వంకరలా తాజాగా వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలపై కన్నేశాడు. అయితే ఈ ముఠాతో విభేదాలు వచ్చిన ఒకరు ఫిర్యాదు చేయడంతో కర్నూలు జిల్లా పోలీసులు దాడిచేసి గురివిరెడ్డితోపాటు మరో ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి వెల్లడించారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాదిమంది నేడు పరీక్షలు రాయనున్న సంగతి తెలిసిందే. ఇదీ పథకం... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురివిరెడ్డి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడంలో సిద్ధహస్తుడు. వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌కు పథకం వేసిన గురివిరెడ్డికి స్థానికంగా ప్రముఖుడైన ఒక న్యాయవాది కుమారుడు ప్రదీప్‌రెడ్డి తోడయ్యాడు. ఒక్కొక్కరికి రూ.మూడు లక్షల చొప్పున గుంటూరు, ఒంగోలు, కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో 50 మందితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు మాట్లాడుకుని కొంత వసూలు చేసుకున్నారు. ఇందుకు కావాల్సిన అత్యాధునిక పరికరాలకోసం గురివిరెడ్డి మొదట చైనా కంపెనీలతో సంప్రదింపులు జరిపాడు. అయితే ఆ పరికరాలను భారత్‌కు చేరవేయటానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయని అతనికి మెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో ఢిల్లీలో తనకు తెలిసిన వారిని సంప్రదించి తనకు కావాల్సిన పరికరాలను తెప్పించుకున్నాడు. గురివిరెడ్డి పథకం ప్రకారం పరీక్షలు రాసే అభ్యర్థులు వేసుకున్న చొక్కాలకు బటన్సైజ్ రంధ్రాలు ఏర్పాటు చేసి అందులో అతి చిన్న కెమెరాలు పెట్టి లోనికి పంపుతారు. ప్రశ్నపత్రాలను తీసుకున్న అభ్యర్థులు వాటిని ఈ చిన్న కెమెరాతో స్కాన్ చేసి బ్లూటూత్ ద్వారా పరీక్షా కేంద్రాల వద్ద వేచి ఉన్న ముఠా సభ్యులకు పంపుతారు. అభ్యర్థుల చెవిలో గురివింద గింజ సైజులో బ్లూటూత్ ఉంటుంది. వీటికి సిగ్నల్స్ సరిగా అందేందుకు చొక్కాలోపల రాగితీగ ఏర్పాటు చేస్తారు. ముఠా సభ్యులు గైడ్స్‌లో వెతికి సిద్ధం చేసిన జవాబులను సెల్‌ఫోన్ ద్వారా చెప్తుండగా... అభ్యర్థులు బ్లూటూత్ ద్వారా విని చకచకా నింపేస్తారు. ముఠా గుట్టు రట్టయిందిలా... గురివిరెడ్డి నంద్యాల పద్మావతినగర్‌లోని నాగిరెడ్డి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. ఒప్పందం కుదుర్చుకున్న అభ్యర్థులను అక్కడకు పిలిపించుకుని కెమెరాలు ఎలా దాచుకోవాలి... ప్రశ్నపత్రాన్ని ఎలా ఫొటోలు తీయాలి... బ్లూటూత్‌ను ఎలా ఉపయోగించాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చేవాడు. వీరితో విభేదాలు రావడంతో నంద్యాల పట్టణానికి చెందిన ఆకుల చాంద్‌బాషా గత నెల 31న నంద్యాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించి నిందితుల నుంచి మాల్‌ప్రాక్టీస్‌కు ఉపయోగిస్తున్న సెల్ఫోన్లను, ఆధునిక బ్లూటూత్ పరికరాలను వాటిద్వారా లబ్ధిపొందే అభ్యర్థులు ధరించేందుకు వీలైన డ్రెస్సులు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. {పధాన నిందితుడు గురివిరెడ్డితో పాటు అతని ముఠా సభ్యులైన నంద్యాలకు చెందిన కాకర్ల కిరణ్‌కుమార్, గోనె జార్జి ఇమ్మానియేల్, గోనె దేవరాజు, రామాయణం ధర్మతేజ, విజయవాడకు చెందిన కల్యాణ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కుట్రలో మరో ప్రధాన నిందితుడైన ప్రదీప్‌రెడ్డితోపాటు హైదరాబాద్‌కు చెందిన రాకేష్, తిరుపతికి చెందిన కిరణ్, నంద్యాలకు చెందిన కిరణ్, మరికొందరు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రఘురామిరెడ్డి వివరించారు. ఎవరీ గురివిరెడ్డి? వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురివిరెడ్డి ఇంటర్ పూర్తి చేశాక, మూడేళ్లకు ఎంసెట్‌లో ర్యాంక్ సాధించాడు. నంద్యాలలోని శాంతిరాం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఐదేళ్ల కోర్సు పూర్తయినా కొన్ని సెమిస్టర్లలో సబ్జెక్టులు పాస్ కాలేదు. వైద్య విద్య చదువుతున్నా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఎక్కువ. బ్లూటూత్‌ను ఉపయోగించి ఎంసెట్ పేపర్ లీకేజీకి ప్రయత్నించి 2010లో పట్టుబడ్డాడు. జైలునుంచి వచ్చాక కూడా ప్రవర్తనలో మార్పురాలేదు. 2012లో చండీఘర్ మెడికల్ వర్సిటీ ఎంబీబీఎస్, పీజీ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకేజీకి ప్రయత్నించి మరోసారి పట్టుబడ్డాడు. జైలునుంచి వచ్చాక కొద్దినెలలు అజ్ఞాతంలో ఉన్న గురివిరెడ్డి తాజాగా వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలపై కన్నేసి మరోసారి పట్టుబడ్డాడు. నేడే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం వీఆర్వో పరీక్షకు 13,23,881 మంది, వీఆర్ఏ పరీక్షకు 97,703 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 98 శాతం మందికి పైగా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీ స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచిన ప్రశ్నపత్రాలను ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రాలకు పోలీసు భద్రతతో తరలించేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. వీఆర్వో పరీక్ష 3,684 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 వరకు జరుగుతుంది. వీఆర్ఏ పరీక్ష 195 కేంద్రాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ఏపీపీఎస్సీ 88 మంది సిబ్బందిని నియమించింది. పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్ జవాబు పత్రాలను ప్రత్యేక బస్సుల్లో పోలీసు భద్రతతో ఏపీపీఎస్సీ కార్యాలయానికి తరలిస్తారు. సోమవారం నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని స్కానింగ్ విధానంలో నిర్వహిస్తారు. వాల్యుయేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 14వ తేదీ కల్లా పూర్తి చేసి ఫలితాల ప్రకటన కోసం ర్యాంకులను కలెక్టర్లకు పంపేలా ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. కర్నూలు పోలీసులకు రఘువీరా అభినందనలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కర్నూలు జిల్లాలో వీఆర్వో, వీఆర్ఏ పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసేందుకు ప్రయత్నించిన గురివిరెడ్డి ముఠాను అరెస్టు చేసిన పోలీసులను, అధికారులను రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అభినందించారు. -
4న ప్రాథమిక కీ విడుదల
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల ప్రాథమిక కీని 4న, ఫైనల్ కీని 10న విడుదల చేయనున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టరేట్లో విలేకరులకు ఆయన వివరించారు. జవాబు పత్రాల (ఓఎంఆర్ షీట్లు) మూల్యాంకనాన్ని ఈ నెల 14లోగా పూర్తి చేసి 20 నాటికి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. 26న ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన, అనంతరం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు వివరించారు. 2వేల 97మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు సమన్వయకర్తలుగా నలుగురు ఆర్డీవోలను, పరిశీలకులుగా 27 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించామని కలెక్టర్ చెప్పారు. 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను(రెవెన్యూ, పోలీస్ అధికారులు సిబ్బంది ఉంటారు) ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో 137 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2వేల 97 మంది ఇన్విజిలేటర్లు బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు. మహిళా అభ్యర్థినులను తనిఖీ చేయటానికి మహిళా పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. 28 రూట్లలో పరీక్షా పత్రాలను తీసుకెళ్లేందుకు 28 లైజన్ అధికారులు, 137 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు పనిచేస్తారని తెలిపారు. సీఆర్ఆర్ ఇంజినీరింగ్‌లో బఫర్ సెంటర్ వీఆర్వో, వీఆర్ఏ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఒకే పరీక్షా కేంద్రం కాకుండా వేర్వేరు కేంద్రాలకు వచ్చే వారి కోసం వట్లూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బఫర్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. దీనిలో 29మంది పరీక్ష రాసే ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు దారి.. పరీక్షా కేంద్రాలకు దారిచూపుతూ చార్టులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష రోజున ఆర్టీసీ బస్సులను నడిపేలా రీజనల్ మేనేజర్‌తో మాట్లాడామన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల ఏర్పాట్లును జేసీ, డీఆర్వోలు పర్యవేక్షిస్తున్నారన్నారు. సమావేశంలో జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. అభ్యర్థులకు సూచనలు హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బ్లూ లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పరీక్షా కేంద్రానికి గంట ముందు హాజరు కావటం మంచిది ప్రతి అభ్యర్థి వేలిముద్రలు, సిగ్నేచర్‌ను బార్ కోడ్‌తో పరిశీలించిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో లేకపోయినా, స్పష్టంగా కనిపించకపోయినా, ఫొటో చిన్నగా ఉన్నా, ఫొటో ఉండి సంతకం లేకపోయినా వారు మూడుపాస్ పోర్టు సైజు ఫొటోలను గెజిటెడ్ ఆఫీసరుతో ధ్రువీకరణ చేయించి సంబంధిత పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటరుకు ఇవ్వాలి. లేకపోతే అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు పరీక్ష ప్రారంభమైన తరువాత వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రం వదిలి వెళ్లకూడదనే నిబంధన ఉంది సమాధాన పత్రంపై హాల్ టికెట్ నంబరు, ప్రశ్నాపత్రం కోడ్, సబ్జెక్టు, పరీక్షా కేంద్రం పేరు తదితరాలు అందుకు కేటాయించిన స్థానాల్లో మాత్రమే రాయాలి. అలా చేయకపోతే జవాబు పత్రం విలువ లేనిదిగా పరిగణిస్తారు సమాధాన పత్రాలపై నిర్దేశించిన చోట అభ్యర్థులు సంతకాలు తప్పనిసరిగా చేయాలి ఓఎంఆర్ షీట్లు ఒరిజనల్, డూప్లికేట్ రెండు ఇస్తారు. ఒరిజినల్‌ను ఇన్విలిజిలేటరుకు ఇవ్వాలి. డూప్లికేట్‌ను అభ్యర్థి తీసుకెళ్లాలి ప్రశ్న పత్రంపై ముద్రించిన వర్గం (సిరీస్) (‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’)ని సమాధాన పత్రంలో కేటాయించబడిన స్థలంలో 4 వృత్తాల్లో ఒక వృత్తాన్ని పెన్‌తో దిద్దాలి ప్రశ్నాపత్రం (టెస్ట్ బుక్లెట్)పై ఏ విధమైన రాతలు రాయకూడదు తోటి అభ్యర్థులతో సమాచారం ఇచ్చి పుచ్చుకోవటం, ఇతర మాటలు నిషిద్ధం ఓఎంఆర్ షీటుపై సమాధాన స్థానాల్లో బాల్ పాయింట్ పెన్నుతో పూర్తిగా దిద్దాలి సమాధాన పత్రాన్ని అభ్యర్థులు తీసుకెళ్లకూడదు. అలా చేస్తే అనర్హులుగా పరిగణిస్తారు సమాధాన పత్రాల్లో జవాబు మార్చటానికి వైట్నర్, బ్లేడ్, రబ్బర్ మరేవిధమైన దిద్దుబాటు చేసినా సమాధాన పత్రం పరిశీలించరు. పరీక్షా కేంద్రాల్లో దుష్ర్పవర్తన లేక దుశ్చర్యలకు పాల్పడితే డిబార్ చేస్తారు కాలిక్యులేటర్, సెల్‌ఫోన్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు -
నిమిషం ఆలస్యమైనా... అనుమతించం
సాక్షి, గుంటూరు: జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 83 వీఆర్వో స్థానాలకు 76,573మంది, 425 వీఆర్ఏ పోస్టులకు 12,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 4,600 మంది ఉన్నారని పేర్కొన్నారు. వీఆర్వో పరీక్షకు 17 మండలాల్లో 193 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీఆర్ఏ పరీక్షకు 5 మండలాల్లో 26 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాస్థాయిలో జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయకర్తగా వ్యవహరిస్తారనీ, సహాయకులుగా 15 మంది జిల్లా అధికారులను నియమించామనీ చెప్పారు. వీఆర్వో పరీక్షకు 49 రూట్లు, వీఆర్ఏ పరీక్షకు 9 రూట్లు, నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మూడు నుంచి 4 కేంద్రాలకు ఒకరి వంతున మొత్తం 50 మందిని పరిశీలకులుగా నియమించినట్లు తెలిపారు. ప్రతికేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తుతోపాటు అభ్యర్థులకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ముద్రించి తీసుకున్న హాల్‌టిక్కెట్‌పై ఫోటోగానీ, అభ్యర్థి సంతకంగానీ గజిబిజిగా ఉన్నా, సరిగా కనబడకపోయినా ఒక తెల్లకాగితంపై అభ్యర్థి మూడు సంతకాలు చేసి ఫొటో అతికించి దానిపై గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించుకుని పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందించాలని సూచించారు. అభ్యర్ధి తనతోపాటు హాల్‌టిక్కెట్, బాల్‌పాయింట్ పెన్ను, పెన్సిల్ మాత్రమే తెచ్చుకోవాలన్నారు. సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించేది లేదన్నారు. ప్రతి కేంద్రం వద్ద అభ్యర్థి వేలిముద్ర తీసుకుంటారన్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి ఆర్టీసీ సహకారంతో బస్సుల్ని తిప్పుతున్నట్లు చెప్పారు. సమావేశంలో రూరల్ ఎస్పీ సత్యనారాయణ, జేసీ వివేక్‌యాదవ్, డీఆర్వో కె.నాగబాబు పాల్గొన్నారు. -
వీఆర్వో, వీఆర్ఏ రాత పరీక్షలు సజావుగా నిర్వహించాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: వచ్చేనెల 2న ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలంలో నిర్వహించే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహశీల్దార్లతో ఆయన శుక్రవారం వీడియోకాన్ఫ్రెన్స నిర్వహించారు. వీఆర్వో, వీఆర్ఏ పరీక్షల ఏర్పాట్లు, జాతీయ ఓటరు దినోత్సవం, రెవెన్యూ సదస్సులపై జేసీ సురేంద్రమోహన్‌తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. ఫిబ్రవరి 2న ఉదయం గంటల నుంచి 12 గంటల వరకు వీఆర్వోల పరీక్షలు, అదే రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు వీఆర్ఏల పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం 161 కేంద్రాల్లో వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఈ పరీక్షలకు సమన్వయ అధికారిగా, ఆర్డీఓలు అదనపు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని తెలిపారు. జిల్లాలో 78 వీఆర్వో పోస్టులకు 70,055 మంది, 105 వీఆర్ఏ పోస్టులకు 3022 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. వీఆర్వో, వీఆర్ఏలకు ఉమ్మడిగా 1,194 దరఖాస్తులు అందాయన్నారు. ఈ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. అందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సదస్సుల్లో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని అన్ని మండల, డివిజనల్ కేంద్రాల్లో నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ సూచించారు. కలెక్టరేట్ నుంచి మండల రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులతో ఎన్నికల నిర్వహణపై జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ రంగనాథ్‌తో కలసి వీడియోకాన్ఫిరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల అనుభవాలు, ప్రస్తుత పరిస్థితులను క్షేత్రస్థాయిలో క్షణంగా అధ్యయనం చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ నాయకులతో చర్చించి ఎన్నికల పరంగా సమస్యత్మక, అత్యంత సమస్యత్మక గ్రామాలు, పోలింగ్‌కేంద్రాలను ఈ నెల 27 వరకు గుర్తించాలన్నారు. ఈ నెలాఖరులో రెవెన్యూ, పోలీస్ మండల స్థాయి అధికారులను బదిలీ చేసే అవకాశం ఉన్నందున మండల స్థాయి ఉప తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు క్రీయాశీలకంగా భగస్వాములు కావాలన్నారు. సరిహద్దు రాష్ట్రాకు సమీపంలో ఉన్న గ్రామాలు, నక్సల్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం ఆర్డీఓలు అమయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సంజీవరెడ్డి, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
టెట్టా.. వీఆర్ఓనా?
జిల్లాలో టెట్ కోసం 21,261 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్ - 1 రాసేవారు (డీఈడీ అభ్యర్థులు) 2062 మంది, పేపర్ -2 రాసేవారు (బీఈడీ అభ్యర్థులు) 18,936 మంది ఉన్నారు. బీఈ డీ, డీఈడీ రెండూ పూర్తి పేపర్లు -1,2 రాసే వారు 263 మంది ఉన్నారు. చాలామంది ఇటీవల వెలువడిన వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగాల నియామకం కోస దరఖా స్తు చేశారు. ఇందుకోసం కొందరు సొంతంగా సన్నద్ధమవుతున్నారు. మరికొందరు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. ఫిబ్రవరి 2న వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 9వ తేదీన టెట్ నిర్వహిం చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటిం చారు. దేనికి ప్రాధాన్యమివ్వాలో అర్థంగాక అయోమయానికి గురువుతున్నారు. ఇన్నాళ్లూ టెట్‌పై స్పష్టత లేకపోవడంతో చాలా మంది వీఆర్ఓ, వీఆర్ఏకు దరఖాస్తు చేశారు. ఇక ఇప్పుడు టెట్ నిర్వహిస్తుండడం తో దేనికి సన్నద్ధం కావాలో తేల్చుకోలేక పోతున్నారు. ఇప్పటిదాకా రెవెన్యూ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాం కానీ, బీఈడీ చదివి టెట్ పాస్‌కాకపోతే ఎలా? రేపటి నుంచి మళ్లీ ఈ పుస్తకాలే చేతపడతాం అని కొందరు అభ్యర్థులు అంటున్నారు. వీఆర్ఓ పరీక్ష తర్వాత వారం రోజుల టైముంది కదా.. ముందు వీఆర్ఓ పరీక్ష రాసి ఆ తర్వాత టెట్‌కు పునశ్చరణ చేస్తామని మరికొంద రంటున్నారు. టెట్ కోసం దరఖాస్తు చేసిన వారు: 21,261 మంది వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు: ఫిబ్రవరి 2 టెట్ : ఫిబ్రవరి 9