4న ప్రాథమిక కీ విడుదల | feb 4th vro/vra key will release | Sakshi
Sakshi News home page

4న ప్రాథమిక కీ విడుదల

Published Sat, Feb 1 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

feb 4th vro/vra key will release

 ఏలూరు, న్యూస్‌లైన్ :
 జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షల ప్రాథమిక కీని 4న, ఫైనల్ కీని 10న విడుదల చేయనున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టరేట్‌లో  విలేకరులకు ఆయన వివరించారు. జవాబు పత్రాల (ఓఎంఆర్ షీట్లు) మూల్యాంకనాన్ని ఈ నెల 14లోగా  పూర్తి చేసి 20 నాటికి ఫలితాలు విడుదల చేస్తామన్నారు. 26న ఎంపికైన అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన, అనంతరం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్టు వివరించారు.
 
 2వేల 97మంది ఇన్విజిలేటర్లు
 పరీక్షల నిర్వహణకు సమన్వయకర్తలుగా నలుగురు ఆర్డీవోలను, పరిశీలకులుగా 27 మంది జిల్లా స్థాయి అధికారులను నియమించామని కలెక్టర్ చెప్పారు. 14 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను(రెవెన్యూ, పోలీస్ అధికారులు సిబ్బంది ఉంటారు) ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో 137 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2వేల 97 మంది ఇన్విజిలేటర్లు బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పారు. మహిళా అభ్యర్థినులను తనిఖీ చేయటానికి మహిళా పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. 28 రూట్లలో పరీక్షా పత్రాలను తీసుకెళ్లేందుకు 28 లైజన్ అధికారులు, 137 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు పనిచేస్తారని తెలిపారు.
 
 సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్‌లో బఫర్ సెంటర్
 వీఆర్వో, వీఆర్‌ఏ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఒకే పరీక్షా కేంద్రం కాకుండా వేర్వేరు  కేంద్రాలకు వచ్చే వారి కోసం వట్లూరు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బఫర్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు.  దీనిలో 29మంది పరీక్ష రాసే ఏర్పాటు చేశామన్నారు.
 
 పరీక్షా కేంద్రాలకు దారి..
 పరీక్షా కేంద్రాలకు దారిచూపుతూ  చార్టులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా పరీక్ష రోజున  ఆర్టీసీ బస్సులను నడిపేలా రీజనల్ మేనేజర్‌తో మాట్లాడామన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షల ఏర్పాట్లును జేసీ, డీఆర్వోలు పర్యవేక్షిస్తున్నారన్నారు. సమావేశంలో జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.
 
 అభ్యర్థులకు సూచనలు
  హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బ్లూ లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో పరీక్షా కేంద్రానికి  గంట ముందు హాజరు కావటం మంచిది
  ప్రతి అభ్యర్థి వేలిముద్రలు, సిగ్నేచర్‌ను బార్ కోడ్‌తో పరిశీలించిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు
 
  హాల్ టికెట్‌పై అభ్యర్థి ఫొటో లేకపోయినా, స్పష్టంగా కనిపించకపోయినా, ఫొటో చిన్నగా ఉన్నా, ఫొటో ఉండి సంతకం లేకపోయినా వారు మూడుపాస్ పోర్టు  సైజు ఫొటోలను గెజిటెడ్ ఆఫీసరుతో ధ్రువీకరణ చేయించి సంబంధిత పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటరుకు ఇవ్వాలి. లేకపోతే అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు
 
  పరీక్ష ప్రారంభమైన తరువాత వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రం వదిలి వెళ్లకూడదనే నిబంధన ఉంది
 
  సమాధాన పత్రంపై హాల్ టికెట్ నంబరు, ప్రశ్నాపత్రం కోడ్, సబ్జెక్టు, పరీక్షా కేంద్రం పేరు తదితరాలు అందుకు కేటాయించిన స్థానాల్లో మాత్రమే రాయాలి. అలా చేయకపోతే  జవాబు పత్రం విలువ లేనిదిగా పరిగణిస్తారు
 
  సమాధాన పత్రాలపై నిర్దేశించిన చోట అభ్యర్థులు సంతకాలు తప్పనిసరిగా చేయాలి
  ఓఎంఆర్ షీట్లు ఒరిజనల్, డూప్లికేట్ రెండు ఇస్తారు. ఒరిజినల్‌ను ఇన్విలిజిలేటరుకు ఇవ్వాలి. డూప్లికేట్‌ను అభ్యర్థి  తీసుకెళ్లాలి
 
   ప్రశ్న పత్రంపై ముద్రించిన వర్గం (సిరీస్) (‘ఎ’, ‘బి’, ‘సి’, ‘డి’)ని సమాధాన పత్రంలో కేటాయించబడిన స్థలంలో 4 వృత్తాల్లో ఒక  వృత్తాన్ని పెన్‌తో దిద్దాలి
  ప్రశ్నాపత్రం (టెస్ట్ బుక్‌లెట్)పై ఏ విధమైన రాతలు రాయకూడదు
  తోటి అభ్యర్థులతో సమాచారం ఇచ్చి పుచ్చుకోవటం, ఇతర మాటలు నిషిద్ధం
  ఓఎంఆర్ షీటుపై సమాధాన స్థానాల్లో  బాల్ పాయింట్ పెన్నుతో పూర్తిగా దిద్దాలి
  సమాధాన పత్రాన్ని అభ్యర్థులు తీసుకెళ్లకూడదు. అలా చేస్తే అనర్హులుగా పరిగణిస్తారు
  సమాధాన పత్రాల్లో జవాబు మార్చటానికి  వైట్నర్, బ్లేడ్, రబ్బర్ మరేవిధమైన దిద్దుబాటు చేసినా సమాధాన పత్రం పరిశీలించరు.
 
  పరీక్షా కేంద్రాల్లో  దుష్ర్పవర్తన లేక దుశ్చర్యలకు పాల్పడితే డిబార్ చేస్తారు
  కాలిక్యులేటర్, సెల్‌ఫోన్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement