ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఎదుట బుధవారం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీఆర్వో పరీక్షలో తనకు అన్యాయం జరిగిందన్న బాధతో అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
ప్రస్తుతం అతడు సైఫాబాద్ పోలీసుల అదుపులో ఉన్నాడు. యువకుడి వివరాలు సేకరిస్తున్నారు.