కలెక్టరేట్, న్యూస్‌లైన్: నెల రోజులుగా అభ్యర్థులను, అధికారులను ఉత్కంఠకు గురి చేసిన వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీఆర్ ఓ పరీక్ష జరుగగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు వీఆర్‌ఏ పరీక్ష నిర్వహిం చారు. వీఆర్‌ఓ పోస్టులకు మొత్తం 41,920 మంది దరఖాస్తు చేసుకోగా 38,481 మంది (91.796 శా తం) హాజరయ్యారు. 3,439 మంది గైర్హాజరయ్యా రు. వీఆర్‌ఏకు 2,823 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,518 మంది (89.19 శాతం)
పరీక్ష రాశారు. 305 మంది హాజరు కాలేదు.
పర్యవేక్షించిన అధికారులు
కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్‌పీ తరుణ్‌జోషీ, జేసీ హర్షవర్ధన్, ఏజేసీ శేషాద్రి, బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణ పరీక్ష నిర్వహణను పరిశీలించారు. వివిధ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద హాల్‌టికెట్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
131 మం ది చీఫ్ సూపరింటెండెంట్లు, అంతే సంఖ్యలో లైజన్ అధికారులు, అసిస్టెంట్ లైజన్ అధికారులు, రెండు వేల మంది ఇన్విజిలేటర్లు, 25 మంది రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్స్‌లో 25 మంది, నలుగురు జోనల్ అధికారులు విధులు నిర్వహించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారు. 144వ సెక్షన్ అమలు చేశారు. వైద్య సిబ్బంది కేంద్రాలలో సేవలు అందించారు.
ఆలస్యమైతే బయటికే
పరీక్షలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు కేంద్రాలలోకి అనుమతించలేదు. వారు ఎంతగా ప్రాధేయపడినా నిరాకరించారు. నిమిషం ఆలస్యమైనా బయటకే పంపించి వేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు అధికారులను ప్రాధేయపడడం కనిపించింది. పరీక్ష కేంద్రాలన్నీ నగరంలో ఉండేసరి కి జిల్లాలోని 36 మండలాల నుంచి అభ్యర్థులు ఒకేసాకి నగరానికి విచ్చేశారు. దీంతో నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్‌లు కిక్కిరిసిపోయాయి. ఇందూరు జాతరను తలపించింది. చాలా మంది అభ్యర్థులు తిరిగి స్వస్థలాలకు వెళ్లేందుకు బస్టాండ్ ,రైల్వేస్టేషన్‌లో గంటలపాటు బస్సులు, రైళ్ల కోసం వేచి చూశారు.
తెలంగాణ యూనివర్సిటీలో
డిచ్‌పల్లి : డిచ్‌పల్లి మండలంలోని పది పరీక్షా కేంద్రాలలో వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు తహశీల్దార్ వెంకటయ్య తెలిపారు.3,640 మంది అభ్యర్థులకుగాను 3,283 మంది హాజరయ్యారు. తెలంగాణ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి నలుగురు మహిళా అభ్యర్థులు ఆలస్యంగా చేరుకోవడంతో వారిని అనుమతించలేదు.
అధికారులను బతిమాలినా ఫలితం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. ఈ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 144 సెక్షన్‌ను అమలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎస్‌ఐ శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో ఏఎన్‌ఎంలు వైద్య సేవలందించారు.
జాతర
Published Mon, Feb 3 2014 4:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM
Advertisement
Advertisement