ded candidates
-
‘సంక్షేమ’ కొలువుల్లో డీఈడీలు గల్లంతు!.. మార్పులపై తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: వసతిగృహ సంక్షేమాధికారి (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) కొలువుల భర్తీ ప్రక్రియ డీఈడీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లతోపాటు ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో కూడా పోస్టులు భర్తీ చేస్తున్న ప్రభుత్వం.... విద్యార్హతలను డిగ్రీ–డీఈడీ స్థాయికి పెంచిన అంశాన్ని ప్రకటించకపోవడంపట్ల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు మొదలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ చేపట్టిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 కేటగిరీలో డీఈడీ లేదా బీఈడీలకు అవకాశం కల్పించింది. తాజాగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ సమయంలో అర్హతల మార్పు చేపట్టడంతో డీఈడీ చేసిన లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పది కేటగిరీల్లో 581 పోస్టులు... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొలువుల జాతరలో భాగంగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కేటగిరీల వారీగా సంబంధిత నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 23న గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–1, గ్రేడ్–2, హాస్టల్ వార్డెన్ గ్రేడ్–1, గ్రేడ్–2, మ్యాట్రన్ గ్రేడ్–1, గ్రేడ్–2 కేటగిరీల్లో 581 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 కేటగిరీలో 544 పోస్టులున్నాయి. పోస్టులపరంగా ఈ సంఖ్య చాలా పెద్దది కావడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టించింది. తీరా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యాక రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న డీఈడీ అభ్యర్థులు తెల్లముఖం వేశారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం 5 కేటగిరీల్లోని 549 పోస్టులకు కేవలం డిగ్రీ బీఈడీ అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మరో రెండు కేటగిరీల్లోని 10 గ్రేడ్–1 పోస్టులకు డిగ్రీ–బీఈడీ తప్పనిసరి. కేవలం వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 8 కొలువులకే డీఈడీ అభర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ నిర్ణయంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామంటూ డీఈడీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అర్హతల్లో మార్పులు చేసి తమకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: పుస్తకం.. ఓ బహుమానం -
బీఈడీ అభ్యర్థులకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) అభ్యర్థులకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ఎనిమిదేళ్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు దూరమైన బీఎడ్ అభ్యర్థులకు మళ్లీ ఎస్జీటీ అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది బీఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులతోపాటు ఎస్జీటీ పోస్టులకూ అర్హులు కానున్నారు. అయితే ఒకటి నుంచి 5వ తరగతి వరకూ బోధించేందుకు టీచర్‌గా ఎంపికయ్యే బీఎడ్ అభ్యర్థి తాను నియామకం అయిన తేదీ నుంచి రెండేళ్లలోగా తాము గుర్తించిన విద్యా సంస్థ నుంచి ఎలిమెంటరీ విద్యలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలని ఎన్సీటీఈ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అసలేం జరిగిందంటే.. బీఎడ్‌లో చైల్డ్ సైకాలజీ లేదని, చిన్న పిల్లలకు వారు బోధించేందుకు అర్హులు కాదని, 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఎస్జీటీ పోస్టులకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఎడ్) అభ్యర్థులే అర్హులంటూ 2008లో డీఎడ్ అభ్యర్థుల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయిం చింది. వాదోపవాదాల తర్వాత 2010లో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అభ్యర్థులే అర్హులని, బీఎడ్ అభ్యర్థులు అర్హులు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాల మేరకు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు బీఎడ్ వారు అర్హులు కాదని 2010 ఆగస్టు 23న ఎన్సీటీఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో చేపట్టిన నియామకాల్లో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను తీసుకోలేదు. వారిని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే పరిమితం చేసింది. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేస్తూ వచ్చాయి. బీఎడ్ అభ్యర్థుల అభ్యర్థనతో.. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని, చైల్డ్ సైకాలజీ సబ్జెక్టును ప్రత్యేకంగా చదువుకుంటామని అనేకసార్లు బీఎడ్ అభ్యర్థులు ఎన్సీటీఈని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టింది. 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఎడ్ పూర్తి చేసిన వారు 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు అర్హులేనని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్జీటీగా నియమితులైన రెండేళ్లలోగా ఎలిమెంటరీ విద్యలో 6 నెలల బ్రిడ్జి కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఎలిమెంటరీ విద్యలో బ్రిడ్జి కోర్సు లేదు. దానిని ఎన్సీటీఈ ప్రవేశ పెడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు డీఎడ్ అభ్యర్థులకు ఇప్పటివరకు ఎస్జీటీ పోస్టుల్లో ఉన్న పూర్తి అవకాశం తగ్గిపోనుంది. డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు ఇద్దరికి వాటిల్లో అవకాశం ఉండనుంది. మళ్లీ పూర్వవైభవం వస్తుందా? ఒకప్పుడు ఏడాది కోర్సుగానే ఉన్న బీఎడ్‌ను ఎన్సీటీఈ 2014లో రెండేళ్ల కోర్సుగా మార్పు చేయడం, బీఎడ్ వారికి ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం తొలగించడంతో బీఎడ్‌కు డిమాండ్ తగ్గిపోయింది. గతంలో బీఎడ్‌లో చేరేందుకు ఏటా లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018–19లో బీఎడ్‌లో ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌కు 38 వేల మంది మాత్రమే హాజరయ్యారు. ఎన్సీటీఈ తాజా నిర్ణయంతో బీఎడ్‌కు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని, ప్రైవేటు పాఠశాలల్లోనూ అవకాశాలు విస్తృతం అవుతాయని అధికారులు చెబుతున్నారు. -
డీఈడీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో కనీస అర్హత మార్కులు లేవన్న కారణంతో ఉపాధ్యాయ నియామకపు పరీక్ష(టీఆర్టీ)కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన పలువురు డీఈడీ అభ్యర్థులకు ఊరట లభించింది. వారి పిటిషన్లపై ఉమ్మడి హైకోర్టు సానుకూలంగా స్పందించింది. డిగ్రీలో 45 శాతం మార్కులు సాధించిన ఓసీ, 40 శాతం మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ వర్గాలకు చెందిన డీఈడీ అభ్యర్థుల దరఖాస్తులను స్వీకరించి, టీఆర్టీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీఈడీ చేసిన అభ్యర్థుల్లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించి ఉంటేనే టీచర్ పోస్టులకు అర్హులని అధికారులు నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. అయితే, టీఆర్టీకి దరఖాస్తు చేసుకున్న పలువురి దరఖాస్తులను, డిగ్రీలో కనీస మార్కులు లేవన్న కారణంతో అధికారులు తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. -
టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడి
హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో డీఎడ్ అభ్యర్థులకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ.. డీఎడ్ అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. శనివారం మధ్యాహ్నం కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న డీఎడ్ అభ్యర్థులు ముట్టడికి యత్నించడంతో.. పోలీసులు వారిని అడ్డుకొని నిరసనకారులను అరెస్ట్ చేశారు. -
డీఈడీలకు మళ్లీ అన్యాయం
సాక్షి, రాజమండ్రి :డీఎస్సీలో డీఈడీ అభ్యర్థులకు మళ్లీ అన్యాయం జరిగింది. ప్రభుత్వ విధానాల కారణంగా 2008లో డీఎస్సీ రాయలేక పోయిన డీఈడీ అభ్యర్థులకు వయసు మీరిపోయినా కోర్టు మూడేళ్ల వరకూ అవకాశం కల్పించింది. దీంతో అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు వెళ్లగా వయసు సడలింపును వెబ్సైట్లు అనుమతించలేదు. దీంతో ఆన్లైన్లో సవరణ చేయాలని ముగ్గురు అభ్యర్థులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. కోర్టు వారికి నేరుగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించాలని ఆదేశించింది. బుధవారంతో దరఖాస్తు గడువు ముగుస్తుండగా.. ఆన్లైన్లో, ఈ సేవా కేంద్రాల్లో ఫీజు చెల్లించేందుకు వెళితే సాఫ్ట్వేర్ తీసుకోవడం లేదంటున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. పూర్వాపరాలు ఇవీ.. డీఎస్సీ ద్వారా నియమించే సెకండరీ గ్రేడ్ టీచర్లకు డీఈడీ అభ్యర్థుల్ని అనుమతించాలన్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనను 2008 డీఎస్సీలో ప్రభుత్వం పాటించలేదు. దీంతో అర్హత ఉన్న అభ్యర్థులు కూడా డీఎస్సీలో పాల్గొనలేకపోయారు. వారిలో వయో పరిమితి దాటిన వారు గత ఏడాది నాటికి రాష్ట్రంలో 2000 మంది ఉన్నారని అంచనా. వీరిలో 200 మందికి పైగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నష్టపోయిన అభ్యర్థులకు మూడేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తూ డీఎస్సీకి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు 2012లో ఆదేశించింది. ఈ మేరకు 2013 నుంచి 2016లోగా జరిగే డీఎస్సీల్లో పాల్గొనే అవకాశం డీఈడీ అభ్యర్థులకు కల్పిస్తామంటూ 2013 నవంబరులో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుతం డీఎస్సీ దరఖాస్తులను ఆన్లైన్లో భర్తీ చేస్తున్నందున వయసు రాయతీని సాఫ్ట్వేర్ అనుమతించడం లేదని జిల్లాకు చెందిన నాగేశ్వరరావు, పశ్చిమగోదావరికి చెందిన డానియేలు, విజయనగరానికి చెందిన అప్పలరాజు హైకోర్టుకు వెళ్లారు. వీరి దరఖాస్తులను తీసుకోవాలని ఆదేశాలిస్తూ ఈ నెల 8న కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఆర్డరుతో అభ్యర్థులు డీఈఓ కార్యాలయాలకు వెళితే ఫీజు ఆన్లైన్లో చెల్లించి రశీదుతో పా టు దరఖాస్తులు సమర్పించమని చెప్పారు. తీరా ఆన్లైన్లో ఫీజు చెల్లించబోగా పుట్టిన తేదీని సాఫ్ట్వేర్ అంగీకరించడం లేదు. బుధవారంతో గడువు ము గుస్తున్నా నేరుగా ఫీజు కట్టే అవకాశం కల్పించనూ లేదు, ఆన్లైన్లో సవరణా చేయలేదు. కోర్టు ఆదేశించినా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించకపోవడాన్ని నిరసిస్తూ అభ్యర్థులు న్యాయ పోరాటం చేస్తామంటున్నారు. -
డీఎస్సీ పోస్టుల్లో కోత
సాక్షి, చిత్తూరు: ఊరించి, ఉడికించిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైందనే సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా పోయింది. సీఎం చంద్రబాబునాయుడు తన సహజసిద్ధ ధోరణిలోనే డీఎస్సీ పోస్టుల్లో కోత విధించారు. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో పోస్టులు తగ్గిస్తూ డీఈవో తయారు చేసిన నివేదికను పంపించారు. ఆర్థికభారం సాకుగా చూపించి ఆ చర్యకు పాల్పడినట్లు అధికారుల నుంచి సమాధానం లభించింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన తరువాత పోస్టులు తగ్గించడం ఏమిటో అర్థంకాక విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించారు. ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగాలేదని, ఒక్కసారిగా అంత భారం భరించే స్థితిలో లేనందున, ఆర్థికశాఖ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోగా తగ్గంపు ప్రక్రియ ను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయా జిల్లాల డీఈవోలు నోటిఫికేషన్లో చూపించిన ఉపాధ్యాయ పోస్టులను తగ్గించే కార్యక్రమాన్ని ఇప్పటికే ముగిం చినట్లు సమాచారం. ప్రతిజిల్లాలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా ప్రభుత్వం కేవలం వందల పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసింది. అసలే తక్కువ పోస్టులతో నోటిపికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం దరఖాస్తులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో మళ్లీ ఉన్న పోస్టులు తగ్గించే ప్రయత్నానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలతో పోలిస్తే చిత్తూరులోనే అత్యధికంగా 1,606 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. తరువాత అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే వెయ్యి పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో అతి తక్కువ పోస్టులు (356) మాత్రమే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చూపారు. ఆ తరువాత వరుసక్రమంలో విజయనగరం జిల్లాలో 362, కృష్ణాలో 379, నెల్లూరు 416, పశ్చిమ గోదావరి 601, శ్రీకాకుళం 719, కర్నూలు 731 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్లో చూపింది. అయితే 20 శాతం కుదించాలన్న తాజా ఆదేశాలతో ఈ పోస్టులు మరింతగా తగ్గనున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోనే మొత్తం 1,606కు గాను 320 పోస్టులు తగ్గనున్నాయి. ఈ లెక్కన తక్కువ పోస్టులు కేటాయించిన జిల్లాలో నామమాత్రంగా కూడా పోస్టులు మిగిలే పరిస్థితి లేదు. ఉదాహరణకు వైఎస్సార్ కడప, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల పరిధిలో మొత్తం 400 లోపు మాత్రమే పోస్టులు చూపించారు. వీటిలో 20 శాతం తగ్గిస్తే 80 పోస్టులు తగ్గనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో కొత్త జాబితాతో వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం. చిత్తశుద్ధిలేని ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ఆది నుంచి చంద్రబాబు ప్రభుత్వం దోబూచులాడింది. ఎన్నికల ప్రచారంలో డీఎస్సీపై ప్రకటన చేసి హామీలు ఇచ్చిన బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీని పక్కన బెట్టింది. డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ఐదుమార్లు ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు, తాజాగా 19న మంత్రి ప్రకటన చేయగా 20న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీపై బీఈడీ చేసినవారు అర్హులు కాదనడం, టెట్, డీఎస్సీని అనుసంధానించడం, బీఈడీలను, డీఈడీలను విభజించడం తదితర నిర్ణయాలతో ప్రభుత్వం నిరుద్యోగులను గందరగోళానికి గురిచేసింది. తాజాగా దరఖాస్తులకు నాలుగు రోజులు మాత్రమే గడువున్న సమయంలో పోస్టులను కుదించి అర్హులకు ఉద్యోగావకాశాలను ఎండగడుతోంది. మరోవైపు ఒక్కో జిల్లాలో 20 నుంచి 40 వేలమంది వరకూ బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా మొక్కుబడిగా డీఎస్సీ నిర్వహణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు డీఎస్సీని కూడా రుణమాఫీ మాదిరే మార్చారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
టెట్టా.. వీఆర్ఓనా?
జిల్లాలో టెట్ కోసం 21,261 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారిలో పేపర్ - 1 రాసేవారు (డీఈడీ అభ్యర్థులు) 2062 మంది, పేపర్ -2 రాసేవారు (బీఈడీ అభ్యర్థులు) 18,936 మంది ఉన్నారు. బీఈ డీ, డీఈడీ రెండూ పూర్తి పేపర్లు -1,2 రాసే వారు 263 మంది ఉన్నారు. చాలామంది ఇటీవల వెలువడిన వీఆర్ఓ, వీఆర్ఏ ఉద్యోగాల నియామకం కోస దరఖా స్తు చేశారు. ఇందుకోసం కొందరు సొంతంగా సన్నద్ధమవుతున్నారు. మరికొందరు కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. ఫిబ్రవరి 2న వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 9వ తేదీన టెట్ నిర్వహిం చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ప్రకటిం చారు. దేనికి ప్రాధాన్యమివ్వాలో అర్థంగాక అయోమయానికి గురువుతున్నారు. ఇన్నాళ్లూ టెట్‌పై స్పష్టత లేకపోవడంతో చాలా మంది వీఆర్ఓ, వీఆర్ఏకు దరఖాస్తు చేశారు. ఇక ఇప్పుడు టెట్ నిర్వహిస్తుండడం తో దేనికి సన్నద్ధం కావాలో తేల్చుకోలేక పోతున్నారు. ఇప్పటిదాకా రెవెన్యూ ఉద్యోగ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాం కానీ, బీఈడీ చదివి టెట్ పాస్‌కాకపోతే ఎలా? రేపటి నుంచి మళ్లీ ఈ పుస్తకాలే చేతపడతాం అని కొందరు అభ్యర్థులు అంటున్నారు. వీఆర్ఓ పరీక్ష తర్వాత వారం రోజుల టైముంది కదా.. ముందు వీఆర్ఓ పరీక్ష రాసి ఆ తర్వాత టెట్‌కు పునశ్చరణ చేస్తామని మరికొంద రంటున్నారు. టెట్ కోసం దరఖాస్తు చేసిన వారు: 21,261 మంది వీఆర్ఓ, వీఆర్ఏ పరీక్షలు: ఫిబ్రవరి 2 టెట్ : ఫిబ్రవరి 9