tet exam
-
జనవరి 1 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరగనుంది. పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవ చ్చు. ఈ ఏడాది టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది రెండోసారి. జాబ్ క్యాలెండర్లో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు.వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలోనూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి టెట్ రాసే అవకాశం కలి్పంచారు. తాజా టెట్‌కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్‌తో కూడిన సమాచార బులిటెన్ మంగళవారం https:// schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయడం, టెట్ నిర్వహించడంతో.. జనవరిలో నిర్వహించే టెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. పేపర్–2లో తక్కువ ఉత్తీర్ణత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. డీఈడీ అర్హత గల వారు పేపర్–1, బీఈడీ అర్హులు పేపర్–2తో పాటు పేపర్–1 రాసేందుకు కూడా అవకాశం కల్పించారు. పేపర్–1 ఉత్తీర్ణులు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే అర్హత సాధిస్తారు. పేపర్–2 అర్హులు ఉన్నత పాఠశాలల వరకూ బోధించే వీలుంది. అయితే పేపర్–2లో ఉత్తీర్ణులు గత 8 ఏళ్ళుగా తక్కువగా ఉంటున్నారు. గరిష్టంగా 30 శాతం దాటకపోవడం, జనరల్ కేటగిరీలో ఉత్తీర్ణత శాతం మరీ తక్కువగా ఉండటం కని్పస్తోంది. ఇందుకు బీఈడీలో నాణ్యత లోపమే కారణమనే విమర్శలున్నాయి. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
-
3 నుంచి ‘టెట్’.. 21 వరకు రెండు సెషన్లలో నిర్వహణ
సాక్షి, అమరావతి: ఈ నెల 3 (గురువారం) నుంచి జరిగే టెట్–2024 (జూలై) పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 వరకు ఎంపిక చేసిన సెంటర్లలో ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. అన్ని జిల్లాల డీఈవో కార్యాలయాల్లో సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా వీటిని సంప్రదించాలని సూచించారు. దివ్యాంగ అభ్యర్థుల కోసం స్క్రైబ్‌ను ఏర్పాటు చేశామని, వారికి అదనంగా 50 నిమిషాల సమయం కేటాయించినట్టు తెలిపారు. ఎవరికైనా రెండు హాల్ టికెట్లు వచ్చి ఉంటే వారు ఏదో ఒక సెంటర్‌ను మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రానికి సెల్‌ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోమన్నారు. హాల్టికెట్లలో తప్పులుంటే సరైన ఆధారాలు చూపి పరీక్ష కేంద్రంలోని అధికారి వద్దనున్న నామినల్ రోల్స్‌లో సరిచేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు హాల్ టికెట్లు తీసుకోని అభ్యర్థులు cse.ap.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
నిరుద్యోగులకు సర్కారీ ‘పరీక్ష’!
వారం రోజుల్లో మొదలుకానున్న డీఎస్సీ పరీక్షలు.. అవి ముగిశాక రెండు రోజుల్లోనే గ్రూప్–2 పరీక్షలు.. ప్రిపరేషన్‌కు సమయం సరిపోని పరిస్థితి.. దీంతో డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చాలంటూ అభ్యర్థుల ఆందోళనలు.. ఏమాత్రం వెనక్కితగ్గకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతున్న సర్కారు.. ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాలపై పోలీసుల లాఠీచార్జీలు.. కాస్త సమయం ఇస్తే బాగుంటుందంటున్న విద్యావేత్తలు.. సమస్యకు పరిష్కారం చూపడం మానేసి లాఠీచార్జీలు ఏమిటంటూ హక్కుల కార్యకర్తల నిలదీతలు.. .. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఆందోళన, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నెలకొన్న పరిస్థితి ఇది. సర్కారు ఉద్యోగాల భర్తీ హర్షణీయమే అయినా.. నిరుద్యోగుల డిమాండ్లు, విజ్ఞప్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్న సూచనలు వస్తున్నాయి.సిలబస్ ఎక్కువ.. సమయం తక్కువ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ బాగా పెరిగింది. మొత్తం 14 సబ్జెక్టులు చదవాలి. కానీ సమయం మాత్రం తక్కువగా ఉంది. రోజుకో సబ్జెక్ట్ పూర్తి చేయడం ఎలా? ఇది ఆందోళన రేపుతోంది. పరీక్ష గడువును కనీసం మూడు నెలలు పొడిగించాలి. – ఐ.సుజిత, డీఎస్సీ అభ్యర్థి, సూర్యాపేట జిల్లాసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షల (డీఎస్సీ)కు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి సబ్జెక్టుల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ ఆధారి తంగా పరీక్షలు నిర్వహించనున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఆన్లైన్ కేంద్రాలను సైతం ఎంగేజ్ చేసుకుంది. డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో పూర్తికానుండగా.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. వరుసగా పరీక్షలు ఉండటంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనే వాదన వస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో.. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 4 నుంచి జూన్ 20వ తేదీ వరకు కొనసాగింది. సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధంకావడానికి కనీసం 45 రోజులు ఉండాలి. కానీ ఉపాధ్యాయ నియామక పరీక్షకు కనీసం నెల రోజుల వ్యవధి కూడా ఇవ్వకుండా పరీక్షల తేదీలు నిర్ణయించడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ కోసం 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజా తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. ఈసారి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదంటూ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరుగుతుండటంతో.. రెండింటికీ సిద్ధమవుతున్న వారికి ఇబ్బందిగా మారింది. ఆందోళనలకు దిగుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌కు సమయం తక్కువగా ఉందని.. ఉపాధ్యాయ నియామక పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టెట్ పరీక్ష ఫలితాలను కూడా వారం క్రితమే విడుదల చేశారని.. డీఎస్సీకి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... వాయిదా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టిందని పేర్కొంటున్నాయి. రెండు నెలలు వాయిదా వేయాలి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నెలలోపే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదు. కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. తక్కువ సమయంలో పరీక్షలకు ఎలా సిద్ధమవాలో అర్థంకాని పరిస్థితి. ఇది అభ్యర్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడమే. టీచర్ నియామక పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేస్తే మేలు జరుగుతుంది. – కేశమోని మనోజ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా (డీఎస్సీ, గ్రూప్–2 పరీక్షల అభ్యర్ధి) పరీక్షలు వాయిదా వేయాలంటే.. పోలీసులతో కొట్టిస్తున్నారు డీఎస్సీ పరీక్షలకు కాస్త సమయం ఇవ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతుంటే స్పందించని సీఎం.. నిరుద్యోగులపై మాత్రం లాఠీచార్జి చేయిస్తున్నారు. ప్రజాపాలన అంటే.. నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, ఇచి్చన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమేనా? 25వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తానన్న సీఎం రేవంత్.. కేవలం 11 వేలకే టీచర్ పోస్టులను పరిమితం చేశారు. పైగా విద్యార్థులకు ప్రిపరేషన్‌కు తగిన సమయం కూడా ఇవ్వకపోవడం సరికాదు – గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు కొంత సమయం ఇస్తే బాగుండేది టెట్ ఫలితాలు వెల్లడించిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహిస్తే బాగుండేది. అలాగాకుండా ముందే షెడ్యూల్ ప్రకటించి, తర్వాత టెట్ ఫలితాలు ఇవ్వడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరిస్తే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే జాబ్ కేలండర్ ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్–1 పరీక్షలు సవ్యంగా నిర్వహించిందన్న పేరు వచి్చంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. – ప్రొఫెసర్ కోదండరామ్, టీజేఎస్ అధ్యక్షుడు లాఠీచార్జీలు కాదు.. సమస్యను పరిష్కరించాలి రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించి రాజకీయ పారీ్టల అభిప్రాయాలు తీసుకుంటే మంచిది. పదేళ్లపాటు ఉద్యోగాల కోసం వేచి ఉండటంతో నిరుద్యోగ యువతలో ఆతృత, ఆందోళన పెరిగాయి. వరుస పరీక్షల నిర్వహణ షెడ్యూల్, ఇప్పటికే ప్రకటించిన పోటీపరీక్షల రీషెడ్యూల్‌పై టీజీపీఎస్సీ నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎవరైనా కోర్టుకు వెళితే.. కోర్టు స్టే ఇస్తే మొత్తం సమస్య మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వపరంగా స్పందించడమో లేక ఉద్యమిస్తున్న సంఘాల ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారానికి నచ్చజెప్పడమో చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా లాఠీచార్జీలు, దాడులకు దిగడం మంచిది కాదు. దీనితో అసలు సమస్య పోయి పోలీసులు దాడులకు దిగారంటూ మరో సమస్య తెరపైకి వస్తోంది. – ప్రొఫెసర్ హరగోపాల్, హక్కుల కార్యకర్త, విద్యావేత్త వెబ్సైట్లో డీఎస్సీ హాల్‌టికెట్లు డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను గురువారం రాత్రి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు www. schooledu. telangana. gov. in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం సుమారు 2.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
AP: టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షలకు కొత్త తేదీలు ఇవే..
సాక్షి, అమరావతి: ఏపీలో టెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఏపీ పాఠశాల విద్యాశాఖ టెట్ దరఖాస్తు తేదీలను పొడగించింది. టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇక, సవరించిన షెడ్యూల్ ప్రకారం.. అభ్యర్థులు ఆగస్టు మూడో తేదీ వరకు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, జూలై రెండో తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ తాజాగా పరీక్ష తేదీల్లో కూడా మార్పులు చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5వ తేదీ నుంచి 20వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది.కాగా, టెట్ పరీక్షల కోసం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాట్ టికెట్స్ డౌన్ లోడ్‌కి అవకాశం ఇచ్చింది. అలాగే, అక్టోబర్ 27వ తేదీన తుది పరీక్షల తుది ‘కీ’ విడుదల కానుంది. నవంబర్ రెండో తేదీన పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. -
TS TET Results 2024: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం తెలంగాణ టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఒక్క క్లిక్‌తో ఫలితాలుటెట్-2024కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో 67.13 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18 శాతం అర్హత సాధించారు. -
Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) సోమవారం ఉదయం ప్రారంభమైంది. పూర్తిగా కంప్యూటర్ బేస్డ్గా.. రోజుకు రెండు సెషన్లు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఇంకో సెషన్లో పరీక్ష జరగనుంది. వచ్చే నెల 2వ తేదీ వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 42 కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కొత్తగా బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెట్టారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేయాలని ఆదేశాలిచ్చారు. ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి సొంత ప్రాంతాల్లోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. ఆలస్యంగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రం దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు అలాట్ అయ్యాయి. సెంటర్ల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని.. సెల్ఫోన్లు, ఇతర ఎలాంటి ఎల్రక్టానిక్స్ వస్తువులను అనుమతించరని అధికారులు తెలిపారు. 2.86 లక్షల మందికిపైగా దరఖాస్తు.. మొత్తంగా టెట్ పరీక్షకు 2,86,386 మంది దరఖాస్తు చేసుకున్నారు. డీఈడీ అర్హత ఉన్నవారు పేపర్–1 రాయనున్నారు. వారు ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు అర్హులవుతారు. పేపర్–1కు 99,588 మంది దరఖాస్తు చేశారు. బీఈడీ అర్హత ఉన్నవారు టెట్ పేపర్–2 రాయనున్నారు. వారు ఉన్నత పాఠశాలల్లో బోధించేందుకు అర్హత ఉంటుంది. దీనికి 1,86428 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో భాగంగా ముందుగా పేపర్–2 నిర్వహిస్తారు. తర్వాత పేపర్–1 నిర్వహిస్తారు. ఇక పదోన్నతులు పొందాలనుకునే సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాల్సి ఉంటుంది. మొత్తం 80 వేల మంది సర్వీస్ టీచర్లు పరీక్ష రాయాల్సి ఉండగా.. 48 వేల దరఖాస్తులే వచ్చాయి. వాస్తవానికి టెట్ గడువు పెంచడం వల్లే దరఖాస్తులు పెరిగాయి. తొలుత ఏప్రిల్ 10 వరకు గడువు ఇవ్వగా 2 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. తర్వాత అదనంగా పది రోజులు గడువు పెంచగా.. సర్వీస్ టీచర్లు సహా మరో 80 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. 2016లో టెట్‌కు 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.91 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మేథ్స్ సబ్జెక్టు వాళ్లే ఎక్కువ గణితం, సైన్స్ సబ్జెక్టుల నేపథ్యం ఉన్న వారే ఎక్కువగా టెట్‌కు దరఖాస్తు చేశారు. మొత్తం అప్లికేషన్లలో ఈ సబ్జెక్టు వారే 99,974 మంది ఉన్నారు. సోషల్ నేపథ్యంతో టెట్ రాసేవారు 86,454 మంది ఉన్నారు. పేపర్–1కు ఎక్కువగా ఆదిలాబాద్ (7,504), వికారాబాద్ (5,879) జిల్లాల నుంచి.. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి (771) జిల్లా నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇక పేపర్–2కు నల్గొండ (7,163) జిల్లా నుంచి అధికంగా.. జయశంకర్ భూపాలపల్లి (935), ములుగు (963) జిల్లాల నుంచి అతి తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో టెట్ రాయాలి. ఎలాంటి ఒత్తిడికి లోనుకావద్దు. పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకురావాలి. పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలి. – రాధారెడ్డి, టీఎస్ టెట్ కన్వీనర్ -
తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్ వెవువడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది. ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. చదవండి: గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు -
నేటి నుంచి ‘టెట్’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ టెట్)–2024 షెడ్యూల్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే 2,67,559 మంది అభ్యర్థులకు విద్యా శాఖ హాల్ టికెట్లను జారీ చేసింది. టెట్ మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 120 సెంటర్లను సిద్ధం చేశారు. అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, వైద్య సదుపాయాలను సైతం కల్పించినట్టు కమిషనర్ సురేష్‌కుమార్ సోమవారం తెలిపారు. పరీక్ష సరళిని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 26 మందిని, 300 మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్మెంటల్ అధికారిని నియమించినట్టు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలోని పరీక్ష కేంద్రాలకు కూడా డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించినట్టు తెలిపారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌నూ సిద్ధం చేశామన్నారు. వైకల్యం గల అభ్యర్థుల కోసం సహాయకులను అందించడంతో పాటు వారికి 50 నిమిషాల అదనపు సమయం ఇచ్చినట్టు వెల్లడించారు. గర్భిణులు సమీప పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేలా వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అయితే వీరు పరీక్ష కేంద్రంలోని అధికారులకు పరీక్ష రాసే ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంది. హైకోర్టు ఆదేశం మేరకు బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్జీటీ పోస్టుల టెట్ మాత్రమే రాయాల్సి ఉంది. టెట్ జరిగే అన్ని రోజులూ ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కమిçÙనరేట్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ (95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997) సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. టెట్ షెడ్యూల్ ఇదీ.. ► పేపర్ 1ఏ: నేటి నుంచి మార్చి 1 వరకు ► పేపర్ 2ఏ: మార్చి 2, 3, 4, 6 తేదీలు ► పేపర్ 1బి: మార్చి 5 (ఉదయం) ► పేపర్ 2బి: 05.03.2024 (మధ్యాహ్నం) -
రేపట్నుంచే ఏపీలో టెట్ పరీక్షలు
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 6వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో టెట్ పరీక్షల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ ఇదివరకే ప్రకటించింది. పొద్దున 9గం.30. నుంచి 12గం. దాకా.. అలాగే మధ్యాహ్నాం 2గం.30ని. నుంచి సాయంత్రం 5గం. దాకా మరో సెషన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. టెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉండనుంది. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం గమనార్హం. తెలంగాణాలో మూడు, కర్ణాటకలో నాలుగు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల పర్యవేక్షణకు 26 మంది సీనియర్ అధికారుల్ని నియమించారు. పరీక్షా కేంద్రాల తనిఖీలకి 29 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. గర్బిణీ అభ్యర్ధులకి సమీప పరీక్షా కేంద్రాలలో హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. ఇక.. విద్యాశాఖ ముందస్తుగానే రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ.. 14వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
‘టెట్’కు అభ్యర్థులు ఎంచుకున్న కేంద్రాలే
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2024కు పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఎంచుకున్న ప్రాధాన్యత క్రమంలో మాత్రమే కేటాయిస్తారని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఆదివారం ‘ఈనాడు’ పత్రికలో ‘టెట్ అభ్యర్థులు కేంద్రానికి వెళ్లడమే పెద్ద పరీక్ష’ పేరిట ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తమని కమిషనరేట్ ఓ ప్రకటనలో ఖండించింది. అభ్యర్థులకు పరీక్ష కేంద్రాల ఎంపికలో ఆరు కేంద్రాలను ప్రాధాన్యతా క్రమంలో ఎంచుకోవాలన్నారు. అలా మొత్తం దరఖాస్తు చేసుకున్న వారిలో 82 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్నే కేటాయించినట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ పేర్కొన్నారు. కేటాయింపు ఇలా.. మ్యాథ్స్, సైన్స్ విభాగంలో దరఖాస్తు చేసుకున్న 58,631 మందిలో 90.97 శాతం మందికి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం 37 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. మరో 3,389 మందికి (5.78 శాతం) రెండో ప్రాధాన్య కేంద్రాన్ని, 1,406 మందికి మూడో ప్రాధాన్య కేంద్రాన్ని, 373 మందికి నాలుగో ప్రాధాన్య కేంద్రాన్ని, 93 మందికి ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు విద్యా శాఖ కమిషనర్ వివరించారు. ► సోషల్ విభాగంలో 36,776 మందిలో 31051 మంది (84.43శాతం)కి మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, కేవలం ముగ్గురికి మాత్రమే ఆరో కేంద్రాన్ని కేటాయించారన్నారు. ► తెలుగు విభాగంలో వచ్చిన దరఖాస్తుల్లో 149 మందికి మాత్రమే ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించగా, మిగిలిన వారికి మొదటి కేంద్రాన్నే ఇచ్చామన్నారు. ► ఇంగ్లిష్ విభాగంలో 17 మందికి మాత్రమే ఐదో ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించారన్నారు. ఈ విభాగంలో ఆరో ప్రాధాన్య కేంద్రాన్ని ఎవరికీ ఇవ్వలేదన్నారు. ► హిందీ విభాగంలో 8,752 మందికి (80.43 శాతం) మొదటి ప్రాధాన్య కేంద్రం, మరో ఇద్దరికి ఆరో ప్రాధాన్య కేంద్రం ఇచి్చనట్టు పేర్కొన్నారు. ఉర్దూ విభాగంలో అందరికీ మొదటి ప్రాధాన్య కేంద్రాన్ని కేటాయించినట్టు తెలిపారు. -
TS: ప్రారంభమైన టెట్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రారంభమైంది. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా హల్స్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పాఠశాల విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 1,139 పరీక్ష కేంద్రాల్లో ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్–1, పేపర్–2 జరుగుతుంది. ► ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ► మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో... టెట్ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. -
తెలంగాణ: టెట్ ప్రాథమిక కీ వచ్చేసింది
హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-టెట్) ప్రాథమిక కీ విడుదల అయ్యింది. జూన్ 12న టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కీ ద్వారా సమాధానాలపై అభ్యంతరాలుంటే.. జూన్ 18లోపు ఆన్లైన్లో సమర్పించొచ్చు. Telangana TET Key రిలీజ్ అయ్యిందని బుధవారం సాయంత్రం కన్వీనర్ రాధారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 27న టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. tstet.cgg.gov.in వెబ్సైట్ ద్వారా కీ డౌన్లోడ్ చేస్కోవచ్చు. తెలంగాణ టెట్ పరీక్షకు 90 శాతం హాజరు నమోదు అయ్యింది. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 3,51,482 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,18,506 మంది (90.62 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 2,77,900 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,070 మంది (90.35 శాతం) హాజరయ్యారు. -
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టెట్ ఎగ్జామ్ వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వకుండానే ఎగ్జామ్ తేదీ ముందుగానే ఖరారు చేసామని ఆమె మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. జూన్ 12వ తేదీన రైల్వే ఎగ్జామ్ ఉన్నందున.. టెట్ ఎగ్జామ్ ను వాయిదా వేయాలంటూ ఓ అభ్యర్థి చేసిన ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలంటూ మంత్రి సబితకు ట్యాగ్ చేశారు కేటీఆర్. అయితే సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాతే ట్వీట్ చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. దాదాపు 3.5లక్షల మంది రాయాల్సి ఉన్న టెట్ ను అన్ని పరిగణలోకి తీసుకునే ఏర్పాట్లు చేసామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. any other competitive exams. Taking everything into consideration postponing TET exams is not possible as it has cascading effect on other preparations of the Dept— SabithaReddy (@SabithaindraTRS) May 21, 2022 -
పెద్దగా కష్టపడకుండానే టీచర్ జాబ్ కొట్టేసిన అనుపమ!
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టెట్ పరీక్షలో మంచి మార్కులతో పాసయిందట. అదేంటి.. ఆమె టీచర్ కావాలనుకుంటుందా? మరి సినిమాల సంగతేంటి అంటారా? అది బిహార్ ప్రభుత్వాన్నే అడగాలి. ఎందుకంటే ఆమె టీచర్ అవాలనుకుంటుందో లేదో కానీ అనుపమను టీచర్ చేయాలనుకుంటోంది బిహార్ విద్యాశాఖ. అదెలా అంటారా? అయితే ఈ వార్త చదివేయండి.. బిహార్ విద్యాశాఖ ఇటీవలే సెకండరీ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్(STET) ఫలితాలను వెల్లడించింది. ఇందులో రిషికేశ్ కుమార్ అనే వ్యక్తి 77 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. కానీ స్కోర్ కార్డులో అతడి ఫొటో లేదు. తన ఫొటోకు బదులుగా అనుపమ పరమేశ్వరన్ ఫొటో వచ్చింది. దీంతో షాకైన అతడు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. "ఇదేమీ మొదటి సారి కాదు. నా అడ్మిట్ కార్డు మీద కూడా అనుపమ ఫొటో వచ్చింది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాన్ని సరిదిద్దుతామని చెప్పారు. కానీ ఎలాంటి మార్పులు చేయకపోవడంతో అదే అడ్మిట్ కార్డుతో పరీక్షలు రాశాను. ఇప్పుడు రిజల్ట్స్‌లో కూడా మళ్లీ అనుపమ ఫొటోనే వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం కాస్తా వైరల్ కావడంతో స్పందించిన విద్యాశాఖ అధికారి సంజయ్ కుమార్ ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని తెలిపారు. బిహార్ విద్యాశాఖలో గతంలోనూ ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి జూనియర్ ఇంజనీర్ పరీక్షలో బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్‌ను టాపర్‌గా ప్రకటించి నవ్వులపాలైన విషయం తెలిసిందే. చదవండి: ప్రేమ సన్నివేశాల్లో నిఖిల్ ఎవరిని ఊహించుకుంటాడో తెలుసా? -
టెట్ నిర్వహిస్తారా లేదా...?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కోసం 5.5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడితే తమకు టెట్ అర్హత ఉంటుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకొని ఇప్పటివరకు ఆరుసార్లే నిర్వహించారు. వాస్తవానికి 12 సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను 6 సార్లే నిర్వహించడంతో ఇంకా 5.5 లక్షల మంది టెట్ కోసం ఎదురు చూస్తు న్నారు. రాష్ట్రంలో 2017 జూలై 23 తర్వాత ఇప్పటి వరకు టెట్ నిర్వహించలేదు. తాజాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఎన్సీటీఈ నిబంధనల మేరకు.. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ (1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు) పరీక్ష రాయాలంటే టెట్‌లో అర్హత సాధించి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి 2011లో ఆదేశాలు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం మేరకు టెట్‌ను తప్పనిసరి చేసింది. టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా టెట్ పేపర్–1లో అర్హత సాధిస్తే ఒకటి నుంచి 5వ తరగతి వరకు, పేపర్–2లో అర్హత సాధిస్తేనే 6 నుంచి 8వ తరగతి వరకు బోధించవచ్చని పేర్కొంది. టెట్‌లో అభ్యర్థులు సాధించిన స్కోర్‌కు ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ, ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముగిసిన మూడు టెట్ల వ్యాలిడిటీ.. ఎన్సీటీఈ నిబంధనల మేరకు 2011 జూలై 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మొదటి టెట్ నిర్వహించింది. ఆ తర్వాత 2012 జనవరి 8న రెండో టెట్, 2012 జూన్ 1న మూడో టెట్ నిర్వహించింది. ప్రస్తుతం ఆ మూడు టెట్ల స్కోర్‌కు ఎన్సీటీఈ కల్పించిన ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసింది. ఆయా టెట్ల పేపర్–1, పేపర్–2 పరీక్షలకు తెలంగాణ, ఏపీకి చెందిన వారు 15 లక్షల మందికి పైగా హాజరు కాగా, అందులో 7,41,097 మంది అర్హత సాధించారు. అందులో తెలంగాణకు చెందిన అభ్యర్థులు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు. ఏడేళ్ల నిబంధన కారణంగా వారంతా తమ టెట్ వ్యాలిడిటీని కోల్పోయారు. ఆ తర్వాత (2014, 2016, 2017లలో) నిర్వహించిన మరో మూడు టెట్లలో 3,69,308 మంది అర్హత సాధించారు. 2014 మార్చి 16న నిర్వహించిన నాలుగో టెట్‌లో ఏపీకి చెందిన 70 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వారు కాకుండా తెలంగాణ అభ్యర్థులు 3 లక్షల మంది ఆయా టెట్లలో అర్హత సాధించారు. అయితే మొదటి మూడు టెట్లలో అర్హత కోల్పోయిన వారు ఇందులో దాదాపు 2 లక్షల మంది ఉండగా, మరో లక్ష మంది అర్హులు కాలేకపోయారు. నాలుగో టెట్‌లో అర్హత సాధించని లక్ష మందితో పాటు మరో 3 లక్షల మందికి పైగా పలు టెట్లలో అర్హత సాధించని వారు ఉన్నారు. వారికి తోడు 2017 జూలై 23న నిర్వహించిన చివరి టెట్ తర్వాతి మూడు విద్యా సంవత్సరాల్లో (2018, 2019, 2020) ఉపాధ్యాయ విద్యా కోర్సులను (బీఎడ్, డీఎడ్) పూర్తి చేసుకున్న వారు మరో లక్షన్నర మంది ఉన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రంలో టెట్ కోసం ఇప్పుడు 5.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారంతా టెట్‌లో అర్హత సాధిస్తేనే టీఆర్టీ రాసేందుకు అర్హులు అవుతారు. ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరేనా? ప్రస్తుతం ఏడేళ్లు మాత్రమే ఉన్న టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని ఇటీవల ఎన్సీటీఈ పాలక మండలి నిర్ణయించింది. దాన్ని జీవితకాలం వ్యాలిడిటీగా మారుస్తామని స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. అయితే దానిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, మొదటి మూడు టెట్లలో అర్హత సాధించినా, తర్వాతి టెట్లలో అర్హత సాధించని మరో 1 లక్షల మందికి టెట్ గండం వచ్చి పడింది. టెట్ వ్యాలిడిటీని శాశ్వతం చేస్తామన్న ఎన్సీటీఈ నిర్ణయాన్ని.. గతంలో టెట్ అర్హత సాధించిన వారికి కూడా వర్తింపజేస్తే ఆ లక్ష మందికి ప్రయోజనం చేకూరనుంది. లేదంటే వారు కూడా మళ్లీ టెట్ రాయాల్సిందే. వెంటనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వండి: రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు రాష్ట్రంలో వెంటనే టెట్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్ష నిర్వహించాలి. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో టెట్‌లో అర్హత సాధిస్తేనే అభ్యర్థులకు టీఆర్టీ రాసే అర్హత లభిస్తుంది. టెట్ కోసం 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వ్యాలిడిటీ రద్దయిన టెట్ల వివరాలు.. 2011 జూలై 1న మొదటి టెట్.. పేపర్ హాజరు అర్హులు అర్హుల శాతం 1 3,05196 1,35,105 44.27 2 3,34,659 1,66,262 49.68 2012 జనవరి 8 నాటి రెండో టెట్.. 1 55,194 24,578 44.53 2 4,12,466 1,93,921 47.02 2012 జూన్ 1 నాటి మూడో టెట్ 1 58,123 26,382 45.39 2 4,18,479 1,94,849 46.56. ప్రస్తుతం వ్యాలిడిటీ ఉన్న మూడు టెట్లు.. 16–3–2014 – నాలుగో ఏపీ టెట్ 1 65,770 40,688 61.86 2 4,04,385 1,15,510 28.56 22–5–2016– మొదటి తెలంగాణ టెట్ 1 88,661 48,278 54.45 2 2,51,906 63,079 25.04 23–7–2017– రెండో తెలంగాణ టెట్ 1 98,848 56,708 57.37 2 2,30,932 45,045 19.51 –––––––––––––––––––––– 22–5–2016 కానీ జనవరి 24న పరీక్ష జరిగింది. -
వాటర్ ట్యాంకులెక్కి నిరసన
అవనిగడ్డ/ఒంగోలు: టెట్ పీఈటీ ప్రశ్నపత్రం లీకైందని, అందువల్ల ఈ నెల 19న జరగనున్న పరీక్షను రద్దు చేయాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డ, ప్రకాశం జిల్లా ఒంగోలులో అభ్యర్థులు ఆదివారం వాటర్ ట్యాంకులు ఎక్కి ఆందోళన చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వందలాది మంది పీఈటీ అభ్యర్థులు అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా పీఈటీ అభ్యర్థులకు టెట్ నిర్వహిస్తుండటంతో రెండు నెలల నుంచి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న తేళ్ల వంశీకృష్ణ విజయవాడలో బాసర ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ఒంగోలులోనూ ఆయనకు శిక్షణా కేంద్రం ఉంది. స్కూల్ గేమ్ ఫెడరేషన్లో సెక్రటరీగా పనిచేస్తున్న సయ్యద్ బాషా సహకారంతో వంశీకృష్ణ టెట్ పేపర్ లీక్ చేశారని ఆందోళనకారులు ఆరోపించారు. వంశీకృష్ణ శిక్షణ ఇచ్చిన వారందరినీ చెన్నై సెంటర్లో వేయించుకున్నారని చెప్పారు. జాబ్ గ్యారెంటీ అంటూ 75 మందికి ఒక్కొక్కరి వద్ద రూ.4లక్షల నుంచి రూ.8లక్షలు తీసుకుని టెట్ పేపర్ లీక్ చేయించారని వారు ఆరోపించారు. టెట్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అవనిగడ్డలో మధ్యాహ్నం 1.15 గంటలకు స్ధానిక సంత వద్ద ఉన్న రెండు వాటర్ ట్యాంకులపై 28 మంది పీఈటీ అభ్యర్థులు ఎక్కారు. మరో రెండొందల మంది పీఈటీలు కింద నిలబడి టెట్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు ఘటనా స్ధలికి చేరుకుని పీఈటీలతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుతో వీరి సమస్యలపై మాట్లాడించారు. ఈ సందర్భంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థులు అంబటిని కోరారు. ఇదిలా ఉండగా టెట్‌ను రద్దు చేయాలంటూ ఒంగోలు లోనూ సుమారు 50 మంది అభ్యర్థులు ఓవర్‌హెడ్‌ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చచెప్పడంతో రాత్రి 8 గంటలకు కిందికి దిగారు. టెట్ పీఈటీ పేపర్ యథాతథం: మంత్రి ఈ నెల 19న నిర్వహించే టెట్ పీఈటీ పేపర్ లీకైందనే వార్తలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. 19న పరీక్ష నిర్వహిస్తామని స్పష్టంచేశారు. ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తుందున ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశం లేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాయామ ఉపాధ్యాయుడు వంశీకృష్ణను సస్పెండ్ చేస్తున్నామన్నారు. టెట్ రద్దు చేయాలి విజయవాడతో పాటు, ఒంగోలులో తేళ్ల వంశీకృష్ణ పీఈటీలకు టెట్‌కు శిక్షణ ఇచ్చారు. టెట్ పేపరు సెట్‌చేసే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సయ్యద్‌బాషాకు ఇతనికి సన్నిహిత సంబం«ధాలున్నాయి. ఇతని ద్వారా తమ దగ్గర శిక్షణ తీసుకున్నవారికి టెట్ పేపర్ ముందుగానే లీక్ చేశారు. అందువల్ల టెట్ని రద్దు చేసి మరోసారి నిర్వహించాలి. – శ్రీరామకృష్ణ, పెద్దాపురం, తూర్పుగోదావరి చెన్నై సెంటర్ రద్దు వివాదానికి కారణమైన చెన్నై పరీక్షా కేంద్రాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ బి. లక్ష్మీకాంతం తహశీల్దార్ బి ఆశయ్య ద్వారా ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు తెలిపారు. ఈ సెంటర్లో పరీక్ష రాసేవారికి రాష్ట్రంలోని వేర్వేరు కేంద్రాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగం చేస్తూ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న తేళ్ల వంశీకృష్ణపై విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. ఈనెల 19వ తేదీన పీఈటీలకు టెట్ జరుగుతుందని, ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ చెప్పారని తహశీల్దార్ వెల్లడించారు. -
టెట్ పరీక్షపై స్పందించిన గంటా
సాక్షి, అమరావతి: టెట్ వ్యాయామ పరీక్షపై సామాజిక ప్రసార మాద్యమాల్లో వస్తున్న వార్తలపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. టెట్ పరీక్ష పేపర్ లీకులపై వస్తున్న వార్తలను నమ్మకండని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. యధావిధిగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే ఈ నెల 19వ తేదీన టెట్ వ్యాయామ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో పరీక్షా పశ్నా పత్రం లీకులకు అవకాశమే లేదని గంటా పేర్కొన్నారు. అన్లైన్ సెంటర్లోనూ పరీక్షకు ముందు నిర్ణీత సమయంలో మాత్రమే ప్రశ్నాపత్రం అందుబాటులోకి వస్తుందని గుర్తుచేశారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష పటిష్టంగా నిర్వహిస్తామని తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో సెక్రటరీకి డిప్యూటేషన్‌పై సహాయకుడిగా పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు తేళ్ల వంశీకృష్ణను సస్పెండ్ చేయాలని గంటా పాఠశాల విద్యా కమీషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వంశీకృష్ణ అర్హత లేకపోయినా టెట్ వ్యాయమ పరీక్షకు దరఖాస్తు చేశారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఆయన అభ్యర్థులకు ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో తమ కోచింగ్ సెంటర్లోని అభ్యర్థులను గట్టెక్కించేందుకు టెట్‌కు దరఖాస్తు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వంశీకృష్ణను సస్పెండ్ చేస్తూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
భార్యను టెట్ పరీక్ష హాల్లోకి పంపి..
చిత్తూరు, రేణిగుంట: ‘‘ భార్యతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష రాయించేందుకు, రేణిగుంట సమీపంలోని ఓ పరీక్ష కేంద్రానికి మంగళవారం ఉదయం చేరుకున్న ఓ వ్యక్తి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. పరీక్ష బాగా రాయాలని ఆల్ ద బెస్ట్ చెప్పి.. భార్యను కేంద్రంలోని పంపిన గంట వ్యవధిలోనే ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. చుట్టుపక్కల వారు గుమిగూడేలోపే మృత్యు ఒడికి చేరాడు. కాగా భర్త మరణించిన విషయం తెలిస్తే తట్టుకోలేదన్న భావనతో నిర్వాహకులు పరీక్ష పూర్తయ్యే వరకు ఆమెకు ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. పరీక్ష రాసి మధ్యాహ్నం 12 గంటలకు బయటకు వచ్చి విగతజీవిగా భర్త పడి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. గుండెలు బాదుకుంటూ మృతదేహంపై పడి భోరున విలపించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల వద్ద మంగళవారం చోటుచేసుకుంది.’’ రేణిగుంట పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లె పంచాయతీ కొండేపల్లెకి చెందిన ప్రభాకర్(33), భార్య సరితకు మంగళవారం టెట్ ఆన్లైన్ అర్హత పరీక్ష ఉంది. దీంతో వారు మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయల్దేరి చిత్తూరుకు చేరుకున్నారు. అక్కడ బైక్ పార్క్ చేసి బస్సులో తిరుపతికి చేరుకుని అక్కడ నుంచి పరీక్ష కేంద్రం ఉన్న అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చారు. టెట్ పేపర్–1 పరీక్ష రాసేందుకు ఉదయం 8.30 గంటలకు భార్య సరితను కేంద్రంలోకి పంపి ఆమె కోసం కళాశాల ప్రాంగణంలో ప్రభాకర్ కూర్చుని నిరీక్షించాడు. 10 గంటల సమయంలో అతనికి గుండెపోటుకు గురై కూర్చున్న చోటే కుప్పకూలాడు. పక్కనున్న వారంతా తేరుకుని దగ్గరికి చేరేలోపే తుదిశ్వాస విడిచాడు. పరీక్ష రాసి బయటకు వచ్చిన సరిత భర్త మృతి చెందడాన్ని చూసి తీవ్ర మనోవ్యధకు గురైంది. ‘ఏవండీ పరీక్ష బాగా రాశాను.. లేవండి.. ఇంటికెళదాం’ అంటూ రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. అనంతరం మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకెళ్లారు. కాగా మృతుడికి ముగ్గురు పిల్లలు యశ్వంత్(9), హాసిని(7), గోపీకృష్ణ(5) ఉన్నారు. ప్రభాకర్ చిత్తూరులో మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన మృతి చెందడంతోవారి కుటుంబం వీధిన పడిందని.. ప్రభుత్వం ఆదుకోవాలని మృతుని బంధువులు వేడుకుంటున్నారు. -
టెట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం
సాక్షి, అమరావతి: ఏపీ టెట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఏ జిల్లా నుంచి అభ్యర్ధి దరఖాస్తు చేస్తే ఆ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. అదే విధంగా సీటింగ్ కేపాసిటీ లేకుండానే పలు కేంద్రాలకు అధికారులు హాల్ టికెట్లను జారీ చేశారు. మరో వైపు హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్‌లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి మూడో తేదీత వరకు ఆన్లైన్లో టెట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే టెట్ నిర్వహణకు సంబంధించిన లోటుపాట్లతో మళ్లీ పరీక్షల వాయిదా పడుతుందేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులపై గంటా ఆగ్రహం టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాల కేటాయింపుల్లో పొరపాట్లు చోటు చేసుకోవడం పై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి గంటా సంబంధిత అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులో అభ్యర్ధులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నిలదీశారు. తొలిసారి ఆన్లైన్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ముందు నుంచి చెబుతున్నా అధికారుల అలసత్వం కనబరచడం సరికాదన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి గురువారం విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
ఆన్లైన్లో ‘టెట్’
సాక్షి, అమరావతి: ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ‘టెట్’ విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం సోమవారం జీఓ నెంబర్ 91 జారీ చేసింది. డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. టెట్ పరీక్షను ఆన్లైన్లో రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి టీచర్ పోస్టుల కోసం పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. 6 నుంచి 8వ తరగతి టీచర్ పోస్టులకు పేపర్ 2లో అర్హత సాధించాలి. టెట్ పేపర్ 1 అర్హతలు ఇవీ పేపర్ 1కు దరఖాస్తు చేసే వారు ఇంటర్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. రెండేళ్ల డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీ.ఇఎల్.ఈడీ), లేదా రెండేళ్ల డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యాహక్కు చట్టం– 2010 కన్నా ముందు ఇంటర్మీడియెట్, డీఎడ్ వంటి పరీక్షలు రాసిన వారికి మాత్రం అర్హత మార్కుల్లో కొంత మినహాయింపు ఉంటుంది. వీరికి ఇంటర్లో 45 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులలకు 40 శాతం మార్కులతో పాటు డీఎడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. టెట్ పేపర్ 2 అర్హతలు ఇవీ టెట్ పేపర్ 2కు దరఖాస్తు చేసుకునేవారు బీఏ, బీఎస్సీ, బీకాంలలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులుండాలి. దీంతోపాటు బీఈడీ, బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యాహక్కు చట్టం– 2010 కన్నా ముందు బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈడీ లాటి పరీక్షలు రాసిన వారికి మాత్రం అర్హత మార్కుల్లో కొంత మినహాయింపు ఉంటుంది. వీరిలో బీఏ, బీఎస్సీ, బీకాం చదివిన ఓసీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండడంతో పాటు బీఈడీ తదితర శిక్షణ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా నాలుగేళ్ల బీఏ (ఈడీ), బీఎస్సీ (ఈడీ) కోర్సుల్లో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 45 శాతం మార్కులు వస్తే చాలు. లాంగ్వేజ్ టీచర్లకు సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజెస్, సంబంధిత లాంగ్వేజెస్‌లో గ్రాడ్యుయేషన్, పండిట్ ట్రయినింగ్, లాంగ్వేజ్‌లో బీఈడీ (సంబంధిత సబ్జెక్టులో మెథడాలజీతో కూడి ఉండాలి. ఫైనల్ పరీక్షలకు హాజరయ్యే వారూ అర్హులే ప్రస్తుతం బీఈడీ, డీఈడీ తదితర కోర్సులు అభ్యసిస్తూ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే వారు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత షరతులకు లోబడి డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేలా వారికి అవకాశం కల్పించనున్నారు. అర్హత మార్కులు తప్పనిసరి డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్‌లో కనీస అర్హత మార్కులు తప్పనిసరిగా సాధించి ఉండాలి. జనరల్ అభ్యర్ధులు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్ రాసిన వారికి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డిజిటల్ ఫార్మాట్లో ధ్రువపత్రాలు జారీ చేస్తుంది. ఈ ధ్రువపత్రానికి ఏడేళ్ల చెల్లుబాటు ఉంటుంది. ఈలోపల ప్రకటించే డీఎస్సీలన్నిటికీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అర్హత ఉంటుంది. ఏటా రెండుసార్లు టెట్.. టెట్‌లో సాధించిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులకు 20 శాతం, డీఎస్సీలో వచ్చిన మార్కులకు 80 శాతం చొప్పున వెయిటేజీని పరిగణనలోకి తీసుకుని ఎంపిక జాబితాను రూపొందిస్తారు. టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఛైర్మన్‌గా, జాయింట్ డైరక్టర్ (టెట్) సభ్యకన్వీనర్‌గా మరో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేస్తారు. ఈ కమిటీ టెట్ షెడ్యూల్ ఇతర అంశాలపై నిర్ణయాలు తీసుకుంటుంది. టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. జూన్/జులైలో ఒకసారి అక్టోబర్/నవంబర్‌లో మరోసారి టెట్ పరీక్ష ఉంటుంది. అభ్యర్ధులు ఎన్నిసార్లైనా వీటికి హాజరుకావచ్చు. టెట్ పరీక్షా విధానం ఇలా... టెట్ పరీక్షను కంప్యూటర్ ఆధారంగా బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలతో నిర్వహించనున్నారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. నెగిటివ్ మార్కుల విధానం లేదు. అభ్యర్ధులు పేపర్1 లేదా పేపర్2లకు వేర్వేరుగా హాజరుకావచ్చు. రెండు పేపర్లనూ రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలుంటాయి. పరీక్ష రాయడానికి రెండున్నర గంటల సమయం ఇస్తారు. అంశాలవారీగా ప్రశ్నలను జీఓలో పొందుపరిచారు. -
భార్య టెట్ పరీక్ష తాను రాస్తూ..
మహబూబ్‌నగర్ జిల్లా: భార్య అంటే అన్నీ పంచుకోవాలి అనుకున్నాడో ఏమో, భార్య రాయాల్సిన పరీక్షను తాను రాయబోయాడు. తీరా అధికారులకు దొరికి పోయిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, పరీక్ష హాల్ నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పాన్‌గల్ మండలం రేమొద్దులు పాఠశాలలో పరంధామయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల టెట్ పరీక్షకు భార్యాభర్తలు ఇద్దరూ దరఖాస్తు చేశారు. ఆదివారం పరీక్షా కేంద్రంలో భార్యకు బదులుగా తాను రాస్తూ డీఈఓకు పట్టుబడ్డాడు. మరి ఏమైందో ఏమో గానీ కాసేపైన తర్వాత పరందామయ్య అక్కడి నుంచి జారుకున్నాడు. -
వందలు కాదు.. వేలల్లో అక్రమార్కులు!
♦ వరుస ఐడీలతో టెట్ హాల్‌టికెట్ల జనరేషన్‌ను గుర్తించిన అధికారులు ♦ సెంటర్లలో జంబ్లింగ్‌కు చర్యలు, ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సీటింగ్ సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల ఒకటిన జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో మాస్‌కాపీయింగ్‌కు అవకాశం లేకుండా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అర్ధరాత్రులు, తెల్లవా రుజామున ఫీజుల చెల్లింపులతో వరుస రెఫరెన్స్ ఐడీలను పొంది, వాటి ఆధారంగా హాల్‌టికెట్లు జనరేట్ అయిన అభ్యర్థులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కమిటీ గుర్తిం చింది. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు వరుసగా హాల్‌టికెట్లు వచ్చేలా, ఒకే దగ్గర కూర్చొని భారీగా మాస్ కాపీయింగ్‌కు పాల్పడేలా పన్నిన కుట్రకు టెట్ కమిటీ అడ్డుకట్ట వేస్తోంది. రెఫరెన్స్ ఐడీల ఆధారంగా హాల్ టికెట్లను జనరేట్ చేసిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వరుసగా హాల్‌టికెట్లు వచ్చేలా పన్నిన కుట్రలో వేలల్లో అభ్యర్థులున్నట్లు గుర్తించింది. ప్రస్తుతం వారందరికీ పరీక్ష హాల్లో వరుసగా సీట్లు కేటాయించకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తోంది. పరీక్ష కేంద్రాలు, వాటిల్లోని రూమ్‌ల వారీగా సీట్లల్లో మార్పు చేసేందుకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా చర్యలు చేపట్టింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆన్లైన్ ఫీజులను చెల్లించినవారు దాదాపు 8 వేల మంది వరకు ఉన్నారు. సీజీజీ దీనిని మరింత లోతుగా పరిశీలిస్తోంది. సాధారణంగా అయితే హాల్‌టికెట్ నంబర్ ప్రకారం వారందరూ వివిధ రూమ్‌ల్లో వరుసగా కూర్చోవాలి. కానీ, మాస్ కాపీయింగ్ కోసం మోసపూరితంగానే కోచింగ్ కేంద్రాలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాయన్న ఆరోపణలు, అనుమానాలున్న నేపథ్యంలో వారిని వరుసగా కాకుండా పరీక్ష కేంద్రాల వారీగా, వేర్వేరు రూమ్‌లలో కూర్చోబెట్టేలా సీటింగ్ అరేంజ్‌మెంట్‌ను జంబ్లింగ్ చేసి మారుస్తోంది. దీంతో కోచింగ్ కేంద్రాల ఆటలుసాగవని, పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. మరోవైపు వరుస హాల్‌టికెట్ల జనరేషన్‌పై సీజీజీకి విద్యాశాఖ నోటీసు జారీ చేసి వివరణ కోరింది. తదుపరి చర్యలను పక్కాగా చేపట్టాలని ఆదేశించింది. మే 1వ తేదీన జరగనున్న ఈ పరీక్షకు 3.74 లక్షల మంది హాజరు కానున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష జరగనుంది. -
ఒక్కో విద్యార్థిపై రూ.37,538
- ప్రభుత్వ బడుల్లో సర్కారు ఏటా వెచ్చిస్తున్న మొత్తమిదీ! - అయినా చేకూరని ప్రయోజనం - టీచర్ల వేతనాలకు రూ.7,711 కోట్లు - ఏటేటా పడిపోతున్న విద్యార్థుల సంఖ్య - అదే సమయంలో ప్రైవేటులో చేరుతున్న విద్యార్థులు - డిస్క్రిప్టివ్ విధానంలో టీచర్ నియామక పరీక్ష వైపు అధికారుల చూపు - ఇంటర్వ్యూలు పెడితేనే బాగుంటుందన్న యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 24,12,084 మంది విద్యార్థులు.. 1.23 లక్షల మంది ఉపాధ్యాయులు.. ఏటా రూ.9 వేల కోట్లకు పైగా బడ్జెట్.. ఈ లెక్కన ఒక్కో విద్యార్థిపై ఏటా వెచ్చిస్తున్న మొత్తం రూ. 37,538! అయినా ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదు. విద్యార్థులకు చదువు ఫలాలు దక్కడం లేదు. ఎయిడెడ్ , రెసిడెన్షియల్ పాఠశాలలు మినహా మిగతా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో 46 శాతం మంది తెలుగులో కూడా సరిగ్గా చదవలేకపోతున్నారు. సుశిక్షితులైన టీచర్లు ఉన్నా ప్రైవేటు పోటీని అధిగమించలేని పరిస్థితి నెలకొంది. 2015-16 లెక్కల ప్రకారం ఉపాధ్యాయుల వేతనాల కోసం రూ.7,711 కోట్లు ప్రణాళికేతర వ్యయం కింద వెచ్చిస్తున్నా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తప్పడం లేదు. ఉపాధ్యాయుల వేతనంగానే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.31,969 ఖర్చు చేస్తోంది. ఇక వివిధ పథకాల కింద రూ.1,343 కోట్లు వెచ్చిస్తోంది. ఇందులో ఒక్కో విద్యార్థిపై రూ.5,570 ఖర్చు చేస్తోంది. ఇలా మొత్తంగా ఒక్క విద్యార్థిపైనే ఏటా రూ. 37,538 వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నామని విద్యాశాఖ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. పడిపోతున్న ప్రమాణాలు.. తగ్గుతున్న విద్యార్థులు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది. 2011-12 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 30,76,352 మంది విద్యార్థులు ఉంటే.. అది 2015-16 విద్యా సంవత్సరం నాటికి 27,92,514కు పడిపోయింది. అంటే 2,83,838 మంది తగ్గిపోయారు. అదే సమయంలో ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2011లో ప్రైవేటు పాఠశాలల్లో 30,64,343 మంది విద్యార్థులు ఉండగా 2015-16 విద్యా సంవత్సరం వచ్చే సరికి అది 32,70,799కి పెరిగింది. అంటే 2 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లారు. మిగితా వారు డ్రాపౌట్స్‌గా మిగిలిపోయారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులుంటే టీచర్లు లేరు.. టీచర్లు ఉంటే విద్యార్థుల్లేరు. విద్యాశాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ప్రభుత్వ పాఠశాలలు 407 ఉన్నాయి. గతేడాది లెక్కల ప్రకారం 456 స్కూళ్లలో విద్యార్థుల్లేకపోయినా టీచర్లు ఉన్నారు. 180 స్కూళ్లలో పది మందిలోపే పిల్లలున్నా నలుగురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. టీచర్లు ఉండి 25 మంది లోపే విద్యార్థులు ఉన్న స్కూళ్లు 300 వరకు ఉన్నాయి. ఇక పిల్లలు ఉండీ.. టీచర్లు ఉన్న చోట కూడా సరైన బోధన అందడం లేదు. ఇంటర్వ్యూలపైనా దృష్టి ఉపాధ్యాయుల నియామకాలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీచర్ల నియామక విధానంలో మార్పులు తేవాలని భావిస్తోంది. ఆబ్జెక్టివ్ విధానంలో కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. ఇంటర్వ్యూ విధానం కూడా పెట్టాలని భావిస్తోంది. తద్వారా పోస్టులకు ఎంపికయ్యే వారిలో బోధన, అభ్యాసన పట్ల వారికున్న ఆసక్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, భావోద్వేగాలు, ప్రజ్ఞ, తరగతి బోధన నైపుణ్యం, ప్రదర్శన వంటివి తెలుసుకోవచ్చని, అందుకే ఈ సంస్కరణలు అవసరమని విద్యాశాఖ భావిస్తోంది. అక్షరాస్యతలో 32వ స్థానం దేశవ్యాప్తంగా అక్షరాస్యతలో తెలంగాణ 32వ స్థానంలో ఉంటే.. ఏపీ 30వ స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో పురుషుల అక్షరాస్యత 80.90 శాతం ఉంటే రాష్ట్రంలో 75.04 శాతంగా ఉంది. మహిళల విషయానికొస్తే జాతీయ స్థాయిలో 64.60 శాతం ఉండగా రాష్ట్రంలో 57.99 శాతంగా ఉంది. అసలు లోపం ఎక్కడ? ప్రస్తుతం స్కూళ్లకు టీచర్లు వస్తున్నారా? లేదా? పాఠశాలలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా చూసే వారు లేరు. క్షేత్రస్థాయి పర్యవేక్షకులైన మండల విద్యాధికారి (ఎంఈఓ) పోస్టులు 462 ఉన్నా.. వాటిల్లో 420 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఉప విద్యాధికారి (డిప్యూటీ ఈఓ) పోస్టులు 67 ఉంటే అందులోనూ 59 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పాఠశాలలను పర్యవేక్షించే వారు లేక క్షేత్ర స్థాయిలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వీటికితోడు ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం సన్నగిల్లింది. దీంతో ఆర్థిక స్తోమత లేని వారంతా మధ్యలోనే బడి మానేస్తున్నారు. మరికొందరు ఇంగ్లిషు మీడియంపై ఆసక్తితో ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులను పంపించడం లేదు. -
టెట్‌కు 1.28 లక్షల దరఖాస్తులు
ఈ నెల 31 వరకు దరఖాస్తుకు గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు ఇప్పటివరకు 1.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15 నుంచి ఫీజు చెల్లింపు, 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ పది రోజుల్లోనే 1,28,464 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించగా, గురువారం నాటికి 1,17,735 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించారు. మరోవైపు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉంది. ఈ వారం రోజుల్లో మరో 1.50 లక్షలకు పైగా దర ఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈసారి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.