పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన ఉంటుందని ముఖ్య మంత్రి కేసీఆర్ చెప్పి వారం గడవక ముందే విద్యాశాఖ మంత్రి మాట మార్చడాన్ని నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు.
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
Published Sat, Nov 28 2015 12:41 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM
వరంగల్: పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన ఉంటుందని ముఖ్య మంత్రి కేసీఆర్ చెప్పి వారం గడవక ముందే విద్యాశాఖ మంత్రి మాట మార్చడాన్ని నిరసిస్తూ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన బాటపట్టారు. డీఎస్సీ అభ్యర్థులకు టెట్ పరిక్ష ఉన్నట్టా.. లేనట్టా అని ప్రశ్నిస్తూ వరంగల్‌లోని స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి డీఈవో కార్యాలయం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
భారీగా తరలివచ్చిన డీఎస్సీ అభ్యర్థులతో డీఈవో కార్యాలయం కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం అస్పష్టమైన ప్రకటనలు చేస్తూ ఉద్యోగార్థులతో ఆడుకుంటుందని మండిపడ్డారు. జనవరి 24న నిర్వహించ తలపెట్టిన టెట్ ఉంటుందా అని అభ్యర్థులు ప్రశ్నించారు. ఒక వేళ టెట్ ఉంటే దానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ జరపాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement