
కొవ్వొత్తుల ప్రదర్శనలో విద్యార్థి సంఘాల నాయకులు
కొడకండ్ల/ఎంజీఎం/వరంగల్/కాశిబుగ్గ: ప్రీతి ఘటనలో కళాశాల ప్రిన్సిపాల్, హెచ్‌ఓడీల నిర్లక్ష్యం ఉన్నందున వారిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలంటూ ఆదివారం రాత్రి గిర్నితండాలో స్థానికులు, మైదంచెరువుతండా గిరిజనులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జనగామ–సూర్యాపేట రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు చేరుకొని ఆందోళనను విరమింపజేశారు.
అలాగే, ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా.. పోలీసులు విద్యార్థులను అడ్డుకుని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ప్రీతి మృతికి కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ డెమొక్రటిక్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్ పోరిక ఉదయ్‌సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment