Student Union
-
కామారెడ్డిలో దారుణం.. విద్యార్థినిని వేధించిన పీఈటీ
-
గిర్నితండాలో గిరిజనుల ధర్నా.. కేఎంసీలో విద్యార్థుల ఆందోళన
కొడకండ్ల/ఎంజీఎం/వరంగల్/కాశిబుగ్గ: ప్రీతి ఘటనలో కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ఓడీల నిర్లక్ష్యం ఉన్నందున వారిని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలంటూ ఆదివారం రాత్రి గిర్నితండాలో స్థానికులు, మైదంచెరువుతండా గిరిజనులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. జనగామ–సూర్యాపేట రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు చేరుకొని ఆందోళనను విరమింపజేశారు. అలాగే, ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన సీనియర్ విద్యార్థి సైఫ్‌ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రీతి మృతికి సంతాపం తెలుపుతూ కొవ్వొత్తులతో నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా.. పోలీసులు విద్యార్థులను అడ్డుకుని మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ప్రీతి మృతికి కారకులైన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ డెమొక్రటిక్ ఫ్రంట్ స్టేట్ కన్వీనర్ పోరిక ఉదయ్‌సింగ్ డిమాండ్ చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. -
హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్
సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగరావును ప్రకటించింది. గత ఆరేళ్లుగా ఆయన భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బల్మూరి వెంకట్‌తో పాటు స్థానిక నేతలు రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్లు ప్రతిపాదిస్తూ టీపీసీసీ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన వెంకట్‌ను బరిలో నిలపాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ బల్మూరి వెంకట్ పేరును ఖారారు చేసినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా... 2015, 2018లో జరిగిన ఎన్ఎస్యూఐ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2017లో ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఎంబీబీఎస్ చదివిన వెంకట్‌ది పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాం పూర్ మండలం తారుపల్లి గ్రామం. అవివాహితుడయిన వెంకట్ (29) విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయనను పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగి క్రమశిక్షణతో పనిచేసే యువనాయకత్వానికి కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవం ఇస్తుందన్న విషయం వెంకట్ ఎంపికతో మరో మారు నిరూపితమయిందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ వినోద్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అధినాయకత్వానికి ధన్యవాదాలు: వెంకట్ హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులకు వెంకట్ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. -
72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం
ఏబీవీపీ అనే నాలుగు అక్షరాలు తెలియని విద్యార్థి కళాశాల క్యాంప స్లో ఉండడు. 72 ఏళ్ళుగా విద్యార్థి లోకంతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుండటమే దీనికి కారణం. 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమై, నేడు దేశంలో 33 లక్షల సభ్యత్వం గల అతి పెద్ద విద్యార్థి సంఘం ఇది. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా చేయాలనీ; వివిధ ప్రాంతాల భాషలను రాజ్యభాషగా, హిందీని అధికార భాషగా గుర్తిం చాలనీ; రాజ్యాంగంలో ఇండియా పేరును భారత్‌గా మార్చా లనీ ఏబీవీపీ ఉద్యమం చేసింది. విద్యార్థులపై పన్ను భారం లేని విద్యను కొనసాగించాలని డిమాండ్ చేసింది. కానీ ప్రభుత్వం పన్నును రెండింతలు చేయడంతో దేశం మొత్తం జరిగిన ఆందోళనలకు నేతృత్వం వహించింది. దీనితో 1966లో డి.ఎస్. కొఠారిని యూజీసి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. 1968లో విద్యపై కేంద్రం ఒక విధానాన్ని ప్రకటించింది. 1973లో గుజరాత్‌లోని ఎల్.డి.ఇంజనీరింగ్ కాలేజీ, మోర్వి పాలిటెక్నిక్ కాలేజీల మెస్ ఉద్యమానికి ఏబీవీపీ మద్దతుగా నిలవడంతో ఉద్యమం ఉధృతమైంది. చిమన్‌భాయ్ పటేల్ సర్కారు గద్దె దిగక తప్పలేదు. గుజరాత్‌లాగే బిహార్‌లో కూడా ఉద్యమం ప్రారంభమైంది. 1974 మార్చి 19న ఉద్యమానికి నేతృత్వం వహించమని జయప్రకాశ్ నారాయణను కోరింది. అసెంబ్లీల ముందు ధర్నాలు, కర్ఫ్యూల నడుమ నడిచిన ఈ ఉద్యమం 1975 జూన్ 20న ఇందిరాగాంధి ఎమర్జెన్సీ విధిం చడంతో ప్రజా ఆందోళనగా మారింది. సుమారు 5 వేల మంది ఏబీవీపీ కార్యకర్తలను మీసా చట్టం క్రింద అరెస్టు చేసి జైళ్లలో బంధించారు. ఎమర్జెన్సీ తరువాత అనేక విద్యార్థి సంఘాలు జనతా పార్టీలో కలిసిపోయాయి. ఏబీవీపీ మాత్రం జాతీయ పునఃనిర్మాణంలో ముందుకెళ్ళాలని నిర్ణయిం చుకుంది. 1990లో ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి శ్రీనగర్ లాల్ చౌక్‌లో జాతీయ జెండాను కాల్చి దేశానికి సవాల్ విసిరి నప్పుడు, ‘చలో కాశ్మీర్’ కార్యక్రమంతో కార్యకర్తలను సమా యత్తం చేసింది. 10 వేల మందితో అదే లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేసి జాతి గౌరవాన్ని నిలిపింది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల విషయమై 1983 నుండి ‘సేవ్ అస్సాం’ పేరుతో ఉద్యమాలు చేసింది. బంగ్లా సరిహద్దును మూసి వేయాలని, అక్రమ చొరబాటు దారులను వారి స్వస్థలాలకు పంపాలని 2008 డిసెంబర్ 17న బిహార్ సరిహద్దులోని చికెన్ నెక్ దగ్గర 50 వేల మందితో ఆందోళన నిర్వహించింది. తెలంగాణలోని బీడుభూములు గోదావరి, కృష్ణా జలా లతో సస్యశ్యామలంగా మారాలని 1997లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ను బాసర నుండి శ్రీశైలం వరకు నిర్వహించింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని 2009లో నిజాం కాలేజీ గ్రౌండ్లో లక్ష మంది విద్యార్థులతో ‘విద్యార్థి రణభేరి’ మోగించింది. ‘నా రక్తం నా తెలంగాణ’ పేరుతో ఒకే రోజు 22 వేలమంది విద్యార్థి యువకులు రక్త దానం చేసి చరిత్ర సృష్టించారు. 40 దేశాలల్లో ఏబీవీపీ కార్య క్రమాలను కొనసాగిస్తున్నది. దీని ఆవిర్భావ దినోత్సవాన్ని ‘జాతీయ విద్యార్థి దినోత్సవం’గా దేశమంతటా నిర్వహిం చడం సంతోషకరం. వ్యాసకర్త: చిరిగె శివకుమార్ ఏబీవీపీ రాష్ట్ర సహ సంఘటనా కార్యదర్శి, తెలంగాణ -
వ్యతిరేకించినవాళ్లే సపోర్ట్ చేస్తున్నారు
‘‘డిగ్రీ కాలేజ్’ విడుదలకు ముందు పోస్టర్స్ చూసి సినిమాని ప్రదర్శించకుండా అడ్డుకుంటామన్న విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాల నాయకులే చిత్రాన్ని చూశాక మనసుకు హత్తుకునే మంచి కథ ఉందని ప్రశంసిస్తున్నారు. అప్పుడు వ్యతిరేకించినవాళ్లే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు’’ అన్నారు దర్శకుడు నరసింహ నంది. వరుణ్, దివ్యారావు జంటగా స్వీయ దర్శకత్వంలో నరసింహ నంది నిర్మించిన ‘డిగ్రీ కాలేజ్’ ఈ నెల 7న విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్లో నరసింహ నంది మాట్లాడుతూ– ‘‘కొన్ని రొమాంటిక్ సీన్స్ చూసి సినిమా మీద నెగటివ్ అభిప్రాయం ఏర్పరచుకోవద్దని మా మనవి. సినిమా చూశాక మాట్లాడమని కోరుతున్నాం. బలమైన కథ ఉంది. క్లైమ్యాక్స్ సీన్స్ ప్రేక్షకులను భావోద్యేగానికి గురి చేస్తున్నాయి. కుల వ్యవస్థ మీద తీసిన సినిమా ఇది. ‘1940 లో ఒక గ్రామం’ సినిమాని కుల వ్యవస్థపైనే తీశాను.. జాతీయ అవార్డు వచ్చింది కానీ డబ్బులు రాలేదు. ‘డిగ్రీ కాలేజ్’కి డబ్బులు కూడా రావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. -
‘చంద్రబాబు ఆంధ్ర ప్రజల ద్రోహి’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేసి.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధివిభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారిపాలన వికేంద్రీకరణతోనే 13 జిల్లాల అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ ముందడుగు వేశారని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు అడ్డుకోవడంతో చంద్రబాబు ఆంధ్ర ప్రజల ద్రోహిగా మిగిలిపోతారని అంజిరెడ్డి మండ్డిపడ్డారు. వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చంద్రబాబు విధానాలకు నిరసనగా ఈ నెల 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తే.. పెయిడ్ ఆర్టిస్టులు అన్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మం చౌదరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేస్తే.. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా అని అంజిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని బ్రాహ్మం విద్యార్థులను మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రెండు లక్షల ఉద్యోగ ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయని చేతకాని ప్రభుత్వం టీడీపీ అని అంజిరెడ్డి ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే రాష్ట్రం నుంచి బ్రాహ్మం చౌదరిని అతని విద్యార్ధి సంఘాన్ని వెళ్లగొడతామని అంజీరెడ్డి హెచ్చరించారు. -
విద్యార్థి చేయి విరగ్గొట్టిన ‘శ్రీచైతన్య’ టీచర్
ఎమ్మిగనూరు టౌన్: అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదన్న కోపంతో శ్రీ చైతన్య పాఠశాల ఉపాధ్యాయుడొకరు ఓ విద్యార్థి చేయి విరగ్గొట్టాడు. బాధిత విద్యార్థి తండ్రి కరీం, విద్యార్థి సంఘాల నాయకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణానికి చెందిన అబ్దుల్ కలాం అనే విద్యార్థి ఎమ్మిగనూరు లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం తరగతి గదిలో తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని విద్యార్థి అబ్దుల్‌కలాంను సైన్స్ ఉపాధ్యాయుడు జమీల్ చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. దీంతో చేయి విరిగింది. అతన్ని తల్లిదండ్రులు చిన్నతుంబళం గ్రామానికి తీసుకెళ్లి నాటు వైద్యం చేయించారు. శుక్రవారం విద్యార్థి తండ్రితో పాటు విద్యార్థి సంఘాల నాయకులు వీరే‹Ùయాదవ్, ఉసేని, మహేంద్రబాబు పాఠశాల వద్దకు చేరుకుని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్సతో పాటు చదువుకయ్యే ఖర్చు భరించాలన్నారు. చివరకు చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పి వారిని శాంతింపజేశారు. -
వైరల్ ట్రైలర్స్
‘‘ప్రైవేటైజేషన్ ఈజ్ టేకింగోవర్. పూర్ స్టేయింగ్ పూర్ అండ్ రిచ్ బికమింగ్ రిచర్’’.జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు.‘‘.. బీయింగ్ అగైనెస్ట్ దిస్, వి హ్యావ్ రైజ్డ్ అవర్ వాయిస్ టు ప్రొటెస్ట్.. బట్ అవర్ ప్రొటెస్ట్ హ్యాజ్ రిమెయిన్డ్ అన్హర్డ్..’’(పేదోడు పేదోడిగానే ఉండిపోతున్నాడు. ఉన్నోడు ఇంకా ఇంకా ఉన్నోడు అయిపోతున్నాడు. దీనిపై మేము గళం విప్పాం. పిడికిలి బిగించాం). ఉస్మానియా విశ్వవిద్యాలయం 1967. హాస్టల్ డైనింగ్ హాల్. ‘‘మనం తిన్న ప్లేట్లల్ల ఉప్పేసి కడుగుతరు ఈ నా కొడుకులు. తినండ్రా మీరు తిన్నంక అదే ప్లేట్లల్లో ఉచ్చ పోసి కడుగుత..’’అన్నం పరబ్రహ్మ స్వరూపం. వర్ణం? మనుధర్మ వికృతరూపం. తింటున్న ప్లేట్లు గాల్లోకి లేచాయి. ‘‘రేయ్.. ఏం కూశావ్‌రా’’ అగ్రవర్ణం పైకి లేచింది. జార్జిరెడ్డి కూడా పైకి లేచాడు. తనది ఏ వర్ణమో అతడు చూసుకోలేదు. ‘ఉచ్చపోసి కడుగుతా’ అని అరిచిన ‘అధమ’ వర్ణం వైపు నిలబడ్డాడు! ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో అమిత్గాడి హాస్టల్‌కి వెళ్లి మరీ వాడి ముక్కూమూతి పగలగొట్టినట్లు.. ‘ఏం కూశావ్‌రా..’ అని అధమ వర్ణంపైకి లేచిన అగ్రవర్ణం ముక్కు బద్దలు కొట్టాడు జార్జిరెడ్డి.‘‘ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం కోసం పోరాడుతున్న విద్యార్థులారా.. యుద్ధానికి సిద్ధం కండి. భారత్ మాతాకీ జై.’’క్యాంపస్‌లోకి అవుట్ సైడర్స్! టార్గెట్ జార్జిరెడ్డి!‘‘ఎవరు వాడు?’’.. పొలీస్ ఇన్స్పెక్టర్ అడిగాడు.‘‘ఎవడో కొత్త కుర్రోడు సార్. పేరు జార్జిరెడ్డి’’.. ముఖం పచ్చడైన భరతమాత ముద్దుబిడ్డ ఒకడు చేతులు కట్టుకుని చెబుతున్నాడు.‘‘ఎనీ బడి కెన్ సాల్వ్ దిస్?’’.. ఫిజిక్స్ క్లాస్ రూమ్‌లో లెక్చరర్ అడిగాడు. జార్జిరెడ్డి చెయ్యెత్తాడు. క్లాసయ్యాక క్లాస్మేట్ అడిగాడు.. ‘‘నిజం చెప్పు డబుల్ ఎమ్మెస్సీ కదా!’’ జార్జిరెడ్డి నవ్వలేదు. నవ్వీ నవ్వనట్లు చూశాడు. క్యాంపస్‌లోకి మళ్లీ ఔట్ సైడర్స్. మళ్లీ జార్జిరెడ్డే టార్గెట్. వీడిని ఇలాగే వదిలేస్తే క్యాంపస్ చేజారిపోతుంది. ‘‘పోతేపోయింది.. ఆ నా కొడుకుల చేతిలోకి పోతుంది’’. కత్తులు, కర్రలు.. ఉస్మానియాలో ఉద్రిక్తత. కారణం.. మళ్లీ జార్జిరెడ్డి! ‘‘వన్ ఇయర్ రస్టికేట్ లెటర్ టైప్ చెయ్యండి’’.. వైస్ చాన్స్‌లర్ ఆర్డర్. ఇంటికొచ్చాడు జార్జిరెడ్డి. ‘‘నేను అనుకున్న క్యాంపస్ ఇది కాదమ్మా..’’ తల్లితో అన్నాడు. కానీ క్యాంపస్ అనుకున్న హీరో మాత్రం జార్జిరెడ్డే. రష్యన్ రివల్యూషన్ పుస్తకాన్ని కొడుకు చేతికిచ్చింది తల్లి. జార్జిరెడ్డి రీచార్జ్రెడ్డి అయ్యాడు. ‘‘జార్జిరెడ్డి దాదా అయిండన్నా.. ఔటర్స్ లోపలికి రావాలంటేనే భయపడుతున్నారు. అంతేకాదు.. అప్పర్ క్యాస్ట్ అంటే.. అసలు ఆలోచించకుండా కొడుతున్నాడు’’ ‘‘అసలు ఈడెవడు భయ్యా. నిన్నగాక మొన్నొచ్చాడు’’ వచ్చింది నిన్నగాక మొన్ననే. ఉండబోతున్నది ఉస్మానియా క్యాంపస్ ఉన్నంతకాలం. ‘‘స్కాలర్షిప్పులు రాకుండా చేసినా, ఏం చేసినా సరే.. గల్లా పట్టుకుని ప్రశ్నించండి.. రైజ్ యువర్ వాయిస్’’.. జార్జిరెడ్డి స్పీచ్‌కి క్యాంపస్‌లోని చెట్టు కూడా తలలు ఊపుతున్నాయి. ‘‘ఈ కాలేజేమైనా వాళ్ల అయ్యదా? తాతదా? ఎవరికి ఆయాసమొచ్చినా ఉరికొస్తుండు’’ ‘‘ఎవరో కనుక్కోండి’’ జార్జిరెడ్డి. మ్యాన్ ఆఫ్ యాక్షన్. ‘‘టుడే వాట్ వియ్ లెఫ్ట్ విత్ అజ్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ అండ్ మీట్ వయొలెన్స్ విత్ వయొలెన్స్’’ జార్జిరెడ్డి మాట్లాడుతున్నాడు. ‘‘రైజ్ యువర్ వాయిస్. బిఫోర్ ద ట్రూత్ డైస్’’. జార్జిరెడ్డి కొట్లాడుతున్నాడు. ‘‘జీనా హైతో మర్నా సీకో.. కదమ్ కదమ్ పర్ లడ్నా సీకో’’. బతకాలంటే చావడం ఎలాగో నేర్చుకో. ప్రతి అడుగులోనూ పోరాడటం నేర్చుకో. రెండేళ్ల క్రితం ‘అర్జున్‌రెడ్డి’ సినిమా ట్రైలర్ ఎంత వైరల్ అయిందో.. ఇప్పుడు ‘జార్జిరెడి’్డ ట్రైలర్ అలాగే యూత్‌ని ఊపేస్తోంది. అర్జున్‌రెడ్డి లవ్ స్టోరీ. జార్జిరెడ్డి వార్ స్టోరీ. పేదరికంపై వార్. ప్రైవేటీకరణపై వార్. అగ్రవర్ణ ఆధిపత్యంపై వార్. ఉత్తమాటలపై వార్. చెత్త రాజకీయాలపై వార్. సమసమాజ స్థాపనే ధ్యేయంగా జీవించి, పోరాడి, అమరుడైన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డిపై ఈ సినిమాను తీస్తున్నది జీవన్‌రెడ్డి (‘దళం’ఫేమ్). జార్జిరెడ్డిగా నటిస్తున్నది సందీప్ మాధవ్ (‘వంగవీటి’ ఫేమ్). ఇది హిట్ కొట్టేలా కనిపిస్తోంది. కొట్టాలి. విద్యార్థి ఉద్యమ నిర్మాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1970వ దశాబ్దారంభంలో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమ నిర్మాణానికి జార్జిరెడ్డి రాజకీయ పునాదులు వేశాడు. ఆ క్రమంలోనే 1972లో 25 ఏళ్ల వయసులో క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కాలేజ్ హాస్టల్ బయట ప్రత్యర్థి శక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు. ఓయూ క్యాంపస్‌లో సామాజికంగా అట్టడుగు విద్యార్థులను చైతన్య పరచిన చరిత్ర జార్జిరెడ్డిది. -
భగ్గుమన్న యువత
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి)/పలమనేరు/వికోట/గుంతకల్లు: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల ప్రశ్నపత్రం లీకైందంటూ ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన కథనం పట్ల రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాలు ఆ పత్రికపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ కథనాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు తిరుపతి ఎస్వీయూలో ఆ పత్రిక దినపత్రికను తగలబెట్టారు. విద్యార్థి విభాగం నేతలు మురళీధర్, కిషోర్‌దాస్, నరేంద్ర, శివకృష్ణ, తదితరులు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి దినపత్రికను, ఏబీఎన్ చానెల్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ పరీక్షలపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్న రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నేతలు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పీఎన్ నాగరాజు చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోటలో వేర్వేరుగా డిమాండ్ చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికను దహనం చేసి నినాదాలు చేశారు. ర్యాంకులు సాధించిన వారిపై అసత్య కథనాలు వెలువరించిన రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని రాయలసీమ విమోచన సమితి నేతలు డిమాండ్ చేశారు. గుంతకల్లు హనుమాన్ సర్కిల్లో నిరసన తెలిపారు. -
పబ్జీ గేమ్‌ను నిషేధించండి
జమ్మూ: పబ్జీ వీడియో గేమ్ గురించి ఇటీవల చాలా వార్తలు పేపర్లలో కనిపిస్తున్నాయి. టాస్క్ ఏలా పూర్తి చేయాలో, అందుకు ఏయే చిట్కాలు అమలు చేయాలో కూడా సోషల్ మీడియాలో చెబుతున్నారు. దీంతో యువత వీడియో గేమ్ పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ఏదో కాసేపు ఆడి.. వదిలేస్తే ఫరవాలేదు, కానీ పబ్జీ గేమ్‌కు బానిసలుగా మారుతున్నారు. దీంతో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతూ గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్య విడుదలైన పది, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాలు చాలా దారుణంగా వచ్చాయని, వెంటనే ఈ గేమ్‌పై నిషేధం విధించాలని జమ్ముకశ్మీర్ విద్యార్థుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ నాయక్‌ను కలిసి గేమ్‌పై నిషేధం విధించాల్సిందిగా కొందరు విద్యార్థులు కోరారు. విద్యార్థులు ఈ గేమ్‌కు బానిసలవుతున్నారని, ఈ మధ్య వచ్చిన పది, పన్నెండో తరగతి ఫలితాలను చూసిన తర్వాతైనా దీనిపై నిషేధం విధించాల్సిందని కోరారు. పబ్జీ గేమ్‌ను వీళ్లు డ్రగ్స్‌తో పోల్చడం విశేషం. యువత 24 గంటలూ ఈ గేమ్ ఆడటం చూస్తుంటే.. డ్రగ్స్‌కు బానిసలైనట్లే కనిపిస్తున్నారు. అందుకే ఈ గేమ్‌ను వెంటనే బ్యాన్ చేయాలని గవర్నర్‌ను కోరుతున్నామని విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు రఖిఫ్ మఖ్దూమి అన్నారు. భవిష్యత్తును నాశనం చేసే గేమ్‌గా పబ్జీని అభివర్ణించారు జమ్ముకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ అబ్రార్ అహ్మద్ భట్. -
ముదురుతున్న తె.యూ వివాదం
సాక్షి, తె.యూ (డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో పాతిక రోజులుగా కొనసాగుతున్న అందోళనలు గురువారం విద్యార్థులు నిరవధిక దీక్షలు చేపట్టడంతో మరింత ముదిరాయి. యూనివర్సిటీలో బోధన తరగతులు కొనసాగక విద్యా సంవత్సరం వృథా అవుతోందని ఆరోపిస్తూ మూడు రోజులుగా అందోళనబాట పట్టిన విద్యార్థులు చివరికి ఆమరణ దీక్షలకు దిగారు. చిచ్చురేపిన జీవో నంబరు 11.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల(అకడమిక్ కన్సల్టెంట్లు)కు వేతనాలు పెంపు చేస్తూ జీవో నంబరు 11ను విడుదల చేసింది. అయితే తెయూ వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య తొమ్మిది కోర్సులను సెల్ఫ్ ఫైనాన్స్లుగా ప్రకటించారు. ఆయా కోర్సుల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు జీవో నంబరు 11 ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లించబోమని స్పష్టం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. వర్సిటీలో అన్ని కోర్సులు రెగ్యులర్ కోర్సులుగానే పరిగణించాలని, జీవో నంబరు 11ను కాంట్రాక్టు అధ్యాపకులందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ 9 కోర్సుల కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మె బాట పట్టారు. 25 రోజులుగా క్యాంపస్ మెయిన్ గేటు వద్ద శిబిరం ఏర్పాటు చేసుకుని నిరవధిక రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. దీంతో 9 కోర్సుల్లో పాఠాలు బోధించేవారు లేక తరగతులు కొనసాగడం లేదు. పట్టించుకోని వీసీ, రిజిస్ట్రార్లు.. 25 రోజులుగా రిలేదీక్షలు చేస్తున్నా వీసీ ప్రొఫెసర్ పి.సాంబయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు మొండివైఖరితో సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టు అధ్యాపకులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చర్చల పేరుతో పిలిచి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి, 19 రోజులుగా వీసీ యూనివర్సిటీకి రాకుండా తప్పించుకు తిరుగుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రార్ సైతం తన చేతిలో ఏమీ లేదని వీసీ ఎలా చెబితే అలా చేస్తామని చేతులెత్తేశారు. దీంతో కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా మూడు రోజులుగా విద్యార్థులు నేరుగా అందోళనబాట పట్టారు. వీసీ సాంబయ్య కన్పించడం లేదంటూ కరపత్రాలు ముద్రించి క్యాంపస్ ఆవరణలో అతికించారు. బోధన, బోధనేతర సిబ్బందిని క్యాంపస్‌లోకి అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. గురువారం సైతం బోధన, బోధనేతర సిబ్బందిని విధులకు హాజరు కాకుండా అడ్డుకున్న విద్యార్థులు అల్పాహారం సైతం గేటు వద్దకే తెప్పించుకుని తిన్నారు. ఆమరణ దీక్షలు.. వీసీ, రిజిస్ట్రార్ల నుంచి స్పందన లేకపోవడంతో గురువారం విద్యార్థులు విఘ్నేశ్, వినోద్, అఖిల్, నర్సింలు, శ్రీకాంత్, అశోక్, ప్రశాంత్ ఆమరణ దీక్షలు ప్రారంభించారు. దీక్షా శిబిరంలో విద్యార్థు లు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరగతులు జరగకపోవడంతో సిలబస్ పూర్తి కాలేదని, ఈ నెల 27నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. సిలబస్ పూర్తి కాకపోవడంతో పరీక్షలు ఎలా రాయాలని ప్రశ్నించారు. ఆమరణ దీక్షలకు మద్దతు తెలిపిన విద్యార్థి నాయకులు యెండల ప్రదీప్, క్రాంతికుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా వీసీ, రిజిస్ట్రార్ లు స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఎస్ఐ తీరుపై ఏయూ విద్యార్థుల ఆందోళన
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థిపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ చేయి చేసుకున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు అందోళనకు దిగారు. ఆదివారం మధ్యాహ్నం వర్సిటీ పరిపాలనా భవనం వద్ద నిరసన చేపట్టారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎంవీపీ కాలనీ ప్రాంతంలో టిఫిన్ చేయడానికి వెళ్లిన న్యాయ కళాశాల విద్యార్థి సురేష్‌పై ఎస్ఐ అనుచితంగా చేయిచేసుకున్నారన్నారు. దాడిలో విద్యార్థికి చెవిపై గాయం కావడంంతో ఆగ్రహించిన విద్యార్థులు శనివారం రాత్రి 3 గంటల సమయంలో వర్సిటీ రిజిస్ట్రార్ నివాసాన్ని ముట్టడించారు. రిజిస్ట్రార్‌కు జరిగిన విషయాన్ని వివరించిన విద్యార్థులు ఆదివారం ఉదయం మరో పర్యాయం ర్సిటీ పరిపాలనా భవనానికి చేరుకుని పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. తూర్పు ఏసీపీ నరసింహమూర్తి ఇతర పోలీసు అధికారులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు సర్దిచెప్పారు. పోలీసులు విద్యార్థులకు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. విద్యార్థికి అవసరమైన చికిత్సను చేయించడానికి పోలీసులు ముందుకు వచ్చారు. దీనితో శాంతించి విద్యార్థులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
అమానుషం: దాడి చేసి నగ్నంగా నడిపించారు
కోల్‌కతా: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థి ర్యాగింగ్ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించింది. ఘటనకు బాధ్యులైన వారెవరైనా సరే విడిచిపెట్టబోమని విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ ఆదివారం మీడియాకు తెలిపారు. కాగా, కోల్‌కతాలోని సెయింట్ క్యాథెడ్రల్ కాలేజీలో గత నెల 17 న ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని చితకబాదిన సీనియర్లు.. అందరి ముందు నగ్నంగా నడిపించారు. ఆపై తతంగం అంతా వీడియోలు తీసి వైరల్ చేశారు. బాధిత విద్యార్థి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం సభ్యుడు కావటంతో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. అసలేం జరిగింది... కాలేజీ ఫంక్షన్ పేరుతో సీనియర్లు విద్యార్థుల నుంచి విరాళాలు సేకరించారు. అయితే వసూలు చేసిన మొత్తంపై లెక్కలు చూపాలని సదరు విద్యార్థి సీనియర్లను నిలదీశాడు. దీంతో కోపోద్రిక్తులైన సీనియర్లు అతనిపై దాడి చేసి, అందరి ముందు నగ్నంగా మార్చి అవమానించారు. ఆపై వీడియోలు తీసి ఇంటర్నెట్లో పోస్టు చేశారు. విషయం బయటపడడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధం అయ్యారు. మరోవైపు బాధిత యువకుడు విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీని స్వయంగా కలిసి ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై టీఎంసీ విద్యార్థి విభాగం గుర్రుగా ఉంది. అధ్యక్షురాలు జయ దత్త స్పందిస్తూ... ఘటనపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయంపై రాజకీయ విమర్శలకు దిగాయి. -
కర్నూలును రాజధానిగా ప్రకటించాలి
కర్నూలు(అర్బన్): కర్నూలును రాజధానిగా ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం వందల సంఖ్యలో విద్యార్థులు జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్ అధ్యక్షతన చేపట్టిన ఆందోళనలో లక్ష్మీనరసింహ మాట్లాడుతు రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తూ కర్నూలును రాజధానిగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. కమిటీల పేరిట కాలయాపన చేస్తూ రాజధానిని కోస్తాకు తరలించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు పదవుల కోసం పాకులాడుతున్నారే తప్ప రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. 57 సంవత్పరాల సమైక్యాంధ్రలో రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అయ్యారని, వీరంతా సీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాయలసీమ ప్రజలు తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఉన్నత విద్యను అభ్యసించిన ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకొని వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో పాలకుల పుణ్యమాని రైతులకు రుణాలు అందడం లేదని, రుణమాఫీపై చంద్రబాబు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయన్నారు. రాయలసీమ అభివృద్ధి రాజధానితోనే సాధ్యమని, అన్ని రకాల వనరులు కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికీ కమిటీల పేరిట ఎందుకు కాలయాపన చేస్తున్నారని లక్ష్మీనరసింహ ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి అంతర్జాతీయ మెట్ట పొలాల పరిశోధన సంస్థ, ఐటీ హబ్, నిట్, నిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీ, మైనింగ్ స్కూల్, పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు కలసిరావాలని ఆయన కోరారు. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధానికి గుంటూరు-విజయవాడ అనుకూలంగా ఉంటుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని సోమిశెట్టి హామీ ఇచ్చారు. ఆందోళనలో విద్యార్థి నాయకులు నాగభూషణం, నరసింహ, వినయ్, నగర నాయకులు షఫీ, మాబాష, రమేష్ తదితరులు పాల్గొన్నారు.