జమ్మూ: పబ్‌జీ వీడియో గేమ్ గురించి ఇటీవల చాలా వార్తలు పేపర్లలో కనిపిస్తున్నాయి. టాస్క్ ఏలా పూర్తి చేయాలో, అందుకు ఏయే చిట్కాలు అమలు చేయాలో కూడా సోషల్ మీడియాలో చెబుతున్నారు. దీంతో యువత వీడియో గేమ్ పట్ల బాగా ఆకర్షితులవుతున్నారు. ఏదో కాసేపు ఆడి.. వదిలేస్తే ఫరవాలేదు, కానీ పబ్‌జీ గేమ్‌కు బానిసలుగా మారుతున్నారు. దీంతో రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతూ గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్య విడుదలైన పది, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాలు చాలా దారుణంగా వచ్చాయని, వెంటనే ఈ గేమ్‌పై నిషేధం విధించాలని జమ్ముకశ్మీర్ విద్యార్థుల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ నాయక్‌ను కలిసి గేమ్‌పై నిషేధం విధించాల్సిందిగా కొందరు విద్యార్థులు కోరారు. విద్యార్థులు ఈ గేమ్‌కు బానిసలవుతున్నారని, ఈ మధ్య వచ్చిన పది, పన్నెండో తరగతి ఫలితాలను చూసిన తర్వాతైనా దీనిపై నిషేధం విధించాల్సిందని కోరారు. పబ్‌జీ గేమ్‌ను వీళ్లు డ్రగ్స్‌తో పోల్చడం విశేషం. యువత 24 గంటలూ ఈ గేమ్ ఆడటం చూస్తుంటే.. డ్రగ్స్‌కు బానిసలైనట్లే కనిపిస్తున్నారు. అందుకే ఈ గేమ్‌ను వెంటనే బ్యాన్ చేయాలని గవర్నర్‌ను కోరుతున్నామని విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు రఖిఫ్ మఖ్దూమి అన్నారు. భవిష్యత్తును నాశనం చేసే గేమ్గా పబ్‌జీని అభివర్ణించారు జమ్ముకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ అబ్రార్ అహ్మద్ భట్.
Comments
Please login to add a commentAdd a comment