నల్గొండ: నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థిని కట్టెబోయిన అలేఖ్య పరీక్షలకు ముందు ఎన్నో ఇబ్బందులకు గురైంది. బుధవారం ప్రకటించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 9.7 జీపీఏ సాధించింది. గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్షమ్మ దంపతులకు ఏకైక కూతురు అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియడంతో తండ్రి చాలా ఏళ్ల కిందటే వదిలి వెళ్లాడు.
దీంతో తల్లి లక్ష్మమ్మ కూతురు అలేఖ్యను తీసుకుని తల్లిగారి ఊరు పెద్దవూర మండలంలోని ముసలమ్మ చెట్టుకు వచ్చి స్థిరపడింది. అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమనూరులోని వసతి గృహంలో ఉంటూ ఆదర్శ పాఠశాలలో చేరింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కూడా తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రా సి 9.7 జీపీఏ సాధించింది.
అలేఖ్య పరిస్థితి తెలుసుకున్న ఆదర్శ పాఠశాల అధ్యాపకులు ఆర్థికంగా కొంత సహయ సహకారాలు అందించారు. పదో తరగతి తర్వాత కూడా అలేఖ్య కూడా చదువుకు అవసరమైన సహకారం అందించడానికి అధ్యాపకులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్‌లో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. బైపీసీలో చేరి, నర్సింగ్ చేయాలని లక్ష్యమని తెలిపింది.
సాయం అందిచాలనుకునే వారు:
కట్టెబోయిన అలేఖ్య
యూనియన్ బ్యాంక్(పెద్దవూర బ్రాంచ్)
A/C NO: 194612120000001
IFSC CODE:UBIN 0819468
Comments
Please login to add a commentAdd a comment