తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఒకేసారి ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్ని..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలను అందరికన్నా త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకే క్లిక్‌తో తేలికగా ఫలితాలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది. www.sakshi education.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వేగంగా ఫలితాలు చెక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.
ఫలితాల కోసం 👇 క్లిక్ చేయండి
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇక తెలంగాణలో ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసినట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే.. ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా ఉందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
- ఫస్ట్ ఇయర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత
- 2, 87, 261మంది పాసయ్యారు
- ఫస్ట్ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా టాప్, మేడ్చల్ జిల్లా సెకండ్
- సెకండ్ ఇయర్‌లో 64.61 శాతం
- సెకండ్ ఇయర్‌లో 3,22,432 మంది పాస్
- సెకండ్ ఇయర్‌లో ములుగు జిల్లా టాప్
- ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలు
- రేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్.. దరఖాస్తు చేస్కోవాలి
- మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment