second year results
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలను అందరికన్నా త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకే క్లిక్‌తో తేలికగా ఫలితాలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది. www.sakshi education.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వేగంగా ఫలితాలు చెక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం 👇 క్లిక్ చేయండిఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇక తెలంగాణలో ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసినట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే.. ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా ఉందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఫస్ట్ ఇయర్లో 60.01 శాతం ఉత్తీర్ణత2, 87, 261మంది పాసయ్యారుఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి జిల్లా టాప్, మేడ్చల్ జిల్లా సెకండ్సెకండ్ ఇయర్లో 64.61 శాతంసెకండ్ ఇయర్లో 3,22,432 మంది పాస్సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా టాప్ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలురేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్.. దరఖాస్తు చేస్కోవాలిమే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు -
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
-
TS Inter Results 2021: ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,76,719 మంది ‘ఏ’ గ్రేడ్... 1,04,888 మంది ‘బీ’ గ్రేడ్ సాధించారు. ఇక 61,887 మంది ‘సీ’ గ్రేడ్... 1,08,093 మంది ‘డీ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయించారు. ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్‌కు వందశాతం మార్కులు ఇచ్చారు. కాగా మంగళవారం వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మహమ్మారి కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేసి, సెకండియర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులు కేటాయించే విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. చదవండి: ఇంటర్ సెకండియర్ ఫలితాల వెల్లడి: మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలివీ..! -
రెండు మూడు రోజుల్లో సెకండ్ ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫలితాలు రాబోతున్నాయి. ఈనెల 25 లేదా 26 తేదీల్లో విడుదల చేసేందుకు ఇంటర్మీడియెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. కరోనా కారణంగా ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులను ప్రమోట్ చేసి, సెకండియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులు కేటాయించే విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా బుధవారం ఉత్తర్వులు (మెమో నంబరు 1583/ఎంసీ/2021) జారీ చేశారు. ఫలితాల వెల్లడికి అనుసరించాల్సిన విధి విధానాలను అందులో పొందుపరిచారు. ఈ ఫలితాల కోసం 4,73,967 మంది సెకండియర్ విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. వారిలో ఫస్టియర్ ఫెయిలైన 1,99,019 మంది ఉన్నారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in వెబ్సైట్లో చూడొచ్చని బోర్డు తెలిపింది. మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలివీ.. 2020–21లో విద్యార్థులకు ప్రథమ సంవత్సరం (జనరల్, వొకేషనల్, బ్రిడ్జి కోర్సు)లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకు సెకండియర్ (2021–22)లో మార్కులను కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ప్రథమ సంవత్సరంలో వచ్చిన మార్కులనే సెకండియర్‌లోనూ ఇస్తారు. సెకండియర్ ఫీజు చెల్లించిన విద్యార్థులు (రెగ్యు లర్, ప్రైవేటు) ఫస్టియర్‌లో ఫెయిలై ఉంటే 35% కనీస పాస్ మార్కులను కేటాయిస్తారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ప్రాక్టికల్స్ నిర్వహించలేదు కాబట్టి అందరికీ ప్రాక్టికల్స్‌లో 100 శాతం మార్కులను ఇస్తారు ప్రైవేటు విద్యార్థులు ఏయే సబ్జెక్టుల్లో ఫెయిలై ఉంటారో ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస పాస్ మార్కులను ఇస్తారు. హాజరు మినహాయింపు కేటగిరీలో, అదనపు సబ్జెక్టుల్లో పరీక్షలకు హాజరు కావాలనుకున్న మ్యాథమెటిక్స్ జనరల్ బ్రిడ్జి కోర్సు, వొకేషనల్ బ్రిడ్జి కోర్సు, హ్యుమానిటీస్ కోర్సుల విద్యార్థులు ఫస్టియర్‌లో ఫెయిలై ఉంటే ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస మార్కులను ఇస్తారు. వారికి సెకండియర్‌లోనూ ఆయా సబ్జెక్టుల్లో అవే మార్కులను కేటాయిస్తారు. ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొందని సెకండియర్ విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో 35 శాతం కనీస మార్కులను ఇస్తారు. ఈ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు తరువాత పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. కరోనా అదుపులోకి వచ్చి, సాధారణ పరిస్థితులు నెలకొన్నాక పరీక్షలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఆ పరీక్షలకు హాజరై మార్కులను పెంచుకోవచ్చు. -
23న ఇంటర్ ఫస్టియర్, 26న సెకండియర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్ష ఫలితాలను ఈనెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియెట్‌బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. ముందుగా ఈనెల 23న ఫస్టియర్ ఫలితాలను విడుదల చేస్తామని, ఆ తరువాత రెండు, లేదా మూడు రోజుల్లో సెకండియర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని బోర్డు కార్యదర్శి ఎం.వి.సత్యనారాయణ సాక్షి’తో పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి మూడో తేదీ నుంచి ప్రారంభమై మార్చి 21తో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మూల్యాంకనం అనంతరం విద్యార్థుల కేటగిరిల వారీగా మార్కులను కంప్యూటరీకరించడం, మార్కుల మెమొరాండమ్ల రూపకల్పన తదితర ప్రక్రియలను పూర్తి చేయించి మొదటి సంవత్సరం ఫలితాలను ఈనెల 23న విడుదల చేస్తారు. తరువాత రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేయనున్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని జూనియర్ కాలేజీలకు మార్చి 29 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రకటించింది. అయితే ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా ప్రవేశాలు చేపట్టడంతో పాటు తరగతులను సైతం నిర్వహిస్తున్నాయి. ఇలా సెలవుల్లో తరగతులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని బోర్డు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి సత్యనారాయణ హెచ్చరించారు. -
మళ్లీ 14వ స్థానమే!
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు షరా మామూలు అనిపించాయి. 53శాతం ఉత్తీర్ణతతో జిల్లా 14వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం కూడా 52శాతంతో 14వ స్థానాన్నే దక్కించుకుంది. ఈ ఏడాది మొత్తం జిల్లాలో 36,208మంది విద్యార్థులు హాజరుకాగా 19363మంది (53శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 17,427 హాజరుకాగా 10283 మంది (59శాతం) ఉత్తీర్ణత సాధించగా, బాలురు 18781మంది హాజరుకాగా 9080 మంది (48 శాతం) ఉత్తీర్ణత సాధించారు. కాగా ఒకేషనల్ విభాగంలో 4541 మంది పరీక్షలు రాయగా 2807 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలు 2190కి గాను 1489 మంది (68 శాతం), బాలురు 2351కి గాను 1318 (56 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కాలేజీల్లో 70 శాతం ఉత్తీర్ణత... జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఫలితాల శాతం ఈ సంవత్సరం కూడా మెరుగ్గా ఉంది. మొత్తం 29 కాలేజీల్లో 4765మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగాా 3330 మంది (69.88 శాతం) ఉత్తీర్ణత సాధించారు. నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు 98.44 శాతం ఉత్తీర్ణతతో జిల్లా ప్రథమస్థానంలో నిలిచారు. గత సంవత్సరం జిల్లాలో మొదటిస్థానం పొందిన యాదగిరిగుట్ట ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈసారి 93.61 శాతం ఫలితాలతో 2వ స్థానానికి పరిమితమయ్యారు. మోత్కూరు 92.86శాతం, నడిగూడెం 92.36 శాతం, నెమ్మికల్ 92.26 శాతం, నారాయణపూర్ విద్యార్థులు 91.95 శాతం ఫలితాలు సాధించారు. 26.24 శాతం ఉత్తీర్ణతతో సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు చివరి స్థానంలో నిలిచారు. ఇక్కడ 202 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా కేవలం 53 మంది ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం కూడా ఈ కాలేజీ 23.74 శాతం ఫలితాలతో అట్టడుగు స్థానంలో నిలిచింది. జిల్లా టాపర్లు... ఎంపీసీ విభాగంలో నల్లగొండలోని ప్రగతి జూనియర్ కాలేజీ విద్యార్థిని ఎస్.వైష్టవి వెయ్యి మార్కులకు 987 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం సాధించింది. బైపీసీ విభాగంలో స్థానిక లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ విద్యార్థిని బోడ శ్రీతేజ 987 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం దక్కించుకుంది. అదే కాలేజీకి చెందిన ఎంఈసీ విద్యార్థిని విగ్రహాల శ్రావణి 969 మార్కులతో జిల్లా ప్రథమ స్థానం పొందింది. హాలియాలోని సృజనా కళాశాల విద్యార్థి కుర్ర నాగార్జున సీఈసీ విభాగంలో 935 మార్కులు సాధించాడు. ఒకేషనల్‌లో.. ఒకేషనల్‌లో ఎంపీహెచ్‌డబ్ల్యూ విభాగంలో నల్లగొండలోని లిటిల్‌ఫ్లవర్ జూనియర్ కళాశాల విద్యార్థిని పరంగి మౌనిక 964 మార్కులతో జిల్లా ప్రథమస్థానం సాధించింది. దేవరకొండ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు చెందిన ఎన్.భాగ్యకు ఎంఎల్‌టీలో 933 మార్కులు వచ్చాయి. డెయిరీ గ్రూపులో ఎం.నీలిమ 924 మార్కులు, ఎలక్ట్రికల్ గ్రూపులో కె.బాల్సింగ్ 901 మార్కులు సాధించారు. కార్డియాలజిస్టునవుతా : శ్రీతేజ ఇంటర్లో ప్రథమ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ఎంసెట్‌లో కూడా మంచి ర్యాంకు సాధించి కార్డియాలజిస్టునవుతా. పేదలకు సేవ చేస్తా. డాక్టర్‌గా సేవలందించాలనే ఉద్దేశంతోనే బైపీసీ గ్రూపును ఎంపిక చేసుకున్నా. ఐఐటీ సాధిస్తా : ఎస్.వైష్ణవి నాన్న లారీడ్రైవర్, అమ్మ ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తూ నన్ను కష్టపడి చదివించారు. ఎంపీసీలో టాపర్‌గా నిలవడం సంతోషం కలిగించింది. ఐఐటీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మంచి ఇంజినీర్‌గా సేవలందిస్తాను. సీఏ చేస్తా : శ్రావణి ఎంఈసీలో జిల్లా ప్రథమ స్థానం దక్కడం ఆనందం కలిగిస్తోంది. భవిష్యత్‌లో సీఏ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అధ్యాపకులు అందించిన ప్రోత్సాహం వల్లే జిల్లా ప్రథమ, రాష్ట్రంలో 3వ ర్యాంకు సాధించగలిగాను. -
అమ్మాయిలు అదరగొట్టారు!
ఉత్తీర్ణతలోనూ, అత్యధిక మార్కుల్లోనూ వారే టాప్ బాలికలు 69.52 శాతం, బాలురు 61.87 శాతం పాస్ మొత్తం 65.57 శాతం ఉత్తీర్ణత నమోదు గతేడాది కంటే స్వల్పంగా పెరుగుదల మొదటి స్థానంలో కృష్ణా.. చివరలో మెదక్, ఆదిలాబాద్ ఫలితాలు విడుదల చేసిన గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అమ్మాయిలు అదరగొట్టారు. ఉత్తీర్ణతపరంగానే కాకుండా అన్ని గ్రూపుల్లోనూ అత్యధిక మార్కులు సాధించి సత్తా చాటారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో శనివారం ఈ ఫలితాలను గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ మహ్మద్ విడుదల చేశారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి మొత్తం 9,54,156 మంది విద్యార్థులు హాజరుకాగా.. 5,69,571 మంది (59.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 65.57 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికలు 69.52 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 61.87 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోల్చితే ఈసారి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం స్వల్పంగా పెరిగింది. 82 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలువగా, 49 శాతం ఉత్తీర్ణతతో మెదక్, ఆదిలాబాద్ జిల్లాలు చివరి స్థానంలో ఉన్నాయి. ఎంపీసీలో వేయి మార్కులకుగాను 994 నుంచి 990 మార్కులు సాధించినవారు 11 మంది ఉండగా, వారిలో ఎనిమిది మంది అమ్మాయిలే కావడం విశేషం. ఇక బైపీసీలో అత్యధిక మార్కులు 989 సాధించినవారు ఎనిమిది మంది ఉండగా, అందులో ఏడుగురు బాలికలే. ఎంసీఈ, సీఈసీ, హెచ్‌ఈసీల్లో కూడా వారే ముందంజలో ఉన్నారు. 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ... ఈనెల 25 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు సెకండరీ విద్య ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి రామశంకర్ నాయక్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. పర్యావరణ విద్య పరీక్ష మే 19న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మే 20 నుంచి 24 వరకు ఉంటాయని చెప్పారు. ఇందుకోసం విద్యార్థులు ఈనెల 9లోగా పరీక్ష ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలన్నారు. అలాగే ప్రస్తుత పరీక్ష ఫలితాలకు సంబంధించిన మార్కుల మెమోలను ఈనెల 7లోగా ఆర్ఐఓ కార్యాలయాల నుంచి తీసుకోవాలని ప్రిన్సిపాళ్లకు సూచించారు. వాటిలో ఏమైనా తప్పులు, పొరపాట్లు ఉంటే, జూన్ 1వ తేదీలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 9లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలను http://bieap.gov.in వెబ్సైట్లో పొందవచ్చని వివరించారు.