Inter first year results
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాలను అందరికన్నా త్వరగా అందించేందుకు ‘సాక్షి’ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒకే క్లిక్‌తో తేలికగా ఫలితాలు అందించే సాఫ్ట్‌వేర్‌ను అందిపుచ్చుకుంది. www.sakshi education.com వెబ్‌సైట్‌కు లాగిన్ అయి వేగంగా ఫలితాలు చెక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.ఫలితాల కోసం 👇 క్లిక్ చేయండిఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇక తెలంగాణలో ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసినట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. అలాగే.. ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయిగా ఉందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఫస్ట్ ఇయర్లో 60.01 శాతం ఉత్తీర్ణత2, 87, 261మంది పాసయ్యారుఫస్ట్ ఇయర్లో రంగారెడ్డి జిల్లా టాప్, మేడ్చల్ జిల్లా సెకండ్సెకండ్ ఇయర్లో 64.61 శాతంసెకండ్ ఇయర్లో 3,22,432 మంది పాస్సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా టాప్ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలురేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్.. దరఖాస్తు చేస్కోవాలిమే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు -
AP Inter 1st, 2nd Year Results 2023: ఒకేసారి ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు మునుపెన్నడూ లేనివిధంగా ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ(బుధవారం) విజయవాడలో సాయంత్రం ఐదు గంటలకు ఇంటర్ ఫలితాల్ని విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే.. ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 4,84,197 మంది విద్యార్ధులు, సెకండియర్ కి హాజరైన 5,19,793 మంది విద్యార్దులు హాజరయ్యారు. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తోంది ఇంటర్ బోర్డు. నేటి సాయంత్రం ఫలితాలు విద్యార్ధులకి అందుబాటులో రానున్నాయి. ఫలితాల కోసం సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ చూడొచ్చు. -
రెండు లక్షల మంది భవితకు పరీక్ష, స్పందించిన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు కొత్త వివాదాలు రేపుతున్నాయి. 2 లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్ ఏంటనే ప్రశ్న తెరపైకొచ్చింది. పట్టణాల్లో ఫలితాలు మెరుగ్గా, గ్రామాల్లో తక్కువగా రావడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫెయిలైన విద్యార్థులు ఇప్పుడు ఫస్ట్, సెకండియర్ పరీక్షలు ఎలా రాస్తారని, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సమయమెక్కడ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఫెయిలైన ప్రభావం రెండో ఏడాదిపైనా ఉంటుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలపై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఇంటర్ బోర్డు తీరును దుయ్యబడుతూ శుక్రవారం బోర్డు కార్యాలయం వద్ద సంఘాల నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వ అధ్యాపకుల నుంచీ బోర్డు తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంటర్ ఫస్టియర్‌లో 2,35,230 మంది ఫెయిలయ్యారు. వీరిలో రెండుకుపైగా సబ్జెక్టులు ఫెయిలైన వాళ్లు 63 శాతం మంది ఉన్నారు. ఆన్లైన్ బోధనకు అవకాశం లేక వీళ్లకు ప్రతికూల ఫలితాలు వచ్చినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. ‘పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు సంబంధించిన చాప్టర్లే వాళ్లు వినే అవకాశం చిక్కలేదు. నెట్ సిగ్నల్స్ అందడం లేదని విద్యార్థుల నుంచీ ఫిర్యాదులొచ్చాయి’ అని మహబూబ్‌నగర్‌కు చెందిన అధ్యాపకుడు నవీన్ తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబ్‌బాద్, భూపాలపల్లి, మెదక్, యాదాద్రి, సూర్యాపేట, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల నుంచి ఈ ఫిర్యాదులు వచ్చాయి. గ్రేస్ మార్కులేస్తే?: ఆన్లైన్ సౌకర్యం లేక గ్రామీణ విద్యార్థులు చాలా చాప్టర్లు వినలేదని వరంగల్‌కు చెందిన అధ్యాపకుడు సతీశ్‌వర్మ తెలిపారు. ఇప్పుడీ చాప్టర్స్ మొదటి నుంచీ చదివితేనే మార్చిలోనైనా పరీక్షలు రాయగలరన్నారు. కానీ విద్యార్థులు ఇప్పటికే సెకండియర్ ప్రిపరేషన్లో ఉన్నారని మరి సమయం ఎలా ఉంటుందని అన్నారు. ‘గ్రేస్ మార్కులిస్తే కనీసం 30 శాతం మంది బయటపడే వీలుంది’ అని హైదరాబాద్‌కు చెందిన లెక్చరర్ నీలేశ్ చెప్పారు. అంతా సక్రమంగానే చేశాం, విద్యార్థులు ఆందోళనకు గురవ్వొద్దు: ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఫస్టియర్ పరీక్ష ఫలితాలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ శుక్రవారం రాత్రి స్పందించింది. విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ విధించేవరకూ కొంతకాలంపాటు ప్రత్యక్ష బోధన సాగిందని గుర్తు చేశారు. ఆ తరువాత విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను 70 శాతానికి కుదించామన్నారు. అదనంగా బేసిక్ మెటీరియల్‌ను కూడా బోర్డ్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఎక్కువ ఐచ్ఛికాలతో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలను తేలిక చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ ఫీజును తగ్గిస్తున్నాం..: ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రీవెరిఫికేషన్ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురవ్వొద్దని, బాగా ప్రిపేరై వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. -
ఇంటర్లో ఫస్టియర్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి ప్రతిభ
వరంగల్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ ఫలితాల్లో వరంగల్ విద్యార్థి గుండ సాయి శ్రావణి అద్భుత ప్రతిభ కనబరిచింది. గురువారం వెల్లడైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఆమె మెరుగైన మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో మొత్తం 470 మార్కులకు గాను 466 మార్కులు తెచ్చుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇది రెండో అత్యుత్తమ మార్కులుగా పేర్కొంటున్నారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో లాంగ్వెజెస్‌ను మినహాయిస్తే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఫుల్ మార్కులు సాధించారు. ఇంగ్లీష్ వందకి 97, సంస్కృతంలో వందకి 99 మార్కులు తెచ్చుకున్నారు. సాయి శ్రావణి మార్కుల పట్ల ఆమె తల్లిదండ్రులు గుండ అమర్నాథ్, నిర్మలాదేవిలు హర్షం వ్యక్తం చేశారు. -
తెలంగాణ: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
Telangana Inter First Year Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 56 శాతం ఉండగా.. బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాల కోసం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చు. చదవండి: (అవినీతి కేసులో డీఎస్పీ జగన్ అరెస్టు ) ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి -
విజయలక్ష్మి..
(కాకినాడ) : పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తే ఏదైనా సాధ్యమని నిరూపిస్తోంది కాకినాడ దిగుమర్తివారి వీధికి చెందిన కాదా విజయలక్ష్మి. తాజాగా విడుదలైన ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాదు వివిధ పోటీ పరీక్షలు, జాతీయ, అంతర్జాతీయ గణిత ఒలంపియాడ్లో ప్రథమ ర్యాంకులు సాధించింది. రామానుజన్ గణిత పోటీల్లో జిల్లా ప్రథమస్థానం కైవసం చేసుకుంది. పదో తరగతి ఫలితాల్లోనూ టాపే.. 2015 పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 పాయింట్లు సాధించగా, అదేసంవత్సరం ఏపీఆర్జేసీ ప్రవేశపరీక్షల్లో రాష్ట్రస్థాయి 13వ ర్యాంక్ సాధించింది. అలాగే పాలిసెట్ 2016 ప్రవేశపరీక్షల్లో 120 మార్కులకు 118 సాధించి రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఎటువంటి శిక్షణ కేంద్రాలకు వెళ్లకుండా పాఠశాలస్థాయిలో ఉన్న సిలబస్‌ను ప్రతిరోజూ సమీక్షించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావడం వల్లే ఈ ర్యాంకులు సాధించానని విజయలక్ష్మి చెబుతోంది. ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపి ప్రముఖ ఐఐటీ విద్యాసంస్థలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించి సైన్స్ ఇంజనీర్‌గా స్థిరపడాలనేది తన లక్ష్యమంది. తనకు త ల్లిదండ్రులు కుమార్, సుబ్బలక్ష్మిల ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె చెబుతోంది. -
తెలుగులో తప్పారు!
- భాషపై తగ్గుతున్న పట్టు - రంగారెడ్డిలో 37.26, హైదరాబాద్‌లో 31 శాతం ఫెయిల్ సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జంట జిల్లాలు అగ్రస్థానంలోనిలిచాయి. గతంతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇదంతా నాణేనికి ఒక వైపు. మరోవైపు మాతృభాష తెలుగు విషయంలో మన విద్యార్థుల తీరు విస్తుగొల్పుతోంది. తెలుగులో 90 శాతం విద్యార్థులు కూడా నెగ్గలేకపోయారు. రంగారెడ్డి జిల్లాలో 37.26 శాతం, హైదరాబాద్ జిల్లాలో దాదాపు 31 శాతం విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఫెయిలవడం గమనార్హం. ప్రతి ముగ్గురిలో ఒకరు తెలుగులో తప్పారు. తెలుగులో నూటికి 35 మార్కులు సంపాదించడంలో జంట నగరాల పిల్లలు తడబడుతున్నారు. ప్రధాన సబ్జెక్టుల్లో నెగ్గలేకపోయారంటే కొంతవరకు సరిపెట్టుకోవచ్చు. కానీ తేనేలొలుకు తెలుగులోనే చతికిల పడుతుండడం ఆందోళనకరం. భాషను తేలికగా తీసుకోవడం... పరీక్షల సమయంలోనే పుస్తకం చేతపట్టడం వంటివి విద్యార్థులు తప్పడానికి కారణమని నిపుణుల మాట. మరోపక్క తరగతులకు తరచూ వెళ్లకపోవడమూ ఉత్తీర్ణతపై ప్రభా వం చూపించి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనికితోడు కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలల్లోసబ్జెక్టులకు కేటాయించే సమయాన్ని భాషకు కేటాయించడం లేదని తెలుస్తోంది. ఫలితంగా తెలుగులో గణనీయం గా ఉత్తీర్ణత శాతం తగ్గిందని నిపుణుల అభిప్రాయం. రెండు జిల్లాల్లో కామర్స్‌లో అత్యధికంగా విద్యార్థులు తప్పారు. ఫెయిలైన వారి శాతం 40కిపైగా నమోదైంది. అత్యల్పంగా సంస్కృతంలో తప్పారు. తెలుగులో ఆశ్చర్యపరిచేలా.. రంగారెడ్డి జిల్లాలో 21,366 మంది తెలుగు పరీక్ష రాయగా.. అందులో 7,962 (37.26 శాతం) మంది తప్పారు. 1.04 లక్షల మంది ఇంగ్లిష్ పరీక్ష రాయగా.. దాదాపు 11 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. హైదరాబాద్ జిల్లాలో తెలుగు పరీక్ష 6,150 మంది రాయగా.. అందులో 1,893 (30.78 శాతం) మంది విద్యార్థులు తప్పారు. తెలుగులో 5 శాతం కంటే ఎక్కువగా రెగ్యులర్ విద్యార్థులు ఫెయిల్కారని నిపుణుల అంచనా. దీనికి భిన్నంగా 30 శాతానికి పైగా తప్పడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో 75 శాతానికిపైగా విద్యార్థులు తెలుగు బదులు సంస్కృతం, హిందీ పరీక్షలు రాస్తుండడం గమనార్హం. ఆర్ట్స్ విద్యార్థులే అధికంగా ఫెయిల్... సైన్స్ గ్రూపులతో పోల్చుకుంటే తప్పిన వారిలో ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులే అధిక శాతం ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ అదే పరిస్థితి. హైదరాబాద్‌తో పోల్చితే కామర్స్ మినహా మిగిలిన ఆర్ట్స్ సబ్జెక్టుల్లో రంగారెడ్డి జిల్లాలో తప్పినవారి శాతం కొంచెం అధికంగా ఉంది. సైన్స్‌లో హైద రాబాద్ జిల్లాలో ఎక్కువ మంది పాస్ కాలేకపోయారు. గణితంలోనూ వెనకబడ్డారు. హైదరాబాద్‌లో అత్యధికంగా కామర్స్‌లో 41.79 శాతం విద్యార్థులు ఫెయిలయ్యారు. ఆ తర్వాత ఎకనామిక్స్‌లో 38.43, సివిక్స్‌లో 37.38, హిస్టరీలో 35.42 శాతం తప్పారు. రంగారెడ్డిలో కామర్స్‌లో 43.74, హిస్టరీలో 42.69, సివిక్స్‌లో 40.62, ఎకనామిక్స్‌లో 40.16 శాతం ఫెయిలయ్యారు. -
ఇంటర్ ఫస్టియర్‌లో పెరిగిన ఉత్తీర్ణత
జనరల్‌లో జిల్లాకు 10వ స్థానం, ఒకేషనల్ ఉత్తీర్ణతలో మొదటిస్థానం జనరల్ 57%, ఒకేషనల్70% ఉత్తీర్ణత అత్యధిక మార్కులు వచ్చిన వారిలో టాప్ - 20లో రోషిణి విజయనగరం అర్బన్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సర వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లా మెరుగుపడింది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకు 10వ స్థానం లభిం చింది. ఉత్తీర్ణత విషయంలో 5 శాతం పెరిగిం ది. గత ఏడాది ఉత్తీర్ణత 52 శాతం కాగా తాజాగా 57 శాతానికి పెరిగింది. ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం సాయంత్రం 5గంటలకు విడుదల చేశారు. జిల్లాలో పరీక్షలు రాసిన 20,936 మంది విద్యార్థుల్లో 57 శాతంతో 12,019 మంది ఉత్తీర్ణలయ్యారు. ఫలితాల్లో ఈ సారి కూడా బాలికలే తమ హవాను చాటుకున్నారు. పరీక్షకు హాజరైన 11,100 మంది బాలికల్లో 61 శాతంతో 6,795 మంది ఉత్తీర్ణులయ్యారు. అదే బాలురులో 9,836 మందిలో 53 శాతంతో 5,224 మంది ఉత్తీర్ణులయ్యారు.వొకేషనల్ ఫలితాల్లో మొదటి స్థానం.. వృత్తికోర్సుల ఉత్తీర్ణతలో రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ఈ పరీక్షలకు 1914 మంది హాజరుకాగా 70 శాతంతో 1,346 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 62 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో జిల్లా నిలిచింది. ప్రభుత్వ కళాశాలలకు చెందిన 3,331 మంది పరీక్ష రాయగా 2,063 మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు వీరే ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర వార్షిక పరీక్షల్లో తాజాగా అందిన సమాచారం మేరకు గ్రూప్‌ల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఎంపీసీలో అత్యధికంగా 466/470 మార్కులతో వి.రోషిణి, రెండవ అత్యధికం 465/470 మార్కులు ఊహాప్రియకి, 464/470 మార్కులు బి.చైతన్యలక్ష్మి, జీవీఎస్జీహేమంత్, సాయిఅనుదీప్, సుధాసారికలకు లభించాయి. అదే విధంగా బైపీసీ గ్రూప్‌లో 433/440 మార్కులతో వి.దినేష్, 432/440 మార్కులతో టి.సాయిగీతిక, బోని రాధిక, పూజాబజాజ్లు అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఉన్నారు.వీరంతా స్థానిక చైతన్య, నారాయణ కళాశాలలకు చెందినవారు. కామ ర్స్‌లో స్థానిక ఆర్ఎస్ అకాడమీ విద్యార్థి 480/500 మార్కులతో కె.నాగలక్ష్మి అధికమార్కులు సాధించినవారిలో ఉంది. మెరిసిన రోషిణి: జిల్లాలో ఎంపీసీలో అత్యధిక మా ర్కులు సాధించిన రోషిణి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మార్కులు సాధించిన వారిలో టాప్-20లో నిలిచింది. -
ఇంటర్ ఓకే
నిజామాబాద్ అర్బన్ : ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో జిల్లాకు మెరుగైన ఫలితాలే వచ్చాయి. గత ఏడాది కంటే ఉత్తీర్ణత నాలుగు శాతం పెరిగింది. కానీ, స్థానం మాత్రం తగ్గింది. పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 27,499 మంది విద్యార్థులు పరీక్షలురా యగా, 13,399 మంది ఉత్తీర్ణులయ్యారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 26,752 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,125 మంది విద్యార్థులు ఉత్తీర్ణత (45 శాతం) సాధించారు. ఈసారి బాలికలే పైచేయి సాధించారు. 14,068 మంది బా లికలు పరీక్షలు రాయగా 7,760 మంది ఉత్తీర్ణుల య్యారు. 55 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 13,431 మంది బాలురు పరీక్షలు రాయగా 5,639 మంది ఉత్తీర్ణులయ్యారు. 42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒ కేషనల్లో 1,753 మంది పరీక్ష రాయగా 617 మంది ఉత్తీర్ణులయ్యారు. 33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 520 మంది బాలికలు పరీక్షలు రాయగా 236 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 1,233 మంది పరీక్షలు రాయగా 381 మంది (31 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలలలో కూడా ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలలలో 5,159 మంది విద్యార్థు లు పరీక్షలు రాయగా 2,743 మంది (53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు ఈ ఏడాది ఎంపీసీ విభాగంలో మూడు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన ప్రీతిశర్మ 465/470, ఎస్ఆర్ కాలేజీకి చెందిన జి.జి.మానసి 465/470, బోధన్‌లోని విజయసాయి కళాశాలకు చెందిన సా యిదీప్తి 465/470 మార్కులు సాధించారు. ఇదే వి భాగంలో నగరంలోని ఎస్ఆర్.కళాశాలకు చెందిన గ్రీష్మ 464/470 , లిఖిత 463/470, ఆక్కినపల్లి శివలహరి 463/470, కేతవత్ కౌసల్య 463/470 మార్కు లు సాధించారు. బీపీసీలో బంటు అంజలి 432/440 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకులు గోవర్ధన్‌రెడ్డి విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. బోధన్ విజయసాయి కళాశాలలో బోధన్‌లోని విజయసాయి జూనియర్ కళాశాల వి ద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ఎంపీసీ లో 470 మార్కులకుగాను 465 మార్కులు సాధిం చి సాయిదీప్తి డివిజన్లో టాపర్‌గా నిలిచింది. బైపీసీలో ఎమ్. రవలి 440 మార్కులకుగాను 427 మా ర్కులు సాధించి ప్రతిభను చాటింది. ఎంఈసీలో జి. ప్రవళిక 500 మార్కు లకు గాను 481 మార్కులు సాధించింది. సీఈసీలో టి. రమేష్ 500 మార్కులకు గాను 431 మార్కులు సాధించాడు. ఎంపీసీలో ఫజీలత్ జోహ్రా 461,మెహారీన్ ఉన్నీ సా 458, పూజా కృష్ణణ్ 457, దిలీప్ 456, నుస్రత్ జబీన్ 456 మార్కులను సాధించారు. బైపీసీలో అనీల్ 424, సు మంత్ రెడ్డి 424 మార్కులు సాధించారు. ఎంఈసీలో సుష్మ 474, సంగీత 474, సీఈసీలో రాజు 421 మార్కులను సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్ధులకు విజయసాయి విద్యాసంస్థల డెరైక్టర్ ఆర్. కామశాస్త్రి అభినందించారు. ‘కాకతీయ’కు ర్యాంకుల పంట జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలకు ర్యాంకుల పంట పండింది. ఎంపీసీలో పది లోపు 19 ర్యాంకులు, బీపీసీలో ఐదు ర్యాంకులు వచ్చాయి. మొత్తం పది లోపు 25 ర్యాంకులు వ చ్చాయి. ఎంపీసీలో ప్రీతిశర్మ 465/470, రాజేశ్ 464/470), సి.హెచ్.మనీష్ 464/470 మార్కు లు సాధించారు. బీపీసీలో నీడామహ్రిన్ 434/ 440 రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు, అహిష మహవీన్ 428/440 రాష్ట్రస్థాయి 9వ ర్యాంకు, సంహిత 424/440 మార్కులు సాధించారు. ఎంఈసీ విభాగంలో ఎ.సంధ్యశ్రీ 487/ 500 రాష్ట్ర స్థాయి 4 వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యజమాన్యం అభినందించింది. ర్యాంకు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. కాకతీయ విద్యాసంస్థల డెరైక్టర్ సి.హెచ్.విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధిస్తామని అన్నారు. విద్యార్థులకు ప్రణాళికాబద్ధం గా విద్యను అందించడంతో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిం చడమే తమ లక్ష్యమని అన్నారు. ఫలితాలు సా ధించిన విద్యార్థులకు, ఇందుకు కృషి చేసిన అ ధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. -
సామి రంగా..
► ఇంటర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాకు అగ్రస్థానం ► 71 శాతం ఉత్తీర్ణత ► 59 శాతంతో హైదరాబాద్ రెండో స్థానం ► రెండు జిల్లాల్లోనూ బాలికలదే హవా ► ఒకేషనల్ కోర్సుల్లోనూ వారిదే ఆధిపత్యం సాక్షి, సిటీబ్యూరో : ఇంటర్ మొదటి సంవత్సర పరీక్ష ఫలితాల్లో జంట జిల్లాల విద్యార్థులు దుమ్మురేపారు. ఉత్తమ ప్రతిభ కనబరచి అందరి దృష్టినీ ఆకర్షించారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన ఈ పరీక్ష ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచింది. వృత్తి విద్యా కోర్సుల్లోనూ అదే స్థానాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ జిల్లా 59 శాతం ఉత్తీర్ణత సాధించి రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడేళ్లలో హైదరాబాద్ జిల్లా మొదటిసారిగా అధిక ఉత్తీర్ణత సాధించింది. ఎప్పటిలాగే తాజా ఫలితాల్లోనూ బాలికల హవా కొనసాగింది. జంట జిల్లాల్లోనూ బాలురపై బాలికలు ఆధిపత్యం ప్రదర్శించారు. రికార్డు స్థాయిలో... రంగారెడ్డి జిల్లా గతంలో మాదిరిగానే ఫలితాల్లో తనదైన ముద్ర వేసింది. కాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో రెండు, మూడు స్థానాలకు పరిమితం కాగా.. తాజా ఫలితాల్లో ఏకంగా 70 శాతానికి పైగా ఉత్తీర్ణతతో మొదటి స్థానం పొందింది. జిల్లాలో మొత్తం 1,04,207 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 73,563 మంది పాసయ్యారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 67,413 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 39,513 మంది ఉత్తీర్ణత సాధించారు. సత్తాచాటిన బాలికలు ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలు ప్రతిభ చాటారు. రంగారెడ్డి జిల్లాలో 75 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 47,973 మం ది బాలికలు పరీక్షలకు హాజరు కాగా.. 35,968 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు, బాలికల మధ్య ఉత్తీర్ణత తేడా 8 శాతంగా నమోదైంది. బాలురు 37,595 (67 శాతం) మందే పరీక్షల్లో గట్టెక్కారు. హైదరాబాద్ జిల్లాలో... పరీక్షలకు హాజరైన బాలికల్లో... 69 శాతం ఉత్తీర్ణులవడం విశేషం. బాలుర ఉత్తీర్ణతా శాతం 49. బాలురు, బాలికలకు ఉత్తీర్ణతలో 20 శాతం తేడా. 32,709 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 22,504 మంది ఉత్తీర్ణులయ్యారు. 34,704 మంది బాలురకుగాను.. 17,009 మంది పాసయ్యారు. మహేశ్వరంలో 98.31 శాతం హైదరాబాద్‌తో పోల్చితే రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు మెరుగ్గా రాణించారు. ప్రైవేటు కళాశాలల విద్యార్థులతో పోటీ పడ్డారు. ప్రభుత్వ కళాశాలల విభాగంలో రంగారెడ్డి జిల్లా 46 శాతం ఉత్తీర్ణత సాధించి ఆరో స్థాంలో నిలిచింది. 37 శాతంతో హైదరాబాద్‌ది ఆఖరి స్థానం. రంగారెడ్డి జిల్లాలో 25 సర్కారు కళాశాలలు ఉండగా... 7 కాలేజీలలో 50 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా మహేశ్వరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 98.31 శాతం సాధిం చింది. 90.59 శాతంతో ఆ తర్వాతి స్థానాన్ని నవాబ్‌పేట్ కాలేజీసొంతం చేసుకుంది. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు పూర్తిగా చతికిలపడ్డారు. ఉన్న 19 కాలేజీలలో.. కేవలం రెండు కళాశాలల్లో 50 శాతం విద్యార్థులే పాసై నిరాశపరిచారు. మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో 61.23 శాతమే అత్యుత్తమం. ఉత్తీర్ణత పరంగా చూసుకుంటే గతేడాది కంటే 2.68 శాతంతో మెరుగ్గా ఉన్నా.. ఆశించిన స్థాయిలో విద్యార్థులు పాస్ కాలేకపోయారు. వృత్తి విద్యలోనూ... వృత్తి విద్యా కోర్సుల్లో 2010 నుంచి రంగారెడ్డి జిల్లా కంటే హైదరాబాద్ జిల్లా మెరుగైన ఫలితాలు సాధిస్తూ వచ్చింది. ఈసారి సీన్ మారింది. తాజా ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు దూసుకెళ్లారు. 56 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. గత ఆరేళ్లలో ఇదే అత్యుత్తమం. 2,558 మంది పరీక్షలు రాయగా.. 1,442 మంది విద్యార్థులు నెగ్గారు. ఇందులో 662 మంది బాలికలు పైచేయి సాధించారు. బాలురు 780 మంది పాసయ్యారు. హైదరాబాద్ జిల్లా తీవ్ర నిరాశపరిచింది. గతం కంటే రెండు శాతం ఉత్తీర్ణత తగ్గి... నాలుగో స్థానానికి పరిమితమైంది. 2013లో 50 శాతంగా ఉన్న ఉత్తీర్ణత.. తాజాగా 47 శాతానికి దిగజారింది. 3,422 మంది పరీక్షలు రాయగా.. 1,594 మంది పాసయ్యారు. ఇక్కడా బాలికలదే ఆధిపత్యం. 924 మంది (63 శాతం) బాలికలు ఉత్తీర్ణులు కావడం విశేషం. బాలురు 670 మంది (34 శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. -
జూనియర్ ఇంటర్లో 64 ఉత్తీర్ణత
ఎంపీసీలో 466/470 నెల్లూరు హరనాథపురంలోని నారాయణ కళాశాల విద్యార్థి కొండూరు కార్తికేయన్ ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి జిల్లాలో టాపర్‌గా నిలిచారు. నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో జిల్లా 64 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత నెల్లో ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి ఏడాది ఫలితాలను ఇంటర్‌బోర్డు సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 26,947 మంది మొదటి ఏడాది పరీక్షలు రాశారు. వీరిలో 17,281 మంది ఉత్తీర్ణులయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్ర స్థాయిలో నాల్గోస్థానాన్ని జిల్లా దక్కించుకొంది. గత ఏడాది కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. ఈ ఏడాది 14,384 మంది బాలురు పరీక్ష రాయగా 8,885 మంది ఉత్తీర్ణులై 62 శాతం సాధించారు. 12,563 మంది బాలికలు పరీక్ష రాయగా 8,396 మంది ఉత్తీర్ణత సాధించి 67 శాతం నమోదు చేశారు. సరాసరి 64 శాతం విజయం సాధించినప్పటికీ ఫలితాల్లో బాలికలదే పైచేయి. రాష్ట్రంలో కృష్ణా, రంగారెడ్డి, విశాఖపట్టణం జిల్లాల తర్వాత నెల్లూరులో ఎక్కువ మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి, అధిక మార్కులు సాధిం చాలనుకునే వారికి ప్రభుత్వం వచ్చే 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. మే 6వ తేదీ లోపు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.