సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు మునుపెన్నడూ లేనివిధంగా ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.
ఇవాళ(బుధవారం) విజయవాడలో సాయంత్రం ఐదు గంటలకు ఇంటర్ ఫలితాల్ని విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే.. ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 4,84,197 మంది విద్యార్ధులు, సెకండియర్ కి హాజరైన 5,19,793 మంది విద్యార్దులు హాజరయ్యారు.
కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తోంది ఇంటర్ బోర్డు. నేటి సాయంత్రం ఫలితాలు విద్యార్ధులకి అందుబాటులో రానున్నాయి. ఫలితాల కోసం సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment