Inter second year results
-
AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చింది.సెకండ్ ఇయర్లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండో స్థానం గుంటూరు. మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్లో 10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక, మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను www.sakshi education.comలో చూడొచ్చు. ఫస్ట్ ఇయర్.. కృష్ణా జిల్లా-84 శాతం గుంటూరు- 81 శాతం ఎన్టీఆర్-79 శాతం సెకండ్ ఇయర్.. కృష్ణా-90 శాతం గుంటూరు-87 శాతం ఇక, ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించారు. పరీక్షలకు సంబంధించి వివరాలు ఇలా.. పరీక్షలకు హాజరైన 10,53,435 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,17,570 మంది విద్యార్థులు సెకండియర్ పరీక్షలకు 5.35,865 మంది విద్యార్థులు సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి అడ్డుకట్ట సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ఇంటర్ సెకండియర్‌లోనూ కృష్ణా జిల్లానే టాప్ రెండో స్థానంలో గుంటూరు జిల్లా మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 67 శాతం సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78 శాతం ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి ఒకేషన్ లో 71 శాతం ఉత్తీర్ణత పాసయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అభినందనలు ఫెయిలైనా మళ్లీ చదివి పరీక్షలు రాయండి ఫెయిల్ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి ఫస్టియర్ ఫలితాల్లో మొదటి స్థానం కృష్ణా జిల్లా 84 శాతం రెండో స్థానం గుంటూరు జిల్లా 81 శాతం మూడో స్థానం ఎన్టీఆర్ జిల్లా 79 శాతం ఇంటర్ సెకండయిర్ ఫలితాల్లోమొదటి స్థానం కృష్ణా జిల్లా 90 శాతం రెండో స్థానం గుంటూరు జిల్లా 87 శాతం ఈనెల 18 నుంచి 24 వరకు రీవాల్యూయేషన్‌కు అవకాశం -
AP Inter 1st, 2nd Year Results 2023: ఒకేసారి ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెల్లడికానున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు మునుపెన్నడూ లేనివిధంగా ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ(బుధవారం) విజయవాడలో సాయంత్రం ఐదు గంటలకు ఇంటర్ ఫలితాల్ని విడుదల చేస్తారు. ఇదిలా ఉంటే.. ఏపీలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 4,84,197 మంది విద్యార్ధులు, సెకండియర్ కి హాజరైన 5,19,793 మంది విద్యార్దులు హాజరయ్యారు. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలు ప్రకటిస్తోంది ఇంటర్ బోర్డు. నేటి సాయంత్రం ఫలితాలు విద్యార్ధులకి అందుబాటులో రానున్నాయి. ఫలితాల కోసం సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ చూడొచ్చు. -
సెకండియర్ విద్యార్థులంతా పాస్.. వెయిటేజీ ఇలా
సాక్షి, అమరావతి: ఇంటర్ సెకండియర్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి 5,19,797 మంది సెకండియర్ విద్యార్థులకు వచ్చిన మార్కులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. వీరిలో బాలురు 2,58,310 మంది, బాలికలు 2,61,487 మంది ఉన్నారు. వీరి మార్కుల షార్ట్ మెమోలను ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బోర్డు వెబ్సైట్లో పొందుపర్చనున్నారు. కోవిడ్–19 కారణంగా ఈ విద్యా సంవత్సరంలో పరీక్షలు నిర్వహించనందున ఈ విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించారు. సెకండియర్ విద్యార్థులకు వారి టెన్త్, ఇంటర్ ఫస్టియర్ మార్కుల ఆధారంగా మార్కులను కేటాయించారు. ప్రాక్టికల్, నైతిక విలువలు, పర్యావరణ శాస్త్రం పరీక్షలకు సంబంధించిన మార్కులను య«థాతథంగా ఇచ్చారు. ఫస్టియర్ విద్యార్థులను కనిష్ట పాస్ మార్కులతో ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఆదిమూలపు ఈ వివరాలు వెల్లడించారు. మార్కుల వెయిటేజీ ఇలా.. 2021 ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలను మే 5 నుంచి 23 వరకు నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లుచేసినా కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి వాయిదా వేయాల్సి వచ్చింది. అంతకుముందే.. ప్రాక్టికల్ పరీక్షలు, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ సైన్సు పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం.. సెకండియర్ విద్యార్థులకు మార్కులతో ఫలితాల వెల్లడికి ఫార్ములా నిమిత్తం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. టెన్త్ మార్కులకు 30 శాతం, ఇంటర్ ఫస్టియర్ మార్కులకు 70 శాతం వెయిటేజీ ఇవ్వాలని కమిటీ సూచనలతో సెకండియర్ మార్కులను బోర్డు ప్రకటించింది. అలాగే, టెన్త్‌లో విద్యార్థులు మంచి మార్కులు సాధించిన మూడు సబ్జెక్టుల (బెస్ట్ 3) సరాసరి మార్కులను తీసుకోగా.. ఇంటర్ ఫస్టియర్లోని అన్ని సబ్జెక్టుల మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు. ఇక ప్రాక్టికల్స్, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ సైన్సు పరీక్షల మార్కులను య«థాతథంగా విద్యార్థుల మెమోల్లో పొందుపర్చనున్నట్లు మంత్రి సురేష్ వివరించారు. ప్రైవేటు విద్యార్థులకు పాస్ మార్కులు ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో గతంలో ఫెయిలై ఈసారి ప్రైవేటుగా పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించిన వారికి.. ఫస్టియర్‌లో ఫెయిలైన సబ్జెక్టుల కోసం ఫీజు చెల్లించిన వారికి ఆయా సబ్జెక్టులకు కనిష్ట పాస్ మార్కులను కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అలాగే, ఫస్టియర్ మార్కులలో బెటర్మెంట్ కోసం పరీక్ష ఫీజు చెల్లించిన వారికి గతంలో వచ్చిన మార్కులనే యథాతథంగా కేటాయిస్తున్నామన్నారు. ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి, ఫెయిలైన వారికి కూడా ఆయా సబ్జెక్టులకు కనిష్ట పాస్ మార్కులు కేటాయిస్తున్నట్లు ఆదిమూలపు వివరించారు. హైపవర్ కమిటీ సూచించిన విధానంలో కేటాయించిన మార్కులపై ఎవరికైనా అసంతృప్తి ఉంటే వారికి సెకండియర్ పరీక్షలను రాసేందుకు ఓ అవకాశమిస్తామని మంత్రి చెప్పారు. సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాక ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించి సందేహాలు, ఇతర సమస్యలుంటే వాటిని నివృత్తి చేసి పరిష్కరించేందుకు వివాద పరిష్కార కమిటీని ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటుచేస్తోంది. అలాంటి వారు బోర్డు ఏర్పాటుచేసిన ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ వెబ్సైట్లో తమ సమస్యలను తెలియజేయవచ్చు. 26న వెబ్సైట్లో షార్ట్ మార్కుల మెమోలు ఇంటర్ సెకండియర్ మార్కుల షార్ట్ మెమోలను ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బోర్డు వెబ్సైట్ ‘బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ లో పొందుపర్చనున్నారు. అనంతరం విద్యార్థులు తమ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందేహాలు, సమస్యలుంటే ‘ఓయూఆర్బీఐఈఏపీఎట్దరేట్జీమెయిల్.కామ్’ మెయిల్‌కు లేదా 9391282578 నంబర్లోని వాట్సాప్‌కు మెసేజ్ ఇవ్వవచ్చని బోర్డు వివరించింది. మీడియా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ, పరీక్షల నియంత్రణాధికారి రమేష్‌లు పాల్గొన్నారు. ఆన్లైన్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్, డిగ్రీ కోర్సుల అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. గత ఏడాదే ఇంటర్మీడియెట్‌లో 70 శాతం ప్రవేశాలను ఆన్లైన్లో నిర్వహించామని.. మధ్యలో హైకోర్టు ఆదేశాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఈ ఏడాది పూర్తిగా ఆన్లైన్లోనే ప్రవేశాలు జరపనున్నట్లు ఆయన తెలిపారు. టెన్త్ ఫలితాలను విడుదల చేయకముందే ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్లు నిర్వహించడంపై మంత్రి స్పందిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇంటర్ ఫలితాలు: ‘అసంతృప్తి ఉంటే.. పరీక్షలకు సిద్ధం’
-
ఇంటర్ ఫలితాలు: ‘అసంతృప్తి ఉంటే.. పరీక్షలకు సిద్ధం’
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలపై విద్యార్థులకు అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామని, మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామన్నారు. భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
తెలంగాణ: రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రేపు (సోమవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయిస్తామని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే మార్కులకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కారు విడుదల చేసింది. ప్రాక్టికల్ పరీక్షలకు 100 శాతం మార్కులు, ఫస్టియర్‌లో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు ఈ ఏడాది 35 శాతం మార్కులు కేటాయించి పాస్ చేయనున్నారు. tsbie.cgg.gov.inలో ఫలితాలు చూడవచ్చు. చదవండి: రేవంత్‌కు పోస్ట్: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అక్కడికి వద్దన్నా వెళ్లిన మోత్కుపల్లి.. బీజేపీ సీరియస్! -
వారంతా కంపార్ట్మెంట్లో పాస్..
కొత్తగూడెం, అశ్వాపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8,540 మంది హాజరు కాగా 6,453 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,087 మంది ఫెయిలయ్యారు. సప్లిమెంటరీ రద్దుతో ఆ 2,087 మంది ఉత్తీర్ణులు కానున్నారు. అయితే వారంతా కంపార్ట్మెంట్లో పాస్ కానున్నారు. ఈ నెల 31వ తేదీ లోపు విద్యార్థుల మార్కుల మెమోలు కళాశాలలో అందుబాటులో ఉంచునున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సెకండియర్ పాసైన విద్యార్థుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి చేయనున్నారు. -
జూన్ 15న ఇంటర్ ‘ద్వితీయ’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను జూన్ 15వ తేదీన విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో పూర్తయింది. ప్రస్తుతం స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తరువాత ఫలితాల ప్రాసెస్ చేయాల్సి ఉంది. అయితే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని ఇదివరకే భావించినా అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయినా ద్వితీయ సంవత్సరంతోపాటే ప్రథమ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సాధ్యం కాకపోతే జూన్ 15న ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటించి ఆ తరువాత రెండు మూడు రోజుల్లో ఫస్టియర్ ఫలితాలు విడుదల చేయనుంది. మొత్తానికి జూన్ 20వ తేదీలోగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఈ ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వార్షిక పరీక్షలకు హాజరైన వారిలో 30 శాతం మంది వీటికి హాజరు కానున్నారు. టెన్త్ ఫలితాలు వచ్చాక ప్రథమ సంవత్సర తరగతులను ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించింది. ఇక ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 తరువాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంసెట్, నీట్, జేఈఈ ఆన్లైన్ మాక్ టెస్టులు.. ఎంసెట్, నీట్, జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థుల కోసం మాక్ టెస్టులను అందుబాటులోకి తెచ్చినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ పేపర్లు, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు www.rankersl-earning.comలో పొందవచ్చని తెలిపారు. -
పెరిగిన టాప్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్స ర ఫలితాల్లో ఈసారి టాప్ మార్కులు పెరిగాయి. గతేడాది ఎంపీసీలో టాప్ మార్కులు 993 కాగా.. ఈసారి 994 వచ్చాయి. బైపీసీలో గతేడాది 991 మార్కులు టాప్కాగా.. ఈసారి 992 మార్కులు వచ్చాయి. ఈసారి ఎంపీసీ, బైపీసీ రెండు విభాగాల్లోనూ ఇద్దరు చొప్పున విద్యార్థులు టాప్ మార్కులు సాధించారు. ఇక ఎంఈసీలో గతేడాది 986 అత్యధిక మార్కులు కాగా.. ఈసారి ఒక విద్యార్థికి 987 మార్కులు వచ్చాయి. సీఈసీలో గతేడాది 976 టాప్ మా ర్కులుకాగా.. ఈసారి ముగ్గురు విద్యార్థులు 977 మార్కులు సాధించారు. హెచ్ఈసీలో గతే డాది 950 టాప్ మార్కులుకాగా.. ఈసారి 958 టాప్ మార్కులను ఒక్క విద్యార్థి సాధించారు. ప్రథమ సంవత్సరంలో.. ఇక ప్రథమ సంవత్సరం ఎంపీసీలో గతేడాది 467 టాప్ మార్కులుకాగా.. ఈసారి కూడా 467 మార్కులే టాప్. అయితే గతేడాది టాప్ మార్కులు 12 మందికే రాగా.. ఈసారి 24 మంది విద్యార్థులకు వచ్చాయి. బైపీసీలో గతేడాది 436 టాప్ మార్కులను 11 మంది సాధించగా.. ఈసారి ఏడుగురు 437 టాప్ మార్కులు పొందారు. ఎంఈసీలో గతేడాది ఆరుగురు 493 టాప్ మార్కులు సాధించగా.. ఈసారి ఒక విద్యార్థి 495 టాప్ మార్కులు పొందారు. సీఈసీలో గతేడాది ఒక విద్యార్థి 492 టాప్ మార్కులు పొందగా.. ఈసారి టాప్ మార్కులు తగ్గిపోయాయి. ఒక విద్యార్థి మాత్రమే 490 టాప్ మార్కులు సాధించారు. గతేడాది హెచ్ఈసీలో 470 టాప్ మార్కులను ఒక్క విద్యార్థి పొందగా.. ఈసారి ఒక విద్యార్థికి 483 మార్కులు వచ్చాయి. టాపర్లు వీరే.. సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీలో టాప్ మార్కులను (994) వరంగల్ జిల్లాకు చెందిన వర్ణం శ్రీజ, ఖమ్మం జిల్లాకు చెందిన అయిలూరి శ్రుతి సాధించారు. ఖమ్మం జిల్లాకు చెందిన సహదేవుడి సాయి రాకేశ్ 993 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇక బైపీసీలో 992 మార్కులతో హైదరాబాద్‌కు చెందిన పొదిల గాయత్రి, వి. శ్రీరామ్ ఆనంద్ టాపర్లుగా నిలిచారు. తర్వాత 991 మార్కులను ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో హైదరాబాద్‌కు చెందిన నగరూరు రక్షిత (987 మార్కులు) టాపర్‌గా నిలవగా.. సీఈసీలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్పీ భావన, వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన బంబాక్ హర్ష, పత్తి శృతి 977 మార్కులు పొందారు. హెచ్ఈసీలో 958 మార్కులతో హైదరాబాద్ జిల్లాకు చెందిన సుంకరి శ్రీసాయి తేజ టాపర్‌గా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో.. ఫస్టియర్ ఎంపీసీలో 467 టాప్ మార్కులను 24 మంది విద్యార్థులు.. బైపీసీలో 437 టాప్ మార్కులను ఏడుగురు విద్యార్థులు సాధించా రు. ఎంఈసీలో 495 టాప్ మార్కులను హైదరాబాద్‌కు చెందిన గంపా గాయత్రి.. సీఈసీలో 490 టాప్ మార్కులను సిద్దిపేట జిల్లాకు చెందిన బోయిని శ్రీ మహాలక్ష్మి.. హెచ్ఈసీలో 483 టాప్ మార్కులను వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన జి.జాన్సన్ సాధించారు. ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ అవుతా.. ఇంటర్లో ఎలాగైనా స్టేట్ టాపర్లలో ఒకరిగా ఉండాలనుకున్నాను. కానీ ఏకంగా నేనే టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్ కావాలనేది నా ధ్యేయం. అమ్మ, నాన్న కృష్ణారెడ్డి, లీలావతి ఇద్దరూ రైతులే. వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ విజయం సాధించాను.. – ఎ.శృతి, ఎంపీసీ స్టేట్ టాపర్ (994 మార్కులు) ఐఏఎస్ కావడమే లక్ష్యం నమ్మకంతో చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చేందుకు ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం, సూచనలతోనే మంచి మార్కులు సాధించగలిగా. మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటా.. – ఆర్.పి.భావన, సీఈసీ స్టేట్ టాపర్ (977 మార్కులు) -
ఏపీ ఇంటర్లో బాలికలదే పైచేయి
సాక్షి, రాజమహేంద్రవరం/సాక్షి, అమరావతి: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. బాలురు కన్నా 7 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఏపీ సీనియర్ ఇంటర్ పరీక్ష ఫలితాలను గురువారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 73.33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 77 శాతం, బాలురు 70 శాతం పాస్ అయ్యారు. ఇక ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో, 59 శాతం ఉత్తీర్ణతతో వైఎస్సార్ జిల్లా చివరి స్థానంలో నిలిచాయి. 77 శాతంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ద్వితీయ, 76 శాతం ఉత్తీర్ణతతో గుంటూరు జిల్లా తృతీయ స్థానం దక్కించుకున్నాయి. ఆయా గ్రూపుల్లో టాప్–3 విద్యార్థులు ఎంపీసీ:కున్నం తేజవర్ధనరెడ్డి(992), అఫ్రీన్ షేక్(991), వాయలపల్లి సుష్మ(990), బైపీసీ: ముక్కు దీక్షిత(990), నారపనేని లక్ష్మీకీర్తి(990),కురుబ షిన్యథ(990), ఎంఈసీ: పోపూరి నిషాంత్ కృష్ణ(982), డి.మీనా (981), జి.నాగవెంకట అభిషేక్(981 సీఈసీ: కాదంబరి గీత(968), ఎ.సెల్వరాజ్ ప్రియ(966), కాసా శ్రీరాం(964), హెచ్ఈసీ: ముద్ద గీత(966), బొమ్మిడి లావణ్య(952), పప్పు సత్యనారాయణ(949). -
మెరిసిన మౌనిక
► ఎంపీసీలో 984 మార్కులు సాధించిన విద్యార్థిని ► ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులకు బ్రేక్ పాలకుర్తి : కష్టాలు ఎదురైనా.. పేదరికం వెక్కిరించినా.. ఆమె ధైర్యం కోల్పోలేదు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తోటి విద్యార్థుల కు ఆదర్శంగా నిలిచింది. మండల కేంద్రానికి చెందిన పన్నీరు మౌనికది నిరుపేద కుటుంబం. 8వ తరగతిలో ఉండగానే ఆమె తండ్రి అనారోగ్యం తో మృతి చెందాడు. దీంతో తల్లి సరోజన పాలకుర్తి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో సంచార గాజుల దుకాణం నిర్వహిస్తూ కూతురుతోపాటు కొడుకును పోషిస్తుంది. అరుుతే మౌనిక రెండేళ్ల క్రితం పదో తరగతి పరీక్షలో మంచి మార్కులు సాధించడంతో వరంగల్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల నిర్వాహకులు ఆమెకు ఎంపీసీలో ఉచి తంగా సీటు ఇచ్చారు. దీంతో ఈ ఏడాది జరిగిన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఆమె 984/1000 మార్కులు సాధించి సత్తా చాటుకుంది. అరుుతే ఇంటర్లో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికం కారణం గా మౌనిక చదువుకు స్వస్తి చెప్పి తల్లివెంట గాజులు అమ్మేందుకు వెళ్తుం ది. ప్రభుత్వం తనను ఆదుకుని చదివిస్తే టీచర్ ఉద్యోగం సంపాదిస్తానని చెబుతోంది. ఇదిలా ఉండగా, మౌనిక అన్నయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. -
అదే జోరు
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల హవా రాష్ర్టంలో మూడో స్థానం 76శాతం ఉత్తీర్ణత బాలురకంటే బాలికలే టాప్ విశాఖపట్నం: ఇంటర్ ఫస్టియర్‌లోనే కాదు మంగళవారం ప్రకటించిన రెండో సంవత్సరం ఫలితాల్లోనూ జిల్లా విద్యార్థులు భళా అనిపించారు. 76శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో జిల్లాను తృతీయ స్థానంలో నిలిపారు. కిందటేడాది కూడా ఇంతే ఉత్తీర్ణత శాతం సాధించి ద్వితీయ స్థానం సంపాదించారు. రాష్ట్ర స్థాయిలో మార్కుల సాధనలో మాత్రం జిల్లా విద్యార్థులే అగ్రగామిగా నిలిచారు. ఎస్. శ్రావ్య ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 990 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. అదే విధంగా 989 మార్కులు అయిదుగురు పొందగా 980 మార్కులకు పైగా వంద మంది విద్యార్థులు మార్కులు సాధించి విద్యాపరిమళాలు వెదజల్లారు. ఈ ఫలితాల్లో కూడా బాలిక ల హవానే కొనసాగింది. బాలురు 75శాతం ఉత్తీర్ణత సాధించగా బాలికలు 77శాతం ఉత్తీర్ణులయ్యారు. అయితే ఒకేషనల్ విభాగంలో జిల్లా పూర్తిగా దిగజారింది. కిందటేడాది 92శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో నిలవగా ఈ ఏడాది 70శాతం ఉత్తీర్ణతతో 7వ స్థానానికి తగ్గిపోయింది.గొలుగొండ, జి.మాడుగుల గురుకుల కళాశాల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. 76శాతం ఉత్తీర్ణత : ఈ ఏడాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు జనరల్ కోర్సుల నుంచి 41,088 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 76శాతంతో 31,174 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 21,121 మంది పరీక్షలు రాయగా 75శాతంతో 15,766 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 19,967 మంది పరీక్షలు రాయగా 77శాతంతో 15,408 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 3,071 మంది పరీక్షలు రాయగా 70శాతంతో 2,153 మంది పాసయ్యారు. బాలురు 1553 మంది పరీక్షలు రాయగా 73శాతంతో 1140 మంది పాసయ్యారు. బాలికలు 1518 మంది పరీక్షలు రాయగా 67శాతంతో 1013 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా ఉత్తీర్ణతలో చతికిలబడ్డాయి. గత ఏడాదితో పోల్చుకుంటే 4శాతం ఉత్తీర్ణత త గ్గింది. జిల్లాలో 34 ప్రభుత్వ కళాశాల నుంచి 5,238 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 65.85శాతంతో 3449 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో అత్యధికంగా 98.69శాతంతో దేవరాపల్లి జూనియర్ కళాశాల ప్రథమ స్థానంలో నిలవగా అనకాపల్లి జూనియర్ కళాశాల 5శాతం, పాడేరు జూనియర్ కళాశాల 14.55శాతం, డుంబ్రిగుడ జూనియర్ కళాశాల 33.40శాతంతో వెనుకబడ్డాయి. జిల్లాలో ఎయిడెడ్ కళాశాలలు నుంచి 1621 మంది పరీక్షలు రాయగా 56.94శాతంతో 923 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాలల నుంచి 544 మంది పరీక్షలు రాయగా 84.01శాతంతో 457 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 5 మోడల్ స్కూల్స్ నుంచి 180 మంది పరీక్షలు రాయగా 79.44శాతంతో 143 మంది ఉత్తీర్ణులయ్యారు. సివిల్ సర్వీసు చేయాలని ఉంది. అందుకే టెన్త్ నుంచి లక్ష్యంగా చదువుతున్నాను. రెండేళ్ల కష్టం ఫలితంగానే ఎంపీసీ గ్రూప్‌లో 990 మార్కులు వచ్చాయి. రోజుకు 10 నుంచి 12గంటలు ప్రిపరేయ్యేదాన్ని. ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే కొద్దిగా భయం. అందుకే ఫిజిక్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాను. జేఈఈ మెయిన్స్‌లో 165 మార్కులు వచ్చాయి. అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ అవుతున్నాను. కచ్చితంగా ఐఐటిలో సీటొస్తుందని నమ్మకం. కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్స్‌కు ప్రిపేరవుతాను. నా చదువు వెనుక అమ్మానాన్నల ప్రోత్సాహం మరువలేను. నాన్న గోపాలకృ్షష్ణ రైల్వేలో పనిచేస్తున్నారు. అమ్మ జయమ్మ గృహిణి. -ఎస్.శ్రావ్య, ఎంపీసీ 990 మార్కులు (శ్రీచైతన్య నారాయణకళాశాల) -
‘ద్వితీయ’లోనూ బాలికలదే హవా
ఇంటర్ ఫలితాలను వెల్లడించిన ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలోనే కాదు ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ రంగారెడ్డి జిల్లా అత్యధిక ఉత్తీర్ణతశాతంతో మొదటి స్థానంలో నిలిచింది. బాలికలు కూడా అంతే.. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ అత్యధిక ఉత్తీర్ణత శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయంలో సోమవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి ఫలితాలను సకాలంలో ఇచ్చినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. కొత్తగా బోర్డు ఏర్పడిన నేపథ్యంలో ఫలితాలు సకాలంలో వస్తాయా? లేదా? అన్న అనుమానం ఉన్నప్పటికీ బాగా పని చేసి సరైన సమయంలో ఫలితాలు ఇచ్చారని కొనియాడారు. భవిష్యత్తులో బోర్డు అధికారులు మరింత బాగా పని చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కార్యదర్శి సతీష్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, సలహాదారు వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 1000 మార్కులకు గాను టాప్ మార్కులు 991. ఈ మార్కులను ఎంపీసీలో ఐదుగురు విద్యార్థులు సాధించగా, బైపీసీలో ఒక్కరే సాధించారు. మొత్తంగా చూస్తే 54.57 శాతం ఉత్తీర్ణత ఇంటర్మీడియెట్ ద్వితీయ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 74.93 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం లో నిలవగా, 50.26 శాతంతో నల్లగొండ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 64.18 శాతంతో హైదరాబాద్, 64.08 శాతంతో ఖమ్మం ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రెగ్యులర్ విద్యార్థులు 3,78,973 మంది పరీక్షలకు హాజరుకాగా 2,32,742 మంది (61.41 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 93,500 మంది హాజరుకాగా 25,439 మంది (27.21 శాతం) పాసయ్యారు. ఇక వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 25,488 మంది పరీక్షలకు హాజరుకాగా 15,054 మంది (59.06 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 7,242 మంది హాజరుకాగా 2,474 మంది (34.38 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా చూస్తే అన్ని విభాగాల్లో కలిపి 54.57 శాతం మంది పాసయ్యారు. మళ్లీ బాలికలదే పైచేయి.. మొదటి సంవత్సర ఫలితాల్లోనే కాదు ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ బాలికలే పైచేయిగా నిలిచారు. బాలుర కంటే బాలికలే 11 శాతం మేర అధిక ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచారు. బాలికలు 1,90,483 మంది హాజరుకాగా 1,27,355 మంది (66.86 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురలో 1,88,490 మంది పరీక్షలకు హాజరుకాగా 1,05,387 మంది (55.91 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థుల్లో బాలికలు 34,486 మందికిగాను 10,857 మంది (31.48 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక 150 మంది విద్యార్థులు డీబార్కాగా, వివిధ కారణాలతో 22 మంది ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టారు. మే 1 నాటికి మార్కుల జాబితాలు మూడు రోజుల్లో మార్కుల రిజిస్టర్లను రీజనల్ ఇన్స్పెక్షన్ (ఆర్ఐవో) అధికారులకు పంపిస్తారు. మార్కుల జాబితాలను ఆర్ఐవోల నుంచి సంబంధిత ప్రిన్సిపాళ్లు తీసుకెళ్లవచ్చు. వీలైనంత త్వరగా విద్యార్థులకు అందజేయాల్సి ఉంటుంది. మెమోల్లో ఏమైనా పొరపాట్లు వస్తే మే 27లోగా సం బంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. మే 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ♦ ఫీజు చెల్లింపునకు మే 6 వరకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 25వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించేం దుకు ఇంటర్మీడియెట్ బోర్డు షెడ్యూలు జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర పరీక్షలను, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహిస్తారు. ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 4 నుంచి 7వ తేదీ వరకు ఉంటాయి. ఎథిక్స్, మానవీయ విలువల పరీక్ష జూన్ 8న, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 9న ఉంటుంది. ఈ రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన పూర్తి టైంటేబుల్‌ను ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్లో http://bie.telangana.gov.in త్వరలోనే పొందుపరుస్తారు. విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును మే 6వ తేదీలోగా చెల్లించాలి. ఆలస్య రుసుముతో చెల్లింపునకు అవకాశం లేదు. ప్రైవేటు విద్యార్థులకు ఇవే తేదీలు వర్తిస్తాయి. వొకేషనల్ కోర్సులు చదివిన పాత విద్యార్థులు పాత సిలబస్‌లో పరీక్షలు రాసేందుకు ఇదే చివరి అవకాశం. హాజరు మినహాయింపు పొందిన వారు ఆర్ట్స్, కామర్స్ పరీక్షలకోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను కలసి ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్, ఫొటో కాపీకి అవకాశం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు మే 6వ తేదీలోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. రీ వెరిఫికేషన్, మూల్యాకనం చేసిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీ పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ. 600 చొప్పున మీసేవ, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి. -
ఇంటర్లో... జిల్లా విద్యార్థుల జయకేతనం
ఖమ్మం, న్యూస్‌లైన్: ఇంటర్ ద్వితీయసంవత్సరం ఫలితాలలో జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ విభాగంలో ప్రథమస్థానంతో సహా మొదటి ఐదుస్థానాల్లో ప్రతిభచాటారు. బైపీసీ విభాగంలో ఇద్దరు ప్రథమస్థానం, హెచ్ఈసీలో ఒకరు ప్రథమస్థానం సాధించి జిల్లా ఖ్యాతిని నలుదిశల చాటారు. కాగా, ఇంటర్ ఫలితాలలో జిల్లా 64శాతం ఉత్తీర్ణతను సాధించి రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా బాలికలే హవా కొనసాగించారు. బాలికలు 66శాతం, బాలురు 61శాతం ఉత్తీర్ణత పొందారు. గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత 2 శాతం పెరిగింది. జిల్లా మొత్తం మీద 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 182 ప్రైవేట్ కళాశాలల నుంచి 24,208 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకాగా 15,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 12,426 మందికి 8,237 మంది (66శాతం), బాలురు 11,782 మందికి 7,155 మంది (61శాతం) ఉత్తీర్ణులయ్యారు. గత పదేళ్లుగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో బాలికలే ముందునిలవడం విశేషం. ఒకేషనల్‌కోర్సులకు సంబంధించి 60శాతంమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం 43శాతం ఉత్తీర్ణత ఉండగా ఇప్పుడు 13శాతం పెరిగింది. ఓకేషనల్‌లో మొత్తం 4,736మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 2850 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షల్లో బాలురు 49శాతం మంది ఉత్తీర్ణత సాధించగా... 69శాతం ఉత్తీర్ణత సాధించి బాలికలు ప్రతిభ చాటారు. వారం రోజుల్లో కళాశాలల ద్వారా విద్యార్థులు మార్కుల జాబితాలను పొందవచ్చునని ఆర్ఐవో ఆడ్రోస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల ఫలితాలు గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. గత సంవత్సరం 57.6 శాతం ఉత్తీర్ణత నమోదుకాగా, ఈ సంవత్సరం 63.03 శాతం సాధించాయి. జిల్లాలోని 42 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొత్తం 3,873 మంది చదువుతుండగా 2,441 మంది ఉత్తీర్ణులయ్యారు. బూర్గంపాడు ప్రభుత్వజూనియర్ కళాశాల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించి ప్రతిభచాటారు. అదేవిధంగా దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల 98.21శాతం, కూనవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల 95.56శాతం, వీఆర్‌పురం ప్రభుత్వ జూనియర్ కళాశాల 95శాతం, బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల 93.15 శాతం ఉత్తీర్ణత సాధించాయి. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 19 ప్రభుత్వ ఓకేషనల్ జూనియర్ కళాశాలల్లో 1098 మందికి 856 మంది (77.96శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
ఈ సారి బాలికలదే హవా
సాక్షి, సంగారెడ్డి: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మెతుకుసీమ రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. సాధారణ విభాగంలో 49 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లాతో కలిసి 23వ స్థానాన్ని పంచుకుంది. గతేడాది ఫలితాల్లో 46 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచిన మెదక్ జ్లిలా...ఈ ఏడాది ఉత్తీర్ణత స్వల్పంగా పెరిగినా, జిల్లా మాత్రం అట్టడుగు స్థానానికి దిగజారింది. జిల్లా నుంచి 27,228 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరు కాగా 13,362 మంది ఉత్తీర్ణులయ్యా రు. ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. 14,220 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, కేవలం 6,326 మంది మాత్రమే విజయం సాధించడంతో ఉత్తీర్ణత శాతం 44 మాత్రమే నమోదైంది. పరీక్షలకు హాజరైన 13,008 మంది బాలికల్లో 7,036 మంది విజయం సాధించారు. దీంతో బాలికల ఉత్తీర్ణత శాతం 54గా నమోదైంది. ఒకేషనల్ కోర్సుల్లో.. వృత్తి విద్యా విభాగం ద్వితీయ ఫలితాల్లో జిల్లా 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. మొత్తం 2,960 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 1,660 మంది ఉత్తీర్ణులయ్యారు. 1,957 మంది బాలురుల్లో 990 మంది పాస్‌కాగా, ఉత్తీర్ణతా శాతం 51గా నమోదైంది. 1,003 మంది బాలికల్లో 670 మంది ఉత్తీర్ణలు కాగా, 67 శాతం న మోదైంది. ప్రభుత్వ కళాశాలలే భేష్.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు మళ్లీ సత్తా చాటాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలు 69 ఉత్తీర్ణత సాధించి తెలంగాణలోనే రెండో స్థానంలో నిలవడం ఒక్కటే ఈ ఫలితాల్లో ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు.