
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలపై విద్యార్థులకు అసంతృప్తి ఉంటే కోవిడ్ తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ లో ఇబ్బంది లేకుండా మార్కులే ప్రకటించామని, మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేస్తున్నామన్నారు.
భవిష్యత్‌లో పరిస్థితులు అనుకూలిస్తే బెటర్‌మెంట్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. పదవ తరగతి ఫలితాలను వారం రోజులలో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment