
కొత్తగూడెం, అశ్వాపురం: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8,540 మంది హాజరు కాగా 6,453 మంది ఉత్తీర్ణులయ్యారు. 2,087 మంది ఫెయిలయ్యారు. సప్లిమెంటరీ రద్దుతో ఆ 2,087 మంది ఉత్తీర్ణులు కానున్నారు. అయితే వారంతా కంపార్ట్‌మెంట్‌లో పాస్ కానున్నారు. ఈ నెల 31వ తేదీ లోపు విద్యార్థుల మార్కుల మెమోలు కళాశాలలో అందుబాటులో ఉంచునున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సెకండియర్ పాసైన విద్యార్థుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తుల ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment