సోనూసూద్‌ సాయం: కరోనా బాధితుడికి కాన్సన్‌ట్రేటర్‌ | Sonu Sood Help To Covid Patient In Khammam Over Oxygen Contraction | Sakshi
Sakshi News home page

సోనూసూద్‌ సాయం: కరోనా బాధితుడికి కాన్సన్‌ట్రేటర్‌

Published Wed, Jun 9 2021 8:42 AM | Last Updated on Wed, Jun 9 2021 8:42 AM

Sonu Sood Help To Covid Patient In Khammam Over Oxygen Contraction - Sakshi

ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా రూ.6 లక్షలు ఖర్చు అయింది. అయినా నిత్యం ఆక్సిజన్‌  లెవెల్స్‌ పడిపోతుండటం, చేతిలో డబ్బు లేకపోవడంతో కుమారుడు సతీశ్‌రెడ్డి వారం క్రితం తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు.

తిరుమలాయపాలెం: ఓ కరోనా బాధితుడికి ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌ ప్రాణవాయువు అందించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన రణబోతు వీరారెడ్డి(65) 25 రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా రూ.6 లక్షలు ఖర్చు అయింది. అయినా నిత్యం ఆక్సిజన్‌  లెవెల్స్‌ పడిపోతుండటం, చేతిలో డబ్బు లేకపోవడంతో కుమారుడు సతీశ్‌రెడ్డి వారం క్రితం తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు.

ఖమ్మం నుంచి నిత్యం ఆక్సిజన్‌ సిలిండర్‌ తెచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆన్‌లైన్‌  ద్వారా సోనూసూద్‌ ట్రస్ట్‌కు తెలియజేస్తూ ఆక్సిజన్‌  కాన్సన్‌ట్రేటర్‌ కావాలని వేడుకోగా ఐదురోజుల్లోనే సుమారు రూ.60 వేల విలువైన ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను మేడిదపల్లికి పంపించారు. తమ కష్టాలకు స్పందించి ఆక్సిజన్‌  కాన్సన్‌ ట్రేటర్‌ అందించిన సోనూసూద్‌కు సతీశ్‌ కృతజ్ఞతలు తెలిపాడు.
చదవండి: వైద్య సదుపాయాలపై మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఉప సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement