Oxygen cylinder
-
అతడు సత్యవంతుడు
సత్యవంతుడి కోసం సావిత్రి యముడితో పోరాడింది... నేను నా భార్యకోసం సత్యవంతుడిలా పోరాడుతున్నాను... అంటున్నాడు విజయ్ మండల్.గత నాలుగేళ్లుగా ఇతను భార్యకు 24 గంటల్లో కావలసిన 3 ఆక్సిజన్ సిలిండర్లను రోజూ భుజంపై మోస్తున్నాడు. ఇందుకోసం సిలిండర్‌తో రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తాడు. అలుపు లేదు. ఆగిందీ లేదు. బిహార్ భాగల్పూర్కు చెందిన ఈ భర్తకు భార్య కన్నీటి కృతజ్ఞత తెలుపుతుంటోంది. నేటి ఉలిక్కిపడే వార్తల మధ్య ఈ అనుబంధం ఎంతో ఆదర్శం.భర్త కోసం భార్యలు పోరాడిన గాథలు ఉన్నాయి. కాని భార్య కోసం భర్తలు చేసే త్యాగాలు లోకం దృష్టికి రావడం తక్కువ. కాని విజయ్ మండల్ కథ విస్మరించను వీలు కానిది. ఒక మనిషి నిజమైన హృదయంతో పూనుకుంటే తప్ప ఇలాంటి ఘనకార్యాన్ని, ఘనమైన సేవను చేయలేడు. బిహార్‌లోనే ఇటువంటి భర్తలు ఉన్నారేమో. గతంలో దశరథ్ మాంఝీ అనే అతను తన భార్యకు సమయానికి వైద్యం అందనివ్వకుండా అడ్డుగా నిలిచిన కొండను ఒక్కడే తొలిచి, దారి వేసి ‘మౌంటెన్ మేన్’ అనిపించుకున్నాడు. కరోనా తర్వాత రోగగ్రస్త అయిన భార్య కోసం నాలుగేళ్లుగా పట్టుదలగా ఆక్సిజన్ సిలిండర్లు మోస్తున్న విజయ్ మండల్‌ను ‘ఆక్సిజన్ మేన్’ అనొచ్చేమో.భాగల్పూర్ నుంచివిజయ్ మండల్‌ది బిహార్‌లోని భాగల్పూర్కు దగ్గరలోని కహల్గావ్. ఇక్కడ అతను చిన్న కిరాణా షాపు నడిపేవాడు. భార్య అనితాదేవికి 2021లో కరోనా సోకింది. పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. భార్యను బతికించుకోవడానికి విజయ్ మండల్ చేయని ప్రయత్నం లేదు. కూతురి పెళ్లి కోసం దాచిన 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. చివరకు ఢిల్లీ ఎయిమ్స్‌కు కూడా తీసుకెళ్లారు. వాళ్లు ఆమెను చేర్చుకొని అన్ని విధాలా వైద్యం చేసి చివరకు ‘ఈమె ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకోవు. బతికి ఉన్నంత కాలం ఆక్సిజన్ మీద బతకాల్సిందే’ అని చెప్పి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చి పంపారు. అది సంవత్సరంలో చెడిపోయింది. ఇంకోటి కొన్నా దాని పరిస్థితీ అంతే. దాంతో స్థానికంగా దొరికే ఆక్సిజన్ సిలిండర్లే మేలని వాటితో భార్యను బతికించుకోవాలని విజయ్ మండల్ నిశ్చయించుకున్నాడు.ఉదయాన్నే 4 గంటలకు లేచిఒక్కో సిలిండర్ 8 గంటలు వస్తుంది. అందుకే ఖాళీ అయిన దానిని వెంటనే ఇచ్చి నిండింది తెచ్చుకోవాలి. విజయ్ మండల్ దినచర్య ఇలా ఉంటుంది. అతడు తన ఊరు రసల్పూర్ నుంచి తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ‘ఇక్చారి’ రైల్వేస్టేషన్‌కు సిలిండర్ మోసుకొని బయలుదేరుతాడు. అక్కడ రైలు పట్టుకుని 50 నిమిషాల దూరంలోని భాగల్పూర్ చేరుకుంటాడు. అక్కడి నుంచి ఆక్సిజన్ దొరికే చోటుకు వెళ్లి సిలిండర్ తీసుకుని 9 గంటలకు ఇల్లు చేరుతాడు. మళ్లీ 11కు వెళ్లి ఒంటి గంటకు వస్తాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి 7కు తిరిగి వస్తాడు. అంటే రోజులో భుజాన సిలిండర్‌తో 30 కిలోమీటర్లు అతడు నడుస్తాడు. అతని భుజం కదుం కట్టి పోయింది. ‘ఎందుకు ఆక్సిజన్ మోస్తూ కనిపిస్తావు’ అని ఎవరైనా అడిగితే ‘ఒక పక్షి దాహంతో ఉంది. దాని కోసం’ అని సమాధానం చెబుతాడు.ఆయుష్మాన్ కార్డు‘ఒకరికొకరు తోడుండటమే వివాహం అంటే. ఆమె మరణించేవరకూ నేనే తోడు’ అంటాడు విజయ్ మండల్. ఇతని గాథ అందరికీ తెలిసినా స్థానిక అధికారులు ఆయుష్మాన్ కార్డు ఇచ్చి సరిపెట్టారు. ఒక మనిషి ఆక్సిజన్ కోసం ఇంతగా ఎందుకు తిరగాలి పర్మినెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. పిచ్చివాడిలా గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆ భర్తను చూసి భార్య రెండు చేతులూ జోడిస్తుంటుంది. ‘ఉత్త పుణ్యానికి భార్యలను హతమార్చే ఈ రోజుల్లో అనారోగ్యంతో ఉన్న నన్ను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడు నా భర్త’ అని కన్నీరు కారుస్తుంది. విజయ్ మండల్ ఆ మాటలు పట్టించుకోడు. తనకు మిగిలిన టైమ్‌లో ఆమె దగ్గర కూచుంటాడు. పాదాలు నొక్కుతాడు. కబుర్లు చెబుతాడు. ఆమెలో జీవితేచ్ఛ నశించకుండా చూసుకుంటాడు. ఒక మనిషి ఇంత గొప్పగా ఉంటాడా? ఉంటాడు. ప్రతి మనిషి ఇలా ఉంటే కనీసం ఇంతలో కొంతగా అయినా ఉంటే ఎంత బాగుణ్ణు. ఇంట్లోని గదినే ఐసియుగా మార్చి...‘నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్యను ఎంత బాగా చూసుకోవాలనే విషయం పై నేను ఒక ఉదాహరణగా నిలవాలి’ అన్నాడు విజయ్ మండల్. అతను తాను నడిపే కిరాణా దుకాణాన్ని కొడుక్కు అప్పజెప్పి జీవితాన్ని ఇక పూర్తిగా భార్యకు అంకితం చేశాడు. మూడు ఆక్సిజన్ సిలిండర్లను పర్మినెంట్‌గా ఉండేలా కొనేశాడు. వాటిని నింపుకొని రావడమే ఇప్పుడతని కర్తవ్యం. -
బిడ్డ కోసం తండ్రి పాట్లు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): పసిబిడ్డ కోసం తండ్రి నానా కష్టాలు పడ్డాడు. ప్రసవం అయిన తర్వాత చికిత్స కోసం పిల్లల వార్డుకు తీసుకొని వెళ్లడానికి సిబ్బంది నిరాకరించారు. దీంతో తండ్రి ఆక్సిజన్ సిలిండర్ మోసుకొని వార్డుకు తీసుకొని వెళ్లాడు. పసిబిడ్డను ఆయా తీసుకొని వెళ్లగా తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. కాకినాడ జిల్లా కోటనందూరుకి చెందిన అల్లు శిరీష, విష్ణుమూర్తి దంపతులు. శిరీష ఈ నెల 9న కేజీహెచ్ గైనిక్ వార్డులో చేరారు. మంగళవారం ఉదయం 8.30 శిరీష పసికందుకు జన్మనిచ్చి0ది. పసికందు అనారోగ్యానికి గురవడంతో పిల్లల వార్డులో ఉన్న ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచాలని వైద్యులు సూచించారు. పసికందును గైనిక్ వార్డుకు తరలించడానికి కేజీహెచ్ సిబ్బంది ఎవరు ముందుకు రాలేదు. దీంతో తండ్రి విష్ణుమూర్తి అక్కడ ఉన్న ఆయాతో మాట్లాడి తాను సిలిండర్ మోస్తానని ముందుకు వచ్చాడు. దీంతో ఆయా పసిపాపను, తండ్రి సిలిండర్ మోసుకొని వెళ్లారు. గైనిక్ వార్డు నుంచి పిల్లల వార్డు వరకు నడిచి తీసుకొని వెళ్తున్న ఈ దృశ్యాన్ని కొంత మంది వీడియో తీశారు. దీనిని వైరల్ చేయడంతో ఈ విషయం బయట పడింది. గైనిక్ వార్డు వద్ద బ్యాటరీ కారు ఈ ఘటన వైరల్ కావడంతో సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ ఆరా తీశారు. గైనిక్, పిల్లల వార్డు సిబ్బందిని పిలిచి విచారించారు. ఆ సమయంలో ఎవరు డ్యూటీలో ఉన్నారు.. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్నదానిపై చర్చించారు. ఈ సమస్య లేకుండా గైనిక్, పిల్లల వార్డు వద్ద ఒక బ్యాటరీ కారు సిద్ధం చేస్తున్నట్లు శివానంద్ తెలిపారు. -
పెద్దాస్పత్రిలో దొంగల భయం!
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో రక్షణ కరువైంది. ఆస్పత్రికి సంబంధించిన విలువైన వస్తువులు తరచూ మాయమవుతున్నాయి. అంతే కాకుండా రోగులు, వారికి సహాయంగా వచ్చే వారి సెల్ ఫోన్ల చోరీ పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రికి వచ్చే వారు మండిపడుతున్నారు. పెరిగిన తాకిడి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇటీవల మెడికల్ కళాశాలగా మార్పు చెందింది. దీంతో నిత్యం వెయ్యి నుండి 1,500 మంది వరకు వైద్యసేవలకు వస్తుంటారు. అలాగే రోగుల సహాయకులతో నిత్యం ఆస్పత్రి కిటకిటలాడుతెఓంది. ఇదే అదనుగా కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. రోగుల బెడ్ల వద్ద ఉండే ఫోన్లు, చార్జింగ్ పెట్టిన ఫోన్లు చోరీ చేస్తుండగా.. ఇటీవల ఆర్ఎంఓకు వరుస ఫిర్యాదులు అందుతున్నా ఎలాంటి చర్యలు లేదు. మరోపక్క ఆస్పత్రిలోని వస్తువులు కూడా తస్కరణకు గురవుతున్నాయి. తాజాగా ఆక్సిజన్ సిలిండర్లకు వినియోగించే మ్యాన్ హోల్డ్‌లు చోరీకి గురయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ల నుండి పైప్‌లైన్‌కు లింక్ కలిపేందుకు మ్యాన్ హోల్డ్స్ వినియోగిస్తారు. వీటిని చాలా వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి పూట ముసుగు వేసుకొచ్చి వీటిని చోరీ చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా పట్టించుకోవడం లేదు. సెక్యూరిటీ ఉన్నట్టా.. లేనట్లా? పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ, పేషంట్ కేర్, స్వీపర్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ ఓ ఏజెన్సీకి కట్టబెట్టింది. ఆస్పత్రిలో 575 బెడ్లు ప్రాతిపదికగా బెడ్‌కు రూ.7,500 సదరు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఈమేరకు 259 మంది సెక్యూరిటీ, పేషంట్ కేర్, స్వీపర్లను నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా వారిని ఆస్పత్రి రక్షణకు వినియోగించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో అవసరం మేరకు సిబ్బంది లేకపోవడంతో వీరిని ఇతర పనులకు కేటాయిస్తున్నారని.. మరికొందరిని అధికారులు, ఉద్యోగులు వారి ఇళ్లలో పని చేయించుకుంటున్నారని సమాచారం. ఫలితంగా సెక్యూరిటీ గార్డుల కొరతతో చోరీలు సర్వసాధారణమయ్యాయి. ఇంత జరుగుతున్నా విషయం బయటకు పొక్కకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అధికారులు మిన్నకుంటున్నట్లు సమాచారం. గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం ఆస్పత్రిలో చోరీలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటుచేస్తాం. సెల్ఫోన్లు చోరీకి గురైన విషయమై ఫిర్యాదులు అందాయి. అలాగే సిలిండర్లకు బిగించే మ్యాన్ హోల్ద్స్ కూడా దొంగిలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, ఆర్ఎంఓ -
కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు. ఆక్సిజన్‌పై ఆరా.. అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది. చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు.. -
ప్రజా వైద్యానికి.. రూ.10,000 కోట్లు
వైద్య ఆరోగ్యశాఖలో ఎన్నడూలేని విధంగా 2021 సంవత్సరంలో అత్యంత విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఒకేసారి ప్రభుత్వ రంగంలో 8 మెడికల్ కాలేజీలను మంజూరు చేసింది. మంచిర్యాల, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, జగిత్యాల, రామగుండం, వనపర్తిలో రానున్న 2022–23 సంవత్సరంలో వైద్య కళాశాలలు ప్రారంభం అవుతాయి. ప్రతీ కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున 1,200 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 9 మెడికల్ కాలేజీలుంటే, అంతేమొత్తంలో కొత్త కాలేజీలు రావడం విప్లవాత్మక నిర్ణయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీంతో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,840 అవుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఆయా ప్రాంతాల్లో స్పెషలిస్ట్ వైద్య సేవలు ప్రజలకు అందుతాయి. ఎయిమ్స్ తరహాలో నాలుగు టిమ్స్ ఎయిమ్స్ తరహాలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరానికి నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎల్బీనగర్, అల్వాల్‌లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో వీటి సేవలు ఉండాలన్నది సర్కారు సంకల్పం. అలాగే వరంగల్లోనూ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కూడా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే రాష్ట్రానికి మెడికల్ హబ్‌గా మారుతుందని అంటున్నారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, మానవవనరులను సమకూర్చి ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. ఈ నిధులను సాధారణ బడ్జెట్‌తో సంబంధం లేకుండా వచ్చే రెండేళ్లలో అదనంగా కేటాయించనుంది. ‘రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితి రాకూడదు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అందుకే రూ.10 వేల కోట్లు కేటాయిస్తాం’ అని సర్కారు చెప్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో వైద్య, ఆరోగ్యశాఖకు రూ. 6,295 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌ను సాధారణ అవసరాలకు, ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. -
మొదలైన ఆక్సిజన్ కొరత
-
మరో 10వేల ఆక్సిజన్ పడకలు
సాక్షి, హైదరాబాద్: కరోనా థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేలా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంసిద్ధమవుతోంది. ముఖ్యంగా రోగులకు ఆక్సిజన్‌ను అందించడంలో ఎటువంటి కొరత తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మొదటి, రెండో వేవ్‌ల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 17 వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించగా.. తాజాగా మరో 10 వేల పడకలకు ఈ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే అన్ని జిల్లా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పనుంది. ప్రతి ఏరియా ఆస్పత్రిలోనూ 20 పడకలను ఐసీయూలుగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 20 శాతం పడకలను పిల్లలకు కేటాయించనున్నారు. ఐసీయూ పడకలనూ ఇదే విధంగా కేటాయిస్తారు. వంద పడకలకు పైగా ఉన్న ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆక్సిజన్న్ప్లాంటు ఉండాలని ఆదేశించారు. 100 పడకలు నుంచి 200 పడకల వరకు ఉన్న ఆసుపత్రులు నిమిషానికి 500 లీటర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యమున్న ప్లాంటును ఏర్పాటు చేయాలి. 200–500 మధ్య పడకలున్న ఆసుపత్రులు నిమిషానికి వెయ్యి లీటర్లు ఉత్పత్తి చేసే ప్లాంటును నెలకొల్పాలి. 500 పడకలకు మించి ఉన్న ఆస్పత్రి నిమిషానికి 2 వేల లీటర్లు ఉత్పత్తి చేసే ప్లాంటును కలిగి ఉండాలి. థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. కరోనా థర్డ్‌వేవ్‌పై జాతీయ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ‘కార్యాలయాలు తెరుచుకున్నాయి. మార్కెట్లు రద్దీగా మారాయి. జనసంచారం పెరిగింది. కానీ జాగ్రత్తలు పాటించడంలో విఫలమవుతున్నాం. భౌతికదూరం పాటించడం లేదు. మాస్క్‌లు ధరించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది..’అని పేర్కొంది. ఈ వైఖరి థర్డ్‌వేవ్‌ను మోసుకొస్తుందని హెచ్చరించింది. తగిన వైద్య సదుపాయాలు లేకపోవడం, టీకాలు వేయడంలో వెనుకబడి ఉండటం వల్ల థర్డ్‌వేవ్ వస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశముందని తెలిపింది. దేశంలోని 40 మంది నిపుణులు కూడా థర్డ్‌వేవ్ అక్టోబర్‌లో వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు, ఇతరత్రా సన్నద్ధతపై దృష్టి సారించింది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. సన్నాహాలు ఇలా.. ►పిల్లల చికిత్స కోసం నీలోఫర్ ఆస్పత్రిలో మరో వెయ్యి పడకలను అందుబాటులోకి తీసుకురావాలి. ►దాదాపు కోటిన్నర ఆర్టీపీసీఆర్, యాంటీజెన్ కిట్లను కొనుగోలు చేయాలి. ►దాదాపు 2 వేల మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలి. ►ఫైనలియర్ చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థుల సేవలనూ ఉపయోగించుకోవాలి. ఆ మేరకు వారికి శిక్షణ ఇవ్వాలి. ►ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అవసరమైన మేర ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకురావాలి. -
విషాదం: ఊపిరి పోస్తుందనుకుంటే నిలువునా ప్రాణం తీసింది
జైపూర్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెంకడ్ వేవ్ తీవ్రంగా విస్తరించడంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వినియోగం పెరిగిపోయింది. నాసిరకమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కోవిడ్ బాధితులు వాడటంతో శ్వాస సమస్యలు మరింత తీవ్రమై వారి ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. నాణ్యతలోపం కారణంగా కాన్సంట్రేటర్లు పేలిన ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పేలడంతో భార్య మృతి చెందగా, భర్త ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. సుల్తాన్ సింగ్, సంతోషి మీనా దంపతులు రాజస్తాన్‌లోని గంగాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే కోవిడ్ బారిన పడిన సుల్తాన్ సింగ్ గత రెండు నెలలుగా ఇంట్లోనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సాయంతో చికిత్స తీసుకుంటున్నాడు. సుల్తాన్ సింగ్ భార్య ఓ బాలికల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే శనివారం ఆమె పాఠశాల నుంచి ఇంటికి వచ్చి లైట్లు ఆన్ చేయడంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. భారీగా మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి సంతోషి మీనా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాపాయ స్థితితో ఉన్న సుల్తాన్ సింగ్‌ను జైపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సప్లై చేసిన దుకాణా యజమానిని విచారించగా అది చైనా నుంచి వచ్చిన సరుకని తేలింది. -
ఆక్సిజన్ సిలిండర్‌తోనే సివిల్స్: రియల్ ఫైటర్ మూగబోయింది!
తిరువనంతపురం: కేరళలో ఆక్సిజన్ సిలిండర్‌తో 2019లో సివిల్ సర్వీస్ పరీక్షలు రాసిన లతీషా అన్సారీ మృతి చెందారు. కాగా జూన్ 16 ఉదయం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. అరుదైన జన్యు పర వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించడంతో పాలా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె ఒక పక్క తీవ్రమైన వ్యాధి బాధిస్తున్నా..లెక్క చేయకుండా సివిల్స్ పరీక్షను రాసి, వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ధైర్యం మూగబోయింది. అమృతావర్షిణి అనే స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె మృతిపై అమృత వర్షిణి ఫౌండర్ లతా నాయర్ రియల్ ఫైటర్ అంటూ నివాళులర్పించారు., కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(27) పుట్టినప్పటి నుంచి టైప్–2 ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. వీటితో పాటు పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఏర్పడింది. అయినాసివిల్స్ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో సివిల్స్ ప్రాథమిక పరీక్షకు హాజరు కావడం విశేషంగా నిలిచింది. లతీషాకు ఇతర ఆసక్తులు కూడా ఉన్నాయి. అందులో కీబోర్డ్ ప్లే చేయడం. టెలివిజన్‌లో సంగీత ప్రదర్శనతో పాటుగా ఆమె యూట్యూబ్ ఛానెల్‌ను కూడా నిర్వహించేది. లతీషా కొన్ని నెలలు తాత్కాలికంగా ఒక బ్యాంకులో పనిచేసింది, కానీ ఆమె పల్మనరీ హైపర్‌టెన్షన్‌ను తీవ్రతరం కావడంతో మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. వైకల్యం ఉన్న పిల్లల కోసం ఆమె ఇంటి నుంచే ఆమె ఆన్లైన్లో క్లాసులు కూడా చెప్పేది. చదవండి: Novavax సెప్టెంబరుకే, పిల్లలపై ట్రయల్స్: సీరం కీలక ప్రకటన -
సోనూసూద్ సాయం: కరోనా బాధితుడికి కాన్సన్ట్రేటర్
తిరుమలాయపాలెం: ఓ కరోనా బాధితుడికి ప్రముఖ సినీనటుడు సోనూసూద్ ప్రాణవాయువు అందించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన రణబోతు వీరారెడ్డి(65) 25 రోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా రూ.6 లక్షలు ఖర్చు అయింది. అయినా నిత్యం ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతుండటం, చేతిలో డబ్బు లేకపోవడంతో కుమారుడు సతీశ్‌రెడ్డి వారం క్రితం తండ్రిని ఇంటికి తీసుకొచ్చాడు. ఖమ్మం నుంచి నిత్యం ఆక్సిజన్ సిలిండర్ తెచ్చేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. ఈ విషయాన్ని ఆన్లైన్ ద్వారా సోనూసూద్ ట్రస్ట్‌కు తెలియజేస్తూ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కావాలని వేడుకోగా ఐదురోజుల్లోనే సుమారు రూ.60 వేల విలువైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ను మేడిదపల్లికి పంపించారు. తమ కష్టాలకు స్పందించి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ అందించిన సోనూసూద్‌కు సతీశ్ కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: వైద్య సదుపాయాలపై మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన ఉప సంఘం -
మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ప్రమాదం
సాక్షి, చిత్తూరు: జిల్లాలోని మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. టర్ఫ్‌పెర్ల్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌లో లిక్విడ్ ఆక్సిజన్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. చదవండి: వామ్మో.. బంధువులని చేరదీస్తే ఎంత పనిచేశారు -
NATA: ఏపీకి 500 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ విరాళం
న్యూజెర్సీ: కోవిడ్ సెకండ్ వేవ్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రెండు తెలగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు నాటా(నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) ముందుకు వచ్చింది. ఈ మేరకు నాటా ప్రెసిడెంట్ డాక్టర్ రాఘవ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘వైరస్ విజృంభిస్తుండటంతో ఆస్పత్రులన్ని కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ ఉంటే.. కొందరు ఇంటి వద్దనే క్వారంటైన్లో ఉండి కోలుకోవచు. దీన్ని దృష్టిలో పెట్టుకుని.. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, పల్స్ ఆక్సిమీటర్లు, ఇతర వైద్య పరికరాలు అందించేందుకు ముందుకు వచ్చింది’’ అని రాఘవ రెడ్డి తన ప్రకటనలో తెలిపారు. నాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ ఎమెరిటస్, ప్రైమ్ హెల్త్ కేర్ అధినేత డాక్టర్ ప్రేమ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు 500 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, అవసరమైన ఇతర వైద్య సామాగ్రిని విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించారు. ప్రేమ్‌రెడ్డి ప్రైమ్ హాస్పిటల్‌కు దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 44 ఆస్పత్రులు , 300 ఔట్ పేషెంట్ల విభాగాలతో దేశంలో ఐదవ అతిపెద్ద లాభాపేక్షలేని ఆసుపత్రి వ్యవస్థగా నిలించింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో సహా వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా నాటా 250 ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు విరాళంగా ఇచ్చింది. మే 31, 2021 న 85 రెసిజన్ కాన్సట్రేటర్స్, 1400 పల్స్ ఆక్సిమీటర్లను వివిధ జిల్లాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తమకు సాయం చేసిన డాక్టర్ అరుమల్లా శ్రీధర్ రెడ్డికి, ఏపీ స్టేట్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇవి కాకుండా నాటా 165 ఆక్సిజన్ కాన్సన్ట్రెటర్స్, అదనంగా వెయ్యి పల్స్ ఆక్సిమీటర్లు, ఇతర వైద్య సామాగ్రిని సేకరించి అవసరమున్న కోవిడ్ బాధితులకు అందజేసింది. ఇవే కాక మృతదేహాల దహన సంస్కారాలు, కోవిడ్ ప్రభావంతో ఉన్న కుటుంబాలకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో సహాయపడే వివిధ అనాథాశ్రమాలు , సంస్థలకు సహాయం చేయడానికి నాటా ప్రయత్నిస్తోంది. చదవండి: ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఔదార్యం.. -
ఆటాకు ధన్యవాదాలు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తాడేపల్లి: కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సిజన్ కాన్సట్రేటర్స్‌ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించిన అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) సభ్యులకు తెలిపారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా 600 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారు. 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడేలా పంపారు. ప్రస్తుతం 50 ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ పంపారు. ఈ సాయం అందించినందుకు ఆటా సభ్యులందరికీ ధన్యవాదాలు అన్నారు వైవీ సుబ్బారెడ్డి. కరోనా కట్టడికి సీఎం జగన్ ఎంతో చేస్తున్నారు: శివ భరత్ రెడ్డి మేమంతా కలిసి తెలుగు ప్రజలకు సాయం చేయాలని నిర్ణయించాము. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మేము కూడా సాయం చేస్తున్నాము అని ఏపీ ఆటా ప్రతినిధి శివ భరత్ రెడ్డి తెలిపారు. చదవండి: ఏపీ ప్రభుత్వానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ విరాళమిచ్చిన ఆటా -
ఏపీ ప్రభుత్వానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ విరాళమిచ్చిన ఆటా
సాక్షి, అమరావతి: కోవిడ్-19 నేపథ్యంలో ఏపీకి ఆటా(అమెరికా తెలుగు అసోసియేషన్) తమ వంతు సాయం అందించింది. 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను టీటీడీ ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డికి ఆటా ప్రతినిధులు మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద అందించారు. ప్రాథమికంగా 50 కాన్సంట్రేటర్స్‌ను అందించిన ఆటా మొత్తంగా 600 కాన్ససెంట్రేటర్లను ఏపీ వ్యాప్తంగా అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఏపీ త్వరలోనే కరోనా ఫ్రీ రాష్ట్రంగా కావాలని తాము కోరుకుంటున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు భువనేష్ భుజాల, కార్యదర్శి హరిప్రసాద్ లింగల తదితరులు పాల్గొన్నారు. -
Sonu Sood: కొరియర్లో ఆక్సిజన్ సిలిండర్లు
కరోనా ఫస్ట్ వేవ్ నుంచి నటుడు సోనూసూద్ తన ఉదారతను చాటుకుంటూనే ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్‌లోనూ వివిధ రకాలుగా సాయం చేస్తున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్స్‌ను నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్న ఆయన తాజాగా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులకు భారతదేశ వ్యాప్తంగా సిలిండర్లు సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులు దేశంలోని ఎక్కడి నుంచి అడిగినా సిలిండర్ పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరం ఉన్న వారు www.umeedysonusood.com కు లాగిన్ అయితే డీటీడీసీ ద్వారా కొరియర్లు పంపనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ఉచితంగా ఆక్సిజన్ పంపిణీ చేయాలని సోనూ సూద్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. చదవండి : యాంటీ కోవిడ్ డ్రగ్స్ సెలబ్రిటీల వద్ద ఎలా ఉన్నాయి : హైకోర్టు Sonu Sood: నేనూ సోనూసూద్ అవుతా -
తండ్రి పేరుతో సుక్కు ఆక్సిజన్ ప్లాంట్, ప్రారంభించిన మంత్రి
సాక్షి, రాజోలు: కరోనా కట్టడిలో సినీ ప్రముఖులంతా భాగస్వాములు అవుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి రోజురోజుకు కరోనా కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. దీంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎర్పడి సమయాని వైద్యం అందక కోవిడ్ బాధితులు కన్నుమూస్తారు. ఈ తరుణంలో సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా ఆక్సిజన్ సిలిండర్లు పంపిణి చేస్తూ సామాన్యుల కోసం నడుంబిగిస్తున్నారు. తాజాగా దర్శకుడు సుకుమార్ సైతం తన సోంతూరు రాజోలులో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. సుకుమార్ తండ్రి బండ్రెడ్డి తిరుపతి నాయుడు పేరున ప్రభుత్వ కమ్మునిటీ హెల్త్ సెంటరులో దాదాపు 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఆక్సిజన్ యూనిట్‌ను మంగళవారం ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం సుకమార్‌కు ప్రభుత్వం తరపున మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, కలెక్టర్ మురళీధర్ రెడ్డి, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, సర్పంచ్ రేవు జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దర్శకుడు సుకుమార్ తండ్రి బండ్రెడ్డి తిరుపతినాయుడి పేరున ఏర్పాటు చేసిన ఆక్సిజన్ యూనిట్ ద్వారా ఒక నిమిషానికి ఎనిమిది లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చునన్నారు. రాజోలు ప్రభుత్వాస్పత్రిలో 10 కోవిడ్ బెడ్లు అందుబాటులో ఉన్నాయని, మరో 10 ఏర్పాటయ్యాయని చెప్పారు. మరో 10 బెడ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. సొంత ప్రాంతంపై మమకారంతో సుకుమార్ రూ.40 లక్షల సహకారం చేయడం స్ఫూర్తిదాయమన్నారు. సుకుమార్, డార్విన్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అదే విధంగా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ, నియోజకవర్గంలో మోరిలో సుబ్బాయమ్మ ఆస్పత్రి ద్వారా 100 బెడ్లు, రాజోలు ప్రభుత్వాస్పత్రిలో 20 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాజోలు ఆస్పత్రిలో కోవిడ్ వార్డును మంత్రి, కలెక్టర్ పరిశీలించారు. రోగు లు ఇబ్బందులు పడకుండా ఆక్సిజన్ అందించాలని సూపరింటెండెంట్ ప్రభాకరరావుకు సూచించారు. -
ఏపీలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు: సంతోషంగా ఉంది: మెగాస్టార్
ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కరోనా బాధితుల కోసం మెగాస్టార్ చిరంజీవి నడుంబిగించారు. ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాలకు ఆక్సిజన్ బ్యాంకులు ఎర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తరలిస్తున్న వీడియోను చిరంజీవి ట్విటర్లో షేర్ చేశారు. ‘అనుకున్న ప్రకారం వారం రోజుల్లోనే వందల సంఖ్యల్లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు సంపాదించాం. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో బుధవారం నుంచి ‘చిరు ఆక్సిజన్ బ్యాంక్’ సేవలు ప్రారంభమవుతున్నాయి. గురువారం నుంచి ఖమ్మం, కరీంనగర్ జిల్లాలతో పాటు మరో ఐదు జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ఆక్సిజన్ సిలిండర్లు సంపాదించడానికి రామ్‌చరణ్ కూడా ఎంతో కృషి చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది. సమయానికి ఆక్సిజన్ దొరక్క ఇక ఎవరు ఇబ్బందిపడకూడదు’ ఆయన చెప్పుకొచ్చారు. కాగా కరోనా కారణంగా చాలా చోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో స్వయంగా తానే ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని కొన్ని రోజుల క్రితం చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఆక్సిజన్ బ్యాంకులను ఆయా జిల్లాల చిరంజీవి అభిమానల సంఘాల అధ్యక్షులు నిర్వాహకులుగా వ్యవహరిస్తారని రామ్ చరణ్ ప్రకటించారు. చదవండి: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి జిల్లాలోనూ.. -
కరోనా బాధితులకు సింగర్ స్మిత ఆక్సిజన్ సాయం
దేశ వ్యాప్తంగా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ పడకల కొరత ఏర్పడింది. దీంతో ఆక్సిజన్ కోరతతో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే నటుడు సోను సూద్ ఫౌండేషన్స్ ఏర్పాటు చేసిన దానికి ద్వారా బాధితులకు మందులు, ఆక్సిజన్, వ్యాక్సిన్ పంపిణి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి సైతం ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పాప్ సింగర్ స్మిత సైతం కరోనా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. గతంలో తను స్టాపించిన ఏఎల్‌ఏఓతో (ALAO) పాటు పలు స్వచ్చంద సంస్థల ద్వారా ఆమె వివిధ ప్రాంతాల్లోని కోవిడ్ కేర్ సెంటర్లకు 100 ఆక్సిజన్ పడకలను అందించారు. స్వయంగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేగాక ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ స్మిత ట్వీట్ చేశారు. Happy to share that Vijayawada now has a very comfortable Covid care center with 100 oxygen beds & medical teams at #VenueConvention by Sujana foundation. Adding another 100 oxygen beds frm team #EOAPforOOPIRI & #ALAIfoundation by this week. Contact: 91 97019 99962 Pls RT & share pic.twitter.com/BEzBQqxrLq — Smita (@smitapop) May 17, 2021 అలాగే దర్శకుడు సూకుమార్ సైతం కోవిడ్ బాధితుల కోసం శాశ్వత ప్రతిపాదికన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. తన స్వస్థలమైన కాకినాడ దగ్గర రాజోలు గ్రామంలో40 లక్షల రూపాయలతో డీఓసీఎస్ 80 ఆక్సిజన్ జనరేటర్ సిస్టమ్ ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమలోని కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించేందుకు ఆయన ఇప్పటికే ముందుకు వచ్చారు. -
కాలిబూడిదైన అంబులెన్స్.. తృటిలో తప్పిన ప్రమాదం
చెన్నై: తమిళనాడులోని కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రి వద్ద శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్లు మారుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మిగతా సిలిండర్లను అక్కడినుంచి తరలించారు. అయితే అప్పటికే అంబులెన్స్‌కు మంటలు అంటుకోవడంతో పూర్తిగా కాలిపోయింది. ఈ సమయంలో అంబులెన్స్‌లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ప్రమాదం జరిగే కొన్ని నిమిషాల ముందే అంబులెన్స్‌లో కోవిడ్ రోగులను ఆసుపత్రికి తీసుకొచ్చారు. కోవిడ్ రోగులను కరోనా వార్డుకు పంపిన వెంటనే సిబ్బంది వచ్చి ఆక్సిజన్ సిలిండర్ మారుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిలిండర్ మారుస్తున్న సమయంలో గ్యాస్ లీకవడంతో పాటు అంబులెన్స్‌లో షార్ట్ సర్య్కూట్ చోటుచేసుకోవడంతో ఇది జరిగి ఉండొచ్చని సిబ్బంది వాపోయారు. అయితే ఆసుపత్రి రీజనల్ మెడికల్ ఆఫీసర్ మాత్రం ఈ ఘటనపై ఏం స్పందించలేదు. మరోవైపు తమిళనాడులో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గకపోవడంతో ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తున్నట్లు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: covid: డబ్బులు ఇస్తేనే నీ భర్త మృతదేహం.. -
చిరంజీవి కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి జిల్లాలోనూ..
Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న కొనసాగుతుంది. రోజుకి వేలల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో కొందరు కరోనా తో చనిపోతే.. మరికొందరు సమయానికి ఆక్సిన్ అందక మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విటర్ వేదికగా అఫీషియల్ స్టేట్మెంట్ను విడుదల చేసింది. వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు, నిర్వహణను హీరో రామ్ చరణ్ చూసుకోనున్నట్లు తెలుస్తోంది. చిరు ఇప్పటికే ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రక్తం దొరక్కుండా ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998వ సంవత్సరంలో ఈ బ్లడ్ బ్యాంక్‌ని స్థాపించాడు. -
ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ఔదార్యం..
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ గత 53 ఏళ్లుగా ప్రవాస భారతీయుల సంక్షేమానికి కోసం పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ అండగా నిలుస్తోంది. అయితే భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగసామ్యం కావడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు కరోనా బాధితులకు అవసరమయ్యే సుమారు రూ.10 లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్స్‌ని ఢిల్లీలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి పంపించింది. భారత దౌత్య కార్యాలయ విజ్ఞప్తి మేరకు ఎమిరేట్స్ విమానయాన సంస్థ ఈ ఆక్సిజన్ సిలిండర్స్‌ని ఉచితంగా ఇండియాకు రవాణా చేసింది. ఎమిరేట్స్ విమానయాన సంస్థకి యూఏఈలో నివసిస్తున్న ప్రవాసీ భారతీయులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆ సంస్థ సంక్షేమ కార్యదర్శి రాజా శ్రీనివాసరావు అన్నారు. రానున్న రోజుల్లో మరింత సహాయం అందిస్తామని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జోజో అంబూకేన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధ్యక్షుడు జార్జ్ వర్గీస్, క్రీడా కార్యదర్శి ఫ్రెడ్డీ జె. ఫెర్నాండెజ్, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సి. జార్జ్ వర్గీస్, జనరల్ మేనేజర్ రాజు పాల్గొన్నారు. (చదవండి: TikTok: నేను మరీ అంత సోషల్ కాదు.. సీఈఓగా ఉండలేను) -
Ram Charan : స్నేహితుడిపై రామ్ చరణ్ ప్రశంసలు
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అయితే వీరిలో కొంతమంది కరోనాతో మరణిస్తే.. మరికొంత మంది సమయానికి ఆక్సిజన్ అందక చనిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పలువురు ప్రముఖలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. కోవిడ్ బాధితుల కోసం విదేశాల నుంచి ఆక్సిజన్ రప్పించి, కొంతమందికి ఊపిరి పోస్తున్నారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్నేహితుడికి చెందిన గ్రీన్ కో సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించింది. చైనా నుంచి తెప్పించి వాటిని ప్రభుత్వానికి అందించారు. దీనిపై రామ్ చరణ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘ప్రభుత్వానికి 1000కి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తున్న నా స్నేహితుడి సంస్థ గ్రీన్కో గ్రూపునకు కుడోస్. కరోనా సవాల్ విసురుతున్న ఇలాంటి కష్ట సమయాల్లో దేశంలోని ప్రభుత్వాసుపత్రులకు సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించడం గొప్ప విషయం’ అని చరణ్ ట్వీట్ చేశారు. Kudos to #Greenko Group - a dear friend’s renewable energy firm for donating over 1000 O2 concentrators & cylinders to Govt. Hospitals across multiple states in India during these challenging times. pic.twitter.com/m4oNmPa53O — Ram Charan (@AlwaysRamCharan) May 17, 2021 -
దేశంలో కోవిడ్ దృష్ట్యా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు భారీగా డిమాండ్
-
ఎస్పీ చొరవతో సకాలంలో చేరిన ఆక్సిజన్ ట్యాంకర్
అనంతపురం : అనంతపురం జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు చొరవతో ఆక్సిజన్ ఇబ్బందులకు చెక్ పడింది. బళ్లారి నుంచి అనంతపురం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటైంది. అయితే పోలీసు ఎస్కార్ట్‌తో కర్ణాటక లోని జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ కేవలం 3 గంటల్లోనే అనంతపురానికి చేరేలా ఎస్పీ సత్యయేసుబాబు చర్యలు తీసుకున్నారు. బళ్లారి నుంచి అనంతపురం దాకా దారి పొడవునా పోలీసులను అప్రమత్తం చేసిన ఎస్పీ.. ఆక్సిజన్ ట్యాంకర్ సాఫీగా వెళ్లేలా ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఎక్కడా నిర్లక్ష్యం లేకుండా ఆక్సిజన్ ట్యాంకర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎస్పీ చొరవతో సకాలంలో ఆక్సిజన్ ట్యాంకర్ అనంతపురానికి చేరుకుంది. దీంతో జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు ఊరట కలిగింది. -
‘‘ఆక్సిజన్ కావాలా.. రూమ్‌కి వచ్చి నాతో గడుపు’’
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మనుషులతో పాటు మానవత్వాన్ని మింగేస్తుంది. ఓవైపు ప్రజలు కోవిడ్‌తో అల్లాడుతుంటే.. దీన్ని అదునుగా తీసుకుని కొందరు మనుషులు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. వైరస్ విజృంభిస్తోన్న వేళ ఆక్సిజన్ సిలిండర్, అంబులెన్స్, కొన్ని ఔషధాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దాంతో కొందరు వ్యక్తులు ఏమాత్రం జాలి, దయ లేకుండా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ.. జలగల్లా జనాల రక్తాన్ని పీలుస్తున్నారు. మరి కొందరు నీచులు అంతటితో ఆగక మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. అపత్కాలంలో ఆడవారు సాయం కోరితే దాన్ని అదునుగా తీసుకుని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. విచారకరమైన అంశం ఏంటంటే కొన్ని చోట్ల బాధితులకు ఎంతో కాలంగా తెలిసిన వారు.. మంచి వారుగా ముద్ర వేయించుకున్న వారు ఇలా ప్రవర్తించడం. తాజాగా ఓ ట్విట్టర్ యూజర్ ఇలాంటి సంఘటన గురించి ట్వీట్ చేయగా ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిని ఆ సంఘటన ఆ వివరాలు.. సదరు ట్విట్టర్ చేసిన ట్వీట్లో ‘‘నా స్నేహితుడి సోదరి తండ్రి కోవిడ్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో బాధితురాలు.. చిన్నతనం నుంచి తనను సోదరిగా భావించిన పొరుగింటి వ్యక్తికి తన పరిస్థితిని వివరించి.. సాయం చేయాల్సిందిగా కోరింది. దానికి అతడు ‘‘తప్పకుండా హెల్స్ చేస్తాను. అందుకు బదులుగా నువ్వు నాతో శృంగారానికి ఒప్పుకోవాలి. నా గదికి వచ్చి గడిపితే.. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేస్తాను’’ అన్నాడు. అతడి మాటలు విని బాధితురాలు షాక్ అయ్యింది. చిన్నతనం నుంచి తనను చెల్లి అని పిలిచిన వ్యక్తి ఇంత నీచుడా అనుకుని ఎంతో ఆవేదన చెందింది’’ అంటూ వెల్లడించి.. ‘‘ఇలాంటి వారిని ఏం చేయాలో చెప్పండి’’ అని నెటిజనులను కోరాడు సదరు ట్విట్టర్ యూజర్. ఈ ట్వీట్‌పై ‘‘వెంటనే అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయండి’’ అని కొందరు సూచించగా.. మరి కొందరు ‘‘సదరు అపార్ట్మెంట్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లండి’’ అనగా.. మరి కొందరు ‘‘అతడి పేరు, ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. పబ్లిక్‌గా పరువు తీస్తే తప్ప ఇలాంటి వారికి బుద్ధి రాదు’’ అని కామెంట్ చేస్తున్నారు. ఇక గతంలో ముంబైకి చెందిన ఓ మహిళ ప్లాస్మా కావాలి.. దాతలు సంప్రదించాల్సిందిగా కోరుతూ.. తన పర్సనల్ నంబర్ ఇవ్వడంతో ఎంత టార్చర్ అనుభవించిందో ట్విట్టర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: ఛీ.. ఛీ: ప్లాస్మా కోసం సోషల్ మీడియాలో నంబర్ షేర్ చేస్తే.. -
ఆక్సిజన్ కొరత.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాతృత్వం
సాక్షి, కృష్ణా: ఆంధప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.మరోవైపు కోవిడ్ బాధితులకు ఆక్సిన్ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాతృత్వం చాటకున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు వంశీ చేయూతనందించారు. రూ.30 లక్షల విలువైన 70 ఆక్సిజన్ సిలిండర్లు వితరణ చేశారు. చిన్నఅవుటపల్లి పిన్నమనేని సిద్దార్థ కోవిడ్ ఆస్పత్రికి వీటిని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది హాస్పిటల్ యాజమాన్యానికి ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తోట వెంకయ్య,అనగాని రవి,అన్నవరపు ఎలిజబెత్ రాణి,మేచినేని బాబు,గొంది పరందమయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆక్సిజన్ బెడ్ల కోసం రామ్‌కో సిమెంట్ రూ.20 లక్షల విరాళం ప్రటించింది. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు విరాళం అందజేశారు. చదవండి: నా అక్కచెల్లమ్మలైన నర్సులందరికీ కృతజ్ఞతలు: సీఎం జగన్ -
ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ
-
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి..ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై లేఖలో ప్రస్తావించారు. ఏపీకి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజెన్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా కోరారు. ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్న అది ఏమాత్రం సరిపోవడం లేదని తెలిపారు. 20 ఆక్సిజన్ ట్యాంకర్లను ఏపికి మంజూరు చేయాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామని అది సరిపోవడం లేదన్నారు. మోదీకి జగన్ రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే.. ►ఈనెల 10న చెన్నై, కర్ణాటక నుంచి రావాల్సిన ఆక్సిజన్ ఆలస్యమైంది. ఆక్సిజన్ రావడం ఆలస్యమవ్వడంతో తిరుపతిలో 11 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ►ప్రస్తుతం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్న...20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 150 మెట్రిక్ టన్నులకు పెంచాలని లేఖలో ప్రస్తావించారు. ►ప్రస్తుతం ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్న...210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను 400 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. ►భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు... టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని లేఖలో తెలిపారు. ►పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలంటే టెక్నాలజీ బదిలీ తప్పనిసరి. వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి...ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలు సహకరించాయి ►ఇతర వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీలకు టెక్నాలజీని అందించే విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రధాని మోదీని కోరిన సీఎం వైఎస్ జగన్ ►దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయొచ్చన్న సీఎం ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరాపై ప్రధానికి సీఎం వైయస్ జగన్ లేఖ pic.twitter.com/4SPNirvZCN — YSR Congress Party (@YSRCParty) May 11, 2021 కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి భారత్ బయోటెక్ నుండి ఇతర సంస్థలకూ టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలంటూ ప్రధానికి సీఎం శ్రీ వైయస్ జగన్ లేఖ pic.twitter.com/LLhnSpONlY — YSR Congress Party (@YSRCParty) May 11, 2021 -
రైనాకు సాయం చేసిన సోనూసూద్
ముంబై: బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా విపత్కర పరిస్థితుల్లో తనకు తోచిన సాయం చేస్తూ రియల్ హీరోగా అనిపించుకున్నాడు.కొవిడ్ బాధితులు దేశంలో ఎక్కడ ఉన్నా వారికి అవసరమైన ఆర్థిక, వైద్య సాయం చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు సాయం చేసి పెద్ద మనసు చాటుకున్నాడు. విషయంలోకి వెళితే.. రైనా తన బంధువు ఒకరు ఆక్సిజన్ కొరతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రైనా తన ట్విటర్లో పంచుకున్నాడు. ‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా ఆక్సిజన్ సిలిండర్ కావాలి. ఆమె వయసు 65ఏండ్లు. ఆమె తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. రైనా ట్వీట్‌కు వెంటనే స్పందించిన సోనూ సూద్ మొదట 'రైనా బాయ్.. వివరాలు పంపండి అని ట్వీట్ చేశాడు. రైనా వివరాలు పంపిన తర్వాత కాసేపటికే..'' 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్ అక్కడికి చేరుకుంటుంది భాయ్ అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా ఈ మధ్యనే కరోనా పాజిటివ్‌గా తేలిన సోనూసూద్ అంత కష్టంలోనూ తన సాయం మాత్రం విడువలేదు. ఇక కరోనా నుంచి కోలుకున్న సోనూ కష్టాల్లో ఉన్నవారికి తన సాయాన్ని అందిస్తూనే ఉన్నాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్‌కు దూరంగా ఉన్న రైనా.. ఈ ఏడాది సీజన్లో మాత్రం బరిలోకి దిగాడు. సీఎస్కే తరపున ఆడుతున్న రైనా.. 7 మ్యాచ్‌లాడి ఒక హాఫ్ సెంచరీ సాయంతో 123 పరుగులు సాధించాడు. ఇక రైనా గతేడాది ఆగస్టు 15న ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నాట్లు ప్రకటించాడు. చదవండి: అందరూ సేఫ్‌గా వెళ్లాకే నేను ఇంటికి పోతా! Urgent requirement of an oxygen cylinder in Meerut for my aunt. Age - 65 Hospitalised with Sever lung infection. Covid + SPO2 without support 70 SPO2 with support 91 Kindly help with any leads.@myogiadityanath — Suresh Raina🇮🇳 (@ImRaina) May 6, 2021 Oxygen cylinder reaching in 10 mins bhai. ☑️@Karan_Gilhotra @SoodFoundation https://t.co/BQHCYZJYkV — sonu sood (@SonuSood) May 6, 2021 -
ఆస్పత్రిలో కరోనా బాధితులు.. పారిపోయిన డాక్టర్లు, స్టాఫ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ బాధితుల్ని రక్షించేందుకు డాక్టర్లు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నారు. అదే డాక్టర్లు కరోనా బాధితులకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా పారిపోవడం కలకలం రేపుతోంది. ఐదురోజుల క్రితం ఢిల్లీ గూర్గావ్ చెందిన కృతి ఆస్పత్రిలో గత శుక్రవారం రాత్రి ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. మరో ముగ్గురు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారితో పాటు మరికొంత మంది కరోనా బాధితులు నార్మల్ వార్డ్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోవడంతో డాక్టర్లు, సిబ్బంది కరోనా పేషెంట్లను వదిలేసి పారిపోయారు. అయితే రోజులు గడుస్తున్నాయి. డాక్టర్లు ఎవరూ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో అనుమానంతో కరోనా బాధితులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, మీడియా ప్రతినిధుల సాయంతో ఆస్ప్రత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐసీయూ బెడ్ల మీద కరోనా బాధితులకు బదులు డెడ్ బాడీలున్నాయి. అదే సమయంలో ఓ వ్యక్తి చనిపోయారు..చనిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కేకలు వేయడం హృదయవిదారక దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి మరో బాధితుడి కుటుంబసభ్యుడు ఆస్పత్రిలోని అన్ని వార్డ్‌లను చెక్ చేస్తూ డాక్టర్లు లేరు. సిబ్బంది ఎవరూ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా పేషెంట్లను ఇలా వదిలేసి వెళ్లడానికి వీళ్లకి మనసెలా వస్తుంది. వాళ్ల కుటుంబసభ్యులు చనిపోతే ఆ బాధ వాళ్లకు తెలుస్తుందని పోలీసులతో చెబుతున్నాడు. ఆక్సిజన్ కొరత ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన మేనల్లుడు ప్రాణాలు పోయాయని ఓ వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు.'నా మేనల్లుడి కోసం మూడు సిలిండర్లు తెచ్చాను. ఆ సిలిండర్లలో ఆక్సిజన్ అయిపోవడంతో నా మేనల్లుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 40 ఏళ్ల నా తమ్ముడికి కరోనా సోకింది. అయినా అతను చాలా ఫిట్ గా ఉన్నాడు. ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయాడు. డాక్టర్లు టైమ్‌కి రెస్పాండ్ అయ్యింటే బ్రతికే వాడని అన్నాడు. ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్ స్వాతి రాథోడ్ మాట్లాడుతూ.. గత శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోతున్నాయని సిబ్బంది ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా కరోనా బాధితుల్ని మరో ఆస్పత్రికి తరలించాలని వారి బంధువులకు సమాచారం అందించాం. కానీ వాళ్లు పట్టించుకోలేదు. అందువల్లే రాత్రి 11గంటల సమయంలో ఆరుగురు కరోనా బాధితులు మరణించారు అని డాక్టర్ స్వాతి వెల్లడించారు. గవర్నమెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కృతి ఆస్పత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ ఆస్పత్రి కోవిడ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆస్పత్రుల జాబితాలో లేదు. అయినా ట్రీట్మెంట్ ఇస్తామని బాధితుల్ని ఎందుకు జాయిన్ చేయించుకున్నారు. పైగా ఆస్పత్రిలో రోగులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్లు అనారోగ్యం వల్ల మరణించారా? లేదంటే ఆక్సిజన్ కొరత వల్ల మరణించారనేది విచారణలో తేలుతుంది. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ అన్నారు. చదవండి : వైరల్: మమ్మీ... ప్లీజ్ కాస్త మెల్లిగా వేయండి! -
ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తోన్న యువ బృందం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రాణవాయువు కోసం పలువురు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో 250 మంది సభ్యులున్న ఓ యువ బృందం మిషన్-ఆక్సిజన్ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. అలా సేకరించిన డబ్బులతో దేశ వ్యాపంగా ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక.. ఆక్సీజన్ సిలిండర్లు లేక కరోనా బాధితులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారికి అండగా నిలబడుతున్న 'మిషన్-ఆక్సిజన్' గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మేం ఈ మిషన్‌ను ప్రారంభించేనాటికి 100 ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేయాలనుకున్నాం. సోషల్ మీడియా ద్వారా వెంటనే దానికి నిధులు సేకరించాం. అయితే మేం ఊహించిన దాని కంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మేం ఇది ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఆక్సిజన్ సిలిండర్లు కావాలని కొన్నివేల వినతులు వచ్చాయి. ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్ ఇలా సామాజికి మాధ్యమాలను ఉపగయోగించుకొని ఫండింగ్ చేపట్టాం. దాదాపు 3900 సిలిండర్లను తక్షణ సాయం కింద చైనా నుంచి తెప్పిచ్చాం. ఇప్పటికే వివిధ ఆసుపత్రులకు వీటిని పంపిస్తున్నాం. మేం ప్రారంభించిన ఈ మిషన్ 100 శాతం లాభాపేక్షలేని, ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రమే. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ సహా పలువురు ప్రముఖులు తమ వంతుగా ముందుకు వచ్చి సహాయం చేశారు. ఏప్రిల్ 29న ప్రారంభించిన ఈ మిషన్ ద్వారా ఇప్పటికే 15కోట్ల నిధులను సేకరించి వాటి ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు అందించగలిగాం. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు మా సేవలు అందిస్తున్నాం. ఇందుకోసం డీజీ, బిఎస్ఎఫ్, మేజర్ జనరల్ (హెచ్‌క్యూ), ఇండియన్ ఆర్మీ, ఛైర్మన్ ఇఎస్ఐసి, డైరెక్టర్లు /మెడికల్ సూపరింటెండెంట్లు సహా వివిధ ప్రభుత్వ అధికారులతో మేం నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. నిజంగా అవసరం ఉన్న చోట ప్రభుత్వ అధికారులతోనూ అందుకు తగ్గ వాస్తవాలు తెలుసుకొని పూర్తి పారదర్శకతతో దీన్ని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చాలామంది ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరికీ మా మిషన్ ద్వారా మీరు సహాయం చేయగలరా? మీరు అందించే చిన్న సహాయం అయినా ఎంతో మంది ప్రాణాలను నిలబెబుతుంది. గూగుల్ పే లేదా ఏదైనా డిజిటల్ చెల్లింపుల ద్వారా మీరు మాకు ఫండ్స్ పంపొచ్చు. పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతున్నాం. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా మా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎప్పటికప్పుడు మీరు నేరుగా అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇది పూర్తి పారదర్శకతతో, నిస్వార్థంగా చేస్తోన్న ఓ ఉద్యోమం. ఇందులో మీరు కూడా భాగస్వాములు అవుతారా? ప్రాణ వాయువు కోసం అల్లాడిపోతున్న ప్రాణాలను మీ వంతు సహాయం చేసి రక్షించగలరా? మీరు ఇవ్వాలనుకునే ఫండింగ్‌ను డైరెక్ట్ క్యూఆర్ స్కాన్ ద్వారా మాకు పంపొచ్చు. -
ఆదాయం... సహాయం
‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్ర నిర్మాతలు ఆదర్శనీయమైన ఓ మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సినిమా విడుదల ద్వారా లభించే ఆదాయంలో కొంత మొత్తాన్ని కరోనా బాధితుల వైద్య సేవలకు వినియోగించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘గివ్ ఇండియా’ సంస్థతో అసోసియేట్ అయి, కోవిడ్ బాధితులకు అవసరమయ్యే ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్స్, వెంటిలేటర్స్ వంటి పరికరాల కొనుగోలుకు తాము సహాయం చేస్తున్నట్లు ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ నిర్మాతలు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్, ఆయన సోదరుడు సోహైల్ ఖాన్, బావ అతుల్ అగ్నిహోత్రి, నిఖిల్ నిర్మించారు. ఈ సినిమా విడుదల హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. ‘‘ఈ నెల 13న మల్టీ ప్లాట్‌ఫామ్స్ (ఓటీటీ, డీటీహెచ్ ఆపరేటర్స్, థియేటర్స్...)లో మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమాకు ఆదాయం వస్తే అందులో కొంత కోవిడ్ బాధితుల సహాయార్థం వినియోగిస్తాం. కోవిడ్ బాధితుల కోసం మరింతమంది సహాయం చేయాల్సిన అవసరం ఉంది’’ అని జీ స్టూడియోస్ ప్రతినిధులు వెల్లడించారు. -
Sonu Sood: ప్రాణం పోసిన సోనూసూద్ ట్రస్ట్
యలహంక: ఆక్సిజన్ నిల్వలు ఖాళీ కావడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న కరోనా రోగులకు సోనూసూద్ చారిటబుల్ ట్రస్టు సకాలంలో ప్రాణవాయివు అందించి ప్రాణాలు నిలిపింది. బెంగళూరులోని యలహంక వద్ద ఆర్క ప్రైవేటు ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా మార్పు చేశారు. ఇక్కడ 15 మందికి పైగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయి. ఓ మహిళా బాధితురాలి సోదరుడు అనిల్ గుర్తించి ఆస్పత్రి సిబ్బందిని అలర్ట్ చేశాడు. దీంతో యాజమాన్యం యలహంక న్యూటౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సత్య నారాయణ అక్కడికి సమీపంలోని సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించగా 11 ఆక్సిజన్ సిలిండర్లను బైక్‌లు, కార్లలో ఆస్పత్రికి పంపగా ఆక్సిజన్ వ్యవస్థను పునరుద్ధరించారు. అయితే, అప్పటికే ఇద్దరు మహిళలు మృతి చెందగా 13 మంది ప్రాణాపా యస్థితి నుంచి బయట పడ్డారు. సకాలంలో ఆక్సిజన్ అందించిన ట్రస్టు సభ్యులు అశ్మత్, రాధిక, రాఘవ్‌లకు ఆస్పత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేసింది. -
రహానే, పాండ్యా బ్రదర్స్ ఉదారత.. భారీ మొత్తంలో
ఢిల్లీ: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. కరోనాపై పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు.ఇప్పటికే పాట్ కమిన్స్, బ్రెట్ లీ, సచిన్, శిఖర్ ధావన్, జయదేవ్ ఉనద్కత్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అజింక్య రహానేతో పాటు పాండ్యా బ్రదర్స్ ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా అందించి తమ ఉదారతను చాటుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రహానే 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను మిషన్ వాయు అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వగా.. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న కృనాల్, హార్దిక్ పాండ్యాలు 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను రూరల్ ఇండియాకు విరాళంగా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో రహానె చేసిన సాయానికి మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ను మహారాష్ట్రలోని అత్యంత కరోనా ప్రభావిత ప్రాంతాలకు వీటిని పంపుతామని ప్రకటించింది. ‘మిషన్ వాయుకు 30 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందించిన రహానేకు ధన్యవాదాలు. మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న జిల్లాలకు వీటిని అందజేస్తామని’ ట్వీట్ చేసింది. కరోనా సెకండ్ వేవ్‌తో దేశంలో ప్రతిరోజూ 4లక్షలకు పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. -
నైట్రోజన్ యంత్రాలతో ఆక్సిజన్ ఉత్పత్తి!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించేందుకు ఐఐటీ బాంబే శాస్త్రవేత్తలు వినూత్నమైన పరిష్కారం కనిపెట్టారు. నైట్రోజన్ వాయువును కేంద్రీకరించే యంత్రాన్ని ఆక్సిజన్ కాన్సంట్రేటర్గా మార్చారు. నమూనా యంత్రం ఇప్పటికే విజయవంతంగా పరీక్షలు ముగించుకుంది. ‘ప్రెషర్ స్వింగ్ అడ్సాప్షన్’(పీఎస్ఏ) టెక్నాలజీ తోనే ఈ యంత్రం పనిచేస్తుంది. ఈ యంత్రంతో వాతావరణ పీడనానికి 3.5 రెట్లు ఎక్కువ పీడనంతో, 93 నుంచి 96 శాతం స్వచ్ఛతతో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు.. జియోలైట్ అనే పదార్థం సాయంతో నైట్రోజన్, ఇతర వాయువులను తొలగించి ఆక్సిజన్‌ను కేంద్రీ కరిస్తుంది. నైట్రోజన్‌ను కేంద్రీకరించే యంత్రాల్లో జియోలైట్ స్థానంలో కార్బన్‌ను ఉపయోగిస్తారు. దేశంలోని నైట్రోజన్ ప్లాంట్లను ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చగలిగితే సులువుగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చని పరిశోధన లకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మిలింద్ ఆత్రే తెలిపారు. చదవండి: కాన్సన్ట్రేటర్లకు ఎందుకంత డిమాండ్ ? రెమిడెసివర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం -
నిలుస్తున్న ప్రాణాలు..భిల్వారా మోడల్ అంటే ఏమిటి?
జైపూర్: ఓ వైపు కరోనా సెకండ్ వేవ్.. మరోవైపు ఆక్సిజన్ అందక ఎంతోమంది అభాగ్యులు తమ ప్రాణాల్ని కోల్పోతున్నారు. అయితే ఈ ఆపత్కాలంలో భిల్వారా మోడల్ సాయంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమే కాకుండా, ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని రక్షించుకోవచ్చు. ఈ స్ట్రాటజీని ఉపయోగించే రాజస్థాన్ లోని 8 వేల మంది కరోనా బాధితులకు ఆక్సిజన్ అందించి ప్రాణాల్ని నిలబెట్టడం ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఇలా మొదలైంది.. గతేడాది భిల్వారా జిల్లాలో 430 పడకలున్న మహత్మాగాంధి ఆస్పత్రిలో 300 బెడ్లు కరోనా బాధితులతోనే నిండిపోయాయి. ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు లేక స్ట్రెచ్చర్ల మీద, కారిడార్లలో వైద్యం కోసం నిరీక్షిస్తూ పేద కుటుంబాలు పడిగాపులు కాస్తూ కనపడ్డాయి. అయితే ఆ సమయంలో బెడ్ల సంగతి పక్కనపెడితే.. ఆక్సిజన్ సరఫరా చేస్తే కరోనా నుంచి బాధితులను రక్షించవచ్చని గాంధీ ఆస్పత్రి వైద్యులు భావించారు. వెంటనే ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని రాజస్థాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్యుల సలహాతో ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. కరోనా మొదటి దశ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఆక్సీజన్ ప్లాంట్ ఇప్పుడు రాజస్తాన్‌లో 8 వేల మంది కరోనా బాధితులకు ప్రాణవాయువు అందిస్తోంది. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్ డాక్టర అరుణ్ గౌర్ మాట్లాడుతూ.. ‘కరోనా వ్యాధిగ్రస్తుల్ని రక్షించాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. బెడ్ల లేవని గాబరా పడేకంటే.. బాధితులకు సత్వరం ఆక్సీజన్ అదించడం ముఖ్యం. గతేడాది అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సీఎం అశోక్ గహ్లోత్ ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకుంటోంది. కరోనా బాధితులు పెరుగుతున్నప్పటికీ అందరికీ ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నాం. ప్రస్తుతం మేము సొంతంగా ఏర్పాటు చేయించిన ఫ్లాంట్ లో ప్రతిరోజు 100 ఆక్సిజన్ సిలిండర్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర ఆక్సిజన్ ఫ్లాంట్ల నుంచి సిలిండర్లను తెప్పించుకుంటున్నాము. గతంలో మా ఆస్పత్రిలో 30 నుంచి 40 ఆక్సిజన్ సిలిండర్లను వినియోగించే వాళ్లం. ఇప్పుడు 400 నుంచి 450 సిలిండర్లను ఉపయోగించాల్సి వస్తుంది. వీటిలో 100 సిలిండర్ల వరకు సొంత ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన వాటినే వినియోగించుకుంటున్నాం. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలుతున్నాం ’ అని అరుణ్ గౌర్ పేర్కొన్నారు. (చదవండి: రాజస్థాన్ సీఎంకు కరోనా పాజిటివ్) -
శభాష్ ప్యారే ఖాన్: రూ.కోటితో ఆక్సిజన్ ట్యాంకర్లు
నాగపూర్: కరోనాతో అల్లాడుతున్న నాగపూర్ ఆస్పత్రులకు నగరానికి చెందిన ప్యారే ఖాన్ ఉదారతతో ఆక్సిజన్ అందే ఏర్పాట్లు చేశారు. ట్రాన్స్పోర్ట్ కంపెనీ అధిపతైన ఖాన్ నగరానికి 20 ఆక్సిజన్ ట్యాంకర్లను సొంత డబ్బును వెచ్చించి తెప్పించారు. ఇందు కోసం ఆయన దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశారు. పవిత్ర రంజాన్ ఆరంభమైందని, ఈ సందర్భంగా తనవంతు బాధ్యతగా చేయాల్సిన జకాత్ (దాక్షిణ్య కార్యక్రమాలు)కు సొమ్ములిచ్చే బదులు అవే డబ్బులను రోగుల కోసం ఆక్సిజన్‌ను తెప్పించేందుకు ఉపయోగిం చాలని నిర్ణయించానని ఖాన్ తెలిపారు. తొలుత ఆయన బెంగుళూరు నుంచి అధిక ధర వెచ్చించి ట్యాంకర్లు తెప్పించారు. అనంతరం నాగపూర్ ఎంపీ నితిన్ గడ్కరీ సాయంతో విశాఖపట్నం నుంచి ట్యాంకర్లను తెప్పించామని తెలిపారు. ఇవేకాకుండా ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో 116 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల ఏర్పాటుకు రూ.50 లక్షలు విరాళమిచ్చినట్లు తెలిపారు. ఖాన్ సాయాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ కొనియాడారు. చదవండి: లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ ప్లాంట్లు -
కరోనా విలయ తాండవం.. తళపతి విజయ్ ఔదార్యం
కరోనా మరోసారి పంజా విసిరిన నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులకు చేయూత నివ్వడానికి నేనున్నానంటూ నటుడు విజయ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే కార్మికులకు అవసరమైన మాస్కులను సాయంగా అందించారు. విజయ్ ఆదేశాలతో ఆయన కార్యదర్శి బుస్సీ ఎన్.ఆనంద్ సలహా మేరకు కడలూరు జిల్లా నిర్వాహకుడు శీను, కడలూరు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్బాస్ మంగళవారం సేవల్లో నిమగ్నమయ్యారు. కార్యక్రమంలో కడలూరు తూర్పు జిల్లా విభాగం అధ్యక్షుడు రాజ్‌కుమార్, పశ్చిమ జిల్లా కార్యదర్శి రాజేష్, విరుదాచలం నగర అధ్యక్షుడు వాసు, జిల్లా నిర్వాహకుడు శక్తివేల్, నటుడు విజయ్ ప్రజా సంఘానికి చెందిన వారు పాల్గొన్నారు. వీఓ రూ. 2 కోట్లు.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రోగులకు తమ వంతుసాయం అందించేందుకు వీఓ ఇండియా ముందుకు వచ్చింది. రూ. 2 కోట్ల విరాళాన్ని ఆ సంస్థ డైరెక్టర్ నిపున్ మరియ బుధవారం ప్రకటించారు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సాయం ప్రకటంచడమే కాకుండా, 9 లక్షల మాస్క్‌లు, 15 వేల పీపీఈ కిట్లు, 50 వేల లీటర్ల శానిటైజర్లను పంపిణీ చేశారు. -
బ్యాంకాక్ నుంచి భారత్‌కు ఆక్సిజన్ ట్యాంకర్లు
న్యూఢిల్లీ: థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్ నుంచి భారత్‌కు నాలుగు ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇవి గుజరాత్‌లోని జామ్ నగర్‌కి బుధవారం సాయంత్రం చేరుకున్నట్లు అధికా రులు వెల్లడించారు. మరోవైపు సింగపూర్ నుంచి రెండు సీ–130 ఎయిర్ క్రాఫ్ట్‌ల ద్వారా 256 ఆక్సిజన్ సిలిండర్లు పశ్చిమబెంగాల్లోని పనాగఢ్‌కు చేరుకున్నా యి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేమితో భారత్ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో భారత వాయు సేన పలు ట్యాంకర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అంతేగాక దేశంలో సైతం పలు ప్రాంతాల మధ్య కూడా యుద్ధ విమానాలను ఉపయోగించి ట్యాంకర్లను తరలిస్తున్నారు. ఆగ్రా, హిందోన్, భోపాల్, చండీగఢ్‌ల నుంచి ఒక్కో సిలిండర్ చొప్పున రాంచీకి తరలిం చారు. అవేగాక ఇండోర్ నుంచి రాయ్‌పూర్‌కు రెండు ట్యాంకర్లు, జోధ్‌పూర్ నుంచి జామ్ నగర్‌కు రెండు ట్యాంకర్లు తరలించారు. చదవండి: కరోనా కల్లోలం.. 3 వేల మంది పేషెంట్లు పరారీ! -
ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,300 కి.మీ జర్నీ
రాంచీ: కరోనా బారినపడిన స్నేహితుడిని కాపాడుకునేందుకు అతడి మిత్రుడు సాహస యాత్ర చేశాడు. 24 గంటల్లో ఏకంగా 1,300 కిలోమీటర్లు నిరంతరం ప్రయాణం చేసి మరీ తన స్నేహితుడికి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చాడు ఓ ఫ్రెండ్. అతడి చేసిన సాహస యాత్రపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆయనే రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్ శర్మ. జార్ఖండ్‌లోని రాంచీ నుంచి ఘజియాబాద్‌లోని వైశాలి వరకు ప్రయాణించిన మిత్రుడి కథ చదవండి.. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్ శర్మకు ఏప్రిల్ 24వ తేదీన స్నేహితుడు సంజయ్ సక్సేనా ఫోన్ చేశాడు. తనకు కరోనా సోకిందని ఆక్సిజన్ కావాలని కోరాడు. వెంటనే స్పందించిన సంజయ్ తన మిత్రుడు రాజన్‌ను సంప్రదించాడు. 24 గంటల్లో ఆక్సిజన్ కావాలని కోరడంతో తన మిత్రుల ద్వారా ఆక్సిజన్ కోసం వెతికాడు. చివరకు 120 కిలోమీటర్ల దూరంలోని బోకారోలో ఆక్సిజన్ అందుబాటులో ఉందని తెలియడంతో అర్ధరాత్రి సంజయ్ బైక్‌పై అక్కడకు వెళ్లాడు. రాకేశ్ కుమార్ గుప్తాకు చెందిన జార్ఖండ్ గ్యాస్ ప్లాంట్‌లో గ్యాస్ తీసుకుని అనంతరం వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ చేరుకున్నాడు. స్నేహితుడు ఉన్న వైశాలి ప్రాంతానికి చేరుకుని ఆక్సిజన్ సిలిండర్ సకాలంలో అందించాడు. ఈ విధంగా మొత్తం 1,300 కిలోమీటర్లు 24 గంటలు నిరంతరం ప్రయాణం చేసి తన స్నేహితుడి కోసం ఆక్సిజన్ తీసుకొచ్చాడు. చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్డౌన్: ఎక్కడంటే.. -
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు ఎందుకంత డిమాండ్?
భారత్‌లో కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స కోసం ఆస్పత్రిలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కొంత మంది రోగులకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా వారికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. కానీ హఠాత్తుగా దేశంలో కేసులో పెరగడంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇక ఆక్సిజన్ సిలిండర్లకు ప్రత్యామ్నాయ మార్గాలపై నిపుణులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో సిలిండర్లకు ప్రత్నామ్నాయంగా దొరికిందే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కంప్యూటర్ మానిటర్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. ఇవి శ్వాస సంబంధ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి, ప్రాణవాయువు తగినంత అందని వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఐసోలేషన్‌లో ఉన్నవారు, ఇంటివద్ద ఒంటరిగా చికిత్స పొందుతున్న రోగులకు దీన్ని సిఫారసు చేస్తున్నారు. ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేని ఆసుపత్రుల్లో ప్రస్తుతం వీటిని వాడుతున్నారు. ఎలా పనిచేస్తాయి? ఇవి గాలి నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను వేరు చేసి అందిస్తుంటుంది. సాధారణంగా వాతావరణంలోని గాలిలో 78 శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. ఇతర వాయువులు ఒక శాతం వరకు ఉంటాయి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఈ గాలిని వడపోస్తాయి. ఒక జల్లెడ ద్వారా డివైజ్ గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఈ ప్రక్రియలో విడుదలైన నైట్రోజన్‌ను తిరిగి గాలిలోకి విడుదల చేస్తుంది. మిగిలిన ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తుంది. ఈ ఆక్సిజన్ 90-95 శాతం స్వచ్ఛమైనదని నిపుణులు చెబుతున్నారు. వీటిని 24 గంటలు ఉపయోగించవచ్చు. ఇవి నిరంతరాయంగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవు. సాధారణ, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కరోనా రోగులకు మాత్రమే కాన్సన్ట్రేటర్లు విడుదల చేసే ఆక్సిజన్, లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ మాదిరిగా (ఎల్ఎంఓ) 99 శాతం స్వచ్ఛమైనది కాదు. అందువల్ల ఐసీయూ రోగులకు డాక్టర్లు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిఫారసు చేయరు. సాధారణ, మధ్యస్థ లక్షణాలతో ఉన్న కరోనా రోగులకి మాత్రమే 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ సంతృప్త స్థాయి ఉన్న వారికి ఇవి సరిపోతాయి. ఒక డివైజ్ ద్వారా ఒకేసారి ఇద్దరు రోగులకు ప్రాణవాయువును అందించవచ్చు. కానీ వీటి వల్ల క్రాస్ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్లు.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు తేడాలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సిలిండర్లకు ప్రత్యామ్నాయాలుగా చెప్పుకోవచ్చు. సాధారణ అవసరాలకు మాత్రమే వీటిని వినియోగించవచ్చు. క్లిష్టమైన సమస్యలు ఉన్న రోగులకు కాన్సన్ట్రేటర్లను వాడకూడదు. ఎందుకంటే తీవ్ర సమస్యతో బాధపడుతున్నరోగులకు నిమిషానికి 40-50 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. కానీ కాన్సన్ట్రేటర్లు నిమిషానికి 5-10 లీటర్ల ఆక్సిజన్‌ను మాత్రమే సరఫరా చేయగలవు. ఎల్‌ఎంఓలకు.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు తేడాలు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సులువుగా వేరే ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ఎల్‌ఎంఓల విషయంలో ఇలాంటి సదుపాయం ఉండదు. దీన్ని క్రయోజెనిక్ ట్యాంకర్లలో నిల్వ చేసి, రవాణా చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్లను నిరంతరం రీఫిల్లింగ్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. కానీ కాన్సన్ట్రేటర్ల విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి కేవలం గాలి నుంచి ఆక్సిజన్‌ను వేరుచేసి అందిస్తాయి కనుక నిరంతరం వాడుకోవచ్చు. ధర ఎంత? ఆక్సిజన్ సిలిండర్ల కంటే కాన్సన్ట్రేటర్ల ధర ఎక్కువగా ఉంటుంది. వీటికి రూ.40,000- రూ.90,000 వరకు ఖర్చు అవుతుంది. సిలిండర్ల ధర మాత్రం రూ.8,000- రూ.20,000 వరకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం హాస్పిటళ్లలో ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడటంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయి. సాధారణంగా ఏటా 40,000 వరకు యంత్రాలను సరఫరా చేస్తుండగా, ప్రస్తుతం ఇది నెలకు 30,000-40,000 వరకు పెరిగిందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ( చదవండి: క్షణమొక యుగంలా గడిచింది, లేదంటే 100 ప్రాణాలు.. ) -
స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్ సిలిండర్ల దందా
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛంద సంస్థ ముసుగులో సాగుతున్న ఆక్సిజన్ సిలిండర్ల దందాకు రాచకొండ ఎస్ఓటీ, మల్కాజిగిరి పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి వాహనం, ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం వివరాలు.. కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ మాస్ ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. కరోనా బాధితులుకు ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సు సేవలు ఉచితంగా అందిస్తామంటూ ప్రచారం చేసుకున్నాడు. ఉచితం అంటూ బ్లాక్మార్కెట్లో అమ్మకం ఈ ముసుగులో సల్మాన్ అనే వ్యక్తి నుంచి 150 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్‌ను రూ.16 వేలకు ఖరీదు చేస్తున్నాడు. ఆపై నల్లబజారుకు తరలించి కరోనా పేషెంట్లకు రూ.25 వేలకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్న వాహనం మౌలాలీ మీదుగా ఈసీఐఎల్ వైపు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మల్కాజిగిరి పోలీసుల సహకారంతో రాత్రి 10 గంటలకు జెడ్టీఎస్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. వీరికి మాస్ ఫౌండేషన్ అంటూ రాసి ఉన్న ఓమ్నీ వాహనం కనిపించింది. అనుమానంతో తనిఖీ చేయగా అందులో 150 లీటర్ల 5 ఆక్సిజన్ సిలిండర్లు బయటపడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు వాహనంలో లభించలేదు. ఓమిని వ్యాన్ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్లాతో పాటు వాహనంలోని మహ్మద్ మజార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఫలితంగా ఆసిఫ్ చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆక్సిజన్ సిలిండర్లు, వాహనాన్ని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర అత్యవసర మందుల అక్రమ దందాలపై కన్నేసి ఉంచుతున్నామని అధికారులు పేర్కొన్నారు. ( చదవండి: కరోనా వ్యాక్సిన్ బ్లాక్ దందాకు చెక్: ముఠా అరెస్ట్ ) -
సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు
తిరుపతి తుడా: చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో కోవిడ్–19 మహమ్మారిని కట్టడి చేసేందుకు, ప్రజలను రక్షించుకునేందుకు నడుం బిగించారు. రూ.25 లక్షల సొంత నిధులతో 150 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నారావారి పల్లె పీహెచ్‌సీని, చంద్రగిరి ఏరియా ఆస్పత్రిని అధికారులతో కలిసి సందర్శించిన ఆయన తుడా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుచానూరు సమీపంలో ఉన్న శ్రీ పద్మావతి కోవిడ్ సెంటర్లో కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం పద్మావతి నిలయంలో వెయ్యి మంది కరోనా బాధితులకు సేవలు అందుతున్నాయని చెప్పారు. చంద్రగిరికి సమీపంలో మరో 500 మంది కరోనా బాధితులకు సౌకర్యవంతంగా కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. ఆక్సిజన్ కొనుగోలుకు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని తానే సొంతంగా భరించనున్నటేకట ప్రకటించారు. చంద్రగిరి ప్రాంతీయ ఆస్పత్రిలో ఆక్సిజన్ సౌకర్యంతో 100 పడకలు, నారావారి పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో 50 పడకల బెడ్లు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కాగా, హోమ్ ఐసొలేషన్‌లో ఉండే వారికి 34 రకాల వస్తువులతో 2,500 కిట్లను ముందస్తుగా సిద్ధం చేశామని చెవిరెడ్డి చెప్పారు. కరోనా బాధితులకు టెలీ మెడిసిన్, టెలీ కాన్ఫరెన్స్ అందుబాటులోకి తెస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఏడు కోవిడ్ మెడికల్ షాప్‌లు, ఏడు అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. -
దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం చూపే అవకాశం ఉందని, ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓ కరోనా వైద్యుడి అవతారమెత్తి వైరస్‌పై పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టిషా) అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాపై అవగాహన పెంచుకొని స్వీయ జాగ్రత్తలు పాటించడంతోపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ముందే తెలుసుకోవాలన్నారు. తద్వారా ఆరోగ్యం క్షీణించకుండా జాగ్రత్తపడటంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి సేవలు అవసరం లేకుండా చూసుకోవచ్చన్నారు. ఇందుకోసం పల్స్‌రేటు, ఆక్సిజన్ శాచురేషన్, హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రతలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కరోనా బీమా తప్పనిసరి... ‘దేశంలో వైరస్ మ్యుటేషన్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో విస్తరణ చాలా వేగంగా ఉంది. బాధితుల్లో వైరస్ లోడ్ కూడా ఎక్కువగా ఉంటోంది. చికిత్స అందించినా కోలుకొనేందుకు చాలా రోజులు పడుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆస్పత్రులు, వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, ఆక్సిజన్, మందులు లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికే అనేక మంది వైద్యులు కూడా వైరస్ బారినపడ్డారు. వైద్యసేవల్లో అలసిపోయారు. వైరస్ బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు భారంగా మారకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ‘కరోనా కవచ్’బీమా పాలసీ తీసుకోవాలి’అని డాక్టర్ భాస్కర్‌రావు సూచించారు. అవసరం లేకున్నా ఆస్పత్రుల్లోనే... కొందరు బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకొనే అవకాశం ఉన్నా భయంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. అలాగే చాలా మంది బాధితులు అవసరం లేకున్నా రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. వైద్యులు నచ్చజెప్పినా డిశ్చార్జికి నిరాకరిస్తూ రోజుల తరబడి ఆస్పత్రుల్లోనే ఉండిపోతున్నారు. ఫలితంగా పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతోందన్నారు. వారి వల్లే ఆక్సిజన్ కొరత... ప్రస్తుతం ఒక్క కిమ్స్‌లోనే 500 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా వారిలో 240 మంది ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేకున్నా ప్రముఖులతో ఫోన్లు చేయించి బలవంతంగా ఆస్పత్రిలోనే ఉన్నట్లు డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. గతంలో ఆ ఆస్పత్రిలో 40 వెంటిలేటర్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్యను 200 పెంచినా ఆక్సిజన్ అవసరాలు రెట్టింపయ్యాయన్నారు. గతంలో 3 రోజులకు ఒకసారి 20 కేఎల్ ట్యాంక్‌ను నింపే పరిస్థితి ఉండగా ప్రస్తుతం 24 గంటలకు ఒకసారి ఆక్సిజన్ నింపాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఒక్కసారిగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఆస్పత్రి యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆక్సిజన్ ప్లాంట్ కావాలి.. భవిష్యత్తులో ఆక్సిజన్ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రదేశాల్లో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్‌ను ముందే ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరోనా వంటి విపత్తులను సులభంగా జయించే అవకాశం ఉందని డాక్టర్ భాస్కర్‌రావు అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆస్పత్రులపై ఒత్తిడి కూడా తగ్గించొచ్చని, ఇందుకు ఒక్కో ఇంటికి రూ. 40 వేలకు మించి ఖర్చు కాదన్నారు. భయాన్ని వీడినప్పుడే భరోసా... ప్రస్తుతం వెలుగు చూస్తున్న కరోనా మరణాలకు బాధితుల్లో నెలకొన్న భయమే ఎక్కువ కారణమవుతోందని డాక్టర్ భాస్కర్‌రావు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారితోపాటు ఆస్పత్రుల్లో చేరిన వారు రోజంతా మంచంపై పడుకొని ఆందోళన చెందేకంటే ఓ గంటపాటు పక్కన ఉన్న రోగులతో కలసి మాట్లాడటం, ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం వల్ల మనోధైర్యం పొందొచ్చని, తద్వారా వైరస్ నుంచి త్వరగా బయటపడొచ్చని ఆయన సూచించారు. భయాన్ని వీడినప్పుడే బతుకుపై భరోసా ఏర్పడుతుందన్నారు. అవసరంలేకున్నా రెమిడెసివిర్ వాడకం ప్రమాదకరం.. కరోనా కేసులను స్వల్ప, మధ్యస్త, తీవ్రమైనవిగా విభజించారని, స్వల్ప లక్షణాలు ఉండేవారు హోం ఐసోలేషన్‌లోనే ఉండి వైరస్ నుంచి కోలుకోవచ్చని డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. ఇందు కు ఆక్సీమీటర్‌తో ప్రతి 3 గంటలకు ఒకసారి ఆక్సి జన్ శాతాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. ఆక్సిజన్ స్థాయిలు 94 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడే ఆస్పత్రిలో చేరి వైద్యుడి పర్యవేక్షణలో మందులు, ఆక్సిజన్ వాడాల్సి ఉంటుందన్నారు. కానీ చాలా మంది బాధితులు అవ సరం లేకున్నా స్టెరాయిడ్స్‌తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది వారి ఆరోగ్యానికే ప్రమాదకరమని ఆయన చెప్పారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుందని తప్ప బాధితులు కోరినట్లు కాదన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రతి 100 మందిలో ఐదారుగురికి మించి వైద్యులు రెమిడెసివిర్ ఇంజక్షన్లను వాడట్లేదని, కానీ తెలంగాణలో ఆస్పత్రుల్లో చేరిన వారందరికీ వైద్యులు వాటిని ఇస్తున్నారన్నారు. దీనివల్ల రోగుల ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరుగుతుందని, మందులు పనిచేయకుండా పోవడంతోపాటు భవిష్యత్తులో ఇతర అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. -
మంటల్లో కోవిడ్ ఆస్పత్రి.. 82 మంది మృతి
బాగ్దాద్: మహారాష్ట్రలోని కోవిడ్ ఆస్పత్రుల్లో ప్రమాదాలు స్ఫురించేలా ఇరాక్‌లోని బాగ్దాద్‌లో కూడా ఘోరం జరిగింది. బాగ్దాద్‌లోని ఇబన్ అల్‌ఖతీబ్ ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 82 మంది మృతి చెందారు. మరో 110 మంది కాలిన గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా బాధితుల కోసం ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఉన్న అంతస్తులోనే ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో వెంటిలేటర్ మీద ఉన్న 28 మంది రోగులు మంటలకి ఆహుతయ్యారు. మరికొందరు దట్టంగా వ్యాపించిన పొగతో ఊపిరాడక మరణించారు. ఈ ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగిందని తేలడంతో ఆరోగ్య మంత్రి హసన్ అల్ తమిమీని ప్రధాని సస్పెండ్ చేశారు. ప్రమాదం సమయంలో ఆస్పత్రిలో హృదయ విదారక సన్నివేశాలు కనిపించాయి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న కొందరు రోగులు వాటిని తీసేసి పరుగులు పెట్టే దృశ్యాలు మనసుల్ని కలిచివేశాయి. రోగుల కోసం వచ్చిన కుటుంబ సభ్యులు, బంధువులు కూడా మంటల్లో చిక్కుకున్నారు. ఆ ఆçస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగితే రక్షించే వ్యవస్థ లేకపోగా, ఫాల్ సీలింగ్‌లో వినియోగించిన సామగ్రితో మంటలు మరింత విస్తృతంగా వ్యాపించాయని దేశ మానవ హక్కుల కమిషన్ అధికార ప్రతినిధి అలీ అల్–బయతి చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తేవడానికి కొన్ని గంటల సేపు శ్రమించారు. దాదాపు 200 మంది ప్రాణాలను కాపాడారు. -
Gaurav Rai: ఆక్సిజన్ మ్యాన్
ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్.. మరో కోణంలో సమాజంలో అడుగంటిన మానవత్వాన్ని తట్టిలేపుతోంది. కరోనా కారణంగా ఎదురవుతోన్న సమస్యలకు ఒకరికొకరు సాయమందించుకోవడం రోజూ చూస్తూనే ఉన్నాం. పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్ కరోనా పేషంట్లకు ఆక్సిజన్ అందిస్తూ వందలమంది ప్రాణాలను రక్షిస్తున్నారు. ‘‘కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోతాయి. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది’’. ఈ పరిస్థితిని స్వయంగా అనుభవించిన గౌరవ్.. తనలాగా ఎవరూ ఇబ్బంది పడకూడదు అని భావించి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తూ ‘ఆక్సిజన్ మ్యాన్ ’గా అందరి మన్ననలను పొందుతున్నారు. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ కొనసాగుతున్న సమయంలో గౌరవ్ కరోనా బారిన పడ్డారు. అప్పుడు అతనికి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వడానికి బెడ్ దొరకలేదు. దీంతో గౌవర్ కరోనా పేషంట్లు ఉన్న వార్డులో మెట్ల పక్కన పడుకున్నాడు. పడుకోవడానికి కాస్త స్థలం దొరికినప్పటికీ.. కరోనాతో అతని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. వెంటనే ఆక్సిజన్ సిలిండర్ పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఆ ఆసుపత్రిలో ఒక్క సిలిండర్ కూడా దొరకలేదు. ఓ ఐదుగంటల తర్వాత గౌరవ్ భార్య నానా తంటాలు పడి ఆక్సిజన్ సిలిండర్‌ను ఏర్పాటు చేశారు. దీంతో గౌరవ్ నెమ్మదిగా కోలుకుని బయటపడ్డారు. సిలిండర్ దొరకక తాను పడిన ఇబ్బంది మరొకరు పడకూడదనుకున్న గౌరవ్ ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయాలనుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్న గౌరవ్ రాయ్ అనుకున్న వెంటనే గౌరవ్ దంపతులు తమ సొంత డబ్బులతో వాళ్ల ఇంటి బేస్ మెంట్ లో చిన్న ఆక్సిజన్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. రోజు ఆక్సిజన్ సిలిండర్లు అవసరమైన వారికి గౌరవ్ తన వ్యాగ్నర్ కారులో తీసుకెళ్లి ఇవ్వడం ప్రారంభించారు. ఫేస్బుక్, ట్విటర్లో ఉన్న గౌరవ్ స్నేహితులు ఆక్సిజన్ బ్యాంక్ గురించి ప్రచారం చేయడంతో అవసరమైన వారందరూ గౌరవ్‌కు కాల్ చేసేవారు. వారికి సిలిండర్లను ఉచితంగా ఇచ్చి, ఆ పేషెంట్ కోలుకున్నాక మళ్లీ వెళ్లి సిలిండర్‌ను వెనక్కు తీసుకొచ్చేవారు. ఈ మొత్తం ప్రక్రియలో గౌరవ్ ఒక్క రూపాయి కూడా తీసుకోక పోవడం విశేషం. ప్రారంభంలో ఆక్సిజన్ బ్యాంక్ పది సిలిండర్లతో ప్రారంభమై నేడు 200 సిలిండర్ల స్థాయికి చేరుకుంది. ఈ విషయం తెలిసిన కొందరు దాతలు విరాళాల రూపంలో గౌరవ్‌కు సాయం చేస్తున్నారు. తెల్లవారుజామున ఐదుగంటలకే లేచి.. ప్రారంభంలో గౌరవ్ తనుండే అపార్టుమెంటు లో అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చేవారు. సిలిండర్ కావాలని కాల్స్ పెరగడంతో తెల్లవారుజామున ఐదుగంటల నుంచి అర్ధరాత్రి వరకు సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్నవారికి ఇప్పటిదాక దాదాపు వేయ్యిమందికి సిలిండర్లను సరఫరా చేశారు. క్రమంగా సిలిండర్ల సంఖ్య పెంచుతూ బిహార్‌లోని 18 జిల్లాల్లోని కరోనా పేషంట్లకు సిలిండర్లను ఉచితంగా సరఫరా చేస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. -
ప్రాణాలు కాపాడాల్సిన వాళ్లం.. ఓ వైద్యుడి భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తగా కరోనా మహమ్మారి విలయం రోజుకు రోజుకు మరింత ఉధృతమవుతోంది. దీంతో దేశంలో ఏ ఆసుపత్రిలో చూసినా ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19 ప్రభావిత రాష్ట్రం ఢిల్లీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. దీంతో ప్రాణాలను పణంగా పెట్టి మరీ కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. బాధితులు ఊపిరాడక తమ కళ్లముందే విలవిల్లాడుపోతోంటే తీవ్ర మానసిక వేదన చెందుతున్నారు. ఆసుపత్రిలో దుర్భర పరిస్థితి, రోగుల ప్రాణాలను కాపాడలేని తమ నిస్సహాయతపై ఒక సీనియర్ వైద్యుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది దేశ రాజధాని నగరంలో ఢిల్లీలోని అతిపెద్ద ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో అల్లకల్లోలమవుతున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా స్పందించాయి. తక్షణమే అన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైద్య సదుపాయాలు, రోగుల ప్రమాదకర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు శాంతి ముకాండ్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ సునీల్ సాగర్ కంట తడిపెట్టారు. వైద్యులుగా రోగుల ప్రాణాలను కాపాడాల్సిన తాము, కనీసం ఆక్సిజన్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్న చాలామందిని డిశ్చార్జ్ చేయవలసిందిగా వైద్యులను కోరామని, చాలా క్రిటికిల్ గా ఉన్న వారికి ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ అందిస్తున్నామన్నారు. ప్రాణాలను నిలపాల్సిన తాము చివరికి ఆక్సిజన్ కూడా ఇవ్వలేకపోతే... పరిస్థితి ఏమిటి... వారు చనిపోతారంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఆసుపత్రిలో ఉన్న స్టాక్స్ మహా అయితే రెండు గంటలకు సరిపోతుందని డాక్టర్ సాగర్ చెప్పారు. తమ రెగ్యులర్ సరఫరాదారు ఐనాక్స్ కాల్స్‌కు స్పందించడం మానేసిందని ఆరోపించారు. మరోవైపు రోహిణి సరోజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో, 51 ఏళ్ల ఆశిష్ గోయల్ వెంటిలేటర్లో ఉన్న తన తండ్రికి ఆక్సిజన్ కోసం చాలా ఇబ్బందులనెదుర్కాను. అయితే 15 నిమిషాలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే తమ దగ్గర ఉందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. దీంతో చాలా భయంకరంగా ఉంది.. తమకు ఎవరూ రక్షణ లేరంటూ బావురుమన్నారు గోయల్. అటు ఘజియాబాద్‌లోని లక్ష్మీచంద్ర ఆసుపత్రి అంబులెన్స్‌లు ఇప్పుడు రోగులకు బదులుగా ఆక్సిజన్ రీఫిల్స్ సిలిండర్లను రవాణా చేస్తున్నాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని అదే జిల్లాలోని చంద్రలక్ష్మి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ గోయల్, " మా వద్ద ఆక్సిజన్ లేదు, మందులు లేవు.. పేషంట్లను స్వీకరించలేను క్షమించండి’’ అంటూ ఏకంగా బోర్టు పెట్టేశారు. ఆసుపత్రిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా యంత్రాంగానికి లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాజధానిలోని ఆరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అయిపోయాయంటూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం ఒక జాబితా విడుదల చేశారు. సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శాంతి ముకుంద్ హాస్పిటల్, తీరత్ రామ్ షా హాస్పిటల్, యూకే నర్సింగ్ హోమ్, రాఠి హాస్పిటల్ , శాంటం హాస్పిటల్ ఇందులోఉన్నాయి. (వ్యాక్సిన్ తరువాత పాజిటివ్ : ఐసీఎంఆర్ సంచలన రిపోర్టు) చదవండి : ఎన్నిసార్లు గెలుస్తావ్ భయ్యా..! నెటిజన్లు ఫిదా #WATCH | Sunil Saggar, CEO, Shanti Mukand Hospital, Delhi breaks down as he speaks about Oxygen crisis at hospital. Says "...We're hardly left with any oxygen. We've requested doctors to discharge patients, whoever can be discharged...It (Oxygen) may last for 2 hrs or something." pic.twitter.com/U7IDvW4tMG — ANI (@ANI) April 22, 2021 -
రూ.22 లక్షల కారు అమ్మేసి మరీ.. నువ్వు గొప్పోడివయ్యా!
ముంబై: దేశంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ రూపంలో వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకీ తన ప్రతాపాన్ని పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ బెడ్ల కోసం దేశంలో పలు చోట్ల కరోనా రోగులు, వారి బంధువులు పడుతున్న ఇబ్బందులు, ఆవేదన అన్ని ఇన్నీ కావు. ఓ పక్క ప్రభుత్వాలు ఇందుకు కావాల్సిన చర్యలను ముమ్మరం చేసినప్పటికీ కరోనా వైరస్ బారిన పడుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరగడంతో అవి సరిపోని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి వారిక సహాయం చేసేందుకు ముంబయికి చెందిన షానవాజ్ షేక్ అనే యువకుడు ముందుకు వచ్చి తన వంతు సాయాన్ని అందిస్తున్నాడు. అందుకోసం ఏకంగా తను ఎంతో ఇష్టపడి కొన్న కారునే అమ్మేశాడు. వివరాల్లోకి వెళితే.. షానవాజ్ గత సంవత్సరం, తన స్నేహితుడి భార్య ఆటో రిక్షాలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల మరణించడం చూసి చలించిపోయాడు. ఇక ఆ తర్వాత ముంబైలోని రోగులకు ఆక్సిజన్ సరఫరా ఏజెంట్‌గా పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలకు సకాలంలో సహాయం అందించడం కోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా జారీ చేసి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాడు. ఇంతేకాక ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు ఆక్సిజన్ పొందడంలో సమస్యలు ఉండకుండా అతను ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను కరోనా బాధితులకు సహాయార్థం తన ఫోర్డ్ ఎండీవర్ కారుని కూడా అమ్మేశాడు. ఆ డబ్బుతో ఆక్సిజన్ సిలిండర్లు కొని ఆపదలో ఉన్నవారికి అందిస్తున్నాడు. గత సంవత్సరం పేదలకు సహాయం చేస్తున్నప్పుడు డబ్బు అయిపోయిందని, అందువల్ల అతను తన కారును అమ్మవలసి వచ్చిందని షానవాజ్ చెప్పాడు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి పరిస్థితి ఒకేలా లేదని, ఈ జనవరిలో తనకు ఆక్సిజన్ కోసం 50 కాల్స్ వచ్చాయని, ప్రస్తుతం ప్రతిరోజూ 500 నుంచి 600 ఫోన్ కాల్స్ వస్తున్నాయని షానవాజ్ తెలిపారు. ఇప్పటివరకు తన బృందంతో కలిసి షానవాజ్ 4000 మందికి సాయమందించినట్లు చెప్పుకొచ్చాడు ( చదవండి: పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్ ) -
దేశానికి ఊపిరిపోస్తోన్న విశాఖ స్టీల్ ప్లాంట్
-
ఆక్సిజన్ ట్యాంక్ లీక్ : 22 మంది మృతి
సాక్షి,ముంబై: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రతతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత పట్టి పీడిస్తోంది. మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ ఆసుపత్రి వద్ద జరిగిన షాకింగ్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఆక్సిజన్ నింపుతుండగా ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్ కావడం ప్రారంభమైంది. దీంతో ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక దళ సిబ్బందిని తరలించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నగరంలోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో బుధవారం ఈ సంఘటన జరిగింది.ఈ పరిణామంతో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జాకీర్ హుస్సేన్ స్పందించారు. మరింత సమాచారం సేకరించిన తరువాత ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. (పరిస్థితి చేయిదాటింది.. ప్లీజ్.. జాగ్రత్త: ఏడ్చేసిన డాక్టర్) The tragedy at a hospital in Nashik because of oxygen tank leakage is heart-wrenching. Anguished by the loss of lives due to it. Condolences to the bereaved families in this sad hour. — Narendra Modi (@narendramodi) April 21, 2021 మృతుల బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. నాసిక్ సంఘటనపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. మరోవైపు నాసిక్ విషాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 351 మంది మరణించారు. దీంతోమొత్తం కేసులు 38,98,262కు చేరుకోగా, మరణాల సంఖ్య 60,824కు చేరుకుంది. చదవండి : సూపర్ హీరోలకే హీరో: ప్రశంసలు, బంపర్ గిఫ్ట్ -
కోవిడ్ పంజా; బెంగళూరులో ప్రాణవాయువుకు గిరాకీ
సాక్షి, బెంగళూరు: కన్నడనాట రెండోదఫా కోవిడ్ పంజా విసురుతోంది. రోజూ డిశ్చార్జిల కంటే యాక్టివ్ కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. అలాగే ఐసీయూలో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో బెంగళూరులో కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్ల వినియోగం పెరిగింది. ఫలితంగా ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. కరోనా వల్ల కర్ణాటకలో ఐసీయూ పడకల వినియోగం 60–70 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐసీయూలో 351 మంది ఉన్నారు. వీరిలో చాలా మందికి ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఉంది. గతేడాది 2020, సెప్టెంబర్‌లో రాష్ట్రంలో సగటున రోజుకి 814 ఐసీయూ కేసులు నమోదు అయ్యాయి. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమవుతూ ఉండేది. ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా లేదని అధికారులు వాపోతున్నారు. ఆస్పత్రులు, ఆక్సిజన్ సిలిండర్ల బ్యాంకుల్లో కూడా డిమాండ్ మేర వాటి సరఫరా లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఇళ్లకు అద్దెకు ఇచ్చే ఆక్సిజన్ సిలిండర్ల డిమాండ్ కూడా 10–15 శాతం మేర పెరిగింది. కొంతమంది అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆక్సిజన్ సిలిండర్లను ముందుగానే కొనేస్తుండడంతో కొరత ఏర్పడింది. గతేడాది బెంగళూరు పరిధిలో 70 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయగా, ప్రస్తుతం 53 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులుగా హఠాత్తుగా డిమాండ్ పెరిగింది. ఇక్కడ చదవండి: కరోనా డేంజర్.. నెగటివ్ రిపోర్టు ఉంటేనే వైరస్ విస్ఫోటనం.. బెంగళూరులో కేసులు ఎందుకు అధికం?! -
కరోనా రోగులకు మరో షాక్?!
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణతో ఓ పక్క దేశంలోని కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు సహా ప్రభుత్వాస్పత్రులన్నీ కిక్కిరిసి పోతుండగా, ఉన్నంతలో వారికి తగిన చికిత్సను అందించేందుకు కుస్తీ పడుతోన్న వైద్య సిబ్బందికి ఇప్పుడు పెనం మీద పిడుగు పడిన చందంగా ఊహించని ఉపద్రవం ముంచుకొచ్చింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఎదురయింది. కరోనా వైరస్‌తో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరవుతోన్న రోగులకు వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించడం అవసరమన్న విషయం అర్థమైందే. దేశంలో కరోనా రోగుల సంఖ్య ఇప్పటికే 80 లక్షలు దాటిపోగా వారిలో కొన్ని లక్షల మందికి ఆక్సిజన్ వెంటిటేటర్లు అవసరం అవుతున్నాయి. (చదవండి : ఫ్యూచర్ మహమ్మారులు మరింత డేంజర్..!) దేశంలో వైద్య అవసరాలతోపాటు గ్లాస్, స్టీల్ పరిశ్రమలకు కూడా ఆక్సిజన్ సిలిండర్లు అవసరం. గ్లాస్, స్టీల్ పరిశ్రమలకు తాత్కాలికంగా గ్యాస్ సరఫరాను నిలిపివేసి వైద్య అవసరాలకే ఆక్సిజన్ సిలిండర్లను మళ్లించినప్పటికీ సెప్టెంబర్ నెలలో దేశంలోని ఆస్పత్రులకు రోజుకు మూడు వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కొరత ఏర్పడిందని ‘ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గ్యాసెస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్’కు చెందిన రాజీవ్ గుప్తా తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కరోనా వైరస్ దాడికి ముందు దేశంలో రోజుకు 6, 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరిగేది. వాటిలో వైద్య అవసరాలకు వెయ్యి మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌కు మించి అవసరం పడలేదు. (చదవండి : అమ్మ ఉద్యోగం పోయింది.. టీ అమ్ముతున్నా) మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో 70 నుంచి 80 శాతం గ్లాస్, స్టీల్ పరిశ్రమలు వినియోగించుకునేవని పంజాబ్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి కంపెనీ ‘హైటెక్ ఇండస్ట్రీస్’ అధిపతి ఆర్ఎస్ సచ్దేవ్ తెలిపారు. వైద్య అవసరాలకు ఆక్సిజన్ సిలిండర్లను మళ్లించినట్లయితే పరిశ్రమలు నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒకటి, రెండు సిలిండర్ల కొరత ఏర్పడితే సర్దు కోవచ్చుగానీ, లోడుల లెక్కన కొరత ఏర్పడితే నష్టాన్ని భరించడం కష్టమని ఆయన చెప్పారు. అయినప్పటికీ తమ ప్రాథమిక ప్రాథామ్యం వైద్య అవసరాలు తీర్చడమని రాజీవ్ గుప్తా తెలిపారు. కోవిడ్ దండయాత్ర కారణంగా వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచామని ఆయన చెబుతున్నప్పటికీ అది ఎంత అన్నది ఆయన చెప్పలేక పోయారు. దేశవ్యాప్తంగా వైద్య అవసరాలకు ఆక్సిజన్ కొరత ఉందని కేరళలోని మనోరమ గ్యాసెస్ అధినేత ఆంథోని జోసఫ్ తెలిపారు. దేశంలోని అవసరాలకు తమ ఉత్పత్తులు చాలడం లేదని ఆయన చెప్పారు. పీకల మీదకు వచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ విపక్షాలు చేస్తోన్న విమర్శల్లో నిజం లేకపోలేదన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆస్పత్రుల కోసం ఓ లక్ష మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్ ఉత్పత్తి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అక్టోబర్ 14వ తేదీన ప్రభుత్వ రంగంలోని ‘హెచ్ఎల్ఎల్ (హిందుస్థాన్ లాటెక్స్ లిమిటెడ్) లైవ్ కేర్’ ద్వారా బిడ్డింగ్‌లను ఆహ్వానించింది. అవి ఎప్పుడు ఖరారు అవుతాయో, అదనపు ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభం అవుతుందో ఎవరికి ఎరుకో! దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 15 శాతం మందికి ఆస్పత్రి వైద్య సేవలు అవసరం అవుతున్నాయని, వాటిలో ఐదు శాతం కేసులకు ఆక్సిజన్ వెంటిలేటర్ల ద్వారా అత్యవసర వైద్య సేవలు అవసరం అవుతున్నాయని ‘ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఓ విలేకరుల సమావేశంలో చెప్పారు.(చదవండి : ఎఫ్డీసీ నుంచి 800ఎంజీ ఫావిపిరావిర్) కరోనా కారణంగా వైద్య అవసరాలకు ఆక్సిజన్ వినియోగం అంతకుముందుకన్నా ఏడెనిమిదింతలు పెరగడం ఆక్సిజన్ కొరతకు ఓ కారణం కాగా, లాక్డౌన్ నాటి నుంచి ఆక్సిజన్ పరిశ్రమలు ఊపిరి పీల్చుకోకుండా పని చేస్తుండడంతో దేశంలోని కొన్ని పరిశ్రమలు ‘బ్రేక్‌డౌన్’ అవడం మరో కారణం. వార్శిక మెయింటెనెన్స్‌లో భాగంగా ఏటా కొన్ని రోజుల పాటు ఈ పరిశ్రమలను మూసి వేయాల్సి ఉంటుందన్న తెల్సిందే. దేశంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గత ఏప్రిల్ నెల నాటికి 57,924 బెడ్లకు ఆక్సిజన్ సపోర్ట్ ఉండగా, వాటి సంఖ్య అక్టోబర్ నాటికి 2,65,046 చేరుకున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీ నాటికి దేశంలో 43,033 మంది ఆక్సిజన్ థెరపీ తీసుకుంటుండగా, అక్టోబర్ ఒకటవ తేదీ నాటికి వారి సంఖ్య 75,098కి చేరుకుంది. ఆక్సిజన్ అవసరాలు ఇలాగే పెరిగితే కిమ్కర్తవ్యం?! -
ఆక్సిజన్ దాత సుఖీభవ
మంచిదనీ, చెడ్డదనీ ఫిక్స్ అయిపోడానికి లేకుండా మంచి చెడులు మిక్స్ అయిపోయి ఉంటుంది లోకం. రెంటినీ వేరు చేస్తూ కూర్చుంటే జీవితం ముగిసిపోతుంది. బాధ కలిగిన చోట బాధపడి, మంచి కనిపించిన చోట సంతోషపడి జన్మను గడిపేయాలని, చేతనైతే నిస్వార్ధాన్ని గడించి వారస మానవులకు వీలునామా రాసిపోవాలనీ జీవిత అంతరార్థమేమో! ఈ కరోనా కాలంలో స్వార్థం బుసలు కొట్టే చోట కొడుతుంటే, నిస్వార్ధం ప్రాణవాయువై కొన్నిచోట్ల ఊపిర్లు ఊదుతోంది. కర్ణాటకలోని బెల్గాంలో వెంకటేష్ పాటిల్ అనే ఆయనకు ఆక్సిజన్ సిలిండర్ల రీ ఫిల్లింగ్ కంపెనీ ఉంది. కంపెనీతో పాటు మంచి మనసు కూడా. బెల్గాం కోవిడ్ ఆసుపత్రుల్లో ఎవరైనా ఆక్సిజన్ అవసరమై, కొనే స్థోమత లేక చావు బతుకుల్లో ఉన్నారని తెలియగానే వెంకటేష్ పాటిల్ హుటాహుటిన అక్కడికి సిలిండర్లు పంపిస్తున్నారు. అలా ఇప్పటివరకు ఆయన 1882 సిలిండర్లను ఉచితంగా రీఫిల్ చేసి పంపించారు. ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఒక్క రీఫిల్‌కి 260 రూపాయలు అవుతుంది. అదే ఒకసిలిండర్‌కి కార్పొరేట్ ఆసుపత్రులలో పది వేలు బిల్ అవుతుంది! వాళ్లు చేస్తున్న దాని గురించి పాటిల్ తనేమీ మాట్లాడ్డం లేదు. తను చేయగలిగిన దాని పైనే ధ్యాస పెట్టారు. ఆక్సిజెన్ కంపెనీ ఉన్నవాళ్లు ఉచితంగా సిలిండర్ రీఫిల్ చేసి ఇవ్వడం పెద్ద విషయం కాదనిపించవచ్చు. పెద్దపెద్ద కంపెనీలనే తలదన్నేలా ఉండే కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు ఒక్క టెస్ట్ అయినా పేదవాళ్లకు ఉచితంగా చేసినట్లు విన్నామా?! కొండంత స్వార్థాన్ని కొలవలేం. నిస్వార్ధాన్ని మాత్రం వెంకటేష్ పాటిల్ వంటి వాళ్లను కూర్చోబెట్టి తూచవచ్చు. కానీ ఆయన కూర్చోడానికి ఒప్పుకోరే! ‘పాపం ఎవరికో ఆక్సిజెన్ కావాలట’ అని పరుగెత్తి వెళతారు. కనుక నిస్వార్థాన్నీ కొలవలేం. లోకం ఎప్పటికీ ఇలాగే ఉంటుందేమో మంచీ చెడ్డా కలిసిపోయి! మంచికి దండం. చెడుకు దూరం. ఇదే మనశ్శాంతికి దివ్యౌషధం. -
85శాతం మంది ఇళ్లలోనే కోలుకుంటున్నారు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ శాఖ ప్రకటించింది. కరోనా వైరస్‌పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు దూరం చేయాలని, వైరస్ సోకి ఆస్పత్రులకు వచ్చే వారికి అరగంటలోనే బెడ్లు కేటాయించాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధమైంది. కరోనా సోకిన వారికి ఎక్కడా, ఏ లోటు లేకుండా వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్లలోనే 85 శాతం కేసులు : రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 85 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ కోలుకున్నారు. మిగిలిన 15 శాతం ఆస్పత్రుల్లో చేరినా, వారిలో కేవలం 4 శాతం రోగులు మాత్రమే అత్యవసర వైద్య సేవల విభాగం (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 11 శాతం మంది సాధారణ చికిత్సతో డిశ్చార్జ్ అవుతున్నారు. ఆస్పత్రులు–బెడ్లు–వెంటిలేటర్లు : కోవిడ్–19 వైరస్ సోకిన వారి చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా 138 ఆస్పత్రులను గుర్తించారు. అన్ని ఆస్పత్రులలో 4300 ఐసీయూ బెడ్లు ఉండగా, నాన్ ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లు 17,406 ఉన్నాయి. ఇక నాన్ ఐసీయూ, నాన్ ఆక్సిజన్ బెడ్లు 17,364 ఉండగా, కోవిడ్ చికిత్స కోసం గుర్తించిన అన్ని ఆస్పత్రులలో కలిపి మొత్తం 36,778 బెడ్లు ఉన్నాయి. శుక్రవారం నాటి పరిస్థితి చూస్తే, 14,450 బెడ్లు ఆక్యుపెన్సీలో ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,31,488 పాజిటివ్ కేసులను గుర్తించగా, వాటిలో 70,466 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వారిలో 14,042 మంది ఆస్పత్రులలో, 18,753 మంది కోవిడ్ కేర్ సెంటర్ల (సీసీసీ)లో ఉండగా, 35,660 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. 3,541 మంది ఆక్సిజన్, వెంటిలేర్ల సహాయంతో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వారిలో అత్యధికంగా ఇళ్లలోనే ఉండి నయం అవుతుండగా, ఆస్పత్రులలో చేరిన వారిలో కూడా అత్యల్పం మాత్రమే అత్యవసర విభాగాలలో (ఐసీయూ)లో చికిత్స పొందుతున్నారు. బెడ్లు–ఆక్యుపెన్సీ : రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రులలో 36,778 బెడ్లు అందుబాటులో ఉండగా, వాటిలో శుక్రవారం నాటికి కేవలం 45.48 శాతం అంటే.. 14,450 బెడ్లు మాత్రమే ఆక్యుపెన్సీలో ఉన్నాయి. ఆక్సిజన్ పైప్లైన్లు : కోవిడ్ చికిత్సలో కీలకమైన ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన పైప్లైన్ల ఏర్పాటుపైనా వైద్య ఆరోగ్య శాఖ దష్టి పెట్టింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికి ముందు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 3286 ఆక్సిజన్ పైప్లైన్లు అందుబాటులో ఉండగా, ఆ తర్వాత ప్రభుత్వం వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతోంది.ఈ ఏడాది జూన్ 3వ తేదీ నాటికి 11,364 కొత్త ఆక్సిజన్ పైప్లైన్లు మంజూరు చేయగా, వాటిలో 10,425 పైప్లైన్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూలై 29న మరో 7,187 ఆక్సిజన్ పైప్లైన్లను మంజూరు చేశారు.ఆ విధంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 17,827, పైవేటు ఆస్పత్రులలో 11,084 పైప్లైన్లు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 28,911 ఆక్సిజన్ పైప్లైన్లు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్లాస్మా ఇస్తే రూ.5 వేలు : కోవిడ్ చికిత్సకు అవసరమైన ప్లాస్మా సేకరణపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ దిశలో ప్రజలను ప్రోత్సహించే విధంగా ప్లాస్మా డొనేట్ చేస్తే రూ.5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్), కర్నూలులోని సర్వ జన ఆస్పత్రి (జీజీహెచ్)లో ప్లాస్మా థెరపీ చికిత్స చేస్తున్నారు. ఆందోళన వద్దు : వీటన్నింటి నేపథ్యంలో కరోనా పాజిటివ్‌ను గుర్తించినా, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని చోట్లా కరోనా చికిత్సకు ఏర్పాటు చేశామని, మరోవైపు బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకుంటే, కోవిడ్ మహమ్మారి నుంచి బయట పడవచ్చని, అందువల్ల ప్రజలెవ్వరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ శాఖ వివరించింది. -
ఆక్సిజన్ కొనేస్తున్నారు!
సాక్షి సిటీబ్యూరో: పాతబస్తీకి చెందిన ఓ యువకుడు తన తల్లికి ఆక్సిజన్ కోసం కారులో ఎక్కించుకొని ఎన్నో చోట్లకు వెళ్లాడు. ఎక్కడా ఆక్సిజన్ దొరకలేదు. దీంతో నేరుగా జల్పల్లిలోని ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్లింగ్ యూనిట్‌కి రాత్రి 11 గంటలకు తీసుకెళ్లాడు. అయితే అక్కడ కూడా ఆక్సిజన్ స్టాక్ లేదని, కొద్దిసేవు వేచి ఉండాలని నిర్వాహకులు చెప్పారు. ఇంతలోనే తల్లి అక్కడే మృతి చెందింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నగరంలో ఆక్సిజన్ గ్యాస్ షార్టేజ్ అయిందని పుకార్లు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో కరోనా వ్యాధి తీవ్రత మరింత పెరిగి ఆక్సిజన్ అందుబాటులో ఉండదనే ఉద్దేశంతో నగర ప్రజలు ముందస్తుగా మందులు, ఆక్సిజన్ సిలిండర్లు కొంటున్నారు. రానురాను సిలిండర్లు దొరకవని ప్రచారం ‘‘రానురాను కరోనా రోగుల సంఖ్య పెరిగి ఆక్సిజన్ సిలిండర్లు దొరుకుడు కష్టమట కదా? అందుకే ఒకట్రెండు సిలిండర్లు తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నా’’... పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి మాటలివి. కరోనా భయంతో ప్రైవేట్ దవాఖానాల్లో ముందే బెడ్లు రిజర్వు చేసుకుంటున్న వారు కొందరైతే, ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ కొని ఇంట్లో దాచిపెట్టు కుందామనుకుంటున్నవారు మరికొందరు. శ్వాస సంబంధ వ్యాధు లు, వృద్ధాప్యం, వైరల్ లోడ్ అధికంగా ఉండటం. ఇలాంటి సమస్య లున్న వారికే ఆక్సిజన్ అవసరమని నివేదికలు, సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయినా కొందరు అతిగా ఊహించుకొని హంగామా సృష్టిస్తున్నారు. అనవసరంగా ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెంచుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే చాలా కుటుంబ సభ్యులు, సంబంధీకులు రకరకాల సలహాలు ఇస్తున్నారు. రోగ లక్షణాలు ఉన్నా లేకున్నా.. వ్యాధి ముదిరినా లేకున్నా ఆక్సిజన్ సిలిండర్లు కొనాల్సిందేనని ఉచిత సలహాలు ఇస్తున్నారు. డాక్టర్ ఆక్సిజన్ అవసరం లేదని చేప్పినా ఆ మాటాలను పక్కన పెట్టి సిలిండర్లు కొంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలోనే అందించాలి.... కరోనా పాజిటివ్ వస్తే రోగ లక్షణాలు అంతగా లేకపోతే డాక్టర్లు ఇంటివద్దే ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యసిబ్బంది నేరు గా ఇంటికి వెళ్లడం లేదా టెలీమెడిసిన్ ద్వారా వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే డాక్టర్లు రోగం ముదిరే వరకు ఇలాగే చేస్తున్నారని, రోగం ముదిరిన తర్వాత ఆక్సిజన్ వాడమంటున్నారని ఇళ్లలో సిలిండర్లు ముందస్తుగా పెడుతున్నారు. కొంతమంది డాక్టర్లకు తెలియకుండానే ఇళ్లలో రోగులకు ఆక్సిజన్ ఇస్తున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నవారికి వైద్యుల పర్యవేక్షణలోనే కృత్రిమ శ్వాస అందించాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ అవసరం ఉన్నా..లేకున్నా నగరంలో కోవిడ్ వ్యాధి బారిన పడ్డ రోగులు ఆక్సిజన్ వాడుతున్నారు. మరోవైపు పలువురు డాక్టర్లు రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆసుపత్రికి తీసుకెళ్లాని, లేని పక్షంలో చాలా ఇబ్బందులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
అసలు ధర 10వేలు.. ఇచ్చే ధర 25 వేలు
ఎల్బీనగర్కు చెందిన ఓ యువకుడి తాతకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కానీ వ్యాధి లక్షణాలు పెద్దగా లేవు. దీంతో వైద్యులు ఇంట్లోనే ఉండాలని వృద్ధుడికి సూచించారు. ఎక్కువ వయసు కావడంతో ఆక్సిజన్ పెట్టాలన్నారు. ఆక్సిజన్ సిలిండర్ కొనేందుకు వివిధ కంపెనీలకు ఫోన్ చేశారు సదరు యువకుడు. ప్రస్తుతం స్టాక్ లేదని, రెండు మూడు రోజుల్లో వస్తుందని ఓ కంపెనీ చెప్పింది. ఆ తర్వాత మాట మార్చింది. ఆర్డర్లు చాలా ఉన్నాయి. ధరలు బాగా పెరిగాయి. అత్యవసరమైతే తాము చెప్పిన ధర చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో 13 కేజీల సిలిండర్ రూ.25 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. సాధారణ రోజుల్లో ఈ సిలిండర్ రూ.10 వేలకే లభిస్తుంది. కానీ.. కరోనా వేళ కాసుల దందా చేస్తున్న కొన్ని కంపెనీలు దోపిడీ చేస్తున్నాయి. నగరంలో సిలిండర్ల అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందనడానికి ఈ ఉదాహరణ ఓ మచ్చుతునక. సిలిండర్ ధర కంటే ఎక్కువగా తీసుకొని విక్రయిస్తుండటం షరామామూలుగా మారింది. కొంత మంది వ్యాపారులు వందల సంఖ్యలో సిలిండర్లు ఉన్నా స్టాక్ లేదనే సాకుతో ఎక్కువ డబ్బులు గుంజుతున్నారు. సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్లో కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది ముందస్తుగా వైద్య పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో ఇటు ఆక్సిజన్ సిలిండర్ కంపెనీలు అటు అక్రమ వ్యాపారులు ధరలు విపరీతంగా పెంచి విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. నగరంలో ఎక్కువగా మెడికల్ దుకాణాలు కేంద్రంగా సిలిండర్ల అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎల్బీనర్, మలక్‌పేట్, నాంపల్లి, కోఠి, కూకట్పల్లి, మెహిదీపట్నం, టోలిచౌకితో పాటు పాతబస్తీలోని పలు మెడికల్ పాపుల నిర్వాహకులు లైసెన్స్ ఉన్న కంపెనీల నుంచి అక్రమంగా సిలిండర్లు కొనుగోలు చేసుకున్నారు. వీటిని నిల్వ చేసి ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ‘సాక్షి’ సర్వేలో వెలుగు చూసింది. సిలిండర్ కావాలని అడిగితే ముందు లేదని చెబుతున్నారు. ఆ తర్వాత పరిచయం ఉన్న వ్యక్తి పేరు చెబితే మాత్రం సిలిండర్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. తాము చెప్పిన ధర ఇవ్వాలని లేని పక్షంలో సిలిండర్ లేదని తెగేసి చెబుతున్నారు. కరోనా వేళ కేటుగాళ్లు క్యాష్ చేసుకోవడంతో చేతివాటం కనబరుస్తున్నారు. అవసరాన్ని బట్టి.. గ్రేటర్లో కరోనా వ్యాధి విశ్వరూపం దాలుస్తుండటంతో వ్యాధి బారినపడిన వారికి ఆసుపత్రుల్లో వైద్యం సరిగా అందలేదు. దీంతో రోగులు ఇళ్ల వద్దే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు. రోగం ముదరక ముందు అన్ని రకాల సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారు. రోగుల సంబంధీకులు ఇందులో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లు కూడా కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. కొందరు డాక్టర్ల సూచనల మేరకు రోగులకు ఆక్సిజన్ పెడుతున్నారు. అయితే కరోనా వ్యాధి తీవ్రతతో జనం ఆక్సిజన్ సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలో జోరుగా అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్ దందా సాగుతోంది. సిలిండర్ అసలు ధర కంటే రెండు మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఎంత అత్యవసరమైతే అంత ఎక్కువ ధర తీసుకుంటున్నారు. లైసెన్స్ లేకపోయినా ఫిల్లింగ్.. లైసెన్స్ లేకపోయినా సిలిండర్లు ఫిల్లింగ్ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు జంబో, పెద్ద సిలిండర్లు కంపెనీల నుంచి తీసుకొచ్చి ఇళ్లలో, షాప్‌ల్లో రీఫిల్లింగ్ చేస్తున్నారు. జంబో, పెద్ద సిలిండర్ల ద్వారా పైప్‌లైన్స్ ఏర్పాటు చేసి ఎల్పీజీ సిలిండర్ ఫిల్లింగ్ చేసినట్లు ఆక్సిజన్ సిలిండర్లు ఫిల్ చేస్తున్నారు. 10 కేజీల సిలిండర్ రూ.500 నుంచి రూ.800 వరకు, 13 కేజీల సిలిండర్ రూ. 1000 నుంచి రూ.1200కు ఫిల్లింగ్ చేస్తున్నారు. కొంతమంది పూర్తిగా సిలిండర్ ఫిల్లింగ్ చేయడం లేదు. ఎందుకంటే కొనుగోలు చేసినప్పుడు వచ్చినంత బరువు ఉండడం లేదు. అదేవిధంగా కొత్తగా కొన్న సిలిండర్ మూడు నుంచి నాలుగు రోజులు వస్తే ఫిలింగ్ చేసిన సిలిండర్ రెండు రోజులకే అయిపోతోంది. ఫిల్లింగ్‌కు ఒకవైపు ఎక్కువ డబ్బులు మరోవైపు తక్కువగా ఫిలింగ్ చేస్తూ ఆపదలో ఉన్నవారిని మోసం చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. లెసెన్స్ ఉంటేనే విక్రయించాలి.. గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి డ్రగ్స్ కంట్రోల్ అనుమతి తీసుకోవాలి. ఈ కంపెనీలు మాత్రమే ఆక్సిజన్ ఫిల్లింగ్‌తో పాటు నాణ్యమైన సిలిండర్లు తయారు చేసి విక్రయిస్తాయి. అక్రమ వ్యాపారులు కంపెనీల నుంచే సిలిండర్లు కొనుగోలు చేసి తమ వద్ద నిల్వ చేసుకొని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. సిలిండర్ల రీఫిల్లింగ్ కంపెనీల్లోనే చేయాలి. కానీ అన్ని ప్రాంతాల్లో కంపెనీ రీఫిల్లింగ్ అందుబాటులో లేకపోవడంతో పలువురు జంబో, పెద్ద సిలిండర్ల ద్వారా ఇళ్లలో, షాప్‌ల్లో రీఫిల్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయం తెలిసినా డ్రాగ్స్ కంట్రోల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అయ్యో... బిడ్డ
సాక్షి, నల్లగొండ : శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, ఆక్సిజన్ సరఫరా లేక కొడుకు నరకయాతన పడుతుండగా... ఏం చేయాలో దిక్కుతోచక కన్నతల్లి తల్లడిల్లింది. బిడ్డను పిలుస్తూ, సపర్యలు చేస్తూ రోదించింది. ఆమె అలా చూస్తుం డగానే కుమారుడి ప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి ఎందరి హృదయాలనో బరువెక్కించింది. నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఈ ఘటన జరిగింది. దీన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం సల్కునూరు గ్రామానికి చెందిన బొప్పని యాదయ్య (40) ఆరోగ్యం బాగోలేక శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరగా, శనివారం సాయంత్రం శ్వాస ఆడకపోవడంతో ఆక్సిజన్ అందించారు. కొద్దిసేపటి తర్వాత ఆక్సిజన్ అయిపోయింది. తల్లి లక్ష్మమ్మ కుమారుడి అవస్థను చూసి ఎంతగా రోదించినా ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించలేదు. గిలగిలలాడిన యాదయ్య తుదిశ్వాస విడిచాడు. యాదయ్య లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో కొంతకాలంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. అతని భార్య కూడా ఐదేళ్ల క్రితం చనిపోయింది. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి లక్ష్మమ్మ తన పెన్షన్ డబ్బులతోనే యాదయ్య, అతని పిల్లలను సాకుతోంది. ఈ క్రమంలో యాదయ్యకు ఆయాసం ఎక్కువ కావడంతో శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చింది. పరీక్షించిన వైద్యులు శ్వాససంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించినా.. కరోనా లక్షణాలు ఉండడంతో అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో చేర్చారు. అతను శ్వాస ఆడక శనివారం సాయంత్రం మరణించాడు. సకాలంలో వైద్యం అందితే బతికేవాడు నా కుమారుడికి సరైన సమయంలో వైద్యం, ఆక్సిజన్ అందితే బతికేవాడని తల్లి లక్ష్మమ్మ తెలిపింది. డాక్టర్లు ఎవరూ పట్టించుకోలేదని, ఆక్సిజన్ పెట్టినా అది అయిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక చనిపోయినట్లు ఆరోపించింది. యాదయ్యకు కరోనా లక్షణాలు ఉండడంతో అతని నుంచి నమూనాలు తీసుకుని పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌కు పంపినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంకా రిజల్ట్ రాలేదని పేర్కొన్నాయి. సుమోటోగా కేసు నమోదు ఆస్పత్రి బెడ్‌పై కుమారుడు యాదయ్యకు తల్లి సేవలు చేస్తూ రోదిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఆగస్టు 21లోగా అన్ని ఆధారాలతో పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఎంహెచ్ఓ కొండల్రావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహకు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. నివేదిక కోరిన కలెక్టర్ యువకుడి మృతిపై పూర్తిస్థాయిలో విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ నర్సింహను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం యాదయ్య తీవ్ర శ్వాస ఇబ్బంది, దగ్గు, జ్వరంతో చికిత్స కోసం 17న ఆస్పత్రిలో చేరాడని, అతను అప్పటికే అలర్జి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరి వ్యాధి (సీఓపీడీ)తో బాధపడుతున్నాడని కలెక్టర్ వివరించారు. వచ్చిన వెంటనే కరోనా అనుమానిత వార్డులో చేర్చుకుని సంబంధిత డాక్టర్, సిబ్బంది శక్తివంచన లేకుండా వైద్యసేవలు అందించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయాడన్నారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే సంబంధీకులపై చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్ఆర్సీ నుంచి ఇంకా నోటీసులు రాలేదని, వచ్చాక స్పందిస్తామని తెలిపారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని పేర్కొన్నారు. -
ఆక్సిజన్ సిలిండర్ల కొరత
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లకు కొరత ఏర్పడింది. మున్ముందు అవసరం అవుతుందన్న భావనతో అనేక మంది ముందస్తుగా కొనుగోలు చేసి ఇళ్లలో పెట్టుకుంటున్నారు. దీంతో మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు పంపిణీదారులు, విక్రయదారులు బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆక్సిజన్ సిలిండర్ పంపిణీదారులపై దాడులు చేస్తున్నారు. సిలిండర్లను కేవలం ఆసుపత్రులు, లైసెన్స్ హోల్డర్లకు మాత్రమే సరఫరా చేయాలి. అలాకాకుండా ఇష్టారాజ్యంగా సరఫరా చేస్తుండటంతో 44 మంది పంపిణీదారులు, 16 తయారీ యూనిట్లలో అధికారులు తనిఖీలు చేశారు. 14 మంది పంపిణీదారులు, ఒక తయారీ యూనిట్ వద్ద రికార్డుల్లో వ్యత్యాసాలు గుర్తించారు. వాటికి నోటీసులు జారీ చేశారు. వ్యక్తులు లేదా సంస్థల పేరిట సిలిండర్ల సరఫరాకు అనుమతి లేదని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంపిణీదారులపై దాడులు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. ఎక్కడైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్ సిలిండర్లను నిర్ణయించిన సీలింగ్ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే కేసులు బుక్ చేస్తామని తెలిపారు. మూడింతలు పెరిగిన ధర ఇటు బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్ ధరలు ఏకంగా మూడింతలు పెరగడం గమనార్హం. గతంలో రూ.4 వేలకు లభించిన 7 లీటర్ల (బీ రకం) ఆక్సిజన్ సిలిండర్, ఇప్పుడు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. సిలిండర్ల డిమాండ్ 10 నుంచి 20 శాతం పెరిగింది. దీంతో సాధారణ రేటుకు ఆక్సిజన్ సిలిండర్లు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ అడిగినా స్టాక్ లేదన్న మాటే వినబడుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు తాజాగా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను వ్యక్తులకు విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ‘సరఫరాదారులు చిన్న ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మాకు చెప్పారు. తీరా చూస్తే అవి బ్లాక్‌లో మాత్రమే దొరుకుతున్నాయి’అని ఓ వైద్య నిపుణుడు వ్యాఖ్యానించారు. సిలిండర్ల కొరత కారణంగా ఆసు పత్రులు తమ ఐసీయూలలో డిమాండ్‌ను తీర్చడానికి ఇబ్బంది పడుతున్నాయి. ‘కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో భారీ కొరత ఉంది’అని ఓ వైద్యాధికారి చెప్పారు. ‘ఉబ్బసం వంటి వ్యాధి ఉన్న కొందరు వ్యక్తులు 5 నుంచి 10 సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప వ్యక్తులకు సరఫరా చేయొద్దని సరఫరాదారులకు సలహా ఇచ్చామని’ఒక డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ తెలిపారు. కొందరికే అవసరం కరోనా రోగులకు అత్యవసరమైతే ఆక్సిజన్ అందజేయాలి. అప్పుడే రోగి కోలుకుంటాడు. వాస్తవానికి కరోనా రోగుల్లో 80 శాతం మందికి ఎలాంటి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు. మధుమేహం, బీపీ నియంత్రణలో లేనప్పుడు, దీర్ఘకాలిక మూత్రపిండాలు, కాలేయ వ్యాధి, గుండె ఆగిపోవడం లేదా రోగనిరోధక మందుల మీద ఉన్నవారికి ఆక్సిజన్ అవసరం కావచ్చు. అనవసర భయాందోళనల కారణంగా కొందరు ముందు జాగ్రత్తగా వాటిని కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. విచిత్రమేంటంటే కొన్ని నర్సింగ్ హోంలు, క్లినిక్ సెంటర్లు ఆక్సిజన్ సిలిండర్ల కిట్‌ను కూడా రోగులకు విక్రయిస్తున్నాయి. అవసరమైనప్పుడు వాడుకోవచ్చని వారిని భయపెట్టి అంటగడుతున్నాయి. దీంతో అత్యవసర రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. -
ఉచిత ఆక్సిజన్ సిలిండర్లకు బ్రేక్!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కష్టకాలంలో అత్యవసరం ఉన్న నిరుపేద రోగులకు అందజేస్తున్న ‘ఉచిత ఆక్సిజన్ సిలిండర్ల’ ప్రక్రియకు బ్రేక్ పడింది. నగరంలోని గోల్కొండలో ఎలాంటి లైసెన్స్, ముందస్తు జాగ్రత్త చర్యలు లేకుండా కొనసాగుతున్న అక్రమ ఆక్సిజన్ సిలిండర్ల దందా బయటపడటంతో మిగతా చోట్ల ఆక్సిజన్ సిలిండర్ల నిల్వలపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. అందులో భాగంగా పలు ఎన్జీవోలు, దాతలకు సైతం ‘ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీ నిలిపివేయాలని స్థానిక పోలీసుల నుంచి ఆదేశాలు అందాయి. నిబంధనలకు విరుద్ధంగా సిలిండర్లను నిల్వ ఉంచితే ఎక్స్‌ప్లోజివ్ చట్టం, జాతీయ విపత్తు నిర్వాహణ చట్టం కింద కేసులు నమోదు తప్పదని అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. కరోనా బారినపడి రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ఊపిరితిత్తుల్లో సమస్యలు తలెత్తుతుండటంతో వారికి ఆక్సిజన్ అందించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు ఆక్సిజన్ సిలిండర్ల దందాకు తెరలేపడాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసు యంత్రాంగం ఎక్స్‌ప్లోజివ్ చట్టం నిబంధలను కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. కరోనా కేసుల్లో ఆక్సిజన్ అందక బాధితుల ప్రాణాలు పోతుంటే.. ఉచిత ఆక్సిజన్ సిలిండర్ల పంపిణీకి కూడా ఎక్స్‌ప్లోజివ్ చట్టం వర్తింపజేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఆక్సిజన్ అందక.. హైదరాబాద్ మహా నగరంలో కరోనా బారిన పడిన వారిలో అత్యధికంగా ఊపిరి ఆడక మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల తీవ్ర కొరత ఉండగా, ఇక ఇంటి వద్ద ఉండి చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మెడికల్ ఆక్సిజన్ ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో కొన్ని ఎన్జీవో సంస్థలు, మసీదులు ముందుకు వచ్చి దాతల ఆర్థిక చేయూతతో అత్యవసరం ఉన్న నిరుపేదరోగులకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లపంపిణీకి శ్రీకారం చుట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో 15 రోజులుగా ఉచిత సిలిండర్ల పక్రియ కొనసాగింది. కొన్ని ఎన్జీవోలైతే ఏకంగా తమ వాహనాల్లోనే బాధితుల ఇళ్ల్ల వద్దకు సైతం సిలిండర్లు, దానికి సంబంధించిన పరికరాలను చేరవేశాయి. ఆయా ఎన్జీవో సంస్థలు, సామాజిక సేవకులు, మసీదు కమిటీలు, దాతలు సోషల్ మీడియాలో ఉచిత ఆక్సిజన్ సిలిండర్ల పోస్టు పెట్టడంతో స్పందన లభించింది. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మరికొందరు దాతలు సైతం ఉచిత సిలిండర్లపంపిణీకి ఆర్థిక చేయూత అందించేందుకు ముందుకు వచ్చారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో లక్షలతో కూడుకున్న పని కావడంతో పేదలకు ఇంటి వద్దకే ఆక్సిజన్ సిలిండర్లు అందజేయడంతో ఉపశమనం కలిగింది. తాజాగా ఉచిత సిలిండర్ల పంపిణీ నిలిపివేతతో నిరుపేదలకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. అత్యవసరం విషమ పరిస్థితుల్లో గల రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు అత్యవసరంగా మారాయి. డిమాండ్‌కు తగ్గ సిలిండర్లు అందుబాటులో లేక మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్లకు కొరత ఏర్పడింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ‘మెడికల్ ఆక్సిజన్’ కొరత ఇబ్బందిగా మారింది. ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా.. ఆక్సిజన్ సిలిండర్ల కొరత సమస్యగా మారింది. పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్‌కు పరిమితం చేయడంతో బహిరంగ మార్కెట్లో మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగినట్లయింది. వాస్తవంగా ఆక్సిజన్ సిలిండర్ల ఉత్పత్తి చేసే సంస్థలు, కంపెనీలకు కూడా డిమాండ్‌కు తగ్గ సరఫరా తలకు మించిన భారంగా తయారైంది. రీఫిల్ చేయడానికి ఖాళీ సిలిండర్ల కొరత కూడా వెంటాడుతోంది. కరోనా రోగుల తాకిడిని తట్టుకునేందుకు ఏకంగా ఐసీఎమ్ఆర్ నిబంధనల మేరకు.. పాజిటివ్ పేషంట్లను ఇళ్లకు పరిమితం చేస్తూ ఇంట్లో ఉండి వైద్యం చేసుకోవాలని అధికారులు పేర్కొనడం విస్మయంకలిగిస్తోంది. ఆక్సిజన్ టెన్షన్.. హోమ్ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం చేయించుకుంటున్న రోగులకు ఆక్సిజన్ సిలిండర్లటెన్షన్ వెంటాడుతోంది. కరోనా ప్రాథమిక స్థాయిలో ఉంటే ఇబ్బంది లేదు. కానీ ఆక్సిజన్ పెట్టాల్సి వస్తే.. తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన అధికమైంది. ఓల్డేజ్, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వారు కరోనా వైరస్‌తో కొద్ది రోజుల వ్యవధిలో చనిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా ఊపిరి అందకపోవడమే కారణంగా తెలుస్తోంది. దీంతో ముందస్తుగా ఆక్సిజన్ సిలిండర్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుండంతో మెడికల్ ఆక్సిజన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. హోం క్వారంటైన్లో ఉన్న కరోనా పేషెంట్లు ఆక్సిజన్ సిలిండర్లు, మిషన్లు అద్దెకు తీసుకుంటున్నారు. మరికొంత మంది రేటు ఎక్కువైనా వీటిని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు.. ఆక్సిజన్ సిలిండర్స్, మెషిన్స్తోపాటు పల్స్ ఆక్సీ మీటర్స్ కూడా విపరీతంగా డిమాండ్ పెరిగినట్లయింది. సిలిండర్ల ధర ఇలా... సిలిండర్ల ధర ఇష్టానుసారంగా తయారైంది. సాధారణంగా 10 కిలోల సిలిండర్ ధర రూ.7 వేల నుంచి రూ.8 వేల రూపాయలుంటే.. ప్రస్తుతం రూ.10 వేలకు పైగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా లభించని పరిస్థితి. 12 కిలోల సిలిండర్ రూ.10 నుంచి రూ.12 వేలు ఉంటే ప్రస్తుతం రూ.20 వేల వరకు ధర పలుకుతోంది. 10 కిలో సిలెండర్‌తో 8 గంటలు, 12 కిలోల సిలెండర్‌తో 10 గంటల పాటు రోగికి ఆక్సిజన్ అందించే అవకాశం ఉంటుంది. సిలిండర్ పూర్తయ్యే సరికి రీఫిల్ సిద్ధంగా ఉండాలి. కనీసం రెండు సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఖాళీ సిలిండర్ రీఫిలింగ్ సమస్యగా తయారైంది. సిలిండర్ల రీఫిలింగ్‌కు రెండు, మూడు రోజులు పడుతోంది. మరోవైపు పవర్‌తో నడిచే ఆక్సిజన్ మెషిన్స్ 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు ఉంటాయి. రూ.45 వేల నుంచి రూ.75 వేల వరకు ధర పలుకుతోంది. ఆక్సిజన్ సిలిండర్ కంటే మెషిన్ అయితే డిస్పోజబుల్ క్యాప్ వల్ల అందరూ వినియోగించుకునే అవకాశం ఉంది. -
గాలిగాళ్ల దోపిడీ
-
బ్లాక్‌లో ఆక్సిజన్ సిలిండర్లు.. టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలెండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తూ దోచుకుంటున్న ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ముషీరాబాద్‌లోని ఇందిరానగర్ లోని బాబా ట్రేడర్స్ పై దాడులు జరిపారు. లైసెన్స్‌లు లేకుండా ఆక్సిజన్ సిలెండర్లు అమ్మకాలు చేస్తున్న షేక్ అక్బర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, 38 ఆక్సిజన్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. కరోనా సోకిన వ్యక్తులు, క్వారంటైన్లో ఉన్నవారికి కొన్ని ముఠాలు అక్రమంగా అధిక ధరలకు ఆక్సిజన్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వెస్ట్‌జోన్‌లో 43 సిలెండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ.లక్ష!!) -
హైదరాబాద్: అమ్మకానికి ఆక్సిజన్ సిలిండర్లు
-
ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ.లక్ష!!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు ఆక్సిజన్ అందక కోవిడ్ బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే.. మరోవైపు కొందరు ఆక్సిజన్ సిలిండర్ల దందాకు తెరలేపారు. అక్రమంగా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతూ లక్షల రూపాయలు దండుకుంటున్నారు. ఈక్రమంలో సిలిండర్ల దందాపై పక్కా సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఆ ముఠాను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్ముతున్న రెండు ముఠాలపై దాడి చేసిన పోలీసులు 34 ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. పలు క్లీనిక్‌లు, ఆస్పత్రులు, వ్యక్తిగతంగా కొందరికి ఈ ముఠాలు ఆక్సిజన్ సిలిండర్లు అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్క సిలిండర్‌కు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్లను రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు అప్పగించామని తెలిపారు. నగరంలో సిలిండర్ల అమ్మకాల పై దృష్టి సారించామని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. (చదవండి: దుబ్బాకలో మరో డేరాబాబా) -
కరోనా: నిజామాబాద్ ఆసుపత్రిలో కలకలం
సాక్షి, నిజామాబాద్ : కరోనాతో ఒకేసారి నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం సృష్టిస్తోంది. ఒకరు ఆక్సిజన్ అందక మృతిచెందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే అతడు చనిపోయారని మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు కరోనా కారణంగా 9 మంది మృతి చెందారు. అయితే ఒకేసారి నలుగురు చనిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పలు అనుమానులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. నలుగురు కరోనా బాధితులు ఒకేసారి ఎలా చనిపోయారన్న దానిపై వివరాలు ఆరా తీశారు. బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులతో ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కోవిడ్ పేషెంట్ల కోసం లగ్జరీ కారు అమ్మాడు
ముంబై: కళ్ల ముందే ఫ్రెండ్ సోదరి ప్రాణాలు కోల్పోయింది. బతికించుకునే ఆర్థిక స్థోమత ఉన్నా ఆసుపత్రుల్లో వైద్య పరికరాల కొరత, పడకలు ఖాళీగా లేకపోవడం వల్ల ఆమె కడుపులో బిడ్డతో సహా మరణించాల్సి వచ్చింది. ఇది చూసిన ముంబైకి చెందిన షెహనవాజ్ మనసు చలించిపోయింది. కనీసం ఆక్సిజన్ సిలిండర్ ఉన్నా ఆమె బతికి ఉండేదని ఓ వైద్యుడు చెప్పడంతో అతను మరింత బాధపడ్డాడు. అదే సమయంలో అతని మనసులో పదిమందికి సాయం చేయాలనే ఆలోచన పునాది పోసుకుంది. ఆ మహిళలాగా ఎవరూ చనిపోవడానికి వీల్లేదంటూ తనకు చేతనైన సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. (మృతదేహాలకు కరోనా పరీక్షలు బంద్) కరోనా బారిన పడ్డ పత్రి ఒక్కరికీ ఆసుపత్రిలో బెడ్డు దొరకని పరిస్థితి అందరికీ తెలిసిందే. అటు ఆసుపత్రులనూ వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల కొరత వెంటాడుతోంది. ఈ క్రమంలో ఇంట్లో స్వీయ నిర్బంధం విధించుకుంటున్న కోవిడ్ పేషెంట్లకు సాయం చేసేందుకు షెహనవాజ్ తనకు ఎంతో ఇష్టమైన ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్) కారును అమ్మేశాడు. ఆ డబ్బుతో 60 సిలిండర్లను కొని మరో 40 సిలిండర్లను అద్దెకు తీసుకున్నాడు. వీటిని సకాలంలో కోవిడ్ బాధితులకు అందజేసి ప్రాణదాతగా మారాడు. అలా సుమారు 300 మందికి సాయం చేశాడు. కాగా షెహనవాజ్ తన మిత్రుడు అబ్బాస్ రిజ్వీతో కలిసి ఓ ఎన్జీవో నడిపిస్తున్నాడు. సాయం కోసం ఎన్జీవో తలుపు తట్టినవారికి తామున్నామంటూ అండగా నిలబడుతున్నారు. కరోనా కష్టకాలంలో వీరు చేస్తున్న పని ఇతరులకు ఆదర్శప్రాయంగా మారింది. (తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం) -
కరోనా: విశాఖ నావల్ డాక్‌యార్డ్ వినూత్న పరికరం
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఒకే ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆరుగురికి ఆక్సిజన్ అందించే వినూత్నమైన పరికరాన్ని విశాఖ నావల్ డాక్‌యార్డ్ అభివృద్ధి చేసింది. మల్టీఫీడ్ ఆక్సిజన్ మెనిఫోల్డ్ (ఎంవోఎం) పేరిట ఈ పరికరాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా ఆస్పత్రుల్లో ప్రతీ బెడ్‌కు పైప్ ద్వారా ఆక్సిజన్ అందించే సదుపాయం ఉంటుంది. కానీ ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కాలేజీలు, హోటల్స్, కళ్యాణ మండపాలు వంటి చోట్ల ఏర్పాటు చేసే ఆస్పత్రుల్లో ప్రతీ రోగికీ ఒక ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయడం కష్టంతో కూడిన పని. దీన్ని దృష్టిలో పెట్టుకుని నావల్ డాక్‌యార్డ్ సిబ్బంది ఈ ఎంవోఎం పరికరాన్ని అభివృద్ధి చేసి పరీక్షించారు. ఇది సత్ఫలితాన్ని ఇవ్వడంతో సుమారు 25 ఎంవోఎం పరికరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా అందచేయాలని నేవీ అధికారులు నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. సాధారణంగా కోవిడ్–19 బారిన పడ్డ వారిలో 5 నుంచి 8 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ల అవసరం ఉంటుంది. మిగిలిన వారికి ఆక్సిజన్ అందిస్తే సరిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ సెంటర్లకు ఎంవోఎం చక్కగా ఉపయోగపడుతుందని నేవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నావెల్ డాక్‌యార్డ్ 10 ఎంవోఎంలను తయారు చేస్తోంది. -
ఒకే సిలిండర్ నుంచి ఆరుగురికి ఆక్సిజన్
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఒకే ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆరుగురికి ఆక్సిజన్ అందించే వినూత్నమైన పరికరాన్ని విశాఖ నావల్ డాక్‌యార్డ్ అభివృద్ధి చేసింది. మల్టీఫీడ్ ఆక్సిజన్ మెనిఫోల్డ్ (ఎంవోఎం) పేరిట ఈ పరికరాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా ఆస్పత్రుల్లో ప్రతీ బెడ్‌కు పైప్ ద్వారా ఆక్సిజన్ అందించే సదుపాయం ఉంటుంది. కానీ ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కాలేజీలు, హోటల్స్, కళ్యాణ మండపాలు వంటి చోట్ల ఏర్పాటు చేసే ఆస్పత్రుల్లో ప్రతీ రోగికీ ఒక ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయడం కష్టంతో కూడిన పని. దీన్ని దృష్టిలో పెట్టుకుని నావల్ డాక్‌యార్డ్ సిబ్బంది ఈ ఎంవోఎం పరికరాన్ని అభివృద్ధి చేసి పరీక్షించారు. ఇది సత్ఫలితాన్ని ఇవ్వడంతో సుమారు 25 ఎంవోఎం పరికరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉచితంగా అందచేయాలని నేవీ అధికారులు నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. సాధారణంగా కోవిడ్–19 బారిన పడ్డ వారిలో 5 నుంచి 8 శాతం మందికి మాత్రమే వెంటిలేటర్ల అవసరం ఉంటుంది. మిగిలిన వారికి ఆక్సిజన్ అందిస్తే సరిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ సెంటర్లకు ఎంవోఎం చక్కగా ఉపయోగపడుతుందని నేవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం నావెల్ డాక్‌యార్డ్ 10 ఎంవోఎంలను తయారు చేస్తోంది. -
ఆక్సిజన్ సిలిండర్‌తో సివిల్స్ పరీక్ష
తిరువనంతపురం: ఓ సివిల్స్ అభ్యర్థి తపనను అనారోగ్యం కూడా అడ్డుకోలేకపోయింది. ఎముకల వ్యాధితో బాధ పడుతున్నా, ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. కేరళలోని కొట్టాయంకు దగ్గరలో ఉన్న ఎరుమెలికి చెందిన లతీషా అన్సారీ(24) పుట్టినప్పటి నుంచి టైప్ –2 ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా అనే అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతోంది. అలాగే పల్మనరీ హైపర్ టెన్షన్ వల్ల ఏడాది నుంచి ఆమెకు ఎల్లప్పుడూ ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఏర్పడింది. అయినప్పటికీ సివిల్స్ రాయాలనుకున్న లతీషా కోసం ఆమె తండ్రి అన్సారీ ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నారు. దీంతో చక్రాల కుర్చీలో, ఆక్సిజన్ సిలిండర్ల సాయంతో ఆమె ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రాథమిక పరీక్షకు హాజరయింది. పరీక్ష అనుమతి కోసం ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ సుధీర్‌బాబుకు అన్సారీ కృతజ్ఞతలు తెలిపారు. లతీషా ఎం.కాం. వరకు చదువుకుందని అన్సారీ వెల్లడించారు. -
ఫోరమ్‌మాల్ ఫ్లైఓవర్‌పై ఆక్సిజన్ సిలీండర్ పేలుడు
-
ఆక్సిజన్ సిలిండర్‌తో పరీక్షకు..
తుర్కయంజాల్: లక్ష్యం ముందు ఎంత పెద్ద సమస్య అయిన చిన్నదే అని నిరూపించింది ఆ విద్యార్థిని. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్కు చెందిన బాలయ్య, వసంతల కూతురు నవీన ఇంజాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. నవీన మూడు నెలలుగా ఆస్తమాతో బాధ పడుతోంది. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నప్పటికీ ఇంకా నయం కాలేదు. ఆస్తమా తీవ్ర స్థాయిలో ఉండటంతో నవీనకు 24 గంటలూ ఆక్సిజన్ సిలిండర్ సహాయంతో శ్వాస అందించాల్సి ఉంది. కాగా, నవీన శనివారం రాగన్నగూడలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి తెలుగు పరీక్షకు సిలిండర్ ద్వారా శ్వాస తీసుకుంటూనే హాజరైంది. ఎంత కష్టమైనా పరీక్ష రాస్తానని తమ కూతురు చెప్పిందని, అందుకే పరీక్ష రాసేందుకు తీసుకువచ్చామని తల్లి వెల్లడించింది. -
పేలిన ఆక్సిజన్ సిలిండర్
సిద్దిపేట టౌన్: ఇంట్లో నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం సిద్దిపేటలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్‌నగర్‌లో నివాసముండే గోపరి మల్లేశం 35 సంవత్సరాలుగా ఆక్సిజన్ సిలిండర్లను విక్రయించే దుకాణం నిర్వహిస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఎప్పటిలాగే ఇంట్లో చిన్న సిలిండర్లలోకి ఆక్సిజన్ నింపుతుండగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. దీంతో ఈ పనిని పర్యవేక్షిస్తున్న మల్లేశం తల్లి లింగమ్మ(70)కు తీవ్ర గాయాలు కావడంతో పాటు కాలు తెగిపోయింది. అక్కడే ఉన్న ఆమె మనవడు వెంకటేశ్(27) కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరినీ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లింగమ్మ మృతిచెందింది. వెంకటేశ్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. పేలుడు ధాటికి ఇంటిముందు నిలిపిన బైకులు చెల్లాచెదురుగా పడ్డాయి. అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను రిటైల్‌గా విక్రయించడంతో పాటు జనావాసంలో నిల్వ ఉంచడం వల్లే ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు. గతంలోనూ మూడుసార్లు ఆక్సిజన్ సిలిండర్లు లీకైన సందర్భాలు ఉన్నాయని వారు చెప్పారు. -
ఆక్సిజన్ అందక అంబులెన్స్‌లోనే..
సాక్షి, లక్నో: రాష్ట్ర ప్రభుత్వం, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయింది. ప్రాణాలు రక్షించేందుకు తరలిస్తున్న అంబులెన్స్ లోనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధితుడి కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ ఘటన యూపీలోని సహరన్‌పూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఓ ఆస్పత్రికి ఫోన్ చేశారు. వైద్యులు ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే పేషెంట్‌ను హాస్పిటల్‌కు తీసుకొచ్చేందుకు అంబులెన్స్ ను పంపించారు. అయితే ఆసుపత్రికి తీసుకొస్తుండగా మార్గం మధ్యలోనే ఆ పేషెంట్ (45) చనిపోయాడు. ఆక్సిజన్ సిలిండర్ పంపకపోవడం వల్లే ప్రాణాలు పోయాయంటూ మృతుడి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ బీఎస్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సిలిండర్ పంపామని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తారని, విచారణలో అన్నీ తెలుతాయన్నారు. ఆక్సిజన్ లేని సిలిండర్లే అంబులెన్స్ లో ఉంటున్నాయని డ్రైవర్ తెలిపాడు. హాస్పిటల్‌కు కాసేపట్లో అంబులెన్స్ చేరుకుంటుందనగా ఆక్సిజన్ అయిపోయందని మెడికల్ టెక్నీషియన్ చెప్పాడు. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలోని పలు ఆస్పత్రల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో నెలల చిన్నారులు వేలల్లో మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. -
భావితరాలకు ఆక్సిజన్ సిలిండర్లే గతి
కోటగుమ్మం(రాజమహేంద్రవరం): ప్రస్తుతం ఉన్న వాతావరణంలో మార్పులు సంభవించకపోతే మన భావితరాలు ఆక్సిజన్ సిలిండర్లతో తిరగాల్సిన పరిస్థితి వస్తుందని నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ఎం.ముత్యాలునాయుడు హెచ్చరించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో గురువారం రాత్రి ‘శక్తి పునరుత్పాదకత’పై అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సుకు సంబంధించిన సావనీర్‌ను ఆవిష్కరించిన ముత్యాలునాయుడు మాట్లాడుతూ ప్రకృతి పరంగా లభించే మంచినీటినే ప్రస్తుత తరుణంలో కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఉందని, వాతావరణంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల వల్ల ఆక్సిజన్‌ను కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. బొగ్గు, ఆయిల్, గ్యాస్‌ను స్థాయికి మించి తవ్వేస్తున్నాం. దాని దుష్ఫలితాలు ప్రస్తుతం మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి పరంగా లభించే సహజ వనరులు గాలి, నీరు, సౌర శక్తి, సముద్రం మన దగ్గర అధికంగా ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కావలసినంత సముద్ర తీరం ఉన్న రాష్ట్రంలో పవన విద్యుత్‌ను ఎందుకు వినియోగించుకోకూడదని ప్రశ్నించారు. వీటన్నింటినీ మనం అందుబాటులోకి తీసుకువస్తే 2030 నాటికి 40 శాతం అభివృద్ధి సాధిస్తామన్నారు. 2050 నాటికి నూరు శాతం అభివృద్ధి సాధించి గ్లోబల్ వార్మింగ్ నుంచి రక్షించుకోగలుగుతామన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తమ కళాశాలలో సోలార్ విద్యుత్‌ను వినియోగించుకుంటున్నామన్నారు. సోలార్ విద్యుత్‌పై త్వరలో తమ కళాశాలలో గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సులు ప్రారంభించనున్నట్టు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ వర్సిటీల ప్రతినిధులు, ఆర్ట్స్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా అంతర్జాతీయ సదస్సు సందర్భంగా కళాశాల విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. -
ఆస్పత్రులకు అందని ఆక్సిజన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని బోధనాస్పత్రులను ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ సరఫరాలో ప్రభుత్వ అలక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. పెద్దాస్పత్రుల్లో ఆక్సిజన్ లేనిదే ఒక్క గంట కూడా గడవదు. పైగా దేశంలోనే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతోంది రాష్ట్రంలోనే. ప్రమాద బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రులకు వస్తుంటారు. ఒక్కో ఆస్పత్రికి మూడు నెలలకుగాను రూ.30 లక్షలు అవసరమవుతుండగా.. ప్రభుత్వం కనీసం రూ.20 లక్షలు కూడా ఇవ్వడం లేదు. కొన్ని ఆస్పత్రుల్లో బయటి నుంచి సిలిండర్లు తెప్పించుకుంటున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో 25 శాతం ఎక్కువ రేటుకు ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. రూ.15 కోట్లకు.. ఇస్తోంది రూ.8 కోట్లే రాష్ట్రంలో మొత్తం 11 బోధనాస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లకు ఏటా రూ.15 కోట్లు పైనే వ్యయం అవుతుంది. కానీ ప్రభుత్వం ఇస్తోంది.. కేవలం రూ.8 కోట్లు మాత్రమే. దీంతో కొన్ని ఆస్పత్రుల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జనరల్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ఆస్పత్రులకే ఆక్సిజన్ సరఫరాకు సరిపడా నిధులు విడుదల కావడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
‘బోరు’ బాలల కోసం...
నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడిన చిన్నారులను ప్రాణాలతో కాపాడేందుకు ఓ యువకుడు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు, ఆంధ్రా సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉంటున్న బోరుబావుల్లో పడి ఎంతో మంది చిన్నారులు కన్నుమూశారు. అలాంటి సంఘటనలు టీవీలో చూసిన యువకుడు చలించిపోయూడు. వారి కోసం ఏదో ఒకటి చేయూలని తలిచాడు. ఆ చిన్నారులను ప్రాణాలతో కాపాడేందుకు ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నాడు. పళ్లిపట్టు (తమిళనాడు): కాంచీపురం జిల్లా పిళ్లైయార్పాళ్యానికి చెందిన శివకుమార్. పాఠశాల దశ నుంచే కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం డీఈసీఈ అనే సాంకేతిక విద్య పూర్తి చేసి విదేశంలో నూనె కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడుతున్న చిన్నారులను సురక్షితంగా వెలుపలికి తీసేందుకు మన యంత్రాంగం ఎంత కృషి చేసినా ఫలితం లేదు. ఇలాంటి సంఘటనలు టీవీలో చూసిన శివకుమార్ కరిగిపోయూడు. ఎంతో మంది తల్లిదండ్రుల కడుపుకోతను చూసి చలించిపోరుున శివకుమార్ వారిని ఎలాగైనా ప్రాణాలు కాపడాలని సంకల్పించారు. దీంతో సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. పరికరం 85 సెంటీమీటర్ల పొడవు, 35 సెంటీ మీటర్ల వెడ ల్పుతో కూడిన ఈ సాధనం అవసరాన్ని బట్టి పొడవు వెడల్పు పెంచి తగ్గించుకోవచ్చు. ఈ యంత్రం దాదాపు 25 కిలోల బరువును మోసే సామర్థ్యం ఉంటుంది. ఇది వరకే అందుబాటులో ఉన్న పరికరాలు చిన్నారిని గాలి వేగంతో లేదా చిన్నారి సాయంతో మాత్రమే వెలికి తీసేందుకు వీలుపడేది. అయితే యువకుడి సరికొత్త ఆవిష్కరణలో బోరుబావిలో చిక్కుకున్న చిన్నారి పరిస్థితిని గుర్తించేందుకు వీలుగా అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరా, చిన్నారి మాటలను సైతం ఖచ్చితంగా వినడానికి వీలుగా మైక్‌ను ఆ పరికరంలో అమర్చారు. అలాగే చిన్నారి శ్వాస తీసుకునేందుకు వీలుగా ఆక్సిజన్ సిలిండర్ ద్వారా తీసుకునే అవకాశం సైతం ఉంది. ఈ సరికొత్త ఆవిష్కరణతో బోరుబావిలోని చిన్నారులను కేవలం అర్దగంట సమయంలో సులభంగా ప్రాణాలతో కాపాడవచ్చు. యువకుడి సరికొత్త ఆవిష్కరణను తన ప్రాంతం ప్రజ లకు తెలియజేసే విధంగా నిరుపయోగంగా ఉంటున్న బోరుబావిని ఎంచుకుని ప్రయోగాత్మకంగా వివరించారు. అతని ఆవిష్కరణలో బోరుబావిలో చిక్కుకున్న చిన్నారిని ఎలా కాపాడాలి? అందుకు ఏం చేయాలో తెలుపుతూ తన సరికొత్త ఆవిష్కరణ ఎలా ఉపయోగపడుతుందో చేసి చూపించారు. ముందుగా ఒక చిన్నారి బొమ్మను బోరు బావిలోకి వేశారు.తరువాత ఆ బొమ్మ ఎంత లోతులో ఉంది, ఏ పరిస్థితిలో ఉందో కనుగొనడానికి తాను తయూరు చేసిన పరికరాన్ని బోరుబావిలోకి పంపించారు. దానికి అనుసంధానం చేసిన అత్యాధునిక పరికరంతో చూస్తూ ఆ సరికొత్త యం త్రాన్ని బోరుబావిలోకి దించాడు. అనంతరం ఆ పరికరం ఉన్న దారాల ఆధారంగా ఆ బొమ్మను పట్టుకుని బోరు బావిలోని గోడలు సైతం ఆ బొమ్మకి తగలకుండా పైకి తీసుకొచ్చాడు. ఇంత అద్భుత ప్రయోగం చేసిన శివకుమార్‌ను స్థానికులు అభినందించకుండా ఎలా ఉంటారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ముందు వెళుతున్న లారీని ఢీకొన్న వ్యాన్ డ్రైవర్, క్లీనర్ మృతి గట్టుభీమవరం వద్ద దుర్ఘటన మృతులు మెదక్ జిల్లా వాసులు గట్టుభీమవరం(వత్సవాయి) : విధి నిర్వహణలో భాగంగా డీసీఎం వ్యాన్‌లో దూరప్రాంతం నుంచి వచ్చిన డ్రైవర్, క్లీనర్ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై గట్టుభీమవరం పరిధిలోని కొంగరమల్లయ్య గుట్టవద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు చెందిన డ్రైవర్ చాకలి గోవర్థన్, క్లీనర్ యేలేష్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం వ్యాన్‌లో విజయవాడ వచ్చారు. అక్కడ సిలిండర్లను నింపుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కొంగరమల్లయ్య గుట్ట వద్ద ముందు వెళుతున్న లారీని వీరి వాహనం అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ కేబిన్ నుజ్జునుజ్జవగా, గోవర్థన్, యేలేష్ లోపల ఇరుక్కుని అక్కడికక్కడే మరణించారు. దీనిపై సమాచారం అందుకున్న వత్సవాయి పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. క్రేన్‌ను రప్పించి, గంటసేపు శ్రమించి మృతదేహాలను వెలికి తీయించారు. మృతుల వద్ద ఉన్న సెల్ఫోన్ల ఆధారంగా వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. జగ్గయ్యపేట సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదవగా, ఎస్సై ఆర్.ప్రసాదరావు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ 108 కే ఆక్సిజన్ సిలిండర్
ఎంజీఎం, న్యూస్‌లైన్: ఎంజీఎంలో ఆక్సిజన్ దందాకు తెరపడింది. గత ఆరేళ్ళుగా నిరాటంకంగా నడుస్తున్న దోపిడీ వ్యవస్థకు చెక్ పడింది. 2007 నుంచి తులసీ ఏజెన్సీ ద్వారా ఆస్పత్రికి రూ 385లకు సరఫరా చేస్తున్న సిలిండర్ ధర టెండర్లలో ప్రస్తుత కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎంజీఎం సూపరింటెండ్, పరిపాలన అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించడంతో ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ ధర రూ108కి పడిపోయింది. దీంతో ఆస్పత్రికి రోజు సుమారు 100 సిలిం డర్లు అవసరమవుతుండగా ఒక్కొ సిలిండర్‌పై 277 చొప్పున రోజుకు సుమారు రూ 30 వేల మిగులు చొప్పులన నెలకు రూ 9 లక్షలు సంవత్సరానికి రూ కోటి ఆదా అవుతాయని ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్ పేర్కొన్నారు. దోపిడీకి స్వస్తి ఆరేళ్ళుగా ఎంజీఎంలో కొనసాగుతున్న ఆక్సిజన్ అక్రమ దందాకు బుధవారంతో తెరపడింది. 2006 నుంచి ఒకే కాంట్రాక్టర్‌కు గత పరిపాలన అధికారులు వత్తాసు పలికి యథేచ్చగా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 2006 నుంచి 2011 వరకు టెండర్ల పేరుతో ఈ ప్రక్రియ సాగగా.. తదనంతరం టెండర్ల ప్రక్రియకు కూడా స్వస్తి పలికారు. లిక్విడ్ ఆక్సిజన్ పేరుతో టెండర్లకు స్వస్తి ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు, మరణాలను తగ్గించేం దుకు 2011లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇదే అదునుగా భావించిన సదరు కాంట్రాక్టర్ అప్పటి సూపరిండెంట్‌ను మచ్చిక చేసుకుని ప్లాంట్ పూర్త య్యే వరకు టెండర్ల పిలవద్దని ఆదేశాలు జారీ చేయించారు. దీంతో 2011-12, 2012-13 సంవత్సరాలకు టెండర్లు పిలవకుండానే నామినేషన్ పద్ధతిన రూ 385లకే ఎంజీఎం ఆస్పత్రికి సిలిండర్లను సరఫరా చేశారు. నివ్వెరపోయిన అధికారులు.. ఎంజీఎంలో ఆక్సిజన్ సిలిండర్ ధర రూ 108 కిపడిపోవడంతో అధికారులు నివ్వెర పోయారు. సిలిండర్ ఒక్కసారిగా రూ 385 నుంచి రూ 108కి అంగీకారం కుదిరిందనే విషయం చెబుతున్న తరుణంలో వాస్తవమేనా.. అని చర్చించుకోవడం ఎంజీఎంలో కనిపించింది. మొత్తానికి గత అధికారులు చేసిన తప్పిదానికి ప్రస్తుత అధికారులు నిక్కచిగా వ్యవహరించి ప్రభు త్వ ఖజానా గండికొట్టకుండా వ్యవహరించిన తీరుపై ఆస్పత్రి వైద్యులు, అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.