Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న కొనసాగుతుంది. రోజుకి వేలల్లో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో కొందరు కరోనా తో చనిపోతే.. మరికొందరు సమయానికి ఆక్సిన్ అందక మృతి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ప్రతీ జిల్లాలోనూ ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’లను నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ట్విటర్ వేదికగా అఫీషియల్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది. వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకలాపాలు, నిర్వహణను హీరో రామ్ చరణ్ చూసుకోనున్నట్లు తెలుస్తోంది. చిరు ఇప్పటికే ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ఏర్పాటు చేసి రక్తదానం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రక్తం దొరక్కుండా ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998వ సంవత్సరంలో ఈ బ్లడ్ బ్యాంక్‌ని స్థాపించాడు.
Comments
Please login to add a commentAdd a comment