న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ బాధితుల్ని రక్షించేందుకు డాక్టర్లు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నారు. అదే డాక్టర్లు కరోనా బాధితులకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా పారిపోవడం కలకలం రేపుతోంది. ఐదురోజుల క్రితం ఢిల్లీ గూర‍్గావ్ చెందిన కృతి ఆస్పత్రిలో గత శుక్రవారం రాత్రి ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. మరో ముగ్గురు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారితో పాటు మరికొంత మంది కరోనా బాధితులు నార్మల్ వార్డ్ లో ట్రీట‍్మెంట్ పొందుతున్నారు. అయితే ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోవడంతో డాక్టర్లు, సిబ్బంది కరోనా పేషెంట్లను వదిలేసి పారిపోయారు.
అయితే రోజులు గడుస్తున్నాయి. డాక్టర్లు ఎవరూ ట‍్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో అనుమానంతో కరోనా బాధితులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, మీడియా ప్రతినిధుల సాయంతో ఆస్ప్రత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐసీయూ బెడ్ల మీద కరోనా బాధితులకు బదులు డెడ్ బాడీలున్నాయి. అదే సమయంలో ఓ వ్యక్తి చనిపోయారు..చనిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కేకలు వేయడం హృదయవిదారక దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి
మరో బాధితుడి కుటుంబసభ్యుడు ఆస్పత్రిలోని అన్ని వార్డ్‌లను చెక్ చేస్తూ డాక్టర్లు లేరు. సిబ్బంది ఎవరూ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా పేషెంట్లను ఇలా వదిలేసి వెళ్లడానికి వీళ్లకి మనసెలా వస్తుంది. వాళ్ల కుటుంబసభ్యులు చనిపోతే ఆ బాధ వాళ్లకు తెలుస్తుందని పోలీసులతో చెబుతున్నాడు.
ఆక్సిజన్ కొరత ఆస్పత‍్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన మేనల్లుడు ప్రాణాలు పోయాయని ఓ వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు.'నా మేనల్లుడి కోసం మూడు సిలిండర్లు తెచ్చాను. ఆ సిలిండర్లలో ఆక్సిజన్ అయిపోవడంతో నా మేనల్లుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 40 ఏళ్ల నా తమ్ముడికి కరోనా సోకింది. అయినా అతను చాలా ఫిట్ గా ఉన్నాడు. ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయాడు. డాక్టర్లు టైమ్‌కి రెస్పాండ్ అయ్యింటే బ్రతికే వాడని అన్నాడు.
ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్ స్వాతి రాథోడ్ మాట్లాడుతూ.. గత శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోతున్నాయని సిబ్బంది ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా కరోనా బాధితుల్ని మరో ఆస్పత్రికి తరలించాలని వారి బంధువులకు సమాచారం అందించాం. కానీ వాళ్లు పట్టించుకోలేదు. అందువల్లే రాత్రి 11గంటల సమయంలో ఆరుగురు కరోనా బాధితులు మరణించారు అని డాక్టర్ స్వాతి వెల్లడించారు.
గవర్నమెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కృతి ఆస్పత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ ఆస్పత్రి కోవిడ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆస్పత్రుల జాబితాలో లేదు. అయినా ట్రీట్మెంట్ ఇస్తామని బాధితుల్ని ఎందుకు జాయిన్ చేయించుకున్నారు. పైగా ఆస్పత్రిలో రోగులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్లు అనారోగ్యం వల్ల మరణించారా? లేదంటే ఆక్సిజన్ కొరత వల్ల మరణించారనేది విచారణలో తేలుతుంది. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment