Doctors Neglect
-
Supreme Court of India: జనం ఏమైపోయినా పట్టించుకోరా?
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్న వైద్యులకు, వైద్య సిబ్బందికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని తేలి్చచెప్పింది. విధులను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించడం సరైంది కాదని అభిప్రాయపడింది. సాధారణ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా డాక్టర్లు ఇలా విధులకు గైర్హాజరు కావడం ఏమిటని ప్రశ్నించింది. జనం ఏమైపోయినా పట్టించుకోరా? అని నిలదీసింది. విధుల్లో చేరితే ఎలాంటి క్రమశిక్షణా చర్యలు ఉండబోవని వెల్లడించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు మీ భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటారు, వెంటనే వెళ్లి డ్యూటీలో చేరండి అని డాక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకవేళ విధులకు దూరంగా ఉంటూ నిరసనలు కొనసాగిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. బాధితురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించినప్పుడు సంబంధిత డాక్టర్లకు ఇచ్చిన చలాన్ కనిపించకపోవడం పట్ల న్యాయస్థానం అనుమానం వ్యక్తంచేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని సీబీఐని, పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. చలాన్ మాయం కావడంపై దర్యాప్తు జరపాలని సీబీఐకి సూచించింది. జూనియర్ డాక్టర్‌పై అఘాయిత్యం కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. శవపరీక్ష కోసం ఉపయోగించిన చలాన్ తమ రికార్డుల్లో లేదని చెప్పారు. అయితే, అది ఎక్కడుందో తేల్చాలని ధర్మాసనం పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదులో 14 గంటలు ఆలస్యం కావడం పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేసింది. బాధితురాలి ఫోటోలు, వీడియోలను అన్ని రకాల సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని పేర్కొంది.విరమించబోం: జూనియర్ డాక్టర్లు కోల్‌కతా: ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ నెలరోజులుగా విధులను బహిష్కరిస్తున్న పశి్చమబెంగాల్ జూనియర్ డాక్టర్లు సమ్మె కొనసాగిస్తామని సోమవారం రాత్రి ప్రకటించారు. విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ తాము సమ్మె విరమించబోమని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సీఐఎస్ఎఫ్కి వసతులు కలి్పంచండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీల్డ్ కవర్లో సమరి్పంచిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై ఈ నెల 17వ తేదీలోగా తాజా నివేదిక సమరి్పంచాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. ఆర్జీ కర్ ఆసుపత్రిలో భద్రతా విధుల్లో చేరిన మూడు కంపెనీల సీఐఎస్ఎఫ్ సిబ్బందికి తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారికి అవసరమైన పరికరాలు ఇవ్వాలని పేర్కొంది.ఫోరెన్సిక్ నివేదికపై అనుమానాలు డాక్టర్ ఫోరెన్సిక్ నివేదికపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. తదుపరి పరీక్షల కోసం బాధితురాలి నమూనాలను ఢిల్లీ–ఎయిమ్స్‌కు పంపించాలని నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. డాక్టర్ కేవలం హత్యకు గురైనట్లు నివేదిక తేలి్చందని చెప్పారు. కానీ, ఆమెను లైంగికంగా చిత్రహింసలకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. -
బిడ్డను తీశారు.. కత్తెర మరిచారు.. ఆరేళ్ల తర్వాత!
కోల్‌సిటీ(రామగుండం): ప్రసవం చేయమని డాక్టరుని వేడుకుంటే..సిజేరియన్ ద్వారా కడుపులో బిడ్డను తీసి..కత్తెర ఉంచి కడుపు కుట్టేశారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధితురాలు ఆరేళ్లుగా నరకయాతన అనుభవించింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ మొదటికాన్పు కోసం గోదావరిఖనిలోని తన పుట్టింటికి వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో 2017 ఏప్రిల్ 15న చేరింది. మరుసటిరోజు ఆస్పత్రిలోని సీనియర్ గైనకాలజిస్టు సిజేరియన్ ద్వారా మగబిడ్డకు పురుడు పోశారు. అయితే సిజేరియన్ అనంతరం మహిళ కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేసి వారం తర్వాత ఇంటికి పంపేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కుటుంబంతో ఉంటున్న సదరు మహిళకు మొదటి కాన్పు జరిగి ఆరేళ్లయినా గర్భం దాల్చలేదు. కడుపునొప్పితోపాటు తరుచూ అనారోగ్య సమస్యలు ఎదురవుతుండటంతో రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఎక్స్‌రే తీయించగా...ఆమె కడుపులో కత్తెర ఉందని వైద్యులు నిర్ధారించారు. పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్న వైద్యురాలు బాధితురాలికి జరిగిన దారుణంపై కుటుంబ సభ్యులు సిజేరియన్ చేసిన గైనకాలజిస్టును నిలదీయడంతో విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు రాజీ కుదుర్చురోవాలని వైద్యురాలు వేడుకున్నారు. బాధితురాలి కడుపులో కత్తెర తీసేందుకు చేసే శస్త్రచికిత్సకు ఖర్చును తానే భరించడంతోపాటుగా రూ.3.50లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో అందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే డబ్బులిచ్చి ఆ మహిళను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. దీనిపై వైద్యురాలిని వివరణ అడగగా..ఆపరేషన్ సమయంలో పొరబాటు జరిగి ఉండొచ్చని చెప్పారు. కాగా, కడుపులోనే కత్తెర మర్చిపోయిన గైనకాలజిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ రామగుండం నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్ డిమాండ్ చేశారు. -
వైద్యుల నిర్వాకం.. పేషెంట్ కడుపులో సర్జికల్ క్లాత్ మరిచి..
మైలవరం(ఎన్టీఆర్ జిల్లా): ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గర్భసంచి తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కడుపులోనే సర్జికల్ క్లాత్ వదిలేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన కొరివిడి శివపార్వతి తరచూ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేది. ఆమె ఆరు నెలల కిందట ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అను హాస్పటల్‌కు వెళ్లింది. ఆమెకు వైద్యులు గర్భసంచి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో మళ్లీ పలుమార్లు అను ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. చివరికి 20 రోజుల కిందట విజయవాడలోని హరిణి ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో గుడ్డ వంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేయగా బాధితురాలి కడుపులో సర్జికల్ క్లాత్ ఉండటంతో తొలగించారు. శివపార్వతి డిశ్చార్జి అయిన అనంతరం మంగళవారం ఈ విషయంపై మాట్లాడేందుకు మైలవరంలోని అస్పత్రికి వచ్చి ఆమె బంధువులు... వైద్యులు సరిగా స్పందించలేదని ఆందోళన చేశారు. చదవండి: డేటా కేబుల్‌తో ప్రియురాలిని చంపి.. అదే రోజు మరో అమ్మాయితో పెళ్లి! -
డాక్టర్ల దారుణం.. కరోనా ఉందని కాన్పు చేయలేదు
‘కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన గర్భిణికి కరోనా సోకినా నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం చేశారు. జనగామ ఎంసీహెచ్ ఆస్పత్రిలో కూడా కరోనా సోకి క్లిష్ట పరిస్థితిలో ఉన్న గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేశారు.’’ – ఈ నెల 23న ట్విట్టర్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నిజమే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సిబ్బంది కరోనా పరిస్థితుల్లో సైతం వెనుకంజ వేయకుండా నిర్విరామ సేవలందిస్తున్నారు. కానీ కొన్నిచోట్ల మాత్రం వారు ఈ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి మెచ్చుకున్న రెండ్రోజులకే ఒక నిండు గర్భిణిని ఆస్పత్రి ఆరుబయటే వదిలేశారు. కరోనా సాకుతో ఆమెకు డెలివరీ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవించింది. సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట రూరల్: పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ ఉందనే సాకుతో డెలివరీ చేసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. బల్మూర్ మండలం బాణాలకు చెందిన చెంచు మహిళ నిమ్మల లాలమ్మ మూడో కాన్పు కోసం సోదరి అలివేలతో కలసి మంగళవారం ఉదయం అచ్చంపేట సివిల్ ఆస్పత్రికి వచ్చింది. ముందు జాగ్రత్తగా వైద్యులు ఆమెకు కరోనా ర్యాపిడ్ టెస్టు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇక్కడ డెలివరీ చేయడం కుదరదని, నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేస్తూ చీటీని రాసిచ్చి చేతులు దులిపేసుకున్నారు. కనీసం అంబులెన్సు కూడా ఏర్పాటు చేయలేదు. దాదాపు 40 నిమిషాలు గడిచిపోయాయి. ఈలోగా లాలమ్మకు పురిటి నొప్పులు ఎక్కువైనా వైద్యులెవరూ స్పందించలేదు. చివరికి ఆస్పత్రి ఆవరణలోనే ఆమె ఆడశిశువుకు జన్మి నిచ్చింది. దీంతో సిబ్బంది హడావుడిగా లాలమ్మను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. బిడ్డకు, తల్లికి ప్రత్యేక గదిని కేటాయించి చికిత్స అందించారు. గతంలోనూ ఇదే తీరు.. గతంలోనూ అచ్చంపేట సివిల్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. 2016 సెప్టెంబర్ 28న నల్లగొండ జిల్లా చందంపేటకు చెందిన ఈదమ్మ కాన్పుకు రాగా.. ఆస్పత్రి వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో ఆçస్పత్రి బయటే ప్రసవించింది. 2019 డిసెంబర్ 18న అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన గర్భిణికి డెలివరీ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తల, మొండెం వేరు అయ్యేలా చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. రానియ్యలేదు: అలివేలు, లాలమ్మ సోదరి పురిటినొప్పులు వస్తున్నాయని చెల్లెలు లాలమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చినం. డాక్టర్లు టెస్టు చేసి కరోనా ఉందని చెప్పారు. పురిటినొప్పులు వస్తున్నా ఎవరూ దగ్గరకు రాలేదు. మేం చెంచులం, పైసలు ఉండవనే మమ్మల్ని ఆస్పత్రి నుంచి పంపించారు. అందరూ చూస్తుండగానే కాన్పు అయింది. నిబంధనల ప్రకారమే రెఫర్ చేశాం: డా.కృష్ణ, సూపరింటెండెంట్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. డ్యూటీ డాక్టర్ పరిశీలించి నిబంధనల ప్రకారమే జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. వారు బయటకుపోయిన చాలాసేపటి తర్వాత ఆరుబయట ఆమె ప్రసవించడంతో వెం టనే బాలింత, శిశువుకు ఆస్పత్రిలోని ఓ ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నాం. డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోండి: మంత్రి హరీశ్ అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని కోవిడ్ వచ్చిందని చేర్చుకోకుండా బయటికి పంపిన డ్యూటీ డాక్టర్ హరిబాబుపై చ ర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కలెక్టర్ ఉదయకుమార్‌ను ఆదేశించారు. కోవిడ్‌తో వచ్చి న గర్భిణులకు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయా లని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు. -
ఏపీ: విధులకు హాజరవ్వని వైద్యులపై చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా కొందరు వైద్యులు అనేక ఏళ్లుగా అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్నారు. వీరందరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల అధిపతులకు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.రవిచంద్ర ఆదేశాలు జారీ చేశారు. వారి జాబితా తక్షణమే పంపించాలని స్పష్టం చేశారు. డిప్యుటేషన్‌పై ఇతర విభాగాల్లో ఉంటూ.. గడువు ముగిసినా ఇంకా అక్కడే కొనసాగుతున్న వారిని కూడా సొంత శాఖకు పిలిపించాలని ఆదేశించారు. ఎలాంటి సమాచారం లేకుండా అనధికారికంగా సెలవుపై ఉన్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బదిలీ జరిగినా కదలడం లేదు.. కొంతమంది వైద్యులు, స్టాఫ్ నర్సులు డిప్యుటేషన్ రద్దయినా.. కదలకుండా అక్కడే కొనసాగుతూ వేతనాలు తీసుకుంటున్నారు. పదోన్నతులు పొంది బదిలీ అయినా.. వెళ్లడం లేదు. తాజాగా ఆరుగురు ప్రొఫెసర్లకు అదనపు సంచాలకులుగా పదోన్నతి ఇచ్చారు. ఇందులో ఒక్కరు మాత్రమే(విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రిలో) విధుల్లో చేరారు. మిగతా ఐదుగురు విధుల్లో చేరకుండా పాత చోటే ఉన్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరు ఎక్కడ వేతనం తీసుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారందరిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే.. హెచ్‌వోడీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
‘మారడోనాను డాక్టర్లే చంపారు.. ఆయనను అస్సలు పట్టించుకోలేదు’
బ్వేనోస్ ఎయిరెస్: ఫుట్ బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా దివంగత ఆటగాడు డీగో మారడోనాను డాక్టర్లే చంపారని ఆయనకు వైద్యం చేసిన నర్సు సంచలన ఆరోపణలు చేసింది. కేవలం వారి నిర్లక్ష్యం కారణంగానే మారడోనా మృతి చెందాడని, చివరి రోజుల్లో డాక్టర్లు అతన్ని అస్సలు పట్టించుకోలేదని మారడోనా అనుమానాస్పద మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న దహియానా గిసెలా మాడ్రిడ్ అనే నర్సు పేర్కొంది. ఈ విషయాన్ని ఆమె తన లాయర్ ద్వారా వెల్లడించింది. కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నలకు నర్సు తరపు న్యాయవాది స్పందిస్తూ.. మారడోనా బ్రెయిన్ సర్జరీ నుంచి కోలుకున్నాక కూడా ఏ డాక్టరూ ఆయన ఆరోగ్య స్థితిని పరీక్షించలేదని తన క్లయింటు చెప్పినట్లు పేర్కొన్నాడు. హాస్పిటల్లో మారడోనా కింద పడిపోయినప్పుడు తన క్లయింట్ ఆయనకు వెంటనే సీఏటీ స్కాన్ చేయాలని చెప్పినప్పటికీ అక్కడే ఉన్న డాక్టర్ స్పందించలేదని, ఈ విషయం మీడియాకు తెలిస్తే రచ్చ చేస్తారని సదరు డాక్టర్ తన క్లయింట్‌తో చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఏ డాక్టర్ కూడా మారడోనా మరణాన్ని ఆపలేకపోయారని, అయన చివరి రోజుల్లో తన క్లయింటే అతని బాగోగులు చూసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా, మారడోనా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, అతని సంతానం ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో మారడోనా వ్యక్తిగత వైద్యునితో సహా ఏడుగురిని ప్రాసిక్యూట్ చేస్తున్నారు. వారిలో మాడ్రిడ్ అనే నర్సు కూడా ఒకరు. మారడోనా గతేడాది నవంబరులో 60 ఏళ్ళ వయస్సులో గుండెపోటుతో ఆర్జెంటీనాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో మృతి చెందారు. చదవండి: గ్రౌండ్లో కుప్పకూలిన మరో స్టార్ ప్లేయర్.. -
ఆస్పత్రిలో కరోనా బాధితులు.. పారిపోయిన డాక్టర్లు, స్టాఫ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ బాధితుల్ని రక్షించేందుకు డాక్టర్లు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నారు. అదే డాక్టర్లు కరోనా బాధితులకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా పారిపోవడం కలకలం రేపుతోంది. ఐదురోజుల క్రితం ఢిల్లీ గూర్గావ్ చెందిన కృతి ఆస్పత్రిలో గత శుక్రవారం రాత్రి ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. మరో ముగ్గురు ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారితో పాటు మరికొంత మంది కరోనా బాధితులు నార్మల్ వార్డ్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అయితే ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోవడంతో డాక్టర్లు, సిబ్బంది కరోనా పేషెంట్లను వదిలేసి పారిపోయారు. అయితే రోజులు గడుస్తున్నాయి. డాక్టర్లు ఎవరూ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడంతో అనుమానంతో కరోనా బాధితులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, మీడియా ప్రతినిధుల సాయంతో ఆస్ప్రత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఐసీయూ బెడ్ల మీద కరోనా బాధితులకు బదులు డెడ్ బాడీలున్నాయి. అదే సమయంలో ఓ వ్యక్తి చనిపోయారు..చనిపోయారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కేకలు వేయడం హృదయవిదారక దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి మరో బాధితుడి కుటుంబసభ్యుడు ఆస్పత్రిలోని అన్ని వార్డ్‌లను చెక్ చేస్తూ డాక్టర్లు లేరు. సిబ్బంది ఎవరూ లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కరోనా పేషెంట్లను ఇలా వదిలేసి వెళ్లడానికి వీళ్లకి మనసెలా వస్తుంది. వాళ్ల కుటుంబసభ్యులు చనిపోతే ఆ బాధ వాళ్లకు తెలుస్తుందని పోలీసులతో చెబుతున్నాడు. ఆక్సిజన్ కొరత ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన మేనల్లుడు ప్రాణాలు పోయాయని ఓ వ్యక్తి కన్నీరుమున్నీరుగా విలపించాడు.'నా మేనల్లుడి కోసం మూడు సిలిండర్లు తెచ్చాను. ఆ సిలిండర్లలో ఆక్సిజన్ అయిపోవడంతో నా మేనల్లుడు చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. 40 ఏళ్ల నా తమ్ముడికి కరోనా సోకింది. అయినా అతను చాలా ఫిట్ గా ఉన్నాడు. ఆక్సిజన్ కొరత కారణంగా చనిపోయాడు. డాక్టర్లు టైమ్‌కి రెస్పాండ్ అయ్యింటే బ్రతికే వాడని అన్నాడు. ఈ సందర్భంగా ఆస్పత్రి డైరెక్టర్ స్వాతి రాథోడ్ మాట్లాడుతూ.. గత శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు అయిపోతున్నాయని సిబ్బంది ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించారు. ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా కరోనా బాధితుల్ని మరో ఆస్పత్రికి తరలించాలని వారి బంధువులకు సమాచారం అందించాం. కానీ వాళ్లు పట్టించుకోలేదు. అందువల్లే రాత్రి 11గంటల సమయంలో ఆరుగురు కరోనా బాధితులు మరణించారు అని డాక్టర్ స్వాతి వెల్లడించారు. గవర్నమెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కృతి ఆస్పత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ ఆస్పత్రి కోవిడ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చే ఆస్పత్రుల జాబితాలో లేదు. అయినా ట్రీట్మెంట్ ఇస్తామని బాధితుల్ని ఎందుకు జాయిన్ చేయించుకున్నారు. పైగా ఆస్పత్రిలో రోగులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్లు అనారోగ్యం వల్ల మరణించారా? లేదంటే ఆక్సిజన్ కొరత వల్ల మరణించారనేది విచారణలో తేలుతుంది. విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుర్గావ్ డిప్యూటీ కమిషనర్ యష్ గార్గ్ అన్నారు. చదవండి : వైరల్: మమ్మీ... ప్లీజ్ కాస్త మెల్లిగా వేయండి! -
ఏరియా ఆసుపత్రిలో దారుణం
సాక్షి, వనస్థలిపురం(హైదరాబాద్): నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో సోమవారం ఓ శిశువు మృతి కలకలం రేపింది. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చిన్నారి చనిపోయాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడ్గుల మండలం నల్లచెరువుకు చెందిన ఊట శేఖర్, ప్రసన్న దంపతులు మీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న మొదటి కాన్పు నిమిత్తం మూడు రోజుల కిందట వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో చేరింది. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రసవమై మగ శిశువు జన్మించాడు. బాలుడిని డ్యూటీలో ఉన్న డాక్టర్ విజయలక్ష్మి తలకిందులుగా చేసి వీపుపై తడుతుండగా కిందపడి చనిపోయినట్లు అక్కడే ఉన్న బాలుని అమ్మమ్మ మార్తమ్మ పేర్కొన్నారు. చదవండి: పసికందును అమ్మకానికి పెట్టిన తల్లి! అయితే చిన్నారి మృతి చెందిన విషయం చెప్పకుండా వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలని డాక్టర్ తమపై ఒత్తిడి తెచ్చినట్లు బంధువులు ఆరోపించారు. కాగా వైద్యురాలు విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ హరిప్రియ మాట్లాడుతూ బాబు కిందపడలేదన్నారు. నెలలు నిండకపోవడం, బలహీనంగా ఉండి, చలనం లేకపోవడంతోనే నీలోఫర్‌కు రిఫర్ చేశామని చెప్పారు. చదవండి: పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు కొత్త విధానం బాలుని తలపై గాయం ఉందని, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందడంతో పోలీసులు చేరు కుని ఘర్షణ నివారించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మీర్‌పేట కార్పొరేటర్ రాజ్‌కుమార్, తదితరులు డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వైద్యురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బంధువులు తెలిపారు. -
నిర్లక్ష్యం.. ప్రాణాంతకం!
►అతని పేరు సురేష్ (పేరు మార్చాం)... ఆదిలాబాద్‌లో ప్రభుత్వ ఉద్యోగి. 15 రోజుల క్రితం 101 నుంచి 102 ఫారిన్ హీట్ జ్వరం వచ్చింది. సమీపంలోని ప్రైవేట్ డాక్టర్ వద్దకు వెళ్లాడు. ప్రస్తుతం సీజన్ కదా సాధారణ వైరల్ ఫీవరేనని, పారాసిటమాల్ మాత్రలు వాడమన్నాడు. నాలుగైదు రోజులు వాడినా జ్వరం తగ్గకపోగా దగ్గు తోడైంది. దీంతో అతని కుటుంబసభ్యులు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించారు. పాజిటివ్ అని తేలింది. ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయినట్లు సీటీస్కాన్ లో తేలింది. అతని రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి ఆయాసం ఎక్కువైంది. అప్పటికప్పుడు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నాడు. అతని ఇంట్లో అందరికీ పాజిటివ్ వచ్చింది. ►సంగారెడ్డి జిల్లాకు చెందిన శరత్ (పేరు మార్చాం) ప్రైవేట్ ఉద్యోగి. 35 ఏళ్ల ఇతనికి 20 రోజుల కిందట అధిక జ్వరం వచ్చింది. తెలిసిన డాక్టర్ వద్దకు వెళ్లగా.. సాధారణ వైరల్ ఫీవర్ అని చెప్పి మాత్రలు ఇచ్చాడు. ఐదారు రోజులైనా జ్వరం తగ్గలేదు. ఒకరోజు రాత్రి తీవ్ర ఆయాసం వచ్చింది. ఆక్సి జన్ స్థాయి పడిపోయింది. అప్పటి కప్పుడు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. తర్వాత ఆ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు ఆ కుటుంబం రోడ్డున పడింది. సాక్షి, హైదరాబాద్: ఇలాంటి కేసులు రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో నమోదవు తున్నాయి. కొందరు సీనియర్ డాక్టర్లు, మరికొం దరు శిక్షణలేని ప్రాక్టీషనర్ల నిర్లక్ష్యం.. అమాయక ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. సాధారణ మాత్రలతో తగ్గాల్సిన కరోనా సీరియస్ పరిస్థితికి చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో యువకులు కూడా కరోనా పోరాటంలో ఓడిపోతున్నారు. ఏం కాదులే.. రెండు, మూడ్రోజులు చూద్దాం.. లేకుంటే తదుపరి పరీక్షలు చేద్దాం.. అని కొందరు వైద్యులు నానబెడుతున్నారు. దీంతో బాధితులకు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. జ్వరమొస్తే పారసిటమాల్, దగ్గు వస్తే సిరప్... రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై జ్వరమొచ్చినా, అనుమానిత లక్షణాలున్నా తక్షణమే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని పదే పదే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే.. లక్షణాలు లేకున్నా టెస్టులు చేయించుకోవాలని సూచిస్తోంది. ఆ మేరకు ప్రభుత్వం రాష్ట్రంలోని 1,100 కేంద్రాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. రోజుకు 60 వేలకుపైగా పరీక్షలు చేస్తున్నారు. అయినా కొందరు వైద్యులు మాత్రం మారడంలేదు. జ్వరం వచ్చిందా పారసిటమాల్ వెయ్యి... దగ్గు వచ్చిందా ఫలానా సిరప్ తాగు... జలుబు చేసిందా ఇదిగో మాత్ర... ఒళ్లు నొప్పులంటే సీజన్ లో ఇలాగే ఉంటుంది...అంటూ సాదాసీదాగా చెబుతున్నారు. ఈ నిర్లక్ష్యం బాధితులను ప్రాణాల మీదకు తీసుకురావడమే గాక, కరోనా కుటుంబంలో ఉన్న వారందరికీ సోకేలా చేస్తోంది. ఇదిలావుంటే చాలామంది బాధితులు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలంటే భయపడుతున్నారు. ‘కరోనా పరీక్ష అంటే హడలిపోతున్నారు. పాజిటివ్ వస్తే అందరూ వెలివేస్తారేమో అన్న భయం వారిని వెంటాడుతోందని’ ఒక వైద్యాధికారి అభిప్రాయపడ్డారు. ఇంటింటి సర్వేలెక్కడ? ప్రతీ ఇంటికీ వెళ్లి జ్వర నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా చాలాచోట్ల అది అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులను గుర్తించడం సాధ్యంకావడంలేదు. అనేకమంది ప్రైౖవేట్ క్లినిక్‌లకు వెళుతున్నారు. అంతేకాదు ప్రతీ ప్రైౖవేట్ క్లినిక్‌లలో జ్వరం కౌంటర్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. పైగా జ్వరం సహా ఇతరత్రా లక్షణాలుంటే పై ఆసుపత్రికి రిఫర్ చేయడంలో, యంత్రాంగానికి సమాచారం ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం జరుగుతోంది. పైగా ప్రైౖవేట్ క్లినిక్‌లు, ప్రాక్టీషనర్లపై స్థానిక వైద్య,ఆరోగ్య యంత్రాంగం పర్యవేక్షణ కరువైంది. జిల్లాల్లో పర్యటించాలని, పరిస్థితిని పర్యవేక్షించి సూచనలు ఇచ్చి రావాలని రాష్ట్ర వైద్య యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశించినా ఎవరూ హైదరాబాద్ నుంచి కదలడంలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాల్లో ఏం జరుగుతుందో కూడా సమాచారం రావడం లేదు. ఇక జిల్లాల్లో ప్రైవేట్ డాక్టర్లు, ప్రాక్టీషనర్లకు కరోనాపై ప్రత్యేక శిక్షణ ఇవ్వకపోవడం ప్రధాన లోపంగా చెబుతున్నారు. దీంతో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు వైద్యం చేసుకుంటూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా బాధ్యులు అవుతున్నారు. బాధితుడి పరిస్థితి సీరియస్ అయ్యాక పై ఆసుపత్రికి వెళ్లడంటూ చిన్నపాటి రిఫరెన్స్‌లు ఇస్తున్నారు. -
కరోనా: నిర్లక్ష్యం వైరస్
సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలి క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో వైద్యులు, స్టాఫ్‌నర్సులను శాశ్వత ప్రాతిపదికన నియమించండి. అందరూ ఒకే చోట కాకుండా వేర్వేరుగా విధులు నిర్వర్తించేలా చూడండి. వైద్యాధికారి ఆస్పత్రి వైద్యులతో సమన్వయంతో నిర్ణయాలు తీసుకోవాలి. కరోనా నివారణకు ఓ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలి. – కరోనా నేపథ్యంలో డీఎంఈ, కలెక్టర్ చంద్రుడు చేసిన సూచనలివీ అంతా నా ఇష్టం నేను చెప్పినట్లు చేయండి. రాష్ట్రాధికారులు, జిల్లా ఉన్నతాధికారి చెప్పినట్లు వినాలంటే కుదరదు. ఇక్కడ నేను ఏ డ్యూటీ వేస్తే అది చేయాల్సిందే. వైద్యులందరూ కరోనా పాజిటివ్ కేసులు చూడాల్సిందే. – ఆస్పత్రిలోని కీలక వైద్యుడి తీరిదీ అనంతపురం: ఓ ఉన్నతాధికారి నిర్లక్ష్యం.. సర్వజనాస్పత్రిలోని వైద్యులు, నర్సులు, సిబ్బందికి శాపంగా మారుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ చేస్తూ సదరు కీలక వైద్యుడు తీసుకుంటున్న నిర్ణయాలతో ఎందరో ఇబ్బంది పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసుల చికిత్సపై ప్రభుత్వం పక్కాగా మార్గనిర్దేశకాలు చేసినా.. సర్వజనాస్పత్రిలోని కీలక వైద్యుడు మాత్రం మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కలెక్టర్ చెప్పిన మాటలను సైతం సదరు అధికారి బేఖాతారు చేస్తున్నారని వైద్యులు వాపోతున్నారు. ప్రణాళిక లేక.. ప్రాణాలు ఫణం కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స చేసే విషయంలో సర్వజనాస్పత్రిలోని కీలక వైద్యుడి అవగాహన లోపం స్పష్టం కనిపిస్తోంది. హిందూపురానికి చెందిన 58 ఏళ్ల వ్యక్తికి ప్రారంభంలో సరిగా స్క్రీన్ చేయకపోవడంతో సర్వజనాస్పత్రిలో ముగ్గురు వైద్యులు(అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్ఆర్, హౌస్‌సర్జన్), ముగ్గురు స్టాఫ్‌నర్సులు వైరస్ బారిన పడ్డారు. వీరితో పాటు వంద మంది వరకు క్వారంటైన్‌కు వెళ్లారు. ఇంత జరిగినా సదరు వైద్యుడు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్ ఓపీకి 90 మంది వైద్యులను నియమించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ ఆదేశాల ప్రకారం కరోనా వార్డుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, సదరు వైద్యుడు మాత్రం గైనిక్, చిన్నపిల్లల విభాగం, ఆర్థో, తదితర వార్డుల నుంచి వైద్యులకు కరోనా క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులకు డ్యూటీలు వేశారు. దీంతో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్యులు.. రెండు, మూడు రోజుల తర్వాత సాధారణ రోగులకు చికిత్సలు చేస్తున్నారు. పొరపాటున ఆ వైద్యులకు వైరస్ సోకితే పరిస్థితి చేయిదాటిపోతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వార్డులకు శాశ్వత బృందాలను ఏర్పాటు చేసి, ఆ బృందాలు ఇతర సాధారణ రోగులను చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో కరోనాతో ఇద్దరు మృత్యువాత పడగా.. వారికి చికిత్స చేసిన వైద్యులే ఇతర రోగులకు వైద్యం అందించారని, దీని ద్వారా ఎంత మంది వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని వైద్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సదుపాయాల కల్పనలో విఫలం కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఏకంగా రూ.3 కోట్ల విలువ చేసే వివిధ రకాల పరికరాలు, మౌలిక సదుపాయాలను కలి్పంచింది. పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు అవసరానికి మించి ఆస్పత్రికి పంపింది. కానీ వాటిని వైద్యులు, నర్సులకు అందివ్వకుండా ఆస్పత్రి ఉన్నతాధికారి తాత్సారం చేశారని, అందువల్లే వైద్యులు, సిబ్బంది ఇప్పుడు తీవ్ర భయాందోళన చెందుతున్నట్లు ఆస్పత్రిలోని ఉద్యోగులే చెబుతున్నారు. పాజిటివ్ కేసును విస్మరించిన వైనం సర్వజనాస్పత్రిలోని పరిపాలన వైఫల్యం మరోసారి వెలుగు చూసింది. హిందూపురంలో నివాసముంటున్న ఓ తహసీల్దార్ తాజాగా కరోనా బారిన పడ్డారు. సదరు తహసీల్దార్ గత వారంలో సర్వజనాస్పత్రికి రాగా... వైద్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అదే సమయంలోనే తహసీల్దార్ పేరుతోనే ఉన్న మరో మహిళకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అందులో ఓ మహిళ పేరు మీద నెగిటివ్ రాగా... వైద్యులు మాత్రం సదరు తహసీల్దార్కే నెగిటివ్ వచ్చిందని నిర్ధారించారు. ఈ క్రమంలోనే తహసీల్దార్ కుటుంబీకులు సైతం తమకు నెగిటివ్ వచ్చిందని డిశ్చార్జ్ చేయాలని వైద్యులతో వాగ్వాదం చేసినట్లు సమాచారం. చివరకు ఆస్పత్రి వైద్యులు ఆమెను, కుటుంబీకులను డిశ్చార్జ్ చేశారు. అయితే ఆమెను డిశ్చార్జ్ చేసే సమయంలో ఈఎన్టీ వైద్యులు ముందస్తుగా మరోసారి త్రోట్, న్యాసో ఫ్యారింజిల్ స్వాప్ తీశారు. క్వారంటైన్లో ఉండాలని వైద్యులు ఆదేశించినా.. ఆమె మాత్రం తాను హోం క్వారంటైన్లో ఉంటామని వెళ్లిపోయారు. చివరకు ఆమెకు కరోనా పాజిటివ్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు ఆ తహసీల్దార్‌కు సాధారణ రోగులకు తీసే ఎక్స్‌రే గది 26లో ఎక్స్‌రే తీసినట్లు తెలిసింది. ప్రస్తుతం తహసీల్దార్‌కు ఎక్స్‌రే తీసిన సిబ్బంది, ఆమెకు సన్నిహితంగా ఉన్న వారు క్వారంటైన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ మరోసారి సర్వజనాస్పత్రి కీలక అధికారులకు తనదైన రీతిలో సూచలనలిస్తేనైనా మార్పు వచ్చే పరిస్థితి కని్పంచడం లేదు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి : మంత్రి అనంతపురం: కరోనా కట్టడికి జిల్లాలో పగడ్బందీ చర్యలు తీసుకోవాలని, వైరస్ నియంత్రణ చర్యలు ముమ్మరంగా చేపట్టాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో కోవిడ్–19 స్పెషలాఫీసర్ విజయానంద్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్–19 స్పెషల్ ఆస్పత్రులను రోజు డిస్ ఇన్ఫెక్ట్ చేయాలన్నారు. వైద్య సిబ్బందికి మాస్కులు, పీపీఈ కిట్లు ఇస్తూ...వైద్యులు, సిబ్బందిలో ధైర్యం నింపాలని సూచించారు. జిల్లాలోని కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కరోజే ఆరుగురికి పాజిటివ్ అనంతపురం: జిల్లాలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తాజాగా సర్వజనాస్పత్రిలో పనిచేసే ఓ వైద్యురాలు, మెడికల్ కళాశాలలో పనిచేసే మరో వైద్యురాలితో పాటు హిందూపురంలో నివాసముంటున్న ఓ తహసీల్దార్, హిందూపురానికే చెందిన మరో ముగ్గురు కరోనా వైరస్ బారిన పడినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21కి చేరిందన్నారు. సర్వజనాస్పత్రిలో కళ్యాణదుర్గానికి చెందిన ఓ వృద్ధుడి(70)కి వైద్యురాలు(32) సేవలందించారని, ఈ క్రమంలో వైద్యురాలికి వైరస్ సోకిందన్నారు. ఇక వైద్య కళాశాల వీఆర్డీఎల్ ల్యాబ్‌లోని ఓ మైక్రోబయాలజిస్టు(35), హిందూపురం పూలకుంట పంచాయతీ పరిధిలో నివాసమున్న తహసీల్దార్(48), మరో వ్యక్తి(49), ఇటీవల ఢిల్లీకి వెళ్లొచ్చిన హిందూపురానికి చెందిన 36 ఏళ్ల వ్యక్తి, ఇప్పటికే కరోనా బారిన పడిన అంబులెన్స్ డ్రైవర్‌తో సన్నిహితంగా మెలిగిన 21 ఏళ్ల యువకుడు కరోనా బారిన పడిన వారిలో ఉన్నారని కలెక్టర్ పేర్కొన్నారు. మంగళవారం ఆరు పాజిటివ్ కేసులు రాగా.. హిందూపురానికి చెందినవే నాలుగు ఉన్నాయన్నారు. అంతకుముందు కలెక్టర్ కిమ్స్ సవీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులను పరామర్శించారు. మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తాం మీరందరికీ నిష్ణాతులైన వైద్యులతో చికిత్సలందిస్తున్నాం. త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటాం. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. ప్రభుత్వం తరఫున అన్నివిధాల అండగా నిలుస్తాం. మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డువేస్తాం. వైద్యులు చెప్పినట్లు నడుచుకుంటే మీరంతా త్వరలోనే మీ ఇళ్లకు వెళ్తారు. – కిమ్స్ సవీరాలోని కరోనా బాధితులతో కలెక్టర్ గంధం చంద్రుడు -
సకాలంలో వైద్యం అందక గర్భిణి మృతి
సాక్షి, వికారాబాద్: వైద్యం సకాలంలో అందకపోవడంతో ఓ గర్భిణి మృతి చెందిన ఘటన శుక్రవారం మోమిన్‌పేట మండలంలో చోటుచేసుకుంది. మొరంగపల్లికి చెందిన మీనా వైద్యం కోసం మోమిన్‌పేట ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. అక్కడ నర్సులు వైద్యం చేశారు. గర్భిణికి అధిక రక్తస్రావం కావడంతో వెంటనే 108 వాహనంలో సదాశివపేటకు తరలించగా.. వైద్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని సూచించారు. వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా గర్భిణి మార్గమధ్యలోనే మృతి చెందింది. వైద్య సేవల్లో జాప్యం చేయడం వల్లనే మీనా మృతిచెందిందని ఆరోపిస్తూ.. మృతురాలి కుటుంబసభ్యులు మోమిన్‌పేట ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. -
కార్పొ‘రేటు’ ఏజెంట్లు
వైద్యం.. సేవ.. అన్నమాట ఒకప్పటిది.. ప్రస్తుతం వైద్యం.. పక్కా వ్యాపారంగా మారింది. రోగి బాధను, భయాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రణాళికా బద్ధంగా సాగిపోతోందీ వ్యాపారం. ప్రస్తుతం ఏ స్థాయికి దిగజారిపోయిందంటే కార్పొరేట్ ఆసుపత్రులు సైతం కమీషన్లు ఇచ్చి రోగులను ఆసుపత్రులకు రప్పించుకునే పరిస్థితి. సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి) : గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్)ల నుంచి పట్టణాల్లో పెద్ద డాక్టర్ల వరకు రోగుల నుంచి వచ్చే కమీషన్లపైనే బతుకుతున్నారంటే పరిస్థితి అర్థమవుతోంది. డాక్టర్లకు లక్షలకు లక్షలు జీతాలు చెల్లించి మరీ కార్పొరేట్ ఆసుపత్రులు వారిని పోషిస్తున్నాయి. ఆ ఖర్చులను రోగులపై రుద్దేస్తూ ఒకవైపు... మరోవైపు రోగుల సంఖ్య పెంచేలా డాక్టర్లకు సైతం టార్గెట్లు నిర్దేశిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సదరు డాక్టర్లు ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ఆర్ఎంపీలకు కమీషన్లు ఇస్తున్న డాక్టర్లు ఆ డబ్బులను రోగులపై బాదేస్తున్నారు. ఇదంతా పెద్ద మాఫియాగా నడుస్తున్న వ్యవహారం. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో వీరి వ్యాపారం మూడు సిరెంజీలు.. ఆరు మందు బిళ్లలుగా సాగిపోతోంది. డాక్టర్ల ముసుగులో.. అక్షరం ముక్క మెడికల్ టెర్మినాలజీ రాని ఆర్ఎంపీలంతా డాక్టర్ల పేరుతో చలామణి అవుతున్నారు. ఇంటికి వచ్చి మందులు ఇస్తూ పిలిస్తే పలికే ఆర్ఎంపీల వెనుక పెద్ద మాఫియానే నడుస్తోంది. కమీషన్లు, గిఫ్టులు, వాటాలు, స్టార్ హోటళ్లలో విందులు, విదేశీయానాలు ఇలా ఒక్కటేమిటి ఆర్ఎంపీలు అనుభవిస్తున్న రాజభోగం అంతా ఇంతా కాదు. పట్టణాల్లోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలకు 20 నుంచి 30 శాతం కమీషన్లు ఇచ్చి మరీ రోగులను ఆసుపత్రులకు రప్పించుకుంటున్నాయి. ఇలాంటి కమీషన్లకు ఆశపడుతున్న ఆర్ఎంపీలు రోగులను భయపెట్టి మరీ వారు చెప్పిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు పంపిస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చిన్నాచితకా వైద్యం చేసుకునే ఆర్ఎంపీలు కార్పొరేట్ ఆసుపత్రులతో సంబంధాలు పెట్టుకుని రోగులను, వైద్యాన్ని సైతం శాసించే స్థాయికి ఎదిగారు. అవసరం లేకపోయినా రోగుల్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు పంపించి అడ్డగోలు ఆపరేషన్లు చేయిస్తున్నారు. జిల్లాలో వేళ్లూనుకున్న మెడికల్ మాఫియా చిన్నపాటి జబ్బులకు కూడా రకరకాల పరీక్షలు చేయించి ఎక్కువ ఖర్చు చేయిస్తూ తమ వాటా తాము తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఆర్ఎంపీలు ఏర్పాటు చేస్తున్న క్లినిక్‌ల సంఖ్య పెరుగుతోంది. వీళ్లకు కమీషన్లు ఇచ్చేందుకు ప్రతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా పీఆర్వో పేరుతో ఒక బృందం ఉంటుంది. ఏ ఆపరేషన్‌కు ఎంత కమీషన్ ఇవ్వాలి, ఏ ఆర్ఎంపీలకు ఎంత ముట్టజెప్పాలో వీరు చూసుకుంటారు. అప్పుడప్పుడూ గ్రామాలకు వెళ్లి పీఎంపీలతో కొత్త డీల్స్ కుదుర్చుకుంటూ ఉంటారు. నిత్యం రూ.కోట్లలో సాగుతున్న ఈ దందాపై అధికారులు దృష్టి సారించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘కాసు’పత్రులు కాలంతోపాటు వైద్య రంగంలో సేవాభావం కనుమరుగవుతోంది అనడానికి కార్పొరేట్ ఆసుపత్రులే ఉదాహరణ. కార్పొరేట్ వైద్యంలో చాలా భాగం కాసులే పరమావధిగా సాగుతోందనే అపవాదు ఉంది. జిల్లాలో సుమారు 2 వేల వరకు ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటే దాదాపు 50 వరకు కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నింటికీ అనుసంధానంగా సుమారు 2 వేల మంది ఆర్ఎంపీలు వైద్యం చేస్తున్నారు. ఆసుపత్రులు అంటే సామాన్యుల నుంచి కాసులు పిండే యంత్రాలుగా తయారయ్యాయంటే అతిశయోక్తి కాదేమో. ఇటీవల చిన్నపాటి ఆసుపత్రులన్నీ కలిసి తమకు అనుసంధానంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. రోగులను చివరి క్షణం వరకూ పీల్చి చివరి దశలో డాక్టర్లు కార్పొరేట్ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ చనిపోయిన రోగి నుంచి కూడా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు అనుసంధానంగా డయోగ్నోస్టిక్ సెంటర్లు సైతం ఇదే తరహా దోపిడీ చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. సాధారణంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం, యాంటీబయోటిక్స్ వాడటం వంటివి ఆర్ఎంపీలు చేయకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే జిల్లాలోని కొందరు ఆర్ఎంపీలు మాత్రం యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ గర్భవిచ్చిత్తికి సైతం మందులు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం జిల్లాలోని ఆర్ఎంపీలు నిబంధనలు మీరి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. కొందరైతే స్టెరాయిడ్స్ కూడా రోగులపై ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డెంగీ టెస్టులు రాయడం, యాంటీ బయోటిక్స్ మందులు ప్రిస్క్రైబ్ చేయడం వంటివి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. కొందరు ఆర్ఎంపీలు ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా క్లినిక్‌లు సైతం ఏర్పాటుచేశారు. వీరిపై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవు. – వి.సుబ్రహ్మణ్యేశ్వరి, డీఎంహెచ్ఓ, ఏలూరు -
వైద్యుల నిర్వాకం,బాలింత మృతి
-
ప్రాణం ఉండగానే పాడి కట్టేందుకు ఏర్పాట్లు
-
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణీ మృతి!
సాక్షి, హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యంతోనే మూడు నెలల గర్భిణీ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నగరంలోని చైతన్యపురిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. హీమోగ్లోబిన్ తక్కువగా ఉందని ఆస్పత్రి వైద్యులు చెప్పారని, అంతలోనే హడావిడిగా బయటకు పంపేశారని కుటుంబ సభ్యులు వాపోయారు. హాస్పిటల్ వైద్యులపై, నిర్వాహాకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. అయితే.. గతకొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీని కారణంగానే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. వైద్య పరంగా తమ నుంచి ఎలాంటి తప్పిదం లేదని, తాము నాణ్యమైన వైద్య చికిత్స అందించామని , కార్డియాక్ సమస్యతోటే హఠాన్మరణం పొందారని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. -
నా శరీరం నిర్జీవంగా మారింది.. ఆత్మరోదన నాకు మాత్రమే వినిపించింది
కళ్లు మూతలు పడుతున్నాయి. కాలు భూమిపై నిలవడం లేదు.. ఎవరో మా బంధువులు నా శరీరాన్ని మూటలా ఆటోలో వేసుకుని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అవయవాలు సరిగా పని చేయడం లేదని తెలుస్తూనే ఉంది. నాతో వచ్చిన వారికి ఎక్కడ వైద్యం చేస్తారో తెలియక కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నారు.. ఎవరూ దయ చూపలేదు. జీవచ్ఛవంలా మారిన నన్ను పడుకోబెట్టడానికి స్ట్రెచర్లు కూడా లేవు. నేలపైనే ఓ మూలన పడేశారు.. నా ఎదురుగా వెళుతున్న వారి వంక నా కళ్లు ఆశగా చూస్తున్నాయి. ఒక్కరికైనా కనికరం కలుగుతుందని.. సాయంత్రమైంది.. డాక్టర్ల జాడ లేదు.. నా గొంతులో గుటక పడడం లేదు. ఎవరినైనా పిలుద్దామన్నా మాట రావడం లేదు.. జీవంతో కట్టెగా ఉన్న నా శరీరాన్ని రాత్రంతా దోమలు ఆవాసంగా మార్చుకున్నాయి. తెల్లవారింది.. ఈ రోజైనా డాక్టర్లు పట్టించుకుంటారని నా నవనాడుల్లో ఏదో మూల ఉన్న ఆయువుకు ఆశ కలిగింది. మధ్యాహ్నం వేళకు కూడా నా వైపు కన్నెత్తి చూసిన దిక్కు లేదు.. అయ్యా కనికరించండయ్యా అని కాళ్లు పట్టుకుందామనుకున్నాను.. చచ్చుబడిన నా చేతులు పైకి రాలేదు.. పైకి వినబడని గుండె రోదనకు కళ్లలో నీళ్లు ధారలవుతున్నాయి. మళ్లీ రాత్రికి దోమలే నాకు మిత్రులయ్యాయి. మూడో రోజు నా శరీరంలో అవయవాలన్నీ పని చేయడం మానేశాయి. నోట్లో నుంచి రక్తం బొట్లు రాలుతున్నాయి. అప్పుడూ వైద్యులు, వైద్య సిబ్బంది నా శరీరం మీదుగా నడిచి వెళుతూనే ఉన్నారు.. కడుపులో ప్రాణం కళ్లలో నుంచి వెళ్లిపోయింది. నా శరీరం నిర్జీవంగా మారింది.. ప్రభుత్వాస్పత్రి నిర్దయకు బలైన మృతుల్లో నా శవమూ చేరింది. అప్పుడు నా ఆత్మరోదన నాకు మాత్రమే వినిపించింది.. అయ్యా.. మాలాంటి బక్కచిక్కినోళ్లకు మీరే దేవుళ్లు.. కాస్తంత మానవత్వంతో మమ్మల్ని మనుషులుగా చూడండయ్యా అంటూ దిక్కులు పిక్కటిల్లేలా వేడుకుంది. గుంటూరు ఈస్ట్: జీజీహెచ్ అత్యవసర విభాగం వెయిటింగ్ హాలులోని జనరిక్ మెడికల్ షాపు వద్ద 3 రోజులుగా అస్వస్థతతో పడి ఉన్న సుమారు 40 ఏళ్ల మహిళ శనివారం మృతి చెందింది. 3 రోజులుగా మహిళ అస్వస్థతతో నేల మీద పడి ఉన్నా వైద్యులుగానీ, వైద్య సిబ్బందిగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. రోగి సహాయకులు వేడుకున్నా వైద్య సిబ్బంది కనికరించ లేదు. ప్రాంగణంలో అడుగడుగునా సీసీ కెమెరాలు,సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఎవరూ మహిళను పట్టించుకోలేదు. ఆస్పత్రికి వచ్చిన మూడో రోజుకు ఆమె ప్రాణాలు వదిలింది. మరో వ్యక్తి బలి విషయం తెలిసిన మీడియా సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లిన అనంతరం మరో వ్యక్తి ఇదే దుస్థితిలో కనిపించాడు. నాలుగు రోజులుగా ఆసుపత్రి మెయిన్‌గేటు లోపల పడి ఉండటాన్ని గుర్తించారు. విషయాన్ని ఆర్ఏంవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ రోగిని అత్యవసర విభాగంలోకి తరలించారు. వైద్యం ప్రారంభించిన కొంతసేపటికి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ప్రాథమిక చికిత్సతో సరి ఈ ఏడాది ఏప్రిల్ నెల 11వ తేదీ రంగనాథ్ అనే వ్యక్తి చికిత్స కోసం జీజీహెచ్ అత్యవసర విభాగానికి వస్తే సహాయకుడు లేడని బయటకు పంపించేశారు. రంగనాథ్ 3 రోజులు అస్వస్థతతో మెయిన్ గేటు సమీపంలోనే మృతి చెందాడు. 8 గంటలపాటు మృతదేహాన్ని వైద్య సిబ్బంది మార్చురీకి తరలించకుండా వదిలేశారు. మీడియా దృష్టికి వెళ్లడంతో అప్పుడు స్పందించారు. నవంబర్ 5వ తేదీ సత్యనారాయణ అనే రోగి ముఖానికి దెబ్బతగలడంతో అత్యవసర విభాగానికి వచ్చాడు. అతనికి ప్రాథమిక చికిత్స చేసి అసిస్టెంట్ సర్జరీ విభాగంలో ఉంచారు. నోటి నుంచి తీవ్ర రక్త స్రావమవుతున్నా ఆరు గంటలపాటు పట్టించుకోలేదు. అక్టోబర్ 23వ తేదీ పల్లపు నాగేశ్వరావు అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స అనంతరం రోగిని వదిలేశారు. రోగులు ఆందోళన చేయడంతో డిశ్చార్జ్ రాశారు. అనంతరం ఆర్ఎంవో కలుగచేసుకోవడంతో తిరిగి వైద్యం కొనసాగించారు. ఇటువంటి సంఘటనలు అత్యవసర విభాగంలో తరచూ పునరావృతమవుతున్నాయి. మానవ సేవకు మంగళం కన్నబిడ్డలు నిరాదరణ, రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు స్థానికుల సహాయంతో అత్యవసర విభాగానికి వస్తుంటారు. వైద్య సిబ్బంది సహాయకులు లేకపోవడంతో ప్రాథమిక చికిత్స చేసి వార్డుల్లో చేర్చుకునేందుకు నిరాకరిస్తున్నారు. పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నవారిని ప్రాథమిక చికిత్స చేసి ఓ మూల స్టెచ్చర్ మీదే వదిలేస్తున్నారు. కనీసం మంచి నీరు, అల్పాహారం కూడా అందక వారు మృతి చెందుతున్నారు. అనంతరం గుర్తు తెలియని మృతుల జాబితాలో వేసి మార్చురీకి తరలిస్తున్నారు. గతంలో ఆస్పత్రిలో మానవ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ద్వారా అనాథలకు కొందరు సేవ చేసేవారు. వారికి అండగా ఉండి వైద్యం అందేలా చేసేవారు. ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి అధికారులు అటకెక్కించారు. -
ప్రసవ వేదనతో గర్భిణి మృతి
ఆసిఫాబాద్ రూరల్: సరైన వైద్య సదుపాయం అందక ప్రసవ వేదనతో నిండు గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన ఇది. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రక్తస్త్రావం కావడంతో మృతిచెందింది. సోమవారం కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కొడప గంగ (24)కు పురిటి నొప్పులు రావడంతో 108కు ఫోన్ చేశారు. అయితే జిల్లాలో సిబ్బంది సమ్మెలో ఉండటంతో వాహనం రాలేదు. పురిటి నొప్పులు అధికంగా కాగా భర్త శేఖర్ ఆటోలో గంగను తీసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు. కొంతదూరం వెళ్లేసరికి అధిక రక్తస్రావం కావడంతో పిండం బయటపడి గంగ అక్కడికక్కడే మృతి చెందింది. జిల్లాలో సరైన వైద్య సదుపాయం లేక..ఉన్నా వైద్యులు పట్టించుకోక నిండు గర్భిణుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఇది ఆరో ఘటన కావడం గమనార్హం. -
జగన్నాథా..ఇదేమి పాలన!
అనంతపురం న్యూసిటీ:అనంత సర్వజనాస్పత్రిలో పాలన అస్తవ్యస్తంగా మారింది. బోధనాస్పత్రిలోని 17 మంది ప్రొఫెసర్లను పక్కనపెట్టి గతేడాది మే 2న సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా ఉన్న డాక్టర్ జగన్నాథ్‌కు సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్(ఎఫ్ఏసీ)గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ నియామకం ద్వారా ఆస్పత్రిలో పాలన వ్యవహారాలు గాడితప్పాయి. కలెక్టర్ అనుమతి లేకుండానే ఆస్పత్రిలోని పలు విభాగాల్లో నియామకాలను పూర్తి చేయడమే కాదు.. ఓపీ, ఐపీ బ్లాక్‌ను రిజిస్ట్రేషన్‌ను ప్రైవేట్‌కు అప్పజెప్పడం పలు విమర్శలకు దారితీస్తోంది. వైద్యుల పోస్టు భర్తీ చేసే ముందు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా.. తుంగలో తొక్కి తమకు అనుకూలంగా ఉన్నవారిని విధుల్లోకి తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమర్జెన్సీ(క్యాజువాలిటీ)లో నెల రోజులుగా మందులు లేవు. రోజూ 2వేల మంది ఔట్, 1,300 మంది ఇన్‌పేషెంట్లు ఉన్న సర్వజనాస్పత్రిలో రోగులకే కాదు నర్సింగ్ విద్యార్థుల మానప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. చికిత్స కోసం వస్తేనరకయాతనే ఆస్పత్రికి రోజూ ఐదు నుంచి పది పాయిజన్ కేసులు వస్తుంటాయి. ఈ కేసుల్లో రోగి ప్రాణాలు కాపాడేందుకు రైల్స్ ట్యూబ్ అవపసరం చాలా ఉంటుంది. రూ. 120 విలువ చేసే ఈ ట్యూబ్‌లను అందుబాటులో ఉంచడంలో యాజమాన్యం విఫలం చెందింది. పాయిజన్ కేసుల్లో రోగుల కుటుంబసభ్యుల చేతనే బయట నుంచే వాటిని కొనుగోలు చేయిస్తున్నారు. కేవలం రైల్స్ ట్యూబ్‌లే కాదు. లాసిక్స్, కుట్లు వేసే పరికరాలు, సర్జికల్ గ్లౌస్, అస్తాలిన్ ద్రావణం, కాటన్, తదితర పది రకాల వస్తువులను కూడా రోగులే తమ వెంట తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. శానిటేషన్కి దాసోహం ఆస్పత్రిలో శానిటేషన్ నిర్వాహకులకు యాజమాన్యం దాసోహమంటోంది. ప్రతి నెలా శానిటేషన్కి రూ 20 లక్షలు చెల్లిస్తున్నారు. ఇందుకు గాను ఆస్పత్రిలో పారిశుద్ధ్యం నిర్వహణపై పర్సెంటేజీలో వేసి ఆ మేరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. దీనిపై అప్పటి కలెక్టర్ కోన శశిధర్ 90 శాతం కంటే ఎక్కువ పర్సెంటేజీ ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆస్పత్రి యాజమాన్యం 92 నుంచి 96, 97 శాతం పర్సెంటేజీ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో వివిధ విభాగాల ప్రొఫెసర్లు, నర్సింగ్ స్టాఫ్ ఇచ్చే మార్కుల ఆధారంగా పర్సెంటేజీ వేసేవారు. ఇప్పుడు కేవలం సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, మేనేజర్ మాత్రమే పర్సేంటేజీ మార్కులు వేస్తున్నారు. అమ్మాయిలే టార్గెట్ కొందరు సెక్యూరిటీగార్డులు, సిబ్బంది ఆస్పత్రికి వచ్చే నర్సింగ్ విద్యార్థినిలు, రోగులను టార్గెట్ చేస్తున్నారు. వారికి మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంటున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది. సెక్యూరిటీ గార్డుల అసభ్య ప్రవర్తనతో పలువురు రోగులు, వైద్య సిబ్బంది విసుగెత్తి పోయారు. లంచమిస్తే చికిత్స సర్వజనాస్పత్రిలో వైద్య చికిత్సలన్నీ ఉచితమే. అయితే ఇక్కడ మాత్రం లంచం అందనిదే చికిత్సలు అందడం లేదు. గత నెల 28న గైనిక్ వార్డులో తన బిడ్డ వందన ప్రసవానికి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పద్మశ్రీ రూ.వెయ్యి తీసుకున్నారని నార్పలకు చెందిన రవికుమార్ ఏకంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌కు ఫిర్యాదు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మగబిడ్డ పుడితే రూ.వెయ్యి, ఆడ బిడ్డ పుడితే రూ.500 బలవంతంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుమతితోనే.. చిన్న పిల్లల వార్డును మూడో అంతస్తులో ఏర్పాటు చేయడంతో 18 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం ఏర్పడింది. వీరందరినీ స్థానిక ఎమ్మెల్యే అనుమతితోనే తీసుకున్నాం. ఇక నెఫ్రాలజిస్టులు దొరికేది చాలా కష్టం. ‘అనంత’లోనే ఓ వైద్యుడు అందుబాటులో ఉంటే ఆయన్ను డైరెక్ట్‌గా అపాయింట్ చేసుకున్నాం. ఆర్ఎంఓ వేరే జిల్లాకి వెళ్లాలని ట్రై చేస్తున్నారు. అందుకే సెలవులో వెళ్తున్నారు. – డాక్టర్ జగన్నాథ్, సూపరింటెండెంట్, -
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి!
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్లే శిశువు చనిపోయిందంటూ బాలింత బంధువులు ఆరోపించారు. వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలంటూ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. తాడేపల్లిగూడేనికి చెందిన షేక్ పరహానా గర్భిణి కావడంలో తొమ్మిది నెలలుగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య సేవలు పొందుతోంది. పరీక్షలు చేయించడంతో పాటు మందులు వాడింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పరిహానాకు కడుపులో నొప్పిగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటివరకూ ఆమెకు వైద్యం చేసిన వైద్యురాలు ఆసమయంలో అందుబాటులో లేరు. వైద్యురాలి సూచన మేరకు సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ఆరోజు, తర్వాత రోజు ఆదివారం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది గర్భిణి పరహానాను పట్టించుకోలేదు. సోమవారం వైద్యురాలు వచ్చిన తర్వాత పరీక్షించి ఆపరేషన్ చేయాలని చెప్పారని, అవసరమైతే మరో రోజు కూడా ఆగవచ్చని అన్నారని బంధువులు అంటున్నారు. తాము ఆపరేషన్ చేసేం దుకు అంగీకరించగా సోమవారం ఉద యం ఆపరేషన్ చేయగా మృత శిశువు జన్మించిందని వాపోయారు. ఆస్పత్రిలో వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే ఇలా జరిగిందని ఆరోపించారు. దీనిపై ఏరియా ఆస్పత్రి సూపరిం టెండెంట్ శివప్రసాద్ స్పందిస్తూ పరహానాకు వైద్యసేవలు అందించామన్నారు. అన్ని వివరాలను జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శంకరరావుకు తెలియజేశామన్నారు. డాక్టర్ల్ల నిర్లక్ష్యం వల్లే శిశువు చనిపోయిందని బాధితురాలి బంధువులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు, వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. -
బాత్రూమ్లోనే ప్రసవం
సాక్షి, సిరిసిల్ల : కాన్పు కోసం జిల్లా ధర్మాస్పత్రికి వెళ్లిన నిండు గర్భిణి డాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడి బాత్రూంలోనే ప్రసవించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. గర్భిణి బంధువుల కథనం ప్రకారం.. తంగళ్లపల్లి మండలం మండపెల్లికి చెందిన గర్భిణి బుర్ర లాస్య రెండో కాన్పు కోసం తెల్లవారుజామున నొప్పులు వస్తున్నట్లు తెలపడంతో 6 గంటలకు సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. డాక్టర్ నిర్మల పరీక్షించి డెలివరీకి ఇంకా పదిరోజుల సమయం ఉందని చెప్పి, మళ్లీ రావాలని సూచించారు. దీంతో బిడ్డ నొప్పులంటుందని మరేదైనా ఆసుపత్రికి తీసుకెళ్లాలా అని డాక్టరును అడగ్గా.. అది కూడా మేమే చెప్పాలా .. మీకు తెలియదా అంటూ డాక్టర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆసుపత్రి నుంచి వెనుదిరిగే క్రమంలో బాత్రూంకు పోయిన గర్భిణి అక్కడే ప్రసవించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. ప్రస్తుతం బిడ్డ క్షేమంగా ఉంది. డాక్టరు నిర్లక్ష్యంపై గర్భిణి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ల సమక్షంలోనే డెలివరీ అయింది.. సాధారణంగా మొదటి డెలివరీకి 14 గంటల ముందు నుంచే నొప్పులు ప్రారంభమవుతాయి. రెండో డెలివరీకి గంట నుంచి రెండు గంటల ముందు నుంచే నొప్పులు మొదలవుతాయి. డాక్టర్లు పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు. గర్భిణి బాత్రూంకు వెళ్లినపుడు ప్రసవం అవుతున్నట్లు గుర్తించడంతో ఆపరేషన్ థియేటర్‌కు తరలించి డాక్టర్ల సమక్షంలోనే డెలివరీ చేశారు. బిడ్డ క్షేమంగా ఉంది. – తిరుపతి, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, సిరిసిల్ల -
ఆస్పత్రా ?..అత్తారిల్లా ?
గుంటూరు : జీజీహ్చ్లో వైద్యుల తీరు చూస్తుంటే వారికి ఆస్పత్రి అత్తారిల్లులా అనిపిస్తుంది. ఎందుకంటే సమయపాలన కోసం ఎన్ని నిబంధనలు విధించినా, బయోమెట్రిక్ యంత్రాలతో నిఘా పెట్టినా వీరి దారి వీరిదే.. ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి హాజరు వేసి..కొద్దిసేపు ఆస్పత్రిలో కాలక్షేపం చేసి ఎంచక్కా ఇళ్లకో..సొంత క్లినిక్‌లకో చెక్కేస్తున్నారు. సాయంత్రం తాపీగా వచ్చి నాలుగు నుంచి ఐదు గంటలలోపు హాజరు వేసుకుని వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రోగులుంటారని, తమ కోసమే ఎదురుచూస్తుంటారనే విషయాన్ని మరిచిపోతున్నారు. అభాగ్యుల ఆవేదనల ఆస్పత్రి అది..రాజధానికే తలమానికమైన ఆస్పత్రి అది. వైద్యమో రామచంద్రా అంటూ జిల్లాలు దాటి రోగులు తరలివచ్చే ఆస్పత్రి అది. ఇందులో ఉండేది వైద్యులే..కానీ రోగులకు వాళ్లే దేవుళ్లు. మరి ఈ వైద్యులేమి చేస్తున్నారు. పట్టుమని పది నిమిషాలు కూడా అదనంగా పని చేయకపోగా డ్యూటీ వేళలకూ నామం పెడుతున్నారు. రోగులను గాలికొదిలేస్తున్నారు. అత్తారింటికి వచ్చినట్లుగా వచ్చి సంతకాలు చేసి దర్జాగా వెళ్లిపోతున్నారు. శుక్రవారం జీజీహెచ్‌ను సాక్షి విజిట్ చేయగా డ్యూటీ వేళల్లోనూ ఇలా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. -
వైద్యం.. దైన్యం!
ప్రభుత్వ దవాఖానాలో వైద్యాధికారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుడు అందుబాటులో లేక ఆస్పత్రి బోసిపోయింది. సమస్య పరిష్కరించాల్సిన ఆశాఖ అటువైపు దృష్టి సారించకపోవడంతో రోగులు చిన్నపాటి జబ్బుకు కూడా వేలాది రూపాయలు ఖర్చుచేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. నర్వ : నిరంతర సేవల ద్వారా ప్రజావైద్యం అందించే ఆసుపత్రి సేవల్లో సిబ్బంది మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోవడం మూలంగా పరిస్థితి విషమించే ప్రమా దం ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. లూజ్ మోషన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ బాలుడిని గురు వారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. సిబ్బం ది లేకపోవడంతో గంటల తరబడి వేచి చూశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. తెరుచుకోని యునాని కేంద్రం ఆస్పత్రిలో దీర్ఘకాలిక రోగుల కోసం ఏర్పాటు చేసిన యునాని వైద్య కేంద్రం ఎప్పుడు రోగులకు అందుబాటులో ఉంటుందో దేవుడికే తెలియాలి. నామమాత్రపు సేవలు, ప్రచారం లేని ఆయు ర్వేద కేంద్రంతో ఎలాంటి ప్రయో జనం లేదని ప్రజలు వాపోతున్నారు. ఓపీ సేవలు పెంచాలి నిత్యం వివిధ రోగాలపై ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ సేవలను అందించే సమయాన్ని పెంచాలి. ఓపీ తర్వాత కూడా ఎమర్జెన్సీ కేసులు వస్తే అందుబాటులో వైద్య సిబ్బంది ఉండాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది ఉండక పోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందే ఉండరు.. మా బందువుల బాబుకు మోషన్స్ ఉన్నాయని ఆసుపత్రికి వచ్చాం. సిబ్బంది ఎవ్వరూ లేరు. గతంలో చాలా సార్లు ఆసుపత్రికి వచ్చిన సేవలు అందించడంలో సిబ్బంది రోగులను మాటలతో ఇబ్బందులకు గురిచేస్తారు. ‘మీకు కావాల్సినప్పుడే డాక్టర్ వస్తాడా.. మా సమయంలోనే మేము వస్తాం’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మూడు గంటలు ఎదురుచూశాం. చివరికి గోళి ఇచ్చి పంపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – సైఫల్ అన్సారీ, లంకాల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలి మా బాబు మతిన్‌కు మోషన్స్‌లో బ్లడ్ వస్తుందని ఆసుపత్రికి వెళ్లాం. ఆస్పత్రిలో సిబ్బంది ఎవ్వరూ లేరు. రెండు గంటలు వేచి చూసిన తర్వాతనే సిబ్బంది వచ్చారు. రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. – చాంద్‌పాష, నర్వ, గ్రామం సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమో అందించి వివరణ కోరాం. మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తాను. ఓపీ సేవలను పెంచి రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – సిద్దప్ప, పీహెచ్సీ వైద్యులు, నర్వ -
ఇక ప్రైవేటు ఆస్పత్రుల ఆటకట్టు!
సాక్షి, న్యూఢిల్లీ : ‘రోగులు చస్తున్నా సరే వైద్యం చేయడానికి ముందుకు రారు ప్రభుత్వ వైద్యులు. రోగులు చచ్చాక కూడా వైద్యం చేస్తారు కార్పొరేట్ వైద్యులు’ అన్న వాక్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నిర్లక్ష్యాన్ని, ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యుల కాసుల కక్కుర్తిని సూచిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వాస్పత్రుల పరిస్థితిని పక్కన పెడితే దేశంలోని కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికట్టి, రోగుల హక్కుల పరిరక్షణ కోసం ఓ ఆన్లైన్ వేదిక త్వరలోనే అందుబాటులోకి వస్తోంది. ‘ప్రైవేట్‌హాస్పటల్స్‌వాచ్. ఆర్గ్’ అనే పేరుతో వస్తున్న ఆ ఆన్లైన్ వేదిక సైట్ ప్రస్తుతానికి నిర్మాణంలో ఉంది. రోగుల హక్కులపై ఇటీవల రెండు రోజులపాటు జరిగిన దక్షిణ ఆసియా స్థాయి వర్క్‌షాప్ సందర్భంగా సైట్‌పేరును ఖరారు చేశారు. ముంబైకి చెందిన సతి, సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సోషల్ జస్టిస్ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి. బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, కెన్యా దేశాలతోపాటు భారత దేశంలోని 11 రాష్ట్రాల్లో పనిచేస్తున్న 60 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ప్రైవేటు ఆస్పత్రి రంగంలో జరగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచడం కోసం ఈ వెబ్‌సైట్‌ను తీసుకొస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో చదువుకొని, ప్రభుత్వం ఇచ్చే స్థలాలు తీసుకొని, పన్ను రాయతీలు అనుభవిస్తూ ప్రభుత్వానికి జవాబుదారిగా ఉండకుండా ప్రైవేటు ఆస్పత్రులు అడ్డదారుల్లో నడుస్తున్నాయని ‘జన్ స్వస్థ్ అభియాన్’ జాతీయ కన్వీనర్ డాక్టర్ అభయ్ శుక్లా ఆరోపించారు. ప్రైవేటు ఆస్పత్రులు జవాబుదారిగా వ్యవహరించేందుకు తమ వెబ్సైట్ పబ్లిక్ వేదికగా పనిచేస్తుందని, ఆస్పత్రుల అన్యాయాలు, అక్రమాలను ఎప్పటికప్పుడు డాక్యుమెంట్ల రూపంతో వెబ్సైట్లో పొందుపరుస్తామని ఆయన చెప్పారు. -
ఆస్పత్రిలో గర్భిణి మృతి: బంధువుల ఆందోళన
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు గర్భిణి మృతిచెందింది. ఈ సంఘటన ముషీరాబాద్‌లో జరిగింది. స్థానిక సాగర్‌లాల్ ఆసుపత్రిలో రేవతి(26) ప్రసవం కోసం చేరింది. సకాలం లో వైద్యం అందించకపోవడంతో గర్భిణితోపాటు శిశువు కూడా మృతిచెందింది. కోపోద్రిక్తులైన ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. -
కర్నూలు పెద్దాస్పత్రిలో దారుణం
కర్నూలు(హాస్పిటల్): వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతి చెందిన సంఘటన కర్నూలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటు చేసుకుంది. రోగుల కేస్‌షీట్లు తారుమారు కావడంతో ఒకరికి ఇవ్వాల్సిన వైద్యం మరొకరికి అందించారు. దీంతో రోగి కోలుకోలేక మృతి చెందాడు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం రాజపురానికి చెందిన భీమన్న గత నెల 24న కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ వార్డులో చేరి చికిత్స పొందాడు. అదే రోజున అనంతపురం జిల్లాకు చెందిన భీమప్ప రోడ్డు ప్రమాదానికి గురై అదే వార్డులో చేరాడు. పేర్లు దాదాపు ఒకేలా ఉండటంతోపాటు వైద్యుల నిర్లక్ష్యంతో కేస్‌షీట్లు తారుమారయ్యాయి. భీమప్పకు అందించాల్సిన వైద్యాన్ని భీమన్నకు అందించారు. దీంతో భీమన్న కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని వైద్యులు చెప్పడంతో అతని కుటుంబీకులకు అనుమానం వచ్చింది. అనారోగ్యంతో చనిపోతే పోస్టుమార్టం చేస్తారా అని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సోమవారం ఆస్పత్రిలోని క్యాజువాలిటీ వద్ద భీమన్న కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. తన భర్త మరణానికి కారణం వైద్యులేనని భార్య తెలుగు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్ వివరణ ఇస్తూ.. భీమప్ప ఆస్పత్రిలో చేరిన మాట వాస్తవమేనని, కానీ ఆయన వార్డులో చేరి చికిత్స తీసుకోలేదని చెప్పారు. భీమన్న పేరును పొరపాటున భీమప్పగా నమోదు చేశారన్నారు. భీమన్నకు ఇచ్చిన వైద్యంలో ఎలాంటి లోపమూ లేదన్నారు. కర్నూలు పెద్దాస్పత్రిలో దారుణం