సాయంత్రం 4:06 గంటలకు ఆస్పత్రికి వచ్చి బయోమెట్రిక్ హాజరు వేసి 4:09 గంటలకు వెళ్లిపోతున్న డాక్టర్ ఝాన్సీ
గుంటూరు : జీజీహ్‌చ్‌లో వైద్యుల తీరు చూస్తుంటే వారికి ఆస్పత్రి అత్తారిల్లులా అనిపిస్తుంది. ఎందుకంటే సమయపాలన కోసం ఎన్ని నిబంధనలు విధించినా, బయోమెట్రిక్ యంత్రాలతో నిఘా పెట్టినా వీరి దారి వీరిదే.. ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి హాజరు వేసి..కొద్దిసేపు ఆస్పత్రిలో కాలక్షేపం చేసి ఎంచక్కా ఇళ్లకో..సొంత క్లినిక్‌లకో చెక్కేస్తున్నారు. సాయంత్రం తాపీగా వచ్చి నాలుగు నుంచి ఐదు గంటలలోపు హాజరు వేసుకుని వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రోగులుంటారని, తమ కోసమే ఎదురుచూస్తుంటారనే విషయాన్ని మరిచిపోతున్నారు.
అభాగ్యుల ఆవేదనల ఆస్పత్రి అది..రాజధానికే తలమానికమైన ఆస్పత్రి అది. వైద్యమో రామచంద్రా అంటూ జిల్లాలు దాటి రోగులు తరలివచ్చే ఆస్పత్రి అది. ఇందులో ఉండేది వైద్యులే..కానీ రోగులకు వాళ్లే దేవుళ్లు. మరి ఈ వైద్యులేమి చేస్తున్నారు. పట్టుమని పది నిమిషాలు కూడా అదనంగా పని చేయకపోగా డ్యూటీ వేళలకూ నామం పెడుతున్నారు. రోగులను గాలికొదిలేస్తున్నారు. అత్తారింటికి వచ్చినట్లుగా వచ్చి సంతకాలు చేసి దర్జాగా వెళ్లిపోతున్నారు. శుక్రవారం జీజీహెచ్‌ను సాక్షి విజిట్ చేయగా డ్యూటీ వేళల్లోనూ ఇలా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment