సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు వైఎస్ జగన్. మంత్రి నారా లోకేష్‌ను పప్పు అనడంలో అసలు తప్పే లేదన్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వాళ్లు ఎవరైనా దిశా చట్టం, ప్రతులను కాల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్ని దారుణాలు జరుగుతున్నా పవన్ ఎందుకు స్పందించడం లేదన్నారు.
గుంటూరులోని జీజీహెచ్ సహాన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారు. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, లోకేష్ దగ్గరుండి దాడులను ప్రోత్సహిస్తున్నారు. శాంతి భద్రతలు పూర్తిగా చేజారిపోతున్నాయి. పోలీసులు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమయ్యారు.
బాబు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో 77 మంది మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలు జరిగాయి. ఏడుగురు హత్య, ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. రెడ్‌బుక్ పాలనలో టీడీపీ నేతల తప్పులకు శిక్ష ఉండదు. గతంలో దిశ యాప్‌తో 10 నిమిషాల్లో సాయం అందేది. దిశ యాప్ ద్వారా 31,607 మంది మహిళలను కాపాడాము. వైఎస్సార్‌సీపీ హయాంలో 18 దిశ పీఎస్‌లు, 13 పోక్సో కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రతీ జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ యాప్‌కు 19 అవార్డులు వచ్చాయి.
దిశ చట్టం ప్రతులను బుద్ధి ఉన్నోడు ఎవడైనా కాల్చేస్తాడా?. దిశ యాప్‌ను పనిచేయకుండా చేశారు. హోంమంత్రి అనితకు కూడా నిజంగా బుద్ధిలేదు. అందుకే దిశ లేకుండా చేశారు. ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇదే సమయంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఉండేదని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment