
తాడేపల్లి : ఏపీలో కూటమి ప్రభుత్వం ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తోందో తెలియడం లేదన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ధరలు లేక మిర్చి రైతులు అల్లాడిపోతుంటే.. నేటికి ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారణుమన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి.. ‘ మిర్చి రైతుల కష్టాలు దారుణంగా ఉన్నాయి. ధరల్లేక మిర్చి రైతులు అల్లాడిపోతున్నారు. వైఎస్ జగన్ గత నెలలో మిర్చి యార్డును సందర్శించారు.
రైతుల కష్టాలు తెలుసుకుని చలించిపోయారు. జగన్ వెళ్లాకనే ప్రభుత్వం సమీక్షలు చేసింది. రూ. 11,781లకు తగ్గితే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అసలు ఆ స్కీం ఉందో లేదో కూడా తెలియదు. ఈక్రాప్, చెక్‌పోస్టు, యార్డులోనూ రైతుల పంటల వివరాలు తెలుస్తాయి కదా?, ఐనా సరే ఎందుకని మిర్చి కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారు?, రైతుల పంట వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాకనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా?, అసలు ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం పని చేస్తోంది? , 150 కోల్డు స్టోరేజీల్లో కోటిన్నర మిర్చి బస్తాలు ఉన్నాయి. మిర్చిని అమ్ముకోలేక రైతులు అల్లాడిపోతున్నారు. మిర్చి రైతుల కష్టాల మీద చర్చించాలని మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చాం. ప్రభుత్వం దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూడటం సిగ్గుచేటు. ప్రభుత్వం వాస్తవ పరిస్థితులు ఆలోచింవి రైతులను ఆదుకోవాలి’ అని డిమాండ్ చేశారు లేళ్ల అప్పిరెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment