bio metric
-
ఆధార్ అప్డేట్ చేయాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం తలపెట్టిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలును ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఈ పథకాలకు విద్యార్థుల వేలిముద్రల సమర్పణను తప్పనిసరి చేసింది. ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తును సమర్పించిన తర్వాత ప్రతి విద్యార్థి ఇకపై బయోమెట్రిక్ ఎంట్రీ చేయాల్సిందే. ఇదివరకు మాన్యువల్ పద్ధతిలో వివరాల నమోదుతో దరఖాస్తును ఆమోదించే అధికారం సంక్షేమాధికారికి ఉండేది. కానీ ప్రస్తుతం ప్రతి విద్యార్థి తప్పకుండా ఆధార్‌తో అనుసంధానమైన వేలిముద్రలు సమర్పిస్తేనే దరఖాస్తు సంక్షేమాధికారికి చేరుతుంది. అయితే ఆధార్ ఆధారిత వేలిముద్రలు సరిపోలడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఆధార్ కార్డు పొందిన సమయంలో ఇచ్చిన ఫింగర్ ప్రింట్స్ ప్రస్తుతం సమర్పించే ప్రింట్స్ సరిపోలడం లేదు. పిల్లల్లో ఎదుగుదల వేగంగా ఉండటంతో వేలిముద్రల్లో మార్పులు వస్తున్నాయి. దీంతో పోస్టుమెట్రిక్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఆధార్ అప్డేషన్ అనివార్యమవుతోంది. అప్డేట్ చేస్తేనే... : ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తులో విద్యార్థి ఆధార్ నంబర్ తప్పనిసరి. ఈ నంబర్ ఎంట్రీ చేయడంతో దానికి అనుసంధానమైన వేలిముద్రలు దరఖాస్తులో భాగమవుతాయి. ఈ దరఖాస్తు కాలేజీ ప్రిన్స్‌పల్ లాగిన్‌కు చేరుతుంది. అక్కడ దరఖాస్తును తెరిచి పరిశీలించిన తర్వాత విద్యార్థి తన వేలి ముద్రలను సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఆధార్‌తో అనుసంధానమైన వేలి ముద్రల్లో ఏమాత్రం తేడా ఉన్నా సాఫ్ట్వేర్ ఆమోదించదు. ప్రతి ఐదేళ్లకోసారి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ నిబంధనలు చెబుతున్నాయి. ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన మార్పులు, కొత్తగా చేరికలను ఎంట్రీ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రస్తుతం పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఈ అప్డేషన్ ప్రక్రియ అవసరముందని సంక్షేమ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా ఆధార్ అప్డేట్ చేసుకోని విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తు సమయంలో ఇబ్బందులు వస్తున్నందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నవంబర్ 30 వరకు గడువు... : 2020–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తుకు వచ్చేనెల 30వ తేదీ వరకు ప్రభుత్వం గడువు విధించింది. వాస్తవానికి ఇప్పటికే గడువు ముగియాల్సి ఉండగా.. కోవిడ్–19 వ్యాప్తి, అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం నెలకొనడంతో దరఖాస్తుల స్వీకరణ ఆలస్యంగా ప్రారంభించారు. వచ్చే నెలాఖరు వరకు దరఖాస్తుకు సమయం ఉండటంతో ఆలోపు దీర్ఘకాలికంగా ఆధార్ అప్డేట్ చేసుకోని విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రాల్లో వేలి ముద్రలు సమర్పిస్తే సరిపోతుంది. -
ఆంక్షల్లేకుండా పింఛన్లు
ఒంగోలు టూటౌన్: వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీలో సర్కార్ ఆంక్షలు తొలగించింది. కరోనా నేపథ్యంలో ఈ సారి బయోమెట్రిక్, సంతకం లేకుండానే పింఛన్లు పంపిణీ చేయాలని సర్క్యులర్ జారీ చేసింది. దీంతో పాటు రెండు రోజుల ముందుగానే నిధులు కూడా విడుదల చేసింది. జిల్లాలో 4,11,207 మంది పెన్షన్‌దారులు ఉండగా వీరికి కేటగిరీ వారీగా ప్రభుత్వం పెన్షన్లను ఇస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.98,27,92,750 నిధులను జిల్లా అధికారులు ముందస్తుగానే డ్రా చేశారు. వీటిని గ్రామ వలంటీర్లకు అందజేసే పనిలో నిమగ్నమయ్యారు. పెన్షన్లు పొందుతున్న వారిలో వృద్ధులు, వితంతువులు, చేనేతలు, కల్లు గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. ఈ కేటగిరీ లబ్ధిదారులకు నెలకు రూ.2,250 పెన్షన్ అందిస్తున్నారు. డప్పు కళాకారులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్స్‌కు రూ.3000 ఇస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మాత్రం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్‌ను మూడింతలు పెంచి అందిస్తోంది. రూ.3,500 నుంచి రూ.10,000 పెంచి కిడ్నీ వ్యాధి గ్రస్తులకు సకాలంలో పెన్షన్లు అందిస్తున్నారు. ఇంకా అభయహస్తం కింద 7,752 మంది పెన్షన్లు పొందుతున్నారు. వీరందరికీ ఏప్రిల్ ఒకటో తేదీనే పెన్షన్ ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. ఇప్పటికే బ్యాంకులకు జమ చేసిన పెన్షన్ నిధులను డ్రా చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ బ్యాంకర్లను ఆదేశించారు. దీంతో సోమవారమే పెన్షన్ నిధులను డ్రా చేసినట్లు డీఆర్డీఏ అధికారులు తెలిపారు. డ్రా చేసిన నిధులను గ్రామ వలంటీర్ల ద్వారా ఒకటో తేదీనే పెన్షనర్లకు ఇంటికి వెళ్లి అందజేయాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో పెన్షనర్ల ఫోటో మాత్రమే తీసుకుని పెన్షన్ అందజేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కరోనా నివారణ నేపథ్యంలో వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెన్షన్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
మరో 8 నగరాల్లో ఈ–వీసాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలోని మరో 8 నగరాల నుంచి పర్యాటకులు ఇకపై సులభంగా భారత్‌ను సందర్శించేందుకు విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆయా నగరాలకు చెందిన పర్యాటకులకు బయో మెట్రిక్ విధానంలో ఈ–వీసా మంజూరు చేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ 8 నగరాల్లో ఒట్టావా (కెనడా), సెయింట్ పీటర్స్బర్గ్, వ్లాడివోస్తక్ (రష్యా), మ్యూనిచ్ (జర్మనీ), బ్రస్సెల్స్ (బెల్జియం), ఓస్లో (నార్వే), బుడాపెస్ట్ (హంగేరి), జగ్రీబ్ (క్రొయేషియా) ఉన్నాయి. ఆయా నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో బయో మెట్రిక్ వివరాలు ఇస్తే చాలు ఈ–వీసా ఇస్తారు. భారత్‌కు వచ్చాక మళ్లీ ఈ–వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. -
క్యూఆర్ కార్డులంటే ఏమిటి ?
గ్రామీణ ప్రాంత ప్రజలకి కూడా ఇంటి ముంగిట్లో బ్యాంకింగ్ సేవలను అందించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన తపాలా బ్యాంకులు (ఐపీపీబీ) పనితీరుని సులభం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే సులభతరంగా అన్ని పనులు పూర్తి అయ్యే చర్యలు చేపడుతున్నాయి. ఇందులో బాగంగానే తపాలా బ్యాంకు ఖాతాదారులకు ఏటీఎం, డెబిట్ కార్డులకి బదులుగా క్యూఆర్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించాయి. అసలు క్యూఆర్ కార్డులంటే ఏమిటి ? అవెలా పని చేస్తాయి ? క్యూఆర్ కార్డులంటే ... క్విక్ రెస్సాన్స్‌కు సంక్షిప్త నామమే క్యూఆర్.. ఈ కార్డులకి సాధారణ ఏటీఎంల మాదిరిగా పిన్ నెంబర్లు, పాస్వర్డ్లు ఉండవు. బయోమెట్రిక్ నిర్ధారణ ద్వారా ఈ కార్డులు పనిచేస్తాయి. తపాలా బ్యాంకులు మంజూరు చేసిన ఈ కార్డుల్లో క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ ప్రింట్ చేసి ఉంటుంది. ఈ కోడ్ ద్వారా ఐపీపీబీ ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. స్మార్ట్ఫోన్లు, మైక్రో ఏటీఎం, పోస్ట్మ్యాన్లు ఇంటికి తీసుకువచ్చే పరికరాల ద్వారా కూడా క్యూఆర్ కోడ్‌ని వినియోగించి ఖాతాదారుల్ని గుర్తించవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా ఒకసారి ఖాతాదారుడిని గుర్తించే పని పూర్తవగానే బయోమెట్రిక్ డేటా ద్వారా పోస్టుమ్యాన్లు మిగిలిన తనిఖీ పూర్తి చేస్తారు. రెండు అంచెల తనిఖీ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత ఈ క్యూఆర్ కార్డుల్ని వినియోగించుకోవచ్చు. బయోమెట్రిక్ విధానం ద్వారా తనిఖీ పూర్తయితే ఖాతాదారులు తమ లావాదేవీలను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. వినియోగం సులభం.. క్యూఆర్ కార్డులని వినియోగించుకోవడం అత్యంత సులభం మీ అకౌంట్ నెంబర్ తెలీకపోయినా ఈ కార్డుని వాడుకునే సౌలభ్యం ఉంది. ఈ కార్డుల్ని దేశవ్యాప్తంగా ఉన్న తపాలా బ్యాంకు కేంద్రాల్లోనూ, ఇతర వాణిజ్య కేంద్రాల్లోనూ వాడుకోవచ్చు. ఐపీపీబీ మొబైల్ యాప్స్‌ద్వారా కూడా వీటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదు వీటిని వాడడానికి ఏమంత ఖరీదైన మౌలిక సదుపాయాలు ఉండాల్సిన పనిలేదు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఈ క్యూఆర్ కార్డులు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్, టెలిఫోన్ బిల్లులు కూడా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి చెల్లించుకోవచ్చు. ఆన్లైన్ బిల్లు చెల్లింపులకి రూ.15, నగదు డిపాజిట్, ఉపసంహరణ వంటి లావాదేవీలు ప్రతీ ఒక్కదానికి రూ.25 చార్జీలు వసూలు చేస్తారు. భద్రత ఎక్కువ ఏటీఎం కార్డు ఉండి, పిన్ నెంబర్ తెలిస్తే ఒకరి కార్డుని మరొకరైనా వినియోగించుకోవచ్చు. కానీ క్యూఆర్ కార్డు విషయానికి వచ్చేసరికి అలా కుదరదు. బయోమెట్రిక్ తనిఖీ ఉంటుంది కాబట్టి భద్రత ఎక్కువ. మీ పిన్ నెంబర్ని ఎవరైనా గుర్తిస్తారేమో, పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోతుందేమోనన్న ఆందోళన అక్కర్లేదు. కార్డు పోగొట్టుకున్నా మీ నగదుకు భద్రత ఉంటుంది. -
ఆస్పత్రా ?..అత్తారిల్లా ?
గుంటూరు : జీజీహ్చ్లో వైద్యుల తీరు చూస్తుంటే వారికి ఆస్పత్రి అత్తారిల్లులా అనిపిస్తుంది. ఎందుకంటే సమయపాలన కోసం ఎన్ని నిబంధనలు విధించినా, బయోమెట్రిక్ యంత్రాలతో నిఘా పెట్టినా వీరి దారి వీరిదే.. ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి హాజరు వేసి..కొద్దిసేపు ఆస్పత్రిలో కాలక్షేపం చేసి ఎంచక్కా ఇళ్లకో..సొంత క్లినిక్‌లకో చెక్కేస్తున్నారు. సాయంత్రం తాపీగా వచ్చి నాలుగు నుంచి ఐదు గంటలలోపు హాజరు వేసుకుని వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలోనూ రోగులుంటారని, తమ కోసమే ఎదురుచూస్తుంటారనే విషయాన్ని మరిచిపోతున్నారు. అభాగ్యుల ఆవేదనల ఆస్పత్రి అది..రాజధానికే తలమానికమైన ఆస్పత్రి అది. వైద్యమో రామచంద్రా అంటూ జిల్లాలు దాటి రోగులు తరలివచ్చే ఆస్పత్రి అది. ఇందులో ఉండేది వైద్యులే..కానీ రోగులకు వాళ్లే దేవుళ్లు. మరి ఈ వైద్యులేమి చేస్తున్నారు. పట్టుమని పది నిమిషాలు కూడా అదనంగా పని చేయకపోగా డ్యూటీ వేళలకూ నామం పెడుతున్నారు. రోగులను గాలికొదిలేస్తున్నారు. అత్తారింటికి వచ్చినట్లుగా వచ్చి సంతకాలు చేసి దర్జాగా వెళ్లిపోతున్నారు. శుక్రవారం జీజీహెచ్‌ను సాక్షి విజిట్ చేయగా డ్యూటీ వేళల్లోనూ ఇలా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. -
చైనాలో బలవంతపు ‘బయోమెట్రిక్’ సేకరణ
బీజింగ్: చైనాలోని జింజియాంగ్ ప్రావిన్సులోని కోట్లాది మంది ప్రజల డీఎన్ఏ సహా బయోమెట్రిక్ వివరాలను అక్కడి అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారు. 12 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా బ్లడ్ గ్రూప్ వివరాలు, వేలి ముద్రలు, కళ్లను సైతం స్కాన్ చేసి భారీస్థాయిలో డాటాబేస్‌ను తయారుచేస్తున్నారు. సాధారణంగా ఈ ప్రావిన్సులో ఎక్కువగా ఉయ్ఘర్ అనే ముస్లిం తెగకు చెందినవారు నివసిస్తుంటారు. వారందరిపై నిఘా పెట్టేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారని మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ పేర్కొంది. ప్రజలపై జాతి, మతం, భాష, వారు వెలువరించే అభిప్రాయాలు తదితరాల ఆధారంగా ఇక్కడ నిఘా పెడుతున్నారంది. -
ఈ–హాజరు ఇక తప్పనిసరి
సాక్షి, అమరావతి : పాఠశాల విద్యాశాఖలో టీచర్లు, విద్యార్థులు, ఇతర అధికారులకు ‘ఈ–హాజరు’ను తప్పనిసరి చేస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అన్ని జిల్లాల విద్యాధికారులు ప్రతి ఒక్క ఉద్యోగి హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయించాలని స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీచేశారు. ఏపీ ఆన్లైన్, ఎన్ఐసీ, ఐటీ విభాగాల ఆధ్వర్యంలో రూపొందించిన ఈ–హాజరు అప్లికేషన్ ద్వారా ఈ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేయడంతో పాఠశాల విద్యాశాఖ దీన్ని 100 శాతం పూర్తిచేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతోంది. ఇప్పటికే 67.32 శాతం బయోమెట్రిక్ యంత్రాలను పాఠశాలలు, విద్యాశాఖకు సంబంధించిన కార్యాలయాలకు పంపారు. కొన్నిచోట్ల యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో బయోమెట్రిక్ హాజరులో సమస్యలు ఏర్పడుతున్నాయి. సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పూర్తిస్థాయిలో ఈ–హాజరు నమోదు కావడంలేదు. కొన్ని చోట్ల సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడం, కేంద్రీకృత సర్వర్ వ్యవస్థ సామర్థ్యం తక్కువగా ఉండటం వంటి సమస్యలతో కూడా పలు పాఠశాలలు, కార్యాలయాల్లో ఈ–హాజరు నమోదుకావడం లేదు. జిల్లాల వారీగా ఈ హాజరు ఇలా.. జిల్లాలవారీగా పాఠశాలల్లో టీచర్ల ఈ–హాజరు నమోదు ఎలా ఉందో పాఠశాల విద్యాశాఖ ఇటీవల విశ్లేషించింది. అక్టోబర్ 31వ తేదీకి సంబంధించి ఆయా కార్యాలయాలు, పాఠశాలల్లో ఈ–హాజరు నమోదు లెక్కలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 41,601 ప్రభుత్వ స్కూళ్లుండగా 27,808 స్కూళ్లలో బయోమెట్రిక్ యంత్రాలు అమర్చారు. ఈ స్కూళ్లలో 1,45,087 మంది టీచర్లుండగా.. అక్టోబర్ 31వ తేదీ నాటి గణాంకాల ప్రకారం 75.47 శాతం వరకూ ఈ–హాజరు నమోదైంది. మిగతా సిబ్బంది హాజరు నమోదుకాలేదు. సాంకేతిక లోపాలు, యంత్రాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో పాటు టీచర్లు సెలవులు తీసుకోవడం, గైర్హాజరు వంటి కారణాలతో నమోదుకాలేదు. శ్రీకాకుళం జిల్లా ఈ–హాజరులో ముందు వరుసలో ఉంది. సమస్యల పరిష్కారానికి క్షేత్ర బృందాలు ఈ–హాజరు నమోదులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయి సాంకేతిక బృందాలను విద్యాశాఖ ఏర్పాటుచేస్తోంది. రోజూ ఏపీ ఆన్లైన్, సీఎం డ్యాష్‌బోర్డు, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక పోర్టల్ ద్వారా ఈ–హాజరును పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 48 గంటల్లో దాన్ని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా టీచర్ ఈ–హాజరు నమోదు కాకుంటే ఆతని మొబైల్‌కు ఎస్సెమ్మెస్ అలర్ట్ వస్తుంది. మున్సిపల్ స్కూళ్ల ఈ హాజరు పర్యవేక్షణకు నోడల్ టీమ్‌ను ఏర్పాటుచేశారు. హాజరు తక్కువగా ఉన్న స్కూళ్లకు సంబంధించి ఎంఈవోలు, డీఈవోలు పర్యవేక్షించి నివారణ చర్యలు చేపట్టాలి. టీచర్లతో పాటు విద్యార్థులకూ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి చేస్తున్నారు. ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ హాజరుకు ఏర్పాట్లు చేశారు. ఆఫ్‌లైన్‌లో స్థానిక డేటా బేస్ ఆధారంగా విద్యార్థుల హాజరు నమోదయ్యేలా ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. శుక్రవారం నుంచి ఇది అందుబాటులోకి రానుంది. -
75 శాతం హాజరు ఉంటేనే ఉపకార వేతనాలు
జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు నంద్యాల అర్బన్: బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో 75 శాతం హాజరు ఉంటేనే కళాశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరవుతాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ప్రసాదరావు తెలిపారు. స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో బుధవారం ప్రభుత్వం విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించిన విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ విద్యాసంస్థల అధినేత ఇంతియాజ్ అహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నంద్యాల డివిజన్లోని సుమారు 120 జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, వ్యవసాయ, పాలిటెక్నిక్, డైట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపసంచాలకులు ప్రసాదరావు మాట్లాడుతూ కళాశాలలకు ప్రభుత్వం మంజూరు చేసే ఆర్టీఎఫ్(రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు)లను ఈ సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయనున్నట్లు చెప్పారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉపకార వేతనాలు అందించడానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూర్చిందని చెప్పారు. కార్యక్రమంలో నేషనల్ విద్యాసంస్థల ఏఓ రఫీ అహమ్మద్, నంద్యాల ఏఎస్ డబ్ల్యూఓ నాగేంద్రమణి, కోవెలకుంట్ల ఏఎస్డబ్ల్యూఓ లక్ష్మయ్య, సాంఘిక సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ప్రసాదరావును సన్మానించారు. -
‘అయ్యో’మెట్రిక్
– సర్వజనాస్పత్రిలో హాజరు తంటాలు – సరిగా పనిచేయని బయోమెట్రిక్ మిషన్లు – అవస్థలు పడుతున్న ఉద్యోగులు అనంతపురం మెడికల్ : ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ‘హాజరు’ తంటాలు వెంటాడుతున్నాయి. ఉద్యోగులు డ్యూటీకి వెళ్లినప్పుడు.. ముగించుకున్నప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్‌లో వేలిముద్ర వేయాల్సి ఉండడం...మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు బయోమెట్రిక్ మిషన్లన్నీ ఒకే గదిలో ఉంచడంతో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ ప్రాంతం కిక్కిరిస్తోంది. సకాలంలో వేలిముద్రలు పడకపోవడంతో కొందరు ప్రత్యేక రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు వస్తాయేమోనని మరికొందరు నిరీక్షిస్తున్నారు. 500 మందికి మూడు మిషన్లు! సర్వజనాస్పత్రిలో డాక్టర్లు, స్టాఫ్‌నర్సులు, ఎంఎన్ఓలు, ఎఫ్ఎన్ఓలు, పారామెడికల్ సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది సుమారు 500 మందికి పైగా ఉంటారు. నాలుగు నెలల క్రితం ఇక్కడ బయోమెట్రిక్ హాజరును అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ల్యాబ్టెక్నీషియన్లకు కూడా బయోమెట్రిక్ హాజరు తప్పని సరిచేశారు. ఇన్నాళ్లూ ఓపీ పైన హాజరు వేసే ప్రక్రియ జరిగేది. పై అంతస్తులోకి వెళ్లడానికి ఇబ్బందులు వస్తుండడంతో ఓపీ పక్కనున్న ఆరోగ్య శ్రీ గదిలోకి మార్చారు. రోజూ ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 8 గంటలకు తప్పనిసరిగా హాజరు వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అందరూ ఒకేసారి వస్తుండడంతో ఉన్న మిషన్లు సరిపోవడం లేదు. ఉద్యోగులు మొదటగా తమ ఆధార్‌నంబర్ నమోదు చేసి.. వేలి ముద్ర వేయాలి. అయితే చాలా మంది వేలి ముద్రలు సరిగా తీసుకోవడం లేదు. దీంతో వారు మళ్లీ ప్రయత్నిస్తుండడంతో సమయం వృథా అవుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులు ‘హాజరు’ ఆలస్యం అవుతుందని, తీరా జీతం విషయంలో కోత పడుతుందేమోనని భయపడుతున్నారు. ప్రస్తుతం మూడు బయోమెట్రిక్ మిషన్లను అమర్చగా మంగళవారం రెండు మాత్రమే పని చేశాయి. మధ్యాహ్నం సమయంలో ఉద్యోగులు ఒక్కసారిగా అక్కడికి రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండు యంత్రాల్లో కూడా సాంకేతిక లోపాలు తలెత్తడంతో నిరీక్షించాల్సి వచ్చింది. కొందరు రెండు, మూడు సార్లు ప్రయత్నించినా ‘హాజరు’ పడకపోవడంతో చివరకు రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు స్పందించి మరో రెండు యంత్రాలను అందుబాటులోకి తెస్తే సమస్య తీరే అవకాశం ఉందని ఉద్యోగులు చెప్పారు. -
ప్రశాంతంగా ఎస్ఐ అభ్యర్థుల రాత పరీక్ష
– దరఖాస్తుదారులు 15,569 – హాజరైన అభ్యర్థులు 14,272 కర్నూలు: పోలీసు శాఖలో ఎస్ఐ ఎంపికకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, సాయంత్రం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. ఎస్ఐ పోస్టుల భర్తీకి గత నెల ప్రభుత్వం అనుమతించడంతో 15,569 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 14,272 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. 1,297 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం కర్నూలులో 26 సెంటర్లు ఏర్పాటు చేశారు. బయో మెట్రిక్ హాజరుతో అనుమతి: కాకినాడ జేఎన్టీయూ కళాశాల ఆధ్వర్యంలో ఎస్ఐ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. కర్నూలు నగరంలోని 26 కాలేజీలు, స్కూళ్ల యాజమాన్యాల సహకారంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు నిర్వహించారు. బయోమెట్రిక్ సేకరణ ద్వారా (వేలి ముద్రలు) అభ్యర్థులను పరీక్షలకు అనుమతించారు. పోలీసు శాఖ నుంచి కొంతమంది సిబ్బంది (ఫింగర్ ప్రింట్స్) బృందం నియమించి బయో మెట్రిక్ సేకరణకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలలోపు పరీక్ష కేంద్రానికి చేరుకున్న అభ్యర్థులను బయో మెట్రిక్ హాజరుతో అనుమతించి, 10 గంటలకు పరీక్షను ప్రారంభించారు. ఆధార్ లేదా, ఇతర గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంతమంది మరిచిపోయి వచ్చారు. చివరి నిమిషంలో అలాంటి వారిని కూడా పరీక్షకు అనుమతించారు. డీఐజీ రమణకుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ ఆకే రవికృష్ణ ఉదయం 10 గంటలకు పుల్లయ్య కళాశాల, కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష హాలులోకి సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వాచ్‌లను అనుమతించరాదని ఇన్విజిలేటర్లకు దిశానిర్దేశం చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సీఐలకు ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. పరీక్ష బాగా రాసి పట్టుదలతో ఉద్యోగం సంపాదించాలని అభ్యర్థులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్ష కేంద్రాల యాజమాన్యాలతో మాట్లాడి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు డీఎస్పీ డీవీ రమణమూర్తితో పాటు పలువురు సీఐలు ఎస్పీ వెంట ఉన్నారు. -
పక్కాగా బయోమెట్రిక్ అమలు
నెల్లూరు(అర్బన్) : పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలయ్యేలా ప్రోగ్రాం ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రమాదేవి అన్నారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో పీహెచ్‌సీల డాక్టర్లతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనమోల్ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. ఆరోగ్య సేవల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఐఓ జయసింహ, క్షయనివారణాధికారి డా.సురేష్‌కుమార్, మలేరియా అధికారి వేణుగోపాల్, గూడూరు డిప్యూటి డీఈఓ ఈదూరు సుధాకర్ పాల్గొన్నారు. -
జిల్లా అధికారులకు బయోమెట్రిక్
నెల్లూరు(పొగతోట): డయల్ యువర్ కలెక్టర్, గ్రీవెన్స్డేలకు హాజరయ్యే జిల్లా అధికారులకు బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. ఉదయం 9.00 గంటలలోపు గ్రీవెన్స్ హాల్‌కు హాజరు కావాల్సి ఉంది. జిల్లా అధికారులు సమావేశాలకు ఆలస్యంగా వస్తుడటంతో కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు ఆదేశాల ప్రకారం సోమవారం బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించారు. సకాలంలో రాని వారి వివరాలు కలెక్టర్‌కు అందజేస్తారు. రెండు సార్లు వరుసగా అలస్యంగా హాజరైతే సంబంధిత జిల్లా అధికారిపై చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. -
జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు
తాడేపల్లిగూడెం రూరల్ : జిల్లాలోని అన్ని జెడ్పీ హైస్కూళ్లలో డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేస్తామని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. కడియద్ద జిల్లా పరిషత్ హైస్కూల్లో గోదావరి విద్యా వికాస్ చైతన్య వేదిక సౌజన్యంతో బయోమెట్రిక్ విధానంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాపిరాజు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్స్‌లో డిజిటల్ విధానంలో విద్యాబోధన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గోదావరి విద్యావికాస్ చైతన్య వేదిక చేస్తున్న విద్యాసేవలను ఆయన అభినందించారు. జిల్లాలోని 100 పాఠశాలలను దత్తత తీసుకుని ఆయా పాఠశాలలకు మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు (రంగరాజు) మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేయనున్నట్టు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి, డీసీసీబీ డైరెక్టర్ దాసరి అప్పన్న, తాడేపల్లిగూడెం, పెంటపాడు ఎంపీపీలు పరిమి రవికుమార్, పెదపోలు వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ పాకనాటి నాగదీప్తి పాల్గొన్నారు. -
8 నుంచి జిల్లా అధికారులకు బయోమెట్రిక్
నెల్లూరు(పొగతోట): కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్‌డే, డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాలకు హాజరయ్యే జిల్లా అధికారులకు ఈ నెల 8వ తేదీ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 1వ తేదీ నుంచి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రీవెన్స్‌డేకు జిల్లా అధికారులు కొందరు హాజరుకాకుండా కింది స్థాయి ఉద్యోగులను గ్రీవెన్స్‌కు పంపుతున్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో సమస్యలపై జిల్లా కలెక్టర్ నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. గత వారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. దీంతో కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా అ«ధికారుల కోసం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నారు. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. 150 మంది జిల్లా అధికారులకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్ డేటా అప్లోడ్ చేయాల్సి ఉంది. ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఉదయం 9.30 గంటలలోపు అధికారులు కలెక్టరేట్‌కు రావాల్సి ఉంది. డయల్ యవర్ కలెక్టర్ కార్యక్రమానికి సంబంధించి 1800 425 2499 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. -
కానిస్టేబుల్ పరీక్షలకు బయోమెట్రిక్ అమలు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ కొలువు నియామకాలలో నూతన ఒరవడి కోసం రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. కొలువుల కోసం కోటి ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల నమ్మకాలు వమ్ముకాకుండా ఉండేందుకు నియామకాల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వివిధ విభాగాలలోని 9,281 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 5.36 లక్షల దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. భారీగా దరఖాస్తులు రావడంతో ఒక్కొక్క పోస్టుకు 57 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తవడం, అందులో తప్పొప్పులు సరిచేయడం కూడా పూర్తికావడంతో తదుపరి కార్యాచరణపై రిక్రూట్మెంట్ బోర్డు దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తుది ఎంపిక వరకు ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని నిర్ణయించింది. ఏప్రిల్ 3న జరిగే ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల నుంచి వేలిముద్రలు తీసుకోవాలని యోచిస్తోంది. అందుకోసం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఈ మేరకు అభ్యర్థులందరూ పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సిందిగా స్పష్టం చేసింది. అభ్యర్థులందరి వేలిముద్రలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసుకుంటారు. తరువాత జరిగే పరీక్షల్లో అభ్యర్థులు వారేనా? కాదా? అన్నది తెలుసుకోవడానికి ఇది తోడ్పడనుంది. ఎంపికైన తర్వాత ట్రైనింగ్‌కు వెళ్లే అభ్యర్థుల వేలి ముద్రలను కూడా పరిశీలించనున్నారు. దీని ద్వారా ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థి... తుది వరకు అతనేనా కాదా అనేది సులువుగా బయటపడనుంది. -
త్వరలో వైద్యశాఖ పోస్టుల భర్తీ
తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో జనరిక్ మందుల దుకాణాలు అందుబాటులోకి తెస్తున్నట్టు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆయన సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అధ్యాపకులు సకాలంలో విధులకు హాజరయ్యేలా వైద్య కాలేజీల్లో బయెమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.