జిల్లా అధికారులకు బయోమెట్రిక్
నెల్లూరు(పొగతోట): డయల్ యువర్ కలెక్టర్, గ్రీవెన్స్‌డేలకు హాజరయ్యే జిల్లా అధికారులకు బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. ఉదయం 9.00 గంటలలోపు గ్రీవెన్స్ హాల్‌కు హాజరు కావాల్సి ఉంది. జిల్లా అధికారులు సమావేశాలకు ఆలస్యంగా వస్తుడటంతో కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు ఆదేశాల ప్రకారం సోమవారం బయోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించారు. సకాలంలో రాని వారి వివరాలు కలెక్టర్‌కు అందజేస్తారు. రెండు సార్లు వరుసగా అలస్యంగా హాజరైతే సంబంధిత జిల్లా అధికారిపై చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు.