బీజింగ్: చైనాలోని జింజియాంగ్ ప్రావిన్సులోని కోట్లాది మంది ప్రజల డీఎన్‌ఏ సహా బయోమెట్రిక్ వివరాలను అక్కడి అధికారులు బలవంతంగా సేకరిస్తున్నారు. 12 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ద్వారా బ్లడ్ గ్రూప్ వివరాలు, వేలి ముద్రలు, కళ్లను సైతం స్కాన్ చేసి భారీస్థాయిలో డాటాబేస్‌ను తయారుచేస్తున్నారు.
సాధారణంగా ఈ ప్రావిన్సులో ఎక్కువగా ఉయ్‌ఘర్ అనే ముస్లిం తెగకు చెందినవారు నివసిస్తుంటారు. వారందరిపై నిఘా పెట్టేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారని మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ పేర్కొంది. ప్రజలపై జాతి, మతం, భాష, వారు వెలువరించే అభిప్రాయాలు తదితరాల ఆధారంగా ఇక్కడ నిఘా పెడుతున్నారంది.
Comments
Please login to add a commentAdd a comment