పక్కాగా బయోమెట్రిక్ అమలు
పక్కాగా బయోమెట్రిక్ అమలు
Published Thu, Sep 1 2016 10:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
నెల్లూరు(అర్బన్) : పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలయ్యేలా ప్రోగ్రాం ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రమాదేవి అన్నారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో పీహెచ్‌సీల డాక్టర్లతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనమోల్ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. ఆరోగ్య సేవల్లో జిల్లాను ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఐఓ జయసింహ, క్షయనివారణాధికారి డా.సురేష్‌కుమార్, మలేరియా అధికారి వేణుగోపాల్, గూడూరు డిప్యూటి డీఈఓ ఈదూరు సుధాకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement