![Doctors Forgot The Surgical Cloth In Stomach After Operation In Ntr District - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/15/Doctors-Forgot-The-Surgical.jpg.webp?itok=Vgwu-rN3)
ప్రతీకాత్మక చిత్రం
మైలవరం(ఎన్టీఆర్ జిల్లా): ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గర్భసంచి తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కడుపులోనే సర్జికల్ క్లాత్ వదిలేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన కొరివిడి శివపార్వతి తరచూ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేది. ఆమె ఆరు నెలల కిందట ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అను హాస్పటల్‌కు వెళ్లింది.
ఆమెకు వైద్యులు గర్భసంచి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో మళ్లీ పలుమార్లు అను ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. చివరికి 20 రోజుల కిందట విజయవాడలోని హరిణి ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో గుడ్డ వంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు.
ఆపరేషన్ చేయగా బాధితురాలి కడుపులో సర్జికల్ క్లాత్ ఉండటంతో తొలగించారు. శివపార్వతి డిశ్చార్జి అయిన అనంతరం మంగళవారం ఈ విషయంపై మాట్లాడేందుకు మైలవరంలోని అస్పత్రికి వచ్చి ఆమె బంధువులు... వైద్యులు సరిగా స్పందించలేదని ఆందోళన చేశారు.
చదవండి: డేటా కేబుల్‌తో ప్రియురాలిని చంపి.. అదే రోజు మరో అమ్మాయితో పెళ్లి!
Comments
Please login to add a commentAdd a comment