
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం టీడీపీ మళ్లీ విభేదాలు రాజుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమాను ఉద్దేశించి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మసాని సుబ్బారావు చేసిన కామెంట్ ఇప్పుడు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారాయి. మైలవరం టీడీపీ టికెట్ తనకే ఇవ్వాలని బొమ్మసాని పట్టుబడుతున్నారు.
గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేని ఉమాను తానే గెలిపించానని, ఈసారి టికెట్ మాత్రం తనకే కావాలని బొమ్మసాని జిల్లా టీడీపీలో కొత్త చర్చకు తెరలేపారు.
‘గత ఎన్నికల్లో ఉమా కోసం పెద్ద పాలేరుగా పని చేశాను. పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేని ఉమను గతంలో మైలవరంలో గెలిపించాను. ఈసారి మైలవరం టికెట్ నాకే ఇవ్వాలి. నేను సీటు అడగడంలో న్యాయం ఉంది’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment