surgical
-
ఇకపై.. రోబోలతో సంక్లిష్టమైన సర్జరీలు తేలిగ్గా..!
మానవ మణికట్టు ఒక పరిమితి వరకే తేలిగ్గా తిరుగుతుంది. కానీ ఓ రోబో మణికట్టు ఎటువైపైనా దాదాపు 270 డిగ్రీల వరకు తిరిగేలా రూపొందుతుంది. దాంతో అత్యంత నిశితంగా అనుకున్నంత మేరకే కోసేలా, కుట్లు వేసేలా చేసే శస్త్రచికిత్స ప్రక్రియల్ని రోబోకు ఆదేశాలిస్తూ డాక్టర్లు ‘ఆపరేట్’ చేస్తుంటారు. ఆ సర్జరీలో శస్త్రచికిత్స జరుగుతున్న అవయవాన్నీ, అందులోని భాగాల్నీ (ఫీల్డ్‌ను) 3–డీ ఇమేజ్ తెరపై చూస్తుంటారు.మరింత సురక్షితమెందుకంటే... కోత చాలా చిన్నగా ఉండటంవల్ల కోలుకునే సమయం తగ్గుతుంది. గాయమూ వేగంగా మానుతుంది. కోత, గాయం తక్కువ కావడం వల్ల ఇన్ఫెక్షన్కు అవకాశాలు బాగా తక్కువ. ఇవేకాదు... శస్త్రచికిత్సకు పట్టే సమయమూ, ఇవ్వాల్సిన మత్తుమందూ, రక్తస్రావమూ అన్నీ తక్కువే. ఇవన్నీ రోబోతో జరిగే శస్త్రచికిత్సను మరింత సురక్షితంగా మార్చేస్తాయి.ఏయే శాఖల్లో ఈ శస్త్రచికిత్సలు?మూత్ర వ్యవస్థకు సంబంధించి... మూత్రపిండాల శస్త్రచికిత్సలో:– కిడ్నీ నుంచి మూత్రాశయానికి (బ్లాడర్‌కు) మూత్రం తీసుకొచ్చే పైపులైన యురేటర్లలో ఏవైనా అడ్డంకులు ఉన్నప్పుడు (ఉదాహరణకు యురేటరో–పెల్విక్ జంక్షన్లో అడ్డంకి. దీన్నే యూపీజే అబ్స్టక్షన్ అంటారు.) చేసే ‘పైలో΄్లాస్టీప్రొíసీజర్’ అనే శస్త్రచికిత్సలో ∙కిడ్నీల్లో గడ్డల (రీనల్ ట్యూమర్స్) తొలగింపు ∙కిడ్నీ పూర్తిగా తొలగించాల్సిన కేసుల్లో (నెఫ్రెక్టమీ). ప్రోస్టెక్టమీ: ప్రోస్టేట్ గ్రంథి తొలగింపులో.గైనకాలజీలో:గర్భసంచికీ అలాగే గర్భాశయ ముఖద్వారంలో క్యాన్సర్ (ప్రీ–మ్యాలిగ్నెంట్ సర్విక్స్ అండ్ యుటెరస్) వచ్చే అవకాశముందని తెలిసినప్పుడుఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ వంటి గడ్డల తొలగింపులో ఎండోమెట్రియాసిస్ కేసుల్లో సమస్యాత్మకమైన / వ్యాధికి గురైన భాగాలను తొలగించడానికి ∙ఎండోమెట్రియమ్ శస్త్రచికిత్సలో అడ్హెషన్స్తో ఆ భాగం ఇతర శరీర భాగాలకు అతక్కుపోవడాన్ని విడదీయడానికి.యూరో–గైనకాలజీ శస్త్ర చికిత్సల్లో: – పొత్తికడుపు కింది భాగంలోని అవయవాలు మరో అవయవంలోకి చొచ్చుకునిపోయే హెర్నియా కేసుల్లో ‘సాక్రోకాల్పోపెక్సీ’ చేసేందుకు– దగ్గినప్పుడూ, ఒత్తిడికి మూత్రం పడిపోయే కేసుల్లో చేసే కాల్పోసస్పెన్షన్ప్రొసీజర్లలో, ∙ఫిస్టులా రిపేర్ల వంటి కేసుల్లో సర్జరీ కాంప్లికేషన్లను తగ్గించడానికి.ఇతరత్రా విభాగాల్లోని శస్త్రచికిత్సలివి..విపుల్ ప్రొసీజర్:ప్రాంక్రియాస్ (క్లోమం)లోని ‘హెడ్’ అనే భాగాన్నీ, అలాగే చిన్నపేగుల్లోని ‘డియోడినమ్’ అనే భాగాన్ని, గాల్బ్లాడర్నూ, బైల్డక్ట్ను తొలగించే ‘ప్రాంక్రియాటికో–డియోడనెక్టమీ’ వంటి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలో.ప్రాంక్రియాస్, చిన్నపేగులు, గాల్‌బ్లాడర్‌లోని కొన్ని జబ్బులు (డిజార్డర్స్)లో (ఉదా: క్రానిక్ ప్రాంక్రియాటైటిస్, డియోడనల్ ట్రామా వంటి చికిత్సల్లో)థైరాయిడెక్టమీ: క్యాన్సర్‌కు గురైన థైరాయిడ్ గ్రంథిని తొలగించడానికి చేసే సంప్రదాయ శస్త్రచికిత్స తర్వాత మెడ చుట్టూ గీత కనిపిస్తుంది. కానీ రోబో చేసే శస్త్రచికిత్స తర్వాత ఎలాంటి గీతా పడకుండా శస్త్రచికిత్స చేసేందుకు. (అందంగా కనిపించాలని కోరుకునే యువతీ యువకులకూ / పెళ్లి కావాల్సిన యువతకు ఇదో వరం). బ్రెయిన్ సర్జరీస్: మెదడులోని సంక్లిష్టమైన భాగాల్లోకి ఏర్పడ్డ ట్యూమర్స్‌ను సంప్రదాయ శస్త్రచికిత్సతో తొలగింపు వీలుకాని సందర్భాల్లో.భవిష్యత్తులో మరింత చవగ్గా... ఇప్పుడు చాలా చోట్ల అమెరికన్ తయారీ రోబోలు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి బాగా ఖరీదు కావడంతో ఈ శస్త్రచికిత్సలూ కాస్త ఖరీదే. అయితే భారతీయ రోబోలు అతి వేగంగా అందుబాటులోకి రానున్నాయి. ఇవి అమెరికన్ రోబోల ఖరీదులో సగానికే దొరుకుతాయి. ఫలితంగా అవి అందుబాటులోకి వస్తే ఇప్పటివరకూ అడ్వాన్స్డ్గా పరిగణిస్తున్న లాపరోస్కోపీ సర్జరీల స్థానంలో అన్ని వర్గాల ప్రజలకూ కొద్దిరోజుల్లోనే కారు చవగ్గా రోబో శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.– డాక్టర్ వి. చంద్రమోహన్, సీనియర్ రోబోటిక్ యూరో సర్జన్ -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్‌లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్‌బామ్‌ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌ను సీనియర్ సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్‌బామ్‌కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
వైద్యుల నిర్వాకం.. పేషెంట్ కడుపులో సర్జికల్ క్లాత్ మరిచి..
మైలవరం(ఎన్టీఆర్ జిల్లా): ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. గర్భసంచి తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు కడుపులోనే సర్జికల్ క్లాత్ వదిలేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంకు చెందిన కొరివిడి శివపార్వతి తరచూ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేది. ఆమె ఆరు నెలల కిందట ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అను హాస్పటల్‌కు వెళ్లింది. ఆమెకు వైద్యులు గర్భసంచి తొలగించాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అయినా కడుపునొప్పి తగ్గకపోవడంతో మళ్లీ పలుమార్లు అను ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. చివరికి 20 రోజుల కిందట విజయవాడలోని హరిణి ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో గుడ్డ వంటి పదార్థం ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేయగా బాధితురాలి కడుపులో సర్జికల్ క్లాత్ ఉండటంతో తొలగించారు. శివపార్వతి డిశ్చార్జి అయిన అనంతరం మంగళవారం ఈ విషయంపై మాట్లాడేందుకు మైలవరంలోని అస్పత్రికి వచ్చి ఆమె బంధువులు... వైద్యులు సరిగా స్పందించలేదని ఆందోళన చేశారు. చదవండి: డేటా కేబుల్‌తో ప్రియురాలిని చంపి.. అదే రోజు మరో అమ్మాయితో పెళ్లి! -
ప్రపంచంలోనే అతి పెద్ద ఫేస్ మాస్క్..
world's largest face mask: కరోనా మహమ్మారీ సమయంలో ఫేస్‌మాస్క్‌ల ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం ప్రజలు కూడా తమదైనందిన జీవితంలో ఈ మాస్క్‌లకు అలవాటుపడిపోయారు. ఇది అందరీకి ఒక నిత్యకృత్యంగా మారిపోయింది కూడా. అంతేగాక రకరకాల మాస్క్‌లు కూడా మార్కెట్లలలో దర్శనమిస్తున్నాయి. ఇటీవలే అత్యంత ఖరీదైన మాస్కలు అంటూ బంగారంతో తయారు చేసిన వాటి గురించి విన్నాం. అయితే ఇప్పుడూ వీటన్నింటిని తలదన్నేలా ప్రపంచంలో అతిపెద్ద మాస్క్ ఒకటి తైవాన్‌లో ఉంది. అసలు ఎందుకు తయారు చేశారంటే!.. వివరాల్లోకెళ్తే...ప్రపంచంలోనే అతి పెద్ద సర్జికల్ మాస్క్‌ని తైవాన్‌కి చెందిన ఓ వైద్య సంస్థ రూపొందించింది. ఇది 27 అడుగుల ఎత్తు 3 అంగుళాల 15 అడుగుల వెడల్పు, 9 అంగుళాలు పొడవుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పోరేషన్ అనే వైద్య సంస్థ మాస్క్ క్రియేటివ్ హౌస్‌లో ఈ మాస్క్‌ని ఆవిష్కరించింది. ఇది ప్రామాణిక ఫేస్ మాస్ కంటే కూడా 50 రెట్లు పెద్దది. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ న్యాయనిర్ణేతలు ఈ రికార్డును ధృవీకరించారు. కోవిడ్ -19 మహమ్మారీ సమయంలో అవగాహన పెంచడం కోసం 2020లోనే ఈ మాస్క్‌ని రూపొందించాలనే ఆలోచన వచ్చిందని మోటెక్స్ హెల్త్‌కేర్ కార్పొరేషన్ తెలిపింది. (చదవండి: ఆమె గోల్ కోసమే టెన్షన్...వేస్తుందా ? లేదా!) -
‘కరోనా’ను అడ్డుకునే మాస్క్‌లేమిటి?
న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచంలో పలు దేశాలను భయపెడుతున్న కరోనా వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్త కోసం చైనాతోపాటు కొన్ని దేశాల ప్రజలు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా ఈ మాస్క్‌లకు డిమాండ్ పెరగడంతో ‘ఆమెజాన్ ఆన్లైన్’ మార్కెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిల్వ ఉన్న స్టాక్‌లో ఎక్కువ భాగం ఇప్పటికే అమ్ముడు పోయింది. ప్రపంచానికి మాస్క్‌ల సరఫరా చేస్తున్న నెంబర్ వన్ దేశం చైనానే కావడం, అక్కడే కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. సరఫరాలు నిలిచిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న మాస్క్‌లలో సగం వాటా చైనాదే కావడం గమనార్హం. (చదవండి: కరోనా ప్రమాదం : మన ర్యాంకు ఎంతంటే?) కాలుష్యంతోపాటు వివిధ రకాల వైరస్ల నుంచి తప్పించుకునేందుకు పలు రకాల మాస్క్‌లు అందుబాటులో ఉండడం, తమకు అందుబాటులో ఉన్న మాస్క్‌లను ప్రజలు కొనుక్కొని వాడుతుండడం మనకు తెల్సిందే. అసలు మాస్క్‌లు ఎన్ని రకాలు? ఏ మాస్క్‌లు ఎంత వరకు రక్షణ కల్పిస్తాయి? అన్న అంశాలను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సర్జికల్ మాస్క్‌లు, నాన్ సర్జికల్ మాస్క్‌లు అని ప్రధానంగా రెండు రకాల మాస్క్‌లు మార్కెట్లో ఉన్నాయి. రెండు రకాల్లోను ప్రతి మాస్క్ మూడు రకాలుగా ఉంటాయి. పలుచటి బట్టతో చేసిందీ ఒకటైతే, దళసరి బట్టతో మరోటి, అంతకంటే దళసరి బట్టతో మరో రకం మాస్క్‌లు ఉంటాయి. మొదటిరకం మాస్క్‌లను సైక్లిస్ట్‌లు, రెండో రకం మాస్క్‌లను ఢిల్లీ లాంటి కాలుష్య నగర వాసులు, మూడోరకం మాస్క్‌లను తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న రోగుల నుంచి ఇతరులకు వైరస్ సోకకుండా వాడుతున్నారు. వాయు కాలుష్యాన్ని పక్కన పెడితే వైరస్ల బారి నుంచి తప్పించుకునేందుకు సర్జికల్ మాస్క్‌లను మాత్రమే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. సర్జికల్ మాస్క్లంటే ఏమిటి? ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో సర్జరీ చేస్తున్నప్పుడు వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది వాడే మాస్క్‌లను సర్జికల్ మాస్క్‌లు అంటారు. అందులో మూడు వరుసలు ఉంటాయి. ముక్కు నుంచి నోటి నుంచి కారే జలాన్ని పీల్చుకుని, బయటకు రాకుండా ఈ మూడు వరుసలు అడ్డుపడతాయి. వాస్తవానికి రోగుల నుంచి వైద్య సిబ్బంది రక్షణ కోసం ఈ సర్జికల్ మాస్క్‌లు రాలేదని, సర్జరీ సందర్భంగా వైద్య సిబ్బంది నుంచి సర్జరీకిగానీ, రోగికిగానీ ఇబ్బంది కలుగుకుండా ఉండేందుకే వీటిని రూపొందించారని ఇంగ్లండ్‌లోని వెస్ట్ మినిస్టర్ యూనివర్శిటీ, మెడికల్ మైక్రోబయోలోజీ అధ్యాపకులు డాక్టర్ మనాల్ మొహమ్మద్ తెలియజేస్తున్నారు. (చదవండి: ప్రపంచంలో 60 శాతంపైగా కరోనా ముప్పు!) ఎఫ్ఎఫ్పీ1, ఎఫ్ఎఫ్పీ 2, ఎఫ్ఎఫ్పీ 3 ఫిల్టరింగ్ ఫేస్ పీసెస్‌ను ఎఫ్ఎఫ్పీ అంటున్నారు. వీటిలో మూడు రకాలు. మొదటి రకం వైరస్ సోకకుండా అడ్డుకోదట. కానీ ధరించిన వారి నుంచి ఇతరులకు సోకకుండా కొంత అడ్డుకుంటుందని డాక్టర్ మనాల్ తెలిపారు. ఇవి అంతర్జాతీయ మార్కెట్లో వంద నుంచి వెయ్యి రూపాయల వరకు 20 ఉండే ప్యాక్ దొరకుతోంది. రెండోరకం వైరస్ సోకకుండా కాస్త రక్షణ కల్పిస్తోందని. మూడోరకం 99 శాతం రక్షణ కల్పిస్తుందని, మందంగా ఉండడమే అందుకు కారణమని ఆమె తెలిపారు. శ్వాస పీల్చుకోవడం ఇబ్బంది అవుతుంది కనుక మూడో రకం మాస్క్‌లు ధరించి పనులు చేసుకోలేమని ఆమె చెప్పారు. ఎఫ్ఎఫ్పీ 2 మాస్క్‌లు వెయ్యి నుంచి పదివేల రూపాయల వరకు ఉన్నాయి. ఎఫ్ఎఫ్పీ 3 రకం మాస్క్‌లు రెండు నుంచి 20 వేల రూపాయల వరకు ఉన్నాయి. వీటిలో కొన్ని ఏ రోజు మాస్క్ ఆరోజు పడేసేవి కాగా, మిగతా వాటిల్లో ఫిల్టర్లు మార్చుకునే అవకాశం ఉంటుంది. గ్యాస్ మాస్క్‌లు నూటికి నూరు శాతం రక్షణ కల్పిస్తాయని డాక్టర్ మనాల్ తెలిపారు. అవి అమెజాన్ ఆన్లైన్ మార్కెట్లో 1,500 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. మూడోరకం మాస్క్‌లైనా సరే గాలి జొరడానికి వీల్లేకుండా మూతిని, ముక్కును బిగబట్టి ఉండాలట. అంతేకాకుండా చేతులు శుభ్రంగా లేకుండా కళ్లు తుడుచుకున్నా, మాస్క్‌లు సర్దుకున్నా వైరస్ సోకే అవకాశాలు ఉంటాయట. కళ్ల నుంచి మన శరీరంలోకి ప్రవేశించే ఫ్లూ వైరస్‌లను మాత్రం ఈ మాస్క్‌లు ఏవీ అడ్డుకోలేవని డాక్టర్ మనాల్ చెప్పారు. అప్పుడు కళ్లు మూసుకొని పడుకోవడం ఒక్కటే మార్గమేమో! (చదవండి: కన్నా... నీ రాక కోసం!) -
ఆరెస్సెస్ బోధనల వల్లే ‘సర్జికల్’
పరీకర్ వ్యాఖ్య అహ్మదాబాద్: పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు చేయాలనే ఆలోచన బహుశా తమకు ఆరెస్సెస్ బోధనల వల్లే వచ్చి ఉండొచ్చని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ సోమవారం అన్నారు. మహాత్మాగాంధీ పుట్టిన గుజరాత్ నుంచి వచ్చిన ప్రధాని మోదీ, సైనిక బలగాల చరిత్రలేని గోవా నుంచి వచ్చిన తాను కలసి ఈ దాడులకు ఆదేశాలివ్వడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అహ్మదాబాద్‌లోని నిర్మా వర్సిటీ నిర్వహించిన ‘నో మై ఆర్మీ’(నా సైన్యం గురించి తెలుసుకో) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కొంతమంది ఈ దాడులకు సాక్ష్యాలు అడుగుతున్నారు. ఆర్మీ చెబితే నమ్మాలి. సాక్ష్యాలు ఇచ్చాకా నమ్మని వారు కొందరుంటారు. రుజువులు కోరే వారిని పట్టించుకోనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ సైన్యం మనకుంది’ అని అన్నారు. ఐదారేళ్లలో సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ చాలామార్లు ఉల్లంఘించిందని, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే ప్రస్తుతం మనం వారికి తగిన విధంగా (కాల్పులు, దాడులతో) సమాధానమిస్తున్నామన్నారు. -
సర్జికల్తోలష్కరేకు చావుదెబ్బ
బారాముల్లా/న్యూఢిల్లీ: ఇటీవల భారత సైన్యం సర్జికల్ దాడుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఎక్కువగా నష్టపోయినట్లు పాకిస్తాన్ ఆర్మీ రేడియో తరంగాల విశ్లేషణలో వెల్లడైంది. దాదాపు 20 మంది లష్కరే ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. దాడి తర్వాత పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల సంభాషణల రేడియో తరంగాలపై అనుక్షణం నిఘా ఉంచినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత్‌లోని కుప్వారా సెక్టార్‌కు ఎదురుగా ఉన్న పీవోకేలోని కెల్ అండ్ దుడ్నియాల్ వద్ద దాడుల్లో 10 మంది లష్కరే ఉగ్రవాదులు మరణించారు. తర్వాత పాక్ ఆర్మీ వాహనాల్లో ఆ మృతదేహాల్ని తీసుకెళ్లి ఖననం చేశారు. పూంచ్ సెక్టారుకు ఎదురుగా ఉన్న బాల్నోయ్ ప్రాంతంలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్‌పై సర్జికల్ దాడుల్లో 9 మంది లష్కరే ఉగ్రవాదులు మరణించినట్లు పాకిస్తాన్ ఆర్మీ రేడియో సంభాషణల వల్ల తేలింది. దాడిలో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. -
ఆపరేషన్లకూ యూట్యూబే ఆధారం!
ఏదైనా కొత్త వంట గురించి తెలుసుకోవాలంటే గృహిణులు వెంటనే చూసేది.. యూట్యూబ్. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ మాయాజాలం వైద్యరంగాన్ని కూడా వదలడం లేదు. నిపుణులు సైతం ఆపరేషన్లలో సరికొత్త పద్ధతులు తెలుసుకోడానికి యూట్యూబ్ లాంటి ఆన్లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారట. ఆమెరికన్ అకాడమీ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ అండ్ రీ కనస్ట్రక్టివ్ సర్జరీ (ఏఏఎఫ్పీఆర్ఎస్)కి చెందిన బృందం జరిపిన సర్వేలు యూట్యూబ్ వాడకంపై కొత్త విషయాలను వెల్లడించాయి. ప్లాస్టిక్ సర్జరీల విషయంలో వస్తున్న కొత్త పద్ధతుల గురించి యూట్యూబ్‌లో చూడటంతో పాటు.. వాటిని ఆచరణలో కూడా పెడుతున్నట్లు భారత సంతతికి చెందిన అనిత్ సెత్నా బృందం చేసిన అధ్యయనాల్లో కనుగొన్నారు. ఏఏఎఫ్పీఆర్ఎస్ సభ్యులు కొందరితో సర్వే చేయగా.. మొత్తం 202 మంది దానికి స్పందించారు. సాంకేతిక, సాంకేతికేతర విషయాలు తెలుసుకోడానికి ప్రధానంగా సమావేశాల్లో పాల్గొనడం, జర్నల్స్ చదవడం, సహోద్యోగులతో చర్చించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి. అయితే.. సర్వేలో పాల్గొన్నవారిలో 64.1 శాతం మంది మాత్రం.. రైనో ప్లాస్టీ, సూదులతో చేసే చికిత్సా విధానాలను, అందులోని కొత్త పద్ధతులను తెలుసుకునేందుకు కనీసం ఒక్కసారైనా తాము యూట్యూబ్ వీడియోలు చూసినట్లు చెప్పారు. వాళ్లలో 83.1 శాతం మంది ఏకంగా తాము అలా చూసిన పద్ధతులను ఆచరణలో కూడా పెడుతున్నట్లు చెబుతున్నారు. అనుభవం ఉన్న వాళ్ల కంటే.. అంతగా అనుభవం లేనివాళ్లు ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారట. ఇంటర్నెట్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆయా ఆపరేషన్ల నాణ్యత విషయంలోనే ఆందోళన వ్యక్తమవుతోందని సెత్నా బృందం తెలిపింది. వీరి పరిశోధన వ్యాసం జామా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమైంది.