సర్జికల్తోలష్కరేకు చావుదెబ్బ
బారాముల్లా/న్యూఢిల్లీ: ఇటీవల భారత సైన్యం సర్జికల్ దాడుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఎక్కువగా నష్టపోయినట్లు పాకిస్తాన్ ఆర్మీ రేడియో తరంగాల విశ్లేషణలో వెల్లడైంది. దాదాపు 20 మంది లష్కరే ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. దాడి తర్వాత పాక్ ఆర్మీ, ఉగ్రవాదుల సంభాషణల రేడియో తరంగాలపై అనుక్షణం నిఘా ఉంచినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
భారత్‌లోని కుప్వారా సెక్టార్‌కు ఎదురుగా ఉన్న పీవోకేలోని కెల్ అండ్ దుడ్నియాల్ వద్ద దాడుల్లో 10 మంది లష్కరే ఉగ్రవాదులు మరణించారు. తర్వాత పాక్ ఆర్మీ వాహనాల్లో ఆ మృతదేహాల్ని తీసుకెళ్లి ఖననం చేశారు. పూంచ్ సెక్టారుకు ఎదురుగా ఉన్న బాల్నోయ్ ప్రాంతంలో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్‌పై సర్జికల్ దాడుల్లో 9 మంది లష్కరే ఉగ్రవాదులు మరణించినట్లు పాకిస్తాన్ ఆర్మీ రేడియో సంభాషణల వల్ల తేలింది. దాడిలో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు.