సిబ్బంది లేక ఖాళీగా దర్శనమిస్తున్న నర్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
ప్రభుత్వ దవాఖానాలో వైద్యాధికారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుడు అందుబాటులో లేక ఆస్పత్రి బోసిపోయింది. సమస్య పరిష్కరించాల్సిన ఆశాఖ అటువైపు దృష్టి సారించకపోవడంతో రోగులు చిన్నపాటి జబ్బుకు కూడా వేలాది రూపాయలు ఖర్చుచేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
నర్వ : నిరంతర సేవల ద్వారా ప్రజావైద్యం అందించే ఆసుపత్రి సేవల్లో సిబ్బంది మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోవడం మూలంగా పరిస్థితి విషమించే ప్రమా దం ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. లూజ్ మోషన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ బాలుడిని గురు వారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. సిబ్బం ది లేకపోవడంతో గంటల తరబడి వేచి చూశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు.
తెరుచుకోని యునాని కేంద్రం
ఆస్పత్రిలో దీర్ఘకాలిక రోగుల కోసం ఏర్పాటు చేసిన యునాని వైద్య కేంద్రం ఎప్పుడు రోగులకు అందుబాటులో ఉంటుందో దేవుడికే తెలియాలి. నామమాత్రపు సేవలు, ప్రచారం లేని ఆయు ర్వేద కేంద్రంతో ఎలాంటి ప్రయో జనం లేదని ప్రజలు వాపోతున్నారు.
ఓపీ సేవలు పెంచాలి
నిత్యం వివిధ రోగాలపై ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ సేవలను అందించే సమయాన్ని పెంచాలి. ఓపీ తర్వాత కూడా ఎమర్జెన్సీ కేసులు వస్తే అందుబాటులో వైద్య సిబ్బంది ఉండాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది ఉండక పోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
సిబ్బందే ఉండరు..
మా బందువుల బాబుకు మోషన్స్ ఉన్నాయని ఆసుపత్రికి వచ్చాం. సిబ్బంది ఎవ్వరూ లేరు. గతంలో చాలా సార్లు ఆసుపత్రికి వచ్చిన సేవలు అందించడంలో సిబ్బంది రోగులను మాటలతో ఇబ్బందులకు గురిచేస్తారు. ‘మీకు కావాల్సినప్పుడే డాక్టర్ వస్తాడా.. మా సమయంలోనే మేము వస్తాం’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మూడు గంటలు ఎదురుచూశాం. చివరికి గోళి ఇచ్చి పంపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
– సైఫల్ అన్సారీ, లంకాల్
సిబ్బంది నిర్లక్ష్యం వీడాలి
మా బాబు మతిన్‌కు మోషన్స్‌లో బ్లడ్ వస్తుందని ఆసుపత్రికి వెళ్లాం. ఆస్పత్రిలో సిబ్బంది ఎవ్వరూ లేరు. రెండు గంటలు వేచి చూసిన తర్వాతనే సిబ్బంది వచ్చారు. రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు.
– చాంద్‌పాష, నర్వ, గ్రామం
సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం
రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమో అందించి వివరణ కోరాం. మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తాను. ఓపీ సేవలను పెంచి రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం.
– సిద్దప్ప, పీహెచ్‌సీ వైద్యులు, నర్వ
Comments
Please login to add a commentAdd a comment