patients complain
-
Corona patients: ఆక్సిజన్ అందక.. లైన్లో ఉండలేక..
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్): ‘సమయం మధ్యాహ్నం 12.50 గంటలు.. పాతబస్తీ నుంచి 26 ఏళ్ల యువతిని కుటుంబ సభ్యులు కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 78 నుంచి 84 మధ్య ఉంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతోంది. ఎమర్జెన్సీ అమ్మా.. తొందరగా అడ్మిట్ చేసుకోండంటూ కుటుంబ సభ్యులు అక్కడున్న సిబ్బందిని ప్రాధేయపడ్డారు.ఎవరైనా ఒకటేనమ్మా లైన్లో నిలబడండి, రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ స్లిప్ లెఫ్ట్‌లో ఉన్న క్యాబిన్లో ఇవ్వండనే సమాధానం వచ్చింది. అప్పటికే లైన్లో 15మందికి పైగా ఉన్నారు. వారందర్నీ రిక్వెస్ట్ చేసిన కుటుంబ సభ్యులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేవలం 15 నిమిషాల్లో పూర్తి చేశారు. స్లిప్ తీసుకుని ఎడమవైపు ఉన్న సమాచార క్యాబిన్లో ఉన్న నర్సులకు ఇచ్చారు. ఇక ఇక్కడ నిమిషాల కొద్దీ ఆలస్యం. సుమారు 45 నిమిషాల పాటు వెంట తెచ్చుకున్న ఆక్సిజన్ అయిపోతుంది, మహిళ తీవ్ర నిస్పృహకు గురవుతోంది. ఎంత వేడుకున్నా అస్సలు వినలేదు. 45 నిమిషాల తర్వాత ఒకేసారి ఐదుగురికి అడ్మిషన్ స్లిప్పులు ఇచ్చి 1.30గంటలకు పైకి పంపారు’. ‘వజ్రమ్మ వయస్సు 92 ఏళ్లు. ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 86 నుంచి 80కి పడిపోతున్నాయని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమె కుటుంబీకులు అడ్మిషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేసి అడ్మిషన్ స్లిప్ కోసం కనీసం 45 నిమిషాలకు పైగా వేచి చూశారు. ఓ పక్క వృద్ధురాలు వీల్‌చైర్‌లో అనేక అవస్థలు పడుతోంది. పెద్దామే బాధ చూడలేకపోతున్నాం.. త్వరగా అడ్మిట్ చేసుకోమని ప్రాధేయపడినా సరే.. అందరితో పాటే అడ్మిషన్ స్లిప్‌ని వృద్ధురాలికి కూడా ఇచ్చి పైకి పంపిన ఈ రెండు ఘటనలు బుధవారం కింగ్‌కోఠి ఆసుపత్రిలో చోటు చేసుకున్నాయి’. కంటతడి పెట్టిస్తున్న నిర్లక్ష్యం ఓ పక్క అయినవారు బతకాలనే ఆశ. మరో పక్క సిబ్బంది నిర్లక్ష్యం. ఈ రెండింటితో ఎవరిని ఏం అనాలో తెలియక పేషెంట్ల వెంబడి ఉన్న కుటుంబ సభ్యులు కంటతడి పెడుతున్నారు. సిబ్బందిపై కొద్దిగా కొప్పడితే బెడ్ ఇవ్వరేమో అనే భయం. కొద్దిగా ఓర్చుకో అమ్మా.. అంటూ పెషెంట్‌నిని ప్రాధేయపడుతున్న క్రమంలో.. ఆమె నిస్సాహాయకురాలిగా ఉంటుంది. కనీస పర్యవేక్షణ లేకపోవడం వల్ల, నిత్యం వందలాది మందికి సర్వీస్ ఇవ్వడం వల్ల సిబ్బంది సైతం విసిగెత్తిపోతున్నారు. ప్రాణం పోతే ఆ బాధ, వేదన తమకే తెలుస్తోందంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. 15 నిమిషాల్లోనే అడ్మిట్ ఎవరినీ ఎక్కువ సేపు వెయిట్ చేయించేది లేదు. ఎమర్జెన్సీ ఉంటే పేషెంట్‌ని అడ్మిట్ చేసుకుని అడ్మిషన్ ప్రక్రియ వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నాం. ఒక్కోసారి ఆలస్యం అవుతుంటుంది. కానీ.. ఉద్ధేశపూర్వకంగా ఎవరినీ ఎక్కువ సేపు వేచి ఉంచేలా చేయము. – డాక్టర్ రాజేంద్రనాథ్, కింగ్‌కోఠి ఆస్పత్రి సూపరింటెండెంట్ ( చదవండి: వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! ) -
ప్రైవేట్ ‘సేవ’లో
ఈ ఫొటోలో కనిపిస్తున్నది జిల్లాకేంద్ర ఆసుపత్రి.. ఆవరణలో నిలిచి ఉన్న వాహనాలు ప్రైవేటు ఆసుపత్రుల అంబులెన్స్‌లు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆవరణలో ఈ వాహనాలేంటి..? అనుకుంటున్నా రా.. ప్రమాదంబారిన పడిన రోగులను తీసుకొచ్చే 108 సిబ్బంది కోసం.. ప్రభుత్వ వైద్యులు రెఫర్ చేసే కేసుల కోసం ఇలాంటి వాహనాలు ఇక్కడ నిలిపి ఉండడం ఆసుపత్రి వద్ద నిత్యకృత్యం. కరీంనగర్‌హెల్త్: పెద్దపల్లి బ్రిడ్జి సమీపంలో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని రోడ్డువైపు ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రైవేటు ఉద్యోగి కటుకూరి చందుకు తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన సిబ్బంది మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు రెఫర్ చేశారు. అదే వాహనంలో కరీంనగర్‌కు బయలుదేరారు. దారి మధ్యలో.. ముఖానికి చాలావరకు గాయాలయ్యాయని.. రక్తంకూడా ఎక్కువగా పోయిందని.. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అంతంత మాత్రంగానే వైద్యసేవలు అందుతాయని సదరు అంబులెన్స్ సిబ్బంది రోగి బంధువులను భయపెట్టారు. దీంతో హైరానాపడిన బంధువులు ఏదైనా మంచి ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాలని కోరారు. ‘మనకు తక్కువ ఖర్చులో వైద్యంచేసే మంచి హాస్పిటల్ ఉంది. కానీ.. 108లో ప్రభుత్వ ఆస్పత్రికే తీసుకెళ్లాలి. అక్కడినుంచి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాం. అంతా మేం చూసుకుంటాం..’ అని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్చారు. అక్కడికి చేరుకోగానే అప్పటికే ఓ ప్రైవేటు ఆస్పత్రి అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. వెంటనే అక్కడి నుంచి వారిని తీసుకెళ్లి ప్రైవేటులో చేర్పించారు. విచిత్రం ఏంటంటే.. ఆ ప్రైవేటు ఆస్పత్రికి తరలించేందుకు స్వయంగా 108 సిబ్బంది ఒకరు సాయం అందించడం. క్షతగాత్రుడిని ఎమర్జెన్సీలోకి తరలించిన వెంటనే ఆస్పత్రి యాజమాన్యం అందించిన రూ.5వేల కవర్‌ను తీసుకుని అక్కడినుంచి జారుకున్నట్లు సమాచారం. ఈ ఒక్క సంఘటన చాలు 108 సిబ్బంది అత్యవసర సమయంలో ఉన్నవారిని ప్రైవేటు ఆస్పత్రులకు ఎలా తరలిస్తున్నారో చెప్పడానికి. వైద్యసేవల ముసుగులో జిల్లాలో దళారీ రాకెట్ వ్యవస్థ నడుస్తోంది. దళారీ వైద్య వ్యవస్థలో అంబులెన్స్ నిర్వాహకులే ప్రధానపాత్ర పోషిస్తూ ప్రజలను దోపిడీకి గురిచేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను జిల్లాకేంద్రంలోని సూపర్‌స్పెషాలిటీ, మల్టీస్పెషాల్టీ ఆసుపత్రులుగా చెప్పుకునే నిర్వాహకులే పెంచిపోషిస్తున్నారంటే అతిశయోక్తి కలగక మానదు. ఈ దందా ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా పదేళ్లుగా కొనసాగుతుండడంతో అంబులెన్స్ నిర్వాహకులు తమను ఎవరూ ఏమిచేయలేరు.. అన్నట్లు మారింది. వీరితోపాటు ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకులూ వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే వైద్యాధికారులను సైతం తమ కనుసన్నల్లోకి తిప్పుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదేళ్లుగా వేళ్లూనుకుపోయిన ఈ దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చికిత్స పేరుతో ప్రజల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. అంబులెన్స్‌లే దళారీలు.. జిల్లా కేంద్రంలో హంగుఆర్భాటాలతో నడిపిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకు అంబులెన్స్ నిర్వాహకులు దళారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవస్థలో రెండు రకాలు. మొదటిది రోగాలబారిన పడిన వారిని నమ్మించి ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించడం. రెండోది ప్రమాదంలో గాయపడి.. ఆపదలో ఉన్నవారికి మాయమాటలు చెప్పి భారీగా కమీషన్లు ఇచ్చే ఆస్పత్రుల్లో చేర్పించడం. ఉన్నట్టుండి తీవ్ర కడుపునొప్పి రావడం, గుండెపోటు, విషం తాగిన వంటి కేసులు స్థానిక అంబులెన్స్‌లను ఆశ్రయిస్తుంటారు. వీరి ఆపద, ప్రమాదస్థాయిని ఆసరాగా చేసుకుని ఆ స్థాయి ఆస్పత్రికి తరలిస్తుంటారు. మంచి డాక్టర్ ఉన్న ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తానని చెప్పి ‘మీ ప్రాణాలకు ఢోకాలేదు..’ అని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా ప్రజలను నమ్మించి ఎక్కువ కమీషన్లు వచ్చే హాస్పిటల్లో చేర్పిస్తారు. బాధితులతో అంబులెన్స్ అక్కడికి చేరుకోగానే హాస్పిటల్ వద్ద డాక్టర్, నర్సు, బాయ్స్‌తో కలిసి హంగామా చేస్తుంటాడు. వాహనం ఆగడంతోనే బాధితులను స్ట్రచ్చర్‌పై వేసి లోనికి పంపించి ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న ప్రకారం కమీషన్ జేబులో వేసుకుని కనిపించకుండా వెళ్లిపోతారు. అంబులెన్స్‌ల హవా.. ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య పెరగడంతోపాటు వారిలో పోటీ నెలకొనడంతో ఈ మధ్యకాలంలో అంబులెన్స్‌ల దళారీ వ్యవస్థ మొదలైంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కేసులను తీసుకువచ్చిన అంబులెన్స్ నిర్వాహకులకు కమీషన్లు ఇచ్చేవారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులకు మాత్రమే సొంత అంబులెన్స్‌లు ఉండేవి. ఇవి కూడా అనుబంధంగా మాత్రమే నడిచేవి. ఇపుడు ప్రతి హాస్పిటల్‌కు ఒకటి, పెద్ద ఆస్పత్రులకు నాలుగైదు అంబులెన్స్‌లు ఉంటున్నాయి. వీటితోపాటు మండల హెడ్‌క్వార్టర్స్‌లో కూడా అంబులెన్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే.. ఎక్కువ కేసులు తమ హాస్పిటల్‌కే పంపించాలని అంబులెన్స్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు తీసుకువస్తే ఒక కొత్త అంబులెన్స్ వాహనం గిఫ్టుగా ఇస్తామని ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ ఒప్పందం కారణంగానే డ్రైవర్లుగా ఉన్న వారు అంబులెన్స్ ఓనర్లు అయ్యారు. జిల్లాలో మూడు వందలకుపైగా ప్రైవేటు అంబులెన్స్‌లు ఉన్నాయి. వీటిలో సగం కంటే ఎక్కువ జిల్లా కేంద్రంలో ఆయా ఆస్పత్రుల పేర్లతో కనిపిస్తుంటాయి. ప్రభుత్వాస్పత్రి చుట్టూ.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రి చుట్టు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ప్రైవేటు అంబులెన్స్‌లు మోహరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ప్రహారీ గోడ చుట్టు కనీసం 50వరకు ప్రైవేటు అంబులెన్స్‌లు ఏర్పాటు చేసుకుని నిర్వాహకులు రోగులకోసం వార్డుల్లో తిష్టవేసి తిరుగుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి ఏదైనా సీరియన్ కేస్ వచ్చిందంటే చాలు వారిని ప్రైవేటుకు తరలించుకుపోయే చర్యలు చేపడుతున్నారు. అందుబాటులోనే మంచి డాక్టర్ ఉన్నాడని, తక్కువ ఖర్చులో చేపిస్తామంటూ కమీషన్ల కోసం మాయమాటలతో వారిని ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. ఫిర్యాదులు అందితే చర్యలు: బాలక్రిష్ణ, 108 ఐదు జిల్లాల ఇన్చార్జి, ప్రోగ్రాం మేనేజర్ 108 సిబ్బంది క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులు అందితే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా అందుబాటులో ఉన్న ప్రభు త్వ ఆస్పత్రికి మాత్రమే తీసుకువెళ్లాలి. బా ధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండి బంధువులు ప్రైవేటుకు తీసుకువెళ్లాలని కోరితే ఉన్నతాధికారుల అనుమతితోనే ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకుపోతుంటారు. ప్రైవేటుకు వెళ్లాలని సూచించడం.. ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులు ఏమీ అందలేదు. -
నాణ్యత నగుబాటు
సాక్షి, కర్నూలు : ఉన్నట్టు తెలుస్తోంది. వేస్తున్న రోడ్డు కూడా క్రమబద్ధంగా కాకుండా వంకర టింకర్లుగా సాగుతోంది. ఇందుకు అధికారులు కూడా అభ్యంతరం తెలపడం లేదు. వారు కనీసం పనులు జరిగే ప్రదేశాన్ని తనిఖీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంకర వేశారు... రోడ్డు మరిచారు! పెద్దాసుపత్రి అంతటా అంతర్గతంగా సీసీ రోడ్లను వేసేందుకు రూ.2 కోట్లతో మొదటిసారి టెండర్ పిలిచారు. అయితే, ఒక్కరే వచ్చారనే కారణంగా రెండోసారి టెండర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి షెడ్యూళ్లు దాఖలు చేసిన ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లను రింగు చేసి.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడికే దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు రోజులు గడుస్తున్నప్పటికీ పనులను ప్రారంభించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఉన్న రోడ్లనూ తీసేయడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు వివిధ పరీక్షల కోసం మెడాల్ యూనిట్ వద్దకు వెళ్లేందుకు ఉన్న దారిలో కంకర వేసి నెల రోజులు గడుస్తున్నాయి. రోగులే రోలర్లు! ఏదైనా సీసీ రోడ్డును వేసే సమయంలో మొదట జేసీబీతో ఒక లెవల్‌గా చేస్తారు. అనంతరం కంకర, డస్ట్ వేస్తారు. దీనిపై రోలర్‌తో రోల్ చేస్తారు. ఈ విధంగా నాలుగైదు రోజులు చేసిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడతారు. అయితే, ఇక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. మొదటగా కంకర వేశారు. అది కూడా చిన్నరకం కంకర వాడుతున్నారు. దీనిపై కనీసం డస్ట్ కూడా వేయలేదు. రోడ్డు రోలర్‌తో తిప్పిన దాఖలాలు అసలే లేవు. ఈ కంకర మీద రోగులు, స్ట్రెచర్లు, రోగుల సంబంధీకులు నడవడంతో రోలింగ్ అవుతున్న పరిస్థితి కన్పిస్తోంది. కనీసం రోలింగ్ చేస్తే రోడ్డు పూర్తయ్యే వరకూ కనీసం నడిచేందుకు రోగులకు ఇబ్బంది ఉండదు. అధికారులు మాత్రం ఆ వైపు కనీస చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్‌ను ఏమైనా అంటే ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని జంకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. నాణ్యతలో రాజీ లేదు పెద్దాసుపత్రి అంతర్గత రోడ్ల నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఒక లేయర్లో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిపై మరో లేయర్ వస్తుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు ఉండేలా చూస్తాం. – విజయభాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ -
వైద్యం.. దైన్యం!
ప్రభుత్వ దవాఖానాలో వైద్యాధికారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుడు అందుబాటులో లేక ఆస్పత్రి బోసిపోయింది. సమస్య పరిష్కరించాల్సిన ఆశాఖ అటువైపు దృష్టి సారించకపోవడంతో రోగులు చిన్నపాటి జబ్బుకు కూడా వేలాది రూపాయలు ఖర్చుచేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. నర్వ : నిరంతర సేవల ద్వారా ప్రజావైద్యం అందించే ఆసుపత్రి సేవల్లో సిబ్బంది మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సకాలంలో చికిత్స అందకపోవడం మూలంగా పరిస్థితి విషమించే ప్రమా దం ఉందని రోగులు ఆందోళన చెందుతున్నారు. లూజ్ మోషన్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఓ బాలుడిని గురు వారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. సిబ్బం ది లేకపోవడంతో గంటల తరబడి వేచి చూశారు. అయినా ఫలితం దక్కలేదు. చివరికి జిల్లా కేంద్రానికి తరలివెళ్లారు. తెరుచుకోని యునాని కేంద్రం ఆస్పత్రిలో దీర్ఘకాలిక రోగుల కోసం ఏర్పాటు చేసిన యునాని వైద్య కేంద్రం ఎప్పుడు రోగులకు అందుబాటులో ఉంటుందో దేవుడికే తెలియాలి. నామమాత్రపు సేవలు, ప్రచారం లేని ఆయు ర్వేద కేంద్రంతో ఎలాంటి ప్రయో జనం లేదని ప్రజలు వాపోతున్నారు. ఓపీ సేవలు పెంచాలి నిత్యం వివిధ రోగాలపై ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపీ సేవలను అందించే సమయాన్ని పెంచాలి. ఓపీ తర్వాత కూడా ఎమర్జెన్సీ కేసులు వస్తే అందుబాటులో వైద్య సిబ్బంది ఉండాలని ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది ఉండక పోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బందే ఉండరు.. మా బందువుల బాబుకు మోషన్స్ ఉన్నాయని ఆసుపత్రికి వచ్చాం. సిబ్బంది ఎవ్వరూ లేరు. గతంలో చాలా సార్లు ఆసుపత్రికి వచ్చిన సేవలు అందించడంలో సిబ్బంది రోగులను మాటలతో ఇబ్బందులకు గురిచేస్తారు. ‘మీకు కావాల్సినప్పుడే డాక్టర్ వస్తాడా.. మా సమయంలోనే మేము వస్తాం’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మూడు గంటలు ఎదురుచూశాం. చివరికి గోళి ఇచ్చి పంపించారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. – సైఫల్ అన్సారీ, లంకాల్ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలి మా బాబు మతిన్‌కు మోషన్స్‌లో బ్లడ్ వస్తుందని ఆసుపత్రికి వెళ్లాం. ఆస్పత్రిలో సిబ్బంది ఎవ్వరూ లేరు. రెండు గంటలు వేచి చూసిన తర్వాతనే సిబ్బంది వచ్చారు. రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. – చాంద్‌పాష, నర్వ, గ్రామం సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి మెమో అందించి వివరణ కోరాం. మున్ముందు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్తాను. ఓపీ సేవలను పెంచి రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటాం. – సిద్దప్ప, పీహెచ్సీ వైద్యులు, నర్వ -
రోగులపై లైంగిక వేధింపులు: డాక్టర్ అరెస్టు
కృత్రిమ గర్భధారణ కోసం వచ్చిన పలువురు రోగులను లైంగికంగా వేధించి, మూడేళ్లుగా పరారీలో ఉన్న ఓ ముసలి డాక్టర్‌ను బ్రెజిల్ పోలీసులు అరెస్టు చేశారు. రోజర్ అబ్దెల్మసీ (70) అనే ఈ డాక్టర్ బ్రెజిల్ వదిలిపెట్టి పొరుగునున్న పరాగ్వే దేశంలో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. అక్కడ అతడిని అరెస్టు చేసి బ్రెజిలియన్ అధికారులకు అప్పగించారు. వీసా కూడా లేకుండా పరాగ్వేలో ఉంటున్నందుకు అతడిని అరెస్టు చేశారు. ఇన్నాళ్లుగా ఎవరికీ చిక్కకుండా పలు యూరోపియన్ దేశాలలో తిరుగుతూ మూడు నెలల క్రితమే ఆ డాక్టర్ పరాగ్వే చేరుకున్నాడు. బ్రెజిల్‌లోని అతిపెద్ద నగరమైన సాన్ పాలోలో కృత్రిమ గర్భధారణ నిపుణుడిగా పేరొందిన రోజర్ మీద దాదాపు 35 మంది మాజీ రోగులు ఫిర్యాదు చేశారు. అతడు తమను లైంగికంగా వేధించినట్లు తెలిపారు. ఆయనపై 56 కౌంట్ల అత్యాచారం, లైంగిక వేధింపులు 2010లోనే రుజువయ్యాయి. దాంతో 278 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. దాంతో శాన్ పాలో మెడికల్ కౌన్సిల్ అతడి లైసెన్సును రద్దుచేసింది.