కంకర దారిపై ఇబ్బంది పడుతూ స్ట్రెచర్ నెడుతున్న రోగి సహాయకుడు
సాక్షి, కర్నూలు : ఉన్నట్టు తెలుస్తోంది. వేస్తున్న రోడ్డు కూడా క్రమబద్ధంగా కాకుండా వంకర టింకర్లుగా సాగుతోంది. ఇందుకు అధికారులు కూడా అభ్యంతరం తెలపడం లేదు. వారు కనీసం పనులు జరిగే ప్రదేశాన్ని తనిఖీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కంకర వేశారు... రోడ్డు మరిచారు!
పెద్దాసుపత్రి అంతటా అంతర్గతంగా సీసీ రోడ్లను వేసేందుకు రూ.2 కోట్లతో మొదటిసారి టెండర్ పిలిచారు. అయితే, ఒక్కరే వచ్చారనే కారణంగా రెండోసారి టెండర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి షెడ్యూళ్లు దాఖలు చేసిన ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లను రింగు చేసి.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడికే దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు రోజులు గడుస్తున్నప్పటికీ పనులను ప్రారంభించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఉన్న రోడ్లనూ తీసేయడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు వివిధ పరీక్షల కోసం మెడాల్ యూనిట్ వద్దకు వెళ్లేందుకు ఉన్న దారిలో కంకర వేసి నెల రోజులు గడుస్తున్నాయి.
రోగులే రోలర్లు!
ఏదైనా సీసీ రోడ్డును వేసే సమయంలో మొదట జేసీబీతో ఒక లెవల్‌గా చేస్తారు. అనంతరం కంకర, డస్ట్ వేస్తారు. దీనిపై రోలర్‌తో రోల్ చేస్తారు. ఈ విధంగా నాలుగైదు రోజులు చేసిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడతారు. అయితే, ఇక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. మొదటగా కంకర వేశారు. అది కూడా చిన్నరకం కంకర వాడుతున్నారు. దీనిపై కనీసం డస్ట్ కూడా వేయలేదు. రోడ్డు రోలర్‌తో తిప్పిన దాఖలాలు అసలే లేవు. ఈ కంకర మీద రోగులు, స్ట్రెచర్లు, రోగుల సంబంధీకులు నడవడంతో రోలింగ్ అవుతున్న పరిస్థితి కన్పిస్తోంది. కనీసం రోలింగ్ చేస్తే రోడ్డు పూర్తయ్యే వరకూ కనీసం నడిచేందుకు రోగులకు ఇబ్బంది ఉండదు. అధికారులు మాత్రం ఆ వైపు కనీస చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్‌ను ఏమైనా అంటే ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని జంకుతున్నట్టు ప్రచారం సాగుతోంది.
నాణ్యతలో రాజీ లేదు
పెద్దాసుపత్రి అంతర్గత రోడ్ల నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఒక లేయర్‌లో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిపై మరో లేయర్ వస్తుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు ఉండేలా చూస్తాం. – విజయభాస్కర్,
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్‌ఐడీసీ
Comments
Please login to add a commentAdd a comment