Cc road construction
-
బావమరిది కళ్లలో ఆనందం కోసం..!
మార్కాపురం రూరల్: బావమరిది కళ్లలో ఆనందం కోసం ప్రభుత్వ నిధులతో బావ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం మార్కాపురం ప్రాంతంలో వివాదాస్పదమైంది. మండలంలోని దరిమడుగు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నేత ఏకంగా 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బావమరిది ఇంటి వరకూ రోడ్డు వేయిస్తున్నాడు. ఇప్పటికే మట్టిరోడ్డు తవ్వి కంకరచిప్స్ వేశారు. రేపోమాపో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిచేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు, టీడీపీ గ్రామ కార్యకర్తలు సైతం ఆశ్చర్యం,. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్‌రోడ్డు నుంచి సరిగ్గా బావమరిది ఇంటివరకూ రోడ్డు ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ టీడీపీ నేత వ్యవహారశైలితో ఆ గ్రామంతో పాటు టీడీపీ మండల నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పంచాయతీలో ఎస్సీకాలనీతో పాటు గ్రామంలో పలు అంతర్గత రోడ్లు అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ పంచాయతీలోనే ఉన్న ఆటోనగర్‌లో రోడ్లు లేక డ్రైవర్లు, వాహనాల యజమానులు, కార్మికులు అవస్ధలు పడుతున్నారు. ఇవన్నీ ఆ టీడీపీ నేతకు కనిపించడం లేదా..? అని గ్రామస్తులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే మండిపడుతున్నారు. బావమరిది కోసం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో సుమారు 200 మీటర్ల రోడ్డు నిర్మిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పలు ఎస్సీకాలనీల ప్రజలు సమస్యలతో సతమతమవుతుండగా, బావమరిది కోసం ప్రభుత్వ నిధులతో టీడీపీ నేత రోడ్డు నిర్మించడం తీవ్రస్థాయిలో విమర్శలకు తావిస్తోంది. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి. -
నెల్లూరు రూరల్ లో సీసీ రోడ్ల నిర్మాణం
-
నాణ్యత నగుబాటు
సాక్షి, కర్నూలు : ఉన్నట్టు తెలుస్తోంది. వేస్తున్న రోడ్డు కూడా క్రమబద్ధంగా కాకుండా వంకర టింకర్లుగా సాగుతోంది. ఇందుకు అధికారులు కూడా అభ్యంతరం తెలపడం లేదు. వారు కనీసం పనులు జరిగే ప్రదేశాన్ని తనిఖీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కంకర వేశారు... రోడ్డు మరిచారు! పెద్దాసుపత్రి అంతటా అంతర్గతంగా సీసీ రోడ్లను వేసేందుకు రూ.2 కోట్లతో మొదటిసారి టెండర్ పిలిచారు. అయితే, ఒక్కరే వచ్చారనే కారణంగా రెండోసారి టెండర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈసారి షెడ్యూళ్లు దాఖలు చేసిన ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లను రింగు చేసి.. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడికే దక్కేలా చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు రోజులు గడుస్తున్నప్పటికీ పనులను ప్రారంభించకుండా జాప్యం చేస్తూ వచ్చారు. ఉన్న రోడ్లనూ తీసేయడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు వివిధ పరీక్షల కోసం మెడాల్ యూనిట్ వద్దకు వెళ్లేందుకు ఉన్న దారిలో కంకర వేసి నెల రోజులు గడుస్తున్నాయి. రోగులే రోలర్లు! ఏదైనా సీసీ రోడ్డును వేసే సమయంలో మొదట జేసీబీతో ఒక లెవల్‌గా చేస్తారు. అనంతరం కంకర, డస్ట్ వేస్తారు. దీనిపై రోలర్‌తో రోల్ చేస్తారు. ఈ విధంగా నాలుగైదు రోజులు చేసిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడతారు. అయితే, ఇక్కడ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. మొదటగా కంకర వేశారు. అది కూడా చిన్నరకం కంకర వాడుతున్నారు. దీనిపై కనీసం డస్ట్ కూడా వేయలేదు. రోడ్డు రోలర్‌తో తిప్పిన దాఖలాలు అసలే లేవు. ఈ కంకర మీద రోగులు, స్ట్రెచర్లు, రోగుల సంబంధీకులు నడవడంతో రోలింగ్ అవుతున్న పరిస్థితి కన్పిస్తోంది. కనీసం రోలింగ్ చేస్తే రోడ్డు పూర్తయ్యే వరకూ కనీసం నడిచేందుకు రోగులకు ఇబ్బంది ఉండదు. అధికారులు మాత్రం ఆ వైపు కనీస చర్యలు తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్‌ను ఏమైనా అంటే ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి చీవాట్లు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని జంకుతున్నట్టు ప్రచారం సాగుతోంది. నాణ్యతలో రాజీ లేదు పెద్దాసుపత్రి అంతర్గత రోడ్ల నిర్మాణం నాణ్యతలో ఎటువంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఒక లేయర్లో రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిపై మరో లేయర్ వస్తుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనల మేరకు ఉండేలా చూస్తాం. – విజయభాస్కర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ -
ఛీఛీ రోడ్లు
నాసిరకం మెటీరియల్‌తో సీసీరోడ్ల నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ తనిఖీల్లో బట్టబయలు బెర్మ్‌లు, డ్రైన్లు నిర్మించకుండానే నిధులు డ్రా అడ్వాన్స్ రికార్డింగ్ అంటూ పనులు పూర్తి కాకుండానే ఎంబుక్‌ల్లో నమోదు చేసేశారు. మెటీరియల్ పేరుతో నిధులు పక్కదారి పట్టించేశారు. ఆగమేఘాల మీద హడావుడిగా నిర్మించిన సీసీరోడ్ల నిర్మాణంలో డొల్లతనం నెలరోజులు తిరక్కుండానే బయటపడుతోంది. అధికారులు ఏ స్థాయిలోచేతివాటం ప్రదర్శించిందీ అత్యంత లోప భూయిష్టంగా ఉన్న సీసీ రోడ్లను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. కనీసం బెర్మ్‌లు, కాలువలు నిర్మించకుండానే నిధులు డ్రా చేసేశారు. క్వాలిటీ కంట్రోల్ అధికారుల పరిశీలనలో నిర్మాణంలో డొల్లతనం బయటపడింది. విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.14వ ఆర్థిక సంఘం నిధులను జోడించి ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మురిగిపోకూడదన్న తలంపుతో మార్చి నెలాఖరులోగా ఆఘమేఘాలమీద బిల్లులు మంజూరయ్యాయి. పనులు పూర్తయినట్టుగా ఎంబుక్‌లో రికార్డు చేసి మమా అనిపించారు. అయినప్పటికీ రూ.159కోట్ల కాంపొనెంట్ నిధులను మాత్రమే ఖర్చుచేయగలిగారు. రూ.40కోట్లు మురిగిపోయాయి. తొలుత 50ః50 నిష్పత్తితో రూ.69.27 కోట్లతో పనులు చేపట్టారు. అయినా కాంపొనెంట్ నిధులు రూ.256 కోట్లు మిగిలిపోవడంతో 90ః10 శాతం నిష్పత్తిలో పనులకు అనుమతి ఇచ్చారు. రూ.199కోట్ల ఉపాధి కాంపొనెంట్ నిధులకు 14వ ఆర్థిక సంఘం నిధులు జోడించి మొత్తం రూ.298 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తంగా మూడువందల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటి నాణ్యత మేడిపండు చందంగా ఉంది. 15 రోజులపాటు క్వాలిటీ కంట్రోల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో వీటి నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి బయటపడింది. నిబంధనలు ఇలా చెబుతున్నా.. సీసీ రోడ్ల నిర్మాణంలో నిబంధనలు కఠిన తరం చేశారు. ఎం-30 స్టాండర్డ్(ఒకశాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక)లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు పాటు వేసిన సీసీ రోడ్ లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో, వాటర్ ప్యూరింగ్‌లో నిబంధనలకు ఉల్లంఘిస్తే రూ.లక్షకు 25వేల చొప్పున కోత పెట్టొచ్చు.. పర్యవేక్షించిన ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలే కాదు తీవ్రతను బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అంతా లోపభూయిష్టమే..: నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టలేదని విజిలెన్స్అండ్ మోటనరింగ్ కమిటీతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారుల పరిశీలనలో గుర్తించినట్టు సమాచారం. తొలివిడతలో 50ః50నిష్పత్తిలో చేపట్టిన సీసీ రోడ్లలో నాణ్యత బాగానే ఉన్నప్పటికీ 90ః10నిష్పత్తిలో చేపట్టిన సీసీ రోడ్లలోనే చాలా చోట్ల లోపభూయిష్టంగా ఉంది. నాసిరకం మెటీరియల్‌తో వీటిని నిర్మించినట్టుగా స్పష్టమవుతోంది. దీనికి తోడు జిల్లాలో ఏ ఒక్క సీసీరోడ్కు బెర్మ్‌లు, డ్రైన్లు నిర్మించిన దాఖలాలు లేవు. దీంతో బెర్మ్ల్లేని సీసీరోడ్లపై వెళ్లే వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రెండో విడతలో చేపట్టిన సీసీ రోడ్లలో సుమారు మూడోవంతు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని క్వాలిటీ అధికారులే అంచనా వేస్తున్నారు. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలపై మరో పక్క థర్డ్ పార్టీ ఎంక్వయిరీ కూడా జరుగుతోంది. తమ నివేదికలను నెలాఖరుకు ఉన్నతాధికారులకు అందజేస్తామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెబుతు న్నారు. -
దారి దోపిడీ
సిమెంటు రోడ్లు, డ్రైనేజీల్లో నాణ్యతకు తిలోదకాలు టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్‌కు వాటాలు పీఆర్ అధికారులకు 8, జెడ్పీటీసీలకు 2 శాతం.. ఉపాధి, పంచాయతీ అధికారులకూ.. విశాఖపట్నం : జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న సీసీ రోడ్లు టీడీపీ ప్రజాప్రతినిధులు.. అధికారులకు కామధేనువుల్లా మా రాయి. ఈ పనుల ద్వారా జే బులు నింపుకోవడమే పని గా పెట్టుకున్నారు. నాకిం త.. నీకింత అంటూ పర్సంటేజీలు వేసుకుని మరీ పంచుకు తింటున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను బలవంతంగా లాక్కొని.. వాటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లాలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. 820 పంచాయతీల పరిధిలో రూ.54 కోట్ల 74 లక్షల 79 వేలతో 1816 పనులు ప్రారంభించారు. పర్సంటేజీలు వేసుకుని మరీ పంచుకు తింటున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను బలవంతంగా లాక్కొని.. వాటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లాలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. 820 పంచాయతీల పరిధిలో రూ.54 కోట్ల 74 లక్షల 79 వేలతో 1816 పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా 120 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 87 కిలోమీటర్ల డ్రైన్లు నిర్మించాలి. వీటిని పంచాయతీ సర్పంచ్‌లకు అప్పగించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ ఉన్న చోట వారే చేపట్టగా, ప్రతిపక్ష సర్పంచ్‌లున్న చోట స్థానిక టీడీపీ ఎంపీటీసీలు ఈ పనులు చేపడుతున్నారు. పనులన్నీ రూ.ఐదేసి లక్షల చొప్పున విభజించి నామినేషన్ పద్ధతిలో వారికి కట్టబెట్టారు. నాణ్యత పాటించాల్సిందే.. ఎం-30 స్టాండర్డ్ (ఒక శాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక) విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు వేసిన సీసీ రోడ్ లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో కానీ, వాటర్ ప్యూరింగ్‌లో కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. లక్షకు 25 వేల చొప్పున కోత విధించడమే కాకుండా ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 43 కిలోమీటర్ల సీసీ రోడ్లకు సంబంధించి 120 పనులు పూర్తయ్యాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు కూడా జరిగిపోయాయి. అంతా పర్సంటేజీల మయం నిబంధనలను కచ్చితంగా పాటిస్తే 20 శాతానికి మించి లాభం వచ్చే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. ప్రతి పనిలోనూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్చార్జిల పేరిట 5 శాతం, జెడ్పీ చైర్పర్సన్ పేరిట ఐదు శాతం, జెడ్పీటీసీల పేరిట రెండు శాతం నిధులు పక్కనపెడుతున్నారు. పనులు పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు గతంలో మాదిరిగా 8 శాతం వాటా తీసుకుంటున్నారని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. డ్వామా, పంచాయతీ అధికారులకు మాత్రం పనివిలువను ఒకటినుంచి రెండు శాతం నిధులను ముట్టజెప్పాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఇక తమకు మిగిలేదేమిటని ప్రశ్నిస్తున్నారు. నాణ్యతపై ప్రభావం పర్సంటేజీల గోల కారణంగా నాణ్యతకు తిలోదకాలిచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల ఉపాధి హామీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు మాకవరపాలెం, అనకాపల్లి, నర్సీపట్నం తదితర మండలాల్లో పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు లోపించినట్టుగా గుర్తించారు. సుమారు 28 రోజుల వాటర్‌ప్యూరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ వారం రోజులు కూడా చేయడం లేదని గుర్తించారు. ఆయా మండలాల ఏఈ, డీఈలపై చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. -
అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇప్పిస్తా
చిన్నశంకరంపేట: అర్హులైన ప్రతి ఒక్కరికి అసరా పథకం కింద పింఛన్లు మంజూరు చేయించే బాధ్యత తనదేనని, ఎవరూ ఆందోళన చెందవద్దని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పింఛన్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విదంగా అసరా పథకం కింద పింఛన్లను రూ. వెయ్యి, రూ.15వందలకు పెంచడంతో పాటు గతంలో కన్నా ఎక్కువ సంఖ్యలో తమ ప్రభుత్వం పింఛన్లు ఇస్తోందన్నారు. జాబితాలో అర్హుల పేర్లు లేకున్నా అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హుల పేర్లను గుర్తించే బాధ్యత సర్పంచ్‌లదేనని, వారు అందించిన జాబితాను పరిశీలించి పింఛన్లు మంజూరు చేయిస్తామన్నారు. చందంపేట గ్రామాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానన్నారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 10 లక్షలు, రుద్రారంలో సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని జెడ్పీ పాఠశాలలకు నాలుగు అదనపు గదులు మంజూరు చేయించానని, త్వరలోనే మోడల్ పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తాన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సంతోషి గ్రామ సమస్యలు వివరించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ మోహన్, ఎంపీపీ కృపావతి, జెడ్పీటీసీ స్వరూప, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, ఎంపీటీసీ శశికళపోచగౌడ్, సర్పంచ్‌లు సత్యనారాయణ, నాగరాజ్, మాజీ సర్పంచ్‌లు సుధాకర్,రాజు పాల్గొన్నారు. సమాజసేవలో పాలుపంచుకోవాలి రామాయంపేట: ప్రతి ఒక్కరూ సేవా దృ క్పథాన్ని అలవర్చుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రామాయంపేటలో లయన్స్ క్లబ్ స్నేహబంధు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రక్తదానం ఎంతో గొప్పదని, అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. సమాజసేవలో విద్యార్థులు పాలుపంచుకోవాలన్నారు. రామాయంపేటలో రోడ్డు విస్తరణతోపాటు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అదేశించారన్నారు. స్థానికంగా ఉన్న మల్లెచెరువును శుద్ధిచేయించడంతోపాటు మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడానికి కృషిచేస్తామన్నారు. అంతకుముందు డిప్యూటీ స్పీకర్ స్థానికంగా ఒక హోటల్‌తోపాటు, దుకాణానికి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో క్లబ్ చైర్మన్ సత్యనారాయణ, ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణశాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, పార్టీ జిల్లా నాయకుడు కొండల్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పాతూరి ప్రభావతి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, మాజీ ఎంపీపీ సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీ కలకలం!
ధారూరు: గ్రామాల్లో ప్రతి చిన్నపనికీ సర్పంచ్‌లు అంతోఇంతో డిమాండ్ చేస్తూ ఉంటారు. పని త్వరగా పూర్తి కావడం కోసం ప్రజలు కూడా ‘సమర్పించు’కోక తప్పని పరిస్థితి. రేషన్ కార్డుకు, పింఛన్ నమోదుకు, వివిధ రకాల సర్టిఫికెట్లకు చేసుకునే దరాఖస్తులపై సంతకాల చేసేందుకు మామూళ్ల కోసం సర్పంచ్‌లు చేయి చాస్తుంటారు. ఇక నుంచి అలా డబ్బులు తీసుకునేటప్పుడు సర్పంచ్‌లతోపాటు ప్రజాప్రతినిధులంతా ఆలోచించాల్సిన పరిస్థితిని ఈ ఘటన కల్పించింది. లంచం తీసుకుంటూ ఓ సర్పంచ్ ఏసీబీ అధికారులకు పట్టుబడడం ధారూరు మండలంలో బుధవారం సంచలనం రేపింది. ఎక్కడ నలుగురు కూడినా ఈ అంశంపై చర్చించుకుంటూ కనిపించారు. సర్పంచ్ ఏసీబీకి పట్టుబడడంతో ప్రజాప్రతినిధుల గుండెల్లో గుబులు రేగింది. ఇన్నాళ్లు ఏసీబీ అధికారులు కేవలం ప్రభుత్వ అధికారులను మాత్రమే పట్టుకుంటారని భావించిన వారు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. నాగారం గ్రామానికి చెందిన మొగిలి కృష్ణారెడ్డి గ్రామంలోని వాటర్ ట్యాంకు దగ్గరి నుంచి పరిగి రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం మార్చి నెలలో పంచాయతీ నుంచి తీర్మానం తీసుకున్నాడు. దానిపై సర్పంచ్ ప్రమీలమ్మగౌడ్ సంతకం చేయాల్సి ఉంది. అందుకు ఆమె డబ్బులు డిమాండ్ చేయడంతో రూ. 25వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. అనంతరం కృష్ణారెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. వారి పథకం ప్రకారం బుధవారం కృష్ణారెడ్డి.. సర్పంచ్ మరిది రాంకృష్ణయ్యగౌడ్కు డబ్బులివ్వడంతో ఆయన తీసుకెళ్లి సర్పంచ్‌కు ఇచ్చాడు. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు సర్పంచ్‌తోపాటు ఆమె మరిదిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ తీర్మానం ఇచ్చేందుకు డబ్బులు తీసుకున్నట్లు సర్పంచ్ ప్రమీలమ్మగౌడ్ అంగీకరించారని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ చెప్పారు. కాగా ‘అందరి సర్పంచ్ల మాదిరిగా నేను డబ్బులు తీసుకున్న. ఇందులో తప్పేంముంది’ అని సర్పంచ్ తమను ఎదురు ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి ఏసీబీకి చిక్కడం ఇదే మొదటిసారి.. ప్రజాప్రతినిధులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ అధికారుల లాగే ప్రజా ప్రతినిధులు కూడా ప్రజా సేవకులని, వారు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలు చైతన్యవంతులై అవినీతికి పాల్పడిన వారిపై తమకు సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్న వారి వివరాలు చెబితే దాడులు జరుపుతామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాజు, వెంకట్‌రెడ్డి, సునీల్, లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.