సిమెంటు రోడ్లు, డ్రైనేజీల్లో నాణ్యతకు తిలోదకాలు
టీడీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్‌కు వాటాలు
పీఆర్ అధికారులకు 8, జెడ్పీటీసీలకు 2 శాతం..
ఉపాధి, పంచాయతీ అధికారులకూ..
విశాఖపట్నం : జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్న సీసీ రోడ్లు టీడీపీ ప్రజాప్రతినిధులు.. అధికారులకు కామధేనువుల్లా మా రాయి. ఈ పనుల ద్వారా జే బులు నింపుకోవడమే పని గా పెట్టుకున్నారు. నాకిం త.. నీకింత అంటూ పర్సంటేజీలు వేసుకుని మరీ పంచుకు తింటున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తున్నారు.
పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను బలవంతంగా లాక్కొని.. వాటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లాలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. 820 పంచాయతీల పరిధిలో రూ.54 కోట్ల 74 లక్షల 79 వేలతో 1816 పనులు ప్రారంభించారు. పర్సంటేజీలు వేసుకుని మరీ పంచుకు తింటున్నారు. నాణ్యతను గాలికొదిలేస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను బలవంతంగా లాక్కొని.. వాటికి ఉపాధి హామీ నిధులను జోడించి జిల్లాలో పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం తెలిసిందే. 820 పంచాయతీల పరిధిలో రూ.54 కోట్ల 74 లక్షల 79 వేలతో 1816 పనులు ప్రారంభించారు. ఈ పనుల్లో భాగంగా 120 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 87 కిలోమీటర్ల డ్రైన్లు నిర్మించాలి. వీటిని పంచాయతీ సర్పంచ్‌లకు అప్పగించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ ఉన్న చోట వారే చేపట్టగా, ప్రతిపక్ష సర్పంచ్‌లున్న చోట స్థానిక టీడీపీ ఎంపీటీసీలు ఈ పనులు చేపడుతున్నారు. పనులన్నీ రూ.ఐదేసి లక్షల చొప్పున విభజించి నామినేషన్ పద్ధతిలో వారికి కట్టబెట్టారు.
నాణ్యత పాటించాల్సిందే..
ఎం-30 స్టాండర్డ్ (ఒక శాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక) విధానంలో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు వేసిన సీసీ రోడ్ లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో కానీ, వాటర్ ప్యూరింగ్‌లో కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. లక్షకు 25 వేల చొప్పున కోత విధించడమే కాకుండా ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 43 కిలోమీటర్ల సీసీ రోడ్లకు సంబంధించి 120 పనులు పూర్తయ్యాయి. వీటికి సంబంధించిన చెల్లింపులు కూడా జరిగిపోయాయి.
అంతా పర్సంటేజీల మయం
నిబంధనలను కచ్చితంగా పాటిస్తే 20 శాతానికి మించి లాభం వచ్చే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు. ప్రతి పనిలోనూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే లేదా పార్టీ ఇన్‌చార్జిల పేరిట 5 శాతం, జెడ్పీ చైర్‌పర్సన్ పేరిట ఐదు శాతం, జెడ్పీటీసీల పేరిట రెండు శాతం నిధులు పక్కనపెడుతున్నారు. పనులు పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు గతంలో మాదిరిగా 8 శాతం వాటా తీసుకుంటున్నారని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. డ్వామా, పంచాయతీ అధికారులకు మాత్రం పనివిలువను ఒకటినుంచి రెండు శాతం నిధులను ముట్టజెప్పాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. ఇక తమకు మిగిలేదేమిటని ప్రశ్నిస్తున్నారు.
నాణ్యతపై ప్రభావం
పర్సంటేజీల గోల కారణంగా నాణ్యతకు తిలోదకాలిచ్చే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల ఉపాధి హామీ, క్వాలిటీ కంట్రోల్ అధికారులు మాకవరపాలెం, అనకాపల్లి, నర్సీపట్నం తదితర మండలాల్లో పలు గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు లోపించినట్టుగా గుర్తించారు. సుమారు 28 రోజుల వాటర్‌ప్యూరింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ వారం రోజులు కూడా చేయడం లేదని గుర్తించారు. ఆయా మండలాల ఏఈ, డీఈలపై చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది.
దారి దోపిడీ
Published Fri, Dec 18 2015 11:51 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement